Showing posts with label Kalyan Ram. Show all posts
Showing posts with label Kalyan Ram. Show all posts

ఓం 3D (2013)

చిత్రం: ఓం 3D (2013)
సంగీతం: అచ్చు రాజమణి
సాహిత్యం: బాలాజీ
గానం: హరిహరన్ , చిన్మయి

నన్ను నేనే చూస్తున్నాను ఉన్న చోటే ఉన్నా నేను
ఎందుకో మరి ఏమవుతుందో తెలియని పరవశం  ఓ
నిన్న దాకా నువ్వే లోకం నేటి నుంచి నాకిక ప్రాణం
ఒకరికొకరని తెలిసిన సమయం యుగమిపుడొక క్షణం
నీ చూపు తగిలి నా మనసు పరుగు తీసిందిలే
నా మాట వినదు కుదురేలేదు కూర్చోదిలా
నీడే నువ్వందిలే

ఎందుకిలా ఎందుకిలా ఏ మాయో తరుముతోంది
నిన్నైనా లేదుకదా హో తేలిపోతువుందిలే మనసు

అలికిడైతే ఉలికిపడుతూ అడుగుతోంది శ్వాశ నిన్నే
కళ్ళు మూసి నన్ను కలలోనే చూసుకో
నూరేళ్లనే ఈ రోజని గడిపేసినట్టుంది హాయి
చూడాలని చేరాలని నీ యెదుట ఉంచాను నన్నే

ఎందుకిలా ఎందుకిలా ఏకాంతమే లేదు నాకు
నిన్నైనా లేదుకదా హో తేలిపోతువుందిలే మనసు

మొదటిసారి మనసుతోనే నడిచినట్టు ఉందివ్వాళ
గుండెదారి తెరిచివుంచాను చేరుకో
కలిశావని కలకాదని పులకించిపోయాను నేనే
కను మూసినా ఎటుచూసినా ఉన్నాను నీ తోని నేనే
ఇన్నాళ్లు నేను ఉన్నట్టు లేను తొలిప్రేమలో పడ్డాను ఏమో
మతిచెడి తడబడుతూ ఉందిలా నా ఊహలో తీయగా

ఎందుకనే ఉంది ఇలా నా సొంతమే నువ్వయ్యాక
నిన్నటిలా లేవుకదా నువు నా లోకమే నువ్వు చేరాక

లక్ష్మీ కళ్యాణం (2007)

చిత్రం: లక్ష్మీ కళ్యాణం (2007)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్ , మణిశర్మ (బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: నిహాల్, ప్రాణవి


అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా
అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా

అవుననుకో గోరువంకా అలుసిచ్చాను కనుక
జరిగింది తెలుసుకోక నాపై నింద లేయక
నీకేమీ ఊసుపోక నాదే నేరమనక
నిజమంతే వాదించక....

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా

ఓ కన్ను మూసి చూస్తున్నట్టు ఉంది
నా ఒంటి నడక నాకే నచ్చకుంది
నాతోనే నాకు గొడవయ్యినట్టు వుంది
నా నుంచి నేనే వేరయ్యినట్టు వుంది
ఊరుకోలేను చేరుకోలేను మనసిలా ఎందుకుంది
మూగనేకాను మాటకాలేను ఎమిటవుతున్నది...

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా

నాతోట పువ్వే నాపై కోపమంటే
ఈ ప్రాణమింకా వున్నా లేనిదంతే
నాలోని సగమే నాకే దూరముంటే
ఏ సందడైనా మనసే నవ్వదంతే
చిలిపి జగడాన్ని పెంచుకున్నను నేస్తమా తప్పు నాదే
చెలిమి విరహాన చేదు చూసాను పంతమా ఆగవే...

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా
నీకేమీ ఊసుపోక నాదే నేరమనక
నిజమంతే వాదించక...

విజయదశమి (2007)




చిత్రం: విజయదశమి (2007)
సంగీతం: శ్రీకాంత దేవా
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: సుజాత మోహన్, హరీష్ రాఘవేంద్ర


ఇది ఒక ఇది ఒక నవలోకం
ఇద్దరి ప్రేమకు శ్రీకారం
మనసులు కలిసిన ఈ సమయం
ఆనందానికి తొలి ఉదయం
వరమో వశమో ప్రేమే జగమో
శుభమో సుఖమో మది సంబరమో

ఇది ఒక ఇది ఒక నవలోకం
ఇద్దరి ప్రేమకు శ్రీకారం
మనసులు కలిసిన ఈ సమయం
ఆనందానికి తొలి ఉదయం
కలవై కలసి కథ మార్చావు
మెరుపై మెరిసి నను తాకావు

కుదురంటు లేకుంది మనసుకు
నిదరంటు రాకుంది ఎందుకు
అందర్నీ చూస్తున్నాను వింతగా
చుక్కల్ని లెక్కేస్తున్నా కొత్తగా
సరదాగా మొదలైన ఈ ప్రయాణం
మొత్తంగా ప్రేమాయణం
ఎటు చూస్తున్నా ఏదో లోకం
అటు నీవుంటే తెగ సంతోషం

ఇది ఒక ఇది ఒక నవలోకం
ఇద్దరి ప్రేమకు శ్రీకారం
మనసులు కలిసిన ఈ సమయం
ఆనందానికి తొలి ఉదయం

చంద్రుడు చేతికి అందెనా
మబ్బులు మాటలు నేర్చెనా
పువ్వులు పాటలు పాడెనా
కొండలు నాట్యములాడెనా
ఏ బ్రహ్మ సృష్టించాడో ప్రేమగానే
జగమంత వింతగుంది నేడు
ఎటు చూస్తున్నా అటు అద్బుతమే
మాయలు చేసే మది సంబరమే

ఇది ఒక ఇది ఒక నవలోకం
ఇద్దరి ప్రేమకు శ్రీకారం
మనసులు కలిసిన ఈ సమయం
ఆనందానికి తొలి ఉదయం
వరమో వశమో ప్రేమే జగమో
శుభమో సుఖమో మది సంబరమో



******   ******   ******


చిత్రం: విజయ దశమి (2007)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: ఈశ్వర్ తేజ
గానం: నవీన్, వసుంధరా దాస్

పల్లవి:
అరె కళ్యాణ గడియే తీస్తే కాబోయే వాడే వచ్చే
తాంబూలం పెదవుల కిస్తే వేస్తాను కౌగిలిపుస్తే
అరె కళ్యాణ గడియే తీస్తే కాబోయే వాడే వచ్చే
తాంబూలం పెదవుల కిస్తే వేస్తాను కౌగిలిపుస్తే
పంచాంగాలే పక్కనపెట్టి పరువాలనే చదివేయరా
వారం వర్జ్యం ఒడ్డుకు నెట్టి వయ్యారాలే చూసేన
నీయమ్మ మాయమ్మ అనికొని కన్నారే
మీవాళ్ళు మావాళ్ళు వియ్యంకులవుతారే
నీయమ్మ మాయమ్మ అనికొని కన్నారే
మీవాళ్ళు మావాళ్ళు వియ్యంకులవుతారే

చరణం: 1
ఎటు అడుగులేసిన నా వెనక వచ్చేసేయ్
కుడికాలు ముందుకేసి నా ఎదకి విచ్చేసేయ్ (2)
నందమూరి సుందరాంగుడే వేడి చెయ్యి పడితే చిలక కొట్టుడే
పంచదార పాలమీగడే నాకంటపడితే వీరబాదుడే
నీతోనే వచ్చేస్తా ఏదైనా ఇచ్చేస్తా

మీయమ్మ మాయమ్మ అనికొని కన్నారే
మీవాళ్ళు మావాళ్ళు వియ్యంకులవుతారే
కళ్యాణ గడియే తీస్తే కాబోయే వాడే వచ్చే
తాంబూలం పెదవుల కిస్తే వేస్తాను కౌగిలిపుస్తే

చరణం: 2
అడవి రాముడల్లె నీ అల్లరంత చూపు
అగ్గిరాముడల్లె నాలోన సెగలు రూపు (2)
సాయంత్రం పువ్వులు ఇష్టం ఇక తెల్లార్లు నువ్వే ఇష్టం
నీవల్లే ఇంతటి కష్టం నేనేలే నీ అదృష్టం
చినదాని పెదవుల్లో పుట్టింది పొడితేనె

మీయమ్మ మాయమ్మ అనికొని కన్నారే
మీవాళ్ళు మావాళ్ళు వియ్యంకులవుతారే
కళ్యాణ గడియే తీస్తే కాబోయే వాడే వచ్చే
తాంబూలం పెదవుల కిస్తే వేస్తాను కౌగిలిపుస్తే

అసాధ్యుడు (2006)



చిత్రం: అసాధ్యుడు (2006)
సంగీతం: చక్రి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ఆర్ యకేందర్


రక్కసి కోరలు చాచిన రౌడిమంది ఒకవైపు
శివమెత్తిన సింగమల్లె అతనొక్కడు ఒకవైపు
ఆ చూపుల చింతనిప్పు  దుర్మార్గులకుంది ముప్పు
ఆ అడుగుల పిడుగుపాటు  దుండగీళ్ళ ఆట కట్టు

అదరడు బెదరడు చెదరడు
బిగిసిన పిడికిలినొదలడు
అతనొక అనుపమశూరుడు అసాధ్యుడు

అలసట ఎరుగని యోధుడు
అపజయమెరుగని విజయుడు
అసురుల కూల్చకమానడు అసాధ్యుడు

రక్షణ చేయు నృసింహుడు
రాక్షస కేళి సహించడు
దుర్జనశేషములుంచడు అసాధ్యుడు

సహనము తెలిసిన బుద్దుడు
సమరము నిలిచిన భద్రుడు
సైన్య సమస్తము ఒక్కడు అసాధ్యుడు

సమయము స్థలమిక చూడడు
కదనము అతనికి చెడుగుడు
శత్రుశిరస్సులనొదలడు అసాధ్యుడు

కనపడి దుడుకుగ సాగడు
తలపడి వెనకడుగెరగడు
తలచిన గురినిక వదలడు అసాధ్యుడు

కరుణతొ కరిగిన వరుణుడు
కొలిమిగ రగిలిన అరుణుడు
వీడు దహించక మానడు అసాధ్యుడు

అతడే అనితరసాధ్యుడు
అతడే అభినవ పార్ధుడు
అతడే అతడే అతడే అసాధ్యుడు

పటాస్ (2015)


చిత్రం: పటాస్ (2015)
సంగీతం: సాయి కార్తీక్
గానం: రాహుల్ నంబియర్


ఓ మై ఓ మై బేబీ నన్నొదిలేసి వెళ్లిపోమాకే
ఓ మై ఓ మై బేబీ జర నవ్వేసి ఓ లూక్కివ్వే

ఓసి చిన్నదాన మూతి తిప్పమాకే
ప్రేమ వాత పెట్టకే గుండె కోత పెట్టకే
ఓసి కుర్రదాన తుర్రు మనకే
చిర్రు బుర్రు లాడకే కళ్ళు ఎర్ర జెయ్యకే
ఓ చంచాడు జాలి చూపవే
ఓ గుప్పెడు ప్యార్ పంచవే
ఓ గంపెడు ముద్దులు నా ఖాతాలో వెయ్యవే
మిల్లీ మీటర్ అంత చూపు చాలే
సెంటీమీటర్ అంత స్మైల్ చాలే
నీకు నాకు మధ్య వేల మైళ్ళ ల దూరం కరిగించాలే
పూవులే ఇస్తా పూజలే చేస్తా
నీ బాంఛన్ నన్ను లవ్ చెయ్యవే
రాసులే ఇస్తా రాణిలా చూస్తా
నీ బాంఛన్ నన్ను లవ్ చెయ్యవే

ని కనులకు కాజల్ లా నీ కలలన్నీ చదివేస్తానే
నీ చేతుల గాజుల్లో సవ్వడల్లే ఉంటా
నీ చెవులకి లోలాకై ప్రేమల ఊసులే వినిపిస్తానే
నీ పెదవికి తమలాకై తీపి పంచుతుంటా
కుంచె లాగ నిన్ను బొమ్మ గీస్తా
కంచె లాగ నిన్ను కాపు కాస్తా
ఏ కంచికి చేరని కథనే మనదే చేస్తా
పచ్చబొట్టు లాగ అంటి ఉంటా
గట్టులేని ఒట్టు నేనౌతా
నీ కాలికి మెట్టెను నేనై నడిపించేస్తా
పూవులే ఇస్తా పూజలే చేస్తాలే
నీ బాంఛన్ నన్ను లవ్ చెయ్యవే

ఓ బేబీ లవ్ మీ అంటూ వెంట వెంట నీకై తిరిగాడమ్మ
రఫ్ అండ్ టఫ్ పోలీసోడే రోమియోలా మారిపోయెనే
నీకై పడిచస్తున్నాడే కేసులన్ని పక్కనెట్టి వస్తున్నాడే
వీడి ఫ్యూచర్ నువ్వేనమ్మా బుజ్జగించి ప్రేమ పంచవే

వేసవిలో నీకోసం ప్రేమల వానల మేఘాన్నవుతా
ఈ చలిలో నులి వెచ్చని కౌగిలింత నౌతా
వేకువలో నిను తాకే తొలి కిరాణాన్నై తలుపే తడతా
చీకటిలో నీకోసం జాబిలల్లే వస్తా
పిలుపు కంటే ముందే పలికేస్తా
తలుచుకోక ముందే కనిపిస్తా
కనిపించని నీ ప్రాణానికి ప్రాణాన్నవుతా
ఆగిపోని గుండె చప్పుడంటే
అలిసిపోని ఊపిరంటు ఉంటే
నీ అసలే శ్వాసగా మారిన నేనేనంటా

పూవులే ఇస్తా పూజలే చేస్తా
నీ బాంఛన్ నన్ను లవ్ చెయ్యవే
రాసులే ఇస్తా రాణిలా చూస్తా
నీ బాంఛన్ నన్ను లవ్ చెయ్యవే

నా నువ్వే (2018)

చిత్రం: నా నువ్వే (2018)
సంగీతం: శరత్
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: కార్తీక్, సప్తపర్ణ చక్రవర్తి


చినికి చినికి చిలిపి గాలి తడి
తగిలి తగిలి వలపు వానజడి
కురిసి కురిసి వయసు వాగువడి
పెరిగి పెరిగి మనసు గండిపడి
వరదై వరదై ఉరుకు ప్రేమనది
ఒడులై సుడులై కడలై ఎగిసినదే

ఏమైందో  ఏమైందో
ఇపుడసలేమేమి ఔతుందో సమయం
ఎం చేయ్యమంటుందో తెలియదే
తెలియదే తెలియదే తెలియదే

ఈడు బరిలో అధరాలు నిలబడి
సైనికులుగా సమరాన కలబడి
ఏది గెలుపో మరిచేంత ఎగబడి
ఆత్రపడుతూ మరికొంత మెలిపడి

ఏకం అవుతూ తికమక
ఎదో చేస్తూ సుఖముల
రాజ్యాలేలే పదవిని
పొందాయేమో పెదవులిలా

మాయ మరుపే ముసిరింది మనలను
హాయి మెరుపే తెరిచింది కనులను
తీపి తలపే కలిపింది ఎదలను
చేరువయితే అరచెయ్యి వదలను

నేనే  నీవై ఇప్పుడిక
నాలో నేనే  మిగలను
నీలో శ్వాసై కదులుతూ
లోలో ఆశై కరిగెదనే

చినికి చినికి చిలిపి గాలి తడి
తగిలి తగిలి వలపు వానజడి
కురిసి కురిసి వయసు వాగువాడి
పెరిగి పెరిగి మనసు గండిపడి
వరదై వరదై ఉరుకు ప్రేమనది
ఒడులై సుడులై కడలై ఎగిసినదే

ఏమైందో  ఏమైందో ఇపుడసలేమేమి
 ఔతుందో సమయము
ఎం చేయమంటుందో తెలియదే
తెలియదే తెలియదే తెలియదే
తెలియదే తెలియదే

ఇసమ్ (2016)


నీ మనసుకి... మనసే లేదులే...
నీ మనసుకీ... మనసే లేదులే...
ఉంటే నన్నిలా వదిలీ పోదులే...
ఎలా బతికేది నేను…
గుండె నిండా నువ్వే నిండి కళ్ళముందు లేకపోతే…
ఎలా ఎలా ఎలా ఎలా...
ఎలా ఎలా ఎలా ఎలా…
ఎలా ఎలా ఉండేడేలా ప్రాణం … ప్రాణం...
నీ మనసుకి మనసే లేదులే…
మనసంతా తోలిచేసే భాద...
జారే జారే కన్నీళ్ళకి మాటలొస్తే ఎంత ఎంత బాగున్నో...
ఎద సడి వింటున్నావా...
వినబడి కూడా దాక్కున్నావా...
తెలియక చేస్తున్నావా...
తెలిసే చూస్తున్నావా...
చిరునవ్వులు పూసిన వాసంతాలె ఆశలు రాలే శిశిరాలవుతూంటే...
ఎలా ఎలా ఎలా ఎలా...
ఎలా ఎలా ఉండేదెలా ప్రాణం… ప్రాణం...
కనిపించూ నే పోయేలోగా...
వేల వేల కళ్ళళ్లోనా వత్తులేసి నిన్ను వేటుకుతున్నాగా...
మనసుని ప్రేమగా ఇస్తే...
మనసని తెలియక విసిరేసావా...
బహుమతిగా నన్నిస్తే...
బరువని దించేశావా...
నువ్వు ఎప్పటికప్పుడు గుర్తుకు వచ్చి
ఊపిరి కూడా భారం అవుతూంటే...
ఎలా ఎలా ఎలా ఎలా...
ఎలా ఎలా ఎలా ఎలా...
ఎలా ఎలా ఉండేడేలా ప్రాణం… ప్రాణం... .ప్రాణం...
ఎలా ఎలా ఎలా ఎలా...
ఎలా ఎలా ఉండేడేలా ప్రాణం...


చిత్రం: ఇసమ్ (2016)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: శక్తి శ్రీ గోపాలం





IIజిందగీ కె లియే జాన్ జరూరీ హై...
జీనే కె లియే అర్మాన్ జరూరీ హై...
ఇస్ జాన్ ఔర్ అర్మాన్ కె లియే తెరి ముస్కాన్ జరూరీ హై...
ఔర్ ముస్కాన్ కె లియే మేరీ జాన్ దేదూంగా యా కీసికి జాన్ లూంగII
కనులు నావైనా కలలు నీవేలే…
పెదవి నాదైనా పిలుపు నీదేలే…
ఈ గుండె నాదైనా ఉండేది నువ్వెలే…
ఈ ప్రాణం నాదైనా ఊపిరి నువ్వెలే…
మహా బాగుంది మాయలాగా ఉంది...
మరో లోకంలో మనసు దూకింది…
కనులు నావైనా కలలు నీవేలే…
పెదవి నాదైనా పిలుపు నీదేలే…
నాలోంచి నీలోకి వచ్చేసి మెల్లగా...
నన్నేమో నీకిచ్చేసాగా...
గుండేతో గుండెనే ఇలా గుచ్చెసా దండలా...
జానోనా జానో సనం...
నచ్చింది ప్రేమతనం...
నీ నవ్వు నా మరణం...
నీ చూపే నా జననం...
మహా బాగుంది మాయలాగా ఉంది...
మరో లోకంలో మనసు దూకింది…
నాదంటూ నీదంటూ ఏముంది కొత్తగా...
ఇద్దరిని కరిగించేశాకా...
జన్మతో జన్మకి ఇలా ముడి వేద్దాం గట్టిగా...
జానోనా జానో సనం...
ప్రేమంటే పిచ్చితనం...
నువ్వెలే నా చలనం...
నువ్వెలే నా మననం...
మహా బాగుంది మాయలాగా ఉంది...
మరో లోకంలో మనసు దూకింది…
కనులు నావైనా కలలు నీవేలే…
పెదవి నాదైనా పిలుపు నీదేలే...

చిత్రం: ఇసమ్ (2016)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: జూబీన్ నౌటీయాల్, మోహన భోగరాజు