చిత్రం : శుభసంకల్పం (1995)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు
పల్లవి :
శ్రీశైలంలో మల్లన్న... సింహాద్రిలో అప్పన్న
తిరుపతిలో ఎంకన్న... భద్దరగిరిలో రామన్న
ఆ దేవుళ్ళందరి కలబోత .. అయ్యా సామీ నువ్వేనంటా
దండాలయ్యా సామికి... దండలు వేయరా సామికి
దాసుల గాచే సామికి... దండకాలు దండాలయ్యా సామికి
దండలు వేయరా సామికి... దాసుల గాచే సామికి దండకాలు
కొండంతా అండల్లే కొలువైన... మా రేడు కొంగు బంగారైనాడు
ఈ దొర ఓ.... మా దొర.... ఓ...
చరణం 1 :
సిరులిచ్చే సంద్రమంటే దైవం మా దొరకి
సెమటోచ్చే వోడంటే ప్రాణం మా సామికి
మచ్చలేని మనిషిరా.... మచ్చరమే లేదురా
ఎదురులేని నేతరా.... ఎదురులేని నేతరా
చేతికెముకలేని దాతరా.... ఎముకలేని దాతరా
ఎదలో నిలుపుకుంటే... ఒదిగిపోవు దేవరా
దండాలయ్యా సామికి.... దండలు వేయరా సామికి
దాసుల గాచే సామికి దండకాలు...
దండాలయ్యా సామికి.... దండలు వేయరా సామికి
దాసుల గాచే సామికి దండకాలు
కొండంతా అండల్లే కొలువైన... మా రేడు కొంగు బంగారైనాడు
ఈ దొర... ఓ... మా దొర.... ఓ
************** ***************** ****************
చిత్రం : శుభసంకల్పం (1995)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, ఎస్. పి. శైలజ
పల్లవి :
సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు
సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలో
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలో
ఏకమై నాచోటా వేద మంత్రాలు
ఏకమై నాచోటా వేద మంత్రాలు
చరణం 1 :
హరివిల్లు మాయింటి ఆకాశ బంతి
సిరులున్న ఆ చేయ్యి శ్రీవారి చేయ్యి
హరివిల్లు మాయింటి ఆకాశ బంతి
ఒంపులెన్నో పోయి రంప మేయంగా
చినుకు చినుకు గారాలే చిత్రవర్ణాలు
సొంపులన్ని గుండె గంపకెత్తంగా
సిగ్గులలోనే పుట్టెనమ్మ చిలక తాపాలు
తళుకులై రాలేను తరుణి అందాలు
తళుకులై రాలేను తరుణి అందాలు
వుక్కలై మెరిసేను ఒనుకు ముత్యాలు
చరణం 2 :
తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్
తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్
మొవ్వాకు చీర పెడతా మొగిలి రేకులు పెడతా
నన్నే పెళ్లాడుతావ కన్నె చిలకా
అరె మొవ్వాకు చీర పెడతా మొగిలి రేకులు పెడతా
నన్నే పెళ్లాడుతావ కన్నె చిలకా... అబ్బో ఆశ…
శృంగార పెళ్ళికొడకా… ఇది బంగారు వన్నె చిలకా
శృంగార పెళ్ళికొడకా ఇది బంగారు వన్నె చిలకా
మువ్వకులిస్తే రాదు మోజుపడక
మువ్వకులిస్తే రాదు మోజుపడక
తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్
తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్
హేయ్ రవ్వంటి దాన నిప్పు రవ్వంటి చిన్నదాన... ఏమిచ్చి తీర్చుకోనే దీపకాళికా
రవ్వంటి దాన నిప్పురవ్వంటి చిన్నదాన... ఏమిచ్చి తీర్చుకోనే దీపకాళికా
రాయంటి చిన్నవాడా… మా రాయుడోరి చిన్నవాడా…
మనసిచ్చి పుచ్చుకోర మామకొడకా
మనసిచ్చి పుచ్చుకోర మామకొడకా
మనువాడతాను గాని మాను అలకా
తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్
తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్
************** ***************** ****************
చిత్రం : శుభసంకల్పం (1995)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు, చిత్ర, పల్లవి
పల్లవి :
హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సా
హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సా
సూర్యుడైనా చలవ చంద్రుడైనా కోటి చుక్కలైనా అష్ట దిక్కులైనా
నువ్వయినా అహ నేనయినా అహ రేవైనా ఆ నావైనా
సంద్రాల వీణల సొంతమై... హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సా
నీలాల కన్నుల్లో సంద్రమే ... ఓ ఓ ఓ ... హైలెస్సో హైలెస్సా
నింగి నీలమంతా సంద్రమే... ఓ ఓ ఓ ... హైలెస్సో హైలెస్సా
నీలాల కన్నులలో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే
నేల కరిగిపోతే సంద్రమే... ఓ... ఓ...
నేల కరిగిపోతే సంద్రమే నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే
నేల కరిగిపోతే సంద్రమే నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే
నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే
చరణం 1 :
Life is a holiday jolly day... హైలెస్సో హైలెస్సా
Spend it away in a fabulous way ... హైలెస్సో హైలెస్సా
You need a break boy... don't you thank me?
Eat a piece of cake ... హైలెస్సో హైలెస్సా హైలెస్సో హైలెస్సా
You need a break boy... don't you thank me?
Eat a piece of cake ... హైలెస్సో హైలెస్సా హైలెస్సో హైలెస్సా
Twinkle little star I know what you are
jaane bidO yaar golitO maar
Twinkle little star I know what you are
jaane bidO yaar golitO maar
హైలెస్సో హైలెస్సా... Life is a tamasha
you sing idvaneesha... I don't know saapaasa
నీలాల కన్నులలో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే
అహ ఓ ఓ ఓ... హైలెస్సో హైలెస్సా
చరణం 2 :
ఆకతాయి పరువాల కొంటెగోల.. కోటి సంబరాలా
ఆకతాయి పరువాల కొంటెగోల.. కోటి సంబరాలా
ఆపకండి ఈ వేళ కూనలాలా కొత్త వానలాలా
ఆపకండి ఈ వేళ కూనలాలా కొత్త వానలాలా
కోటి సంబరాల... కొత్త వానలాలా
కోటి సంబరాల... కొత్త వానలాలా
చెంగుమంటు గంగ పొంగులెత్తు వేళా
చెంగుమంటు గంగ పొంగులెత్తు వేళా
ఒళ్ళు మరచిపోవాలి నింగి నేలా
ఒళ్ళు మరచిపోవాలి నింగి నేలా
నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే
చరణం 4 :
హ్మ్మ్..హ్మ్మ్..హ్మ్మ్..
ఆ..ఆ
హ్మ్మ్..హ్మ్మ్..హ్మ్మ్
హరిపాదాన పుట్టావంటే గంగమ్మా
శ్రీహరి పాదాన పుట్టావంటే గంగమ్మా
ఆ హిమగిరిపై అడుగెట్టావంటే గంగమ్మా
కడలే కౌగిలని కరిగావంటే గంగమ్మా
నీ రూపేదమ్మా నీ రంగేదమ్మా
నీ రూపేదమ్మా నీ రంగేదమ్మా
నడిసంద్రంలో నీ గడపేదమ్మా గంగమ్మా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ
నీలాల కన్నుల్లో సంద్రమే హైలెస్సో
నింగి నెలవంక సంద్రమే హైలెస్సో
నీలాల కన్నుల్లో సంద్రమే హైలెస్సో
నింగి నెలవంక సంద్రమే హైలెస్సో
నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నెలవంక సంద్రమే
లా లా ల లా లా ల..
************** ***************** ****************
చిత్రం : శుభసంకల్పం (1995)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు, ఎస్.పి. శైలజ
పల్లవి :
ఆ ఆ ఆ ఆ హ హ హ హ హ
ఆ ఆ ఆ ఆ అహహ అహహ హ
మూడుముళ్ళు ఏసినాక చాటులేదు మాటులేదు
గూటి బయట గుట్టులాటా
హ హ హ హ హ
ఏడు అంగలేసినాక ఎన్నెలింట కాలు పెట్టి
పాడుకుంట ఎంకిపాటా
హ హ హ హ హ
ఆకుపచ్చకొండల్లో ఓ ఓ ఓ ఓ
గోరువెచ్చగుండెల్లో
ఆకుపచ్చకొండల్లో గోరువెచ్చగుండెల్లో
ముక్కుపచ్చలారబెట్టి ముద్దులంటా
హ హ హ హ హ
మూడుముళ్ళు ఏసినాక చాటులేదు మాటులేదు
గూటి బయట గుట్టులాటా... హ హ హ హ హ
ఏడు అంగలేసినాక ఎన్నెలింట కాలు పెట్టి
పాడుకుంట ఎంకిపాటా... హ హ హ హ హ
చరణం 1 :
హ హ హ హ హ ఓ ఓ ఓ ఓ ఓ ఓ.....
హ హ హ హ హ ఓ ఓ ఓ ఓ ఓ ఓ.....
హొయ్ పుష్యమాసమొచ్చింది భోగిమంటలేసింది
కొత్తవేడి పుట్టింది గుండెలోనా.... హ హ హ.......
రేగుమంట పూలకే రెచ్చిపోకు తుమ్మెదా
కాచుకున్న ఈడునే దోచుకుంటె తుమ్మెదా
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
మంచుదేవతొచ్చిందా మంచమెక్కి కూకుందా
అహహ అహహ అహహ అహహ
వణుకులమ్మ తిరనాళ్ళే ఓరినాయనో
సీతమ్మోరీ సిటికెన ఏలూ సిలక తొడిగితె సిగ్గులెర్రనా
రాములోరు ఆ సిలక కొరికితె సీతమ్మోరీ బుగ్గలెర్రనా
మూడుముళ్ళు ఏసినాక చాటులేదు మాటులేదు
గూటి బయట గుట్టులాటా... హ హ హ హ హ
ఏడు అంగలేసినాక ఎన్నెలింట కాలు పెట్టి
పాడుకుంట ఎంకిపాటా... హ హ హ హ హ
చరణం 2 :
హాయి దాయి దాయి దాయి హాయీ
హాయీ దాయి దాయి దాయి హాయీ
వయసు చేదు తెలిసింది మనసు పులుపు కోరింది
చింతచెట్టు వెతికింది చీకటింటా... హ హ హ హ హ
కొత్తకోరికేమిటో చెప్పుకోవె కోయిలా
ఉత్తమాటలెందుకూ తెచ్చుకోర ఊయలా
హా హా ... హొయ్ హొయ్ హొయ్
ముద్దువాన వెలిసింది పొద్దుపొడుపు తెలిసింది
వయసువరస మారింది ఓరి మన్మధా
మూడుముళ్ళ జతలోన ముగ్గురైన ఇంటిలోనా
జోరు కాస్త తగ్గనీర జో జో జో
జోజో జోజో జోజోజో
జోజో జోజో జోజోజో
************** ***************** ****************
చిత్రం : శుభసంకల్పం (1995)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు, చిత్ర
పల్లవి :
ఆ..ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ..ఆ
చినుకులన్నీ కలిసి చిత్ర కావేరి
చివరికా కావేరి కడలి దేవేరి
చినుకులన్నీ కలిసి చిత్ర కావేరి
చివరికా కావేరి కడలి దేవేరి
కడలిలో వెతకొద్దు కావేరినీరు
కడుపులో వెతకొద్దు... కన్నీరు కారు
గుండెలోనే ఉంది గుట్టుగా గంగా... నీ గంగా
యెండ మావుల మీద యెందుకా బెంగా
రేవుతో నావమ్మ కెన్ని ఊగిసలో
నీవుతో నాకన్ని నీటి ఊయలలు
నీవుతో నాకన్ని..



