Showing posts with label కార్తికేయ (2014). Show all posts
Showing posts with label కార్తికేయ (2014). Show all posts

కార్తికేయ (2014)



ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో
సూటిగా నిను చూడలేను
తెరచాటుగా నిను చూసాను
మాయవో నువు ఆశవో
నువు వీడనీ తుది శ్వాసవో
రాయని ఓ గేయమో
నువు ఎవరివో హలా...
ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో
పరిచయమే పరవశమై నిన్ను నాతో కలిపింది
వ్రాసిందే జరిగింది అయినా కలలా ఉంది
ఒకటయ్యాక మీలో ఇక
నీతో ఉంటామరి నేనిక
లేనే లేదిక తీరిక
ఇది మనసులో కలయిక
ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో

రచన: కృష్ణ చైతన్య
సంగీతం: శేఖర్ చంద్ర
గానం: చిన్మయి
చిత్రం: కార్తికేయ (2014)