Showing posts with label 2010. Show all posts
Showing posts with label 2010. Show all posts

రోబో (2010)




చిత్రం: రోబో (2010)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వనమాలి 
గానం: విజయ్ ప్రకాష్ , శ్రేయ ఘోషల్ 

నీలో వలపు అణువులే ఎన్నని
న్యూట్రాన్ ఎలెక్ట్రాన్  నీ కన్నులోన మొత్తం ఎన్నని
నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశే రేగేనే అయ్యో...

సన సన ప్రశ్నించన
అందం మొత్తం నువ్వా
ఆ న్యూటన్  సూత్రమే నువ్వా 
స్నేహం దాని ఫలితమంటావా
నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా
అందం మొత్తం నువ్వా

నువ్వు బుద్దులున్న తింగరివి
కానీ ముద్దులడుగు మాయావి
మోఘే ధీం తోం తోం, ధీం తోం తోం
ధీం తోం తోం మదిలో నిత్యం
తేనె పెదవుల యుద్ధం
రోజా పువ్వే రక్తం
ఓ ధీం తోం తోం మదిలో నిత్యం
 
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ

సీతాకోక చిలకమ్మేమో
కాళ్ళను తాకించి రుచి నెరుగు
ప్రేమించేటి ఈ మనిషేమో
కన్నుల సాయంతో రుచి నెరుగు
పరుగులిడు వాగుల నీటిలో ఆక్సీజన్ మరి అధికం
పాడుతున్న పరువపు మనసున ఆశలు మరి అధికం
ఆశవై రావ ఆయువే నింపిన ప్రేమే చిటికెలో చేద్దాం పిల్లా నువురావా
వలచేవాడు స్నేహం ఎదకు చేరు కాలం చిలికి ఇవ్వు గుండె వాడుతున్నది
వలచేదాన నీలో నడుము చిక్కి నట్టే బతుకులోన
ప్రేమల కాలం వాడుతున్నదే

ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ

నీలో వలపు అణువులే ఎన్నని
న్యూట్రాన్ ఎలెక్ట్రాన్ నీ కన్నులోన మొత్తం ఎన్నని
నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశ రేగేనే అయ్యో...
సన సన ప్రశ్నించన
అందం మొత్తం నువ్వా
ఆ న్యూటన్  సూత్రమే నువ్వా
స్నేహం దాని ఫలితమంటావా
నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా
అందం మొత్తం నువ్వా

ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ

ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ

గాయం-2 (2010)

చిత్రం: గాయం-2 (2010)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వనమాలి
నేపధ్య గానం: ఇళయరాజా

పల్లవి:

కలగనే కన్నుల్లో కరగకే కన్నీరా
కలసిన గుండెల్లో కలతలే కన్నారా
నిన్న మొన్న నీడల్లే
నీతో ఉన్న సందెల్లే
ఈ వెతలుగ చెలరేగేనా
నాతో సాగే స్నేహం
నాలో రేపే శోకం
శాపంలాంటి దూరం
చూపించేనా తీరం

కలగనే కన్నుల్లో కరగకే కన్నీరా

చరణం 1:

ఏనాటిదో అనురాగం
ఈనాడిలా పెనవేసే
పాదం సాగే ప్రతిచోట
పాశం తానే అడుగేసే
మనసే మురిసే మలుపులలోన
వెతలే రగిలే ఎద లయలోన
మదిని వీడని మమతిదియని
మరి మరి ముడిపడగా

కలగనే కన్నుల్లో కరగకే కన్నీరా

చరణం 2:

గాయం మాన్పే చెలిమేదో
కాలం ఇలా కలిపేనా
గమ్యం చేరే తరుణాన
గాలి వాన ఉరిమేనా
ఒడిని వెతికే సమయములోన
ధరణి కనని మది కుమిలేనా
వలచిన కథ వరము అవ్వనీ
చెరగని గురుతులుగా

కలగనే కన్నుల్లో కరగకే కన్నీరా
కలసిన గుండెల్లో కలతలే కన్నారా
నిన్న మొన్న నీడల్లే
నీతో ఉన్న సందెల్లే
ఈ వెతలుగ చెలరేగేనా
నాతో సాగే స్నేహం
నాలో రేపే శోకం
శాపంలాంటి దూరం
చూపించేనా తీరం

కలగనే కన్నుల్లో కరగకే కన్నీరా

***************** *************************** *******************

చిత్రం: గాయం-2 (2010)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: అనంత శ్రీరామ్
నేపధ్య గానం: శ్రీరామ్ పార్థసారథి, గీతా మాధురి

పల్లవి:

ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనె ఆగేవమ్మా రా
సందె వేళ అయ్యిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మా రా
వెంట వెంటనే అన్నీ అందుకోగరా.. జంట వింతలే ఎన్నో చూసుకోగరా
ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనె ఆగేవమ్మా రా
సందె వేళ అయ్యిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మా రా

చరణం 1:

నిన్ను నన్ను దూరం చేసే చెయ్యి లేదనీ
నీకు నాకు చేరువ పెంచే చూపు ఉందనీ
నిన్ను నన్ను దూరం చేసే చెయ్యి లేదనీ..
నీకు నాకు చేరువ పెంచే చూపు ఉందనీ
చాటుమాటులో సరసం చాలదీ పని
గోటి రాతలే కవితై నీకు తోచనీ
తెలిపేందుకు వస్తున్నా.. తెలిసిందని కనుగొన్నా..
కొరికేసే కల నువ్వై రారా... హహాహాహా..

ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనె ఆగేవమ్మా రా
సందె వేళ అయ్యిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మా రా

చరణం 2:

చిన్న చోటులోనే అందే పెద్ద హాయిని
ఆడుతున్న ఇద్దరు గెలిచే వింత ఆటని
చిన్న చోటులోనే అందే పెద్ద హాయిని...
ఆడుతున్న ఇద్దరు గెలిచే వింత ఆటని
పొందకుంటే ఈ మాత్రం జన్మ ఎందుకో
ఆడకుంటే ఈ ఆత్రం ఇక్కడెందుకో
అడగాలని అనుకున్నా.. అటు నీ కసి కనుగొన్నా..
ఇది నీదే ఇక ఏదేమైనా... హాహాహాహా...
ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనె ఆగేవమ్మా రా
సందె వేళ అయ్యిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మా రా
వెంట వెంటనే అన్నీ అందుకోగరా ..జంట వింతలే ఎన్నో చూసుకోగరా
ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనె ఆగేవమ్మా రా
సందె వేళ అయ్యిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మా రా

శంభో శివ శంభో (2010)

చిత్రం: శంభో శివ శంభో  (2010)
సంగీతం: సుందర్ సి. బాబు
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: శంకర్ మహదేవన్


శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో

ఉరిమే మబ్బులు ఉప్పెన కానీ
నీలకు బదులు నిప్పులు రానీ
పిడికిలి వదలకు పిడుగులు పడని
చూపర ధైర్యాన్ని...

నరాలు తెగిపడి నెత్తురు రానీ
నరమేధాలే కలిగిన గాని
స్నేహం కోసం ప్రాణం పోనీ
చెయ్యర యుద్ధాన్ని...

శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో

నువ్వెవరు నేనెవరంటూ తేడాలే లేకపోతే
లోకంలో సోఖం లేదు మనుషుల్లో లోపం లేదు
చీకటిలో విడిపోతుంది నీ నీడే నిన్నొంటరిగా
నవ్వుల్లో బాధల్లోను విడిపోనిది స్నేహమేగా
ప్రపంచమే తలకిందైనా...
ప్రేమ వెంట స్నేహం ఉంటే.. విజయమే

శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో

ఉరిమే మబ్బులు ఉప్పెన కానీ
నీలకు బదులు నిప్పులు రానీ
పిడికిలి వదలకు పిడుగులు పడని
చూపర ధైర్యాన్ని...

నరాలు తెగిపడి నెత్తురు రానీ
నరమేధాలే కలిగిన గాని
స్నేహం కోసం ప్రాణం పోనీ
చెయ్యర యుద్ధాన్ని...

శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో

ఓ ఓ ఓ
కామంతో కలిసే ప్రేమ కలకాలం నిలబడుతుందా
నదిలోన భోగ్గే పెడితే క్షణమైనా నిలుచుంటుందా
ప్రేమన్నది దైవం లేరా స్నేహం తన బీజమేనురా
నీ ఆశలు తీరడానికి ఆ ముసుగులు వేసుకోకురా
స్నేహానికి జన్మ హక్కురా...
నీ తప్పు ఒప్పున దిద్దేయ్.. బాధ్యత

శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో

చంద్రం  రౌద్రం ఔతుందేంటి
మంచే అగ్నిగ మరిగిందేంటి
ప్రేమకు గ్రహణం పడుతుందేంటి బదులే రాదేంటి
దిక్కులు దిశలే మారాయేంటీ
పడమట సూర్యుడు పొడిచాడేంటి
గుండెల్లో ఈ గుణపాలేంటి అసలీ కథయేంటి

శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో


******  *******  *******


చిత్రం: శంభో శివ శంభో  (2010)
సంగీతం: సుందర్ సి. బాబు
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: యస్. పి.బాలు, సాధనా సర్గమ్

పల్లవి:
కనుపాపల్లో ప్రేమ కలలే చూపినా
మరునిమిషంలో ప్రేమా కలతే రేపినా
పూవే అందునా ముళ్ళనే దాటక
ప్రేమే చేరునా మనసునే వేధించక
ప్రతి కథలో ఇది సహజం
పరులకిదే అపార్ధం

చరణం: 1
కడలిని వీడి అడుగులు వేయవు అలలేనాడు
నింగిని వీడి నిలబడగలదా వెన్నెల ఏనాడూ
దేహం ఒకరు ప్రాణం ఒకరని దేవుడు కలిపాడు
విధిలా మారి మళ్ళీ తానే విడదీస్తున్నాడు
ఓ దైవమా...ఈ పాపమెవ్వరిది మరి నీదా నాదా
నా కన్నులలో కన్నీరేల
తుడిచే నేస్తం కనపడదేలా

చరణం: 2
హృదయంలో తొలి ఉదయంలా తన ప్రేమే వెలిగిందీ
ఊహకు అందని ఉపద్రవమేదో నను బలి చేసింది
కనులకు చూపై పెదవికి నవ్వై నను మురిపించింది
ఆ కన్నులలోనే కన్నీరై కలవర పరిచింది
ఓ నేస్తమా...ఓ నేస్తమా నాకన్నా నిన్నే మిన్నగ ప్రేమించా ప్రేమా
అడుగే పడదు అలికిడి లేకా
మరణంలోనూ నిను మరువను ఇంక


******  *******  *******


చిత్రం: శంభో శివ శంభో  (2010)
సంగీతం: సుందర్ సి. బాబు
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: హరిహరన్

పల్లవి:
ఎవరేమన్నా ప్రేమా ఎదకోతేనుగా
ఎదురీతల్లొ ప్రేమ ఎదుగును వింతగా
ప్రేమను ప్రళయమే వీడిపోదూ
తనతో ఆడితే ప్రేమ తానే కాదు
ప్రతి కథలో ఇది సహజం
పరులకిదే అపార్ధం

చరణం: 1
కడలిని వీడి అడుగులు వేయవు అలలేనాడు
నింగిని వీడి నిలబడగలదా వెన్నెల ఏనాడూ
దేహం ఒకరు ప్రాణం ఒకరని దేవుడు కలిపాడు
విధిలా మారి మళ్ళీ తానే విడదీస్తున్నాడు
ఓ దైవమా...ఈ పాపమెవ్వరిది మరి నీదా నాదా
నా కన్నులలో కన్నీరేల
తుడిచే నేస్తం కనపడదేలా

చరణం: 2
హృదయంలో తొలి ఉదయంలా తన ప్రేమే వెలిగిందీ
ఊహకు అందని ఉపద్రవమేదో నను బలి చేసింది
కనులకు చూపై పెదవికి నవ్వై నను మురిపించింది
ఆ కన్నులలోనే కన్నీరై కలవర పరిచింది
ఓ నేస్తమా...ఓ నేస్తమా నాకన్నా నిన్నే మిన్నగ ప్రేమించా ప్రేమా
అడుగే పడదు అలికిడి లేకా
మరణంలోనూ నిను మరువను ఇంక

స్నేహగీతం (2010)

చిత్రం: స్నేహగీతం (2010)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: కార్తిక్


వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరే
వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే
రేపటి గెలుపుకు రూపమే ఓటమిరా
వేకువ జాడను వెతికే మెరుపై రా

వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరే
వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే

చినుకై రాలే మేఘాన్ని ఆపేనా ఎవరైనా
వెనుకడుగెయ్యక శిఖరాన్నే చేరాలో ఏమైనా
నీ కలలను చూపేనా కని పెంచిన అమ్మైనా
నీ కలతను చెరిపేనా శ్రుష్టించిన బ్రహ్మైనా

నీకే సాధ్యం ....ఆ ఆ ఆ

వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరే
వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే

రేపటి గెలుపుకు రూపమే ఓటమిరా
వేకువ జాడను వెతికే మెరుపై రా

పడినా లేచే కెరటాల ప్రతిబింబం బ్రతుకేగా
నడి రాతిరిని దాటందే ఉదయం చిగురించదుగా
ఆ నింగిని తాకేలా సందిస్తే నీ బాణం
తన పరుగును ఆపేనా ఎదురయ్యే అవరోధం

గెలుపే తధ్యం .....ఆ ఆ ఆ

వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరే
వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే
రేపటి గెలుపుకు రూపమే ఓటమిరా
వేకువ జాడను వెతికే మెరుపై రా


******  ******  *******


చిత్రం: స్నేహగీతం (2010)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: సిరా శ్రీ
గానం: సాయి శివాని

వెలిగే వెన్నెలే విడిచేనా
తెలిసి కన్నులే కరిగేనా .....ఓ ప్రేమా

కలలే అలలై కన్నులు నదులై కలతలుగా నిలిచే
కమ్మని కబురే కాదని కదిలే కలకలమే మిగిలే
తలపే... చెదిరెనా
తపనే ....తరిమెనా

వెలిగే వెన్నెలే విడిచేనా
తెలిసి కన్నులే కరిగేనా .....ఓ ప్రేమా

చిగురులు తొడిగిన తోడే కలయై చిటికెలో నను వీడే
చింతే వచ్చి చెంతన చేరి శిశిరం లా తోచే
నడకే .....తడబడే
నడిపే..... విధి ఇదే

వెలిగే వెన్నెలే విడిచేనా
తెలిసి కన్నులే కరిగేనా .....ఓ ప్రేమా


******  ******  *******


చిత్రం: స్నేహగీతం (2010)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: సిరా శ్రీ
గానం: సాయి శివాని

ఒక స్నేహమే..మము కలిపే
ఒక బంధమే... విరబూసే
సంతోషమే.. మది నిండే
నవలోకమే.. పిలిచిందే
ఏవో ఏవో ఏవేవో.. ఎదలో కదిలే కథలేవో
ఏవో ఏవో ఏవేవో ఎదురై నిలిచే కలలేవో

ధ్యేయం ధ్యానం ఒకటై సాగే..
లక్ష్యం గమ్యం ఒకటై ఆడే..
ఒక చెలిమి కోసం వేచే క్షణం
ఒక చెలియ కోసం జరిపే రణం
ఏవో ఏవో ఏవేవో.. ఎదలో కదిలే కథలేవో

స్నేహం ప్రేమై మారే వైనం..
జతగా కలిసి చేసే పయనం
ఒక నవ్వు కోసం ఓ సంబరం
ఒక మెప్పు కోసం పెను సాహసం

హృదయం లోన మెరిసే స్వప్నం
ప్రణయం వరమై తెలిపే సత్యం
ఎదగదుల పైన ఓ సంతకం
మది నదులు కలిపే ఈ సంగమం
ఏవో ఏవో ఏవేవో.. ఎదలో కదిలే కథలేవో
ఏవో ఏవో ఏవేవో ఎదురై నిలిచే కలలేవో

సింహా (2010)




చిత్రం: సింహా (2010)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గాత్రం: హరిహరన్, కౌసల్య


బంగారు కొండ మరుమల్లె దండ
మనసైన అండ నువ్వేరా
బంగారు కొండ మరుమల్లె దండ
మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీరూపు నిండా
నా బ్రతుకు పండ రావేరా
శ్వాశించలేను నిను చూడకుండా
జీవించలేను నిను చేరకుండా
ఏకాంత సరసాలు సాయంత్ర సరదాలు
ప్రేమంతరాగాలు పలికించు ప్రియుడ
గోరంత విరహాలు కొండంత మురిపాలు
జల్లంత జలసాలు జరిపించు ఘనుడ
నీ అడుగు జాడ అది నాకు మేడ

బంగారు కొండ మరుమల్లె దండ
మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీరూపు నిండా
నా బ్రతుకు పండ రావేరా

ఈ మహారాజు చిరునవ్వునే
నా మణిహార మనుకొందున
ఈ వనరాణి కొనచూపునే
నా ధన దాన్యమనిపించనా
నువ్వే నువ్వే నరసింహ స్తోత్రం
ఒడిలో గుడిలో వల్లించనా
నువ్వై నావే గాయత్రి మంత్రం
పగలు రేయి జపియించనా
నీ కరుణ కిరణాలు హృదయాన ఉదయాలు
నీవెంటే నామనుగడ నీగుండె నా తలగడ

బంగారు కొండ మరుమల్లె దండ
మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీరూపు నిండా
నా బ్రతుకు పండ రావేరా

నీ మీసాల గిలిగింతకే
ఆ మోసాలు మొదలాయేనా
నీ మునివేళ్ళ తగిలింతకే
ఆ మునిమాపు కదలాయేనా
నీకే నీకే సోగసాభిషేకం
నిముషం నిముషం చేయించనా
నీతో తనువు మనసు మమేకం
మనదోలోకం అనిపించనా
సంసార కావ్యాలు సంస్కార కార్యాలు
కలగలుపు గుణవంతుడ
కలియుగపు భగవంతుడా

బంగారు కొండ మరుమల్లె దండ
మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీరూపు నిండా
నా బ్రతుకు పండ రావేరా


*********   **********   ********


చిత్రం: సింహ (2010)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గాత్రం: కునాల్ గంజ్ వాల, టీనా

జానకీ జానకీ జానకీ ఎక్కడికి పోతావే జానకీ
జానకీ జానకీ జానకీ ఎక్కడికి పోతావే జానకీ
దేనికీ దేనికీ దేనికీ వెనకేనేకే పడతావు దేనికీ?
ఎహ్ వచ్చెయ్ వచ్చెయ్ గట్టు చాటుకి
చమటెక్కిస్తా తెల్ల చీరకి
సర్లే అంటె ఒక్క పుటకి కావలంట మాటి మాటికీ
అరేయ్ అందాలే దాచోద్దె హైసలకడి దాటికి

జానకీ... జానకీ...
జానకీ జానకీ జానకీ ఎక్కడికి పోతావే జానకీ
దేనికీ దేనికీ దేనికీ వెనకేనేకే పడతావు దేనికీ?

సోయగాల సంపదే హైలైటు
ఎలా పెంచినావొ చెప్పవె సెక్రేటు
కౌగిలింత ఒక్కటె టాబ్లెట్
నిన్ను పట్టుకున్న ఫీవరే హంఫట్టూ
వరెవా నువ్వు ఇంత తేరగా ఇస్తుంటే
తిమ్మిరే తిర్చేసుకొనా
ఇస్ లా మన్నిస్త నిస్ గా లాగిస్తే
వయసునే వడ్డించుకోనా
ఎ బరిలొ నాదేలే గెలుపు
హే త్వరగ ముసేయి తలుపు
చలో నా రాణి నువ్వే లే మల్లెపుల్ల కొటకీ

జానకీ...జానకీ...
జానకీ జానకీ జానకీ ఎక్కడికి పోతావే జానకీ
దేనికీ దేనికీ దేనికీ వెనకేనేకే పడతావు దేనికీ?

లిప్పు తోటి లిప్పుకే లింకెట్టు
ఇక మొగుతాయ్ యవ్వనాల ట్రంపెట్టు
మాయదారి సిగ్గులే కప్పెట్టు
జరా ఒంటిలోన ఎక్కడో తీపెట్టు
జోరుగా నే పైట జారగా ఈ పుటా
జాతరే నా గుండెలోనా
ఎహ్ ఆగలేనంటుంటే ఆపుగా చూస్తుంటే
ఆకలే తీర్చేసిపోనా
హేయ్ అదిరే నీ ఒంటి మెరుపు
ఆ పరువాలే పట్టు పరుపు
మరి లేటైతే బాగోదే లేటు నైటు ఆటకి

జానకీ...జానకీ...
come on Baby...come on...
జానకీ జానకీ జానకీ ఎక్కడికి పోతావే జానకీ
దేనికీ దేనికీ దేనికీ వెనకేనేకే పడతావు దేనికీ??
దేనికీ??

జుమ్మంది నాదం (2010)



చిత్రం: జుమ్మంది నాదం (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు


పల్లవి:

దేశమంటే మతం కాదోయ్.. గతం కాదోయ్
అడవి కాదోయ్ గొడవ కాదోయ్
అన్న చేతి గన్ను కాదోయ్
క్షుద్ర వేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్
తీవ్ర వ్యాధిగ మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్
దేశమంటే..

చరణం: 1

గడ్డి నుండీ గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్
చట్ట సభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదోయ్
రాజధానుల రాచభవనపు రాసలీలలు కాదు కాదోయ్
అబలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదోయ్..
పరిథి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్
సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్ బందు కాదోయ్..
ప్రాణ ధన మానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్
దేశమంటే...
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే మనుషులోయ్

చరణం: 2

ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
హిసలెందుకు సమస్యలను నవ్వుతూ పరిష్కరించు
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
క్రోథమెందుకు కరుణపంచు స్వార్థమెందుకు సహకరించు
పంతమెందుకు పలకరించు కక్షలెందుకు కౌగిలించు
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
మల్లెపువ్వుల లాంటి బాలల తెల్లకాగితమంటి బ్రతుకులు రక్త చరితగ మారకుండా రక్ష కలిగించు
కొత్త బంగరు భవిత నేడే కానుకందించు
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
దేశమంటే...
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే...
దేశమంటే మనుషులోయ్



*********  *********   **********


చిత్రం: జుమ్మంది నాదం (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కృష్ణ చైతన్య, సునీత

ఎంత ఎంత ఎంత చూడనూ
ఎడమ కుడి ఎటేపు చూడను
రెండూ రెండేగా ఉన్నాయంట నా కన్నులూ
అరెరెరెరే.. ఎన్నని సిరులెన్నని నిధులెన్నని మరి చూడాలికా
అరెరెరెరే... ఉన్నవి సరిపోవని నా కన్నులు అరువిస్తానుగా
ఎంత ఎంత ఎంత చూడనూ
ఎడమ కుడి ఎటేపు చూడను

చరణం: 1

చేతికేసి చూస్తే చెంపగారు సిద్దం
నిదురు చూస్తే పెదవిగారు పలికె స్వాగతం
అడుగుకేసి చూస్తే జడలు చేసె జగడం
మెడను చూస్తె నడుముగారు నలిగె తక్షణం
అరెరెరెరే... చూడకు తెగ చూడకు తొలి ఈడుకు దడ పెంచేయకూ
అరెరెరెరే... ఆపకు నను ఆపకు కనుపాపల ముడి తెంచేయకూ
ఎంత ఎంత ఎంత చూడనూ
ఎడమ కుడి ఎటేపు చూడను


చరణం: 2

పైన పైన కాదూ లోన తొంగి చూడూ
మనసు మూల దొరుకుతుంది ప్రణయ పుస్తకం
కళ్ళతోటి కాదు కౌగిళ్ళతోటి చూస్తే వయసు మనకు తెలుపుతుంది వలపు వాస్తవం
అరెరెరెరే... చూపులు మునిమాపుగ మన రేపుగ ఇక మారాలిగా
అరెరెరెరే... రేపటి మన కలయికలను ఇప్పటి కల చూపిందిగా



*********  ********   ********


చిత్రం: జుమ్మంది నాదం (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: యస్.పి.బాలు, గీతమధురి, బాలాజీ, దీపు

లాలి పాడుతున్నది ఈ గాలి
ఆ లాలి రాగాలలో నువు ఊయల ఊగాలి
లాలి పాడుతున్నది ఈ గాలి
ఆ లాలి రాగాలలో నువు ఊయల ఊగాలి
ఏలో యాలా ఏలో యాలా హైలెస్సో
హైల పట్టు హైలెస్సా బల్లాకట్టు హైలెస్సా
అద్దిర బాబు హైలెస్సా అక్కడ పట్టు హైలెస్సా
సన్నాజాజి చీరకట్టి సిన్నాదొచ్చి హైలెస్సా
కన్నూగొట్టే హైలెస్సా...
తన్నానన్న తన్నన తన్నానన్నా హైలెస్సా

చరణం: 1

గాలి కొసల లాలి ఆ పూల తీవెకు
వేలి కొసల లాలి ఈ బోసి నవ్వుకు
బుడి బుడి నడకలకు భూమాత లాలి
ముద్దు ముద్దు పలుకులకు చిలకమ్మ లాలి
ఉంగా ఉంగా సంగీతాలకు కోయిలమ్మ లాలి
కుహుఁ... కుహుఁ...
చెంగు చెంగు గంతులకు చందమామలు దాగివున్న కుందేలమ్మ లాలి
నా లాలి నీకు పూలపల్లకి
అలసిన కళ్లకి సొలసిన కాళ్లకి
ఏమేమి పూవొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
గుమ్మాడి పూవొప్పునే గౌరమ్మ
గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ
ఏమేమి పూవొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
గుమ్మాడి పూవొప్పునే గౌరమ్మ
గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ
గుమ్మాడి సెటు మీద ఆట చిలకల్లారా
పాట చిలకల్లారా కలికి చిలకల్లారా
కందుమ్మ గడ్డలు కలవారి మేడలు
ముత్యప్పు గొడుగులు మురిపాల మురుగులు
రంగు రుద్రాక్షలు తీరు గోరెంటలు
తీరు రుద్రాక్షలు పరుగుల కట్టలు
ఏమేమి పూవొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ

చరణం: 2

వెన్నముద్ద లాలి చిన్నారి మేనికి
గోరుముద్ద లాలి బంగారు బొమ్మకి
ఓనమాలు పలికితే పలకమ్మ లాలి
బాలశిక్ష చదివితే పలుకులమ్మ లాలి
దినదినము ఎదుగుతుంటే దినకరుని లాలి
పదుగురొచ్చి నిను మెచ్చితే కన్నులారా చూసే తల్లికి కడుపు తీపి లాలి
నా లాలి నీకు పూలపల్లకి
అలసిన కళ్లకి సొలసిన కాళ్లకి
లాలి పాడుతున్నది ఈ గాలి
ఆ లాలి రాగాలలో నువు ఊయల ఊగాలి


*********  ********   *********


చిత్రం: జుమ్మంది నాదం (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం:
గానం:

నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ నిన్నే నా స్వామీ
నన్ను దోచుకుందువటే

చరణం: 1

తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూలదండ వోలే..కర్పూర కళిక వోలే
ఎంతటి నెరజాణవు నా అంతరంగమందు నీవు
ఎంతటి నెరజాణవు నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని సంకెలలు వేసినావు సంకెలలు వేసినావు
నన్ను దోచుకుందువటే
నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ..
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ నిన్నే నా స్వామీ
నన్ను దోచుకుందువటే

చరణం: 2

నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై
నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలిసిపోదు నీలో కలిసిపోదు నీలో
ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం
ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గంధం ఇగిరిపోని గంధం
నన్ను దోచుకుందువటే..
నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ నిన్నే నా స్వామీ
నన్ను దోచుకుందువటే



*********  ********   ********



చిత్రం: జుమ్మంది నాదం (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: అరుణ్ గర్వార, చైత్ర

ఏలోరే.. ఏలోరే...
ఏలో ఏలో ఏలో ఏలో ఏలోరే ఏలో
ఏం సక్కగున్నవ్ రో  నా సొట్ట సెంపలోడ
ఏం సిక్కగున్నవ్ రో నా సిట్టి జుంపాలోడ
ఏం సిక్కగున్నవ్ రో నా సిట్టి జుంపాలోడ
పక్కన నువ్వుంటే నాకు రెక్కలు ఉన్నట్టే
రెక్కలు నాకుంటే నేను సుక్కలో ఉన్నట్టే
ఫక్కున నువు నవ్వితే
ముత్యాల్ వజ్రాల్ వైడూర్యాలు ఏరుకుంటాలే
మెళ్ళో ఏసుకుంటాలే !
ఏం సక్కగున్నావే సంపంగి ముక్కు దానా
ఏం సిక్కగున్నావే లవంగి టెక్కుదానా

చరణం: 1

చీర కొంగులో నన్ను కట్టుకో  బొడ్డు లోపలా నన్ను దోపుకో
పూల దస్తిలో నన్ను పెట్టుకో  రైక లోపల నన్ను దాచుకో
ఓహో ఎర్రని రిబ్బెన పువ్వల్లే చేసి
నల్లని కొప్పున నన్ను చుట్టుకో
కొప్పున చుట్కుంటే లోకం చూస్తదీ  ఆహా
రైకల పెట్కుంటే గిలిగిలైతదీ  ఆహా
బొడ్డుల దోప్కుంటే  మోసమైతదీ అమ్మొ మోసమైతదీ
ఏదో పోనీ అని వంటిగొదిలితే
ఏస్కపోతరేమో నా ఈడు ఆడోళ్ళు !
సక్కగున్నవ్ రో  ఏం సక్కగున్నవ్ రో  నా సొట్ట సెంపలోడ
ఏం సిక్కగున్నవ్ రో  నా సిట్టి జుంపాలోడ

చరణం: 2

పచ్చనాకులా పళ్ళెం పెట్టుతా వేడి వేడిగా బువ్వ వడ్డిస్తా
ఆవకాయలో నెయ్యి కల్పుతా  ముద్దు పెడితె నే ముద్ద తింపిస్తా
అబ్బొబ్బొ తినుకుంటా నా ఏలు కొరికితే  మబ్బుల్లో సెంద్రయ్య సిగ్గు సెందాడా
గోరింటా ఆకులు ముద్ద నూరుతా  కాళ్ళకూ వేళ్ళకూ నేనే అద్దుతా
పాదాల దగ్గరనే  సేద తీరుతా  ఆహా సేద తీరుతా
తెల్లవారంగానే నేనే కడుగుతా  నీ కాలి మెరుపులో పొద్దుపొడుపునే చూస్తా
సక్కగున్నవ్ రో నా సొట్ట సెంపలోడ
ఏం సిక్కగున్నవ్ రో   నా సిట్టి జుంపాలోడ
ఏం సక్కగున్నావే సంపంగి ముక్కు దానా
ఏం సిక్కగున్నావే లవంగి టెక్కుదానా
ఏలోరే... ఏలోరే...
ఏలో ఏలో ఏలో ఏలో ఏలోరే ఏలో

ప్రస్థానం (2010)



చిత్రం: ప్రస్థానం (2010)
సంగీతం: మహేష్ శంకర్
సాహిత్యం: వనమాలి
గానం: సాహితి, మహేష్ శంకర్


ఇన్నాళ్లుగా నేను నేనుగా
ఉన్నానులే ఈ తీరుగా
ఈనాడిలా ఉన్నపాటుగా
అయ్యానులే నేన్నీవుగా
వస్తానుగా వెన్నంటే నీడగా
ఉన్నానుగా గుండెల్లో నిండుగా
నన్నింతగా నీవే మార్చేశావుగా
నన్నింతగా నీ ప్రతి మాయ నీదే కాదా
అంతేనుగా నీ మాటే నీదిగా
ప్రేమించగా నీ మధి వేసే నాలో పాగా

ఇన్నాళ్లుగా నేను నేనుగా
ఉన్నానులే ఈ తీరుగా

ఏ వైపుగా నా అడుగు సాగినా
నీ ముంగిటే ఆ నడక ఆగినా
ఏం దాచినా ఈ రెప్పల్చాటున
నీ రూపమే నా కనులు చూపిన
ప్రేమంటే ఎవరికైనా
అలవాటు లేని ప్రేమగా
తపనెంతగా తరుముతున్నా
తడబాటు తొలగి నేనేగా

ఇన్నాళ్లుగా నేను నేనుగా
ఉన్నానులే ఈ తీరుగా
ఈనాడిలా ఉన్నపాటుగా
అయ్యానులే నేన్నీవుగా

ఈ గుండెలో నీ కలల సవ్వడి
విన్నానులే నీ వెంట గారడీ
నీ చూపులే నా వయసు వెంబడి
ఆపేదెలా నీ చిలిపి అలజడి
క్షణమైన నన్నువీడి నీతలపే ఉండనందా
గతమెంతగా తోడుతున్నా
నేనే నీ చోటు ఉన్నాగా

ఇన్నాళ్లుగా నేను నేనుగా
ఉన్నానులే ఈ తీరుగా
ఈనాడిలా ఉన్నపాటుగా
అయ్యానులే నేన్నీవుగా
వస్తానుగా వెన్నంటే నీడగా
ఉన్నానుగా గుండెల్లో నిండుగా
నన్ను ఇంతగా నీవే మార్చేశావుగా
నన్నింతగా నీ ప్రతి మాయ నీదే కాదా
అంతేనుగా నీ మాటే నీదిగా
ప్రేమించగా నీ మధి వేసే నాలోపాగా

ఇన్నాళ్లుగా...

డాన్ శీను (2010)

చిత్రం: డాన్ శీను (2010)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: హేమచంద్ర , మాళవిక

అందమేమో విస్తరాకు మడత చూస్తే మావిడాకు
అందమేమో విస్తరాకు మడత చూస్తే మావిడాకు
తళుకు బెళుకు తామరాకు తడిమి చూస్తే తమలపాకు
ఇన్ని ఉండి అందక పోతే మహా చిరాకు
ఎహే చిరాకు చెడ్డ చిరాకు

చాకులా చెలరేగ మాకు
మీద మీదకి దూకమాకు
లంగరేసి లాగ మాకు సందు చూసి దువ్వమాకు
నేను వచ్చి అల్లుకుపోతా
నువ్వు రామాకు అహ రామాకు ఇటు రామాకు
బంగారు పిట్ట వంపుల పుట్ట
సొంపుల చిట్టా చూస్తూ ఉంటే నోరూరే

చీమల పుట్ట చంపకు ఇట్టా
ముద్దుల పట్టా కావాలంటే లేజారే

అమ్మాయి అమ్మాయి అయస్కాంతం మింగావే
గుప్పెడు గుండెను పట్టుకు లాగావే
అల్లాడే పిల్లాడే మిర్చిలా ఉందే
మెంటర్ ఉంటే కి మాటలు పెట్టాడే

దిమ్మతిరిగి బొమ్మడి పోయే
నా దిమ్మకు దిం దిమ్మకు ధం ధమ్మకు ధమ్మకు
అత్తరు బుడ్డీ చుక్కల మిడ్డీ
చక్కర వడ్డీ చూడాలంటే నాతో రా
బుగ్గలు నొక్కి సిగ్గులు తొక్కి ఉక్కిరి బిక్కిరి చేయాలంటే నాతో దా దా ధా
కన్నేసి వచ్చాడే పిన్నీసు గుచ్చాడు
ఎక్కడి వక్కడ తక్కెడ వేసేడే

నక్కేదో తొక్కావే లక్కీగా దక్కానే
ఎప్పటికప్పుడు తప్పుకు పోతావే

వీడే స్పీడు చూస్తూవుంటే
లవ్ ఎటాక్ హ లవ్ అటాక్ అబ్బాబ్బా లవ్ ఎటాకు

అందమేమో విస్తరాకు మడత చూస్తే మావిడాకు
అందమేమో విస్తరాకు మడత చూస్తే మావిడాకు
తళుకు బెళుకు తామరాకు తడిమి చూస్తే తమలపాకు
ఇన్ని ఉండి అందక పోతే మహా చిరాకు
ఎహే చిరాకు చెడ్డ చిరాకు

చాకులా చెలరేగ మాకు
మీద మీదకి దూకమాకు 
లంగరేసి లాగ మాకు
నీకు నాకు లింకువుందని
బయట తళుకు బయట తళుకు బయట తళుకు

********** ******** ********** *********

చిత్రం : డాన్ శీను (2010)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : బాబా సెహగల్

ఎస్.. హూ ఈజ్ ఇట్. డాన్ శీను..
ఒంటి పేరు శీను.. అద్దిరిపోయిందబ్బా
ఇంటి పేరు డాను.. అల్లాడిపోయే దెబ్బ
ఒంటి పేరు శీను.. శీను..
నా ఇంటి పేరు డాను.. డాను..

వీడెవడో వీరమాసు తిరకాసు కేసులా ఉన్నాడే
వీడి మాటలు నమ్ముకుంటె
ప్రతి ఇంటి గడపకో డానుంటాడే

డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ
నా ముమ్కిన్ హై .. ఏ..

ఐదేళ్ళ వయసుకే నేనమితాబచ్చన్ ఫానురా
హైస్కూలు టైముకే మా ఊళ్ళో నేనో డానురా
దావుదుకి తీసిపోను దేన్లోనైనా
త్వరలో ఎస్ గాంగ్ పెట్టి రాబోతున్నా
ఇత్తడి చిత్తడి నేనొస్తే గత్తర కత్తెర గమ్మత్తే
గ్రూపులు గుంపులు గల్లంతే నా ఒకడికి నమస్తే

ఐదేళ్ళ వయసుకే నేనమితాబచ్చన్ ఫానురా
హైస్కూలు టైముకే మా ఊళ్ళో నేనో డానురా

డి ఫర్ డానంటేనే, ఓ స్టారు సూపర్ స్టారు
ఏ పుడింగు లెజెండుకైన ఉండదుగా అంత పవరు
ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అయినా మన వైపే చూస్తారు
ఏ న్యూస్ కు తక్కువ పడిన మన స్టోరీ వేస్తారు
కన్ను కొడితె కత్తి లాంటి పోర్లు
కాలు పెడితే కొత్త కొత్త కార్లు
ఫోను కొడితే మస్తుగా వసూళ్ళు
గన్ను పడితే చెప్పలేని థ్రిల్లూ.. ఏ..
దమ్ముంటే దక్కుతుందిరా డాన్ చైరు
ఆ చైరుకి టైలర్ మేడ్ రా నా ఫిగరు

ఇత్తడి చిత్తడి నేనొస్తే గత్తర కత్తెర గమ్మత్తే
గ్రూపులు గుంపులు గల్లంతే నా ఒకడికి నమస్తే
ఐదేళ్ళ వయసుకే నేనమితాబచ్చన్ ఫానురా
హైస్కూలు టైముకే మా ఊళ్ళో నేనో డానురా

వీడెవడో వీరమాసు తిరకాసు కేసులా ఉన్నాడే
వీడి మాటలు నమ్ముకుంటె
ప్రతి ఇంటి గడపకో డానుంటాడే

హే గ్లోబును బంతాడొచ్చు, మనమే డాన్ ఐతే
మోస్ట్ వాంటెడ్ మొగాడవ్వొచ్చు డే బై డే రైజైతే
రివాల్వర్ చూపించొచ్చు రిస్కేదో ఎదురైతే
గర్ల్ ఫ్రెండ్స్ తో జింతాకనొచ్చు మూడంతా వేడైతే
పోలీస్ నైనా విసికించొంచ్చు
సారిడాన్లే తినిపించొచ్చు
సినిమా స్టార్స్ కి ఫ్రెండ్ అవ్వొచ్చు
క్రికెట్ స్టార్స్ ని ఆడించొచ్చు
ఏ ఏం చేస్తున్నా నయా పైస లేదే ఖర్చు
ఎవడినో బెదిరించి కోట్లు గుంజేయచ్చు.

ఇత్తడి చిత్తడి నేనొస్తే గత్తర కత్తెర గమ్మత్తే
గ్రూపులు గుంపులు గల్లంతే నా ఒకడికి నమస్తే


నాపేరు శివ (2010)




చిత్రం : నాపేరు శివ (2010)
సంగీతం : యువన్‌శంకర్‌రాజా
సాహిత్యం: సాహితి
గానం : హరిచరణ్

పల్లవి:
వెన్నెల చేతపట్టి తేనా పిండి బొమ్మ చేసి ఈనా
ఓహో ఆటలాడుదాం
పాటపాడుదాం చంద్రవంక పైన
నింగికి వెయ్యి నిచ్చెనలు
మేఘము చెయ్యి మాలికలు
వెల్‌కమ్ కడదాం చెలిమితో పై మెట్లు (2)

చరణం: 1
రేయి చూసి బెదురేలా వేదనెంతో పడనేలా
చీకటి లేక ఈ లోకాన జాబిలి అందం తెలిసేనా
కలలు నమ్ముకోనేలా కరుగు వేళ వగపేలా
కలలో పూచే పూవులు అన్నీ
చేతిలో మిలమిల మెరిసేనా
ఆ నింగికి మల్లే ఓ బంధం
మబ్బులు కమ్మిన ఎద మౌనం
కలిసొచ్చే రోజున వలపై రాదా
ప్రియమౌ అనుబంధం

చరణం: 2
కలత చెందు ఒక నిమిషం
గడిచిపోతే సంతోషం
నిలువున జ్వాలై మండేటపుడే
దీపపు వెలుగుకు ఉత్సాహం
కడలిలోన నది ఐక్యం
ఉనికి విడిన ఉప్పు గుణం
చినుకే ఐనా వానగ మారి
చివరికి కాదా మణిముత్యం
ఈ జీవితమన్నది ఓ వలయం
విశ్రాంతెరుగని ఓ స్వప్నం
అది మొదలే లేని ముగియని కథనీ
పొందకు దుఃఖాన్ని


*******  ******  ******


చిత్రం: నాపేరు శివ (2011)
సంగీతం: యువన్‌శంకర్‌రాజా
సాహిత్యం: సాహితి
గానం: కార్తీక్


పల్లవి:
మనసే గువ్వై ఎగిసేనమ్మో
చెలిమి మాటే వినపడగా
పసిపాపల్లే తడబడినానే నీ చూపెదనే తాకంగా
ఎద నాడే చేజారే నీ చెయ్యే నన్ను సోకగా
మంచల్లే కరిగేనే ఈ గాలే నాపై వీచగా
అయ్యయ్యో ప్రేమే పుట్టెనే
అది అణగని ఆశై పట్టెనే
నా ఎదలో ఏదో మెరుపై మెరిసి తలుపే తట్టేనే
కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతేచాలు
నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతేచాలు

చరణం: 1
చెంతకొచ్చి నువు నిలవడం నిన్ను కలిసి
నే వెళ్లడం అనుదినం జరిగెడి ఈ నాటకం
ఒక సగాన్ని చెప్పేయడం మరు సగాన్ని
దాపెట్టడం తెలిసెలే తెలిసెలే కారణం
కాలాలు పూచెలే వేగాలు వేచెలే
కలువా నీ కాటుక కన్నుల చూపులు
గారడి చేసేలే

చరణం: 2
నా కంటికి ఏమైనదో రేయంతా
ఎరుగదు కునుకును
ప్రియా నువు లేనిదే నీ లేను ఓవ్ ఓహో
నా మీద నీ సువాసన ఏనాడో వీచగ కోరెను
ఎలా నిను చేరక బతికేను ఓవ్ ఓహో
నా ఇరు కళ్లకే ఓ హరివిల్లువే
నీ విరిసే నవ్వులే ఎదలో పూల జల్లులే

నమో వేంకటేశ (2010)


చిత్రం: నమో వేంకటేశ (2010)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సాగర్, రోషిని


నీ కళ్ళలో మెరిసింది ఓ నిజం 
భూమ్మేదెలా ఇక నిలవడం
మేఘాలలో ఎగిరింది ఈ క్షణం
నా మనసు గాలి పటం
హో పలుకనే లేని పెదవి మౌనాన్ని
కదుపుతున్నాను నీకోసం
అదువులోలేని ఆగనేలేని
అడుగునయ్యాను ఈ నిమిషం

ఒకేలా నేడు నీలో నాలో
కలల గొడవ మొదలైయింది కొంచం

నీ కళ్ళలో మెరిసింది ఓ నిజం 
భూమ్మేదెలా ఇక నిలవడం
మేఘాలలో ఎగిరింది ఈ క్షణం
నా మనసు గాలి పటం

నువ్వేం చేశావు నా మనసుని
నీకందించాను నీదేనని
నిన్నా మొన్నలకు వీచే కన్నులకు
నేడే అందినది ఈ గెలుపు
నీకై చూశాను అరచేతిని
నువ్వే నా గీత వయ్యావని
నాలో ఊహలకు నాలో ఆశలకు
ప్రాణం పోసినది నీ పిలుపు
ఎటో చూస్తున్న నా చూపులకు
నిదుర చెదిరి ఎదురైంది మార్పు

నీ కళ్ళలో మెరిసింది ఓ నిజం 
భూమ్మేదెలా ఇక నిలవడం
మేఘాలలో ఎగిరింది ఈ క్షణం
నా మనసు గాలి పటం

నమ్మానే చెలీ నా ప్రేమని నీదాక వంతెనేస్తుందని
నువ్వే నేను అని ప్రేమే సైన్యమని
జయించావులే నా లోకాన్ని
ఇలా చూశాక నా బొమ్మని స్వర్గంతో నైన నాకేం పని
నన్నే కాదు అని నిన్నే చేరుకొని
పంచిస్తానులే నా అందాన్ని
ఇలా నీతోనె నన్నే చూసి మురిసిపోవ ఏడు వింతలన్ని

నీ కళ్ళలో మెరిసింది ఓ నిజం 
భూమ్మేదెలా ఇక నిలవడం
మేఘాలలో ఎగిరింది ఈ క్షణం
నా మనసు గాలి పటం

సీతా రాముల కళ్యాణం లంకలో (2010)

చిత్రం: సీతా రాముల కళ్యాణం లంకలో (2010)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం:
గానం: రమేష్ పట్నాయక్


నా కళ్ళలో నువ్వే కదా
నా గుండెలో నువ్వే కదా
నా ఊహలో నువ్వే కదా
నా ఊసులో నువ్వే కదా
పలికేది నీ పేరేగా
తలచేది నీ పేరేగా
నడిచేది నీ దారేగా
నా వేడి ఊపిరి రావ
నా నాడిచప్పుడై రావ
ప్రాణమా ప్రాణమా ప్రాణమా

యు ఆర్ మై ఎవ్రీథింగ్
ఐ డూ ఫర్ యు ఎనీథింగ్
న న నన న న లవ్ యు  రా (2)

నా కళ్ళలో నువ్వే కదా
నా గుండెలో నువ్వే కదా

చరణం: 1
ఆ అన్నీ నువ్వని అనుకుంటూనే
నన్నే నేను మరిచాన
నీకై దూరమై వెలిపోతూనే
నిన్నే  చేరుకున్నా
ఉంటే నీతోటే, వింటే నీ మాటే
అంతే అంతేలేరా అంటే నిన్నంటే అంటే
వెంటే నీ వెంటే వెంటా ఉంటా రా
ఏమైనా ఏదేమౌతున్న
నిను ఒదులుకోగలన ప్రేమా

యు ఆర్ మై ఎవ్రీథింగ్
ఐ డూ ఫర్ యు ఎనీథింగ్
న న నన న న లవ్ యు  రా (2)

చరణం: 1
నిన్న మొన్నలో నాలో నేను నన్నే చూసుకున్నాను
ఎన్నో నిన్నలే నేడయ్యాక ఇలా మారినాను
నీడై నూరేళ్లు తోడై వెయ్యేళ్ళు నీకై ఉంటా నేను
ఏడు జన్మాలు ఎన్నో జన్మాలు జంటే అవుతాను
నేనైనా నాలోన నువ్వై
నా మనమైతే చాలమ్మా ప్రేమా

యు ఆర్ మై ఎవ్రీథింగ్
ఐ డూ ఫర్ యు ఎనీథింగ్
న న నన న న లవ్ యు  రా (2)

కొమరం పులి (2010)

చిత్రం: కొమరం పులి (2010)
సంగీతం: ఏ. ఆర్.రెహమాన్
సాహిత్యం: చంద్రబోస్ (All Songs)
గానం: నరేష్ అయ్యర్, శ్వేతమోహన్
నటీనటులు: పవన్ కళ్యాణ్, నికేషా పటేల్
దర్శకత్వం: యస్. జె. సూర్య
నిర్మాతలు: నవోదయ అపచ్చన్, సింగణమాల రమేష్,
విడుదల తేది: 10.09.2010

ఓయ్ సూటిగ సూటిగ ధీటుగ ధీటుగ నాటుకుపోయిన చూపుల కొట్టుడు
చీటికి మాటికి మాటికి చీటికి ఘాటుగ తాకిన ఊపిరి కొట్టుడు
దాటక దాటక గీతను దాటి చెక్కిలి చేరే చెక్కర కొట్టుడు
మీటక మీటక మనసే మీటి మాటలు చెప్పే చేతల కొట్టుడు
కొట్టినవాడే దగ్గిరజరిగి, దగ్గరజరిగే సిగ్గులు పెరిగే
సిగ్గులు కరిగే ప్రేమలుపెరిగే, ఓహ్ ఓహ్ ఓ
ప్రేమలు పండగ నవ్వుల పండగ
కోమలి చెంపలు మళ్లీ కొట్టాలే

హే అమ్మ తల్లె నోర్ముయవే నోటిముత్యాల్ జార్నీయకే
అమ్మ తల్లె నోర్ముయవే నోటిముత్యాల్ జార్నీయకే

ఆ మబ్బున గాలే తాకి, ఆ గాలికి మబ్బే ఆగి, పొంగేనంట వర్షం
మరి నీ దెబ్బకు బుగ్గే కంది, నా బుగ్గన రంగే చింది, అందేనంట హర్షం
ఉలి తాకిన సూటిగ మారును కదా శిల శిల్పం
పులి దూకుడు చూడగా రేగును కదా చెలి మురిపం

ఓ లేత కొమ్మను తాకిన వెంటనే
లేలెమ్మని నిద్దుర లేచే వేణువు మదిలో మధుర మధనం
నా కొమ్మను తాకిన వెంటనే పూ రెమ్మల తేనలు పట్టి
రగిలే రిషా ఉషోదయం
నువ్వు నచ్చిన చోట నవ్వెను అందం
గిచ్చిన చోట యవ్వన గంధం
నీకు నాకు జీవన బంధాలే

హే అమ్మ తల్లే నాన్చేయకే నవరత్నాల్ రాల్చేయవే

నువ్వెక్కడవుంటే నేనక్కడ పక్కన ఉంట
నా దిక్కువు నువ్వేనంట ఉక్కిరిబిక్కిరి చేస్తుంట
నా చూపుకు జాబిలి వంట నా రేఖలు పావనమంట
నువ్వే నేనంటా

అమ్మ తల్లే అల్లాడకే

ఓహ్ రేపని మాపని మాపటి రేపని
కాదని లేదని లేదని కాదని
వేదనలోన మోదన సాధన చాలించమంట

నీ వాకిలి వేకువనవుత
నీ చీకటి చాకిరినవుత
నాకై కేకలు పెడితే కాకిలా
నయగారాల చిలకా చినక చిలకా చినక చిలకా
నువ్వు నా నింగిని కోరిన వేళ వేల గంగలుగా
మరి ఆ గంగ తిరిగే నేల సంగమాలు సంభవించే...
ఎలా ఎలా ఎలా ఎలా

జాబిలి గుమ్మ  జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ
జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ
జాబిలి గుమ్మ  జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ
జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ

కొట్టినవాడే దగ్గిరజరిగే, దగ్గిరజరిగే సిగ్గులు కరిగే
సిగ్గులుకరిగే ప్రేమలుపెరిగే ఓహ్ ఓ
ప్రేమలు పండగ నోములు పండగ
కోమలి చెంపలు మళ్లీ కొట్టాలే

అమ్మ తల్లే నోర్ముయవే
నోటిముత్యాల్ జార్నీయకే... నోటిముత్యాల్ జార్నీయకే
నోటిముత్యాల్ జార్నీయకే... నోటిముత్యాల్ జార్నీయకే


********   ********   *******


చిత్రం: కొమరం పులి (2010)
సంగీతం: ఏ. ఆర్.రెహమాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్రేయగోషల్

దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్
అందరికి అందనీది దోచేయ్
దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్
అందరికి అందనీది దోచేయ్
సాగరము నేనోయ్ నావికుడు నీవోయ్
ఈదులాడవోయ్ ఇంకేదోచేయ్

దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్ అందరికి అందనీది దోచేయ్
వెండిఘనులుండోయ్ పైడిమనులుండోయ్
ఈదులాడవోయ్ ఇంకేదోచేయ్

మని ఘనులున్నాయ్ పైడి మనులున్నాయ్
కెంపు లెన్నో నాలో పొంగేనా
నీలాలే నాలోన నిండేనోయ్ ఓఓ.. హో
సుడిగుండమో జల ఘండమో పలు ఆపదలే ఆపేసిన
ఆ ఆశలతో అన్వేషణతో ఆపై ఆపై అడుగేయ్
వెతికెయ్ వెతికెయ్ త్వరగా వెతికెయ్ సరిగా వెతికెయ్
సిరి సంపాదనంత దోచేయ్

దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్
అందరికి అందనీది దోచేయ్
సాగరము నేనోయ్ నావికుడు నీవోయ్
ఈదులాడవోయ్ ఇంకేదోచేయ్

ఆలు చిప్పలుంటాయ్ ఉత్తగవ్వలుంటాయ్
నత్తగుల్లలున్న చేరవోయ్
ముత్యాలే ఆపైన ఏ…రవోయ్ ఓఒ హూ హో
బడభాగ్నులే జడిపించిన నడిదీవులలో నడకాగినా
నీ కోరికనే దిక్సూచికతో కెరటం నీవై దూకెయ్
వెతికెయ్ వెతికెయ్ అతిగా వెతికెయ్ అతికే వెతికెయ్ సుఖసంద్రాలసారం దోచేయ్

దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్
అందరికి అందనీది దోచేయ్
దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్
అందరికి అందనీది దోచేయ్


********   ********   *******



చిత్రం: కొమరం పులి (2010)
సంగీతం: ఏ. ఆర్.రెహమాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఏ. ఆర్.రెహమాన్

మారాలంటే లోకం... మారాలంటా నువ్వే...

వీసే గాలి అందరికోసం
వాన మేఘం దాచుకోదు తన కోసం
సూర్య కాంతి అందరి కోసం
చంద్ర జ్యోతి ఎరగదు ఏ స్వార్ధం
ఒక్కరికైన మేలు చేస్తే లోకమంత మేలు జరిగేను
ఒక్కరికైన హాని చేస్తే లోకమంత హాని కలిగేను

మారాలంటే లోకం... మారాలంటా నువ్వే...

నువ్వంటే లోకం నీ వెంటే లోకం
ఈ మాట శ్లోకం సోదర...
నువ్వంటే లోకం నీ వెంటే లోకం
ఈ మాట శ్లోకం  సోదర...

మా తెలుగు తల్లికి... మల్లెపూదండ...
మా తెలుగు తల్లికి... మల్లెపూదండ...

మారాలంటే లోకం... మారాలంటా నువ్వే....

వీసే గాలి అందరికోసం
వాన మేఘం దాచుకోదు తన కోసం
సూర్య కాంతి అందరి కోసం
చంద్ర జ్యోతి ఎరగదు ఏ స్వార్ధం
ఒక్కరికైన మేలు చేస్తే లోకమంత మేలు జరిగేను
ఒక్కరికైన హాని చేస్తే లోకమంత హాని కలిగేను
సహనం లో గాంధీజీ సమరం లో నేతాజీ
సహనం లో గాంధీజీ సమరం లో నేతాజీ

మారాలంటే లోకం... మారాలంటా నువ్వే...
మా తెలుగు తల్లికి... మల్లెపూదండ...



********   ********   *******



చిత్రం: కొమరం పులి (2010)
సంగీతం: ఏ. ఆర్.రెహమాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: సుచిత్ర, జావేద్ ఆలీ

ఓ చకుముఖే ఓ చకుముఖే నువ్వు చేరగా సరసకే
ఓ శశిముఖే ఓ శశిముఖే ఇక మీసం మొలిచెను మనసుకే యాహి యాహి ఏ

మహామ్మహమాయే మహామ్మాయలిక మొదలాయెనే
మహామ్మహమాయే ముహూర్తాలు ముదిరాయే
మహామ్మహమాయే మహామ్మాయలిక మొదలాయెనే
మహామ్మహమాయే ముహూర్తాలు ముదిరాయే

బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ
తెరలను తియ్యగ
ఓహో చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగ

ఓ చకుముఖే ఓ చకుముఖే నువ్వు చేరగా సరసకే
ఓ శశిముఖే ఓ శశిముఖే ఇక మీసం మొలిచెను మనసుకే యాహి యాహి ఏ

మహామ్మహమాయే మహామ్మాయలిక మొదలాయెనే
మహామ్మహమాయే ముహూర్తాలు ముదిరాయే

కాలికే మేఘాలు తగిలెనే వేలికే గగనాలు వెలిగే
అంతరిక్ష మంతరంగ మంటూ వున్నది
పాలపుంత పూలసంత ఐనది

ఊరించుతున్న స్వర్గమే ఏరి కోరుకుంటూ వచ్చి
ఇంటి పెరటిలో మూల నగ్గుతున్నది
దైవమె కేరి కుర్ర జంట వెర్రి మించి ప్రేమకేమో మొక్కుతున్నది
అలాంటిహాయిదే అలాంటిహాయిదే ఇలాంటి హాయి ఎక్కడున్నది

ఓ..ఓ..ఓ..ఓ
మల్లి పుట్టి మల్లి పెరిగి మల్లి చూసి మల్లి కలిసి
మల్లి మెలసి మల్లి మల్లి ప్రేమ కట్టి చచ్చి పుట్టి హో
మల్లి నువ్వు మల్లి నేను మల్లి భాధ మల్లి ప్రేమ
మల్లి కొత్త రంగులను అంటి రాదూ లే

మహామ్మహమాయే మహామ్మాయలిక మొదలాయెనే
మహామ్మహమాయే ముహూర్తాలు ముదిరాయే
మహామ్మహమాయే మహామ్మాయలిక మొదలాయెనే
మహామ్మహమాయే ముహూర్తాలు ముదిరాయే

బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ తెరలను తియ్యగ
ఓహో చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగ
బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ తెరలను తియ్యగ
ఓహో చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగ

ఓ చకుముఖే ఓ చకుముఖే నువ్వు చేరగా సరసకే
ఓ శశిముఖే ఓ శశిముఖే ఇక మీసం మొలిచెను మనసుకే యాహి యాహి ఏ



********   ********   *******



చిత్రం: కొమరం పులి (2010)
సంగీతం: ఏ. ఆర్.రెహమాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: చిత్ర, హరిణి, మధుశ్రీ

నమ్మకమీయరా స్వామి
నిర్భయమీయరా స్వామి
సన్మార్గమేదో చూపరా స్వామీ
సుజ్ఞాన సూర్యున్ని మాలో వెలిగించరా

నమ్మకమీయరా స్వామి
నమ్మకమీయరా స్వామి
సన్మార్గమేదో చూపరా స్వామీ
సుజ్ఞాన సూర్యున్ని మాలో వెలిగించరా

నమ్మకమీయరా స్వామి
నమ్మకమీయరా స్వామి
సన్మార్గమేదో చూపరా స్వామీ
సుజ్ఞాన సూర్యున్ని మాలో వెలిగించరా

చెడుకు ఎదురు పోరాడే
మంచినెప్పుడూ కాపాడే
పిడుగు దేహమీయరా ప్రభూ
ప్రేమతో పాటు పౌరుషం పంతం
తేజం రాచగుణం ప్రభూ
వినయం విలువలనీయరా
నమ్మకమీయరా స్వామి

నమ్మకమీయరా స్వామి
నిర్భయమీయరా స్వామి
సన్మార్గమేదో చూపరా స్వామీ
సుజ్ఞాన సూర్యున్ని మాలో వెలిగించరా

లోన నిజం గుర్తించే
పైన భ్రమను గమనించే
సూక్ష్మ నేత్రమీయరా స్వామీ
సర్వమందించు నీ ప్రియగానం స్మరణం ప్రార్థనకై
స్వామీ సమయం స్వచ్ఛతనీయరా

నమ్మకమీయరా స్వామి
నిర్భయమీయరా స్వామి
సన్మార్గమేదో చూపరా స్వామీ
సుజ్ఞాన సూర్యున్ని మాలో వెలిగించరా

నమ్మకమీయరా స్వామి
నిర్భయమీయరా స్వామి
సన్మార్గమేదో చూపరా స్వామీ
సుజ్ఞాన సూర్యున్ని మాలో వెలిగించరా


********   ********   *******



చిత్రం: కొమరం పులి (2010)
సంగీతం: ఏ. ఆర్.రెహమాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: తన్వీషా, విజయ్ ప్రకాష్

కయ్యం మానుకుని ఇయ్యర హామీ
నయం చేయవిక ఎందుకు ఏ మీ
తయారయ్యే మరి తరికిట ధీమి
పవర్ స్టార్ పవర్ స్టార్

దెయ్యం కయ్యం అను నువ్వొక ధామి
చెయ్యండియ్యమను నువ్వరికామీ
ఎం కాదు మరి నాతి చరామి
యు ఆర్  స్టార్, యు ఆర్  స్టార్

ఇయ్యాల్సింది మరి ఇయ్యవు ఏమీ
తియ్యాల్సింది తెర తీయావు ఏమీ
అయ్యో చేయకిక తిమ్మీని బమ్మీ
అమ్మి చెల్లదిక చిల్లర దొమ్మీ
తళుకు బెళుకు తార లేనమ్మే
తెలుగు పవర్ స్టార్ వె సుమ్మీ

పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్
సూపరు సూపరు నాపైన చూపరూ...

కయ్యం మానుకుని ఇయ్యర హామీ
నయం చేయవిక ఎందుకు ఏ మీ
తయారయ్యే మరి తరికిట ధీమి
పవర్ స్టార్ పవర్ స్టార్

తప్పదిక ఛయ్యవె handsup
ఎప్పటికీ వెయ్యన లాకప్
చెప్పు మరి చేసిన తప్పులు
ఏమిటి ఏమిటి నా నేరం
ఆరెయ్ ఎందుకు ఈ దౌర్జన్యం
ఆధరాల్లో హేరైన్ ఉందెయ్...
కులుకుల్లోన కొకైన్ ఉందెయ్
అందంలో RDX నిండుందేయ్....

నేనెలొ నికోటిన్ ఉంది...
చిరునవ్వుల్లో స్టరాయ్డ్ ఉంది
ఆల్లరిలొ alcohol దాగుంది...
కౌగిలి కారాగారంలో
బిడియాన్నే ఇక బలి చేస్తా
మరి విరాహన్నే ఇక ఉరి తీస్త
నవ రసిక చెరుగులతో పసిడి చమటలతో
ముసురు చలికి తెర తీస్తా గా

కయ్యం మానుకుని ఇయ్యర హామీ
నయం చేయవిక ఎందుకు ఏ మీ
తయారయ్యే మరి తరికిట ధీమి
పవర్ స్టార్ పవర్ స్టార్

పెట్టుమారి పరుగుకి fullstop
తగ్గు మరి థగదిక wrong step
హద్దు అని నిలాపాకు ఎప్పుడు ఏమిటి ఏమిటి విపరీతం అరె ఎందుకు నాపై పంతం
వన్ వే లో ప్రవేశమేంటే
120 లో ప్రయాణమేంటే
ప్రణయం లో పద్దత పాడు లేదంటే

సిగ్నల్ నే అధిగమిస్తా
సిగ్గేయ్ వదిలి మతీబవిస్థా
చివరికి నా licence అడ్డంకవతున్న
ఎగసిన ఏరువల మార్గంలో
ఏడమైన ఆది కుడి అంట
సరే ఎరుపైన ఆది పశుపంటా
ఇక ఇఱుకు సరసమట
ఉరుకు మురిపెమట
మెలిక మోక్షమంటా పాడమంటా

మధుర ప్రేమలకు మాస్టర్ నువ్వే
మదన కాముడికి ఫుల్ స్టాప్ నువ్వే
మనసు దోచుకునే మాస్టర్ నువ్వే
పవర్ స్టార్ పవర్ స్టార్

దెయ్యం కయ్యం అను నువ్వొక ధామి
చెయ్యండియ్యమను నువ్వరికామీ
ఎం కాదు మరి నాతి చరామి
యు ఆర్  స్టార్, యు ఆర్  స్టార్

మధుర ప్రేమలకు మాస్టర్ నువ్వే
మదన కాముడికి ఫుల్ స్టాప్ నువ్వే