చిత్రం : సాహసం శ్వసగా సాగిపో
లిరిక్స్ : శ్రీజో
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
గానం : సిద్ శ్రీరాం , అపర్ణ నారాయణన్
కాలం నేడిలా మారెనే,
పరుగులు తిసేనే,
హృదయం వేగం వీడదే...
పరుగులు తిసేనే,
హృదయం వేగం వీడదే...
వెతికే చెలిమే నీదై నన్ను చేరితే
కన్నుల్లో నీవేగా నిలువెల్లా...
స్నేహంగా తోడున్నా నివే,
ఇక గుండెలో ఇలా.
నడిచే క్షణమే ఎదసడి ఆగే
ఉపిరి పాడే పెదవిని వీడే
పదమొక కవితై
కన్నుల్లో నీవేగా నిలువెల్లా...
స్నేహంగా తోడున్నా నివే,
ఇక గుండెలో ఇలా.
నడిచే క్షణమే ఎదసడి ఆగే
ఉపిరి పాడే పెదవిని వీడే
పదమొక కవితై
మది నీవశమై, నువు నా సగమై ఎదలో...
తోలిప్రేమే కడలై ఎగిసే వేళా
పసివాడై కెరటాలే ఈ క్షణం
చూడన చుడనా..
తోలిప్రేమే కడలై ఎగిసే వేళా
పసివాడై కెరటాలే ఈ క్షణం
చూడన చుడనా..
ఎగిరే నింగి దాక ఉహలనే రెక్కలుగా చేసిందే ఈ భావం
ఓ!! కలనే కాజేసే కళ్ళ కౌగిలిలో
కరిగే.. కలలేవో... ఓ!!
ఓ!! కలనే కాజేసే కళ్ళ కౌగిలిలో
కరిగే.. కలలేవో... ఓ!!
వెన్నెల్లో వేదించే వెండి వానల్లో వెలిగే..
మనమే మౌనంగా లోలోనే కావ్యంగా మారే కలే
పన్నీటి జల్లై ప్రాణమే తాకే
ఉపిరే పోసే ఇది తొలి ప్రణయం
మనం ఆపినా ఆగదే...
ఎన్నడు వీడదే ...
మనమే మౌనంగా లోలోనే కావ్యంగా మారే కలే
పన్నీటి జల్లై ప్రాణమే తాకే
ఉపిరే పోసే ఇది తొలి ప్రణయం
మనం ఆపినా ఆగదే...
ఎన్నడు వీడదే ...
వెళ్లిపోమాకే ఎదనే , వదిలేళ్లి పోమాకే
మనసే మరువై నడవాలి ఎందాకే
మనసే మరువై నడవాలి ఎందాకే
భాషే తెలియందే లిపి లేదే కనుచుపే చాలందే
లోకాలంతమైన నిలిచేలా మన ప్రేమే ఉంటుందే ఇది వరమే...
లోకాలంతమైన నిలిచేలా మన ప్రేమే ఉంటుందే ఇది వరమే...
మనసుని తరిమే, చేలిమొక వరమే
మురిసిన పెదవుల సడి తెలిపే స్వరమే
ప్రణయపు కిరణం ఎదకిది అరుణం
కనులకి కనులని ఎర వేసిన తొలి తరుణం
మురిసిన పెదవుల సడి తెలిపే స్వరమే
ప్రణయపు కిరణం ఎదకిది అరుణం
కనులకి కనులని ఎర వేసిన తొలి తరుణం
మది నదిలో ప్రేమే మెరిసే
ఏ అనుమతి అడగక కురిసే
ఏ అనుమతి అడగక కురిసే
నీలో నాలో హృదయం ఒకటై పాడే
కలలిక కనులని వీడవే
కలలిక కనులని వీడవే
మనసిక పరుగే ఆపదే (2)
నీలో నాలో (3)
***** *********** ************** ************** ************* ************ ***************
***** *********** ************** ************** ************* ************ ***************
చిత్రం : సాహసం శ్వాసగా సాగిపో (2016)
సంగీతం : ఎ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : అనంత్ శ్రీరామ్
గానం : విజయ్ ప్రకాష్
తాను నేను మొయిలు మిన్ను
తాను నేను కలువ కొలను
తాను నేనూ పైరు చేను
తానూ నేనూ వేరు మాను
శశి తానైతే నిశినే నేనూ
కుసుమం తావి తానూ నేను
వెలుగు దివ్వె తెలుగు తీపి
తానూ నేనూ మనసు మేను
దారి నేను తీరం తాను
దారం నేను హారం తాను
దాహం నేను నీరం తాను
కావ్యం నేను సారం తాను
నేను తాను రెప్ప కన్ను
వేరైపోని పుడమి మన్ను
నేను తాను రెప్ప కన్ను
వేరైపోని పుడమి మన్ను
తాను నేను మొయిలు మిన్ను
తాను నేను కలువ కొలను
తాను నేను గానం గమకం
తాను నేను ప్రాయం తమకం.
తాను నేను మొయిలు మిన్ను
తాను నేను కలువ కొలను
తాను నేనూ పైరు చేను
తానూ నేనూ వేరు మాను
శశి తానైతే నిశినే నేనూ
కుసుమం తావి తానూ నేను
వెలుగు దివ్వె తెలుగు తీపి
తానూ నేనూ మనసు మేను
మనసు మేను మనసు మేను