Showing posts with label Tabu. Show all posts
Showing posts with label Tabu. Show all posts

ప్రియురాలు పిలిచింది (2000)




చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: ఏ.ఎమ్.రత్నం ,  శివ గణేశ్
గానం: శంకర్ మహదేవన్


లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయ మందువే

గంధపు గాలిని తలుపులు ఆపుట
న్యాయమా.... న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె
మౌనమా.... మౌనమా
చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే
అదే నేను ఋజువే చేయ నూరేళ్లు చాలవే

లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే ఏమి చేయమందువే

గంధపు గాలిని తలుపులు ఆపుట
న్యాయమా.... న్యాయమ
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె
మౌనమా.... మౌనమా
చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే
అదే నేను ఋజువే చేయ నూరేళ్లు చాలవే

లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే ఏమి చేయమందువే

హృదయమొక అద్దమని నీ రూపు బింబమని
తెలిపేను హృదయం నీకు సొంతమనీ....
బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి
అద్దాల ఊయల బింబమూగె చెలీ....
నువు తేల్చి చెప్పవే పిల్లా
లేక కాల్చి చంపవే లైలా
నా జీవితం నీ కనుపాపలతో
వెంటాడి ఇక వేటాడొద్దే

లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే ఏమి చేయమందువే

గంధపు గాలిని తలుపులు ఆపుట
న్యాయమా.... న్యాయమ
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె
మౌనమా.... మౌనమా

తెల్లారి పోతున్నా విడిపోని రాత్రేది
వాసనలు వీచే నీ కురులే సఖీ....
లోకాన చీకటైన వెలుగున్న చోటేది
సూరీడు మెచ్చే నీ కనులే చెలీ....
విశ్వ సుందరీమణులె వచ్చి
నీ పాద పూజ చేస్తారే
నా ప్రియ సఖియా ఇక భయమేలా
నా మనసెరిగి నా తోడుగ రావే

ఏమి చేయమందువే ఏమి చేయమందువే
ఏమి చేయమందువే ఏమి చేయమందువే
న్యాయమా... న్యాయమ
ఏమి చేయమందువే ఏమి చేయమందువే
మౌనమా... మౌనమా
ఏమి చేయమందువే




*********   ********   *********



చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: ఏ.ఎమ్.రత్నం ,  శివ గణేశ్
గానం:  సాధనా సర్గమ్

పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా
పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా
అహా నేడే రావాలి నా దీపావళి పండగా
నేడే రావాలి నా దీపావళి పండగా
రేపటి స్వప్నాన్నీ నేనెట్టా నమ్మేది
నే నాటితె రోజా నేడే పూయునే
పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా

పగలే ఇక వెన్నెలా...
పగలే ఇక వెన్నెలా వస్తే పాపమా
రేయిలో హరివిల్లే వస్తే నేరమా
బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్
బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్
కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం
నూరు కలలను చూచినచో ఆరు కలలును ఫలియించు కలలే దరీచేరవా

పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా

నా పేరే పాటగా కోయిలే పాడనీ
నే కోరినట్టుగా పరువం మారనీ
భరతం తం తం మదిలో తం తోం ధిం
భరతం తం తం మదిలో తం తోం ధిం
చిరుగాలి కొంచం వచ్చి నా మోమంతా నిమరని
రేపు అన్నది దేవునికి నేడు అన్నది మనుషులకూ
బ్రతుకే బతికేందుకూ

పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా
అహా నేడే రావాలి నా దీపావళి పండగా
నేడే రావాలి నా దీపావళి పండగా
రేపటి స్వప్నాన్నీ నేనెట్టా నమ్మేది
నే నాటితె రోజా నేడే పూయునే



*********   ********   *********



చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: ఏ.ఎమ్.రత్నం ,  శివ గణేశ్
గానం:  చిత్ర

దోబూచులాటేలరా
దోబూచులాటేలరా గోపాల
నా మనసంత నీవేనురా
దోబూచులాటేలరా గోపాల
నా మనసంత నీవేనురా
ఆ యేటి గట్టునేనడిగ
చిరు గాలి నాపి నే నడిగ
ఆ యేటి గట్టునేనడిగ
చిరు గాలి నాపి నే నడిగ
ఆకాశాన్నడిగ బదులే లేదు
ఆకాశాన్నడిగ బదులే లేదు
చివరికి నిన్నే చూశా
హౄదయపు గుడిలో చూశా
చివరికి నిన్నే చూశా
హౄదయపు గుడిలో చూశా

దోబూచులాటేలరా గోపాల
నా మనసంత నీవేనురా

నా మది నీకొక ఆటాడు బొమ్మయ
నా మది నీకొక ఆటాడు బొమ్మయ
నాకిక ఆశలు వేరేవి లేవయ్య
ఎదలో రొదాగదయా
నీ అధరాలు అందించ రా గోపాలా ఆ
నీ అధరాలు అందించ రా గోపాల
నీ కౌగిళిలొ కరిగించ రా
నీ తనువే ఇక నా వలువా
పాలకడలి నాది నా గానం
నీ వన్నె మారలేదేమి
పాలకడలి నాది నా గానం
నీ వన్నె మారలేదేమి
నా ఏదలొ చేరి వన్నె మర్చుకో
ఊపురి నీవై సాగ
పెదవుల మెరుపు నువు కాగ చేరగ రా

దోబూచులాటేలరా గోపాల
నా మనసంత నీవేనురా

గగనమే వర్షించ గిరి నెత్తి కాచావు
గగనమే వర్షించ గిరి నెత్తి కాచావు
నయనాలు వర్షించ నన్నెట్ట బ్రోచేవు
పువ్వునకనే నీ మతమా
నేనొక్క స్త్రీ నే కదా గోపల
అది తిలకించ కనులే లేవా
నీ కలలే నేనే కాదా
అనుక్షనము ఉలికెనా మనసు
అరె మూగ కాదు నా వయసు
నా ఊపిరిలోన ఊపిరి నీవై ప్రాణం పోనికుండ
యెప్పుడు నీవే అండ కాపాడ రా

దోబూచులాటేలరా గోపాల
నా మనసంత నీవేనురా




*********   ********   *********



చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: ఏ.ఎమ్.రత్నం ,  శివ గణేశ్
గానం:  చిత్ర , శ్రీనివాస్


నెలే పొడిచెనని చంద్రుడొచ్చెనని
తుళ్ళీ పడెనులే నా హృదయం
నీడ చూసినా నువ్వేనంటు
ఈ హృదయం పొంగీ పొరలును

నెలే పొడిచెనని చంద్రుడొచ్చెనని
తుళ్ళీ పడెనులే నా హృదయం
నీడ చూసినా నువ్వేనంటు
ఈ హృదయం పొంగీ పొరలును

ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
కళ్ళలో కలిసెనో అమ్మమ్మ వేకువే చెరిపెనో
కవిత నెతికి ఇవ్వండీ లేక నా కలను తిరిగి ఇవ్వండీ

ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా

సంధ్య వేళలొ మనసు మూల
మరుగైన మోము మది వెదికెలే
మండుటెండలో నగర వీధిలో
మసలి మసలి మది వాడెలే
మబ్బు చిందు చిరు చినుకు చినుకుకు
మధ్య నిన్ను మది వెదికెలే
అలల నురుగు లో కలల ప్రేమికుని
గుచ్చి గుచ్చి మది వెదికెలే
సుందర వదనం ఒక పరి చూచిన
మనసే శాంతించూ...ఊ...
ముని వ్రేళ్ళతో నువ్వక పరి తాకిన
మళ్ళి మళ్ళి పుట్టెదనే..ఏ...

నెలే పొడిచెనని చంద్రుడొచ్చెనని
తుళ్ళీ పడెనులే నా హృదయం
నీడ చూసినా నువ్వేనంటు
ఈ హృదయం పొంగీ పొరలును

ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా

ఒకే చూపును ఒకే మాటను ఒకే స్పర్శ మది కోరెలే
ముద్దులిచు మురిపాల సెగలను ఎల్ల వేళలా కొరులే
చెమట నీటీ నీ మంచి గంధముగ ఎంచ మని మది కోరెలే
మోము పైన కేశములు గుచ్చిన తీపి హయి చెప్పుకోదులే ఆఆ... కోదు లే...ఏ..
రాయి తో చేసిన మనసే నాదని చెలియ కు తెలిపితినే
రాయి మధ్యలో పెరిగిన లత లా నువు నాలో తొలచితివే

ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా

నిన్నే పెళ్ళాడుతా (1996)




చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: జిక్కి, రామకృష్ణ, సందీప్, రాజేష్, బలరామ

పల్లవి:
బబంబం బబంబం బబంబం బబంబం ..బబంబంహై హై

నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా
సరేరా కుమారా అలాగే కానీరా
మా కళ్ళల్లో కారం కొట్టి మీరు మాత్రం జారుకుంటారా
సెలక్షన్ చూశాం ..శభాషంటున్నాం
అహా...
ముహూర్తం చూస్తాం తథాస్తు అనేసి ముడేసి తరించిపోతాం
ఆపై మాతో మీకేం పనిరా మాయమైపోతాములేరా
సరేరా కుమారా అలాగే కానీరా !

నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇచ్చావా పాపం

చరణం: 1
ప్రేమదాకా ఓ..కే... పెళ్లి మాత్రం షాకే..
చాలురా నారదా నీ హరికథ...పెళ్లయే యోగమే నీకున్నదా ?
ఇంటిలో ఇందరం ఉన్నాం కదా..కోరితే సాయమే చేస్తాం కదా
పార్కులో సీను .. తప్పురా శ్రీను
అందుకని నిన్ను సాక్షిగా ముందుంచి ముద్దాడుకుంటార్రా కుర్రాళ్ళు !

ఈ మహలక్ష్మీ ఇంటికి వస్తే మేము మాత్రం కాదంటామా
సరేరా కుమారా అలాగే కానీరా
నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే... మ్మ్...మ్మ్..

చరణం: 2
సిగ్గుపడవే పండు .. నువ్వు కాదురా ఫ్రెండు..
ఆడుతూ పాడుతూ మీ ఊరొస్తాం..అమ్మడు కాసుకో అల్లరి చేస్తాం
విందులు మెక్కుతూ వంకలు పెడతాం...చీటికి మాటికి చెలరేగుతాం

అల్లుడిని తెస్తాం కాళ్ళు కడిగిస్తాం
పెళ్లి కాగానే అందర్నీ తరిమేసి మిమ్మల్ని గదిలోకి నెట్టేసి..
ఖర్చెంతైందో లెక్కలు వేస్తూ మేలుకుంటాం మీకు పోటీగా
లలల్లా లలల్లా లలల్లా లలల్లా

నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా
సెలక్షన్ చూశాం..వాహ్.. శభాషంటున్నాం..
ముహూర్తం చూస్తాం తథాస్తు అనేసి ముడేసి తరించిపోతాం
ఆపై మాతో మీకేం పనిరా మాయమైపోతాములేరా
బబంబం బబంబం బబంబం బబంబం ..బబంబంహై..హై..హై...
నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా...


*****  *****  *****


చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సౌమ్య

పల్లవి:
గ్రీకువీరుడూ..గ్రీకువీరుడూ
గ్రీకువీరుడూ నా రాకుమారుడూ కలల్లోనె ఇంకా ఉన్నాడూ
film స్టారులూ క్రికెట్టు వీరులూ కళ్ళుకుట్టి చూసే కుర్రాడూ
DREAM BOY.....
రూపులో చంద్రుడూ చూపులో సూర్యుడు
DREAM BOY.....
ఊరనీ పేరనీ జాడనే చెప్పడూ..ఏమి చెప్పనూ ఎలాగ చెప్పనూ...
ఎంత గొప్పవాడే నావాడూ..రెప్ప మూసినా ఏటైపు చూసినా
కళ్ళముందు వాడే ఉన్నాడూ..
ఎంతో...ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ
ఎవ్వరూ...వాడితో చెప్పరే ఎదురుగా రమ్మనీ
గ్రీకువీరుడు...గ్రీకువీరుడు...
గ్రీకువీరుడు...గ్రీకువీరుడు...

చరణం: 1
నడకలోని ఠీవి చూసి సింహమైన చిన్నపోదా..
నవ్వులోని తీరుచూసి చల్లగాలి కరిగిపోదా...
style లో వాడంత వాడు లేడూ..
నన్ను కోరినా మగాళ్ళు ఎవ్వరూ
నాకు నచ్చలేదే what to...do...
నేను కోరినా ఏకైక పురుషుడూ..ఇక్కడే ఎక్కడో ఉన్నాడు
ఎంతో...ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ..
ఎందుకో...ఆకలీ నిద్దరా ఉండనే ఉండదే
గ్రీకువీరుడు...గ్రీకువీరుడు...
గ్రీకువీరుడు...గ్రీకువీరుడు...

చరణం: 2
లోకమంత ఒక్కటైన లెక్కచేయనన్నవాడూ
కోరుకున్న ఆడపిల్ల కళ్ళముందు నిలవలేడూ
చూస్తా ఎన్నాళ్ళు దాగుతాడూ

కన్నె ఊహలో వుయ్యాలలూగుతూ..ఎంత అల్లరైనా చేస్తాడూ
ఉన్నపాటుగా కొర్రుక్కు తిననుగా ఎందుకంత దూరం ఉంటాడూ
ఎంతో...ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ
ఎవ్వరూ...వాడితో చెప్పరే ఎదురుగా రమ్మనీ
గ్రీకువీరుడు...గ్రీకువీరుడు...
గ్రీకువీరుడు...గ్రీకువీరుడు...


*****  *****  *****


చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సంజీవ్, సుజాత

పల్లవి:
కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే
ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే

కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే

చరణం: 1
మది దాచుకున్నా రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదేలా
నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా
గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగటం

చరణం: 2
అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను మదిలోని మాటేదని
తల వంచుకొని నేను తెగ ఎదురు చూశాను నీ తెగువ చూడాలనీ
చూస్తూనే రేయంతా తెలవారిపోతుందో ఏమో ఎలా ఆపటం


*****  *****  *****


చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్

పల్లవి:
ఎటో వెళ్లిపోయింది మనసు...
ఎటో వెళ్లిపోయింది మనసు...
ఇలా ఒంటరైయింది వయసు..ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో
ఎటో వెళ్లిపోయింది మనసు ఎటెళ్ళిందో అది నీకు తెలుసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో.

చరణం: 1
ఏ స్నేహమూ కావాలని ఇన్నాలుగా తెలియలేదూ
ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదూ..
చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో..

చరణం: 2
కలలన్నవి కోలువుండని కనులుండి ఏం లాభమందీ
ఏ కదలికా కనిపించని శిలలాంటి బ్రతుకెందుకందీ..
తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుంది అంటూ..


*****  *****  *****


చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్, సౌమ్య

పల్లవి:
హబ్బబ్బ దూకుతోంది లేత ఈడు నీ చూపు లాగి
ఒళ్ళంతా పాకుతుంది వింత కైపు నీ ఊహ తాగి
ఇంకా ఏదో కావాలంటూ

వేడెక్కి వేగుతోంది కోడే యీడు నీ శ్వాస తాగి
కవ్వింత రేగుతోంది కోరుకున్న నీ స్పర్శ సోకీ
ఇంకా ఏదో కావాలంటూ..యే

చరణం: 1
ఆ..ఆ
వొంపు వొంపులోన ఉరికింది తాపం
చంపుతోంది నన్ను నాజూకు రూపం
ఏం చేసినా చాలు అనలేని ఈ వేళలో
ఇంకా ఏదో ఐపోమంటూ...

ఉప్పొంగి దూకుతోంది లేత యీడు నీ చూపు లాగి
ఒళ్ళంతా పాకుతుంది వింత కైపు నీ ఊహ తాగి

చరణం: 2
ఆ..ఆ..
గోటిగాటు తీపి గాయాలు రేపి
పంటిగాటు తోటి ప్రాయాన్ని లేపి
నరనరములా నిప్పు రాజేసిన మత్తులో
ఇంకా యేదో చేసేయ్‌మంటూ
వేడెక్కి వేగుతోంది కోడే యీడు నీ శ్వాస తాగి
కవ్వింత రేగుతోంది కోరుకున్న నీ స్పర్శ సోకీ

ఇంకా ఏదో కావాలంటూ
ఇంకా ఏదో కావాలంటూ
ఇంకా ఏదో కావాలంటూ
ఇంకా ఏదో....

కూలీ నం - 1 (1991)



చిత్రం: కూలీ నెం. 1 (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: యస్ పి బాలు, బృందం


జై జై జై జై గణేష జై జై జై...
జై జై జై జై వినాయక జై జై జై...

దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ
నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ
పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా
తండ్రివలె ఆదరించి తోడు నీడ అందించయ్యా
ఓ...ఓ...ఓ...
దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ
నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ

చరణం: 1
చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెనుభారం
ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా హోహోహో జన్మ ధన్యం
చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెనుభారం
ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా హోహోహో జన్మ ధన్యం
అంబారిగ ఉండగల ఇంతటి వరం
అయ్యోర అయ్యా
అంబాసుతా ఎందరికి లభించురా
అయ్యోర అయ్యా
ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా

దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ
నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ

చరణం: 2
శివుని శిరసు సింహాసనం
పొందిన చంద్రుని గోరోజనం
నిన్నే చేసింది వేళా కోళం
ఎక్కిన మదం దిగిందిగా
తగిన ఫలం దక్కిందిగా
ఏవైపోయింది గర్వం
అరె శివుని శిరసు సింహాసనం
పొందిన చంద్రుని గోరోజనం
నిన్నే చేసింది వేళా కోళం
ఎక్కిన మదం దిగిందిగా
తగిన ఫలం దక్కిందిగా
ఏవైపోయింది గర్వం
త్రిమూర్తులే నిను గని తలొంచరా
అయ్యోర అయ్యా
నిరంతరం మహిమను కీర్తించరా
అయ్యోర అయ్యా
నువ్వెంతనే అహం నువ్వే దండించరా

దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ
నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ
అరెరెరెరెరే... పిండి వంటలారగించీ తొండమెత్తి దీవించయ్యా
తండ్రివలె ఆదరించి తోడు నీడ అందించయ్యా... ఓ...ఓ... ఓ...

హే దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ
నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ
హే దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ
నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ


( జై జై జై జైజై  జైజై  జై జై జై జై  వినాయక జై విజ్నేస్వర జై జై జై జైజై)



**********    **********   **********



చిత్రం: కూలీ నెం. 1 (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్ పి బాలు , చిత్ర

కొత్త కొత్తగా వున్నది స్వర్గమిక్కడే అన్నది
కోటి తారలే... పూల ఏరులై...
కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే

కొత్త కొత్తగా వున్నది స్వర్గమిక్కడే అన్నది

నా కన్ను ముద్దాడితే
కన్నె కులుకాయె కనకాంబరం
నా చెంప సంపెంగలో
కెంపు రంగాయె తొలి సంబరం
ఎన్ని పొంగులో కుమారి కొంగులో
ఎన్ని రంగులో సుమాల వాగులో
ఎన్ని పొంగులో కుమారి కొంగులో
ఎన్ని రంగులో సుమాల వాగులో
ఉద్యోగమిప్పించవా
సోకు ఉద్యాన వనమాలిగా
జీతమియ్యగా లేత వన్నెలే
చెల్లించుకోన...

కొత్త కొత్తగా వున్నది స్వర్గమిక్కడే అన్నది
కోటి తారలే... పూల ఏరులై...
కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే
కొత్త కొత్తగా వున్నది స్వర్గమిక్కడే అన్నది

నీ నవ్వు ముద్దాడితే
మల్లెపువ్వాయె నా యవ్వనం
నాజుకు మందారమే
ముళ్ళ రోజాగ మారే క్షణం

మొగలి పరిమళం మొగాడి కౌగిలి
మగువ పరవశం సుఖాల లోగిలి
మొగలి పరిమళం మొగాడి కౌగిలి
మగువ పరవశం సుఖాల లోగిలి

కండల్లో వైశాఖమా
కైపు ఎండల్లో కరిగించుమా
తీగమల్లికి నరాల పందిరి
అందించుకోన...

కొత్త కొత్తగా వున్నది స్వర్గమిక్కడే అన్నది
కోటి తారలే... పూల ఏరులై...
కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే
కొత్త కొత్తగా వున్నది స్వర్గమిక్కడే అన్నది



*********   *********   *********



చిత్రం: కూలీ నెం. 1 (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: ఇళయరాజా, పి. సుశీల

కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ
కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ
అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా
అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా

కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ
కలయా నిజమా

చరణం: 1
లేనిపోని ఏ కూనిరాగమో లేచిరా అంటున్నదీ ఆహా...
ఊరుకోని ఏ వెర్రి కోరికో తీర్చవా అంటున్నదీ
కోకముళ్ల కూపీ తీసే కైపు చూపు కొరుకుతున్నదీ
కుర్రకళ్లు చీరగళ్లలో దారే లేక తిరుగుతున్నవి
ముంచే మైకమో మురిపించే మొహమో

కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ
కలయా నిజమా

చరణం: 2
చేయి వేయనా సేవ చెయ్యనా ఓయ్ అనే వయ్యారమా
హా హా హా
పాలముంచిన నీటముంచిన నీ దయే శృంగారమా ఆహా...
ఆగలేని ఆకలేవిటో పైకి పైకి దూకుతున్నవి
కాలు నేల నిలవకున్నది ఆకాశాన తేలుతున్నది
ఆఁ అంతా మాయగా అనిపించే కాలము

కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ
కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ
అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా
అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా
కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ



*********   ********   ********




చిత్రం: కూలీ నం - 1 (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర ,  యస్ పి బాలు

కిలకిలమనె కళావరు రాణి
ఘల్లుఘల్లు మనె కథాకళి కానీ
కలల్లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అనీ
ఛల్ మోహన్ రంగ సుఖాలకు బోణి
చలిగిలి అన్నీ హొల్లోమనీ పోనీ
సిగ్గేలేని సింగారాన్ని చిందించని చలో హనీ
మదనుడిపాలై పోనీ ముదిరిన భావాలన్నీ
మగజత పాడే బాణీ మగువకు రేవై రానీ
కిలకిలమనె కళావరు రాణి
ఘల్లుఘల్లు మనె కథాకళి కానీ
కలల్లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అనీ

బరువుగా విరిగెగా కాపు చూపె కద ఏపుగా గోపికా
చొరవగా కరువుగా కాపువేసే కద తేపుగా కోరికా
వాల్లే పరువాలె తగువేలే గనకా
కాలే తమకాలే ఘమకాలై పలుకా
కాంక్షలో సృతీ గతీ పెంచీ కాల్చగా చుట్టూ కట్టే కంచే ఈ మైకం
ఈడులో అతీ గతీ లేనీ దేనికో దిక్కూ మొక్కో పంచే ఈ మాఘం
ఆదమరచిన ఈడులో ఈదలాడనీ

ఛల్ మోహన్ రంగ సుఖాలకు బోణి
చలిగిలి అన్నీ హొల్లోమనీ పోనీ
సిగ్గేలేని సింగారాన్ని చిందించని చలో హనీ

ఒడుపుగా ఒలుచుకో ఓపలేను కద ఒంటిలో అవసరం
చిలిపిగా దులుపుకో మోయలేవు కద నడుములో కలవరం
తాపం తెరతీసీ తరిమేసే తరుణం
కాలం తలుపేసీ విరబూసే సమయం
వీలుగా గుట్టూ మట్టూ మీటీ లీలగా ఎక్కే పుట్టే వేడీ యాడాడో
ఒంటిగా ఉంటే ఒట్టే అంటూ వెంటనే జట్టే కట్టేయాలి ఏనీడో
జోడు బిగిసిన వేడిలో వేగిపోనీ

కిలకిలమనె కళావరు రాణి
ఘల్లుఘల్లు మనె కథాకళి కానీ
కలల్లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అనీ
ఛల్ మోహన్ రంగ సుఖాలకు బోణి
చలిగిలి అన్నీ హొల్లోమనీ పోనీ
సిగ్గేలేని సింగారాన్ని చిందించని చలో హనీ
మదనుడిపాలై పోనీ ముదిరిన భావాలన్నీ
మగజత పాడే బాణీ మగువకు రేవై రానీ
కిలకిలమనె కళావరు రాణి
ఘల్లుఘల్లు మనె కథాకళి కానీ
కలల్లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అనీ


*********   ********   ********


చిత్రం: కూలీ నం - 1 (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు

ఆటెన్షన్ ఎవ్రిబడి నేనొస్తున్నా బీ రెడీ నేనే మహారాజు
నా చుట్టు క్యూ కట్టండి  చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు
అదృష్టం బాడీగార్డు అన్నింటా నేనే ఫస్ట్
కాలాన్ని  కట్టికూర్చోబెట్టా గుమ్మం ముందు

ఆటెన్షన్ ఎవ్రిబడి నేనొస్తున్నా బీ రెడీ నేనే మహారాజుహ హ
నా చుట్టు క్యూ కట్టండి  చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు

హోలీడేకి జోలిగా హాలీవుడ్డేళ్లానంటే
హాల్లో బాసు హౌ డు యు డు అంటూ
డైలీ ఎంతో మంది హీరో రోల్ ఇస్తామంటూ ప్రాణం తింటూ ఉంటారు
సారి రా డైరీ కాళిలేదంటే వింటారా హ హ హ

ఐ యామ్ ఏ బాటసారి మేఘాల రహదారి
ఉండుండి నేల జారి హాల్టేస్తా ఒక్కసారి
ఫోలెండ్లో పొద్దున్నుండి హాలెండులోన  ఆఫ్టర్ నూన్
సిడ్నీ లో సాయంకాలం వాషింగ్టన్లో నైటుంటాను
ఎపుడు నివాసం ఏరో ప్లైన్ ఎక్కడా స్టడిగా కూర్చోలేను
సూరీడల్లే భూగోళాన్ని చుట్టేస్తూనే ఉంటా ఎవ్రిడే

ఆటెన్షన్ ఎవ్రిబడి నేనొస్తున్నా బీ రెడీ నేనే మహారాజు హ హ
నా చుట్టు క్యూ కట్టండి  చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు
అదృష్టం బాడీగార్డు అన్నింటా నేనే ఫస్ట్
కాలాన్ని  కట్టికూర్చోబెట్టా గుమ్మం ముందు హ హ హహ

ఆటెన్షన్ ఎవ్రిబడి నేనొస్తున్నా బీ రెడీ నేనే మహారాజు
నా చుట్టు క్యూ కట్టండి  చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు

నేనేడుంటే ఆడే చుట్టూ ఆడోళ్లంతా అల్లేస్తారు
హాల్లో డార్లింగ్ అంటూ నాతో డేటింగ్ ఔటింగ్
మీటింగ్ మేటింగ్ ఏదైనా ఓకే అంటారు
పెళ్ళాడందే పోదీమేళం ఇల్లా అయితే పోదా శీలం

ఐ యామ్ ఎ బ్రహ్మచారి పట్టాను పెళ్లిదారి
కావాలి తగనారి నువ్వేనా ఆ చిన్నారి
నచ్చాలి కన్ను ముక్కు నిక్కు టెక్కు ఉన్న బాడీ
నచ్చాలి నాలో ఉన్న వాడి వేడి కన్నెలేడి
మగువా మగాడ అనిపించాలి పొగరు వగైరా కనిపించాలి
ఓకే అయితే చేపడతాను చూపెడతాను జతలో హనీమూను

ఆటెన్షన్ ఎవ్రిబడి నేనొస్తున్నా బీ రెడీ నేనే మహారాజు
నా చుట్టు క్యూ కట్టండి  చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు
అదృష్టం బాడీగార్డు అన్నింటా నేనే ఫస్ట్
కాలాన్ని  కట్టికూర్చోబెట్టా గుమ్మం ముందు

ఆటెన్షన్ ఎవ్రిబడి నేనొస్తున్నా బీ రెడీ నేనే మహారాజు
నా చుట్టు క్యూ కట్టండి  చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు


*********   ********   ********


చిత్రం: కూలీ నం - 1 (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు

అమ్మని ఫాదాలు
అబ్బని ఎంత డబ్బని
పిల్లతో పాటుగా ఒళ్లోకి వచ్చింది ఒక్క దెబ్బని..
ఫాదలు ఒహో ఫాదలు..
సన్ను ఓయ్
అమ్మని ఎంత సొమ్మని(2)
నక్కతోక తొక్కినట్టు అప్పనంగా దక్కింది అందుకొమ్మని
సన్ను ఒరేయ్ సన్ను
పాపాయిలా ఈ లూపాయలన్నీ ఎట్టా పెంచాలి ఫాదలు
లోపాయికారి వ్యాపారమేదో చూద్దాం పదరా సన్ను...
ఫాదలు ...ఓయ్ సన్ను ఒరేయ్ సన్ను...


చరణం: 1
ఆ భలే ఐడియా ఫాదలు...
ఏందది ...
ఏందంటే
ఎలక్షన్లో పెడదామా అసెంబ్లీ కి ఎసలెడదామా ఫాదలు ఓహో ఫాదలు
ప్రజలకి టోపీ వేద్దామా ఎడా పెడా దోచేద్దామా ఫాదలు..
అసెంబ్లీలో మినిస్టిరీ లో మూణ్ణాల్లేరా సన్ను అంతేనా
పవర్ పోయాక పాలేరైనా పలకరించడురా నిన్ను
polytics లో ఏముందిరా బంక మన్ను
అమ్మో అయితే వద్దు ఫాదలు...ఇంకో బిజినెస్ చూడు ఫాదలు...

నాకు వచ్చిందిరా
ఏంటి ఫాదలు...ఐడియా
ఫిలిం ఫీల్డ్లో పెడదామా ప్రొడ్యూసర్లం అవుదామా సన్ను ఒరేయ్ సన్ను
లో బడ్జెట్ లో తీద్దామా సబ్సిడీలు కొట్ట్టేద్దామా సన్ను ఒరేయ్ సన్ను
లో బడ్జెట్ లో ఆల్ట్ బొమ్మలు ఎవలు చూడలు ఫాదలు డబ్బా
పోనీ భాలీ సినిమా తీస్తే ఫ్లాప్ అయితేనో ఫాదలు
వకీలులై పడిపోమా నడి వీధిలో...
అయితే ఇంకో బిజినెస్ చూడరా

చరణం: 2
మక్కా జూదం మించిన చిట్కా ఉంటుందా ఫాదలు
మక్కెలు విరిగి బొక్కలో పడే రిస్క్ ఉంటుందిరా సన్ను
పేకాట క్లబ్బును పెడితే అంతా పైకమే కద సన్ను
వచ్చినోళ్ళతో మనమే ఆడి నష్ఠపోతాము ఫాదలు
సాలా కొట్టో బాలో అయితే
బాలో బాట్టో కాదురా...బాలు ఛి ఛి ఛి బారు.
అదేలే ఫాదలు బాలు....బాలెట్టడం భలే ఐడియా ఫాదలు
పీపాల సరుకు మనకే సాలదు అమ్మకమెట్టా సన్ను

లక్కు తిన్నగా లేదంటే బొక్క బోర్ల పడిపోతాము
పళ్ళు ఊడగొట్టుకుంటాము...

ప్రేమ దేశం (1996)

చిత్రం: ప్రేమదేశం (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో, ఉన్నికృష్ణన్, డామ్నిక్
దర్శకత్వం: కధీర్
నిర్మాత: జె. రామచంద్ర రావు
విడుదల తేది: 23.08.1996

వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..
వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..
కడలి ఒడిలో నదులు ఒదిగి.. నిదురపోయే వేళా..
కనుల పైన కలలే వాలి.. సోలిపోయే వేళా..

వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..

ఆశ ఎన్నడు విడువదా..
అడగరాదని తెలియదా..
నా ప్రాణం..చెలియా నీవేలే..
విరగబూసిన వెన్నెలా..
వదిలి వేయకే నన్నిలా..
రారాదా..ఎద నీదే కాదా..
నిదురనిచ్చే జాబిలీ..
నిదురలేక.. నీవే వాడినావా..

వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..

మంచు తెరలో అలిసిపోయి..
మధన సంధ్య తూగెనే..
పుడమి ఒడిలో కలలుకంటూ..
పాపా నీవూ నిదురపో..
మల్లె అందం మగువకెరుక..
మనసు బాధ తెలియదా..
గుండె నిండా ఊసులే..
నీ ఎదుటనుంటే మౌనమే..
జోలపాటా పాడినా..
నే నిదురలేక వాడినా..

వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..
వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..



**********   ************  ***********



చిత్రం: ప్రేమదేశం (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఏ.ఆర్.రెహమాన్

Ooh yeah friendship
friendship is what we' re looking for
ముస్తఫా ముస్తఫా don' t worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా don' t worry mustaffa
కాలం నీ నేస్తం ముస్తఫా
day-by-day day-by-day
కాలం ఒడిలో day-by-day
పయనించే షిప్పే friendship రా

జూన్ పోయి జూలై పుడితే seniorki juniorki
college champus లోనే రాగింగ్ ఆరంభం
student మనసో నందనవనం మల్లెలుంటాయ్ ముల్లులుంటాయ్
స్నేహానికి రాగింగ్ కూడా చేస్తుందోయ్ సాయం
వాడిపోనిది స్నేహమొకటే వీడిపోనిది నీడ ఒక్కటే
హద్దంటూ లేనే లేనిది friendship ఒక్కటే
కష్టమొచ్చినా నష్టమొచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే
కాలేజీ స్నేహం ఎపుడూ అంతం కానిదే
ఓ....ఓ..ఓ...

ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు ఏడనుంచో గోరు వంకలు
కాలేజీ champus లోనే నాట్యం చేసెనే
కన్నెపిల్లల కొంటెనవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు
కాలేజీ compound అంటే కోడైకనాలే
కోర్సు ముగిసే రోజువరకు తుళ్ళిపడిన కుర్ర ఎదలో
కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి
స్నేహితుల్ని వీడిపోయే రోజు మాత్రం కంటి నిండా
కన్నీటి తోడేనంట farewell party



**********   ************  ***********



చిత్రం: ప్రేమదేశం (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు

ప్రేమా…. ప్రేమా…. ప్రేమా ప్రేమా…..
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా…
నా నీడ నన్ను విడిపొయిందే నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా…
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి
రావా నా వాకిట్లో నీకై నే వేచానే
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా…

ఆకాశదీపాన్నై నే వేచిఉన్నా నీ పిలుపుకోసం చిన్నారి
నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి
నా గుండె లోతుల్లో దాగుంది నీవే
నువు లేక లోకంలో జీవించలేనే
నీ ఊహతోనే బ్రతికున్నా….
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా…
నా నీడ నన్ను విడిపొయిందే నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా…

నిముషాలు శూలాలై వెంటాడుతున్నా ఒడి చేర్చుకోవా వయ్యారి
విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా ఓదార్చిపోవా ఓసారి
ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమా
ప్రేమించినానంటూ బ్రతికించలేవా
అది నాకు చాలే చెలీ…..
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా…
నా నీడ నన్ను విడిపొయిందే నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా…
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి
రావా నా వాకిట్లో నీకై నే వేచానే
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా…



**********   ************  ***********



చిత్రం: ప్రేమదేశం (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఉన్ని కృష్ణన్

ఓ వెన్నెలా తెలిపేదెలా… ఓ నేస్తమా పిలిచేదెలా..
కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వే పూసిందంట
నమ్మినవారే పువ్వుని కోస్తే నీ యదలో బాధ తీరేదెట్టా (2)
ఓ వెన్నెలా తెలిపేదెలా…

జడివాన నింగిని తడిచేయునా గంధాలు పువ్వుని విడిపోవునా
నన్నడిగి ప్రేమ యద చేరెనా వలదన్న యదను విడిపోవునా
మరిచాను అన్నా మరిచేదెలా మరిచాక నేను బ్రతికేదెలా
ఓ వెన్నెలా తెలిపేదెలా…

వలపించు హృదయం ఒకటే కదా ఎడం అయితే బ్రతుకు బరువే కదా
నిలిపాను ప్రాణం నీకోసమే కలనైన కూడా నీ ధ్యానమే
మదిలోని ప్రేమ చనిపోదులే ఏనాటికైనా నిను చేరులే
ఓ వెన్నెలా తెలిపేదెలా… ఓ నేస్తమా పిలిచేదెలా..
కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వే పూసిందంట
నమ్మినవారే పువ్వుని కోస్తే నీ యదలో బాధ తీరేదెట్టా

ప్రేమదేశం (1996)

చిత్రం: ప్రేమదేశం (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో, ఉన్నికృష్ణన్, డామ్నిక్


వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..
వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..
కడలి ఒడిలో నదులు ఒదిగి.. నిదురపోయే వేళా..
కనుల పైన కలలే వాలి.. సోలిపోయే వేళా..

వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..

ఆశ ఎన్నడు విడువదా..
అడగరాదని తెలియదా..
నా ప్రాణం..చెలియా నీవేలే..
విరగబూసిన వెన్నెలా..
వదిలి వేయకే నన్నిలా..
రారాదా..ఎద నీదే కాదా..
నిదురనిచ్చే జాబిలీ..
నిదురలేక.. నీవే వాడినావా..

వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..

మంచు తెరలో అలిసిపోయి..
మధన సంధ్య తూగెనే..
పుడమి ఒడిలో కలలుకంటూ..
పాపా నీవూ నిదురపో..
మల్లె అందం మగువకెరుక..
మనసు బాధ తెలియదా..
గుండె నిండా ఊసులే..
నీ ఎదుటనుంటే మౌనమే..
జోలపాటా పాడినా..
నే నిదురలేక వాడినా..

వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..
వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..



**********   ************  ***********



చిత్రం: ప్రేమదేశం (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఏ.ఆర్.రెహమాన్

Ooh yeah friendship
friendship is what we' re looking for
ముస్తఫా ముస్తఫా don' t worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా don' t worry mustaffa
కాలం నీ నేస్తం ముస్తఫా
day-by-day day-by-day
కాలం ఒడిలో day-by-day
పయనించే షిప్పే friendship రా

జూన్ పోయి జూలై పుడితే seniorki juniorki
college champus లోనే రాగింగ్ ఆరంభం
student మనసో నందనవనం మల్లెలుంటాయ్ ముల్లులుంటాయ్
స్నేహానికి రాగింగ్ కూడా చేస్తుందోయ్ సాయం
వాడిపోనిది స్నేహమొకటే వీడిపోనిది నీడ ఒక్కటే
హద్దంటూ లేనే లేనిది friendship ఒక్కటే
కష్టమొచ్చినా నష్టమొచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే
కాలేజీ స్నేహం ఎపుడూ అంతం కానిదే
ఓ....ఓ..ఓ...

ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు ఏడనుంచో గోరు వంకలు
కాలేజీ champus లోనే నాట్యం చేసెనే
కన్నెపిల్లల కొంటెనవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు
కాలేజీ compound అంటే కోడైకనాలే
కోర్సు ముగిసే రోజువరకు తుళ్ళిపడిన కుర్ర ఎదలో
కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి
స్నేహితుల్ని వీడిపోయే రోజు మాత్రం కంటి నిండా
కన్నీటి తోడేనంట farewell party



**********   ************  ***********



చిత్రం: ప్రేమదేశం (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు

ప్రేమా…. ప్రేమా…. ప్రేమా ప్రేమా…..
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా…
నా నీడ నన్ను విడిపొయిందే నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా…
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి
రావా నా వాకిట్లో నీకై నే వేచానే
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా…

ఆకాశదీపాన్నై నే వేచిఉన్నా నీ పిలుపుకోసం చిన్నారి
నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి
నా గుండె లోతుల్లో దాగుంది నీవే
నువు లేక లోకంలో జీవించలేనే
నీ ఊహతోనే బ్రతికున్నా….
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా…
నా నీడ నన్ను విడిపొయిందే నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా…

నిముషాలు శూలాలై వెంటాడుతున్నా ఒడి చేర్చుకోవా వయ్యారి
విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా ఓదార్చిపోవా ఓసారి
ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమా
ప్రేమించినానంటూ బ్రతికించలేవా
అది నాకు చాలే చెలీ…..
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా…
నా నీడ నన్ను విడిపొయిందే నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా…
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి
రావా నా వాకిట్లో నీకై నే వేచానే
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా…



**********   ************  ***********



చిత్రం: ప్రేమదేశం (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఉన్ని కృష్ణన్

ఓ వెన్నెలా తెలిపేదెలా… ఓ నేస్తమా పిలిచేదెలా..
కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వే పూసిందంట
నమ్మినవారే పువ్వుని కోస్తే నీ యదలో బాధ తీరేదెట్టా (2)
ఓ వెన్నెలా తెలిపేదెలా…

జడివాన నింగిని తడిచేయునా గంధాలు పువ్వుని విడిపోవునా
నన్నడిగి ప్రేమ యద చేరెనా వలదన్న యదను విడిపోవునా
మరిచాను అన్నా మరిచేదెలా మరిచాక నేను బ్రతికేదెలా
ఓ వెన్నెలా తెలిపేదెలా…

వలపించు హృదయం ఒకటే కదా ఎడం అయితే బ్రతుకు బరువే కదా
నిలిపాను ప్రాణం నీకోసమే కలనైన కూడా నీ ధ్యానమే
మదిలోని ప్రేమ చనిపోదులే ఏనాటికైనా నిను చేరులే
ఓ వెన్నెలా తెలిపేదెలా… ఓ నేస్తమా పిలిచేదెలా..
కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వే పూసిందంట
నమ్మినవారే పువ్వుని కోస్తే నీ యదలో బాధ తీరేదెట్టా