చిత్రం : మాయని మమత (1970)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : ఘంటసాల
పల్లవి :
రానిక నీకోసం సఖీ... రాదిక వసంత మాసం
రానిక నీకోసం సఖీ... రాదిక వసంత మాసం
రాలిన సుమాలు ఏరుకొని... జాలిగ గుండెల దాచుకోని
ఈ దూరపు సీమలు చేరుకొని
రానిక నీకోసం సఖీ... రాదిక వసంత మాసం
చరణం 1 :
వాకిటిలో నిలబడకు... ఇంక నాకై మరిమరీ చూడకు .. చూడకువాకిటిలో నిలబడకు... ఇంక నాకై మరిమరీ చూడకు
ప్రతి గాలి సడికి తడబడకు... పదధ్వనులని పొరబడకుకోయిలా కోయలే… గూడు గుబులై పోయేలే….
రానిక నీకోసం సఖీ... రాదిక వసంత మాసం
చరణం 2 :
పగలంతా నా మదిలో మమతలు సెగలై లో లో రగులునులే
నిద్రరాని నిశినైనా నాకు నిష్టుర వేదన తప్పదులే
పోనీలే… ఇంతేలే.. గూడు గుబులై పోయేలే ..
రానిక నీకోసం సఖీ... రాదిక వసంత మాసం…రాదిక వసంత మాసం
************************* ********************************
చిత్రం : మాయని మమత (1970)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి:
కనులు మాటలాడునని.. ఈ...
మనసు పాట పాడునని.. ఈ...
కనులు మాటలాడునని.. మనసు పాట పాడునని
కవితలల్లితి ఇన్నాళ్ళు.. అది కనుగొన్నాను ఈనాడు
కనులు మాటలాడునని.. మనసు పాట పాడునని
కవితలల్లగ విన్నాను.. అది కనుగొన్నాను ఈనాడు
చరణం 1:
మెత్తగ సాగే మేనితీగ మెలికలు తిరిగితె.. ఒక అందం
ఆ... ఆ.... ఆ... ఆ...ఆ... ఆ...
మెత్తగ సాగే మేనితీగ మెలికలు తిరిగితె.. ఒక అందం
ఆ మేనితీగ వలపుల పందిట అల్లుకుంటే.. ఒక అందం
మలయానిలమున చెలి ముంగురుల మబ్బులూగితే.. ఒక అందం
ఆ ముంగురులే చెలికాణి మోముపై ముసురుకుంటే.. ఒక అందం
అదే... ముద్దులొలికే అనుబంధం...
కనులు మాటలాడునని.. మనసు పాట పాడునని
కవితలల్లితి ఇన్నాళ్ళు.. అది కనుగొన్నాను ఈనాడు
చరణం 2:
వేచిన కలువ వెన్నెల జల్లుల విరిసిపోతే.. మధురానందం
ఆ కలువ చెలువ నెలరాయునిలో కరిగిపోతే.. మహదానందం
జగములనేలే చంద్రవదనతో ఎగిసిపోతే.. దివ్యానందం
ఎగిసి ఎగిసి పులకించిన మనసులు ఏకమైతే.. రసానందం...
అదే... యుగయుగాల అనుబంధం...
