Showing posts with label 1994. Show all posts
Showing posts with label 1994. Show all posts

హలోబ్రదర్ (1994)




చిత్రం : హలోబ్రదర్ (1994)
సంగీతం : రాజ్ కోటీ
సాహిత్యం : భువనచంద్ర
గానం : బాలు
 
కన్నెపిట్టరో కన్నుకొట్టరో ఓ..ఓ..ఓ
పాలపిట్టరో పైటపట్టరో ఓ..ఓ..ఓ
అరె అరె అరె కన్నెపిట్టరో కన్నుకొట్టరో ఓ..ఓ..ఓ
పాలపిట్టరో పైటపట్టరో ఓ..ఓ..ఓ
గుట్టు గుట్టుగా జట్టు కట్టరో
జంట చేరితే గంట కొట్టరో
ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను
పెట్టేయ్ కట్టి ఉట్టే కొట్టి తీరతాను
ఓ..ఓ..ఓ ఓ..ఓ..ఓ

చూపు చూపుకొక చిటికెల మేళం
చూసి పెట్టనా చిట్టెమ్మా
ఊపు ఊపుకొక తకధిమి తాళం
వేసిపెట్టనా చెప్పమ్మా
అదిరిపడిన కుడీ ఎడమల నడుమున
ఉడుకు వయసు ముడిపెట్టుకోనా
అసలు సిసలు లవ్ కిటుకులు తెలిసిన
పడుచు పనులు మొదలెట్టుకోనా
అదురే సరుకూ ముదిరే వరకూ
అటొ ఇటొ ఎటొ ఎటొ పడి పడి
కలేయనా అదొ ఇదొ కలబడి
ఓ..ఓ..ఓ ఓ..ఓ..ఓ 

కన్నెపిట్టరో కన్నుకొట్టరో ఓ..ఓ..ఓ
అరె పాలపిట్టరో పైటపట్టరో ఓ..ఓ..ఓ
గవ్వ తిరగబడి గలగలమంటే
గువ్వ గుండెలోన రిం జిం జిం
వేడి వేడి ఒడి చెడుగుడు అంటే
సోకులాడి పని రం పం పం
మిడిసి పడిన తడి తలుపుల మెరుపులు
మెరిసి మెరిసి పని పట్టమంటే
మతులు చెడిన చెలి జిగిబిగి బిగువులు
అరిచి అరిచి మొర పెట్టుకుంటే
పనిలో పనిగా ఒడిలో పడనా
చలో చలో చెకా చెకీ చం చం
కలేసుకో ప్రియా ప్రియా కమ్ కమ్
ఓ..ఓ..ఓ ఓ..ఓ..ఓ

కన్నెపిట్టరో కన్నుకొట్టరో ఓ..ఓ..ఓ
అరె పాలపిట్టరో పైటపట్టరో ఓ..ఓ..ఓ
గుట్టు గుట్టుగా జట్టు కట్టరో
జంట చేరితే గంట కొట్టరో
ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను
పెట్టేయ్ కట్టి ఉట్టే కొట్టి తీరతాను హా 

********** ************** ***********

చిత్రం :  హలో బ్రదర్ (1994)
సంగీతం :  రాజ్-కోటి
నేపధ్య గానం :  బాలు,  చిత్ర

ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
చేరాలి సొగసుల తీరం...
సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం...
తీరాలి వయసుల తాపం..
ఓ....ఓ...ఓ...ఓ...
ఓ....ఓ...ఓ...ఓ...
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా

చరణం 1:

అల్లరి కోయిల పాడిన పల్లవి...  స్వరాలలో నీ వుంటే.. పదాలలో నేనుంటా
వేకువ పూచిన తొలితొలి గీతిక  ప్రియా ప్రియా నీవైతే.. శృతిలయ నేనౌతా
కలకాలం కౌగిలై.. నిన్నే చేరుకోని..
కనురెప్పల నీడలో.. కలే ఒదిగి పోనీ..
ఓ ప్రియా.. ఓ.. దరిచేరితే దాచుకోనా..
తొలి ప్రేమలే దోచుకోనా..
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా


చరణం 2:

సవ్వడి చేయని యవ్వన వీణలు అలా అలా సవరించు... పదే పదే పలికించు
వయసులు కోరిన వెన్నెల మధువులు సఖి చెలి అందించు... సుఖాలలో తేలించు
పెదవులతో కమ్మని.. కథే రాసుకోనా..
ఒడి చేరి వెచ్చగా.. చలే కాచుకోనా
ఓ ప్రియా.. ఓ.. పరువాలనే పంచుకోనీ..
పడుచాటలే సాగిపోని..
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
చేరాలి సొగసుల తీరం...
సాగాలి తకధిమి తాళం..
తగ్గాలి  తనువుల దూరం...
తీరాలి వయసుల తాపం
ఓ....ఓ...ఓ...ఓ...

ఓ....ఓ...ఓ...ఓ...

********** ********************** *****************
చిత్రం : హలోబ్రదర్ (1994)
సంగీతం : రాజ్ కోటీ
సాహిత్యం : వేటూరి 
గానం : బాలు,చిత్ర 



మనసిచ్చి ఇచ్చి బరువాయే
వయసొచ్చి గిచ్చి గొడవాయే
ఇది ఏమి ప్రేమరో
ఇది ఎంత ఘటురో
ఇక చాలు లాలిజో

మనసిచ్చి ఇచ్చి బరువాయే
వయసొచ్చి గిచ్చి గొడవాయే

ఓసి వయసా నీకు తెలుసా ఈడు ఇరకాటం
ఓరి మనసా కోరి కలిసా తీర్చు బులపాటం
చలి వేలా ఎద గోలా
అదిరేలా అదరాలే అందాలే
చలి బలేలేవోయీ చెలే నీదోయె
పెదాలే తేన జల్లోయీ జతలో

మనసిచ్చి ఇచ్చి బరువాయే
వయసొచ్చి గిచ్చి గొడవాయే

ఓరి తనువా ఇంత చనువా చాటు చెలగాటం
ఓసి మగువా ఉంటె చొరవా లేదు మొహమాటం
తెర తీసా పెనవేసా
గురి చూసా పరిచేసా ప్రాయాలే
సొగసరీ నీ పేరు సరేలే జోరు
సరంటు లేదె సందేలా కథలో

మనసిచ్చి ఇచ్చి బరువాయే
వయసొచ్చి గిచ్చి గొడవాయే
ఇది ఏమి ప్రేమరో
ఇది ఎంత ఘటురో
ఇక చాలు లాలిజో

మనసిచ్చి ఇచ్చి బరువాయే
వయసొచ్చి గిచ్చి గొడవాయే

ఎర్ర సైన్యం(1994)





 పల్లవి :
 బంజారే... బంజారే...
 బంజారే బంజో ఓనారే బంజా
 ఓ నారే ఆ నారే ఓనారే బంజా
                                     ॥బంజారే॥

 చరణం : 1 
 చుక్కపొద్దూ లేచామమ్మా చందమామ
 సద్ది సంకన కట్టామమ్మా చందమామ
 ఎలపట దాపట ఎడ్లను కట్టి కర్రునాగలి భుజానబెట్టి
 సెమట చుక్కలు జల్లి సేలు సెలకలు దున్ని
 రాజనాలు పంచా... ఓ...
 రేలారే రేలారాయిలర రేలారే
                                    ॥బంజారే॥

 చరణం : 2
 అడవితల్లి బిడ్డలమమ్మా చందమామ
 అన్నెం పున్నెం ఎరగనోళ్లం చందమామ
 కొండల్ని ఏలేటి మత్తుల్ని నరికి
 బల్లకట్టునే పల్లకీ చేసి (2)
 గలగల పారేటి గోదారి ఒడిచేర్చి కలప సాగనంపా
                              ॥రేలారే॥ ॥బంజారే॥

 చరణం : 3
 కొండోళ్లు కోయోళ్లు గోను జాతోళ్లం చందమామ
 మారేడు నేరేడు పళ్లను ఏరాం చందమామ
 అడ్డాకు తునికాకు ఆకుల్ని కోసి చెట్టుమీద తేనెపట్టును తీసి
 ఇప్పబట్టి పెట్టి గుక్క గుక్క తాగి జాతరలే చేశాం
                                  ॥రేలారే॥ ॥బంజారే॥


చిత్రం : ఎర్ర సైన్యం(1994)
గానం,సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
తారాగణం : ఆర్ నారయణమూర్తి




శుభలగ్నం (1994)

పల్లవి:
ఆ... ఆ... ఆ... ఆ...
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చెయిజారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక ||చిలక||

చరణం 1:
బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే ||2||
వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతితెలివితో
కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే ||చిలక||

చరణం 2:
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో ||2||
మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో
ఆనందం కొనలేని ధనరాశితో అనాథగా మిగిలావే అమవాసలో
తీరా నువు కనుతెరిచాక తీరం కనపడదే ఇంకా ||చిలక||

చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు

శుభలగ్నం (1994)



                                     పొరుగింటి మంగళ గౌరి

పల్లవి:
పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు
ఎదురింటి పిన్నిగారి కాసులపేరు చూడు
ఇరుగుపొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు
నగానట్రా టి.వీ గట్రా కొనుక్కున్నారు
మనకి మల్లే ఎవరు ఉన్నారూ?
ఉసూరంటూ ఇలా ఎన్నాళ్ళూ?
మనబతుకేమో ఇట్టా తగలబడింది
ఎక్కడ వేసిన గొంగళి అక్కడె ఉంది
పక్కాళ్ళ పాడుగోల పట్టించుకోవద్దె
పొరుగింటి పుల్లకూర తెగమెచ్చుకోవద్దే
నెత్తిన పెట్టుకు చూసే మొగుడూ నీకూ ఉన్నాడే
అందని పళ్ళకు అర్రులు చాచీ అల్లరిపడొద్దే
మనకిలేక అదో ఏడుపా..
పరులకుంటె మరో ఏడుపా...
ఎందుకె ఇట్టా రోజూ మెదడు తింటావు
ఇంటి గుట్టంతా వీధిని పెట్టుకుంటావు


చరణం 1:

ఓ... ఓ...
కాంతమ్మగారు కట్టే చీర ఖరీదైనా లేదే పాపం తమ
జీతం
నేతచీర కట్టుకున్నా కొట్టవచ్చేటట్టు ఉండే
అందం నీ సొంతం
ఉత్తిమాటలెన్ని అన్నా నా సరదా తీరదుగా
ఉన్నదానితోనె మనం సద్దుకుంటే మంచిదిగా
కట్టుకున్న దాని సంబరం తీర్చడమే పురుష
లక్షణం
సంపదలోనే లేదు సంతోషం
చంపకె నన్నూ నీ డాబు కోసం
పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు
ఎదురింటి పిన్నిగారి కాసులపేరు చూడు
చరణం 2:

ఓ...ఓ...
పలానా వారి మిసెస్ అంటు అంతా మెచ్చుకుంటే మీకే
గొప్ప కాదా
ఆ బోడి పదవికనీ అప్పో సొప్పో చెయ్యమంటే ఊళ్ళో
పరువు పోదా
కాణీకి కొరగానీ పరువూ ఓ పరువేనా
మగాణ్ణి తూచేదీ వాడి పర్సు బరువేనా
డబ్బులేని దర్పమెందుకూ అయ్యో చేతగాని
శౌర్యమెందుకూ
నీకు మొగుడయే యోగ్యత మనిషికి లేదే
ఇనప్పెట్టెనే వరించి ఉండాల్సిందే
పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు
ఎదురింటి పిన్నిగారి కాసులపేరు చూడు
ఇరుగుపొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు ఏడిసారు
నగానట్రా టి.వీ గట్రా కొనుక్కున్నారు
మనకిలేక అదో ఏడుపా
పరులకుంటె మరో ఏడుపా
మనబతుకేమో ఇట్టా తగలబడింది
ఎక్కడ వేసిన గొంగళి అక్కడె ఉంది
ఎందుకె ఇట్టా రోజూ మెదడు తింటావు
ఇంటి గుట్టంతా వీధిని పెట్టుకుంటావు


చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: బాలు, చిత్ర

**************** **************** ********************

చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు


చిలకా ఏ తోడు లేక ఎటెపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటీ ఆశల వెనక
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చెయ్ జారాకా
లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మెశాక

గోరింకా ఏదే చిలక లేదింకా గోరింకా ఏదే చిలక లేదింకా
బతుకంతా బలి చేసే పెరాసను ప్రేమించావే
గోరింకా ఏదే చిలక లేదింకా గోరింకా ఏదే చిలక లేదింకా
బతుకంతా బలి చేసే పెరాసను ప్రేమించావే
వెలుగుల్నె వెలివెసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహాలం పొందావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలొ తడిసీ కనుమరుగైనావే

కొండంత అండ నీకు లేదింక కొండంత అండ నీకు లేదింక
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
మమకారం విలువెంతో మరీచావా సిరి మైకంలో
ఆనందం కొనలేని ధన రాసితో
అనాధగా మిగిలావే అమవాసలో
తీరా నువ్వు కను తెరిచాకా
తీరం కనబడదే ఇంకా



బొంబాయి (1994)

చిత్రం : బొంబాయి (1994)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం : వేటూరి
గానం : హరిహరన్, చిత్ర

ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను

కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్ను ఎపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూ
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు

నీ రాక కోసం తొలిప్రాణమైన
దాచింది నా వలపే
మనసంటి మగువ ఏ జాము రాక
చితి మంటలే రేపే
నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు
అది కాదు నా వేదనా
విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే
ఎద కుంగి పోయేనులే
మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా

ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి
నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి
కలకీ ఇలకీ ఊయలూగింది కంటపడీ

కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూ
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు

తొలిప్రాణమైన ఒకనాటి ప్రేమ
మాసేది కాదు సుమా
ఒక కంటి గీతం జలపాతమైతే
మరు కన్ను నవ్వదమ్మా
నా పరువాల పరదాలు తొలగించి వస్తే
కన్నీటి ముడుపాయెనే
నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా
నీ వేణు గానానికే
అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిసే

ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను

మోహమో మైకమో రెండు మనసుల్లొ విరిసినదీ
పాశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినదీ
ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడీ

************ ************ ***************
చిత్రం : బొంబాయి (1994)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం : వేటూరి
గానం : అనుపమ, నోయల్, పల్లవి, శ్రీనివాస్

పూలకుంది కొమ్మ
పాపకుంది అమ్మ
గుల్లగుల్ల హల్లగుల్ల
నింగి నేల డీడిక్కి
నీకు నాకు ఈడెక్కి
గుల్లగుల్ల హల్లగుల్ల

నవ్వితేనే దీవానా
మల్లె పూల మస్తానా
గుల్లగుల్ల హల్లగుల్ల
నీలో నేనే ఉన్నానా రూప్
తేరా మస్తానా
గుల్లగుల్ల హల్లగుల్ల
నవ్వితేనే దీవానా
మల్లె పూల మస్తానా
గుల్లగుల్ల హల్లగుల్ల
నీలో నేనే ఉన్నానా రూప్
తేరా మస్తానా
గుల్లగుల్ల హల్లగుల్ల

పున్నాగపూలకేల దిగులు
మిన్నేటి పక్షికేది కంటి జల్లు
రవి ఎన్నడూ రాత్రి చూడలేదు
స్వర్గానికి హద్దూ పొద్దు లేనే లేదు
గుల్లగుల్ల హల్లగుల్ల
గుల్లగుల్ల హల్లగుల్ల

కవ్వించాలి కళ్ళు
కన్నె మబ్బు నీళ్ళు
మేఘాలు గాయపడితే
మెరుపల్లె నవ్వుకుంటాయ్
కవ్వించాలి కళ్ళు
కన్నె మబ్బు నీల్లు
మేఘాలు గాయపడితే
మెరుపల్లె నవ్వుకుంటాయ్
ఓటమిని తీసేయ్
జీవితాన్ని మోసేయ్
వేదాలు జాతిమత బేధాలు
లేవన్నాయ్

నవ్వితేనే దీవానా
మల్లె పూల మస్తానా
గుల్లగుల్ల హల్లగుల్ల
నీలో నేనే ఉన్నానా రూప్
తేరా మస్తానా

పున్నాగపూలకేల దిగులు
మిన్నేటి పక్షికేది కంటి జల్లు
రవి ఎన్నడూ రాత్రి చూడలేదు
స్వర్గానికి హద్దూ పొద్దు లేనే లేదు
గుల్లగుల్ల. గుల్లగుల్ల.

మౌనంలోని గానం
ప్రాణంలోని బంధం
ఎగరెయ్యి రెక్కలు
కట్టి ఎదనింక తారల్లోకి
ఎగరెయ్యి రెక్కలు
కట్టి ఎదనింక తారల్లోకి
విజయం కోరే వీరం
చిందిస్తుందా రక్తం
అనురాగం నీలో ఉంటే
ఆకాశం నీకు మొక్కు

గుల్లగుల్ల హల్లగుల్ల.
గుల్లగుల్ల హల్లగుల్ల.
గుల్లగుల్ల హల్లగుల్ల.
గుల్లగుల్ల హల్లగుల్ల.
కవ్వించాలి కళ్ళు
కన్నె మబ్బు నీళ్ళు
జీవితాన్ని మోసేయ్
ఓటమిని తీసేయ్
మౌనంలోని గానం
ప్రాణంలోని బంధం
విజయం కోరే వీరం రక్తం
కోసం

నవ్వితేనే దీవానా
మల్లె పూల మస్తానా
నీలో నేనే ఉన్నానా రూప్
తేరా మస్తానా
నవ్వితేనే దీవానా
మల్లె పూల మస్తానా
నీలో నేనే ఉన్నానా రూప్
తేరా మస్తానా

************** *************** **************
చిత్రం : బొంబాయి (1995)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం : వేటూరి
గానం : హరిహరన్, జి.వి.ప్రకాష్, శ్వేత, స్వర్ణలత

కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లనివ్వు
కుందనాల కూనమ్మా పిల్లనివ్వు
ఊరువాడా నిద్దరోయె కోడి కూడా సద్దు చేసె
కుచ్చి కుచ్చి కూనమ్మా.
కుందనాల కూనమ్మా.

కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లనివ్వు
ఏ కుందనాల కూనమ్మా పిల్లనివ్వు
ఊరువాడా నిద్దరోయె కోడి కూడా సద్దు చేసె
కుచ్చి కుచ్చి కూనమ్మా.
కుందనాల కూనమ్మా.

కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేసమింక చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేసమింక చాలు వెళ్ళమంట

ఆట నెమలికి మెరుపు సుఖం
గాన కోకిలకు పిలుపు సుఖం
చెట్టు వేరుకు పాదు సుఖం ఏ.
అమ్మనాన్న పిలుపు సుఖం

రాకుమారుడికి గెలుపు సుఖం
చంటి కడుపుకి పాలు సుఖం
మొగుడు శ్రీమతి అలకలలు
ముద్దు కన్నా ముడుపు సుఖం

రేయిపగలు పన్నీట్లో ఉన్నా
రాదు మేనికి చలికాలం
అల్లిబిల్లిగా లాలిస్తుంటే
గారాల పూబాల కోరేది సరసం
బుజ్జి బుజ్జి పాపనివ్వు
పోకిరాట వేషమొద్దు
ఆ.ఆ... బుజ్జి బుజ్జి పాపనివ్వు
పోకిరాట వేషమొద్దు
వేడెక్కే అందాల పెట్టు
వేదిస్తే నా మీదే ఒట్టు

కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేసమింక చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేసమింక చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా.
కుందనాల కూనమ్మా.

చిరుత రెక్కలే పక్షివిలే
చిటెకె వెలుగులే దివ్వెవిలే
తోడు నీడ ఇక నీవేలే
తరగని పున్నమిలే
తనువుతోటివే తపనలులే
ఉరుముతోటివే మెరుపులులే
ఉన్నతోడు ఇక నీవేలే
విలువలు తెలియవులే
భూమి తిరగడం నిలబడితే
భువిని తాళమే మారదులే
మగని ఆదరణ కరువైతే
ఇల్లాలి ప్రేమంతా వేసంగిపాలె

పొత్తు కోరుకున్న ఆశ
అంటుకుంది అగ్గిలాగ
పొత్తు కోరుకున్న ఆశ
అంటుకుంది అగ్గిలాగ
బుద్దిగుంటే మంచిదంట
దూరాలు కోరింది జంట

కుచ్చి కుచ్చి కూనమ్మా.
కుందనాల కూనమ్మా.

కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేసమింక చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేసమింక చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా.

*********** *********** *************
చిత్రం : బొంబాయి (1994)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం : వేటూరి
గానం : హరిహరన్, చిత్ర

ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను

కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్ను ఎపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూ
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు

నీ రాక కోసం తొలిప్రాణమైన
దాచింది నా వలపే
మనసంటి మగువ ఏ జాము రాక
చితి మంటలే రేపే
నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు
అది కాదు నా వేదనా
విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే
ఎద కుంగి పోయేనులే
మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా

ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి
నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి
కలకీ ఇలకీ ఊయలూగింది కంటపడీ

కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూ
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు

తొలిప్రాణమైన ఒకనాటి ప్రేమ
మాసేది కాదు సుమా
ఒక కంటి గీతం జలపాతమైతే
మరు కన్ను నవ్వదమ్మా
నా పరువాల పరదాలు తొలగించి వస్తే
కన్నీటి ముడుపాయెనే
నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా
నీ వేణు గానానికే
అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిసే

ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను

మోహమో మైకమో రెండు మనసుల్లొ విరిసినదీ
పాశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినదీ
ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడీ