Showing posts with label SV.Ranga rao. Show all posts
Showing posts with label SV.Ranga rao. Show all posts

భక్త ప్రహ్లాద (1967)



చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: సముద్రాల (సీనియర్ )
గానం: పి.సుశీల


జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా!
నా భారము నీవే కదా!

జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
చంపేదెవరూ సమసెదెవరూ..చంపేదెవరూ సమసేదెవరు..
సర్వము నీవే కదా..స్వామీ..సర్వము నీవే కదా స్వామీ..!!

నిన్నేగానీ పరుల నెఱుంగా రావే వరదా
బ్రోవగ రావే వరదా, వరదా!
అని మొరలిడగా.. కరి విభు గాచిన
అని మొరలిడగా.. కరి విభు గాచిన
స్వామివి నీవుండ భయమేలనయ్యా!

హే ప్రభో! .. హే ప్రభో!
లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
కరుణాభరణా.. కమలలోచనా
కరుణాభరణా.. కమలలోచనా
కన్నుల విందువు చేయగా రావే
కన్నుల విందువు చేయగా రావే
ఆశృత భవ బంధ నిర్మూలనా
ఆశృత భవ బంధ నిర్మూలనా!

లక్ష్మీ వల్లభా ....  లక్ష్మీ వల్లభా!

యస్వీఆర్‌...

యస్వీఆర్‌...
వెండితెరపై వేయి వెలుగుల నక్షత్రం!
తెలుగు... తమిళం...
భాష ఏదైనా... అభినయ స్వర సమ్మోహనాస్త్రం!!
పౌరాణికం... జానపదం... చారిత్రకం... సాంఘికం...
జానర్‌ ఏదైనా... జగమెరిగిన మహా స్టార్‌!!
'పాతాళభైరవి'లో ఒక నేపాళ మాంత్రికుడు
'మాయాబజార్‌'లో ఒక ఘటోత్కచుడు
'పాండవ వనవాసం'లో ఒక దుర్యోధనుడు
'సంపూర్ణ రామాయణం'లో ఒక రావణాసురుడు
'బొబ్బిలి యుద్ధం'లో ఒక తాండ్ర పాపారాయుడు
'పండంటి కాపురం'లో ఒక ఇంటి పెద్దన్నయ్య
'లక్ష్మీనివాసం'లో ఒక షావుకారు రంగయ్య
ఒక్క సూర్యుడు... తెరపై తానొక్కక్కటై తోచు!
అన్నీ ఆయనే! తెరపై కనిపిస్తే... అంతా ఆయనే!!
అందుకే... ఆయన జనం మెచ్చిన విశ్వనట చక్రవర్తి!!
'పద్మశ్రీ'లు లేవు... ప్రత్యేక గుర్తింపులూ లేవు...
అయితేనేం... నూరేళ్ళయినా జనం గుండెల్లో ఉన్నాడు!
మరో వెయ్యేళ్ళయినా...
సినిమా ఉన్నంతవరకు ఇలానే ఉంటాడు!!
యస్వీఆర్‌... చిర యశస్వీఆర్‌!!
శతజయంతి వేళ...
ఇది... ఆ అభినయ చక్రవర్తి జ్ఞాపక సుగంధ మాలిక!
సాహో యస్వీఆర్‌! వారెవ్వా... చిర యశస్వీయార్‌!!