Showing posts with label Rashi Kanna. Show all posts
Showing posts with label Rashi Kanna. Show all posts

బెంగాల్ టైగర్ (2015)

చిత్రం: బెంగాల్ టైగర్ (2015)
సంగీతం: భీమ్స్ సెసిరోలె
సాహిత్యం: శ్రీమణి
గానం: విజయ్ ప్రకాష్

చూపులతో దీపాల దేహముతో ధూపాల
చంపయ్యకే నన్ను చంపయ్యకే
నవ్వులతో చెరసాల నడుముతో మధుశాల
చంపయ్యకే నన్ను చంపయ్యకే

ఓ కలముకు అందానికి అక్షరమా
కవితకు తెలపని లక్షణమా
బాపుకే దొరకని బొమ్మవే
బ్రహ్మకే వన్నె తెచ్చిన వెన్నెలమ్మవే

నీ చక్కని చిత్రానికి కాగితాన్ని ఇచ్చుకున్నా
ప్రతి కొమ్మా ప్రతి రెమ్మా  జన్మ ధన్యమే
నీ చక్కని దేహానికి హత్తుకున్న చీర రైక నేసిన
ఆ చేతులది గొప్ప పుణ్యమే
నిధురకు మెళుకువ తెచ్చే  అందం నీవే లేవే
నిన్ను మరవడం అంటే మరణములే

చూపులతో దీపాల దేహముతో ధూపాల
చంపయ్యకే నన్ను చంపయ్యకే

ఏ ఋతువో ఏ రుణమో వేల వేల ఏళ్ల వేచి
ఈ తెలుగు నేలనిలా ఎంచుకుందిలే
ఆ నదులు ఈ సుధలు కోరి కోరి తపసు చేసి
నీ పాదాలకు నడకనిల పంచుకున్నావే
ఏమిటి చంద్రుడు గొప్ప
అది నీ వెలుగే తప్ప
ఇలకే జాబిలివై జారావే

టచ్ చేసి చూడు (2018)


చిత్రం: టచ్ చేసి చూడు (2018)
సంగీతం: ఆశిష్ పండిట్
సాహిత్యం: రెహ్మాన్
గానం: నకాష్ అజిజ్


ఏం జంతర్ మంతర్ చేశావ్
నాపై ఏ మంత్రం వేశావు
అసలేదో మాయే చేశావ్
చూపుల్తోనే చుట్టేశావు
నవ్వుల్తో పడగొట్టేశావు
మాటల్తో మడతెట్టేశావు

ఓయ్ పుష్పా నువ్వేమో కన్నె బంగారం
తాకేవో దుమ్ము దుమారం
హా పంతం పట్టేసి పై పై కొచ్చేసి
తప్పిస్తున్నావే ఆచారం
అపచారం నాపై నీకేంటి అధికారం


ఓయ్ పుష్పా అయిపోయా దాసోహం
పెంచొద్దే ఇంకా వ్యామోహం
కవ్వించే నారి కన్నె గోదారి
ముంచేలా ఉందే యవ్వారం
నీ భారం నాపై నీకేంటి అధికారం

ఏం జంతర్ మంతర్ చేశావ్
నాపై ఏ మంత్రం వేశావు
అసలేదో మాయే చేశావ్
చూపుల్తోనే చుట్టేశావు
నవ్వుల్తో పడగొట్టేశావు
మాటల్తో మడతెట్టేశావు

ఇటు సూడే నీ చెయ్యే తగిలితే
లోలోన పెరిగెను హాయే
అరె హాయే
జర ఆగే ఈ హాయే ముదిరితే
ఆపేటి వీలేలేదు మాయే
పెనుమాయే
నీ గాలి సోకిందంటే ఉయ్యాలూగే ప్రాణం
పొందండి నిన్నే వీడి పోరి
నాన్నిట్టా లాగేస్తుంటే ముద్దొచ్చే నీ రూపం
ఆగేది ఎట్టాగే వయ్యారి

ఓయ్ పుష్పా నీ సైగే మేఘ సందేశం
వచ్చేస్తా దాటి ఆకాశం
ఓ ఓ కైట్ లాగ రాకెట్ లాగ అయ్యావే నువ్వే ఆధారం
ఓ ధారం నాపై నీకేంటి అధికారం


ఏం జంతర్ మంతర్ చేశావ్
నాపై ఏ మంత్రం వేశావు
అసలేదో మాయే చేశావ్
చూపుల్తోనే చుట్టేశావు
నవ్వుల్తో పడగొట్టేశావు
మాటల్తో మడతెట్టేశావు

ప్రతిరోజు పండగే (2019)


చిత్రం : ప్రతిరోజు పండగే (2019)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : కె.కె.
గానం : శ్రీకృష్ణ

మెరిసాడే మెరిసాడే
పసివాడై మెరిసాడే
మురిసాడే మురిసాడే
సరదాలో మునిగాడే
తనవారే వస్తుంటే
అలుపింక మరిచాడే
మనసంతా వెలుగేనా
ఇక చీకటెళ్ళింది
తెల్లారి నీ నవ్వుతోనే

పదిమంది ఉండగా
ప్రతిరోజు పండగే
పడి నవ్వుతుండగా
ప్రతి రోజు పండగే

మెరిసాడే మెరిసాడే
పసివాడై మెరిసాడే
మురిసాడే మురిసాడే
సరదాలో మునిగాడే

గలగల మాటల సడిలో
బరువిక తేలిక పడెలే
ఇరుకుగ మారితె గదులే
చురుకుగ ప్రాణమే కదిలే
మనమంతా కలిసుంటే
కలతున్నా మరిచేనే
మనమంతా వెనకుంటే
మరణాన్నే గెలిచేనే

మిము కలవగా తెగ కలవరం
అసలిది కదా ఒక సంబరం
ఒక వరసలా కదిలిన క్షణం
ఇక తెలియదే ఒంటరితనం

ఎన్నాళ్ళకో రారు కన్నోళ్ళిలా
వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా
ఇల్లంతా మారింది సందళ్ళుగా
మీరంతా ఉండాలి వందేళ్ళిలా

మనవారే వెనకుంటే
మరణాన్నే మరిచేలే
మనసంతా వెలుగేనా
ఇక చీకటెళ్ళింది
తెల్లారి నీ నవ్వుతోనే

పదిమంది ఉండగా
ప్రతిరోజు పండగే
పడి నవ్వుతుండగా
ప్రతిరోజు పండగే


*********** ************* *************
చిత్రం : ప్రతిరోజు పండగే (2019)
సంగీతం : ఎస్.ఎస్.థమన్  
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : విజయ్ ఏసుదాస్ 

చిన్నతనమే చేరరమ్మంటే
ప్రాణం నిన్నవైపే దారితీస్తోందే
అడుగులైతే ఎదరకైనా
నడకమాత్రం వెనకకే
గడిచిపోయిన జ్ఞాపకాలతో
గతము ఎదురౌతున్నదే

చెరిగిపోనేలేదే మరపురానేరాదే
చివరి మలుపున నిలచి పిలిచిన
స్మృతుల చిటికెన వేలు
వదలని చెలిమిగా
ఊహలే ఉప్పొంగుతున్నవిలా
ముగియని కథలతో
మది మేలుకున్నదిలా

తాతగా తలపండినా
తండ్రి తనమే ఎండున
ఒడిని దిగి కొడుకెదిగినా
నాన్న మురిపెము తీరునా 
 వయసు వాలిన సందె వాలున
చేతికందిన ప్రియవరం
మనవడై తన పసితనమ్మును
వెంట తెచ్చిన సంబరం
కొత్త ఊపిరి కాగా
మనసు ఊయలలూగా
తర తరమ్ముల పాటు ఇంకని
వంశ ధారగ మారి కడలిని కలియని
జీవనదిగా పారుతుంది కదా
కంచికి చేరు కథగా ముగిసిపోదు కదా 

*********** ************* *************
చిత్రం : ప్రతిరోజు పండగే (2019)
సంగీతం : ఎస్.ఎస్. థమన్ 
సాహిత్యం : కె.కె.
గానం : సత్య యామిని, మోహన భోగరాజు, హరితేజ

లవ్ యూ అంటూ వెంట పడలేదు
డేటింగ్ అన్న మాటసలే రాదు
హీ ఈస్ సో కూల్..
హీ ఈస్ సో క్యూట్..

ఫేక్ అనిపించే టైపసలే కాదూ
బ్రేకప్ చెప్పే వీలసలు లేదు
హీ ఈస్ సో హాట్
హీ ఈస్ సో క్యూట్

ఏమి తక్కువంట సూడు
టిప్పు టాపుగున్నాడు
టిక్కు టాకులోన చూసి ఫ్లాటయ్యాడు
వన్నా సీ యూ అంటూ 
సెవెన్ సీస్ దాటివచ్చాడు

ల్యాండు అయ్యిఅవ్వగానే 
బ్యాండు ఎంట తెచ్చినాడు
నీ హ్యాండు ఇవ్వమంటు
నీస్ బెండు చెసి
విల్ యూ మ్యారీ మీ అన్నాడు
డు..డు..డు..డు..డు..

ఓ బావా మా అక్కని సక్కగ సుస్తావా
ఓ బావా ఈ సుక్కని పెళ్ళాడేస్తావా
ఓ బావా మా అక్కని సక్కగ సుస్తావా
ఓ బావా సింధూరం నువ్ పెడతావా

మచో మ్యాన్ మా బావా
పేచీలే మానేవా
కటౌటే చూస్తూనే
కట్టింగే ఇస్తావా

హ్యాండ్సమ్మే మా బావా
నీ సొమ్మే అడిగాడా
తానే చేతులు చాపొస్తే
తెగ చీపైపోయాడా

ఓ బావా…. ఓ బావా…

లవ్ యూ అంటూ వెంట పడలేదు
డేటింగ్ అన్న మాటసలే రాదు
హీ ఈస్ సో కూల్
హీ ఈస్ సో క్యూట్

నిదరే పోడు ఏమీ తినడు
నువ్వే కావాలంటాడు
నిన్నే చూసి ప్రతీ రోజుని
శుభముగ ప్రారంభిస్తాడు
తినె పప్పులోన బీరు కలుపుతాడు
తన పప్పి లోన నిన్ను వెతుకుతాడు
నీ పేరే పలికే.. నిన్నే తలిచెనే..
అక్కా నమ్మే.. అతనే జెమ్మే..

మచో మ్యాన్ మా బావా
పేచీలే మానేవా
కటౌటే చూస్తూనే
కట్టింగే ఇస్తావా

హ్యాండ్సమ్మే మా బావా
నీ సొమ్మే అడిగాడా
తానే చేతులు చాపొస్తే
తెగ చీపైపోయాడా

ఓ బావా మా అక్కని సక్కగ సుస్తావా
ఓ బావా ఈ సుక్కని పెళ్ళాడేస్తావా
ఓ బావా మా అక్కని సక్కగ సుస్తావా
ఓ బావా సింధూరం నువ్ పెడతావా

ఊహలు గుసగుసలాడే (2014)

చిత్రం: ఊహలు గుసగుసలాడే (2014)
సంగీతం: కళ్యాణి కోడురి
సాహిత్యం: అనంత్ శ్రీరాం
గానం: కళ్యాణి కోడూరి, సునీత


ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే  ఈ సందడ్లు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది
ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే  ఆనందాలు పెంచింది
నిమిషము నేల మీద నిలువని గాలి లాగ మది నిను చేరుతోందె చిలకా
తనకొక తోడు లాగ వెనకనె సాగుతోంది హృదయము రాసుకున్న లేఖా...

ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే  ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే  ఈ తొందర్లు ఇచ్చింది

వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే
నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళాపి జల్లి ఓ ముగ్గేసి వెళ్లావే
నిదురిక రాదు అన్న నిజముని మోసుకుంటు
మది నిను చేరుతుందె చిలకా
తనకొక తోడు లాగ వెనకనె సాగుతుంది హృదయము రాసుకున్న లేఖా...

వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే

నీ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్ళి కూ అంటూంది విన్నావా
నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా
ఏమౌతున్నా గానీ ఏమైనా ఐపోనీ ఏం ఫరవాలేదన్నావా

అడుగులు వెయ్యలేక అటు ఇటు తేల్చుకోక
సతమతమైన గుండె గనుక
అడిగిన దానికింక బదులిక పంపుతుంది పదములు లేని మౌన లేఖా....
మ్... మ్... మ్... మ్... మ్... మ్...


*********   *********  **********


చిత్రం: ఊహలు గుసగుసలాడే (2014)
సంగీతం: కళ్యాణి కోడురి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హేమచంద్ర

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకో మరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరుగదు మనసీ మాదిరి
ఎందుకంటె ఏమో ఎందుకు అని తెలియక తికమక పడుతున్నది మది

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకో మరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరుగదు మనసీ మాదిరి

కోపగించి బుంగమూతి పెట్టినా నిరాకరించి పళ్ళు నూరి తిట్టినా
మహాద్భుతం అనేట్టుగానె ఉంది అనుకున్నా
ఇదేదో పిచ్చి కదా మరి అనెవ్వరైన అంటె నిజమేనని ఒప్పేసుకుంట
అంతేగాని నీ వెనకనే పడిన మనసుని ఒద్దొద్దు అని నేనేమైన ఆపగలనా

ఊ... ఊ... ఊ...

కత్రిన కరీన అంటు కొంతమంది కోసమే కుర్రాళ్లు అంత కొట్టుకుంటె
లోకమందు ఇన్ని వేల జంటలుండవేమో
నా కళ్లతో చూస్తే సరి నిన్ను మించి మరొకరు లేరని
అంటారు కద ఎవ్వరైన అలా అన్నానని
ఊరంత వచ్చి నిన్నే నా కళ్లతోటి చూస్తానంటె చూడగలనా

ఊ... ఊ... ఊ...

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకో మరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరుగదు మనసీ మాదిరి
ఎందుకంటె ఏమో ఎందుకు అని తెలియక తికమక పడుతున్నది మది

ఊ... ఊ... ఊ...
ఊ... ఊ... ఊ...



**********   **********    *********


చిత్రం: ఊహలు గుసగుసలాడే (2014)
సంగీతం: కళ్యాణి కోడురి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కారుణ్య

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకో మరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరుగదు మనసీ మాదిరి
ఎందుకంటె ఏమో ఎందుకు అని తెలియక తికమక పడుతున్నది మది
వందకంటే ఎన్నో కారణాలను ఒకటొకటొకటిగా వివరిస్తున్నది

యాహు హూ... యాహు హూ... (2)

కోపగించి బుంగమూతి పెట్టినా నిరాకరించి పళ్ళు నూరి తిట్టినా
మహాద్భుతం అనేట్టుగానె ఉంది అనుకున్నా
ఇదేదో పిచ్చి కదా మరి అనెవ్వరైన అంటె నిజమేనని
ఒప్పేసుకుంట అంతేగాని
తన వెనకనే పడిన మనసుని ఒద్దొద్దు అని నేనేమైన ఆపగలనా
ఆ పిచ్చి బాగుందని మరింత పెంచుకొని
ఇలాగే వుండిపోతానంటే తప్పైన ఒప్పైన గాని

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకో మరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరుగదు మనసీ మాదిరి

కత్రిన కరీన అంటు కొంతమంది కోసమే కుర్రాళ్లు అంత కొట్టుకుంటె
లోకమందు ఇన్ని వేల జంటలుండవేమో
నా కళ్లతోటి చూస్తే సరి తనను మించి మరొకరు లేరని
అంటారు కద ఎవ్వరైన అలా అన్నానని ఊరంత వచ్చి తనని
నా కళ్లతోటి చూస్తానంటె చూడగలనా
నువు నాకే సొంతమని తనతోనే చెప్పాలని అనుకోడం కానీ పైకెనాడు అనలేకపోతున్నా కదా

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకో మరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరగదు మనసీ మాదిరి

యాహు హూ... యాహు హూ... (3)


*********   *********  **********


చిత్రం: ఊహలు గుసగుసలాడే (2014)
సంగీతం: కళ్యాణి కోడురి
సాహిత్యం: అనంత్ శ్రీరాం
గానం: దీపు, శ్రావణి

ఏమిటీ హడావిడి యెదల్లోనా
ఎందుకీ హరీబరి నరాల్లోనా
లోపలి తుఫానిలా షురూ ఐనా
చప్పుడే ఉండదే పైపైనా

ఏమిటీ హడావిడి యెదల్లోనా
ఎందుకీ హరీబరి నరాల్లోనా
లోపలి తుఫానిలా షురూ ఐనా
చప్పుడే ఉండదే పైపైనా

ఓ సమస్యని అనేంత సీనున్నదా దీనికి
ఈ అవస్థని భరిస్తూ దాచేయడం దేనికి
అలా అలా నువ్వెంత తాకిన పరాకులో మరేమీ చేసినా
సరేనని సరాసరి సరెండరవుతుంది ఈ సిగ్గు మైకంలో మౌనంగా

ఏమిటీ హడావిడి యెదల్లోనా
ఎందుకీ హరీబరి నరాల్లోనా
లోపలి తుఫానిలా షురూ ఐనా
చప్పుడే ఉండదే పైపైనా

ఈ హుషారులో రివర్స్ గేరేసినా ముందుకే
ఈ మాజాలలో అదర్స్ చీ కొట్టినా లైట్ లే
ఇదే ఇదే రొమాన్స్ పద్దతి ఇవాలిలా గ్రహించ మన్నది
వయస్సులో లభించిన వరాన్ని వేస్టవ్వనీకండి కవ్వించే ఇబ్బంది

ఏమిటీ హడావిడి యెదల్లోనా
ఎందుకీ హరీబరి నరాల్లోనా
లోపలి తుఫానిలా షురూ ఐనా
చప్పుడే ఉండదే పైపైనా

ఏమిటీ హడావిడి యెదల్లోనా
ఎందుకీ హరీబరి నరాల్లోనా
లోపలి తుఫానిలా షురూ ఐనా
చప్పుడే ఉండదే పైపైనా

జోరు (2014)



చిత్రం: జోరు (2014)
సంగీతం: భీమస్ సెసిరోలె
సాహిత్యం: భీమస్ సెసిరోలె
గానం: శ్రేయఘోషల్

అరె ఉన్నా కనుపాపకు చూపులు ఉన్నా
కనురెప్పల మాటున ఉన్నా
తన చప్పుడు నీదేనా
చూస్తున్నా పెదవులపై నవ్వులు ఉన్నా
పెదవంచున చిగురిస్తున్నా అవి ఇప్పుడు నీవేనా
నిజమేనా దూరంగా గమనిస్తున్నా
తీరానికి కదిలొస్తున్నా నా పరుగులు నీవేనా హా
అనుకున్నా ఊహలకే రెక్కలు ఉన్నా
ఊపిరిలో ఊగిసలున్నా నా ఆశలు నీవేనా హ హా

పూవులకు రంగేయేల చుక్కలకు మెరుపేయేల
గాలినే చుట్టేయల తేలిపోనా
పూవులకు రంగేయేల చుక్కలకు మెరుపేయేల
గాలినే చుట్టేయేల తేలిపోనా హాయిలోన

హో ప్రపంచాన్ని నేను ఇలా చూడలేదు
సమస్తాన్ని నేనై నీతో ఉండనా
సంతోషాన్ని నేను ఎలా దాచుకోనా
సరాగాల నావై సమీపించనా
నా చిన్ని చిన్ని చిట్టి చిట్టి మాటలన్ని మూటగట్టి ఇవ్వాలి
నా బుల్లి బుల్లి అడుగులు అల్లిబిల్లి దారులన్ని దాటేల
నేనింక నీ దాన్ని అయ్యేలా...

పూవులకు రంగేయేల చుక్కలకు మెరుపేయేల
గాలినే చుట్టేయేల తేలిపోనా..

హో మరోజన్మ ఉంటే నిన్నే కోరుకుంటా
మళ్ళీ మళ్ళీ నీకై ముస్తాబవ్వనా
నిన్నే చూసుకుంటూ నన్నే చేరుకుంటా
నీలో దాచుకుంటూ నన్నే చూడనా
మన పరిచయం ఒక్కటే
పరిపరి విధములు లాలించే
ఆ పరిణయమెపుడని
మనసిపుడిపుడే ఊరించే
చేయి చేయి కలపమని

పూవులకు రంగేయేల చుక్కలకు మెరుపేయేల
గాలినే చుట్టేయేల తేలిపోనా హా
పూవులకు రంగేయేల చుక్కలకు మెరుపేయేల
గాలినే చుట్టేయేల తేలిపోనా హాయిలోన

జిల్ (2015)

చిత్రం: జిల్ (2015)
సంగీతం: గిబ్రాన్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: క్లింటన్ సెరిజో, అర్మాన్ హాసన్

ఏమైంది ఈ వేళ నే పుట్టాన ఇంకోల
చూస్తున్నా అన్నీ కొత్తగా నేడిలా
నీతో పాటుండేలా ఈ లైఫంతా ఇదేలా
వచ్చిందే రేపే నేడిలా ముందుగా
ఇపుడే తిరే ఈ కలలే కన్నా
చల్ చలే చలి చలో చలే
నిజమైపోయే ఊహలలో ఉన్నా
చల్ చలే చలి చలో చలే

Don't let go because now is the moment Everyday would be just you and me
Don't let go because you are in my soul And my imagination is wild and free

ఈ నిమిషం ఏంటో కదలక ఆగే..
ఆ ఊహలు మాత్రం పరుగులు తీసే
ఏదేమైనా నీ వెంటే నేనుంటా
నీ శ్వాసలాగా మారి
నీతో ఉంటే నాకేమి కాదంటా
నా ఊపిరింక నీది

Don't let go because now is the moment Everyday would be just you and me
Don't let go because you are in my soul And my imagination is wild and free

ఏమైంది ఈ వేళ నే పుట్టాన ఇంకోల
చూస్తున్నా అన్నీ కొత్తగా నేడిలా
నీతో పాటుండేలా ఈ లైఫంతా ఇదేలా
వచ్చిందే రేపే నేడిలా ముందుగా
ఇపుడే తిరే ఈ కలలే కన్నా
చల్ చలే చలి చలో చలే
నిజమైపోయే ఊహలలో ఉన్నా
చల్ చలే చలి చలో చలే

Don't let go because now is the moment Everyday would be just you and me
Don't let go because you are in my soul And my imagination is wild and free

శ్రీనివాస కళ్యాణం (2018)

చిత్రం: శ్రీనివాస కళ్యాణం (2018)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: శ్రీమణి
గానం: ఎస్. పి.బాలసుబ్రహ్మణ్యం


కళ్యాణం వైభోగం
ఆనంద రాగాల శుభయోగం (2)

రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ
వరమాలకై వేచు సమయాన
శివధనువు విరిచాకే వధువుమధి గెలిచాకే
మోగింది కళ్యాణ శుభవీణ

కళ్యాణం వైభోగం
శ్రీరామ చంద్రుని కళ్యాణం

అపరంజి తరుణి అందాల రమణి
వినగానే కృష్ణయ్య గీతామృతం
గుడిదాటి కదిలింది తనవెంట నడిచింది
గెలిచింది రుక్మిణి ప్రేమాయణం

కళ్యాణం వైభోగం
ఆనంద కృష్ణుని కళ్యాణం

పసిడి కాంతుల్లో పద్మావతమ్మ
పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ
విరి వలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే
కళ్యాణ కలలొలికినాడమ్మ
ఆకాశ రాజునకు సరితూగు సిరికొరకు
ఋణమైన వెనుకాడలేదమ్మా

కళ్యాణం వైభోగం
శ్రీ శ్రీనివాసుని కళ్యాణం

వేద మంత్రం అగ్ని సాక్ష్యం
జరిపించు ఉత్సవాన
పసుపు కుంకాలు పంచ భూతాలు
కొలువైన మండపాన
వరుడంటు వధువంటు ఆ బ్రహ్మముడి వేసి
జతకలుపు తంతే ఇది
స్త్రీ పురుష సంసార సాగరపు మధనాన్ని సాగించమంటున్నది
జన్మంటు పొంది జన్మివ్వలేని
మనుజునకు సార్ధక్యముండదు కదా
మనుగడను నడిపించు కళ్యాణమును మించి
ఈ లోక కళ్యాణమే లేదుగా

కళ్యాణం వైభోగం
ఆనంద రాగాల శుభయోగం

భీష్మ (2020)


సినిమా: భీష్మ (2020)
దర్శకుడు: వెంకీ కుడుముల
గానం: అనురాగ్ కులకర్ణి
సంగీతం: మహతి స్వర సాగర్
సాహిత్యం: శ్రీమణి

హై క్లాసు నుంచి లో క్లాసు దాక నా క్రశ్శులే
వందల్లో ఉన్నారులే… ఒక్కల్లూ సెట్టవ్వలే.
కిస్సింగు కోసం హగ్గింగు కోసం వెయిటింగులే
పాపెనకే జాగింగులే… లైఫ్ అంతా బెగ్గింగులే.

ఎన్నాలిలా ఈ ఒంటరి బతుకే నాకిలా
బాయ్ ఫ్రెండులా నన్ను మార్చదే ఏ పిల్లా
ఏం చేసినా నా స్టేటస్ సింగిల్ మారదా
నా వైపిలా చూడదు ఏ సిండ్రెల్లా
హోయ్ సింగిలే ఐయామ్ రడీ టు మింగిలే…
లైఫ్ కి లేవే రంగులే… నువ్ పడవా పాపా.

హోయ్ జంటలే నా కంట పడితే మెంటలే..
ఒల్లంత జలసి మంటలే.. చల్లార్చెయ్ పాపా.
ఓ ప్రెట్టీ ప్రెట్టీ గర్ల్.. ఒ ఒ ఒ ఓ న న న న
యూ ఆర్ సో బ్యూటిఫుల్.. ఒ ఒ ఒ ఓ న న న న
మ మ మ సస్సి గర్ల్… ఒ ఒ ఒ ఓ న న న న
యూ మేక్ మై లైఫ్ బ్యూటిఫుల్.. ఒ ఒ ఒ
ఎందుకో ఏమో ఒంటరై ఉన్నానిలా…
ఎదురుపడదేమో నా అందాల దేవత.
జాలి చూపేనా కాలమే నాపై ఇలా…
ఏమి తలరాతో నాకర్మ కాలిందిలా..
అయ్యయ్యో సింగిలే ఐయామ్ రడీ టు మింగిలే…
లైఫ్ కి లేవే రంగులే… నువ్ పడవా పాపా.

హోయ్ జంటలే నాకంట పడితే మెంటలే..
ఒల్లంత జలసి మంటలే.. చల్లార్చెయ్ పాపా.

**** **** **** ****

సినిమా: భీష్మ (2020)
దర్శకుడు: వెంకీ కుడుముల
గానం: అనురాగ్ కులకర్ణి
సంగీతం: మహతి స్వర సాగర్
సాహిత్యం: శ్రీ మణి

నా కలలే.. నీ రూపం లో
ఎదురయ్యే నిజామా మాయ..
ఏవేవో ఊహలు నాలో మొదలయ్యే…
నా మనసే నింగిని దాటి ఎగిరెనులే
నిజమా మాయా… ఈ క్షణమే
అద్భుతమేదో జరిగెనులే..

ఏదో ఏదో చెప్పాలనిపిస్తుందే..
నువ్వే నువ్వే కావాలనిపిస్తుందే…
ఇంకా ఏదో అడగాలనిపిస్తుందే…
నీతో రోజూ ఉండాలనిపిస్తుందే..
ఓ.. నాలోనే నవ్వుకుంటున్నా…
నాతోనే ఉండనంటున్న…
నాకే నే కొత్తగా ఉన్నా..
నీ వల్లే… నీ వల్లే…

ఓ.. నీ వెంటే నీడనౌతానే…
నువ్వుండే జాడనౌతానే…
నువ్వుంటే చాలనిపించే…
మాయేదో చాల్లేవే…
సరా సరి గుండెల్లో దించావే..
మరీ మరీ మైకంలో ముంచావే… ఓ.
అయినా సరే ఈ భాద బాగుందే..
అనుకోనిదే  మనిరువురి పరిచయం…
ఓహో జతపడని.. మనకిలా రాసుందే..
మతి చెడి ఇలా.. నీ వెనకే తిరగడం…
హుమ్.. అలవాటుగా నాకెలా మారిందే…
ఆగలేని తొందరేదో.. నన్ను తోసే నీ వైపిలా..
ఆపలేని వేగమేదో నాలోపలా….

ఇంత కాలం నాకు నాతో…
ఇంత గొడవే రాలేదిలా..
నిన్ను కలిసే రోజు వరకు..
ఏ రోజిలా.. లేనే ఇలా..
సరా సరి గుండెల్లో దించావే..
మరీ మరీ మైకంలో ముంచావే… ఓ.
అయినా సరే ఈ భాద బాగుందే..

**** **** **** ****

సినిమా: భీష్మ (2020)
దర్శకుడు: వెంకీ కుడుములు
గానం: నకాష్ అజిజ్
సంగీతం: మహతి స్వర సాగర్
సాహిత్యం: శ్రీమణి

హో ఆయ్ ఆయ్ యె
హో ఆయ్ ఆయ్ యె హో
నీ నవ్వేమో సూపర్ క్యూటే
నీ వైట్ చున్నీ సూపర్ క్యూటే
ఓ లుక్కు తోటి పెంచావే నాలో హార్ట్ బీటే
నీ నడకెంతో సూపర్ క్యూటే
నీ అవుట్ లుక్కే సూపర్ క్యూటే
నా కళ్ళకే నువ్వు మిస్ వరల్డ్ కన్నా అప్డేటే
సునామి లాగా పిల్ల అందాలె ఇళ్ల
ఆళ్లేస్తే ఎల్లా నా దిళ్లు ఫట్టే
ఓరచూపు వాల పడేస్తే
అలా పడుంటా నీలా.. నీ కాలి వెంటే
నువ్వు ఒప్పుకుంటే పిల్ల
నువ్వు నేనిల్లా లవ్వాడేసి ఇల్లా నా లైఫ్ సెట్టే
ఆ కస్సుమంటే ఎల్లా..
కోపంలో కూడా అంత అందమేంటే…
నా మాటే వినవేంటే

హో ఆయ్ ఆయ్ యె
మన జంటే సూపర్ క్యూటే
హో ఆయ్ ఆయ్ యె
హో ఆయ్ ఆయ్ యె
నీ కోసం ఎంత చేసిన
నా లైఫె రాసి ఇచ్చినా
కాస్తయినా కనికరించవే ఓ పిసినారి..
నువ్వెంతో వెతికి చూసినా,
లోకాలు జల్లెడేసిన
నాలాంటి వాడే దొరకడే ఓ సుకుమారి..

నీతో ఉండే ఫీలింగే సూపరే
నాతో కొంచెం ప్లేయింగే ఆపెయ్యవే
నాటి బ్యూటీ టార్చరే పెట్టకే
ఇలా మన ఫ్యూచర్ని సెట్ చెయ్యవే..
నా మాటే వినవేంటే
మన జంటే సూపర్ క్యూటే


సినిమా: భీష్మ (2020)
దర్శకుడు: వెంకీ కుడుముల
గానం: ధనుంజయ్, అమలా చేబోలు
సంగీతం: మహతి స్వర సాగర్
సాహిత్యం: కాసర్ల శ్యామ్

ఏ వాట్టే వాట్టే వాట్టే బ్యూటి..
నువ్వు యాడ ఉంటే ఆన్నే ఊటీ..
ఏ వాట్టే వాట్టే వాట్టే బ్యూటి
నువ్వు యాడ ఉంటే ఆన్నే ఊటీ..
తిప్పూతుంటే నడుమే నాటి
నా కండ్లే చేసె కంత్రీ డ్యూటి..

నువ్వు దగ్గరి కొస్తాంటే …. సల్లగ సలి పెడతాందే..
దూరమెల్లి పోతంటే… మస్త్ ఉడక పోస్తుందే.. దే..
టైటు హగ్గిచ్చి… టాటూలా అంటుకోరాదే…
ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారూ…
అమ్మ అయ్య ఇంట్లో ఎవరూ లేరు..దేసి..
ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్..

తెరిచుంచేనే పోరి ఫ్రంటు డోరు..
సూడకె సిట్టి… మంటలు పుట్టి..
ఫైర్ ఇంజిన్ తిరుగుతందే గంటలు కొట్టి..
రైల్ ఇంజిన్ లా కూతలు పెట్టీ..
టైమంతా గడిపెయ్యకు మాటల తోట్టీ..
ఎండల్లో నువ్ తిరగొద్దే… సూర్యునికే చమటట్టిద్దే..
ఇంతందాన్నే దాచొద్దే… ఇన్కమ్ ట్యాక్స్ అయిపోద్దే..

ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారూ…
అమ్మ అయ్య ఇంట్లో ఎవరూ లేరు..దేసి..
ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్..
తెరిచుంచేనే పోరి ఫ్రంటు డోరు..

ఆ… నువ్ కూసున్న ఏ సీటైనా..
స్వర్గానికి డైరెక్ట్ గా అది ఫ్లైటెనా..
ఇన్నాల్లుగా సింగిల్గున్నా…
నీ ఫోటోకే… నేను ఫ్రేమై పోనా..
నువ్ కాలు మోపిన చోటే.. ఈ భూమికి బ్యూటీ స్పాటే..
ఫారన్లో నువ్ పుట్టుంటే.. తెల్లోలంతా డక్కౌటే…

ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారూ…
అమ్మ అయ్య ఇంట్లో ఎవరూ లేరు..దేసి..
ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్..
తెరిచుంచేనే పోరి ఫ్రంటు డోరు..

**** **** **** ****

తొలిప్రేమ (2018)


చిత్రం: తొలిప్రేమ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: అర్మాన్ మాలిక్ , యస్.యస్.థమన్


నిన్నిలా నిన్నిలా చూసానే
కళ్ళలో కళ్ళలో దాచానే
రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే

నిన్నిలా నిన్నిలా చూసానే
అడుగులే తడబడే నీవల్లే
గుండెలో వినపడిందిగా ప్రేమ చప్పదే

నిన్ను చేరి పోయే నా ప్రాణం
కోరేనేమో నిన్నే ఈ హృదయం
నా ముందుందే అందం నాలో ఆనందం
నన్ను నేను మరచిపోయేలా ఈ క్షణం

ఈ వర్షానికి స్పర్శవుంటే నీ మనసే తాకెనుగా
ఈ ఎదలో నీ పేరే పలికెనే ఇవాళే ఇలా (2)

తొలి తొలి ప్రేమ దాచేయికల
చిరు చిరు నవ్వే ఆపేయకీలా
చలి చలి గాలి వీచేంతలా
మరి మరి నన్నే చేరేంతలా

నిన్ను నీ నుంచి నువ్వు బైటకు రానివ్వు
మబ్బు తెరలు తెంచుకున్న జాబిలమ్మలా


ఈ వర్షానికి స్పర్శవుంటే నీ మనసే తాకెనుగా
ఈ ఎదలో నీ పేరే పలికెనే ఇవాళే ఇలా (2)


*******  *******   *******


చిత్రం: తొలిప్రేమ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: అర్మాన్ మాలిక్, దేవన్ ఏకాంబరన్

లవ్లీ లవ్లీ మెలొడీ ఏదొ మదిలో బట్టర్.ఫ్లై చేసా
ఎన్నో ఎన్నో రోజులు వేచిన నిమిషలో అడుగేసా
కాలాన్నే కాలాన్నే ఆపేసా ఆపేసా
ఆకాసాన్నే దాటేశా

విన్నాన్నే విన్నాన్నే నీ పెదవే చెబుతుంటె విన్నానే
ఉన్నానే ఉన్నానే తొలి ప్రేమై నీలోనె ఉన్నన్నే
నీ ఎదలో ఎదలో పుట్టేసింద ప్రేమ నా పైనా
నా మనసే మనసే కనిపించిందా కాస్త లేటయినా
నీ వెనకే వెనకే వచ్చేస్తున్న దూరమెంతున్నా
మరి ఎపుడీ ఎపుడీ రోజు వస్తుందని వేచి చూస్తున్నా
అరె ఎందరున్న అందమైన మాటె నాకు చెప్పెశావుగా
అరె వంద చంద మామలున్న చోటుల్లోకె నెట్టెశావుగా

విన్నాన్నే విన్నాన్నే నీ పెదవే చెబుతుంటె విన్నానే
ఉన్నానే ఉన్నానే తొలి ప్రేమై నీలోనె ఉన్నన్నే

నీ పలుకే వింటు తేనెలనే మరిచాలే
నీ అలకే కంటు ఆకలినే విడిచాలే
నీ నిద్దుర కోసం కలల తెరే తెరిచాలే
నీ మెలుకువ కోసం వెలుతురునే పరిచాలే
నువ్ మెరిసే మెరిసే హరివిల్లే నీ రంగు నేంటా
నువ్ కురిసే కురిసే వెన్నెలవే నీ రేయి నేనవుతా
నా పేరె పిలిచే అవసరమైనా నీకు రాదంటా
కన్నీరే తుడిచే వేలు నేనై నీకు తోడుంటా

అరె ఎందరున్న అందమైన మాటె నాకు చెప్పెశావుగా
అరె వంద చంద మామలున్న చోటుల్లోకె నెట్టెశావుగా

విన్నాన్నే విన్నాన్నే నీ పెదవే చెబుతుంటె విన్నానే
ఉన్నానే ఉన్నానే తొలి ప్రేమై నీలోనె ఉన్నన్నే


*******  *******   *******


చిత్రం: తొలిప్రేమ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: రాహుల్ నంబియర్

సునోనా సునైనా నీ హైపెర్ హార్టె నేనె కొల్ల గొట్టనా
సునోనా సునైనా నా వెంటె నువ్వె వచ్చే లాగ చెయ్యనా
నీ ట్రింకిల్ ట్రింకిల్ తారలకి లింక్ అవ్వనా
నీ సింగిల్ సింగిల్ మనసుతో మింగిల్ అవనా
నీ సింపుల్ సింపుల్ లైఫులో వండర్ అవనా
సునైనా నీతో రానా

సునోనా సునైనా నీ హైపెర్ హార్టె నేనె కొల్ల గొట్టనా
సునోనా సునైనా నా వెంటె నువ్వె వచ్చే లాగ చెయ్యనా

ఈ ఆగే పోతె మల్లి రాదె నువ్వేం చేసినా
ఇది ఓపెన్ చేసి బోటిల్ బేబి కాలి చేసెయనా
ఓ లవ్లి లేడి నువ్వే ఎంత మారం చేసినా
మన ఇద్దరి మద్య లందన్ బ్రిడ్జె నేనె దాటెయ్ నా
నాలో సరిగమ నీలో పదనిస కలపవ నువ్ పలకవా
ఆతో పాటిఉగ నాతో మాటగ మారవ నువ్ పాడవా

నీ ట్రింకిల్ ట్రింకిల్ తారలకి లింక్ అవ్వనా
నీ సింగిల్ సింగిల్ మనసుతో మింగిల్ అవనా
నీ సింపుల్ సింపుల్ లైఫులో వండర్ అవనా
సునైనా నీతో రానా


*******  *******   *******


చిత్రం: తొలిప్రేమ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: రఘు దీక్షిత్

Break the rules break the rules
Just break the rules prgaress లో దూసుకెల్లి పోరా
Make the rules make the rules
Lets make the rules మనము కోరుకుంటె దొరికె చల్ రా
సోడియ రేడియ రోడియ హీలియం బేరియం తోరియం ఉంది ఫార్ములా
ఫార్ములా...ఫార్ములా...ఫార్ములా
మన పాటల్లొ లిరిక్స్ మాటల్లొ ఎతిక్స్ గుండెల్లొ ఫ్రీడంకి లేదు ఫార్ములా
ఫార్ములా...ఫార్ములా...ఫార్ములా
క్షణాల జిందగీలో no compromise అనేలా
మన విరగ బరువు తిరగ మరగ కురగ లేని గోలా

Break the rules break the rules
Just break the rules prgaress లో దూసుకెల్లి పోరా
Make the rules make the rules
Lets make the rules మనము కోరుకుంటె దొరికె చల్ రా

మోహన మురలిని వలచిన వాడూ
తియ్య రాధని పిలిచిన వాడూ
కమ్మని వేలల కురిసిన ఆడు
పరిమల వనమున ప్రియమగు వాడు
చిన్ని కృష్నుడు మా చేతికందాడు
చిలిపి కృష్నుడు మా మనసు వదలడు
చిన్ని కృష్నుడు మా చేతికందాడు
చిలిపి కృష్నుడు మా మనసు వదలడు
హరే హరే మురారే...హరే హరే మురారే
హరే హరే మురారే...హరే హరే మురారే
హరే హరే మురారే...హరే హరే మురారే

క్లాసు రూంలో బెంచీకే అతుక్కు పోకురా
రెక్కలే విప్పి చూడరా
ఓ ర్యాంకు కోసం పోటినే కాసేపు ఆపరా
రొమాన్సుకీ స్పేసు ఇవ్వరా
తీయ్ పరదా...చేయ్ సరదా
వెలిగి పోదా కలల పరదా
ఆ ఫైరుకి లైఫుకి నీరుకి జోరుకి స్పీడుకి ఉందొక ఫార్ములా
మనలో పొగరు జిగురు వగరు లేదంట ఫార్ములా
యుగాల యువతరంలో సరైన హిష్టరీలా
మన విరగ బరువు తిరగ మరగ కురగ లేని గోలా

Break the rules break the rules
Just break the rules prgaress లో దూసుకెల్లి పోరా
Make the rules make the rules
Lets make the rules మనము కోరుకుంటె దొరికె చల్ రా

శివమ్ (2015)

చిత్రం: శివమ్ (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: నరేంద్ర
నటీనటులు: రామ్ పోతినేని,  రాశీఖన్నా
దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి
నిర్మాత: స్రవంతి రవికిషోర్
విడుదల తేది: 02.10.2015

కాలేజీబుల్లెమ్మో... రంగూ రంగుల రబ్బరుబొమ్మో
టీనేజీ గుండెల్నీ.. రంగులరాట్నం తిప్పొద్దమ్మో
బుజ్జమ్మో బుజ్జమ్మో బూరెబుగ్గల బంగారమ్మో
ఈ ఏజి పోతేరాదూ ఎక్కువ ఆలోచించొద్దమ్మో
నీ హార్ట్ ని లాకర్లో భద్రంగా దాచావే
నా హార్ట్ ని నవ్వుల్తో శుభ్రంగా దోచావే
నువ్వేమో ఏసీలో గురకెట్టీ బజ్జుంటే
నేనేమో గూర్ఖాలా తెలిగేసీ ఉండాలా
ప్రేమ అనే ఒక పిచ్చీ.. నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
ప్రేమ అనే ఒక పిచ్చీ.. నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ

Highway లో నేనెళ్తుంటే యూ-టర్నే కొట్టించావే
నాదారి మళ్ళించావే పిల్లా.. నీ అందం తోటి

ఆహా నువ్వే నా వైఫు,నీతో వందేళ్ళ లైఫు సెట్టయ్యిందనుకున్నానే పిల్లా
Dry day లో బీరల్లే లక్కీగా దొరికావే
తాగేద్దామనుకుంటే చేజారీపోయావే
Winter లో mango లా నోరే ఊరించావే
పెరుగన్నం కలిపేలోగా మాయం అయ్యావే
ప్రేమ అనే ఒక పిచ్చీ.. నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
ప్రేమ అనే ఒక పిచ్చీ.. నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ

బోల్డన్నీగిఫ్ట్లివ్వాలీ.. రీ ఛార్జులు చేయించాలీ

అడిగిందీ కొనిపెడితేనే లవ్వు పుడుతుందనుకున్నా
ఏదో నా టైం బాగుండి ఏమీ శ్రమపడకుండానే ఏంజిల్ లా దొరికేశావే నువ్వూ
I love you చెప్పేసీ who are youఅంటావే
Welcome బోర్డ్ పీకేసీ no entry పెడతావే
కైటల్లే గాల్లోకీ నన్నేమో ఎగరేసీ
కనికరమే లేకుండా దారం తెంచావే
ప్రేమ అనే ఒక పిచ్చీ.. నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
ప్రేమ అనే ఒక పిచ్చీ.. నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ



********   *********   ********


చిత్రం: శివమ్ (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: హరిచరణ్ , యమ్.యమ్. మానసి

గుండె ఆగిపోతాందె..ఒళ్ళు కాగిపోతాందే
అస్తమాను పెదవినట్ట కొరకామాకే
ఇస్తరాకు నడుమునిట్ట తిప్పామాకే
తామరాకులాంటి వయసు చూపామాకే
గుండె ఆగిపోతాందె..ఒళ్ళు కాగిపోతాందే
గళ్ళలుంగి పైకి ఎత్తికట్టామాకూ
కళ్ళజోడు దించి కన్ను కొట్టామాకూ
కందిరీగ లాంటి చూపు చుట్టామాకూ
గుండె ఆగిపోతాందె..ఒళ్ళు కాగిపోతాందే
నీ సిగ్గుల్తోటి సూరేకారం దంచామాకే
నీ మాటల్తోటి ఉప్పూకారం జల్లామాకే
గుండె ఆగిపోతాందె..ఒళ్ళు కాగిపోతాందే
గుండె ఆగిపోతాందె..ఒళ్ళు కాగిపోతాందే

చక్కెర ఎందుకే.. పెదవులు ఉండగా
అత్తరు ఎందుకే.. నీ సొగసే ఉండగా
దుప్పటి ఎందుకూ.. కౌగిలి ఉండగా
తలగడ.. దండగ.. ఒడిదుడుకుండగా
కేజీ నువు ముస్తాబయ్యీ.. అరకేజీ అప్పుగ ఇస్తే
రోజూ రుచిమరిగీ మరిగీ.. ప్రతి రోజూ ఇమ్మని గోలెడితే

గుండె ఆగిపోతాందె.. ఒళ్ళు కాగిపోతాందే
గుండె ఆగిపోతాందె.. ఒళ్ళు కాగిపోతాందే

తక్కెడ ఎందుకే.. తైతక్కుండగా
కత్తెర ఎందుకే.. నీ చూపే ఉండగా
దుద్దులు ఎందుకూ.. ముద్దులు వుండగా
గుటకలు దండగా.. కితకితలుండగా
బేబీ నీ బుగ్గలు పిండీ.. జిలేబీ వేస్తావుంటే
బాబోయ్ నీ చేతులు పడీ.. అయ్ బాబోయ్ చుక్కలు చూపెడితే
గుండె ఆగిపోతాందె.. ఒళ్ళు కాగిపోతాందే
గుండె ఆగిపోతాందె.. ఒళ్ళు కాగిపోతాందే


*******   *******   *******


చిత్రం: శివమ్ (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సాగర్ , హరిప్రియ

Hey girl hey girl wanna say something
Will you listen to me now
Hey boy hey boy a wanna be a thing
Tell me all that you wanna say now

అందమైనలోకం అందులోన నువ్వు అద్భుతం
అందుకేగ నిన్నే ..కోరుకుంది చిన్ని ప్రాణం
అందమైన భావం.. అందులో నువు మొదటి అక్షరం
అందుకేగ నీతో ..సాగుతోంది చిన్ని పాదం
ఓ చెలీ అనార్కలీ.. నీ నవ్వులే దీపావళీ
పేరుకే నేనున్నదీ.. నా ఊపిరే నువ్వేమరీ
చందమామనెవ్వరైన పట్టపగలు చూడగలర నిన్ను నేను చూసినట్టుగా

అందమైనలోకం అందులోన నువ్వు అద్భుతం
అందుకేగ నిన్నే ..కోరుకుంది చిన్ని ప్రాణం

Hey girl hey girl wanna say something
Will you listen to me now
Hey boy hey boy a wanna be a thing
Tell me all that you wanna say now


ఓర చూపుకి లొంగిపోవడం
దొరా నవ్వుకే పొంగిపోవడం
ప్రేమలోనే నేర్చుకున్నా రాతిరంతా మేలుకోవడం
నిన్ను నాలో దాచుకోవడం.. నన్ను నీలో చూసుకోవడం
నమ్మలేక నన్నునేనే అప్పుడప్పుడు గిల్లుకోవడం
ఓ చెలీ అనార్కలీ.. బాగున్నదీ హడావిడీ
నేనిలా వినాలనే.. ఇన్నాళ్లనుంచి కలలుకన్నదీ

అందమైనలోకం అందులోన నువ్వు అద్భుతం
అందుకేగ నిన్నే ..కోరుకుంది చిన్ని ప్రాణం


పూటపూటకొ పండగవ్వడం.. మాటిమాటికి నవ్వుకోవడం
ప్రేమలోన తేలుతుంటే కష్టమేలే తట్టుకోవడం
దిండునేమో హత్తుకోవడం.. జుట్టురింగులు తిప్పుకోవడం
ప్రేమపిచ్చే రేగుతుంటే తప్పదేమో దారితప్పడం
ఓ చెలీ అనార్కలీ.. తమాషగుందిలే ఇదీ
అందుకే సరాసరీ.. మనస్సు ఇచ్చిపుచ్చుకున్నదీ

అందమైనలోకం అందులోన నువ్వు అద్భుతం
అందుకేగ నిన్నే ..కోరుకుంది చిన్ని ప్రాణం

Hey girl hey girl wanna say something
Will you listen to me now
Hey boy hey boy a wanna be a thing
Tell me all that you wanna say now


*******   *******   *******


చిత్రం: శివమ్ (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: యాజిన్ నజీర్, సమీరా

సనిగససనిగససనిగససనిప...
పమనిపపమనిగగమనిప...
సనిగససనిగససనిగససనిప...
పమనిపపమనిగగమనిప...

నా కోసం జీరోసైజే నువు మెంటైన్ చెయ్యక్కర్లేదు...
నా కోసం మేకప్ లిప్ స్టిక్ వెయ్యక్కర్లేదు...
నా కోసం వెయిటింగ్ చేస్తూ నీ గోళ్ళేం కొరకక్కర్లేదు...
నా కోసం ఓ కిస్సే నువు ఇవ్వక్కర్లేదూ...
నా కోసం నీ హెయిర్ స్టైలు... నా కోసం డ్రస్సింగ్ స్టైలు...
నా కోసం నీ లైఫ్ స్టైలు... ఏది మార్చక్కర్లేదు...
నా కోసం నువు ఐ లవ్వూ చెప్పక్కర్లేదూ...
ఎందుకంటే....
ఐ లవ్వూ టూ... ఐ లవ్వూ టూ...
ఐ లవ్వూ టూ... ఐ లవ్వూ టూ...
సనిగససనిగససనిగససనిప...
పమనిపపమనిగగమనిప...

సనిగససనిగససనిగససనిప...
పమనిపపమనిగగమనిప...

తిడతావా తిట్టు... కొడతావా కొట్టూ...
పడతాగా నేను... నీ కోపం నీ ఇష్టం...
వెధవేషాలెయ్యి... ఎక్సట్రాలె చెయ్యి...
వెనకేసుకొస్తా నువ్వంటె అంతిష్టం...
నా కోసం నిన్నే నువ్వు కంట్రోలే చెయ్యక్కర్లేదు...
నా కోసం నువు ఐ లవ్వూ చెప్పక్కర్లేదు...
బి కాజ్...
ఐ లవ్వూ టూ... ఐ లవ్వూ టూ...
ఐ లవ్వూ టూ... ఐ లవ్వూ టూ...

చెప్పేది వినవు... పడతావా పడవు...
ఎట్టాగే నీతో... ఇంకెన్నాళ్ళీ తగువు...
బుద్దున్నొడెవడు ఇన్నాఫర్లివడూ...
ఒప్పేసుకోవే ఐ పోతా నీ మొగుడూ...
నా కోసం అంతందంగా అటుతిరిగేం నవ్వక్కర్లేదు...
నా కోసం నువు ఐ లవ్వూ చెప్పక్కర్లేదు...
క్యూ...
క్యూం కి...
ఐ లవ్వూ టూ... ఐ లవ్వూ టూ...
ఐ లవ్వూ టూ... ఐ లవ్వూ టూ...
సనిగససనిగససనిగససనిప...
పమనిపపమనిగగమనిప...
సనిగససనిగససనిగససనిప...
పమనిపపమనిగగమనిప...


*******   *******   *******


చిత్రం: శివమ్ (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కార్తిక్

నేనే గానీ ఫ్రెండై ఉంటే దేవదాసై పుట్టేవాడా
మందుకొట్టేవాడా? కుక్కని పెంచేవాడా? అట్టా పోయేవాడా?
నేనే గానీ ఫ్రెండై ఉంటే మజ్ను పిచ్చోడయ్యేవాడా? సోలోగా తిరిగేవాడా? శోకంలో మునిగేవాడా? లైఫంతా ఏడ్చేవాడా?
ఓ.. వయసొస్తే ప్రేమించాలి..
ఓ ..ప్రేమిస్తే ఎదురెళ్ళాలి
ఓ..ఎదురెళ్ళి సాధించాలి
భయపడ్డం అంటే చావేరా

శివం శివం శివం శివం
నాతో దోస్తీ చేస్తే నీకే జయం జయం
శివం శివం శివం శివం
కాదని కెలికావంటే ఖేల్ ఖతం ఖతం

చరణం: 1
నాకే గానీ ఫ్రెండ్సై వుంటే రోమియో జూలియట్టు
పెళ్ళైపోయి పాడేవాళ్ళు లవ్ డ్యూయెట్టూ..
డైలీ పార్కుల చుట్టూ
నాకే గానీ ఫ్రెండ్సై ఉంటే సలీం అనార్కలీ
జంటైపోయి గెంతే వాళ్ళు గల్లీ గల్లీ..
ఊటీ హనీమూన్ కెళ్ళీ

ఓ.. - ఆరోజుల్లో గనకా..
ఓ..  - నేనే పుట్టుంటే
ఓ..  - ప్రేమల్నే గెలిపించేసీ..
ఓ.. happy ending చేసుంటా

శివం శివం శివం శివం
నాతో దోస్తీ చేస్తే నీకే జయం జయం
శివం శివం శివం శివం
కాదని కెలికావంటే ఖేల్ ఖతం ఖతం

చరణం: 2
నాకే గానీ నచ్చినపిల్లా దొరికేసిందంటే
మాయల్ చేసో మంత్రం వేసో లైన్లో పెడతా..
Heart ని హైజాక్ చేస్తా
నేనూ నచ్చీ ఏదోరోజూ love you అందంటే
టన్నులకొద్దీ హేపీనెస్సుని తనకిచ్చేస్తా
స్వర్గం కిందకితెస్తా
ఓ.. - మా ప్రేమకడ్డం పడితే ..
ఓ.. - వాడెంతటోడైనా
ఓ... - గుండెల్లో నిద్దరపోయీ..
ఓ...నరకం చూపించేస్తాగా

శివం శివం శివం శివం
కాదని కెలికావంటే ఖేల్ ఖతం ఖతం