Showing posts with label shreya ghoshal. Show all posts
Showing posts with label shreya ghoshal. Show all posts

వి (V)(2020)



చిత్రం : వి (V) 
సంగీతం :తమన్ ఎస్
సాహిత్యం :  సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం :అమిత్ త్రివేది, శష తిరుపతి

మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళా…
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీలా…
అంతగా కవ్వింస్తావేం గిల్లి..
అందుకే బందించేయ్ నన్నల్లి..
కిలాడీ కోమలీ… గులేబకావళీ…
సుఖాల జావళీ.. వినాలి కౌగిలీ…
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళా…
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీలా…

ఓ అడుగులో అడుగువై ఇలా రా నాతో నిత్యం వరాననా..
హ.. బతుకులో బతుకునై నివేదిస్తా నా సర్వం జహాపనా..
పూలనావ.. గాలితోవ.. హైలో హైలెస్సో…
ఓ.. చేరనీవా చేయనీవా.. సేవలేవేవో….
ఓ… మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళా…
ఓ.. వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీలా…


మనసులో అలలయే రహస్యాలేవో చెప్పే క్షణం ఇదీ..
మనువుతో మొదలయే మరో జన్మాన్నై పుట్టే వరమిదీ..
నీలో ఉంచా నాప్రాణాన్ని.. చూసి పోల్చుకో..
ఓ.. నాలో పెంచా నీ కలలన్నీ.. ఊగనీ ఊయల్లో…

మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళా…
ఓ.. వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీలా…
అంతగా కవ్వింస్తావేం గిల్లి..
అందుకే బందించేయ్ నన్నల్లి..
కిలాడీ కోమలీ… గులేబకావళీ…
సుఖాల జావళీ.. వినాలి కౌగిలీ…


************** ***************** ***********


చిత్రం : వి (V) 
సంగీతం :తమన్ ఎస్
సాహిత్యం :  సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం :శ్రేయ ఘోషల్

చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా

చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక
ఏం చేస్తున్న నా ధ్యాసంతా నీ మీదే తెలుసా

నిను చూడనిదే
ఆగనని ఊహల ఉబలాటం
ఉసి కొడుతుంటే

వస్తున్న వచ్చేస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా
కవ్విస్తూ కనబడకున్నా
ఉవ్వెత్తున ఉరికొస్తున్న

చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా



చెలియా చెలియా నీ తలపే తరిమిందే
అడుగే అలలయ్యే ఆరాటమే పెంచనా

గడియో క్షణమో ఈ దూరం కలగాలే
ప్రాణం బాణంలా విరహాన్ని వేటాడగా

మురిపించే ముస్తాబై ఉన్నా
దరికొస్తే అందిస్తాగా ఆనందంగా

ఇప్పటి ఈ ఒప్పందాలే
ఇబ్బందులు తప్పించాలే
చీకటితో చెప్పించాలే
ఏకాంతం ఇప్పించాలే


వస్తున్న వచ్చేస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా
కవ్విస్తూ కనబడకున్నా
ఉవ్వెత్తున ఉరికొస్తున్న

చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా


సుకుమారుడు (2013)

చిత్రం: సుకుమారుడు (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: శ్రీమణి
గానం: శ్రేయ ఘోషల్

అరే ఆలె అలె అలె ... ఆలె అలె అలె  లే... అలె  లే...
ఓ... నీలాకాశంలో మెరిసే చంద్రుడివే
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే

అరే ఆలె అలె అలె ... ఆలె అలె అలె  లే... అలె  లే...

ఓహోహో... పొంగే నదిలా నన్నే మార్చావే
చిన్ని గుండెల్లోనా అలజడి రేపావే
హే... ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో
చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలొ
నీవల్లే నీవల్లేరా సుకుమారా... ఈ మాయే నీవల్లేరా
ఏదో అయ్యిందీవేళ ఇన్నాళ్ళు లేదిలా

అరే ఆలె అలె అలె ... ఆలె అలె అలె  లే... అలె  లే...

ఓ ఓ ఓ... అరే ఆలె అలె అలె ... ఆలె అలె అలె  లే... అలె  లే...

హే సరదాకైనా ఏ ఆడపిల్లైనా... నిన్ను చూస్తుంటే ఉండగలనా
ఓ నిన్నే దాచేసి లేవు పొమ్మంటా... నీకే నిన్నే ఇవ్వనంటా
అరె నిన్నే తాకిందని గాలితోటి రోజూ గొడవేనంట
నిన్ను నువ్వైనా నాలాగ ప్రేమించలేవంట

అరే ఆలె అలె అలె ... ఆలె అలె అలె  లే... అలె  లే...

హో... నీలాకాశంలో మెరిసే చంద్రుడివే
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే

ఓ... ఏలేలో... ఏలేలో... ఓ ఓ

ఓ ఓ ఓ... రహదారుల్లో పూలు పూయిస్తా నా దారంటూ వస్తానంటే
మహరాణల్లే నన్ను చూపిస్తా నాపై కన్నే వేస్తానంటే
అరె ఏంటో క్షణమైనా నిన్ను చూడకుంటే ఆగదు ప్రాణం
ఇలా నువ్వంటే పడిచచ్చే నేనంటే నాకిష్టం

ఓ... నీలాకాశంలో మెరిసే చంద్రుడివే
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే
ఓహోహొ... పొంగే నదిలా నన్నే మార్చావే
చిన్ని గుండెల్లోనా అలజడి రేపావే
ఏ...ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో
చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలొ

నీవల్లే నీవల్లేరా సుకుమారా ఈ మాయే నీవల్లేరా
ఏదో అయ్యిందీవేళ ఇన్నాళ్ళు లేదిలా
ఓ... ఏలేలో... ఏలేలో... ఓ ఓ



కొంచం ఇష్టం కొంచం కష్టం (2009)

చిత్రం: కొంచం ఇష్టం కొంచం కష్టం (2009)
సంగీతం: శంకర్ - ఇహషాన్ - లోయ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శంకర్ మహదేవన్


భజభజరా ప్రేమికా పట్టుకో చెలి పాదం
బాపురే బాలికా...తీయకే నా ప్రాణం
అనుకుంటే సరా..ఒకటే ఊదరా
చెబితే వినదా ఉరికే తొందర
కొంచెం ఇష్టం ఉంటే...కొంచెం కష్టం అంటే
ఒప్పుకోక తప్పదంటూ తగువే తగునా
ఎంతో ఇష్టం ఉన్నా...ఎంతో కష్టం ఉన్నా
పూటకో కొండెత్తమంటే సరే అననా...

అనగనగా జాలిగా సాగెనీ మన గాథ
ఎంతకీ తేలదా...ఏమిటీ యమ బాధ
ప్రతి సారి ఇలా మొదలైతే ఎలా
సుడిలో పడవై కడ తేరేదెలా
కొంచెం ఇష్టం ఉంటే...కొంచెం కష్టం అయినా
కంచి దాకా చేర్చలేనా నిను నా వెనుక..
ఎంత ఇష్టం ఉంటే...అంత కష్టం ఉందే
ఆగిపోని హంస పాదం ఆపకే చిలకా

ఎన్నడూ చేరమే తిన్నగా తుది తీరం

ఆపే ఆపదా కాదే పూపొద
బెదురెందుకట నేనున్నా కదా...
కొంచెం ఇష్టం వెంట...కొంచెం కష్టం వెంట
ప్రేమ దేశం చేరాల్సిందే అనుకో సజనా
ఎంతో దూరం ఉన్నా...ఎంత కాలం అయినా
ప్రేమ కోసం పరుగులు తీద్దాం పదవే లలనా

రాజునే బానిసా...చెయ్యదా చెలి బంధం
సమయంతో సదా...సమరం చేయదా
వలచే హృదయం...గెలిచే తీరదా
కొంచెం ఇష్టం పుడితే...కొంచెం కష్టం నెడితే
అంతు చూసే పంతం అవదా పొంగే ఆశ
కోరే మజిలీ దాకా పోరే గజనీ లాగా
ఓటమంటే కోట చేరే బాటనుకోరా

మతి చెడితే భామరో మనది కాదిక లోకం
మునిగితే ప్రేమలో తేలనీయదు మైకం
మెడలో ఈ ఉరి...పడుతున్నా మరి...
ఇది పూదండే అనదా ఊపిరి
కొంచెం ఇష్టం ఉన్నా..కొంచెం కష్టం అయినా
తేనెపట్టై రేపుతుంది ఈ అల్లరి
ఇంతకు ముందే ఉన్న ఎందరి హిస్టరి విన్నా
నువ్వు నేనే ఈవ్ అండ్ ఆడం అంతే


*******   *******   ********


చిత్రం: కొంచం ఇష్టం కొంచం కష్టం (2009)
సంగీతం: శంకర్ - ఇహషాన్ - లోయ్
సాహిత్యం: చంద్రబోస్
గానం: రామన్ మహదేవన్, క్లింటన్ సిర్జియో, హేమచంద్ర


ఎగిరే... ఎగిరే ఎగిరే... ఎగిరేచూపే ఎగిరెనే

చీకటి ఎదగని దారిలో
పాదం ఎగిరెనే భయమే తెలియని బాట లో
ప్రాయం ఎగిరెనే
పరిచయ మవ్వని త్రోవలో

Fly high in the sky


ఎగిరే... ఎగిరే పైకెగిరే

కలలే ...అలలై... పైకెగిరే
పలుకే స్వరమై పైకెగిరే
ప్రతి అడుగూ స్వేచ్ఛ కోరగా


మనసే అడిగేను ప్రశ్నకే బదులొచ్చెను కదా ఇప్పుడే
ఎప్పుడూ చూడని లోకమే ఎదురొచ్చేను కదా ఇచ్చటే
ఓ  ఈ క్షణమే సంబరం ఈ క్షణమే శాశ్వతం
ఈ క్షణమే జీవితం తెలిసిందీ ఈ క్షణం
మౌనం కరిగేనే మాటల సూర్యుడి ఎండలో

స్నేహం దొరికేనే
నవ్వుల చంద్రుడి నీడలో
ప్రాణం పొంగెనే మెరుపుల తారల నింగి లో


Fly high in the sky

ఎగిరే... ఎగిరే పైకెగిరే

కలలే ...అలలై... పైకెగిరే
పలుకే స్వరమై పైకెగిరే
ప్రతి అడుగూ స్వేచ్ఛ కోరగా


తెలుపు నలుపే కాదురా
పలు రంగులు ఇలా సిధ్ధం
మదిలో రంగులు అద్దగా మన కధలకు
ఓ సరిపొదొయి బ్రతకడం
లేచే జీవించడం
గమనం గమనించడం పయనంలో అవసరం
చేసే సంతకం నడిచే కాలపు నుదిటిపై
రాసే స్వాగతం రేపటి కాలపు పెదవిపై
పంచె సున్నితమ్
కాలం చదివే కవితపై
Fly high in the sky

ఎగిరే... ఎగిరే పైకెగిరే

కలలే ...అలలై... పైకెగిరే
పలుకే స్వరమై పైకెగిరే
ప్రతి అడుగూ స్వేచ్ఛ కోరగా


*******   *******   ********


చిత్రం: కొంచం ఇష్టం కొంచం కష్టం (2009)
సంగీతం: శంకర్ - ఇహషాన్ - లోయ్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శిల్పారావ్, మహాలక్ష్మీ అయ్యర్

అమ్మమ్మా.. అమ్మమ్మా.. అమ్మమ్మమోయ్..

జామురేయి వేళల్లో వీరుడల్లే వస్తాడు
భామలున్నా వీధుల్లో ఓరకంట చూస్తాడు
అందమైన మాటల్తో హే.. ఆశ రేపుతుంటాడు
కొంచెమైన నమ్మారో అంత దోచుకెల్తాడు
ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే మన పడుచు యదలకెదురుపడిన ముదురు మదనుడు
పోరా పోకిరి రాజా ఆ రాజా..
పోరా దూకుడు రాజా ఏ రాజా..
జా జా వంకరరాజా ఏ రాజా..
పోరా జింకల రాజా రాజా రాజా..
అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బబ్బచ
అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ హే అబ్బబ్బచ

ఎంత పనీ పనులొదిలేసి సొగసులకేసి గుటకలువేసే పెద్ద పనీ..
మా రూపు రేఖ పొగిడే నీ పెదవికెంత కష్టం
మా చుట్టు తిరిగి అరిగే నీ కాళ్ళ కెంత నష్టం

చెవిలోన పువ్వులెట్టు చేతి వేళ్ళ నొప్పి నరకం
అయినా గాని అలుపే మాని మన కులుకు గెలికి పులుపు దులుపు చిలిపి కృష్ణుడు
పోరా మాయల రాజా ఆ రాజా..
పోరా మర్కట రాజా ఏ రాజా..
జా జా తిమ్మిరి రాజా ఏ రాజా..
పోరా తికమక రాజా రాజా రాజా..
అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ  అబ్బబ్బచ
అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ  హే అబ్బబ్బచ

కొంటె పని వలలను వేసీ నలుగురిలో మా విలువను పెంచే మంచి పనీ
నీ గాలి సోకలేనీ మా మబ్బుకేది వర్షం
నీ వేడి తాకలేని మా పసిడి కాదు హారం
నీ కంటి ఘాటు తగలలేని ఒంటికేది గర్వం
కనుకే వినుకో కబురే అనుకో ఇది మగువనెపుడు బయటపడని మనసు చప్పుడు
హే రా రా మబ్బుల రాజా రాజా..
రా రా రంగుల రాజా రాజా..
ఆజా అల్లరి రాజా ఏ రాజా..
రా రా అందరి రాజా..
అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ  అబ్బబ్బచ
అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ  హే అబ్బబ్బచ



*******   *******   ********



చిత్రం: కొంచం ఇష్టం కొంచం కష్టం (2009)
సంగీతం: శంకర్ - ఇహషాన్ - లోయ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉన్ని కృష్ణన్

ఎందుకు చెంతకి వస్తావో ..ఎందుకు చేయొదిలేస్తావో
స్నేహమా చెలగాటమా..
ఎప్పుడు నీ ముడి వేస్తావో..ఎప్పుడెలా విడదీస్తావో..

ప్రణయమా పరిహాసమా
శపించే దైవమా..దహించే దీపమా
ఇదే నీ రూపమా ప్రేమా
ఫలిస్తే పాపమా..కలిస్తే లోపమా..గెలిస్తే నష్టమా ప్రేమా

ఈ..కలత...చాల్లే మమత...
మరపురాని స్మృతులలోనే రగిలిపోతావా..

మరలి రాని గతముగానే మిగిలిపోతావా
రెప్పలు దాటవు స్వప్నాలు..చెప్పక తప్పదు వీడ్కోలు
ఊరుకో..ఓ హృదయమా..
నిజం నిష్ఠూరమా..తెలిస్తే కష్టమా..కన్నీటికి చెప్పవే ప్రేమా
ఫలిస్తే పాపమా...కలిస్తే కోపమా..గెలిస్తే నష్టమా ప్రేమా


వెంటరమ్మంటూ..తీసుకెళ్తావు..నమ్మి వస్తే నట్టడవిలో విడిచిపోతావు
జంటకమ్మంటూ..ఆశపెడతావు
కలిమి ఉంచే చెలిమి తుంచే కలహమవుతావు..
చేసిన బాసలు ఎన్నంటే...చెప్పిన ఊసులు ఏవంటే
మౌనమా...మమకారమా
చూపుల్లో శూన్యమా...గుండెల్లో గాయమా..మరీ వేధించకే ప్రేమా...
ఎందుకు చెంతకి వస్తావో ..ఎందుకు చేయొదిలేస్తావో
స్నేహమా చెలగాటమా..
ఎప్పుడు నీ ముడి వేస్తావో..ఎప్పుడెలా విడదీస్తావో..ప్రణయమా పరిహాసమా


*******   *******   ********



చిత్రం: కొంచం ఇష్టం కొంచం కష్టం (2009)
సంగీతం: శంకర్ - ఇహషాన్ - లోయ్
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: శంకర్ మహదేవన్

కనులే కలిపింది కలలే చూపింది
ఏమయిందో ఏమో గాని అంతా మారింది
మాటే వినకుంది మంటే రేపింది
నన్నే మరిచి నాన్నే రైటని ఇంట్లో కూర్చుంది
చేతిలోన చెయ్యేసింది చెలిమి నాకు నేర్పింది
ఎంత హాయిలే ప్రేమంటే అనుకొని మది మురిసింది
ఇంతలోనే ఏమయ్యిందో నన్ను గాలికొదిలింది
అబ్బ సుబ్రమణ్యం వల్లే నా గీత మారింది
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
కొంపముంచాడే సుబ్రమణ్యం
కొంపముంచాడే సుబ్రమణ్యం
అరె ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం

అందరిలో నన్నే అందంగా చెలి
పలకరించగా సరికొత్తగా మళ్ళీ జన్మించాగా
అల్లరిగా తిరిగే నే కూడా ప్రేమించగలనని
తనతో కలిసాకే గుర్తించాగా
వంద ఏళ్ళ ఆనందాలు ఒక్కనాడే చూపింది
కన్ను మూసి తెరిచే లోగా కథ మొత్తం మారింది
చందమామలా నవ్వింది నన్ను వీడలేనంది
మధ్యలో అబ్బ రాగానే తను మాట మార్చింది

అరె ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే సుబ్రమణ్యం
సుబ్రమణ్యం సుబ్రమణ్యం సుబ్రమణ్యం
ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే సుబ్రమణ్యం
అరె కొంపముంచాడే సుబ్రమణ్యం
కొంపముంచాడే సుబ్రమణ్యం
అరె ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం

ఏయ్ ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
అరె ఎవడే... సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
కొంపముంచాడే సుబ్రమణ్యం
కొంపముంచాడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం

ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
సుబ్రమణ్యం ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
హా కొంపముంచాడే సుబ్రమణ్యం
కొంపముంచాడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం


*******   *******   ********



చిత్రం: కొంచం ఇష్టం కొంచం కష్టం (2009)
సంగీతం: శంకర్ - ఇహషాన్ - లోయ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శంకర్ మహదేవన్, శ్రేయా గోషల్

ఆనందమా..ఆరాటమా..ఆలోచనా ఏవిటో
పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి
దాహానిదా స్నేహానిదా ఈ సూచన ఏవిటో
తేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడి
ఓ...పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనా
స్వప్నమే సత్యమై రెప్ప దాటి చేరే సమయానా
ఓ...కంటీకే దూరమై గుండెకే ఇంతగా చేరువైనా
నమ్మవేం మనసా కనబడినది కదా ప్రతి మలుపున

ఆ...ఓ....
ఎద సడిలో చిలిపి లయ
తమ వలనే పెరిగెనయా
కనుక నువ్వే తెలుపవయా
ప్రేమంటారో ఏమంటారో ఈ మాయ
ప్రియా..ప్రియా
ఒక క్షణము తోచనీవుగా
కాస్త మరుపైన రావుగా

ఇంత ఇదిగా వెంట పడక అదే పనిగా
ఓ..నిన్నలా మొన్నలా నేను లేను నేనులా నిజమేనా
ముందుగా చెప్పక మంత్రమేశావే న్యాయమేనా
ఓ..అందుకే ఇంతగా కొలువయ్యున్నా నీలోనా
కొత్తగా మార్చనా నువ్వు నువ్వు అను నిను మరిపించనా

ఆనందమా...ఆరాటమా...ఆలోచనా ఏవిటో
పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి
దాహానిదా స్నేహానిదా ఈ సూచన ఏవిటో
తేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడి
ఓ...పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనా
చుట్టుకో చుట్టుకో ముడిపడిపోయే మురిపాన
ఓ...ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనా
కళ్ళల్లో పెట్టుకో ఎదురుగ నిలవనా ఎటుతిరిగినా
ఏకాంతమే నీ సొంతమై
పాలించుకో ప్రణయమా
కౌగిలే కోటలాఏలుకో బంధమా


*******   *******   ********


చిత్రం: కొంచం ఇష్టం కొంచం కష్టం (2009)
సంగీతం: శంకర్ - ఇహషాన్ - లోయ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సోనునిగమ్, శ్రేయా గోషల్

అంతా సిద్ధంగా ఉన్నది...
మనసేంటో సంతోషమన్నది
ఆలస్యమెందుకన్నది...ఇలా రా మరి...
అబ్బాయిగారి పద్ధతి హద్దు మీరేట్టుగానే ఉన్నది
అల్లాడిపోదా చిన్నది..చాల్లే అల్లరి
కథలో.... తదుపరి...పిలిచే... పద మరి
మనువే కుదిరి..మురిపెం ముదిరీ
మనకిష్టమైన కష్టమైన ఊగిపోదా మరి
అంతా సిద్ధంగా ఉన్నది...
హద్దు మీరేట్టుగానే ఉన్నది
ఆలస్యమెందుకన్నది...సరేలే మరి...

పైట పడి ఎదిగిన వయసా...
ఓయ్ ఏంటి కొత్త వరస....
బయటపడకూడదు సొగసా
పోవోయ్ చాల్లే నస
పైట పడి ఎదిగిన వయసా...
బయటపడకూడదు సొగసా..తెలుసా
మండిపోదా ఒళ్ళు పరాయి వాళ్ల కళ్లు
నిన్నంతలాగ చూస్తే అలా

ఎందుకంత కుళ్లు
నువ్వైనా ఇన్నాళ్ళు
నన్ను కొరకలేదా అచ్చం అలా
కనుకే కలిశా..బంధమై బిగిశా
నీకు ఇష్టమైనా కష్టమైనా వదలనంది అది...
అబ్బాయిగారి పద్ధతి హద్దు మీరేట్టుగానే ఉన్నది
ఆలస్యమెందుకన్నది...ఇలా రా మరి...

చెంపలకు చెప్పవే సరిగా
సిగ్గూపడమని ఒక సలహా
హో...ఓ...చెంపలకు చెప్పవే సరిగా
సిగ్గూపడమని ఒక సలహా
చెలియా కన్నె పిల్ల బుగ్గ కాస్తైన కందిపోక
పసిపాపలాగ ఉంటే అలా
ముందరుంది ఇంకా ఆ ముద్దు ముచ్చటంతా
కంగారు పెట్టకపుడే ఇలా
ఉరికే సరదా...చెబితే వింటదా
నీకు ఇష్టమైనా...కష్టమైనా...ఒప్పుకోదు అది
అంతా సుఖంగా ఉన్నది...
మనసెంతో సంతోషమన్నది
ఆలస్యమెందుకన్నది...ఇలా రా మరి...

బాణం (2009)

చిత్రం: బాణం (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం : హేమచంద్ర ,  సైంధవి


నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మై మరపునా...
ఏమొ అన్నానేమో, నువ్వు విన్నావేమో
విన్న మాటేదో నిన్నడగనా...

నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మై మరపునా...
ఏమొ అన్నానేమో, నువ్వు విన్నావేమో
విన్న మాటేదో నిన్నడగనా...

అలా సాగిపోతున్న నాలోన
ఇదేంటిలా కొత్త ఆలోచన
మనసే నాది మాటే నీది ఇదే మాయో

నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మై మరపునా...
ఏమొ అన్నానేమో, నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా...

ఔనో కాదో తడబాటునీ అంతో ఇంతో గడి దాటనీ
విధి విడిపోనీ పరదానీ పలుకై రానీ ప్రాణాన్ని
ఎదంత పదాల్లోన పలికేనా...
నా మౌనమే ప్రేమ ఆలాపనా
మనసే నాది మాటే నీది ఇదే మాయో

నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మై మరపునా...
ఏమొ అన్నానేమో, నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా...

దైవం వరమై దొరికిందనీ నాలో సగమై కలిసిందనీ
మెలకువ కాని హృదయాన్ని, చిగురైపోనీ సిసిరాన్ని
నీతో చెలిమి చేస్తున్న నిమిషాలు
నూరేళ్ళుగా ఎదిగిపోయాయిలా
మనమే సాక్ష్యం మాటే మంత్రం ప్రేమే బంధం

నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మై మరపునా...
ఏమొ అన్నానేమో, నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా...



**********   ********   ********



చిత్రం: బాణం (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శ్రేయ ఘోషాల్

తననాన నానాన తననాన నానాన
మోగింది జేగంట మంచే జరిగేనంటా మనసంటోంది ఈ మాట
కొలిచే దైవాలంతా దీవించారనుకుంటా నను పిలిచినది పూబాట
తనతో పాటే వెళ్లిపోతా...
ఆకాశం నీడంతా నాదేనంటోంది
అలలు ఎగసే ఆశ...
ఏ చింతా కాసింత లేనే లేదంది
కలత మరిచే శ్వాస...
మోగింది జేగంట మంచే జరిగేనంటా మనసంటోంది ఈ మాట
మనసంటోంది ఈ మాట

పదపదమని నది నడకనీ ఇటు నడిపినదెవరైనా
తన పరుగులో తెలి నురగలో నను నేనే చూస్తున్నా
ప్రతి పిలుపునీ కథ మలుపనీ మలి అడుగులు వేస్తున్నా
అలుపెరుగనీ పసి మనసునై సమయంతో వెళుతున్నా
నలుసంత కూడా నలుపేది లేని
వెలుగుంది నేడు నా చూపున
ఏ దూరమో ఏ తీరమో ప్రశ్నించనీ పయనంలోన
ఈ దారితో సహవాసమై కొనసాగనా ఏదేమైనా...
మోగింది జేగంట మంచే జరిగేనంటా మనసంటోంది ఈ మాట
మనసంటోంది ఈ మాట

ఒక చలువన ఒక వెలువన జత కలిసినదో సాయం
మనసెరిగిన మధుమాసమై నను చేర్చిందే గమ్యం
కల నిలవని కనుపాపలో కళలొలికినదో ఉదయం
అది మొదలున నను ముసిరిన ఏకాంతం మటుమాయం
నా చుట్టూ అందంగా మారింది లోకం ఊహల్లోనైనా లేదీ నిజం
చిరునవ్వుతో ఈ పరిచయం వరమైయిలా నను చేరేనా
బదులడగని ఈ పరిమళం నా జన్మనే మురిపించేనా...
మోగింది జేగంట మంచే జరిగేనంటా మనసంటోంది ఈ మాట
ఓ మనసంటోంది ఈ మాట

స్నేహితుడా (2009)

చిత్రం: స్నేహితుడా (2009)
సంగీతం: శివరామ్ శంకర్
సాహిత్యం: భాషాశ్రీ
గానం: శ్రేయా ఘోషల్


Who who who who are you
Who who who who are you

ఇంతకూ నువ్వెవరూ  వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ
ఇంతకూ ముందెవరూ ఇంతగా నాకెవరూ
చెంతకు వచ్చి వచ్చి చెప్పినవారే లేరెవరూ
ఒక నిముషం కోపముతో మరు నిముషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో
నీ పంతము ఏమిటనీ ఏ బంధము మనది అని
నేను ఆలోచిస్తే బదులే దొరకదు ఎంతకూ

ఇంతకూ నువ్వెవరూ  వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ

ఆ... ఆ... ఆ... ఆ...

ఎందుకో ఏమిటో నేను చెప్పలేను గానీ కలిసావు తియ్యనైన వేళ
చనువుతో చిలిపిగా నీవే మసలుతుంటే నాతో
మరిచాను గుండెలోని జ్వాలా
ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది
నీ అడుగుల నీడలో కాలమే నిలిచి చూస్తున్నదీ

ఇంతకూ నువ్వెవరూ  వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ

ఎవరనీ చూడక నాకై పరుగు తీస్తూ ఉంటే
నీ తీరే ఆశ రేపె నాలో
నువ్వలా కసురుతూ నాకే అదుపు నేర్పుతుంటే
చూసాలే నన్ను నేను నీలో
ప్రియమైన సమయమా గమనమా చెప్పవే అతనికి
ఈ చిరు చిరు పయనమే మధురమై నిలిచిపోతుందనీ

ఇంతకూ నువ్వెవరూ  వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ
ఒక నిముషం కోపముతో మరు నిముషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో
నీ పంతము ఏమిటనీ ఏ బంధము మనది అని
నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకూ

ఒక్కడున్నాడు (2007)




చిత్రం: ఒక్కడున్నాడు (2007)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: శ్రేయ ఘోషల్

పల్లవి:
ఇవ్వాళ నా పిలుపు
ఇవ్వాలి నీకు గెలుపు
సంవత్సరం వరకు  ఓ లోకమా....ఓ...

ఇవ్వాళ నా పిలుపు
ఇవ్వాలి నీకు గెలుపు
సంవత్సరం వరకు  ఓ లోకమా....ఓ...

చరణం: 1
కొంచెం తీపి  కొంచెం పులుపు
పంచే ఆ ఉల్లాసమూ
కొంచెం కారం  కొంచెం ఉప్పు
పంచే ఆ ఆవేశమూ
చేదు వగరు చేసే మేలు
సమంగా ఆస్వాదించమనీ ఓ...

ఇవ్వాళ నా పిలుపు
ఇవ్వాలి నీకు గెలుపు
సంవత్సరం వరకు  ఓ లోకమా....ఓ...
ఇవ్వాళ నా పిలుపు

చరణం: 2
ప్రతి క్షణము ఒక్కో వరమై
సుఖాలే తేవాలని
ప్రతి మనసు ఒక్కో స్వరమై
సంగీతం అవ్వాలని
పల్లవించే పరిచయాలే
స్నేహాలై వికసించాలి అని ఓ...

ఇవ్వాళ నా పిలుపు
ఇవ్వాలి నీకు గెలుపు
సంవత్సరం వరకు  ఓ లోకమా....ఓ...

ఇవ్వాళ నా పిలుపు
ఇవ్వాలి నీకు గెలుపు
సంవత్సరం వరకు  ఓ లోకమా....ఓ...




చిత్రం: ఒక్కడున్నాడు (2007)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అనంత్ శ్రీరామ
గానం: దేవి శ్రీ ప్రసాద్

పల్లవి:
మనకక్కర్లెధు అసలక్కర్లెధు అసలక్కర్లెధురా
ఫియర్,  క్లియర్, ఎవర్...
అరె చుక్కల్లో తెగ చెక్కర్లే ఇక కొట్టొద్దామురా
ఇధర్,  ఉధర్, బ్రదర్...

మనకక్కర్లెధు అసలక్కర్లెధు అసలక్కర్లెధురా
ఫియర్,  క్లియర్, ఎవర్...

చరణం: 1
వందో  వెయ్యో  లక్షో  గిక్షో రేటు ఉంటుంది తప్పుకి
పర్లెధు చేసి పారేయ్
రింగో చైనో బైకో గియ్కో పోతే పోని ఎంటిలే
నీ స్వేచ్ఛ అగరాదోయ్
మనసెక్కడ ఉంటుందో మనం అక్కడ ఉండుంటేనే
లైఫ్ లోన అంతో ఇంతో కిక్ ఉంది లేరోయ్

మనకక్కర్లెధు అసలక్కర్లెధు అసలక్కర్లెధురా
ఫియర్,  క్లియర్, ఎవర్...
అరె చుక్కల్లో తెగ చెక్కర్లే ఇక కొట్టొద్దామురా
ఇధర్,  ఉధర్, బ్రదర్...

చరణం: 2
ఫుల్లో హాఫో ఎన్నో రౌండో ఆలోచిస్తూ చూడకోయ్
కావాల్సినంత వేసేయ్
గంటో పూటో రాత్రో పగలో  వేస్టే  ఐపోని కాలమే
ఏమంత లాస్ లేదోయయ్
మన కళ్ళకు నచ్చిందల్ల మన సొంతం అవుతుంటేనే
భూమ్మిద పుట్టామంటె అర్ధముందిలేరోయ్




చిత్రం: ఒక్కడున్నాడు (2007)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యమ్.యమ్.కీరవాణి

పల్లవి:
అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు
కోరిన తీరాన్నే చేరుకునే వరకు
అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు
కోరిన తీరాన్నే చేరుకునే వరకు
అడుగడుగునా...

చరణం: 1
ఓ నిమిషమైనా నిదరపోవా నిలవనీవేం నిరీక్షణమా
నే వెతుకుతున్నా ఎదుటపడవే తొలి వెలుగు తీరమా
అడుగడుగునా ప్రతి మలుపునా రోజూ నా వెంటే పడకు
విడవని పంతముగా నా ప్రాణం తినకు

చరణం: 2
నీ కలల వెంటే కదలమంటే కుదురుతుందా
అయోమయమా
నా దిగులు మంటే తగులుతుంటే రగలవేం కాలమా

అడుగడుగునా - అడుగడుగునా
పడిపోయినా - పడిపోయినా
ఆగే వీల్లేదే పరుగు
కోరిన తీరాన్నే చేరుకునే వరకు
అడుగడుగునా...

అత్తిలి సత్తిబాబు LKG (2007)




చిత్రం: అత్తిలి సత్తిబాబు LKG (2007)
సంగీతం: శ్రీకృష్ణ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: ఉదిత్ నారాయణ్ శ్రేయా ఘోషల్


పల్లవి:
ఈ చలిగాలులలోన జతగా జతగా కలిశాక
నీ చెలి కన్నులలోన పగలే కలవై నిలిచాక
ఎదుట నిలిచా ఎదను కలిపా రాని నిదురలు పోలేక
వచ్చాక కుదరదు ఇక అలుకా
గిచ్చాక బెదరడు చెలి కనుక
ఇచ్చాక అడగకు ఇమ్మని ఇంకో కానుక

హో ఈ చలిగాలులలోన జతగా జతగా కలిశాక
హో నీ చెలి కన్నులలోన పగలే కలవై నిలిచాక

చరణం: 1
ఎల్లలు లేవిక ఓ చిలుకా ఎగిరాక నింగి దాకా
తికమక లేదిక ఓ మునక మునిగాక గొంతుదాక
దాహము తీరక మోహమిక తొలికేక వేసినాక
ఝల ఝల పారక సాగదిక చెలి రాక ఏరువాక
చక చక వలచినామిక బెరుకు చాలిక అడుముకోయిక
అరరె తోచక మనసు దాచక
పరుచుకోయిక వయసు నాయిక

కోరస్: పిలుపు తలపొక తెలుపక

ఈ చలిగాలులలోన జతగా జతగా కలిశాక
నీ చెలి కన్నులలోన పగలే కలవై నిలిచాక

చరణం: 2
నిన్నెడబాయక నీ వెనుక నిలిచాక ఇంత సోకా
ఎకసెక లాడక ఏమనక నిను తాక వచ్చినాక
కోరిక రేపక చేరు ఇక  కదిలాక ప్రేమ నౌక
గుస గుస లాడక తప్పదిక ముదిరాక ఈడు పాక
పక పక నఘవు లాపక ఎదురు చూడగ ఎదురు రాయిక
అరరె రోజొక ఇలకు నీదిక
అలుపు లేదిక ఎడము చాలక

కోరస్: గడియ వదలక కదలక

హో నీ చెలి కన్నులలోన పగలే కలవై నిలిచాక
ఎదుట నిలిచా ఎదను కలిపా రాని నిదురలు పోలేక
వచ్చాక కుదరదు ఇక అలుకా
గిచ్చాక బెదరడు చెలి కనుక
ఇచ్చాక అడగకు ఇమ్మని ఇంకో కానుక

రుద్రమదేవి (2015)



చిత్రం: రుద్రమదేవి (2015)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్రేయ ఘోషల్


పల్లవి:


పున్నమి పువ్వై వికశిస్తున్నా
వెన్నెల గువ్వై విహరిస్తున్నా
అరమరికలు మరచి
తెరమరుగుల చెరలను విడిచి
అది ఇదియని తలచి
అదుపెరగని మురిపెం పిలిచి
మధుర భవనల సుధల వాహిణిగ
ఎగసిన హృదయంతో

పున్నమి పువ్వై వికశిస్తున్నా
వెన్నెల గువ్వై విహరిస్తున్నా

చరణం: 1


నేలపైకి దూకే తొలి వాన ఆటలా
నింగి అంచు తాకే అలలోని పాటల
మౌనం ఆలపించే నవరాగం ఎదో
ప్రాణం ఆలకించే ఆ ప్రాణం ఎదో
కొండవాగులోని కొత్త అలజడిలో
గుండె పొంగుతున్న సందడిలో
బంధనాలు దాటి చిందులాడు ఒడిలో
కిందు మీదు లేని తొందరలో
నేనేనా నిజంగాన అనే భావం కలిగి

పున్నమి పువ్వై వికశిస్తున్నా
వెన్నెల గువ్వై విహరిస్తున్నా


చరణం: 2


సొంత సోయగాలే బరువైన మేనిలో
వింత సౌరభాలే చిలికించు శ్వాసలో
ఉయ్యాలూపు గాలి లే లెమ్మన్నదా
వయ్యారాల కెలి రా  రమ్మన్నదా
ఇంత కాలమెన్ని సొంపులున్న శిల్పం
శిల వెనుకనే దాగుందా
ఇప్పుడేదో వింత స్వప్నం సంకల్పం
ముని పిలుపుగ తరిమిందా
సంకోచాల సంకెళ్లని తృటిలో కరిగే

పున్నమి పువ్వై వికశిస్తున్నా
వెన్నెల గువ్వై విహరిస్తున్నా
అరమరికలు మరచి
తెరమరుగుల చెరలను విడిచి
అది ఇదియని తలచి
అదుపెరగని మురిపెం పిలిచి
మధుర భవనల సుధల వాహిణిగ
ఎగసిన హృదయంతో

పున్నమి పువ్వై వికశిస్తున్నా
వెన్నెల గువ్వై విహరిస్తున్నా


రేసు గుర్రం (2014)



చిత్రం: రేసు గుర్రం (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: సింహా, దివ్య , గంగ

మామా నువు గిట్ల గబర గిబర
తత్తర గిత్తర సక్కర గిక్కరొచ్చి పడిపోకే
నీకు నాకన్న మంచి అల్లుడు
దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే

సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా
సిను సిను కి  నీతో సీటీ కొట్టిత్త మామా

గళ్ళ వట్టి గుంజుతంది దీని సూపే
లొల్లి వెట్టి సంపుతంది దీని నవ్వే
కత్తి లెక్క గుచ్చుతంది దీని సోకే

డప్పు కొట్టి పిలవబట్టే ఈని తీరే
నిప్పులెక్క కాల్చ వట్టే ఈని పోరే
కొప్పు గూడ గొట్ట వట్టే ఈని జోరే

హే మామ దీని సూడకుంటే మన్నుతిన్న పాములెక్క మనసు పండబట్టే
అయ్యో ఈడు చూడగానే పొయ్యిమీద పాల లెక్క దిల్లు పొంగబట్టే
దీని బుంగమూతి సూత్తే నాకు బంగు తిన్న కోతిలెక్క సిందులెయ్య బుద్ది వుట్టే

సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా
సిను సిను కి  నీతో సీటీ కొట్టిత్త మామా
మామ సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా
సిను సిను కి  నీతో సీటీ కొట్టిత్త మామా

గళ్ళ వట్టి గుంజుతంది దీని సూపే
లొల్లి వెట్టి సంపుతంది దీని నవ్వే
కత్తి లెక్క గుచ్చుతంది దీని సోకే

ఓ జంగిలాల జియ్యలో ఓ జంగిలాల జియ్యలో
ఓ జంగిలాల జియ్యలో ఓ జంగిలాల జియ్యలో

మామ ని బిడ్డవచ్చి తగిలినంకనే
లవ్వు దర్వాజా నాకు తెరుసుకున్నదే
ఓ రయ్య ఈ పోరగాడు నచ్చినంకనే
నన్నీ బద్మాషు బుద్ధి సుట్టుకున్నదే
పట్టు వట్టేసెనే కుట్టేసెనే పాగళ్ గాన్ని చేసెనే
సుట్టూత బొంగరంలా తిప్ప బట్టెనే
సిటారు కొమ్మ మీద కుకో బెట్టేనే
మిఠాయి తిన్నంత తీపిబుట్టెనే
సందులల్ల దొంగలెక్క తిప్పవట్టెనే
దీని బుంగమూతి సూత్తే నాకు
బంగు తిన్న కోతిలెక్క సిందులెయ్య బుద్ది వుట్టే

సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా
సిను సిను కి  నీతో సీటీ కొట్టిత్త మామా
మామ సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా
సిను సిను కి  నీతో సీటీ కొట్టిత్త మామా

మామ ... మామ

ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
పుంగి బజానా పుంగి బజానా
ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
పుంగి బజానా... పుంగి బజానా...

ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
మామ నీకు ముందుందే పుంగి బజాన


***** ********* ********* ******

చిత్రం: రేసు గుర్రం (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: సిద్దార్ధ్ మహదేవన్, రాబిట్ మాక్

ఐమె సౌత్ ఇండియన్
ఐమ్ గొన టెల్లింగ్ గర్ల హు ఈస్ ప్రెట్టి
హొ...హొ...రిచ్చి ద నేమ్ ఈస్ స్పందనా
షి గాట్ బ్యూటిఫుల్ ఐస్ అండ్ షి ఈస్ విత్ ఇట్
ఒహ్ గరాబొ షి ఈస్ గొన్న మై స్వీటీ...
మై స్వీటీ...ఒహ్ మై స్వీటీ... స్వీటీ...

హెయ్ జిందగీని జాలిగా నీకు నచ్చినట్టూగా
నీటి లాగ సాగిపోనీ
హెయ్ ఊహలోన తేలనీ ఉప్పెనల్లె పొంగనీ
గాలిలాగ ఊరేగనీ
హెయ్ ఫేసుకున్న మాస్కునీ సీసికొట్టు నేలనీ
చూడు నీలొ ఒరిజినల్నీ
క్లాసులోన మాసునీ మాసులోన క్లాసునీ
మిక్సు చేస్తే బ్యూటీ హనీ
ఒహ్ మై స్వీటీ  - కొంచెం మాట వినవే
ఒహ్ మై స్వీటీ - కొంచెం దారి తప్పవే
మై స్వీటీ  - కొంచెం కోపగించవే
లైఫ్ స్టైలు మార్చవే నీ బాచ్చుమార్చవే

లైఫే చాల చాల షార్టువే
ఎవ్రీ సెకండే  - ఎంజాయ్ చెయ్యవే
నీతో నువ్వు ఫైటుచెయ్యవే
నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడంపొందవే...

లైఫే చాల చాల షార్టువే
ఎవ్రీ సెకండే  - ఎంజాయ్ చెయ్యవే
నీతో నువ్వు ఫైటుచెయ్యవే
నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడంపొందవే...

చాలు చాల్లే చలాకి వైటు నాటు తుపాకి
పారిపోతారె లోకమంతా నిన్ను చూసీ
కొంచెం వీలేసి చూడు
పెద్దకేకేసి చూడు నన్ను తిట్టైన ఒక్కసారి తిట్టి చూడు
ఇక నీలో హార్టు ఎంతొ లైటు స్మూతు సౌండు
స్వీటీ  -  కొంచెం మాట వినవే
ఒహ్ మై స్వీటీ - కొంచెం దారి తప్పవే
మై స్వీటీ - కొంచెం కోపగించవే

లైఫే చాల చాల షార్టువే
ఎవ్రీ సెకండే  - ఎంజాయ్ చెయ్యవే
నీతో నువ్వు ఫైటుచెయ్యవే
నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడంపొందవే...

స్వీటీ -  కొంచెం మాట వినవే
ఒహ్ మై స్వీటీ -  కొంచెం దారి తప్పవే
మై స్వీటీ  - కొంచెం కోపగించవే
లైఫ్ స్టైలు మార్చవే నీ బాచ్చుమార్చవే

లైఫే చాల చాల షార్టువే
ఎవ్రీ సెకండే  - ఎంజాయ్ చెయ్యవే
నీతో నువ్వు ఫైటుచెయ్యవే
నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడంపొందవే...
మై స్వీటీ.....


***** ********* ********* ******


చిత్రం: రేసు గుర్రం (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాహుల్ నంబియర్, శ్రేయగోషల్

భూ...భూచాడే
డిఫెక్టుగాడే భలె డిఫెక్టుగాడే
కనెక్ట్టుగాని అయిపొతే డిస్కనెక్టుకాడే
భూ...
డిఫెక్టుగాడే భలె డిఫెక్టుగాడే
కనెక్ట్టుగాని అయిపొతే డిస్కనెక్టుకాడే
రేసుగుర్రంలాంటోడే రివర్సు గేరే లేనోడే
ఫొకస్ పెట్టేస్తాడే ఫిక్సవుతాడే డోలే కొడతాడే

భూచాడే భూచాడే భూమ్ భూమ్ భూమ్ చేస్తాడే
భలేతోడే ఘిలోటోడే బ్లూటూతై ఉంటాడే
భూచాడే భూచాడే భూమ్ భూమ్ భూమ్ చేస్తాడే
బిగిస్తాడే తెగిస్తాడే నీకోసం ఉంటాడే...

భూ...భూచాడే
డిఫెక్టుగాడే భలె డిఫెక్టుగాడే
కనెక్ట్టుగాని అయిపొతే డిస్కనెక్టుకాడే

భూ...భూచాడే...
హొ సాలా సాలా సాలా
నీ చూపే మసాలా
హొ సాలా సాలా సాలా
నీ ఊపే మిస్సైలా
ఓ నిక్కిన చుక్కల నక్కిన కిక్కుల
లెక్కలు ఒక్కలు తేల్చేరా
చిక్కిన చుక్కని చెక్కర ముక్కను
వక్కల చెక్కలు చేసేరా
తూ ఆజారే తూ ఆజారే తూ లేజారే సాలా

భూచాడే భూచాడే భూమ్ భూమ్ చేస్తాడే
భలేతోడే ఘిలోటోడే బ్లూటూతై ఉంటాడే
భూచాడే భూచాడే భూమ్ భూమ్ చేస్తాడే
బిగిస్తాడే తెగిస్తాడే నీకోసంఉంటాడే...

భూచాడే భూచాడే భూమ్ భూమ్ చేస్తాడే
గెలాంటోడే గిలాంటోడే బీకేర్ఫుల్ అంటాడే
హొ..హో భూచోడే
భూచాడే భూచాడే భూమ్ భూమ్ చేస్తాడే
సునామీకే మిలానోడే నోటె తెస్తాడే...
భూచాడే...భూచాడే...భూచాడే...భూచాడే


***** ********* ********* ******


చిత్రం: రేసు గుర్రం (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రెహ్మాన్
గానం: దినేష్ కనగరత్నం, మేఘ

గల గల గల గల గల్లంటు మనసే
గల గల గల గల గాల్లోకి ఎగసే మాయో
ఓ అమ్మాయో
యే ఆగమంటే ఆగిపోదే దాగామంటే దాగిపోదే
ఉన్నచోటే ఉండనీదే నిన్ను వీడి ఉండదె మాయో
ఓ అమ్మాయో
నువ్వంటే పిచ్చి ప్రేమలే
చేతిలోన పట్టినంత చిన్నదైంది లోకమంత
మల్లి నేను పుట్టినంత కొత్తగుంది ఇప్పుడే మాయో
ఓ అమ్మాయో
ఓ అద్ధమల్లె కళ్ళముందు నువ్వు ఉంటె ఇల్లా
నా గుండెలోని వేగమేంతో చెప్పమంటే ఎల్లా
నీ కళ్ళతోటి నన్ను నాకు చూపుతుంటే ఇల్లా
నన్నింకా నేను ఆపలేక ఆపలేక హో ఓ ఓ

గల గల గల గల గల్లంటూ మనసే
గల గల గల గల గాల్లోకి ఎగసే మై లవ్
I want to say my love
నువ్వంటే పిచ్చి ప్రేమలే
ఆగమంటే ఆగిపోదే దాగామంటే దాగిపోదే
ఉన్నచోటే ఉండనీదే నిన్ను వీడి ఉండదె మాయో
ఓ అమ్మాయో

రెక్కలోచినట్టు ఉంది కాళ్ళకే - హేయ్
నేను రెప్పలైన వేయలేను అందుకే - హేయ్
హేయ్ ఎందుకే ఎందుకే నిన్ను పొందినందుకే
నువ్వు చెతికందినందుకే
రంగు పూసినట్టు ఉంది గాలికే - హేయ్
నా శ్వాసలోన నువు చేరినందుకే

I wish i wish i could be with you
for longer longer life along
Don’t break my heart
don’t just leave me all alone alone alone

ఓ అద్ధమల్లె కళ్ళముందు నువ్వు ఉంటే ఇల్లా
నా గుండెలోని వేగమేంతో చెప్పమంటే ఎలా
నీ కళ్ళతోటి నన్ను నాకు చూపుతుంటే ఇల్లా
నన్నింకా నేనే ఆపలేక ఆపలేక హో ఓ ఓ ఓ

గల గల గల గల గల్లంటు మనసే
గల గల గల గల గాల్లోకి ఎగసే మై లవ్
ఐ వన్న సే మై లవ్
నువ్వంటే పిచ్చ ప్రేమలే
గల గల గల గల గల్లంటు మనసే
గల గల గల గల గాల్లోకి ఎగసే మాయో
ఓ అమ్మాయో

నువ్వంటే పిచ్చి ప్రేమలే  నువ్వంటే పిచ్చి ప్రేమలే

సరైనోడు(2016)



చిత్రం: సరైనోడు (2016)
సంగీతం: S. S. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తిక్, విశాల్ దల్డాని


రావమ్మా సుహాసిని రావమ్మా సుభాషిణి
రావమ్మా సులోచనీ రావమ్మా సౌధామిని
దివిలో బంగారు బాలామణి
దిగిరా మబ్బుల మీనాలని
తొణికే సొగసులు చూడాలని
అరవిచ్చిన కన్నులు వన్నెల వెన్నెల పున్నమి గనులవని

చరణం: 1
అతిలోక సుందరి అతిలోక సుందరి తొలిచూపుకే ఇలా మతిపోయేనే మరి
ఉన్న ఒక్క ఊపిరి గుళ్లో గంట మాదిరి కొట్టుకున్నదే
అతిలోక సుందరి అతిలోక సుందరి తొలిచూపుకే ఇలా మతిపోయేనే మరి
ఉన్న ఒక్క ఊపిరి గుళ్లో గంట మాదిరి కొట్టుకున్నదే
కత్తులా కాటుక కళ్ళా అవి
లిప్పులా స్ట్రాబెర్రి పళ్ళాఅవి
అందమే నిన్ను చూసి ఫిదా అయి
నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫ్ కు వెయిటింగ్ చేస్తా ఉంటాదే...!!
అతిలోక సుందరి అతిలోక సుందరి తొలిచూపుకే ఇలా మతిపోయేనే మరి
ఉన్న ఒక్క ఊపిరి గుళ్లో గంట మాదిరి కొట్టుకున్నదే
చరణం: 2
నీలో ఏదో ఇంద్రజాలముందేే
గాలమేసి నన్ను లాగుతుందే
నిన్ను చూసీ గుండెల్లోనా కుంభమేళా జరిగిందే
అమ్మో నీలో ఎన్ని కొత్త కోణాలే
అన్నీ అన్నీ నన్ను గిల్లి గిచ్చే ప్రాణాలే
అల్లాడిపోయేలాగా పంచప్రాణాలే కన్నె మిసైలల్లే దూకావే
కత్తులా కాటుక కళ్ళా అవి
లిప్పులా స్ట్రాబెర్రి పళ్ళాఅవి
అందమే నిన్ను చూసి ఫిదా అయి
నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫ్ కు వెయిటింగ్ చేస్తా ఉంటాదే...!!
అతిలోక సుందరి అతిలోక సుందరి తొలిచూపుకే ఇలా మతిపోయేనే మరి
ఉన్న ఒక్క ఊపిరి గుళ్లో గంట మాదిరి కొట్టుకున్నదే


********  *******   ********

చిత్రం: సరైనోడు (2016)
సంగీతం: S. S. థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: జూబిన్ నటీయల్, సమీరా భరద్వాజ్


సజనా...
తెలుసా తెలుసా ప్రేమించానని
తెలుసా తెలుసా ప్రాణం నువ్వని
రాశా రాశా నీకే ప్రేమని
రాశా రాశా నువ్వే నేనని
దం దం దం దదందం ఆనందమానందం
నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం
దం దం దం దదందం ఆనందమానందం
నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం
నా ఊపిరే నిలిపావురా
నా కళ్ళలో నిలిచావురా
నా ప్రేమనే గెలిచావురా...
మనస్సునే పిలిచావురా
నాలోకమై పోయావురా
వెయ్యేళ్ళు నాతో ఉండరా...
తెలుసా తెలుసా ప్రేమించానని
తెలుసా తెలుసా ప్రాణం నువ్వని
రాశా రాశా నీకే ప్రేమని
రాశా రాశా నువ్వే నేనని
ఏదేదో ఏదో ఏదో ఇదీ
ఏనాడూ నాలో నే లేనిది
నీపైనే ప్రేమయ్యిందే చేలీ...
నా ఊపిరే నిలిపావురా
నాకళ్ళలో నిలిచావురా
నా ప్రేమనే గెలిచావురా...
మనస్సునే పిలిచావురా
నాలోకమై పోయావురా
వెయ్యేళ్ళు నాతో ఉండరా...
ఇన్నాళ్ళు నాకేం లోటో తెలిసిందిరా
ఇకపైన నువ్వాలోటే తీర్చాలిరా
ఇన్నేళ్ళు కన్నీళ్ళెందుకు రాలేదనీ
నువు దూరం అవుతూ ఉంటే తెలిసిందిరా
నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా
చిన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటా
లెక్కలేనంత ప్రేమ తెచ్చి నీపైన గుమ్మరించి
ప్రేమించనా కొత్తగా
మనస్సునే పిలిచావురా
నాలోకమై పోయావురా
వెయ్యేళ్ళు నాతో ఉండరా...
తెలుసా తెలుసా ప్రేమించానని
తెలుసా తెలుసా ప్రాణం నువ్వని
రాశా రాశా నీకే ప్రేమని
రాశా రాశా నువ్వే నేనని


********  *******   ********
చిత్రం: సరైనోడు (2016)
సంగీతం: S. S. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హార్డ్ కౌర్, సోను కక్కర్, బ్రిజేష్ శాండిల్య


Ya, 1 to the 2 to the 3 to the 4
Maare woh entry tho majaye shor
Swagger galore
So Hard Kaur!
Ae sarrainodu aaya hill jaaye floor
యే రంగు రంగు సైకిలెక్కి
టింగు రంగ వచ్చినాడే పిల్లగాడు
యే ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి
ముందు సైడ్ ఎక్కమంటూ పిలిచినాడు
హాయ్ నువ్వు మంచి పిల్లగాడు
కానీ నీ లోపలోడు కంతిరోడు
ఎత్తు పళ్ళ మోస్తే నన్ను
సిత్తు సిత్తు చెయ్యకుండా ఊరుకోడు
సూది గుచ్చినోడే మల్లి నీకు దూది మందు రాస్తడు
ఒక్కసారి వచ్చి చూడు...
హే డుడు డుడు రారా డుడు
నువ్వే నువ్వే నువ్వే నాకు సరైనోడు
హే డుడు డుడు రారా డుడు
నువ్వే నువ్వే నువ్వే నాకు సరైనోడు
యే రంగు రంగు సైకిలెక్కి
టింగు రంగ వచ్చినాడే పిల్లగాడు
యే ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి
ముందు సైడ్ ఎక్కమంటూ పిలిచినాడు
Ya, 1 to the 2 to the 3 to the 4
Maare woh entry tho majaye shor
Swagger galore
So Hard Kaur!
Ae sarrainodu aaya hill jaaye floor
ఏ లెక్కలో చూసిన వెరీ గుడ్డు
ఎట్ట పుట్టేసినావే గ్లామర్ లడ్డు
నీ పక్కనే ఉన్నాది చిట్టూఫండు
పట్టే పాడేసుకోర బుజ్జి పండు
హే మోజు పడ్డది నా మూడు
టచ్ చేసుకుంట అందాల ఐ-పాడ్
మర్చిపోతాలే ఛీ పాడు
ఆటాడమంది నా ఈడు హైలాండ్
ఆడ గుగ్గిలాలు పోసినావే గుండెలోన గుప్పెడు
గుప్పుమంది రాంగ్ సైడ్
హే డుడు డుడు రారా డుడు
నువ్వే నువ్వే నువ్వే నాకు సరైనోడు
హే డుడు డుడు రారా డుడు
నువ్వే నువ్వే నువ్వే నాకు సరైనోడు
Boye boye jaani bami
Lagta mujhko mister charming
Tera sang mein rahun hamesha
Tu hai mera only darling
It don’t matter way we are
Nachenge hum puri raat
You can do it feel the music
Tu hai mera stylish star
నా చేతిలో ఉన్నది పవర్ గ్రిడ్డు
ఇట్టే మంటెక్కిపొద్ది నీలో బ్లడ్డు
లేట్ చెయ్యనే చెయ్యకు ఎసేయ్ రెడ్డు
రోజా చెంపల్లో వుంది కేరంబోర్డు
పక్క నువ్వుంటే వాట్ టు డు
లగెత్తినాది గుండెల్లో లైల్యాండ్
అస్సలే నువ్వు చిలిపోడు
అందాల నిప్పు అంటింది ఇక చూడు
ఓసి పిల్ల నువ్వు చూస్తా ఉంది టీజరేనె ఇప్పుడు
ముందు ముందు బొమ్మ చూడు
హే డుడు డుడు రారా డుడు
నువ్వే నువ్వే నువ్వే నాకు సరైనోడు
హే డుడు డుడు రారా డుడు
నువ్వే నువ్వే నువ్వే నాకు సరైనోడు



********  *******   ********

చిత్రం: సరైనోడు (2016)
సంగీతం: S. S. థమన్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: యమ్.యమ్.మానసి, యమ్.సి.విక్కీ


దిస్ ఈజ్ ద ప్రైవేట్ పార్టీ (2)
నో పాపా లాక్సింగ్ లాక్సింగ్ లాక్సింగ్...
పాపా లాక్సింగ్ చేరలేని సీక్రెట్ లొకేషన్
ప్రైవేట్ పార్టీ ఓన్లీ బై ఇన్విటేషన్
బార్ క్లోజ్ అవుతుందని లేదు టెన్షన్
ఫ్రీ లిక్కర్ ఇస్తారు వితౌట్ లిమిటేషన్
మనం ఆడి ఆడి ఆడి ఆడి కిందా మీదా పడి
మనం పాడి పాడి పాడి పాడి పాడిందే పాడి
హేయ్ హాటి హాటి హాటి హాటి డ్రింకే వెయ్ నా తోటి
లెట్స్ గో ట్రిప్పిన్ ట్రిప్పిన్ ట్రిప్పిన్ ఇన్ మై మజా రాత్రి
హల్లో హౌ డు యూ డు అడిగే వాడే లేడు
చుట్టూ అంతా ఫిరంగ్ నేను దేసి పతంగ్
ఐయామ్ నౌ ఆఫ్ టు డ్యూటీ
వితౌట్ ఐడెంటిటీ చేద్దాం ఏదో ఒకటీ కొంచం గీతే దాటి
ప్రైవేట్ పార్టీ
ప్రైవేట్ పార్టీ
ప్రైవేట్ పార్టీ
దిస్ ఈజ్ ద ప్రైవేట్ పార్టీ (9)
అమేజింగ్ ప్రైవేట్ పార్టీ
మనం ఆడి ఆడి ఆడి ఆడి కిందా మీదా పడి
మనం పాడి పాడి పాడి పాడి పాడిందే పాడి
హేయ్ హాటి హాటి హాటి హాటి డ్రింకే వెయ్ నా తోటి
లెట్స్ గో ట్రిప్పిన్ ట్రిప్పిన్ ట్రిప్పిన్ ఇన్ మై లేటెస్ట్ బుగట్టి
వేదర్ ఏదో చూస్తే ఎంతో బ్రీజీ గా ఉంది
మ్యూజిక్ లో మాజికల్ ట్రాన్సే ఉంది
డిజె ప్లే లిస్ట్  ట్రెండీ గా ఉంది
బ్యాక్ స్టేజ్ తీసుకెళ్లాలనిఉంది
అమేజింగ్ ప్రైవేట్ పార్టీ
చాలా చాలా ఎక్కువగా ఉంది క్రౌడే ఇవ్వాళ నాకే పిచ్చెక్కించేలా ఇదంతా నీవల్ల
అబ్బా ఏం ఉంది గోల ఇంకో షాట్ ఎస్తే పోలా
దిగిపోయే లోపల తర్వాత ఓ లాలా
మనం ఆడి ఆడి ఆడి ఆడి కిందా మీదా పడి
మనం పాడి పాడి పాడి పాడి పాడిందే పాడి
హేయ్ హాటి హాటి హాటి హాటి డ్రింకే వెయ్ నా తోటి
లెట్స్ గో ట్రిప్పిన్ ట్రిప్పిన్ ట్రిప్పిన్ ఇన్ దిస్ ప్రైవేట్ పార్టీ
అమేజింగ్ ప్రైవేట్ పార్టీ
దిస్ ఈజ్ ద ప్రైవేట్ పార్టీ (8)
అమేజింగ్ ప్రైవేట్ పార్టీ
దిస్ ఈజ్ ద ప్రైవేట్ పార్టీ (7)
అమేజింగ్ ప్రైవేట్ పార్టీ
ఫ్రీడం రెక్కలేవో వచ్చి నట్టు చేశావ్ రచ్చే ఈ ఫుల్ నైట్
దాచావ్ బోల్డంత టాలెంట్ ఓపెనప్ అయ్యావు నో డౌటు
దిస్ ఈజ్ ద ప్రైవేట్ పార్టీ


********  *******   ********

చిత్రం: సరైనోడు (2016)
సంగీతం: S. S. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: దనుంజయ్


ఓ ఏ  ఒసినీ ఓర సూపు గుచ్చినావే
పొరగాడ్ని జిందగీని మార్చినావే
బోరబండ బోరులోకి తోసినావే
ఓ ఏ, ఓ ఏ గండిమైసమ్మ లాగ దొరికినావే
గండిపేట చెరువులోన ముంచినావే...
సంపెత్తే సంపెయ్యే
కుమ్మేత్తే కుమ్మేయ్యే
ఐన నను లవ్ సెయ్యె
ఓ MLA నా MLA
సంపెత్తే సంపెయ్యే
కుమ్మేత్తే కుమ్మేయ్యే
ఐన నను లవ్ సెయ్యె
ఓ MLA
ఎసెత్తే ఎసెయ్యె
కోసెత్తే కోసెయ్యె
పర్లేదే ఇటు రాయే
ఓ MLA  నా MLA
MLA అంటే నువ్వు అనుకున్నది ఎంకాదే
MLA అంటే అరె ఇంకో మీనింగుందే
M అంటే మై మై మై మై
L అంటే లౌవ్లీ లౌవ్లీ లౌవ్లీ లౌవ్లీ
A అంటే ఏంజల్ ఏంజల్ ఏంజల్ ఏంజల్
You are my MLA
You are my MLA
You are my MLA
My Lovely Angel
My Lucky Apple
ఓ ఏ  ఒసినీ ఓర సూపు గుచ్చినావే
గండిపేట చెరువులోన ముంచినావే...
ఇన్సాక్కగుందే షేపు
ఇన్సాక్కగుందే చూపూ
ఇన్సాక్కగుందే ఊపు
నచ్చినాదేే నాకు నీ వాపు
జనం లో నువ్వు టాప్
నీ కంటే నేను తోపు
తగ్గించమాకు హైపూ
తగ్గితే వెయ్యలేనే ట్రాపు
ఆ టెక్కు నీకు ఉంటే
ట్రిక్ నాకు వుందే
తిక్క తీర్చుకుందమే
బెట్టు నీకు ఉంటే
పట్టు నాకు వుందే
తెలుసుకోవే MLA
M అంటే మై మై మై మై
L అంటే లౌవ్లీ లౌవ్లీ లౌవ్లీ లౌవ్లీ
A అంటే ఏంజల్ ఏంజల్ ఏంజల్ ఏంజల్
You are my MLA
You are my MLA
You are my MLA
My Lovely Angel
My Lucky Apple
ఓ ఏ  ఒసినీ ఓర సూపు గుచ్చినావే
గండిపేట చెరువులోన ముంచినావే...


********  *******   ********

చిత్రం: సరైనోడు (2016)
సంగీతం: S. S. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శ్రేయ గోషల్, నకాష్ అజీజ్, సింహా, శ్రీకృష్ణ , దీపు


సిలకలూరి... సిలకలూరి...
సిలకలూరి చింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జానీ
వయసు లెక్క సీక్రెట్ గానీ నన్నడగమాక అంటోంది జారే వోణి
ఉన్నఫలం సొగసంతా ఇద్దామని సన్నజాజి పండగలే  చేద్దామని
ఎతికి చూస్తన్నా యాడున్నాడని నా ఫిగర్ ఫుల్ కుష్ అయ్యే పొగరున్నొడ్ని
నేనొచ్చేసా రైయ్ మని సరుకంత ఇయ్యమని రాస్కో నీ లైఫింకా బ్లాక్ బస్టరే...
హే బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే
బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే
హే సిలకలూరి చింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జానీ
వయసు లెక్క సీక్రెట్ గానీ నన్నడగమాక అంటోంది జారే వోణి
ఉన్నఫలం సొగసంతా ఇద్దామని సన్నజాజి పండగలే  చేద్దామని
ఎతికి చూస్తన్నా యాడున్నాడని నా ఫిగర్ ఫుల్ కుష్ అయ్యే పొగరున్నొడ్ని
నేనొచ్చేసా రైయ్ మని సరుకంత ఇయ్యమని రాస్కో నీ లైఫింకా బ్లాక్ బస్టరే...

హే బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే
బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే

హే ఎట్టా పెంచావబ్బయ్య నీ టైటు కండలే
అవి చూస్తా అదిరిపోయే నా కన్నె గుండెలే
హే నువ్వేం చూసావమ్మాయే ఇది ఓన్లీ శాంపిలే
మనలో మేటర్ ఇంకా ఉంది టన్నుల్ టన్నులే
అల్లా టప్పా పిల్లాదాన్ని కాదు మేస్తిరి
నాతో పెట్టుకుంటే నలిగిపోద్ది చొక్కా ఇస్తిరి
ఊపంటేనే ఉలికిపడే పిల్లా బిత్తిరి
నే అడుగు పెడితే అదిరిపోద్ది చీకటి రాత్రి
ఏమైనా నే తయ్యారే లేదంటా సెన్సారే
రాస్కో నీ లైఫింకా బ్లాక్ బస్టరే

హే బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే
బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే