Showing posts with label Jaggaiah. Show all posts
Showing posts with label Jaggaiah. Show all posts

కులదైవం (1960)

పయనించే ఓ చిలుకా ఎగిరిపో
చిత్రం: కులదైవం (1960)
సంగీతం: మాస్టర్ వేణు
గీతరచయిత: సముద్రాల (జూ)
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

పయనించే..ఓ..ఓ.. ఓ... చిలుకా ...
ఆ...ఆ....ఆ....ఆ...ఆ...
పయనించే ఓ చిలుకా...ఎగిరిపో..పాడైపోయెను గూడు...
పయనించే ఓ చిలుకా...ఎగిరిపో..పాడైపోయెను గూడు...
పయనించే ఓ చిలుకా
ఆ...ఆ...ఆ...ఆ...

చరణం 1:

పుల్ల పుడక ముక్కున కరచి...గూడును కట్టితివోయి
పుల్ల పుడక ముక్కున కరచి...గూడును కట్టితివోయి
వానకు తడిసిన నీ బిగి రెక్కలు...ఎండకు ఆరినవోయి
ఫలించ లేదని చేసిన కష్టం..మదిలో వేదన వలదోయి
ఫలించ లేదని చేసిన కష్టం..మదిలో వేదన వలదోయి
రాదోయి సిరి నీ వెను వెంట..త్యాగమే నీ చేదోడు

పయనించే ఓ చిలుకా...ఎగిరిపో..పాడైపోయెను గూడు...
పయనించే ఓ చిలుకా
ఆ...ఆ...ఆ...ఆ..

చరణం 2:

తీరెను రోజులు నీకీ కోమ్మకు...కోమ్మా ఈ గూడు వదలి
తీరెను రోజులు నీకీ కోమ్మకు...కోమ్మా ఈ గూడు వదలి
ఎవరికి వారే ఏదోనాటికి...ఎరుగము ఎటకో ఈ బదిలీ
మూడు దినాల ముచ్చటయే..ఏ..ఏ..ఈ లోకంలో మన మజిలీ
మూడు దినాల ముచ్చటయే..ఏ..ఏ..ఈ లోకంలో మన మజిలీ
నిజాయితీగా ధర్మపథాన...
నిజాయితీగా ధర్మపథాన....ధైర్యమే నీ తోడు

పయనించే ఓ చిలుకా...ఎగిరిపో..పాడైపోయెను గూడు...
పయనించే ఓ చిలుకా
ఆ...ఆ...ఆ...ఆ..

చరణం 3:

మరవాలి నీ కులుకుల నడలే...మదిలో నయగారాలే
మరవాలి నీ కులుకుల నడలే...మదిలో నయగారాలే
తీరని వేదన తీయని ముసుగే...శిరస్సున శింగారాలే....
ఓర్వలేని ఈ జగతికి నీ పై...ఈ..ఈ..
ఓర్వలేని ఈ జగతికి నీ పై...లేవే కనికారాలే
కరిగి కరిగి కన్నీరై...
కరిగి కరిగి కన్నీరై...కడతేరుటే నీ తల వ్రాలి
పయనించే ఓ చిలుకా...ఎగిరిపో..పాడైపోయెను గూడు...
పయనించే ఓ చిలుకా

గోడుమని విలపించేరే ...నీ గుణం తెలిసిన వారు
గోడుమని విలపించేరే ...నీ గుణం తెలిసిన వారు
జోడుగ నీతో ఆడీ పాడీ...కూరుములాడిన వారు
ఏరులైయే కన్నీరులతో...మనసారా దీవించేరే
ఎన్నడో తిరిగి ఇటు నీ రాకా...ఎవడే తెలిసిన వారు

పయనించే ఓ చిలుకా...ఎగిరిపో..పాడైపోయెను గూడు...
పయనించే ఓ చిలుకా
ఆ...ఆ...ఆ...ఆ...

********* ******** ******** ***********

పదపదవే వయ్యారి
చిత్రం: కులదైవం (1960)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: సముద్రాల (జూ)
నేపధ్య గానం: ఘంటసాల, జమునారాణి

పల్లవి:

పదపదవే వయ్యారి గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా
పైన పక్షిలాగా ఎగిరిపోయి
పక్కచూపు చూసుకుంటూ
తిరిగెదవే గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా

చరణం 1:

ప్రేమగోలలోన చిక్కిపోయినావా
నీ ప్రియుడున్న చోటుకై పోదువా

ఓ... ప్రేమగోలలోన చిక్కిపోయినావా
నీ ప్రియుడున్న చోటుకై పోదువా
నీ తళుకంతా నీ కులుకంతా
అది ఎందుకో తెలుసును అంతా

పదపదవే వయ్యారి గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా
పైన పక్షిలాగా ఎగిరిపోయి...
పక్కచూపు చూసుకుంటూ...
తిరిగెదవే గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా

చరణం 2:

నీకు ఎవరిచ్చారే బిరుదు తోక
కొని తెచ్చావేమో అంతేగాక...

ఆ... నీకు ఎవరిచ్చారే బిరుదు తోక
కొని తెచ్చావేమో అంతేగాక..
రాజులెందరూడినా మోజులెంత మారినా
తెగిపోక నిలిచె నీ తోక

పదపదవే వయ్యారి గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా
పైన పక్షిలాగా ఎగిరిపోయి...
పక్కచూపు చూసుకుంటూ...
తిరిగెదవే గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా

చరణం 3:

అహ..హ..అహ..హా..అహ..హా...
అహ..హ..అహ..హా
నీలి మబ్బుల్లో ఆడుకుందువేమో
మింట చుక్కల్తో నవ్వుకుందువేమో ...ఓ...

నీలి మబ్బుల్లో ఆడుకుందువేమో
మింట చుక్కల్తో నవ్వుకుందువేమో ...ఓ...

వగలాడివిలే జగదంతవులే
దిగిరాకుండా ఎటులుందువులే

పదపదవే వయ్యారి గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా
పైన పక్షిలాగా ఎగిరిపోయి...
పక్కచూపు చూసుకుంటూ...
తిరిగెదవే గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా

ముందడుగు (1958)

చిత్రం :  ముందడుగు (1958)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  మాధవపెద్ది సత్యం, జానకి

పల్లవి:

కోడెకారు చిన్నవాడా.. వాడిపోని వన్నెకాడా
కోడెకారు చిన్నవాడా.. వాడిపోని వన్నెకాడా
కోటలోనా పాగా వేసావా.. చల్ పువ్వుల రంగా
మాటతోనే మనసు దోచావా.. చల్ పువ్వుల రంగా
మాటతోనే మనసు దోచావా..

చింత పూల రైక దానా.. చిలిపి చూపుల చిన్నాదానా
చింత పూల రైక దానా.. చిలిపి చూపుల చిన్నాదానా
కోరికలతో కోటే కట్టావా.. చల్ నవ్వుల రాణీ
దోరవలపుల దోచుకున్నావా.. చల్ నవ్వుల రాణీ
దోరవలపుల దోచుకున్నావా.. చల్ నవ్వుల రాణీ
దోరవలపుల దోచుకున్నావా..

చరణం 1:

చెట్టు మీద పిట్ట ఉంది.. పిట్ట నోట పిలుపు ఉంది
చెట్టు మీద పిట్ట ఉంది.. పిట్ట నోట పిలుపు ఉంది
పిలుపు ఎవరికో తెలుసుకున్నావా.. చల్ పువ్వుల రంగా
తెలుసుకుంటే కలిసి ఉంటావా.. చల్ పువ్వుల రంగా
తెలుసుకుంటే కలిసి ఉంటావా..

పిలుపు విన్నా తెలుసుకున్నా.. పిల్లదానా నమ్ముకున్నా
పిలుపు విన్నా తెలుసుకున్నా.. పిల్లదానా నమ్ముకున్నా
తెప్పలాగా తేలుతున్నానే.. చల్ నవ్వుల రాణీ
నాకు జోడుగా నావా నడిపేవా.. చల్ నవ్వుల రాణీ
నాకు జోడుగా నావా నడిపేవా..

చరణం 2:

నేల వదిలి నీరు వదిలి.. నేను నువ్వను తలపు మాని
నేల వదిలి నీరు వదిలి.. నేను నువ్వను తలపు మాని
ఇద్దరొకటై ఎగిరిపోదామా.. చల్ పువ్వుల రంగా
గాలి దారుల తేలి పోదామా.. చల్ పువ్వుల రంగా
గాలి దారుల తేలి పోదామా..

ఆడదాని మాట వింటే.. తేలిపోటం తేలికంటే
ఆడదాని మాట వింటే.. తేలిపోటం తేలికంటే
తేల్చి తేల్చి ముంచుతారంటా.. చల్ నవ్వుల రాణీ
మునుగుతుంటే నవ్వుతారంటా.. చల్ నవ్వుల రాణీ
మునుగుతుంటే నవ్వుతారంటా..

కోడె కారు చిన్న వాడా.. వాడిపోని వన్నె కాడా
కోటలోనా పాగా వేసావా.. చల్ పువ్వుల రంగా
మాటతోనే మనసు దోచావా.. చల్ పువ్వుల రంగా
మాటతోనే మనసు దోచావా..

చింత పూల రైకదానా.. చిలిపి చూపుల చిన్నాదానా
కోరికలతో కోటే కట్టావా.. చల్ నవ్వుల రాణీ
దోర వలపుల దోచుకున్నావా.. చల్ నవ్వుల రాణీ
దోర వలపుల దోచుకున్నావా..