Showing posts with label 1971. Show all posts
Showing posts with label 1971. Show all posts

కూతురు కోడలు (1971)

చిత్రం :  కూతురు కోడలు (1971)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  బాలు, వసంత 

పల్లవి :

గాజులు ఘల్లనగానే జాజులు ఘుమ్  ఘుమ్మనగానే
నీవే అనుకున్నాలే... అది నీవే అనుకున్నాలే

తుమ్మెద ఝుమ్ ఝుమ్మనగానే తెమ్మెర రా రమ్మనగానే
నీవే అనుకున్నాలే... అది నీవే అనుకున్నాలే 


చరణం 1 :


నీ కాటుక కన్నుల సొగసు...  నీ చెంగున దూకే వయసు
నన్నెంతో తొందరచేసే... నీ కౌగిట బందీ చేసే

వెచ్చని వెన్నెలలోన...  విచ్చిన కలువను చూసీ 
నీవే అనుకున్నాలే... అది నీవే అనుకున్నాలే

చరణం 2  :


నీ కదిలే పెదవులు చూసి...  నా మెరిసే చెక్కిలి మురిసి
నీ వెచ్చని ఒడిలో చేరి...  నా వయసే పొంగెను నేడే

కోయిల కోయనగానే కొమ్మలు ఓయనగానే   
నీవే అనుకున్నాలే... అది నీవే అనుకున్నాలే

చరణం 3 :


నలనల్లని ఆకాశంలో...  తెలతెల్లని మేఘంలాగా
నల్లని ఆకాశంలో తెలతెల్లని మేఘంలాగా
నీ నీలికురులలో విరిసే మరుమల్లెలు నావే నావే

నీ హృదయపు పందిరిమీద పెనవేసిన మమతల తీగ
హృదయపు పందిరిమీద...  పెనవేసిన మమతల తీగ
విరబూసిన వలపుల పూలే ఏ నాటికి నావే నావే 

గాజులు ఘల్లనగానే...  జాజులు ఘుమ్మనగానే
నీవే అనుకున్నాలే...  అది నీవే అనుకున్నాలే

తుమ్మెద ఝుమ్మనగానే...   తెమ్మెర రమ్మనగానే
నీవే అనుకున్నాలే... అది నీవే అనుకున్నాలే

లలలాలాలాలాలల.... లలలాలాలాలాలలలలా



కళ్యాణ మంటపం (1971)

చిత్రం :  కళ్యాణ మంటపం (1971)
సంగీతం :  ఆదినారాయణరావు
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : సుశీల


పల్లవి : 

సరిగమ పదనిసానిదప మగరిస...  అని
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
వలచే మనసుకు బదులుగ...  బదులుగ
పిలిచే కనులకు ఎదురై...  ఎదురై

పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
వలచే మనసుకు బదులుగ...  బదులుగ
పిలిచే కనులకు ఎదురై...  ఎదురై

పలికే వారుంటే...
సరిగమ పదని సానిదప మగరిసని


చరణం 1 :

ఒక కోవెలలో ఒకడే దేవుడు
ఒక హృదయములో ఒకడే ప్రియుడు

ఒక కోవెలలో ఒకడే దేవుడు
ఒక హృదయములో ఒకడే ప్రియుడు
జీవననేత ప్రేమవిధాత... జీవననేత ప్రేమవిధాత
అను గుడిగంట విను ప్రతి జంట

సరిగమ పదని సానిదప మగరిసని
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే


చరణం 2 :


తీగా తీగా పెనగీ పెనగీ
రాగ ధారగా సాగీ సాగీ

తీగా తీగా పెనగీ పెనగీ
రాగ ధారగా సాగీ సాగీ
జీవన గంగావాహిని కాదా
జీవన గంగావాహిని కాదా
అను ప్రతి జంట విను గుడిగంట
సరిగమ పదని సానిదప మగరిసని

పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
వలచే మనసుకు బదులుగ...  బదులుగ
పిలిచే కనులకు ఎదురై ... ఎదురై

పలికే వారుంటే...
సరిగమ పదని సానిదప మగరిస
అని పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే


*********** ************* *************

చిత్రం :  కళ్యాణ మంటపం (1971)
సంగీతం :  ఆదినారాయణరావు
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : సుశీల


పల్లవి : 


ఏడవకే చిన్నారి పాపా... చిట్టి పాపా..ఆ
చూడలేనే కన్నీరు పాపా..
ఆ....  ఆ....  ఆ....
నీవు పెరగాలి మరవాలి శోకం..రేపు పాడాలి ఆనంద గీతం
ఆ..ఆ..... ఆ....ఆ..ఆ..... ఆ...... ఆ..ఆ..ఆ



చరణం 1 :

కారు మేఘాల చీకట్ల క్షోభ... నేడేనమ్మా..
రేపు శతకోటి కిరణాలశోభ... నీదేనమ్మా..
ఆశలన్నీ....పూచునమ్మా..
ఆశలన్నీ... పూచునమ్మా ....
కాంతులీన కాలిపోవు దీపమౌదు తృప్తిగాను....  తల్లీ..


జీవింతు నీ కొరకు..మళ్ళీ
ఏడవకే చిన్నారి పాపా..చిట్టి పాపా చూడలేనే కన్నీరు పాపా 


చరణం 2 :

నిన్ను లతలాగ కన్నీట తడిపీ...పెంచేనమ్మా..
రక్తమాంసాల త్యాగాల ఎరువు... వేసేనమ్మా..ఆ
చిగురు వేసి విరులు పూచి... చిగురు వేసి విరులు పూచి
మూడుపూవులారుకాయలగుచు నీవు నవ్వవలెను
తల్లీ..ఈ.. ఈ..జీవింతు నీ కొరకు మళ్ళీ 

ఏడవకే చిన్నారి పాపా... చిట్టి పాపా
చూడలేనే కన్నీరు పాపా...
నీవు పెరగాలి మరవాలి శోకం... రేపు పాడాలి ఆనంద గీతం
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్  



*********** ************* *************

 చిత్రం :  కళ్యాణ మంటపం (1971)
సంగీతం :  ఆదినారాయణరావు
గీతరచయిత :  దేవులపల్లి
నేపధ్య గానం : సుశీల


పల్లవి : 


కృష్ణా.... నా మొర వినవా నను దయగనవా..
కన్నె బ్రతుకు కాపాడరావా..
ఈ ఘోరబలి ఆపించలేవా... ఆపించలేవా..

నా మొర వినవా.. నను దయగనవా
దీనులబ్రోచే దైవము కావా..
ఏనాడైనా వరమడిగితినా
ఈ వరమైనా ఈయగలేవా....  కృష్ణయ్యా కరుణించవయ్యా


చరణం 1 :

ఇల్లాలు కాగోరె ఇన్నాళ్లుగా... లోకాన్ని ఎదిరించె ఇన్నేళ్ళుగా
ఇల్లాలు కాగోరె ఇన్నాళ్లుగా... లోకాన్ని ఎదిరించె ఇన్నేళ్ళుగా
ఓటమి కలిగే ఆశలు తొలగే..ఈ ఘోరానికె తలవంచె
జగమింతేనా... బ్రతుకింతేనా..

నా మొర వినవా నను దయగనవా



చరణం 2 :


మగువను లోకం బానిస చేయగ... మౌనం పూనావా..
తాళికి తరుణిని దూరం చేయగ.. జాలే మరిచావా..
న్యాయం విడిచావా..ఘోరం తలిచావా..
వినవేలా... శిలవేనా... రావేలా... కృష్ణా


*********** ************* *************

చిత్రం :  కళ్యాణ మంటపం (1971)
సంగీతం :  ఆదినారాయణరావు
గీతరచయిత :  దేవులపల్లి
నేపధ్య గానం : సుశీల, బాలు  


పల్లవి :

పిలిచే వారుంటే.. పలికేను నేను
పిలిచే వారుంటే.. పలికేను నేను
హృదయాన ఉయ్యాల ఊగేను నేను
కనుపాప అద్దాన కదిలేను నేను.. ఆ....ఆ.....ఆ....


పలికేవారుంటే.. పిలిచేను నేను
పలికేవారుంటే.. పిలిచేను నేను
హృదయాన ఉయ్యాల ఊగేవు నీవే
కనుపాప అద్దాన కదిలేది నీవే ఆ....ఆ.....ఆ....


చరణం 1 :

ఏ నాటిదో ఈ బంధము.. మన అనుబంధము.. ఆ...ఆ... ఆ...
ఏ నాటిదో ఈ బంధము.. మన అనుబంధము
కలకాలము నిలవాలిలే.. మన అనురాగము
గోదారిలా నేడు ఉరికేను మనసు.. 

నీ పిలుపు వినగానే.. పులకించె బ్రతుకు పులకించె బ్రతుకు
పిలిచే వారుంటే.. పలికేను నేను 

హృదయాన ఉయ్యాల ఊగేవు నీవే
కనుపాప అద్దాన కదిలేది నీవే ఆ....ఆ.....ఆ....


చరణం 2 :


నీ రూపమే నా దైవమై నను మురిపించెలే ఆ....ఆ..ఆ.. 
నీ రూపమే నా దైవమై నను మురిపించెలే
నా అందమే అరవిందమై నిను పూజించెలే 
నీ మనసులో నాకు చోటుంటే చాలు
నా బ్రతుకులో విరియు నవనందనాలు.. నవనందనాలు


పలికేవారుంటే.. పిలిచేను నేను
హృదయాన ఉయ్యాల ఊగేను నేను...
కనుపాప అద్దాన కదిలేను నేను
ఆ....ఆ......ఆ......


చరణం 3 :


కలగన్నదే నిజమైనది చెలి ఔనన్నది
సొగసున్నదీ... గుణమున్నదీ చెలి నాదైనది 

అడుగుల్లో అడుగేసి నడవాలి మనము
మన మొకటి కాగానే మారాలి జగము
అడుగుల్లో అడుగేసి నడవాలి మనము
మన మొకటి కాగానే మారాలి జగము 

మన మొకటి కాగానే మారాలి జగము
మారాలి జగము.. మారాలి జగము.. మారాలి జగము


*********** ************* *************

చిత్రం :  కళ్యాణ మంటపం (1971)
సంగీతం :  ఆదినారాయణరావు
గీతరచయిత :  దేవులపల్లి
నేపధ్య గానం : సుశీల 


పల్లవి :

చుక్కలు పాడే..  శుభ మంత్రం
దిక్కులు నిండే దివ్య మంత్రం
ఎక్కడనో.. ఎపుడో.. ఎవరో పలికిన వేద మంత్రం
ఇక్కడనే.. ఇపుడే.. ఎవరో.. నా చెవిలో ఊదిన మంత్రం.. మధు మంత్రం
చుక్కలు పాడే.. శుభ మంత్రం 


చరణం 1 :

రెక్కలపై ఆ గువ్వల జంట ... రేకులలో ఆ పువ్వుల జంట
రెక్కలపై ఆ గువ్వల జంట...  రేకులలో ఆ పువ్వుల జంట
సాగుచునే.. ఊగుచునే..  మధుర మధురముగ మక్కువగా.. చదువుకునే ఆనంద మంత్రం 

చుక్కలు పాడే శుభ మంత్రం


చరణం 2 :


కన్నులు ఒక పరి మూసుకొని.. నీవన్నది మరి మరి తలచుకొని
కన్నులు ఒక పరి మూసుకొని.. నీవన్నది మరి మరి తలచుకొని
ఒక్కతినే.. నే నొక్కతినే.. అదే పనిగనే సదా మనసులో ఆలపించే ప్రియ మంత్రం 

చుక్కలు పాడే శుభ మంత్రం


చరణం 3 :

కోవెల దైవం పిలిచే దాకా.. ఆవలి ఒడ్డున నిలిచే దాకా
కోవెల దైవం పిలిచే దాకా.. ఆవలి ఒడ్డున నిలిచే దాకా
నాలోనే లోలోనే..  నాతి చరామి.. నాతి చరామి.. అన్న ఆ  ప్రాణ మంత్రం  

చుక్కలు పాడే శుభ మంత్రం దిక్కులు నిండే దివ్య మంత్రం
ఎక్కడనో..  ఎపుడో.. ఎవరో పలికిన వేద మంత్రం
ఇక్కడనే ఇపుడే ఎవరో.. నా చెవిలో ఊదిన మంత్రం మధు మంత్రం
చుక్కలు పాడే శుభ మంత్రం

ఆనంద నిలయం (1971)



చిత్రం: ఆనంద నిలయం (1971)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల



పల్లవి:

పదిమందిలో పాటపాడినా..
అది అంకితమెవరో ఒకరికే
విరితోటలో పూలెన్ని పూసినా
గుడికి చేరేది నూటికి ఒకటే......

పదిమందిలో పాటపాడినా...


చరణం 1:

గోపాలునికెంతమంది గోపికలున్నా
గుండెలోన నెలకొన్నా రాధ ఒక్కటే..
పదిమందిలో పాటపాడినా

ఆకాశవీధిలో తారలెన్ని ఉన్నా
అందాల జాబిల్లి అసలు ఒక్కటే....

చరణం 2:

ఏడాదిలో ఎన్ని ఋతువులున్ననూ
వేడుక చేసే.... వసంతమొక్కటే
పదిమందిలో పాటపాడినా...

నా కన్నులందు ఎన్నివేల కాంతులున్ననూ
ఆ కలిమి కారణం నీప్రేమ ఒక్కటే......

పదిమందిలో పాటపాడినా...
అది అంకితమెవరో ఒకరికే
పదిమందిలో పాటపాడినా...

అమాయకురాలు (1971)

చిత్రం : అమాయకురాలు (1971)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి :

సన్నజాజి పువ్వులు చందమామ కాంతులు.. చిన్నారి పాపా నవ్వులు
మా ఇంటి వెలుగు మా కంటి వెలుగు.. బంగారు జోతుల దీవెనలు

సన్నజాజి పువ్వులు చందమామ కాంతులు... చిన్నారి పాపా నవ్వులు
మా ఇంటి వెలుగు మా కంటి వెలుగు... బంగారు జోతుల దీవెనలు


చరణం 1 :


పాపాయి గెంతులు... తువ్వాయి చెంగులు
పాపాయి గెంతులు... తువ్వాయి చెంగులు
తూరీగలాగ దొరకదు.. 

పరుగులు తీస్తే పండుగ.. ఉరకలు వేస్తె వేడుక
మా జోతి చిందులే అందాల విందులు

సన్నజాజి పువ్వులు.. చందమామ కాంతులు... చిన్నారి పాపా నవ్వులు 


చరణం 2 :


తాతయ్య మీసాల ఉయ్యాలలూగేను.. అమ్మమ్మ కళ్ళతో దోబూచులాడేను
తాతయ్య మీసాల ఉయ్యాలలూగేను... అమ్మమ్మ కళ్ళతో దోబూచులాడేను
ఆడిన ఆట.... పాడిన పాట...
ఆడిన ఆట అల్లరి... పాడిన పాట పల్లవి.. మా జోతి మాటలే వరహాల మూటలు

సన్నజాజి పువ్వులు.. చందమామ కాంతులు.. చిన్నారి పాపా నవ్వులు


చరణం 3 :

ఆ కొంటె చేష్టలు ఆ చిలిపి చూపులు
ఆ కొంటె చేష్టలు ఆ చిలిపి చూపులు 
ఆనందమొసగే వరములు
ఇరుగుపొరుగు మెచ్చగా ఇంటిల్లిపాదికి నచ్చగా.. 
చిరంజీవి పెరగాలి బంగారు తల్లిగా


సన్నజాజి పువ్వులు చందమామ కాంతులు.. చిన్నారి పాపా నవ్వులు
మా ఇంటి వెలుగు మా కంటి వెలుగు.. బంగారు జోతుల దీవెనలు



**************** **************** ***********
చిత్రం : అమాయకురాలు (1971)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి :
ఓహో.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
ఆహా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. 

కొంటె పిల్లా....
కొంటె పిల్ల కోరుకున్న జంట దొరికింది
వంట ఇంటి కుందేలై చేత చిక్కింది

బ్రహ్మచారీ....
బ్రహ్మచారి వంట ఇంటి బాధ తప్పింది
కళ్ళలోన పెళ్లి సొగసు గంతులేసింది 

చరణం 1 :


కవ్వించి నవ్వించు గడుసైనదానా.. ఈ వింత సిగ్గేల నీ మోములోన
నను చూసి నా రాజు కను సైగ చేసే నును సిగ్గు పరదాలు కనులందు వాలే
నీ తీపి కలలన్ని నిజమైన వేళ..
నీ తీపి కలలన్ని నిజమైన వేళ.. సరదాగ నాతోటి సరితూగ రావా
బ్రహ్మచారి వంట ఇంటి బాధ తప్పింది...  కళ్ళలోన పెళ్లి సొగసు గంతులేసింది


చరణం 2 :


చెలికాని అధరాల చిరునవ్వు నేనై.. నిండైన ప్రణయాలు పండించుకోనా
చెలి నీలి కురులందు సిరిమల్లె నేనై.. పరువాల మురిపాలు విరబూయ రానా
అందాల మన ప్రేమ బంధాలలోన...
అందాల మన ప్రేమ బంధాలలోన.. హృదయాలు పెనవేసి విహరించుదామా

కొంటె పిల్ల కోరుకున్న జంట దొరికింది.. వంట ఇంటి కుందేలై చేత చిక్కింది
బ్రహ్మచారి వంట ఇంటి బాధ తప్పింది.. కళ్ళలోన పెళ్లి సొగసు గంతులేసింది



**************** **************** ***********
చిత్రం: అమాయకురాలు (1971)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:

హలో సారూ భలే వారు చెలి వలపు తెలుసుకోరు
పైకెంతో చల్లని వారు.. తమరెంతో అల్లరివారు
నా మనసు దోచినారు

చాలు చాలు సరసాలు ఇక దూరంగా ఉంటేనే మేలు
లల్లలల్ల ఒహో ఒహో లలల్లల

చరణం 1:

రానిమ్ము రానిమ్ము ఏమైనకానీ.. నా ఇంపు నా సొంపు నీ సొమ్ము కాదా
రానిమ్ము రానిమ్ము ఏమైనకానీ.. నా ఇంపు నా సొంపు నీ సొమ్ము కాదా
నా తోడు నీవై.. నీ నీడ నేనై.. కలవాలి కరగాలి కావాలి ఒకటిగా.. ఆ..ఓ..

చాలు చాలు సరసాలు ఇక దూరంగా ఉంటేనే మేలు

హలో సారూ భలే వారు చెలి వలపు తెలుసుకోరు

చరణం 2:

రావాలి రావాలి సరియైన అదను.. ఆనాడు ఇవ్వాలి నీ నిండు మనసు..
రావాలి రావాలి సరియైన అదను.. ఆనాడు ఇవ్వాలి నీ నిండు మనసు
ఆలోగ నీవు ఆవేశ పడకు.. ఆకాశ సౌధాలు నిర్మించ రాదులే.. ఏ .. ఓ..

హలో సారూ భలే వారు చెలి వలపు తెలుసుకోరు

చాలు చాలు సరసాలు ఇక దూరంగా ఉంటేనే మేలు

చరణం 3:

అనురాగ బంధాలు సడలించవద్దు.. పెనవేయు హృదయాలు విడదీయవద్దు
అనురాగ బంధాలు సడలించవద్దు.. పెనవేయు హృదయాలు విడదీయవద్దు

నీ లేత వలపు ఆమోదమైన.. బంగారు స్వప్నాలు పండేది ముందెపుడో.. ఓ.. ఓ..

హలో సారూ భలే వారు చెలి వలపు తెలుసుకోరు
చాలు చాలు సరసాలు ఇక దూరంగా ఉంటేనే మేలు


**************** **************** ***********

చిత్రం: అమాయకురాలు (1971) 
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 
గీతరచయిత: దాశరథి 
నేపధ్య గానం: సుశీల 


పల్లవి: 

ఆ... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... ఆ... 
పాడెద నీ నామమే గోపాలా 
పాడెద నీ నామమే గోపాలా 
హృదయములోనే పదిలముగానే 
నిలిపెద నీ రూపమేరా... 
పాడెద నీ నామమే గోపాలా 

చరణం 1: 

మమతలలోనే మాలికలల్లి నిలిచితి నీకోసమేరా 
మమతలలోనే మాలికలల్లి నిలిచితి నీకోసమేరా 
ఆశలతోనే హారతి చేసి పదములు పూజింతు రారా 
పాడెద నీ నామమే గోపాలా 

చరణం 2: 

నీ మురళీ గానమే పిలిచెరా కన్నుల నీమోము కదలెనులేరా 
నీ మురళీగానమే పిలిచెరా 
పొన్నలు పూచే బృందావనిలో వెన్నెల కురిసే యమునాతటిపై 
ఆ..... 
పొన్నలు పూచే బృందావనిలో వెన్నెల కురిసే యమునాతటిపై 
నీ సన్నిధిలో జీవితమంతా ..కానుక చేసేను రారా 

పాడెద నీ నామమే గోపాలా 
హృదయములోనే పదిలముగానే 
నిలిపెద నీ రూపమేరా... 
పాడెద నీ నామమే గోపాలా...


**************** **************** ***********

చిత్రం: అమాయకురాలు (1971)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:

నీ చూపులు గారడి చేసెను.. నీ నవ్వులు పూలై పూచెను
ఆ నవ్వులలో.. ఆ చూపులలో.. నిను కవ్వించేవాడెవ్వడో..

నా చూపులు గారడి చేసినా.. నా నవ్వులు పూలై పూచినా..
ఏ ఒక్కరికో అవి దక్కునులే.. ఆ టక్కరి దొంగవు నీవేలే

చరణం 1:

నీ మోమే ఒక చంద్రబింబం.. దానికి ముచ్చటైన పుట్టుమచ్చ అందం..
నీ మోమే ఒక చంద్రబింబం..
ఆ అందం చూసి.. నీ ముందుకు దూకి..
ఆ అందం చూసి.. నీ ముందుకు దూకి..
ఎందరు యువకులు తొందరపడి నిన్నెత్తుకుపోతారో.. నేనేమైపోతానో...

అహ..హ....
నా చూపులు గారడి చేసినా.. నా నవ్వులు పూలై పూచినా..
ఏ ఒక్కరికో అవి దక్కునులే.. ఆ టక్కరి దొంగవు నీవేలే

చరణం 2:

మగసిరిగల సొగసైన దొరవు.. అందుకు సరిపడు సిరులెన్నో కలవు...
మగసిరిగల సొగసైన దొరవు..
నీ పక్కన మూగి.. తమ మక్కువ చూపి
నీ పక్కన మూగి.. తమ మక్కువ చూపి
చక్కని పడుచుల.. చెక్కెలి తళుకుల చిక్కుకుపోతావో.. నీ చెలినే మరచేవో..

ఊ..హ..హ..
నీ చూపులు గారడి చేసెను.. నీ నవ్వులు పూలై పూచెను
ఆ నవ్వులలో ఆ చూపులలో.. నిను కవ్వించేవాడెవ్వడో...

చరణం 3:

చిగురించిన ఈ అనురాగం.. వికసించునులే కలకాలం
చిగురించిన ఈ అనురాగం..
నీ వలపే నేనై.. నా వెలుగే నీవై
కమ్మని మమతల బంగరు మేడల కలలే కందామా..
కలలే కందామా..

ఆహాహహా.. ఆహాహహా.. ఆహాహహా.. ఆహాహహా..

అదృష్ట జాతకుడు (1971)



చిత్రం  :  అదృష్ట జాతకుడు (1971)
సంగీతం  :  టి. చలపతిరావు
గీతరచయిత  :  సినారె
నేపధ్య గానం  :  సుశీల


పల్లవి :



చిరు చిరు నవ్వుల శ్రీవారు.. చిన్నబోయి ఉన్నారు
ఇంతటి శ్రీమతి ఎదురుగ ఉన్నా.. కిమ్మనరు.. రమ్మనరు
కిమ్మనరు... రమ్మనరు



చరణం 1 :



చల్లగాలి పిలిచింది..  జాజి తీగె పలికింది
చల్లగాలి పిలిచింది..  జాజి తీగె పలికింది
కన్నెతార సైగలలో.. చందమామ సాగింది.. చందమామ సాగింది

చిరు చిరు నవ్వుల శ్రీవారు.. చిన్నబోయి ఉన్నారు
ఇంతటి శ్రీమతి ఎదురుగ ఉన్నా కిమ్మనరు.. రమ్మనరు
కిమ్మనరు.. రమ్మనరు



చరణం 2 :



పూల బాల రమ్మంది.. రాగాల తుమ్మెద ఝుమ్మంది
పూల బాల రమ్మంది.. రాగాల తుమ్మెద ఝుమ్మంది
వెండి పూల వెన్నెలలో నిండు హాయి విరిసింది.. నిండు హాయి విరిసింది

చిరు చిరు నవ్వుల శ్రీవారు చిన్నబోయి ఉన్నారు
ఇంతటి శ్రీమతి ఎదురుగ ఉన్నా కిమ్మనరు.. రమ్మనరు
కిమ్మనరు.. రమ్మనరు


చరణం 3 :



లేత కోరిక పెరిగింది.. రేయి సగమే మిగిలింది
లేత కోరిక పెరిగింది.. రేయి సగమే మిగిలింది
సరసా లెరిగిన మావారే... ఉలకక పలకక ఉన్నారే.. ఉలకక పలకక ఉన్నారే


చిరు చిరు నవ్వుల శ్రీవారు చిన్నబోయి ఉన్నారు
ఇంతటి శ్రీమతి ఎదురుగ ఉన్నా..  కిమ్మనరు.. రమ్మనరు..  కిమ్మనరు..రమ్మనరు

అత్తలూ కోడళ్లు (1971)


చిత్రం : అత్తలూ కోడళ్లు (1971)
సంగీతం : కె. వి. మహదేవన్
గీతరచయిత : ఆత్రేయ
నేపధ్య గానం : బాలు , సుశీల

పల్లవి :


చీరకు రవికందమా?...  రవికకు చీరందమా ?
చీరకు రవికందమా?... రవికకు చీరందమా ?
చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా
చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా 

చీరకు రవికందమా?.. రవికకు చీరందమా ?
చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా
చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా

చరణం 1 :


పైటకొంగు చుట్ట చుట్టి పైటన్నం గంపనెట్టి 
పైటకొంగు చుట్టచుట్టి పైటన్నం గంపనెట్టి
కోక కాస్త ఎత్తికట్టి గట్టుమీద నడుస్తుంటె 
కోక కాస్త ఎత్తికట్టి గట్టుమీద నడుస్తుంటె

నడక అందమా ? ఆ నడుము అందమా ? 
నడక అందమా ? ఆ నడుము అందమా ?

చీరకు రవికందమా ? రవికకు చీరందమా ?
చిలకమ్మా ఒక్కమాట అడుగమ్మా
చిలకమ్మా ఒక్కమాట అడుగమ్మా


చరణం 2 :


పైరగాలి వీస్తుంటే.. పంటచేలు వూగుతుంటే
పైరగాలి వీస్తుంటే, పంటచేలు వూగుతుంటే
ముందు ముందు పంట తలచి మురిసిపోతు నువ్వుంటే
ముందు ముందు పంట తలచి మురిసిపోతు నువ్వుంటే

నువ్వు అందమా? నీ గర్వమందమా?
నువ్వు అందమా ? నీ గర్వమందమా ?

చీరకు రవికందమా ? రవికకు చీరందమా ?
చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా
చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా 


చరణం 3 :


ముద్ద నేను పెడుతుంటే  నా మొగం నువ్వు చూస్తుంటే
ముద్ద నేను పెడుతుంటే  నా మొగం నువ్వు చూస్తుంటే
ముద్ద ముద్దకొక్క ముద్దు కొసరి నేను కోరుతుంటే
ముద్ద ముద్దకొక్క ముద్దు కొసరి నేను కోరుతుంటే

కోరికందమా? ... నీ కోపమందమా ?
నా కోరికందమా? ... నీ కోపమందమా ?

చీరకు రవికందమా? ... రవికకు చీరందమా ?

సుపుత్రుడు (1971)



చిత్రం: సుపుత్రుడు (1971)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:
చిలకమ్మా పిలిచింది... గోరొంకా పలికింది
చిలకమ్మ పిలిచింది... చిగురాకు గొంతుతో
గోరొంక వాలింది... కొండంత ఆశతో

చిలకమ్మ పిలిచింది... చిగురాకు గొంతుతో
గోరొంక వాలింది... కొండంత ఆశతో

చిలకమ్మా.... పిలిచింది
గోరొంకా..... పలికింది

చరణం: 1
ఉరిమేటి మబ్బులే... చిరుజల్లు కురిసేది
చెఱలాడు మనసులే... చెలిమితో కలిసేది
ఉరిమేటి మబ్బులే... చిరుజల్లు కురిసేది
చెఱలాడు మనసులే... చెలిమితో కలిసేది

చినదాని బుగ్గలకు... సిగ్గెపుడు వచ్చేది
చినదాని బుగ్గలకు... సిగ్గెపుడు వచ్చేది
అనుకోని వలపులూ... అప్పుడే తెలిసేది 

చిలకమ్మా.... పిలిచింది
గోరొంకా..... పలికింది

చరణం: 2
ఎఱ్ఱ ఎఱ్ఱగా పూచింది... దానిమ్మ పువ్వు
కుఱ్ఱతనమంతా ఒలికావు... కులుకుల్లోనువ్వు
చలిగాలి వీచింది... ప్రాణాలు జివ్వని
అది గిలిగింత పెట్టితే..అనుకొంటి నువ్వని 

చిలకమ్మా.... పిలిచింది
గోరొంకా..... పలికింది

చరణం: 3
ఆ కొండ ఈ కోన... కలిశాయి మంచులో
నీరెండ తోచింది... నీవున్న తావులో
ఆ కొండ ఈ కోన... కలిశాయి మంచులో
నీరెండ తోచింది... నీవున్న తావులో
ఊగింది మనపడవ... వయ్యారి కొలనులో
ఊగింది మనపడవ... వయ్యారి కొలనులో
సాగాలి మనబ్రతుకు... ఈ తీపి ఊపులో

చిలకమ్మా పిలిచింది... గోరొంకా పలికింది
చిలకమ్మ పిలిచింది... చిగురాకు గొంతుతో
గోరొంక వాలింది... కొండంత ఆశతో

చిలకమ్మ పిలిచింది... చిగురాకు గొంతుతో
గోరొంక వాలింది... కొండంత ఆశతో

చిలకమ్మా.... పిలిచింది
గోరొంకా..... పలికింది


******   ******   ******


చిత్రం:  సుపుత్రుడు (1971)
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం:  సినారె
గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి:
ఒ హో హో... వయ్యారి వగలమారి కుమారీ
వై అర్ యు సారీ... వై కాంట్ యు మారి
యు..నో..నో..నో..

ఒ హో హో..వయ్యారి వగలమారి కుమారీ
వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ..
యు..నో..నో..నో..

చరణం: 1
నడవకు నడవకు అంతజోరుగా... నడుస్తాను నీకేం?
నాకేం..హహహా..
నీ అందాలు చందాలు అలసిపోయేను
నడుము నలిగిపోయేనూ

నడవకు నడవకు అంతజోరుగా..
నీ అందాలు చందాలు అలసిపోయేను
నడుము నలిగిపోయేనూ

చూడకు చూడకు అంత కోరగా
నీ చూపులోని ఎరుపు నాకు కైపులాగ తోస్తుంది
నన్నేదో చేస్తుంది..అహా

ఒ హో హో..వయ్యారి వగలమారి కుమారీ
వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ..
యు..సిల్లి..

చరణం: 2
పడుచుదనం మిడిచిపాటు ఎంతకాలము
గడుసువాడు తగిలితే... కాళ్ళబేరమూ
పడుచుదనం మిడిచిపాటు ఎంతకాలము
గడుసువాడు తగిలితే... కాళ్ళబేరమూ

ఈ రుసరుసలూ... గుసగుసలూ... ఎందుకమ్మాయి
ఈ రుసరుసలూ... గుసగుసలూ... ఎందుకమ్మాయి
ఇంక పస ఉంటే వేసుకొందం.., రోజూ లడాయి
ప్రతి రోజూ లడాయి

వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ..
అబబబభా..

చరణం: 3
బిగదీయకు బిగదీయకు పైటకొంగును
ఎంత బిగదీస్తే బిగువులంట బైట పడేను
కౌగిట దాచమనేనూ..

బిగదీయకు బిగదీయకు పైటకొంగును
ఎంత బిగదీస్తే బిగువులంట బైట పడేను
కౌగిట దాచమనేనూ..

ఎగదోయకు ఎగదోయకు కోడె గుండెనూ..
ఎగదోయకు ఎగదోయకు కోడె గుండెనూ..
నీవు ఎగతాళికి చేస్తే అది వెంటబడేను
నీ అంతేదో... చూసేను..ఏయ్..

ఒ హో హో..వయ్యారి వగలమారి కుమారీ
వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ..
యు..నో..


******   ******   ******


చిత్రం:  సుపుత్రుడు (1971)
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం:  సినారె
గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి:
ఏమివ్వను నీకేమివ్వను.. నా మనసే నీదైతే ఏమివ్వను
ఏమివ్వను నీకేమివ్వను.. నా మనసే నీదైతే ఏమివ్వను

నన్నే వలచి నా మేలు తలచి..
నన్నే వలచి నా మేలు తలచి..
లేని కళంకం మోసిన ఓ చెలీ… మచ్చలేని జాబిలి
ఏమివ్వను నీకేమివ్వను.. నా మనసే నీదైతే ఏమివ్వను

చరణం: 1
తారకలే కోరికలై మెరియగా కనులు విరియగా...
వెన్నెలలే వేణువులై పలుకగా మధువు లొలుకగా
యుగయుగాలు నిన్నే వరియించనా
నా సగము మేన నిన్నే ధరియించనా..

ఏమివ్వను నీకేమివ్వను.. నా మనసే నీదైతే ఏమివ్వను

ఏమడుగను ఇంకేమడుగను.. నీ మనసే నాదైతే ఏమడుగను

చరణం: 2
నీ కన్నుల వెలుగులే తారకలై... నయన తారకలై
నీ నవ్వుల జిలుగులే చంద్రికలై... కార్తీక చంద్రికలై
జగమంతా నీవే అగుపించగా...
నీ సగము మేన నేనే నివసించగా

ఏమడుగను ఇంకేమడుగను.. నీ మనసే నాదైతే ఏమడుగను
నిన్నే వలచి నీ మేలు తలచి...
నిన్నే వలచి నీ మేలు తలచి
బ్రతుకే నీవై పరవశించు చెలినీ... నీ జాబిలినీ

ఏమడుగను ఇంకేమడుగను.. నీ మనసే నాదైతే ఏమడుగను
ఆహాహా... ఆహాహా... ఆహాహహా...

చెల్లెలి కాపురం(1971)

చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన
కర కంకణములు గలగలలాడగ
అడుగులందు కలహంసలాడగా
నడుములో తరంగామ్ములూగగా
వినీల గజభర.. విలాస బంధుర.. తనూలతిక చంచలించిపోగ

ఆడవే మయూరీ .. నటనమాడవే మయూరీ
నీ కులుకును గని నా పలుకు విరియ .. నీ నటనలు గని నవ కవిత వెలయగ
ఆడవే మయూరీ .. నటనమాడవే మయూరీ

అది యమునా సుందర తీరము.. అది రమణీయ బృందావనము
అది విరిసిన పున్నమి వెన్నెల.. అది వీచిన తెమ్మెర ఊయల
అది చల్లని సైకత వేదిక.. అట సాగెను విరహిని రాధిక
అది రాధ మనసులో మాధవుడూదిన రసమయ మురళి గీతిక

ఆడవే మయూరీ .. నటనమాడవే మయూరీ
నా పలుకులకెనెయడు .. కులుకు చూపి.. నా కవితకు సరియగు నటన చూపి..
ఇక ఆడవే మయూరీ .. నటనమాడవే మయూరీ..

హాల నేత్ర సంప్రభాత జ్వాలలు ప్రసవశరుని దహియించగా..
పతిని గోలు పడి రతీదేవి దుఖితమతియై రోదించగా..
హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమధ గణము కనిపించగా
ప్రమదనాద కర పంకజ భ్రాంకృత ఢమరుధ్వని వినిపించగా
ప్రళయ కరళ సంకలిత భయంకర జలదరార్భటుల.. జలిత దిక్కటుల.. జహిత దిక్కరుల.. వికృత
ఘీంకృతుల.. సహస్రఫణ సంచలిత భూత్క్రుతుల

కనులలోన.. కనుబొమలలోన.. అధరమ్ములోన.. వదనమ్ములోన
కనులలోన.. కనుబొమలలోన.. అధరమ్ములోన.. వదనమ్ములోన
గళసీమలోన.. కటసీమలోన.. కరయుగములోన.. పదయుగములోన
నీ తనువులోని అణువణువులోన.. అనంత విధముల అభినయించి.. ఇక ఆడవే.. ఆడవే .. ఆడవే ..

చిత్రం : చెల్లెలి కాపురం(1971)
సంగీతం : K.V.మహదేవన్ 
సాహిత్యం : సినారె 
గానం : S.P.బాల సుబ్రమణ్యం

ప్రేమనగర్ (1971)

చిత్రం :  ప్రేమనగర్ (1971)

సంగీతం  :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం  :  సుశీల


పల్లవి :


ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా

ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా

చుట్టుపక్కల ఉన్నావంటే.. చూడకుండా ప్రాణ ముండదురా..ఆ 

ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా  


చరణం 1 :


కూలికెళ్తే నాకే రారా.. చేను వున్నాది

కూడు తింటే నాతో తినరా.. తోడువుంటాది

కూలికెళ్తే నాకే రారా.. చేను ఉన్నాది

కూడు తింటే నాతో తినరా.. తోడువుంటాది

ఇంకేడకైనా ఎల్లావంటే..ఏ.. ఏ..ఇంకేడకైనా ఎల్లావంటే

నాది చుప్పనాతి మనసు.. అది నీకు తెలుసు

నాది చుప్పనాతి మనసు.. అది నీకు తెలుసు ఒప్పి వూరుకోనంటది

 

ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా 

 

చరణం 2 :


ఊరినిండా వయసు పిల్లలు.. ఒంటిగున్నారు

వాటమైనవాడ్ని చూస్తే.. వదలనంటారు

ఊరినిండా వయసు పిల్లలు.. ఒంటిగున్నారు

వాటమైనవాడ్ని చూస్తే.. వదలనంటారు

నీ చపల బుద్ది సూపావంటే..ఏ... ఏ..

మనిషి నాకు దక్కవింక.. మంచిదాన్ని కాను ఆనక

 

ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా

 

చరణం 3 :


పగటిపూట పనిలో పడితే.. పలకనంటావు

రాతిరేళ రహస్యంగా.. రాను జడిసేవు

పగటిపూట పనిలో పడితే.. పలకనంటావు 

రాతిరేళ రహస్యంగా.. రాను జడిసేవు

నే తెల్లవార్లు మేలుకుంటే.. నే తెల్లవార్లు మేలుకుంటే 

ఎఱ్ఱబడ్డ కళ్ళు చూసి.. ఏమేమో అనుకొని

ఎఱ్ఱబడ్డ కళ్ళు చూసి.. ఏమేమో అనుకొని

ఈది ఈది.. కుళ్ళుకుంటాది       

 

ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా

ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా

చుట్టుపక్కల ఉన్నావంటే.. చూడకుండా ప్రాణ ముండదురా..ఆ 

ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా


***** ******** *************


చిత్రం :  ప్రేమనగర్ (1971)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి:


తాగితే మరచిపోగలను... తాగనివ్వదు

మర్చిపోతే తాగగలను... మరువనివ్వదు


మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే

మనసున్న మనిషికీ సుఖము లేదంతే

మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే

మనసున్న మనిషికీ సుఖము లేదంతే

మనసు గతి ఇంతే ...


చరణం 1:


ఒకరికిస్తే మరలి రాదూ ..ఓడిపోతే మరిచిపోదూ

ఒకరికిస్తే మరలి రాదూ ..ఓదిడిపోతే మరిచిపోదూ

గాయమైతే మాసిపోదూ ... పగిలిపోతే అతుకుపడదూ


మనసు గతి ఇంతే ..మనిషి బ్రతుకింతే..మనసు గతి ఇంతే 


చరణం 2:


అంతా మట్టేనని తెలుసూ... అదీ ఒక మాయేనని తెలుసూ

అంతా మట్టేనని తెలుసూ ... అదీ ఒక మాయేనని తెలుసూ

తెలిసీ వలచీ విలపించుటలో ... తీయదనం ఎవరికి తెలుసూ 

మనసు గతి ఇంతే ..మనిషి బ్రతుకింతే...మనసు గతి ఇంతే


చరణం 3:


మరుజన్మ ఉన్నదో లేదో ...ఈ మమతలప్పుడేమౌతాయో

మరుజన్మ ఉన్నదో లేదో ... ఈ మమతలప్పుడేమౌతాయో

మనిషికి మనసే తీరని శిక్షా... దేవుడిలా తీర్చుకున్నాడు కక్షా


మనసు గతి ఇంతే ..మనిషి బ్రతుకింతే..

మనసున్న మనిషికీ సుఖము లేదంతే

మనసు గతి ఇంతే




***** ******** *************


చిత్రం  :  ప్రేమనగర్ (1971)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి:


నేను పుట్టాను... లోకం మెచ్చింది

నేను ఏడ్చాను... లోకం నవ్వింది

నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది

నాకింకా లోకంతో పని ఏముంది.. డోంట్ కేర్.. 



నేను పుట్టాను... లోకం మెచ్చింది

నేను ఏడ్చాను... లోకం నవ్వింది

నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది

నాకింకా లోకంతో పని ఏముంది.. డోంట్ కేర్.. 


చరణం 1:


నేను తాగితే కొందరి కళ్లు గిరగిర తిరిగాయి

నేను పాడితే అందరి నోళ్లు వంతలు పాడాయి

నేను తాగితే కొందరి కళ్లు గిరగిర తిరిగాయి

నేను పాడితే అందరి నోళ్లు వంతలు పాడాయి



నేను ఆడితే అందరి కాళ్లు నాతో కలిశాయి 

నేను ఆడితే అందరి కాళ్లు నాతో కలిశాయి

తెల్లవారితే వెనకన చేరి నవ్వుకుంటాయి..

హ హ హ హ హ... డోంట్ కేర్...


నేను పుట్టాను... లోకం మెచ్చింది

నేను ఏడ్చాను... లోకం నవ్వింది

నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది

నాకింకా లోకంతో పని ఏముంది.. 


చరణం 2:


మనసులు దాచేటందుకు పైపై నవ్వులు ఉన్నాయి

మనిషికి లేని అందం కోసం రంగులు ఉన్నాయి

ఎరగక నమ్మినవాళ్ల నెత్తికి చేతులు వస్తాయి

ఎరగక నమ్మినవాళ్ల నెత్తికి చేతులు వస్తాయి

ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి..

డోంట్ కేర్.... 


నేను పుట్టాను... లోకం మెచ్చింది

నేను ఏడ్చాను... లోకం నవ్వింది

నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది

నాకింకా లోకంతో పని ఏముంది..  


చరణం 3:


మనిషిని మనిషిని కలిపేటందుకే పెదవులు ఉన్నాయి

పెదవులు మధురం చేసేటందుకే మధువులు ఉన్నాయి

బాధలన్ని బాటిల్లో నేడే దింపేసేయ్

బాధలన్ని బాటిల్లో నేడే దింపేసేయ్

అగ్గిపుల్ల గీసేసెయ్ నీలో సైతాన్ తరిమేసేయ్..

డ్రైవ్ ది డెవిల్ అవుట్..హ హ హ హ హ హ... 


నేను పుట్టాను... లోకం మెచ్చింది

నేను ఏడ్చాను... లోకం నవ్వింది

నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది

నాకింకా లోకంతో పని ఏముంది..  డోంట్ కేర్....




***** ******** *************



చిత్రం : ప్రేమనగర్ (1971)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : ఘంటసాల



పల్లవి:


తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా

తేరులా.. సెలయేరులా.. కల కలా.. గల గలా

కదలి వచ్చింది.. కన్నె అప్సరా

వచ్చి నిలిచింది.. కనుల ముందరా..


తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా

తేరులా.. సెలయేరులా.. కల కలా.. గల గలా

కదలి వచ్చింది.. కన్నె అప్సరా

వచ్చి నిలిచింది.. కనుల ముందరా..


చరణం 1:


తెలుగువారి ఆడపడుచు ఎంకిలా


ఎంకి కొప్పులోని.. ముద్దబంతి పువ్వులా

తెలుగువారి ఆడపడుచు ఎంకిలా

ఎంకి కొప్పులోని.. ముద్దబంతి పువ్వులా


గోదారి కెరటాల గీతాల వలే నాలో

పలికినది..... పలికినది.... పలికినది

చల్లగా చిరుజల్లుగా... జల జల గల గలా

కడలి వచ్చింది కన్నె అప్సరా

వచ్చి నిలిచింది కనుల ముందరా


తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా...



చరణం 2:


రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి

ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి

రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి

ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి


లోలోన.. నాలోన.. ఎన్నెన్నో రూపాలు

వెలసినవి..... వెలసినవి... వెలసినవి...

వీణలా.. నెరజాణలా... కల కల.. గల గలా

కదలి వచ్చింది కన్నె అప్సరా

ఎదుట నిలిచింది కనుల ముందరా


తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా...


***** ******** *************




చిత్రం : ప్రేమనగర్ (1971)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి:


కడవెత్తుకొచ్చిందీ... ఈ ఈ ఈ... కన్నెపిల్ల.. ఆ ఆ..

అది కనపడితే చాలు నా గుండె గుల్ల

కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల

అది కనపడితే చాలు నా గుండె గుల్ల


కాడెత్తుకొచ్చాడూ...ఊ ఊ ఊ... గడుసుపిల్లడు.. ఊ ఊ..

వాడు కనపడితే చాలు నాకొళ్ళు తెలవదు

కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు

వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు


చరణం 1:


పిక్కలపై దాక.. చుక్కల చీర కట్టి

పిక్కల పై దాక.. చుక్కల చీర కట్టి

పిడికలంత నడుము చుట్టు పైట కొంగు బిగగట్టి

వెళుతుంటే...చూడాలి..

వెళుతుంటే చూడాలి దాని నడక

అబ్బో ఎర్రెత్తి పోవాలి దాని ఎనక


కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల

అది కనపడితే చాలు నా గుండె గుల్ల


చరణం 2:


చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగారాలు

చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు

బిరుసైన..కండరాలు..

బిరుసైనా కండరాలు.. మెరిసేటి కళ్ళడాలు

వస్తుంటే.. చూడాలి

వస్తుంటే చూడాలి వాడి సోకు

వాడు వద్దంటే ఎందుకీ పాడు బతుకు


కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు

వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు


చరణం 3:


తల పాగా బాగ చుట్టి ములుకోల చేతబట్టి

అరకదిమి పట్టుకొని మెరక చేనులో వాడు

తల పాగా బాగ చుట్టి ములుకోల చేతబట్టి

అరకదిమి పట్టుకొని మెరక చేనులో వాడు


దున్నుతుంటే ...చూడాలి

దున్నుతుంటే చూడాలి వాడి జోరు

వాడు తోడుంటే తీరుతుంది వయసుపోరు


కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు

వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు



చరణం 4:


నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతు

వంగింది చిన్నదీ వంపులన్ని ఉన్నది

నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతు

వంగింది చిన్నదీ వంపులన్ని ఉన్నది


చూస్తుంటే చాలు దాని సోకు మాడ

పడి చస్తాను వస్తనంటే కాళ్ళకాడ


కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల

అది కనపడితే చాలు నా గుండె గుల్ల

కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు

వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు



***** ******** *************



చిత్రం : ప్రేమనగర్ (1971)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : సుశీల


పల్లవి:


ఆ... ఆ... ఆ... ఆ...


ఎవరో రావాలి..

నీ హృదయం.. కదిలించాలి

నీ తీగలు.. సవరించాలి

నీలో రాగం.. పలికించాలి


ఎవరో రావాలి....

నీ హృదయం.. కదిలించాలి

నీ తీగలు.. సవరించాలి

నీలో రాగం.. పలికించాలి..

ఎవరో రావాలి....


చరణం 1:


మూల దాగి ధూళి మూగి... మూగవోయిన మధుర వీణ..

మూల దాగి ధూళి మూగి... మూగవోయిన మధుర వీణ..

మరిచి పోయిన మమత లాగ...

మరిచి పోయిన మమత లాగ... మమతలుడిగిన మనసు లాగ

మాసిపో.. తగునా...

ఎవరో రావాలి....


చరణం 2:


ఎన్ని పదములు నేర్చినావో... ఎన్ని కళలను దాచినావో..

ఎన్ని పదములు నేర్చినావో... ఎన్ని కళలను దాచినావో..

కొనగోట మీటిన చాలు...

కొనగోట మీటిన చాలు... నీలో కోటి స్వరములు పలుకును..


ఎవరో రావాలి.....



చరణం 3:



రాచనగరున వెలసినావు... రస పిపాసకు నోచినావు

రాచనగరున వెలసినావు... రస పిపాసకు నోచినావు

శక్తి మరచి.. రక్తి విడచి...

శక్తి మరచి.. రక్తి విడచి... మత్తు ఏదో మరగినావు

మరిచిపో... తగునా...


ఎవరో రావాలి....

నీ హృదయం.. కదిలించాలి

నీ తీగలు.. సవరించాలి

నీలో రాగం.. పలికించాలి..

ఎవరో రావాలి.... 




***** ******** *************



చిత్రం :  ప్రేమనగర్ (1971)

సంగీతం  :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం  :  ఘంటసాల


పల్లవి:


ఎవరికోసం ..ఎవరికోసం

ఈ ప్రేమ మందిరం ..ఈ శూన్యనందనం

ఈ భగ్న హృదయం ..ఈ అగ్ని గుండం

ఎవరికోసం ..ఎవరికోసం.. ఎవరికోసం.. ఎవరికోసం 


చరణం 1:


ప్రేమభిక్ష నువ్వే పెట్టీ

ఈ పేద హృదయం పగులగొట్టీ

పిచ్చివాణ్ణి పాత్రలేని బిచ్చగాణ్ణి చేశావు

నువ్వివనిదీ తాకలేనూ ..ఇంకెవరినీ అడుగలేనూ

బ్రతుకు నీకు ఇచ్చాను.. చితిని నాకు పేర్చావు


ఎవరికోసం ..ఎవరికోసం

ఈ ప్రేమ మందిరం ..ఈ శూన్యనందనం

ఎవరికోసం ..ఎవరికోసం.. ఎవరికోసం.. ఎవరికోసం ??


చరణం 2:


ఓర్వలేని ఈ ప్రకృతి ప్రయళంగా మారనీ

నా దేవి లేని ఈ కోవెల తునాతునకలై పోనీ

కూలిపోయి ధూళిలో కలసిపోనీ ...కాలిపోయి బూడిదే మిగలనీ


ఎవరికోసం ..ఎవరికోసం

ఈ ప్రేమ మందిరం ..ఈ శూన్యనందనం

ఎవరికోసం ..ఎవరికోసం.. ఎవరికోసం.. ఎవరికోసం 


చరణం 3:


మమత నింపమన్నానూ .. మనసు చంపుకొన్నావూ

మధువు తాగనన్నాను .. విషం తాగమన్నావూ

నీకు ప్రేమంటే నిజం కాదూ ...నాకు చావంటే భయంలేదూ

నీ విరహంలో బ్రతికానూ ...ఈ విషంతో మరణిస్తానూ ...మరణిస్తానూ..