Showing posts with label Anirudh. Show all posts
Showing posts with label Anirudh. Show all posts

దేవర (2024)




అగ్గంటుకుంది సంద్రం
ఏహా
భగ్గున మండె ఆకసం
అరాచకాలు భగ్నం
ఏహా
చల్లారె చెడు సాహసం

జగడపు దారిలో
ముందడుగైన సేనానీ
జడుపును నేర్పగా
అదుపున ఆపే సైన్యాన్ని

దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత
దాక్కోవే

కాలం తడబడెనే
పొంగే కెరటము లాగెనే
ప్రాణం పరుగులయీ
కలుగుల్లో దూరెనే

దూకే ధైర్యమా జాగ్రత్త
దేవర ముంగిట నువ్వెంత దేవర

దేవరా ఓ

జగతికి చేటు చేయనేల
దేవర వేటుకందనేల
పదమే కదమై దిగితే ఫెళ ఫెళ

కనులకు కానరాని లీల
కడలికి కాపయ్యింది వేళ
విధికే ఎదురై వెళితే విలవిలా

అలలయే ఎరుపు నీళ్ళే
ఆ కాళ్ళను కడిగెరా
ప్రళయమై అతడి రాకే
దడ దడ దడ దండోరా

దేవర మౌనమే
సవరణ లేని హెచ్చరిక
రగిలిన కోపమే
మృత్యువుకైన ముచ్చెమట

దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత
దాక్కోవే

కాలం తడబడెనే
పొంగే కెరటము లాగెనే
ప్రాణం పరుగులయీ
కలుగుల్లో దూరెనే

దూకే ధైర్యమా జాగ్రత్త
దేవర ముంగిట నువ్వెంత దేవర

దేవరా ఓ

 చిత్రం: దేవర (2024)
సంగీతం: అనిరుద్ రవిచందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: అనిరుద్ రవిచందర్

**************** **************** ************** ************ *************** ******
 
చుట్టమల్లే చుట్టేస్తాంది.. తుంటరి చూపు..
ఊరికే ఉండదు కాసేపు...
అస్తమానం నీలోకమే నా మైమరపు..
చేతనైతే నువ్వే నన్నాపు...
రా.. నా నిద్దర కులాసా.. నీ కలలకిచ్చేశా..
నీ కోసం వయసు వాకిలి కాశా..
రా.. నా ఆశలు పోగేశా.. నీ గుండెకు అచ్చేశా..
నీ రాకకు రంగం సిద్దం చేశా..

ఎందుకు పుట్టిందో పుట్టింది.. ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది..
పుడతానే నీ పిచ్చి పట్టింది..నీ పేరు పెట్టింది..
వయ్యారం ఓణీ కట్టింది.. గోరింట పెట్టింది..
సామికి మొక్కులు కట్టింది.. చుట్టమల్లే చుట్టేస్తాంది.. 
చుట్టమల్లే చుట్టేస్తాంది..హాహా..అరారారే
చుట్టమల్లే చుట్టేస్తాంది.. తుంటరి చూపు..
ఊరికే ఉండదు కాసేపు..

చరణం 1
మత్తుగా మెలేసింది.. నీ వరాల మగసిరి
హత్తుకోలేవా మరి సరసన చేరి..
వాస్తుగా పెంచానిట్టా వంద కోట్ల సొగసిరి..
ఆస్తిగా అల్లేసుకో కోసరి కోసరి..
చెయ్యరా ముద్దుల దాడి.. ఇష్టమే నీ సందడి..
ముట్టడించే ముట్టేసుకోలేవా ఓసారి చేజారి..
రా.. ఈ బంగరు నెక్లేసు ఈ ఒంటికి నచ్చట్లే..
నీ కౌగిలితో నన్ను సింగారించు..
రా.. ఏ వెన్నెల జోలాలి..నన్ను నిద్దర పుచ్చట్లే..
నా తిప్పలు కొంచెం ఆలోచించు..

ఎందుకు పుట్టిందో పుట్టింది.. ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది..
పుడతానే నీ పిచ్చి పట్టింది..నీ పేరు పెట్టింది..
వయ్యారం ఓణీ కట్టింది.. గోరింట పెట్టింది..
సామికి మొక్కులు కట్టింది.. చుట్టమల్లే చుట్టేస్తాంది.. 
చుట్టమల్లే చుట్టేస్తాంది..హాహా..అరారారే
చుట్టమల్లే చుట్టేస్తాంది.. తుంటరి చూపు..
ఊరికే ఉండదు కాసేపు..


చిత్రం: దేవర (2024)
సంగీతం: అనిరుద్ రవిచందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: శిల్పా రావు

**************** **************** ************** ************ *************** ******
  
కొర్రమీన నిన్ను కోసుకుంటా ఇయ్యాల
పొయిమీన మరిగిందె మసాలా
చెలికూన వయసాకు ఇస్తారెయ్యాల
కసి మీన తొలి విందులియ్యాల

కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియే కిళి కిళియో
కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియో

దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది.. 
దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది.. 
యే వాది వాది రే.. యే వాది వాది రే.. దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..


నీ ఏటవాలు చూపే ఎన్నెల సాంబ్రాణి
నన్నెక్కించావే పిల్లా.. రెక్కల గుర్రాన్ని
ఆకట్టు..కుంది ఈడు.. ఆకలి సింగాన్ని
జోకొట్టుకుంటా ఒళ్లో చీకటి కాలాన్ని
నల్కీసునడుం గింగిర గింగిర గింగిరమే
రంగుల పొంగుల బొంగరమే
సన్నగ నున్నగ బల్లేగా చెక్కావే
ఇంకేంది ఎడం కస్సున.. బుస్సున పొంగడమే
కాముడి చేతికి లొంగడమే
హక్కుగ మొక్కుగ బల్లేగ దక్కావే..

కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియే కిళి కిళియో
కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియో

దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..
దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..
యే వాది వాది రే.. యే వాది వాది రే.. దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..


చిత్రం: దేవర (2024)
సంగీతం: అనిరుద్ రవిచందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: నకాష్ అజీజ్, ఆకాశ


జెర్సీ (2018)





చిత్రం: జెర్సీ (2018)
సంగీతం: అనిరుధ్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: సంగీతం: అనిరుధ్

అదేంటొగాని ఉన్నపాటుగా
అమ్మాయి ముక్కుమీద నేరుగా
తరాల నటి కోపమంతా... ఎరుపేగా
నాకంటూ ఒక్కరైనా లేరుగా
నన్నంటుకున్న తారవే నువా
నాకున్న చిన్ని లోకమంత నీ... పిలులేగా

తేరిపారా చూడసాగె దూరమే
ఏది ఏది చేరె చోటనే
సాగె క్షణము లాగెనే వెనకె మనని చూసెనే
చెలిమి చేయమంటు కోరెనే
ఓ ఓ ఓ ఓ
వేగమడిగి చూసెనే
అలుపే మనకి లేదనే వెలుగులైనా వెలసిపోయెనే
ఓ ఓ ఓ ఓ

చరణం:
మా జోడు కాగా
వేడుకేగా వేకువెప్పుడో తెలీదుగా
ఆ ఆ ఆ చందమామ మబ్బులో దాగిపోడా
హే వేళ పాళ మీకు లేదా
అంటు వద్దనే అంటున్నదా
ఆ...సిగ్గులోని అర్థమే మారిపోదా


ఏరి కోరి చేరసాగే కౌగిలే
ఏది ఏది చేరె చోటనే
కౌగిలిరుకు ఆయనే
తగిలే పసిడి ప్రాయమే
కనులలోనే నవ్వు పూసెనే

లోకమిచట ఆగెనే
ముగ్గురో ప్రపంచమాయెనే
మెరుపు మరుపుతోనే కలిసెనే

అదేంటొగాని ఉన్నపాటుగా
కాలమెటుల మారెనే
దొరికే వరకు ఆగదే
ఒకరు ఒకరుగానే విడిచెనే

అదేంటొగాని ఉన్నపాటుగా
దూరమెటుల దూరెనే
మనకే తెలిసె లోపలే
సమయమే మారిపోయెనే

************** **************************** ***************

 
చిత్రం: జెర్సీ (2018)
సంగీతం: అనిరుధ్
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం:  కాలభైరవ

Spirit Of Jersey

అనిగిమనిగిన అలలిక యెగిసెను చూడరా
అసలు అవదులు లేవురా
అలుపు దరికిక చెరనీక ఆడరా

మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడర
పగలు మెరుపులు చూపర
వయసు సగముగ మారిపోయి ఓడెరా

గెలుపే అడుగడుగునా
వెలుగే నిను అలిమెన
దిగులే పడె మరుగునా
మొదలే ఇక సమరమా
పడిన బెదరక పదా
పరుగే విజయము కదా
ఉరికే చెమటల నదై కదిలెనులే

తగలగ మేఘమె ఎగురిక నింగి వైపుకే
కొలవని వేగమె అడుగులొ చూపటానికే
మరిచిన తారవే ముసుగిక నెడు వీడెలె
పరుగుల దాహమె బరువిక తెలికాయెలే

అనిగిమనిగిన అలలిక యెగిసెను చూడరా
అసలు అవదులు లేవురా
అలుపు దరికిక చెరనీక ఆడరా

మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడర
పగలు మెరుపులు చూపర
వయసు సగముగ మారిపొయి ఓడెరా

గమనాలనే గమనించరా
గమనాలనే గమనించరా
ఒకరొజు గమ్యమెదురవదా
గగనాలనే గురిచూడరా
మరి నేల నీకు వశమవదా
గమనాలనే గమనించరా
ఒకరొజు గమ్యమెదురవదా
గగనాలనే గురిచూడరా
మరి నేల నీకు వశమవదా

పిడుగు వలెనె పడుతు కలుపు
ఇక ఈ నింగీ నేలా
ఉరుము మెరుపు బరిలో నిలుపు
ఇక అంతా నీదెరా
అడుగు కదుపు జయము జగము నీ
సొంతం అయ్యేలా
విదికి ఎదురు నిలిచి గెలిచి
నీ పంతాం చూపెలా

తగలగ మేఘమె ఎగురిక నింగి వైపుకే
కొలవని వేగమె అడుగులొ చూపటానికే
మరిచిన తారవే ముసుగిక నెడు వీడెలె
పరుగుల దాహమె బరువిక తెలికాయెలె

అనిగిమనిగిన అలలిక యెగిసెను చూడరా
అసలు అవదులు లేవురా
అలుపు దరికిక చెరనీక ఆడరా

మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడర
పగలు మెరుపులు చూపర
వయసు సగముగ మారిపొయి ఓడెరా

గెలుపే అడుగడుగునా
వెలుగే నిను అలిమెన
దిగులే పడె మరుగునా
మొదలే ఇక సమరమా
పడిన బెదరక పదా
పరుగే విజయము కదా
ఉరికే చెమటల నదై కదిలెనులే

తగలగ మేఘమె ఎగురిక నింగి వైపుకే
కొలవని వేగమె అడుగులొ చూపటానికే
మరిచిన తారవే ముసుగిక నెడు వీడెలె
పరుగుల దాహమె బరువిక తెలికాయెలె

అనిగిమనిగిన అలలిక యెగిసెను చూడర


************** **************************** ***************


 
చిత్రం: జెర్సీ (2018)
సంగీతం: అనిరుధ్
సాహిత్యం: బ్రోధ. వి
గానం:  శక్తిశ్రీ  గోపాలన్, బ్రోధ. వి,  అనిరుధ్

ముద్దు పెట్టనా ఊపిరి పైనే
చుట్టు ముట్టనా ఆవిరి లానే
కన్ను కొట్టనా కోరికైనా నిన్ను ముట్టగానే

హత్తుకుందునా ఆఖరులానే
కొత్తగుందనే వైఖరిలోనే
ఎన్ని తిట్టినా ఆపను నేనే ఉండు గుట్టుగానే

పదే పదే పెదాలని
అదే పనై శ్రమించని
పదాలనే పండించని
ఇదే నదై ముంచెయ్యని

పదే పదే పెదాలని
అదే పనై శ్రమించని
పదాలనే పండించని
ఇదే నదై ముంచెయ్యని

I am in pursit of some therapy
As soon as the melody hits
I will never resist the minute I look at you licking you velvety lips
An endless abyss of animalistic energy heavenly thrills

I am letting your empathy enter the feeling I feel is so heavy and steadily builds
Aye yo, chalices of intimacy down
Always got my tunnel vision in focus when you're around
Always got my tunnel vision in focus when you're around

కనులకి కాపల లేదులే
కలలది ఆగని దూకుడే
కన్ను కొట్టనా కోరికైనా
నిన్ను ముట్టగానే

వయసుకి ఓపిక లోకువే
తనువుకి ఆశల తాకిడే
ఎన్ని తిట్టినా ఆపను నేనే
ఉండు గుట్టుగానే

రాలేవా రాలేవా వానల్లే నా మీద 
రాలేవా దేహం వేసవే
పోలేవా పోలేవా మాటేసే దూరాలు 
పోలేవా నీ నా కోసమే

పదే పదే పెదాలని
అదే పనై శ్రమించని
పదాలనే పండించని
ఇదే నదై ముంచెయ్యని

పదే పదే పెదాలని
అదే పనై శ్రమించని
పదాలనే పండించని
ఇదే నదై ముంచెయ్యని

Aye yo, chalices of intimacy down
Always got my tunnel vision in focus when you're around
Aye Yo, chalices of intimacy down
Always got my tunnel vision in focus when you're around

కనులకి కాపల లేదులే
కలలది ఆగని దూకుడే
వయసుకి ఓపిక లోకువే
తనువుకి ఆశల తాకిడే


************** **************************** ***************
 
చిత్రం: జెర్సీ (2018)
సంగీతం: అనిరుధ్
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం:  శశా తిరుపతి , ఇన్నో జంగా 

ప్రపంచమే అలా నిద్దర్లొ ఉందిగా
నవ్వేమొ మేలుకుందిగా పెదాలపై ఇలా
ఆనందమే ఇలా రమ్మందిలే పదా
హుషారు వీధి వైపుగ షికారుకె పదా

ఇటే చీకటె..వెకువై వాలెనా
మరో తీరమే..చేరగ మేమిల

మా కన్నులు వదిలి మరి కలా
మా ఎదురు నిలిచి పిలిచే వేల
మ మనసు కనని మెరుపులా
ఈ నలుపు విడిచె వెలుగిదేలా

మా కన్నులు వదిలి మరి కలా
మా ఎదురు నిలిచి పిలిచే వేల
మ మనసు కనని మెరుపులా
ఈ నలుపు విడిచె వెలుగిదేలా

ప్రతి క్షణము బ్రతుకు ఒక జగడమె
తెగ పరుగు నడుమ ఇది ఎరగమె

మది కుదుటు పడిన
తొలి తరునమె
ముడి నుదుట విడిన
చిరు సమయమె

పసి వయసు మనిషికొక వరములె
అది తెలిసే సరికే మరి మిగలదె
ముది ముడత అనునదొక తనువుకె
ప్రతి ముడత వెనక గలదొక కథె

ఇటె చీకటె..వెకువై వాలెన
మరో తీరమె..చేరగ మేమిల

మా కన్నులు వదిలి మరి కల
మా ఎదురు నిలిచి పిలిచే వేల
మా మనసు కనని మెరుపులా
ఈ నలుపు విడిచె వెలుగిదేలా

మా కన్నులు వదిలి మరి కల
మా ఎదురు నిలిచి పిలిచే వేల
మా మనసు కనని మెరుపులా
ఈ నలుపు విడిచె వెలుగిదేలా


************** **************************** ***************


 
చిత్రం: జెర్సీ (2018)
సంగీతం: అనిరుధ్
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం:  దర్శన్ రవల్

నీడ పడదని మంటననగలరా
నువ్వంటు లేవంటూ
కాని కలలకు కాంతినడిగెదరా
తప్పుంటె లేదంటు

పడిన నేలా
పడిన నేలా
వదలదేల నిలువు నీల
కదపలేల
యెదురుగాలె చెదిరిపోద

కాల్చొద్దు అంటే కాదు స్వర్నం
వోడొద్దు అంటే లేదు యుద్దం
లేకుంటె కష్టం హాయి వ్యర్ధం
యెవరికోసం మారదర్దం

కాల్చొద్దు అంటే కాదు స్వర్నం
వోడొద్దు అంటే లేదు యుద్దం
లేకుంటె కష్టం హాయి వ్యర్ధం
యెవరికోసం మారదర్దం

ఓటమెరగని ఆట కనగలవ
ఉందంటె కాదాటె
దాటి శిషువుగ బైట పడగలవ
నువ్వంటు ఒద్దంటె

అడుగు దూరం
విజయమున్న విడిచిపోన
కదలలేక
వదలలేక చెదిరిపోన

కాల్చొద్దు అంటే కాదు స్వర్నం
వోడొద్దు అంటే లేదు యుద్దం
లేకుంటె కష్టం హాయి వ్యర్ధం
యెవరికోసం మారదర్దం

కాల్చొద్దు అంటే కాదు స్వర్నం
వోడొద్దు అంటే లేదు యుద్దం
లేకుంటె కష్టం హాయి వ్యర్ధం
యెవరికోసం మారదర్దం

గ్యాంగ్ లీడర్ (2019)



సంగీతం : అనిరుధ్ చంద్రన్
సాహిత్యం : అనంత శ్రీరాం
గానం    : అనిరుధ్ చంద్రన్


వేరేయ్  కొత్త  భూమిపై  ఉన్నానా
ఏదో  వింత  రాగమే  విన్నానా
వేరేయ్  కొత్త  భూమిపై  ఉన్నానా
ఏదో  వింత  రాగమే  విన్నానా

పలికెయ్  పాల  గువ్వతో
కూలికెయ్  పూల  కొమ్మతో
కసిరే  వెన్నెలమ్మతో
స్నేహం  చేశా
ఎగిరే  పాలవెల్లితో
నడిచే  గాజు  బొమ్మతో
బంధం  ముందు  జన్మదా
ఏమో  బహుశా

హొయినా  హొయినా  హొయినా  హొయినా  హొయినా
హొయినా  హొయినా  హొయినా
ఇక  ఏదేమైనా  మీతో  చిందులు
వేయనా  వేయనా
హొయినా  హొయినా  హొయినా  హొయినా
హొయినా  హొయినా  హొయినా
కలకాలం  మీతో  కాలక్షేపం
చేయనా  చేయనా

ఠింక్ ఈ చౌఘ్త్ థె ఫీల్స్ థిస్ సుమ్మెర్
భే యౌ’రె ఒనె ఒఫ్ అ కింద్ నొ ఒథెర్
భె మ్య్ స్వీతిఎ బె మ్య్ సుగర్
హద్ ఎనౌఘ్ అస్ అ ఒనె సిదె లొవెర్
ఈ థింక్ ఈ చౌఘ్త్ థె ఫీల్స్ థిస్ సుమ్మెర్
భే యౌ’రె ఒనె ఒఫ్ అ కింద్ నొ ఒథెర్
భె మ్య్ స్వీతిఎ బె మ్య్ సుగర్
హద్ ఎనౌఘ్ అస్ అ ఒనె సిదె లొవెర్

ఠింక్ ఈ చౌఘ్త్ థె ఫీల్స్ థిస్ సుమ్మెర్
భే యౌ’రె ఒనె ఒఫ్ అ కింద్ నొ ఒథెర్
భె మ్య్ స్వీతిఎ బె మ్య్ సుగర్
హద్ ఎనౌఘ్ అస్ అ ఒనె సిదె లొవెర్
ఈ థింక్ ఈ చౌఘ్త్ థె ఫీల్స్ థిస్ సుమ్మెర్
భే యౌ’రె ఒనె ఒఫ్ అ కింద్ నొ ఒథెర్
భె మ్య్ స్వీతిఎ బె మ్య్ సుగర్
హద్ ఎనౌఘ్ అస్ అ ఒనె సిదె లొవెర్

నా  జీవితానికి  రెండో
ప్రయాణముందని
దారి  వేసిన  చిట్టి  పాదమా
నా  జాతకానికి  రెండో
భాగముందని
చాటి  చెప్పిన  చిన్ని  ప్రాణమ
గుండెలోన  రెండో  వైపే  చూపి
సంబరాన  ముంచావే  నేస్తమా
నాలో  నాకే  రెండో  రూపం  చూపి
దీవించిందే  నీలో  పొంగే  ప్రేమ

వెలిగే  వేడుకవ్వనా
కలిసే  కానుకవ్వనా
పెదవుల్లోయినా  నింపైనా
చిరుదరహాసం
ఎవరో  రాసినట్టుగా
జరిగే  నాటకానికి
మెరుగులు  దిద్ది  వెయ్యనా
ఇక   నా  వేషం

హొయినా  హొయినా  హొయినా  హొయినా  హొయినా
హొయినా  హొయినా  హొయినా
ఇక  ఏదేమైనా  మీతో  చిందులు
వేయనా  వేయనా
హొయినా  హొయినా  హొయినా హొయినా
హొయినా  హొయినా  హొయినా
కలకాలం  మీతో  కాలక్షేపం
చేయనా  చేయనా

వేరేయ్  కొత్త  భూమిపై  ఉన్నానా
ఏదో  వింత  రాగమే  విన్నానా
వేరేయ్  కొత్త  భూమిపై  ఉన్నానా
ఏదో  వింత  రాగమే  విన్నానా

****** *********** *********** *******
 Music :Anirudh Chandran
 Lyricist:  Ananta Sriram
 Singers:  Prudhvi Chandra



రా రా జగతిని జయించుదాం
రా రా చరితను లిఖించుదాం
రా రా భవితను సవాలు చేసే కవాతు చేద్దం తెగించుదాం
రా రా నడుములు భిగించుదాం
రా రా పిడుగులు ధరించుదాం
రా రా చెడునిక దహించివేసే రహస్య వ్యూహం రచించుదాం

గదులు గడులుగ గడపలు దాటేయ్
దడలు దడులు దరులను దాటేయ్
ఎగిరెగిరి ఎగిరి యెగిరి ఎగిరెగిరి యెగిరి దస దిసల కొసకు పోదాం
యెరలు మొరలు చెరలను దటేయ్
తరులు గిరులు జరులను దాటేయ్
ఎరిరెగిరి ఎగిరి యెగిరి ఎగిరెగిరి యెగిరి తుది గెలుపు మెరుపు చూద్దాం
రా.........

సరిగా సరిగా మన శక్తులన్ని ఒక చోట చేర్చుదాం
త్వరగా త్వరగా మన తప్పులన్ని సరిదిద్ది సగుదాం
చెమటె చెమటే చమురైన వాహనం దేహమే కదా
శ్రమకే శ్రమకే తను కోరుకున్న గమ్యాన్ని చూపుదాం
తారల కలలు తాకుదాం మన తీరుని తెలుపుదాం
ఆరని తపన ఆయుదం ఇక పోరుని సలుపుదాం

గదులు గడులుగ గడపలు దాటేయ్
దడలు దడులు దరులను దాటేయ్
ఎగిరెగిరి ఎగిరి యెగిరి ఎగిరెగిరి యెగిరి దస దిసల కొసకు పోదాం
యెరలు మొరలు చెరలను దటేయ్
తరులు గిరులు జరులను దాటేయ్
ఎరిరెగిరి ఎగిరి యెగిరి ఎగిరెగిరి యెగిరి తుది గెలుపు మెరుపు చూద్దాం
రా.........

రా రా జగతిని జయించుదాం
రా రా చరితను లిఖించుదాం
రా రా భవితను సవాలు చేసే కవాతు చేద్దం తెగించుదాం
రా రా నడుములు భిగించుదాం
రా రా పిడుగులు ధరించుదాం
రా రా చెడునిక దహించివేసే రహస్య వ్యూహం రచించుదాం

*********** ************* ********

ఏ  సీను  సిరిగి  సీటు లిరిగి 
సీటీ  కొట్టాలోయ్ 
ఏ  సిడెడు  నైజాం  ఆంధ్ర
సింధు  తొక్కాలోయ్ 
సిటీకె  వేసి  వెల్కమ్  చెప్పండోయ్
సిరునవ్వుల్తో  హారతి  పట్టండోయ్   

గ్యాంగు  గ్యాంగు  లీడర్  వచ్చాడు  లెగండోయ్
హంగు  హ్యాంగ్  ఓవర్  లో  ఊగాలి  పదండోయ్
గ్యాంగు  గ్యాంగు  లీడర్  వచ్చాడు  లెగండోయ్
హంగు  హ్యాంగ్  ఓవర్  లో  ఊగాలి  పదండోయ్

ఏ  సీను  సిరిగి  సీటు లిరిగి 
సీటీ  కొట్టాలోయ్ 
ఏ  సిడెడు  నైజాం  ఆంధ్ర
సింధు  తొక్కాలోయ్ 
పి  పి

హే  సరస్వతి  పేరులోనే  కొంత  సోఫ్ట్  రో
ఈ  బామ్మా  మరో  భద్రకాళి  కదరో
హే  వరలక్ష్మి  మాటలోనే  అంత  హార్డు  రో
ఈ  అమ్మ  ఇంకో  అన్నపూర్ణ  కదరో

ఆ  కంట్లో  కోపాన్ని  ఈ  కంట్లో  ఇష్టాన్ని
చూపిస్తూ  ఉంటదోయ్  మా  ప్రియా  డార్లింగ్
స్వాతి  లా  ఓ  చెల్లి  అందరికి  ఉండుంటే
ఈ  లోకం  ఓ  స్వర్గం  అవునని  న  ఫీలింగ్

అడ్డేడే  చిన్నూ  చిన్నూ
పెన్సిలు  ఇది  పెన్ను
అంత  కలిసి  కలిసి
దించేస్తారు  నిన్ను

గ్యాంగు  గ్యాంగు  లీడర్  వచ్చాడు  లెగండోయ్
హంగు  హ్యాంగ్  ఓవర్  లో  ఊగాలి  పదండోయ్
గ్యాంగు  గ్యాంగు  లీడర్  వచ్చాడు  లెగండోయ్
హంగు  హ్యాంగ్  ఓవర్  లో  ఊగాలి  పదండోయ్

ఏ  సీను  సిరిగి  సీటు లిరిగి 
సీటీ  కొట్టాలోయ్ 
ఏ  సిడెడు  నైజాం  ఆంధ్ర
సింధు  తొక్కాలోయ్ 
పి  పి

గ్యాంగు  గ్యాంగు  లీడర్  వచ్చాడు  లెగండోయ్
హంగు  హ్యాంగ్  ఓవర్  లో  ఊగాలి  పదండోయ్
గ్యాంగు  గ్యాంగు  లీడర్  వచ్చాడు  లెగండోయ్
హంగు  హ్యాంగ్  ఓవర్  లో  ఊగాలి  పదండోయ్

టిపిరి  టిపిరి  టిప్పు  టిపిరి
టిపిరి  టిపిరి  టిప్పు  టిపిరి
టిపిరి  టిపిరి  టిప్పు  టిపిరి
ధగదిగది  ధగదిగది
టిపిరి  టిపిరి  టిప్పు  టిపిరి
టిపిరి  టిపిరి  టిప్పు  టిపిరి
టిపిరి  టిపిరి  టిప్పు  టిపిరి
ధగదిగది  ధగదిగది


సంగీతం : అనిరుధ్ చంద్రన్
సాహిత్యం : అనంత శ్రీరాం
గానం    : అనిరుధ్ చంద్రన్

************************** *************

కథ రాయడం మొదలుకాక ముందు అప్పుడే ఎలాంటి మలుపో కల దేనికో తెలుసుకోక ముందు అప్పుడే ఇదేమి తలపో నిను చూసేయ్ ఆనందంలో కనుపాపేయ్ కడలి పొంగినదేయ్ నిను తాకేయ్ ఆరాటం లో నను నేనే వదిలేయసాను కాదెయ్ అరేయ్ భారమెంత నువ్వు మోపినా మనసు తేయలీకౌతు ఉందే నిను చూసేయ్ ఆనందంలో కనుపాపేయ్ కడలై పొంగినదేయ్ కథ రాయడం మొదలుకాక ముందు అపుడెయ్ ఎలాంటి మలుపో అణువణువునా ఒణుకు రెయ్గినది కనబడదాది కనులకెయ్ అడుగడుగునా అడుగుతోంది మాది వినబడదాది చెవులకేయ్ మెదడుకి పది మెలికలేయ్సినది తెలియనిధిది తెలివికీ ఇదివరకెరుగనిది ఏమిటిది నిదరైనది నిదరకే తడవ తడవ గోదవాడినా తగని తగువు పడినా విడిగా విడిగా విసిగించినా వీడని ముడులు పడేనా నిను చూసేయ్ ఆనందంలో కనుపాపేయ్ కడలి పొంగినదేయ్ నిను తాకీ ఆరాటం లో నను నేనే వదిలేయసాను కాదెయ్ అరేయ్ భారమెంత నువ్వు మోపినా మనసు తేయలీకౌతు ఉందే నిను చూసేయ్ ఆనందంలో కనుపాపేయ్ కడలై పొంగినదేయ్ కథ రాయడం మొదలుకాక ముందు అపుడెయ్ ఎలాంటి మలుపో ఒకటొకటిగా పనులు పంచుకుని పెరిగిన మన చనువుని సులువుగా చులకనగా చూడకని పలికెను ప్రతి క్షణమిలా ఒకటొకటిగా తెరలు తెంచుకుని తరిగిని మన వెలితిని పొరబడి నువ్వు మరల పెంచకని అరిచెను ప్రతి కానమిలా వెతికి వెతికి బతిమాలినా గతము తిరగబడదే వెనక వెనక అని చేసినా నిజాము మరుగుబడేదే నిను చూసేయ్ ఆనందంలో కనుపాపేయ్ కడలి పొంగినదేయ్ నిను తాకేయ్ ఆరాటం లో నను నేనే వదిలేయసాను కాదెయ్ అరేయ్ భారమెంత నువ్వు మోపినా మనసు తేయలీకౌతు ఉందే నిను చూసేయ్ ఆనందంలో కనుపాపేయ్ కడలి పొంగినదేయ్ కథ రాయడం మొదలుకాక ముందు అపుడెయ్ ఎలాంటి మలుపో

సంగీతం : అనిరుధ్ చంద్రన్ సాహిత్యం : అనంత శ్రీరాం గానం : సిద్ శ్రీరాం

రఘువరన్ B Tech (2015)


అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా...
నువ్వే లేక వసివాడానమ్మా...
మాటే లేకుండా నువ్వే మాయం...
కన్నిరవుతోంది యదలో గాయం...
అయ్యో వెళ్ళిపోయావే...
నన్నొదిలేసి ఎటు పోయావే...
అమ్మా ఇకపై నే వినగాలనా నీ లాలిపాట...
నే పాడే జోలకు నువు కన్నెత్తి చూసావో అంతే చాలంట...

అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా...
నువ్వే లేక వసివాడానమ్మా...

చెరిగింది దీపం...
కరిగింది రూపం...
అమ్మా నాపై ఏమంత కోపం...
కొండంత శోకం...
నేనున్న లోకం...
నన్నే చూస్తూ నవ్వింది శూన్యం...
నాకే ఎందుకు శాపం...
జన్మల గతమే చేసిన పాపం...
పగలే దిగులైన నడిరేయి ముసిరింది...
కలవర పెడుతోంది పెను చీకటి...
ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది...
బ్రతికి సుఖమేమిటీ...

ఓ అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా...
నువ్వే లేక వసివాడానమ్మా...

విడలేక నిన్నూ...
విడిపోయి వున్నా...
కలిసే లేనా నీ శ్వాసలోన...
మరణాన్ని మరచి...
జీవించి వున్నా...
ఏ చోట వున్నా నీ ధ్యాసలోన...
నిజమై నే లేకున్నా...
కన్నా నిన్నే కలగంటున్నా...
కాలం కలకాలం ఒకలాగే నడిచేనా...
కలతను రానీకు కన్నంచున...
కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన...
చిగురై నిను చేరనా...

అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా...
నువ్వే లేక వసివాడానమ్మా...
అడుగై నీతోనే నడిచొస్తున్నా...
అద్దంలో నువ్వై కనిపిస్తున్నా...
అయ్యో వెళ్ళిపోయావే...
నీలో ప్రాణం నా చిరునవ్వే...
అమ్మా ఇకపై నే వినగాలనా నీ లాలిపాట...
వెన్నంటి చిరుగాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా...


చిత్రం - రఘువరన్ B Tech (2015)
సంగీతం - అనిరుధ్ రవిచరన్
సాహిత్యం - రామజోగయ్య శాస్త్ర్రీ
గానం – దీపు, ఎస్ జానకి


*********** ************* *************          ********************



పో… పోవే ఏకాంతం... ఏకాంతం...
నా రాణి నా సొంతం.... నా సొంతం....
చేరుకుందీ కల.. నిండు పూ మాసంలా...
చిగురు తోడిగానిలా కొత్త చిరునవ్వులా...
లలలలలా... ఒఒఒఒఓ... ఉఉఉఉఊ... నననననా...
అందం...లలలలలా... సోంతం.. ఒఒఒఒఓ... మనసే...ఉఉఉఉఊ...

పో… పోవే ఏకాంతం... ఏకాంతం...
నా రాణి నా సొంతం.... నా సొంతం....

ఏ తోడు లేక నలిగింది సమయం...
నీ నీడ తగిలాకే వెలిగంది హృదయం...
నిట్టూర్పూ సెగలై గతకాల గమనం...
ఓదార్పు పంచింది నీ శ్వాస పవనం...
ఎదనే తడిపే చిన్నారి చినుకా...
తడిసా మురిసా ఇక చాలనకా..
నిను తాకు గాలి నా పైన వాలి...
అమ్మల్లే పాడింది అందాల లాలి...
లలలలలా... ఒఒఒఒఓ... ఉఉఉఉఊ... నననననా...
అందం...లలలలలా... సోంతం.. ఒఒఒఒఓ... మనసే...ఉఉఉఉఊ...

పో… పోవే ఏకాంతం... ఏకాంతం...
నా రాణి నా సొంతం.... నా సొంతం....
చేరుకుందీ కల.. నిండు పూ మాసంలా...
చిగురు తోడిగానిలా కొత్త చిరునవ్వులా...
లలలలలా... ఒఒఒఒఓ... ఉఉఉఉఊ... నననననా...
అందం...లలలలలా... సోంతం.. ఒఒఒఒఓ... మనసే...ఉఉఉఉఊ...

చిత్రం - రఘువరన్ B Tech (2015)
సంగీతం - అనిరుధ్ రవిచరన్
సాహిత్యం - రామజోగయ్య శాస్త్ర్రీ
గానం - రాఘవేంధ్ర

రెమో (2016)

దోర దోర ఊర చూపుతోటి 
నన్ను కొల్లగొట్టే నన్ను కొల్లగొట్టే
చంటి పాపల నవ్వుతోటి 
నన్ను కొల్లగొట్టే నన్ను కొల్లగొట్టే

ఫస్టులుక్కులోన చూడగానే 
గుండె గంట కొట్టే గుండె గంటకొట్టే 
లవ్వు బుక్కు లోన ఫస్టు పేజీ 
అర్థమయ్యినట్టే

ప్రేమ బాణమేసి నన్ను కొల్లగొట్టే
నన్ను కొల్లగొట్టే పిల్ల కొల్లగొట్టే 
లవ్వు సింబలేసి నన్ను కొల్లగొట్టే 
పిల్ల కొల్లగొట్టే నన్ను ఫుల్లుగా 

నాకు నువ్వు ఈజీగా దొరకొద్దే
క్రేజీ క్రేజీగా ట్రై చేస్తాలే 
రోజు రోజు రంగులనీ పువ్వులనీ 
పట్టుకొచ్చి నిన్నే పటాయిస్తాలే

నాకు నీ జాతకమివ్వద్దే
అమ్మ నాన్న సమ్మతమే వద్దే
మన లవ్వు సినిమాల్లో స్టోరీల్లో చూపినట్టు సూపర్‌గా నడిపిస్తాలే

నిన్ను చూడాలిలే 
మాట్లాడిలే.. నీతో 
పక్క పక్క నున్న సెల్ఫీ దిగాలిలే
నిన్ను పొగడాలిలే నువ్వు తిట్టాలిలే 
నిన్ను ఏడిపించి ఊరడించుకోవాలిలే 
॥నిన్ను చూడాలిలే॥ 

కరెక్ట్ టైమ్‌లో
ప్రేమలోన పడేసి నన్నిలా 
ల ల ల ల లైఫ్ బండి లోన 
నింపిందిలా లవ్వు పెట్రోలు వెన్నెలా

ఆడపిల్ల అంటేనే తప్పుకుని పారిపోయేవాన్నిరా
ప ప ప పాపారపాను 
పాట పాడునట్టు 
నన్ను ఎంత మార్చెరా 

నాకోసం దిగొచ్చినా దేవతా 
నీకోసం నేనెంత వేచా
ఇరవై ఏళ్లుగా వెతికినా 
ఇవ్వాలే నే నిన్ను చూశా

బట్ అయినా సరే 
దోర దోర ఊర చూపుతోటి
॥ నాకు నువ్వు ఈజీగా ॥

సినిమా : రెమో (2016)
తారాగణం : శివకార్తీకేయన్, కీర్తి సురేష్
దర్శకుడు : భాగ్యరాజ్ కన్నన్
సంగీతం : అనిరుధ్ రవిచందర్
లిరిక్స్ : శ్రీ మణి
గాయకురాలు : అనిరుధ్ రవిచందర్