Showing posts with label Serial Songs. Show all posts
Showing posts with label Serial Songs. Show all posts

అమృతం (2001)

సీరియల్ : అమృతం (2001)
సంగీతం : కల్యాణి మాలిక్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కల్యాణి మాలిక్

అయ్యోలూ హమ్మోలు..
ఇంతేనా బ్రతుకు హు హు హు..
ఆహాలూ ఓహొలు..
ఉంటాయి వెతుకు హ హ హ..

మన చేతుల్లోనే లేదా
రీమోట్ కంట్రోలు..
ఇట్టే మార్చేద్దాము
ఎడుపు గొట్టు ప్రోగ్రాం లు..

వార్తల్లొ హెడ్ లైన్సా..
మన కొచ్చే చిలిపి కష్టాలు..
అయొడిన్ తో అయిపోయే..
గాయాలే మనకు గండాలు..

ఎటో వెళ్ళి పోతూ..
నిన్ను చూసింది
అనుకో ఓ ట్రబులు..
hello..how do u do..
అని అంటోంది
అంతే నీ లెవెలు..
ఆతిధ్యం ఇస్తానంటె
మాత్రం వస్తుందా...
తీరిగ్గా నీతో కాలక్షేపం
చేస్తుందా..

గాలైనా రాదయ్యా..
నీదసలే ఇరుకు అద్దిల్లు..
కాలైనా పెడుతుందా
నీ ఇంట్లో పెను తుఫానసలు..

ఒరేయ్ ఆంజినేలు..
తెగ ఆయస పడిపొకు చాలు..
మనం ఈదుతున్నాం..
ఒక చెంచాడు భవ సాగరాలు..
కరెంటు రెంటు etc.. మన కష్టాలు..
కర్రీ లొ కారం ఎక్కువ ఐతె కన్నీళ్ళు
నైటంతా దోమల్తొ..
ఫైటింగే మనకి గ్లోబల్ వార్..
భారీ గా ఫీల్ అయ్యే..
టెన్షన్ లేం పడకు గోలీ మార్.

అమృతం (2020)

సీరియల్ : అమృతం (2020)
సంగీతం : కళ్యాణి మాలిక్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కళ్యాణి మాలిక్

అయ్యోలూ హమ్మోలు..
ఇంతేనా బ్రతుకు హు హు హు..
ఆహాలూ ఓహొలు..
ఉంటాయి వెతుకు హ హ హ..

నువ్వాకాశానికి
చిల్లెట్టేంత డేంజరువా
స్పేసంతా ఇరుకై
పోయేటంత ట్రాఫిక్కువా
నీకోసం పుట్టాయా
లోకంలో అన్ని కష్టాలు
నీవల్లే వస్తాయా
ప్రళయాలూ విశ్వ విలయాలు

భయం లేదు శిశువా
ఇసుక తునకంత లేవే నువ్వసలు
నువ్వేం చేయగలవా
అష్ట దిక్కుల్ని వణికించే పనులు
ఎవరెస్టును తొక్కేస్తాయా
మన ఈ పాదాలూ
పసిఫిక్కుని ఇంకించేస్తాయా
నీ పంతాలూ

ఆటం బాంబ్ వేశావే
భూగోళం పేలి పోయిందా
గనులెన్నో తవ్వావే
పాతాళం గాని తగిలిందా

ఒరేయ్.. ఒరేయ్.. ఒరేయ్..
ఒరేయ్ ఆంజినేలు..
తెగ ఆయస పడిపొకు చాలు..
మనం ఈదుతున్నాం..
ఒక చెంచాడు భవ సాగరాలు..
కరెంటు రెంటు etc.. మన కష్టాలు..
కర్రీ లొ కారం ఎక్కువ ఐతె కన్నీళ్ళు
నైటంతా దోమల్తొ..
ఫైటింగే మనకి గ్లోబల్ వార్..
భారీ గా ఫీల్ అయ్యే..
టెన్షన్ లేం పడకు గోలీ మార్..

ఋతురాగాలు

సంగీతం : బంటి, రమేష్
సాహిత్యం : బలపద్ర పాత్రుని మధు
గానం : సునీత, బంటి.

వాసంత సమీరం లా
నునువెచ్చని గ్రీష్మం లా
సారంగ సరాగం లా
అరవిచ్చిన లాస్యం లా

ఒక శ్రావణ మేఘం లా
ఒక శ్రావణ మేఘం లా
శరత్చంద్రికల కల లా..

హేమంత తుషారం లా
నవ శిశిర తరంగం లా
కాలం.. జాలం.. లయలొ కలల అలల సవ్వడి లొ
కాలం.. జాలం.. లయలొ కలల అలల సవ్వడి లో
సాగే జీవన గానం అణువణువున ఋతురాగం
సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

వాసంత సమీరం లా
నునువెచ్చని గ్రీష్మం లా
సారంగ సరాగం లా
అరవిచ్చిన లాస్యం లా

పిన్ని

సీరియల్ : పిన్ని
సంగీతం : దిన
సాహిత్యం : పి. ఓంకార్ (సీనియర్ యాక్టర్/రైటర్)
గానం : నిత్యశ్రీ

కృష్ణమ్మకూ గోదారికీ తోడెవరమ్మా
మమతల మందాకినీ మగువేనమ్మా
ఆ నదులన్నీ కొండాకోనలు దాటాలి
ఆడది కూడా కన్నీళ్ళెన్నో దాచాలి

కుడి ఎడమలలో ఒడ్డుల ఒడిలో
నదులకు నడకలు సాగాలి..
తనువును మనసును త్యాగం చేస్తూ
పడతులు పయనం చేయాలి..

కృష్ణమ్మకూ గోదారికీ తోడెవరమ్మా
మమతల మందాకినీ మగువేనమ్మా
ఆ నదులన్నీ కొండాకోనలు దాటాలి
ఆడది కూడా కన్నీళ్ళెన్నో దాచాలి

కుడి ఎడమలలో ఒడ్డుల ఒడిలో
నదులకు నడకలు సాగాలి..
తనువును మనసును త్యాగం చేస్తూ
పడతులు పయనం చేయాలి..

నిని సాసాస.. నిని సాసాస
నిసగగ నిసగగ గమపమగరిసా
నిసగగ నిసగగ గమపమగరిసా

కడలిని చేరిన నదికి విశ్రాంతి
తరుణికి మాత్రం తీరని భ్రాంతి
పచ్చని పైరుకు నది ఆధారం
బ్రతుకున వెలుగుకు ఆడది మూలం
గంగ పొంగి పొరలిందా ప్రళయ తాండవం కాదా
సీత గీత దాటిందా యుద్దకాండ మొదలేగా
ఆ నది ఆడది శక్తి స్వరూపాలే...ఓఓఓ...
ఝుంతనఝనఝన..ఝుంతనఝనఝన..
ఝుంతన..ఝుంతన..ఝుంతనన..ఓఓఓ...

కృష్ణమ్మకూ గోదారికీ తోడెవరమ్మా
మమతల మందాకినీ మగువేనమ్మా
ఆ నదులన్నీ కొండాకోనలు దాటాలి
ఆడది కూడా కన్నీళ్ళెన్నో దాచాలి

కుడి ఎడమలలో ఒడ్డుల ఒడిలో
నదులకు నడకలు సాగాలి..
తనువును మనసును త్యాగం చేస్తూ
పడతులు పయనం చేయాలి.. 

అంతరంగాలు (1998)

సీరియల్ : అంతరంగాలు (1998)
సంగీతం : వాసూరావ్
సాహిత్యం : సుమన్
గానం : సునీత

గుండెకీ సవ్వడెందుకో
పెదవులకీ వణుకెందుకో

గుండెకీ సవ్వడెందుకో
పెదవులకీ వణుకెందుకో
పరువానికీ పరుగెందుకో
తనువుకీ తపనెందుకో

గుండెకీ సవ్వడెందుకో
పెదవులకీ వణుకెందుకో
పరువానికీ పరుగెందుకో
తనువుకీ తపనెందుకో

ఏమిటీ కొత్త వింత మదిలో ఏదో పులకింత
అర్థం కాని కవ్వింత ఆశల గిలిగింతా
ఇదేనేమో ప్రేమా నవయవ్వన సీమా
ఇదే సుమా ప్రేమా ఆ మదనుడి మహిమా

గుండెకీ సవ్వడెందుకో
పెదవులకీ వణుకెందుకో
పరువానికీ పరుగెందుకో
తనువుకీ తపనెందుకో

ఇది తొలి తొలి వలపుల
తొలకరి ధ్వని తొలకరి ధ్వని
తపనకు తరగని గని
తలపుల రాజధాని
ఇది తొలి తొలి వలపుల
తొలకరి ధ్వని తొలకరి ధ్వని
తపనకు తరగని గని
తలపుల రాజధాని

అడగకు ఇది ఏమనీ
అంతరంగానికిదే ఆమని
అనంత జీవన వాహినీ
అద్భుతానందావని
ఇది కమ్మని యామిని
జన సమ్మోహిని
జగతికే వరదాయని

ఇదే ఇదే ప్రేమా
నవయవ్వన సీమా
ఇదే సుమా ప్రేమా
ఆ మదనుడి మహిమా

గుండెకీ సవ్వడెందుకో
పెదవులకీ వణుకెందుకో
పరువానికీ పరుగెందుకో
తనువుకీ తపనెందుకో

ఇది వయస్సు చేసే తలపుల తపస్సు
ఎద ఎదనూ పండించే ఎర్రని తేజస్సూ
ఇది వయస్సు చేసే తలపుల తపస్సు
ఎద ఎదనూ పండించే ఎర్రని తేజస్సూ

ఇది మదిలో వెల్లివిరిసే ఇంధ్ర ధనుస్సు
మనసుకి పరమార్థమిచ్చే మధుర ఉషస్సూ
ఇది యవ్వన యశస్సూ ఆశల ఆశీస్సూ
దీనికో నమస్సూ

ఇదే ఇదే ప్రేమా
నవయవ్వన సీమా
ఇదే సుమా ప్రేమా
ఆ మదనుడి మహిమా

గుండెకీ సవ్వడందుకే
పెదవులకీ వణుకందుకే
గుండెకీ సవ్వడందుకే
పెదవులకీ వణుకందుకే
పరువానికీ పరుగందుకే
తనువుకీ తపనందుకే
పరువానికీ పరుగందుకే
తనువుకీ తపనందుకే

ఇదే ఇదే ప్రేమా
నవయవ్వన సీమా
ఇదే సుమా ప్రేమా
ఆ మదనుడి మహిమా

నాన్న (2004)

సీరియల్ : నాన్న (2004)
సంగీతం : కళ్యాణిమాలిక్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కళ్యాణిమాలిక్

లాలిజో లాలిజో
అని పాడను ఇకపైనా
మేలుకో మేలుకో
తెలవారే సమయానా
బొమ్మలా నువ్విలా
ఒదిగుండకు ఒడిలోనా

నమ్మకమే నాన్నఅయి
నడపాలిర ఇకపైనా
అని చెప్పిందీ....
అమ్మ చెప్పిందీ....

మరిచిపోతే నీ బాధా
తనే అనాధ అయిపోదా
నేస్తమే వదులుకో నిన్నతో

నడి ఎడారి ఇక మీదా
నవ వసంతమై పోగా
బంధమే కలుపుకో నవ్వుతో

బొమ్మలా నువ్విలా
ఒదిగుండకు ఒడిలోనా
నమ్మకమే నాన్నఅయి
నడపాలిర ఇకపైనా
అని చెప్పిందీ...
అమ్మ చెప్పిందీ... 

స్నేహ (1997)

సీరియల్ : స్నేహ (1997)
సంగీతం :
సాహిత్యం : సుమన్ 
గానం :

స్నేహ.. స్నేహ స్నేహ
స్నేహ.. స్నేహ స్నేహ

చిక్కుముడులెన్నో
చక్కగ విప్పే ఒకానొకా వనిత
ట్రిక్కులతో మోసగాళ్ల
తిక్క కుదర్చడమే ఆమె ఘనత

స్నేహ.. స్నేహ స్నేహ
స్నేహ.. స్నేహ స్నేహ

చెలిమికి మారు పేరు
ఆ తెలివికి జోహారూ
చెలిమికి మారు పేరు
ఆ తెలివికి జోహారూ
మహామాయగాళ్ళెందరో
ఆమె ముందు బేజారూ
హా.. మహా మాయగాళ్ళెందరో
ఆమె ముందు బేజారూ

స్నేహ.. స్నేహ స్నేహ
స్నేహ.. స్నేహ స్నేహ

అందమైన ఊహా
అందరికీ స్నేహ
అందమైన ఊహ
అందరికీ స్నేహ

స్నేహ.. స్నేహ స్నేహ
స్నేహ.. స్నేహ స్నేహ 

లేడీ డిటెక్టివ్ (1996)

సీరియల్ : లేడీ డిటెక్టివ్ (1996)
సంగీతం : వంశీ
సాహిత్యం : గూడురు విశ్వనాధ శాస్త్రి
గానం : బాలు

లేడీ డిటెక్టివ్..
అమ్మో యమ యాక్టివ్..

లేడీ డిటెక్టివ్
అమ్మో యమ యాక్టివ్
లేడీ డిటెక్టివ్
అమ్మో యమ యాక్టివ్

ఫ్యామిలీ ట్రబుల్స్ కి కరెక్టివ్
సొల్యూషన్ భలే ఎట్రాక్టివ్
సెలెక్టివ్ అటెంటివ్ క్రియేటివ్
సజెస్టివ్ ప్రొటెక్టివ్ రిలేటివ్
యాన్ ఎఫెక్టివ్ నాన్ డిఫెక్టివ్
లవ్లీ హైలీ క్యాలిక్యులేటివ్

లేడీ డిటెక్టివ్
అమ్మో యమ యాక్టివ్

మనిషి మనిషికో సమస్య
ఇంటి ఇంటికో సమస్య
వాడ వాడకో సమస్య
ప్రపంచమే ఓ సమస్య
సమస్య లేని స్థలమే లేదు
సమస్య కాని సంగతి లేదు
సంగతేంటో శోధిస్తుంది
సమస్యలన్నీ సాధిస్తుంది

లేడీ డిటెక్టివ్
అమ్మో యమ యాక్టివ్
లేడీ డిటెక్టివ్
అమ్మో యమ యాక్టివ్ 

శివయ్య (2002)

సీరియల్ : శివయ్య (2002)
సంగీతం : దిన
సాహిత్యం :
గానం : బాలు, స్వర్ణలత

తందాని నానని నానని నానే
తననానీ నానని నానని నానే
తందాని నానేనా ఓఓఓ..
తననానీ నానేనా...

మనసు ఉన్నది మమతల కోసం
మనిషి బతుకే తీరని దాహం
మూడు నాళ్ళేరా ఓఓఓ ఎవరి బతుకైనా
మరి ఆనాడు నీతోడు వేరెవరు రారు
ఈ జన్మ బంధాలు కడతేరి పోవూ
ఏడేడు జన్మలకు మనకథ ఇంతే

మనసు ఉన్నది మమతల కోసం
మనిషి బతుకే తీరని దాహం
మూడు నాళ్ళేరా ఓఓఓ ఎవరి బతుకైనా
మరి ఆనాడు నీతోడు వేరెవరు రారు
ఈ జన్మ బంధాలు కడతేరి పోవూ
ఏడేడు జన్మలకు మనకథ ఇంతే

ఇంకో జన్మా ఉందో లేదో
ఎవరికి తెలుసమ్మా
మళ్ళీ జన్మకు నువ్వూ నేనూ
ఎవరై పుడతామో
ఏనాటిదో ఈ బంధము
ఏ చోటికో ఈ పయనమూ
మళ్ళీ మళ్ళీ పుడుతుంటాం
ఎవరికి ఎవరో అవుతుంటాం
తీరీ తీరని ఆశలతో
ఎపుడో విడిపోతాం

మనసు ఉన్నది మమతల కోసం
మనిషి బతుకే తీరని దాహం
మూడు నాళ్ళేరా ఓఓఓ ఎవరి బతుకైనా
మరి ఆనాడు నీతోడు వేరెవరు రారు
ఈ జన్మ బంధాలు కడతేరి పోవూ
ఏడేడు జన్మలకు మనకథ ఇంతే

తందాని నానని నానని నానే
తననానీ నానని నానని నానే
తందాని నాననినా ఓఓఓ..
తననానీ నానానా...