Showing posts with label 1969. Show all posts
Showing posts with label 1969. Show all posts

ఆత్మీయులు (1969)




చిత్రం: ఆత్మీయులు (1969)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి 
గానం: ఘంటసాల, సుశీల 

అన్నయ్య కలలే పండెను
చెల్లాయి మనసే నిండెను
బంగారుకాంతులేవొ నేడే తొంగి చూసేను
తోడు నీడా నీవై లాలించే అన్నయ్యా
తల్లిదండ్రీ నీవై పాలించే అన్నయ్యా
నీకన్న వేరే పెన్నిధి లేనే లేదు
నా పూర్వ పుణ్యాల రూపమే నీవు

అన్నయ్య

రతనాల సుగుణాల రాశివి నీవే
అన్నయ్య నయనాల ఆశవు నీవే
నీవు మెట్టినయిల్లు నిత్యము విలసిల్లు
నీ నవ్వు సిరులొల్కు ముత్యాల జల్లు

అన్నయ్య

మా అన్నయ్య మనసే సిరిమల్లె పువ్వేను
చెల్లి కంటతడివుంటే తల్లడిల్లేను
నీ పూజలేనన్ను నడిపించు తల్లీ
శతకోటి విజయాలు సాధింతు చెల్లి

అన్నయ్య


ఈ రోజుల్లో పడుచువారు పాట సాహిత్యం


 
చిత్రం: ఆత్మీయులు (1969)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, సుశీల 

ఈరోజులో పడుచువారు గడుసువారు
వీలైతే హుషారు కాకుంటే కంగారు

ఈ రోజుల్లో

తాజా తాజా మోజులకోసం తహతహలాడుతువుంటారు
పొట్టి షర్టతో టైటు పాంట్లతో లొట్టిపిట్టలవుతుంటారు
మెప్పులకోసం అప్పులు చేసి తిప్పలపాలవుతుంటారు

ఈ రోజుల్లో

రోడ్డు సైడున రోమియోలలా రోజంతా బీచేస్తారు
సొగసరి చిన్నది కంటపడిందా చూపులతో మింగేస్తారు
ఆ చిన్నదికాస్తా చేయివిసిరితే చెప్పకుండా చెక్కేస్తారు

పాఠాలకు ఎగనామంబెట్టి మ్యాటినీ షో లకు తయ్యారు
పార్టీ లంటూ పిక్నిక్ లంటూ పుణ్యకాలమూ గడిపేరు
పరీక్ష రోజులు ముంచుకురాగా తిరుపతి ముడుపులు కడతారు

ఈ రోజుల్లో ....

పడుచువారు గడుసు వారు
సహనంలో కిసానులు సమరంలో జవానులు
ఆడపిల్లలను గౌరవించితే ఆత్మ గౌరవం పెరిగేను
సమరస భావం కలిగిననాడే చదువుల విలువలు పెరిగేను
దేశానికి వెన్నెముకలు మీరు దివాళకోరులు కావద్దు
భవితవ్యానికి బాటలు వేసే భారం మనదని
మరవొద్దు
ఆ భారం మనదని మరవొద్దు



************ ************************************** *************

 
చిత్రం: ఆత్మీయులు (1969)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: దాశరధి
గానం: సుశీల 

మదిలో వీణలు మ్రోగె
ఆశలెన్నో చెలరేగె
కలనైనకనని ఆనందం
యిలలోన విరిసె ఈనాడె
సిగుచాటున నా లేతవలపు మొగ్గతొడిగింది
పాలవెన్నెల స్నానాలు చేసి పూలు పూచింది

మదిలోని

కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందుగో రేను
అందాల తారయె మెరిసి చెలికాని చెంతచేరేను
 
మదిలోని

రాధలోని అనురాగమంతా మాధవుని చేలే
పేణులోలుని రాగాల కోసం వేచియున్నదిలే

మదిలోని



************ ************************************** *************


 

చిత్రం: ఆత్మీయులు (1969)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, సుశీల 

ఓ.... చామంతి ఏమిటే యీ వింత ఈ
చినవానికి కలిగెనేల గిలిగింత లేనిపులకింత

ఓ.... చిన్నారి చెల్లి పెళ్ళి .... జరిగింది 
యీ చిలకమ్మకు నాకు వరసకుదిరింది వలపు పెరిగింది

ఇన్నాళ్ళు యీ వలపే యేమాయె
నీ కన్నుల్లో యీ మెరుపే కరువాయె
ఇన్నాళ్ళు నీ హొయలు చూశాను
నా ఎదలోనే పదిలంగా దాచాను వేచాను 

ఓ.... చామంతి

దూరాల గగనాల నీ మేడ....
నీ దొరసాని ననుకోరి దిగినావా
జయ నీ మనసే పానుపుగా తలచేను
నీ ప్రాణంలో ప్రాణంగా నిలిచేను వలచేను



************ ************************************** *************

 
చిత్రం: ఆత్మీయులు (1969)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల, సుశీల 

అమ్మబాబో నమ్మరాదూ ఈ రాలుగాయి
అబ్బాయిల నమ్మరాదూ
ప్రేమించామంటారు పెద్దగ చెబుతుంటారు
పెళ్ళిమాట ఎత్తగానె చల్లగ దిగజార తారు

చిన్నారి

అమ్మ బాబో నమ్మరాదూ యీ వగలమారి
అమ్మాయిల నమ్మరాదూ !
డబ్బులున్న కుర్రవాళ్ళ టక్కునపట్టేస్తారు
లవ్ మ్యారేజీ అంటూ లగ్నం పెట్టిస్తారు

కట్నాలు పెరుగునని కాలేజికెళతారు
హాజరుపట్టీ వేసి గైరుహాజరౌతారు
మార్కులకోసం తండ్రుల తీర్థయాత్ర తిప్పుతారు
ఇంజనీర్లు డాక్టర్లయి యిక చూస్కోమంటారు

వరండాలలోనజేరి వాల్చూపులు విసురుతారు
సినిమాలు షికార్లంటు స్నేహం పెంచేస్తారు
తళుకుబెళుకు కులుకులతో పెటచెంగు రాపులతో
చిటికెలోన అబ్బాయిల చెంగున ముడి వేస్తారు

ఆస్తివున్న పిల్లయితే అందంజోలికి పోరు
కుంటిదైన కురూ పైన పెళ్ళికి యస్సంటారు

పెళ్ళియైన మర్నాడే శ్రీవారిని చేత బట్టి
అత్తామామల దయచేయండంటారు
దిమ్మ దిరిగి ఏమిటలా తెల్ల మొగం వేస్తావు
వలపు దాచుకొని ఎందుకు మాటలు దులిపేస్తావు

మనసు మనసు తెలుసుకుందామూ
ఇకనైనా జలసాగ కలిసి ఉందాము

************************** ************************ **********

 
చిత్రం: ఆత్మీయులు (1969)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: సుశీల 

స్వాగతం ఓహో చిలిపినవ్వుల శ్రీవారు
సోగ కన్నులు సైగచేస్తే ఆగలేని దొరగారు
కొంగు తగిలిందా పొంగిపోతారు

కోరిరమ్మంటే బిగిసిపోతారు
ఎందుకో ఎందుకో యీ బింకము
అలిగిన కొలది అందము అబ్బాయిగారి కోపము
పిలిచిన ప్రేయసికి యిదేనా కానుక మీ కానుక
బెట్టుచాలును దొరగారు

స్వాగతం

అందమంతా విందుచేస్తే అదిరి పడ్డా రేం
పొందుగోరి చెంతచేరా బెదిరి పోతారేం
సరసమో విరసమో ఈ మౌనము
అందిన చిన్నది చులకన అందని దెంతో తీయన
అవతల పెట్టండీ తమాషా పోజులు మహరాజులు
అధిక చక్కని దొరగారు

స్వాగతం



************ ************************************** *************

 
చిత్రం: ఆత్మీయులు (1969)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: దాశరధి
గానం:యస్.పి.బాలు, సుశీల 

చిలిపి నవ్వుల నిను చూడగానే 
వలపు పొంగేను నాలోనే
ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో
నిన్ను నే చేరుకున్నాను

చూపుల శృంగార మొలికించినావు
మాటల మధువెంతో చిలికించినావు
వాడని అందాల వీడని బంధాల తోడుగ నడిచేములే 

చిలిపి నవ్వుల నిను చూడగానే 
వలపు పొంగేను నాలోనే

నేను నీదాననే - నీవు నావాడవే
నను వీడి పోలేవులే
కన్నుల ఉయ్యాల లూగింతునోయి
చూడని స్వర్గాలు చూపింతునోయి
తీయని సరసాల తీరని సరదాల
హాయిగ తేలేములే

ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో
నిన్ను నే చేరుకున్నాను

************************ ************************** ***************

 
చిత్రం: ఆత్మీయులు (1969)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: కొసరాజు 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు 

పల్లవి:
ఏం పిల్లో తత్తర బిత్తర గున్నావు
ఎందుకో గాభర గీభర తిన్నావు
చిలిపి నవ్వులతొ కవ్వించు మోము
చిన్నబోయింది ఈ నాడదేమో

చరణం : 1
అందని కొమ్మలకు నిచ్చెన వేశావు
అయ్యొ గాలిలోన మేడలు కట్టావు
వలచిన పేదవాణ్ణి చులకన చేశావు
బులుపేగాని వలపేలేని
టక్కరి వాళ్ళ నమ్మి చిక్కుల పాలైనావు

చరణం: 2
నీ ఒయ్యారపు వాలు చూపులతొ
ముసలివాణ్ణి వూరిస్తున్నావు
పడ చువాణ్ణి చేసేస్తున్నావు
బంగరు బొమ్మా
పలుకవటమ్మా
మోజు దీర్సవే ముద్దులగుమ్మా

చరణం: 3
నీపై కన్నేసి వేషాలేశాను
మెత్తని నీ మనసు గాయం చేశాను
చేసిన తప్పులకు చెంపలేసుకుంటాను
నువు దయజూపితే
నను పెళ్ళాడితే
నిందలు వేసినాళ్ళ నోళ్ళు బందుచేస్తాను


************ ************************************** *************

 
చిత్రం: ఆత్మీయులు (1969)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: ఘంటసాల, సుశీల 

కళ్ళలో పెళ్ళి పందిరి కనబడ సాగె
పల్లకీలోన వూరేగే ముహూర్తం మదిలో కదలాడే
కళ్ళలో పెళ్ళిపందిరి కనబడసాగె
పల్లకీలోన వూరేగే ముహూర్తం మదిలో కదలాడే

నుదుట కళ్యాణ తిలకముతో
పసుపు పారాణీ పదములతో
పెదవి పై మెదిలే నగవులతో
వధువు నను ఓరగ చూస్తూంటే
జీవితాన... పూలవాన...

కళ్ళలో

సన్నాయి చల్లగా మ్రోగి
పన్నీటి జల్లులే రేగి
మనసైన వరుడు దరిజేరి
మెడలోన తాళీకడుతుంటే
జీవితాన... పూలవాన...

వలపు హృదయాలు పులకించి
మధుర స్వప్నాలు ఫలియించి
లోకమే వెన్నెల వెలుగైతే
భావియే నందనవనమైతే
జీవితాన
పూలవాన

కళ్ళలో 

ఆస్తులు-అంతస్తులు (1969 )




చిత్రం :  ఆస్తులు-అంతస్తులు (1969 )
సంగీతం :  కోదండపాణి
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  బాలు, సుశీల     


పల్లవి :

ఒకటైపోదామా ఊహల వాహినిలో
మమతల తరగలపై... మధువుల నురగలపై
పరవశమొందగా... ఏకమౌదమా
పరవశమొందగా... ఏకమౌదమా 


చరణం 1 : 

ఓ....ఓ...ఓ...అనురాగ సీమలో...
అందాలకోనలో.... అల్లారుముద్దుగా ఉందామా

సొంపైన పొదరింట... ఇంపైన గిలిగింత...
సొంపైన పొదరింట... ఇంపైన గిలిగింత...
దోబూచులాడుతూ నవ్వుకుందామా

ఒకటైపోదామా ఊహల వాహినిలో ..
మమతల తరగలపై... మధువుల నురగలపై 
పరవశమొందగా... ఏకమౌదమా
పరవశమొందగా... ఏకమౌదమా

చరణం 2 :

చిగురాకు జంపాల చెలరేగు చెలువాల... ఉయ్యాలలూగుతూ ఉందామా
చిగురాకు జంపాల చెలరేగు చెలువాల... ఉయ్యాలలూగుతూ ఉందామా

నింగిలో విహరించి.... నేలపై పులకించీ
నింగిలో విహరించి.... నేలపై పులకించీ...
శృంగార జలధిలో తేలుదామా....

ఒకటైపోదామా ఊహల వాహినిలో ..
మమతల తరగలపై... మధువుల నురగలపై
పరవశమొందగా... ఏకమౌదమా
పరవశమొందగా... ఏకమౌదమా 

చరణం 3 :

ఓ....ఓ...ఓ....వలపుల జంటగా... సరదాల పంటగా... సయ్యాట పాటలై... సాగుదామా

తారాచంద్రులమై....రాధాకృష్ణులమై
తారాచంద్రులమై....రాధాకృష్ణులమై
తన్మయమొందుతూ... కరగిపోదామా....

ఒకటైపోదామా ఊహల వాహినిలో ..
మమతల తరగలపై... మధువుల నురగలపై
పరవశమొందగా... ఏకమౌదమా
పరవశమొందగా... ఏకమౌదమా...

బుద్ధిమంతుడు (1969)




చిత్రం :  బుద్ధిమంతుడు (1969)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  ఘంటసాల

పల్లవి:

హవ్వారే హవ్వా హైలేసో హహ్హ
హవ్వారే హవ్వా హైలేసో సో సో..సో...
దాని యవ్వార మంతా హైలేసో
హవ్వారే హవ్వా హైలేసో సో సో..సో...
దాని యవ్వారమంతా హైలేసో
హవ్వారే హవ్వా...

చరణం 1:

పచ్చిమిరపకాయలాంటి పడుసు పిల్లరోయ్
దాని పరువానికి గర్వానికి పగ్గమేయరోయ్
పచ్చిమిరపకాయలాంటి పడుసు పిల్లరోయ్
దాని పరువానికి గర్వానికి పగ్గమేయరోయ్

వగలమారి చెప్పరాని పొగరుమోతురోయ్
ఆ వన్నెలాడి ఉడుక్కుంటే వదలమోకురోయ్
వగలమారి చెప్పరాని పొగరుమోతురోయ్
ఆ వన్నెలాడి ఉడుక్కుంటే వదలమోకురోయ్

హవ్వారే హవ్వా...హైలేసో..లెస్సో...
హవ్వారే హవ్వా హైలేసో సో సో..సో...
దాని యవ్వారమంతా హైలేసో..
హవ్వారే...హహ్హా...

చరణం 2:

ఇంటికెళితె నిన్ను జూసి నవ్వుతుందిరో
దాని యెంట బడితె కంట బడితె కసురుతుందిరో
ఇంటికెళితె నిన్ను జూసి నవ్వుతుందిరో
దాని యెంట బడితె కంట బడితె కసురుతుందిరో

టక్కరి టెక్కుల పిల్ల పడవ ఎక్కెరో
టక్కరి టెక్కుల పిల్ల పడవ ఎక్కెరో
టెక్కంతా ఎగిరి పోయి ఎక్కీ ఎక్కీ ఏడ్చెరోయ్ ఓయ్ ఓయ్ ఓయ్

హవ్వారే హవ్వా...హైలేసో..హహ్హా...
హవ్వారే హవ్వా హైలేసో సో సో..సో...
దాని యవ్వార మంతా హైలేసో..
హవ్వారే...హహ్హా...

చరణం 3:

చూడబోతె అవ్వాయి చువ్వ లాంటిదోయ్
జోడు కూడబోతె కులుకులాడి గువ్వ లాంటిదోయ్
చూడబోతె అవ్వాయి చువ్వ లాంటిదోయ్
జోడు కూడబోతె కులుకులాడి గువ్వ లాంటిదోయ్

జాంపండు లాంటి గుంట జట్టు గట్టరోయ్
అది జారిపోతె దారి కాసి పట్టు పట్టరోయ్
జాంపండు లాంటి గుంట జట్టు గట్టరోయ్
అది జారిపోతె దారి కాసి పట్టు పట్టరోయ్...

హవ్వారే హవ్వా హైలెస్సో అహ
హవ్వారే హవ్వా...హైలేసో..హహ్హా...
హవ్వారే హవ్వా హైలేసో సో సో..సో...
దాని యవ్వార మంతా హైలేసో..
హవ్వారే హవ్వా హైలేసో సో సో..సో...
దాని యవ్వారమంతా హైలేసో..
హవ్వారే...హహ్హా...


********* ********* ********
చిత్రం :  బుద్ధిమంతుడు (1969)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఘంటసాల

పల్లవి:

వేయి వేణువులు మ్రోగేవేళా... ఆ... ఆ...
హాయి వెల్లువై పొంగేవేళా...
రాస కేళిలో తేలే వేళా...
రాధమ్మను లాలించే వేళ....

నను పాలింపగ నడచి వచ్చితివా..
మొరలాలింపగ తరలి వచ్చితివా... గోపాలా
నను పాలింపగ నడచి వచ్చితివా...
మొరలాలింపగ తరలి వచ్చితివా... గోపాలా

నను పాలింపగ నడచి వచ్చితివా.. ఆ హా హా...

చరణం 1:

అర చెదరిన తిలకముతో.. అల్లదిగో రాధమ్మా..
అర జారిన పైయ్యెదతో.. అదిగదిగో గోపెమ్మా..
ఎరుపెక్కిన కన్నులతో.. ఇదిగిదిగో సత్యభామా..
పొద పొదలో.. యెద యెదలో.. నీ కొరకై వెదకుచుండగా

నను పాలింపగ నడచి వచ్చితివా
మొరలాలింపగ తరలి వచ్చితివా గోపాలా
నను పాలింపగ నడచి వచ్చితివా .. ఆ హా హా...

చరణం 2:

కంసుని చెరసాలలో.. ఖైదీవై పుట్టావు
కాంతల కౌగిళ్ళలో.. ఖైదీవై పెరిగావు
కరకురాతి గుళ్ళలో.. ఖైదీవై నిలిచావు
ఈ భక్తుని గుండెలో.. ఖైదీగా.. ఉండాలనీ

నను పాలింపగ నడచి వచ్చితివా
మొరలాలింపగ తరలి వచ్చితివా గోపాలా
నను పాలింపగ నడచి వచ్చితివా .. ఆ హా హా...


********* ********* ********
చిత్రం :  బుద్ధిమంతుడు (1969)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల

పల్లవి:

తోటలోకి రాకురా.. తుంటరి తుమ్మెదా... గడసరి తుమ్మెదా
మా మల్లి మనసెంతో తెల్లనిది అది ఏ వన్నెలేచిన్నెలెరుగనిది
తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ

చరణం 1:

కన్ను సైగ చేయకురా కామినీ చోరా.. గోపికాజారా..
కన్ను సైగ చేయకురా కామినీ చోరా.. గోపికాజారా..
మా రాధ అనురాగం మారనిది..
అది ఏ రాసకేళిలోన చేరనిది ..
తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ

చరణం 2:

జిలుగు పైట లాగకురా...
జిలుగు పైట లాగకురా..
తొలకరి తెమ్మెరా.. చిలిపి తెమ్మెరా... ..
జిలుగు పైట లాగకురా..
తొలకరి తెమ్మెరా.. చిలిపి తెమ్మెరా... ..
కన్నెసిగ్గు మేలిముసుగు వీడనిది
అది ఇన్నాళ్ళు ఎండకన్నెరుగనిది

తోటలోకి రాకురా ..ఆ..ఆ..ఆ

చరణం 3:

రోజు దాటి పోగానే.. జాజులు వాడునురా
మోజులు వీడునురా...
రోజు దాటి పోగానే.. జాజులు వాడునురా
మోజులు వీడునురా...
కన్నెవలపు సన్నజాజి వాడనిది..
అది ఎన్ని జన్మలైనా వసివాడనిది..

తోటలోకి రాకురా... తుంటరి తుమ్మెదా ...గడసరి తుమ్మెదా
మా మల్లి మనసెంతో తెల్లనిది.. అది ఏ వన్నె ఏ చిన్నెలెరుగనిది..
తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ


********* ********* ********
చిత్రం :  బుద్ధిమంతుడు (1969)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  ఘంటసాల

పల్లవి:

టాటా.. వీడుకోలు .. గుడ్ బై .. ఇంక సెలవు
టాటా.. వీడుకోలు .. గుడ్ బై .. ఇంక సెలవు
తొలినాటి స్నేహితులారా చెలరేగే కోరికలారా
తొలినాటి స్నేహితులారా చెలరేగే కోరికలారా
టాటా.. వీడుకోలు .. గుడ్ బై .. ఇంక సెలవు
టాటా.. వీడుకోలు .. 

చరణం 1:

ప్రియురాలి వలపులకన్నా నును వెచ్చనిదేదీ లేదని
ప్రియురాలి వలపులకన్నా నును వెచ్చనిదేదీ లేదని
నిన్నను నాకు తెలిసింది ఒక చిన్నది నాకు తెలిపింది
ఆ  ఆ ప్రేమ నగరుకే పోతాను .. పోతాను .. పోతాను
ఈ కామ నగరుకి రాను .. ఇక రాను

టాటా.. వీడుకోలు .. గుడ్ బై .. ఇంక సెలవు
టాటా.. వీడుకోలు ..

చరణం 2:

ఇచ్చుటలో ఉన్న హాయి.. వేరెచ్చటనూ లేనే లేదని
ఇచ్చుటలో ఉన్న హాయి.. వేరెచ్చటనూ లేనే లేదని
లేటుగ తెలుసుకున్నాను.. నా లోటుని దిద్దుకున్నాను
ఆ ఆ స్నేహనగరుకే పోతాను .. పోతాను .. పోతాను
ఈ మోహనగరుకు రాను .. ఇక రాను

టాటా.. వీడుకోలు .. గుడ్ బై .. ఇంక సెలవు
టాటా.. వీడుకోలు ..

చరణం 3:

మధుపాత్రకి ఎదలో ఇంక ఏమాత్రం చోటు లేదని
మధుపాత్రకి ఎదలో ఇంక ఏమాత్రం చోటు లేదని
మనసైన పిల్లే చెప్పింది .. మనసైన పిల్లే చెప్పింది
నా మనసంతా తానై నిండింది .. నా మనసంతా తానై నిండింది
నే రాగ నగరుకే పోతాను .. అనురాగ నగరుకే పోతాను .. పోతాను 

********* ********* ********


చిత్రం : బుద్ధిమంతుడు (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర

నేపధ్య గానం : ఘంటసాల

పల్లవి:

జై శ్రీమద్రమారమణ గోవిందో హా... నాయనలారా
బడిలో ఏముందీ దేవుని గుడిలోనే ఉందీ
భక్తి ముక్తి కావాలంటే మాధవ సేవా చెయ్యాలంటే....
బడిలో ఏముందీ దేవుని గుడిలోనే ఉందీ

గుడిలో ఏముందీ బాబూ బడిలోనే ఉందీ
భుక్తి శక్తి కావాలంటే.. మానవ సేవా చెయ్యాలంటే
గుడిలో ఏముందీ బాబూ బడిలోనే ఉందీ

చరణం 1:

దేవుడి పేరిట దోపిడి చేసే దళారులెందరొ పెరిగారు
ముక్తి మత్తులో భక్తుల ముంచి సర్వం భొంచేస్తున్నారు
నోరులేని ఆ దేవుడు పాపం నీరు గారి పోతున్నాడు...అయ్యో..

గుడిలో ఏముందీ బాబూ బడిలోనే ఉందీ
గుడిలో ఏముందీ బాబూ బడిలోనే ఉందీ


చదువుల పేరిట గుమాస్తాలను తయారు చేస్తూ ఉన్నారు
ప్రభువుల్లాగ బ్రతికేవాళ్ళను బానిసలుగ చేస్తున్నారు
ఉద్యోగాలకు వేటలాడమని ఊళ్ళపైకి తోలేస్తున్నారు 
బడిలో ఏముందీ దేవుని గుడిలోనే ఉందీ

చరణం 2:

చదవకపోతే మనిషి రివ్వున చంద్రుడి పైకి ఎగిరేవాడా
గిర గిర తిరిగి వచ్చేవాడా
దేవుడు చల్లగ చూడకపోతే అక్కడ గల్లంతైపోడా
ఆనవాలు చిక్కేవాడా...

బడిలో ఏముందీ దేవుని గుడిలోనే ఉందీ
గుడిలో ఏముందీ బాబూ బడిలోనే ఉందీ

చరణం 3:

చదువులుసారం హరి యని.. హరి కూడా చదవాలని
చదువుల మర్మం హరి యని.. ఆ హరి కీ గురువుండాలని
హరియే సర్వశమని.....చదువే సర్వశమని
హరిభక్తుడు ప్రహ్లాదుడు మునుపే బల్ల గుద్ది చెప్పాడు

ఆ హరియే శ్రీకృష్ణుడుగా వచ్చి బడిలో కూర్చొని చదివాడు
ఈ బడిలో కూర్చొని చదివాడు చదివాడు చదివాడు చదివాడు
చదివాడు చదివాడు

********* ********* ********

చిత్రం :  బుద్ధిమంతుడు (1969)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి:

గుట్టమీద గువ్వ కూసింది కట్టమీద కంజు పలికింది
ఓ.. గుట్టమీద గువ్వ కూసింది కట్టమీద కంజు పలికింది

ఓ..గుడిలోన జేగంట మ్రోగింది నా గుండెలో తొలివలపు పండింది
గుడిలోన జేగంట మ్రోగింది నా గుండెలో తొలివలపు పండింది
ఓ.. గుండెలో తొలివలపు పండింది

చరణం 1:

నల్లా నల్లాని మబ్బు నడిచింది తెల్లా తెల్లాని అంచు తోచింది
నల్లా నల్లాని మబ్బు నడిచింది తెల్లా తెల్లాని అంచు తోచింది
తనువు సెలరేఖలై వెలిగింది
తనువు సెలరేఖలై వెలిగింది
చల్లా చల్లాని జల్లు కురిసింది

ఓ..గుట్టమీద గువ్వ కూసింది
నా గుండెలో తొలివలపు పండింది
ఓ..గుట్టమీద గువ్వ కూసింది

చరణం 2:

కొమ్మ మీదా వాలి గోరింకా కమ్మ కమ్మని ఊసులాడింది
కొమ్మ మీదా వాలి గోరింకా కమ్మ కమ్మని ఊసులాడింది
గోరింక తానింక గూడు కట్టకపోతే... 
గోరింక తానింక గూడు కట్టకపోతే 
కొమ్మా యెంతో చిన్న బోతుంది...
కొమ్మా యెంతో చిన్న బోతుంది

ఓ..గుట్టమీద గువ్వ కూసింది
నా గుండెలో తొలివలపు పండింది
ఓ..గుట్టమీద గువ్వ కూసింది

చరణం 3:

సన్నగాజుల రవళి పిలిచింది సన్నజాజుల దండ వేసింది
సన్నగాజుల రవళి పిలిచింది సన్నజాజుల దండ వేసింది
మనసైన జవరాలే వలచింది...
మనసైన జవరాలే వలచింది...
మనుగడే ఒక మలుపు తిరిగింది...
మనుగడే ఒక మలుపు తిరిగింది...
ఊ...ఊ

అదృష్టవంతులు(1969)

చిత్రం: అదృష్టవంతులు (1969)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వెంకటరత్నం
గానం: పి. సుశీల


మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచె కాడ కలుసుకో మరువకు మామయ్య
నువ్వు మరువకు మరువకు మామయ్య
మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచె కాడ కలుసుకో మరువకు మామయ్య
నువ్వు మరువకు మరువకు మామయ్య

చుక్కలన్ని కొండ మీద సోకు చేసుకునే వేళ
చల్లగాలి తోటకంత చక్కలిగిలి పెట్టు వేళ
చుక్కలన్ని కొండ మీద సోకు చేసుకునే వేళ
చల్లగాలి తోటకంత చక్కలిగిలి పెట్టు వేళ
పొద్దు వాలినంతనే సద్దు మణగనిచ్చిరా
పొద్దు వాలినంతనే సద్దు మణగనిచ్చిరా
వేళ దాటి వస్తినా వెన్నక్కి తిరిగి పోతివా
తంటా మన ఇద్దరికి తప్పదు మామయ్యా
తప్పదు తప్పదు మామయ్యా!!

మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచె కాడ కలుసుకో మరువకు మామయ్య
నువ్వు మరువకు మరువకు మామయ్య
మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినపుడు
వంగ తోట మలుపు కాడ కొంగు లాగినపుడు
హా..ఓ..హ్మ్మ్..
మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినపుడు
వంగ తోట మలుపు కాడ కొంగు లాగినపుడు
కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని
కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని
నలుగురిలో చిన్నబోయి నవ్వుల పాలైతివా
తంటా మన ఇద్దరికీ తప్పదు మామయ్యా
తప్పదు తప్పదు మామయ్యా

మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచె కాడ కలుసుకో మరువకు మామయ్య
నువ్వు మరువకు మరువకు మామయ్య
గడ్డిబళ్ళ ఎనాకతల గమ్మత్తుగ నక్కిరా
ఊర చెరువు రెల్లు పక్క వొంగి వొంగి నడిచిరా
గడ్డిబళ్ళ ఎనాకతల గమ్మత్తుగ నక్కిరా

ఊర చెరువు రెల్లు పక్క వొంగి వొంగి నడిచిరా
అయినవాళ్ళ కళ్ళబడకు అల్లరి పాలవుతాము
అయినవాళ్ళ కళ్ళబడకు అల్లరి పాలవుతాము
గుట్టు బయట పెడితివా గోలగాని చేస్తినా
తంటా మన ఇద్దరికీ తప్పదు మామయ్యా
తప్పదు తప్పదు మామయ్యా


*********  *********   ********


చిత్రం: అదృష్టవంతులు (1969)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల
పల్లవి:
అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా
ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా

చరణం: 1

చిక్కని మీగడ తరకల్లాగా చక్కనైన చెక్కిళ్లు
పసినిమ్మ పండులాగా మిసమిసలాడే ఒళ్లు
బెట్టుచూసి గుట్టుదాచే గడసరి సొగసరికళ్లు
కొంత కొడెతనముంది  మరికొంత ఆడతనముంది
అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా
ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా

చరణం: 2

మూతిచూస్తే మీసమింకా మొలిచినట్టులేదూ
బెదరుచూస్తే ఎవ్వరితోను కుదిరినట్టులేదూ -ఆ
కసురులోనె అలకనవ్వులు విసురు లేకపోలేదు
కొంత చిలిపితనముంది  మరికొంత కలికితనముంది 
అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా
ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా

చరణం: 3

బులిపించే సొగసున్న ఓ బుల్లోడా నిను చూస్తుంటే
కొమ్ములు తిరిగిన మగాడికే దిమ్మెక్కిపోతుంటే
కన్నెపిల్లలే చూశారా కన్నుగీటక మానేరా?
కవ్వించే కౌగిలిలో  కరిగించక వొదిలేరా?  
అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా
ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా

*********  *********   ********


చిత్రం: అదృష్టవంతులు (1969)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, పి.సుశీల
పల్లవి:

నా మనసే గోదారి నీ వయసే కావేరి
నా మనసే గోదారి నీ వయసే కావేరి
బోల్‍ రాధా బోల్‍ రెండూ కలిసేనా లేదా
అరే బోల్‍ రాధా బోల్‍ జోడీ కుదిరేనా లేదా
నా మనసే గోదారి నీ వయసే కావేరి
బోల్‍ రాధా బోల్‍ రెండూ కలిసేనా లేదా
అరే బోల్‍ రాధా బోల్‍ జోడీ కుదిరేనా లేదా
నేనేం చేసేదయ్యో దద్దమ్మవు దొరికావు
అరే ఏం చెప్పేదయ్యో శుద్ధ మొద్దువి దొరికావు
నేనేం చేసేదయ్యో దద్దమ్మవు దొరికావు
అరే ఏం చెప్పేదయ్యో శుద్ధ మొద్దువి దొరికావు
దద్దమ్మవు దొరికావు...శుద్ధ మొద్దువి దొరికావు

చరణం 1:
కృష్ణుడు నేనే రుక్మిణి నీవే రాతిరి ఎత్తుకు పోతాను
లారీ మెల్లగా తోలుకువస్తా చల్లగ లేచిపోదాము
మీ అమ్మే యమగండం మా తల్లే సుడిగుండం
బోల్‍ రాధా బోల్‍ గండం తప్పేనా లేదా
అరే బోల్‍ రాధా బోల్‍ జోడీ కుదిరేనా లేదా

చరణం: 2
లావొక్కింతయు లేదు ధైర్యం విలోలంబయ్యె
ప్రాణంబులా ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చె
మనసే ఠారెత్తె మా ప్రేమయే జావై పోయెను
గుండెలే పగిలి చద్దామింక దిక్కెవ్వరో....
పోవే శాకినీ ఢాకినీ కదులు పో పో వెళ్ళిపో లంకిణీ...

చరణం: 3

బోల్ అమ్మా బోల్‍ జోడీ కలిసిందా లేదా
బోల్ అత్తా బోల్‍ రోగం కుదిరిందా లేదా
బోల్ అమ్మా బోల్‍ జోడీ కలిసిందా లేదా
బోల్ అత్తా బోల్‍ రోగం కుదిరిందా లేదా
బోల్ అమ్మా బోల్‍ జోడీ కలిసిందా లేదా
బోల్ అత్తా బోల్‍ రోగం కుదిరిందా లేదా....
రోగం కుదిరిందా లేదా....
********  ********  *******


చిత్రం: అదృష్టవంతులు (1969)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సినారె
గానం: పి.సుశీల

పల్లవి:
హొ..హొ..హొ..హొహ్హొ..
హొ..హొ..హొ..హొహ్హొ..
పడిన ముద్ర చెరిగిపోదురోయ్ వన్నెకాడ
పడుచు గుండె విడిచి పోదురోయ్
పెరటి చెట్టు పారిపోదురోయ్ సోగ్గాడా
పిల్ల మనసు మారిపోదురోయ్...
పడిన ముద్ర చెరిగిపోదురోయ్ వన్నెకాడ
పడుచు గుండె విడిచి పోదురోయ్..
పెరటి చెట్టు పారిపోదురోయ్ సోగ్గాడా
పిల్ల మనసు మారిపోదురోయ్...

చరణం: 1

మచ్చికైన పాల పిట్టను...ఓ.. రాజా.. నా... రాజా
మచ్చికైన పాల పిట్టను ...
వలపంతా ఇచ్చుకున్న కన్నెపిల్లనోయ్
మచ్చికైన పాల పిట్టను ...
వలపంతా ఇచ్చుకున్న కన్నెపిల్లనోయ్
నీ జబ్బ మీద పచ్చబొట్టునోయ్...
నీ జబ్బ మీద పచ్చబొట్టునోయ్...
ఔరౌరా... నీ రొమ్ము మీద పుట్టుమచ్చనోయ్...
హొ..హొ..హొ..హ్హొ...హొ..హొ..హొ..హొ
పడిన ముద్ర చెరిగిపోదురోయ్ వన్నెకాడ
పడుచు గుండె విడిచి పోదురోయ్
పెరటి చెట్టు పారిపోదురోయ్ సోగ్గాడా
పిల్ల మనసు మారిపోదురోయ్...

చరణం: 2

డేగలాగా ఎగిరిపోతివోయ్...
నిన్ను నేను తీగలాగ చుట్టుకొంటినోయ్...
డేగలాగా ఎగిరిపోతివోయ్...
నిన్ను నేను తీగలాగ చుట్టుకొంటినోయ్...
పాలలోన తేనె కలిసెనోయ్.....ఓ..రాజా..నా..రాజా
పాలలోన తేనె కలిసెనోయ్...
నేడే మన పరువానికి పండుగైనదోయ్...
హొ..హొ..హొ..హొహ్హొ..హొ..హొ..హొ..హొ
పడిన ముద్ర చెరిగిపోదురోయ్ వన్నెకాడ
పడుచు గుండె విడిచి పోదురోయ్
పడిన ముద్ర చెరిగిపోదురోయ్... సోగ్గాడా...
పడిన ముద్ర చెరిగిపోదురోయ్... సోగ్గాడా..
పడిన ముద్ర చెరిగిపోదురోయ్... సోగ్గాడా...
పడిన ముద్ర చెరిగిపోదురోయ్...
********  ********  ********

చిత్రం: అదృష్టవంతులు (1969)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
చింత చెట్టు చిగురు చూడు.. చిన్నదాని పొగరు చూడు
చింత చిగురు పుల్లగున్నాదోయ్
నా సామిరంగా.. చిన్నదేమో తియ్యగున్నాదోయ్
నా సామిరంగా.. చిన్నదేమో తియ్యగున్నాదోయ్
చింత చెట్టు చిగురు చూడు.. చిన్నవాడి బెదురు చూడు
చింత చెట్టు కాపుకొచ్చిందోయ్..
నా సామిరంగా.. చిన్నదేమో దాపుకొచ్చిందోయ్
నా సామిరంగా.. చిన్నదేమో దాపుకొచ్చిందోయ్

చరణం' 1
పాలవయసు పొందుకోరి పొంగుతున్నది
నా పైట కూడ వాడి పేరె పలవరిస్తది
పాలవయసు పొందుకోరి పొంగుతున్నది
నా పైట కూడ వాడి పేరె పలవరిస్తది
వగలమారి వాలుచూపు వొర్రగున్నది
అది వెంటపడితె ఏదేదో వెర్రిగున్నది
చింత చెట్టు చిగురు చూడు.. చిన్నదాని పొగరు చూడు
చింత చెట్టు కాపుకొచ్చిందోయ్
నా సామిరంగా.. చిన్నదేమో దాపుకొచ్చిందోయ్
నా సామిరంగా.. చిన్నదేమో తియ్యగున్నాదోయ్

చరణం: 2
పగ్గమేస్తే పెంకెతనం తగ్గనన్నది
సిగ్గు దోస్తే చిటికెలోన మొగ్గుతున్నదీ ఈ ఈ..
పగ్గమేస్తే పెంకెతనం తగ్గనన్నది
సిగ్గు దోస్తే చిటికెలోన మొగ్గుతున్నదీ
జబర్దస్తీ చేస్తుంది జబ్బ మీద వాలుతుంది
అబ్బో ఆ పడుచుదనం తబ్బిబ్బు చేస్తుంది
జబర్దస్తీ చేస్తుంది జబ్బ మీద వాలుతుంది
అబ్బో ఆ పడుచుదనం తబ్బిబ్బు చేస్తుంది
చింత చెట్టు చిగురు చూడు.. చిన్నదాని పొగరు చూడు
చింత చెట్టు కాపుకొచ్చిందోయ్..
నా సామిరంగా.. చిన్నదేమో దాపుకొచ్చిందోయ్
నా సామిరంగా.. చిన్నదేమో తియ్యగున్నాదోయ్

చరణం: 3

వన్నె మీద చిన్నవాడి కన్ను పడ్డది
అది వన్నె విడిచి నన్ను విడిచి మళ్ళనన్నది
వన్నె మీద చిన్నవాడి కన్ను పడ్డది
అది వన్నె విడిచి నన్ను విడిచి మళ్ళనన్నది
ఇంతలేసి కన్నులతో మంతరిస్తది...
ఇంతలేసి కన్నులతో మంతరిస్తది...
అహ ఎంత దోచినా కొంత మిగులుతుంటది
చింత చెట్టు చిగురు చూడు.. చిన్నదాని పొగరు చూడు
చింత చిగురు పుల్లగున్నాదోయ్ నా సామిరంగా..
చిన్నదేమో తియ్యగున్నాదోయ్
నా సామిరంగా... చిన్నదేమో తియ్యగున్నాదోయ్
చింత చెట్టు చిగురు చూడు.. చిన్నవాడి బెదురు చూడు
చింత చెట్టు కాపుకొచ్చిందోయ్
నా సామిరంగా.. చిన్నదేమో దాపుకొచ్చిందోయ్
నా సామిరంగా.. చిన్నదేమో దాపుకొచ్చిందోయ్...

*********  ********  ********

చిత్రం: అదృష్టవంతులు (1969)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల
పల్లవి:
కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా
కోడె కారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా
కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా
కోడె కారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా
కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా

చరణం: 1

కన్నె బుగ్గకు సిగ్గు కమ్మెను కళ్ళు చూస్తె కైపులెక్కెను
కన్నె బుగ్గకు సిగ్గు కమ్మెను కళ్ళు చూస్తె కైపులెక్కెను
కాపురానికి కొత్తవాళ్ళం కాడిమోయని కుర్రవాళ్ళం
కలలు తెలిసిన చిలిపివాడా కలుపరా మము కలువరేడా
కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా
కోడె కారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా

చరణం: 2

కంటికింపౌ జంటలంటే వెంట పడతావంట నువ్వు
కంటికింపౌ జంటలంటే వెంట పడతావంట నువ్వు
తెల్లవార్లూ చల్ల చల్లని వెన్నెలలతో వేపుతావట
తెల్లవార్లూ చల్ల చల్లని వెన్నెలలతో వేపుతావట
మత్తు తెలిసిన చందురూడా...మసక వెలుగే చాలు లేరా
కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా
కోడె కారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా

చరణం: 3

అల్లుకున్న మనసులున్నవి అలసిపోని బంధమున్నది
అల్లుకున్న మనసులున్నవి అలసిపోని బంధమున్నది


***************************************************

చిత్రం : అదృష్టవంతులు (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల 



పల్లవి :


ము..ము...ము..ము.. ముద్దంటే చేదా... నీకావుద్దేశం లేదా?
ఇప్పుడొద్దనావంటే చిన్నవాడా... రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా
ము..ము...ము..ము.. ముద్దంటే చేదా... నీకావుద్దేశం లేదా?
ఇప్పుడొద్దనావంటే చిన్నవాడా... రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా



ము..ము..ము..ము.. ముద్దంటే మోజే... ఇప్పుడావుద్దేశం లేదే
నిను ముద్దాడాలంటే కుర్రదానా... అసలు మనసంటూ ఉండాలి వెర్రిదానా
ము..ము...ము.. ముద్దంటే చేదా... నీకావుద్దేశం లేదా?




చరణం 1 :


పెదవులు రెండూ కలగలిపినచో... తేనెలు కురిసే ముద్దు
మనసులు రెండూ పెనవేసినచో... మమతకు లేదు హద్దు
పెదవులు రెండూ కలగలిపినచో... తేనెలు కురిసే ముద్దు
మనసులు రెండూ పెనవేసినచో... మమతకు లేదు హద్దు


చూడు ఉబలాటం... ఆడు చెలగాటం
చూడు ఉబలాటం... ఆడు చెలగాటం
పెడమోమైనా విడువను నిన్ను వద్దుర మొగమాటం


ము..ము...ము..ము.. ముద్దంటే చేదా... నీకావుద్దేశం లేదా?
నిను ముద్దాడాలంటే కుర్రదానా... అసలు మనసంటూ ఉండాలి వెర్రిదానా
ము..ము...ము..ము.. ముద్దంటే చేదా... నీకావుద్దేశం లేదా?




చరణం 2 : 



ఆడదాని ముద్దులో వేడి ఉన్నదోయ్...
ఆ వేడికే వెన్నలా కరిగిపోతావోయ్
ఆడదాని ముద్దులో వేడి ఉన్నదోయ్...
ఆ వేడికే వెన్నలా కరిగిపోతావోయ్



మోజు పడకుంటే మొగవాడెకాదోయ్...
మోజు పడకుంటే మొగవాడెకాదోయ్...
గడసరి బిగువు సడలించనిచో... జవరాలే కాదు



ము..ము...ము..ము.. ముద్దంటే చేదా... నీకావుద్దేశం లేదా?
ఇప్పుడొద్దనావంటే చిన్నవాడా... రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా


ము..ము..ము..ము.. ముద్దంటే మోజే... ఇప్పుడావుద్దేశం లేదే
నిను ముద్దాడాలంటే కుర్రదానా... అసలు మనసంటూ ఉండాలి వెర్రిదానా
ము..ము...ము.. ముద్దంటే చేదా... నీకావుద్దేశం లేదా?


చెలిమి నాటిన చిన్న ఇంట ఎదగనీ మా వలపు పంట
చెలిమి నాటిన చిన్న ఇంట ఎదగనీ మా వలపు పంట
తీపి మాపుల చందురూడా... కాపువై నువ్వుండి పోరా
కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా
కోడె కారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా
కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా
కోడె కారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా


సిపాయి చిన్నయ్య (1969)


పల్లవి :  



ఒరే మావా.. ఆ... ఆ.. హా.... ఒరే మావా.. ఆ.. ఆ..
ఒరే మావా ఏసుకోర సుక్క...  తెచ్చి పోసేను సక్కని సుక్క
ఏసుకో.. ఏసుకో.. సుక్క ఏసుకోరా...
ఒరె.. మావా.. మావా.. మావా.. మావా.. 


అరే బావా నంచుకోరా ముక్కా.. అది నవిలేవు దాల్చిన చెక్కా
నంచుకో... నంచుకో.. నంచుకోర ముక్కా


ఒరే మావా ఏసుకోర సుక్క...  తెచ్చి పోసేను సక్కని సుక్క
ఏసుకో.. ఏసుకో.. సుక్క ఏసుకోరా... 



చరణం 1 :




ఈ రేతిరి చెయరా జల్సా.. హోయ్.. ఎక్కాలి చక్కని నిషా
ఈ రేతిరి చెయరా జల్సా.. హోయ్.. ఎక్కాలి చక్కని నిషా


వేసేయ్ సుక్కా.. కొరికెయ్ ముక్కా.. రెండు కలిస్తే వరెవ్వా...
నే గూములో ఊగాలిరా.. తాగర మళ్ళీ మళ్ళీ
ఈ కైపులో.. మైమరపులో... 



అరే మావా.. ఆ... ఆ.. హా.... అరే మావా.. ఆ.. ఆ..




చరణం 2 :




హొయ్ పోకిరి సూపులు నీవి.. హోయ్ పొగరు వగరు నాది
వేడి సలవా... తీపి కారం... ఇద్దరిలోనా ఉన్నై


నీ కంటికి సోకైనది... నేనే నేనే కాదా
రంగేళిని.. సింగారిని... రంభా మేనకనౌతా




ఒరే మావా ఏసుకోర సుక్క...  తెచ్చి పోసేను సక్కని సుక్క
ఏసుకో.. ఏసుకో.. సుక్క ఏసుకోరా... 





చరణం 3 :




అహ.. పిల్లే కదరా కులాసా... అది కల్లును మించిన నిషా
అహ.. పిల్లే కదరా కులాసా... అది కల్లును మించిన నిషా
పిల్లా... కల్లుపెదవికి వస్తే అల్లిబిల్లి తమాషా


మందెందుకు మగరాయడా... అందం అగ్గిబరాటా
అందాలను తగ్గెయ్యరా... అప్పుడు సూడు మజాకా




ఒరే మావా.. ఆ... ఆ.. ఒరే మావా.. ఆ.. ఆ..
ఒరే మావా ఏసుకోర సుక్క...  తెచ్చి పోసేను సక్కని సుక్క
ఏసుకో.. ఏసుకో.. సుక్క ఏసుకోరా... 





చిత్రం :  సిపాయి చిన్నయ్య (1969)
సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  ఎల్. ఆర్. ఈశ్వరి