Showing posts with label Malladi. Show all posts
Showing posts with label Malladi. Show all posts

కన్యాశుల్కం (1955)




చిత్రం : కన్యాశుల్కం (1955)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : మల్లాది రామకృష్ణశాస్త్రి
నేపథ్య గానం : సుశీల 


పల్లవి : 

ఆనందం అర్ణవమైతే...  అనురాగం అంబరమైతే
ఆనందం అర్ణవమైతే...  అనురాగం అంబరమైతే
అనురాగపు తంచులు చూస్తాం
ఆనందపు లోతులు తీస్తాం.... ఆనందం


ఆనందం అర్ణవమైతే...  అనురాగం అంబరమైతే
అనురాగపు తంచులు చూస్తాం
ఆనందపు లోతులు తీస్తాం.... ఆనందం


 చరణం 1 :

నీ కంకణ నిక్వాణంలో..
నా జీవన నిర్వాణంలో...
నీ మదిలో డోలలు తూగీ...
నా హృదిలో జ్వాలలు రేగీ... 

నీ తలపున రేకులు పూస్తే... నా వలపున బాకులు దూస్తే...
నీ తలపున...
నీ తలపున రేకులు పూస్తే... నా వలపున బాకులు దూస్తే...
మరణానికి ప్రాణం పోస్తాం... స్వర్గానికి నిచ్చెన వేస్తాం
మరణానికి ప్రాణం పోస్తాం... స్వర్గానికి నిచ్చెన వేస్తాం


ఆనందం అర్ణవమైతే...  అనురాగం అంబరమైతే
అనురాగపుటంచులు చూస్తాం
ఆనందపు లోతులు తీస్తాం.... ఆనందం


చరణం  2 :

హసనానికి రాణివి నీవై...
వ్యసనానికి బానిస నేనై...
విషమించిన మదీయ ఖేదం...
కుసుమించిన త్వదీయ మోదం... 

విషవాయువులై ప్రసరిస్తే... విరితేనియలై ప్రవహిస్తే...
విషవాయువులై ప్రసరిస్తే... విరితేనియలై ప్రవహిస్తే...
ప్రపంచమును పరిహాసిస్తాం... భవిష్యమును పరిపాలిస్తాం
ప్రపంచమును పరిహాసిస్తాం... భవిష్యమును పరిపాలిస్తాం

ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే
ప్రపంచమును పరిహాసిస్తాం... భవిష్యమును పరిపాలిస్తాం

ఆనందం అర్ణవమైతే...  అనురాగం అంబరమైతే
అనురాగపు తంచులు చూస్తాం
ఆనందపు లోతులు తీస్తాం.... 

******* *************** ************

చిత్రం : కన్యాశుల్కం (1955)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : మల్లాది రామకృష్ణశాస్త్రి
నేపథ్య గానం : ఘంటసాల 



పల్లవి : 

చిటారు కొమ్మను....
చిటారు కొమ్మను మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా
వాటం చూసి వడుపు చేసి... వంచర కొమ్మను నరుడా
వాటం చూసి వడుపు చేసి... వంచర కొమ్మను నరుడా
హోయ్...  చిటారు కొమ్మను 



చరణం 1 :  


పక్కను మెలిగే చక్కని చుక్కకు... చక్కిలిగింత లేదేం గురుడా
ఆ పక్కను మెలిగే చక్కని చుక్కకు... చక్కిలిగింత లేదేం గురుడా

కంచు మోతగా కనకం మోగదు... నిదానించరా నరుడా
కంచు మోతగా కనకం మోగదు... నిదానించరా నరుడా 

వాటం చూసి వడుపు చేసి... వంచర కొమ్మను నరుడ
హోయ్...  చిటారు కొమ్మను


చరణం 2 : 

పండంటి పిల్లకు పసుపు కుంకం  నిండుకున్నవేం గురుడా
పండంటి పిల్లకు పసుపు కుంకంనిండుకున్నవేం గురుడా

దేవుడు చేసిన లోపాన్ని... నీవు దిద్దుకురారా నరుడా
దేవుడు చేసిన లోపాన్ని... నీవు దిద్దుకురారా నరుడా
కొద్దిగ హద్దు మీరరా నరుడా

చిటారు కొమ్మను మిఠాయి పొట్లం... చేతికందదేం గురుడా
వాటం చూసి వడుపు చేసి... వంచర కొమ్మను నరుడ
హోయ్...  చిటారు కొమ్మను

చరణం 3 :


విధవలందరికి శుభకార్యాలు... విధిగా చెయమంటావా గురుడా
విధవలందరికి శుభకార్యాలు... విధిగా చెయమంటావా గురుడా

అవతారం నీదందుకోసమే..ఏ..
అవతారం నీదందుకోసమె... ఆరంభించర నరుడా

వాటం చూసి వడుపు చేసి... వంచర కొమ్మను నరుడ
హోయ్...  చిటారు కొమ్మను

చిటారు కొమ్మను మిఠాయి పొట్లం... చేతికందదేం గురుడా
వాటం చూసి వడుపు చేసి... వంచర కొమ్మను నరుడ
హోయ్...  చిటారు కొమ్మను


రహస్యం (1967)


చిత్రం :  రహస్యం (1967)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  మల్లాది

నేపధ్య గానం :  ఘంటసాల 


పల్లవి :


లలిత భావ నిలయ నవ రసానంద హృదయ

లలిత భావ నిలయ నవ రసానంద హృదయ

విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ


లలిత భావ నిలయ నవ రసానంద హృదయ

విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ

మధువుచిలుకు  గమకమొలుకు వరవీణాపాణీ

మధువుచిలుకు  గమకమొలుకు వరవీణాపాణీ

సుమరదన విధువదన.. దేవి

సుమరదన విధువదన.. దేవి


అంబరాంతరంగ శారదా స్వరూపిని

చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే

అంబరాంతరంగ శారదా స్వరూపిని

చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే


చరణం 1:


శ్రీదేవి కైవల్య చింతామణి... శ్రీరాగ మోదిని చిద్రూపిని

శ్రీదేవి కైవల్య చింతామణి... శ్రీరాగ మోదిని చిద్రూపిని

బింబాధరా.. రవిబింబాంతరా..

బింబాధరా.. రవిబింబాంతరా..

రాజీవ రాజీవిలోలా... రాజీవ రాజీవిలోలా

శ్రీరాజరాజేశ్వరీ  పరమాకామ సంజీవని....

శ్రీరాజరాజేశ్వరీ  పరమాకామ సంజీవని..

శ్రీరాజరాజేశ్వరీ...



చరణం 2:


నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ

నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ

ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ

ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ

అరుణవసన.. అమలహసనా

అరుణవసన.. అమలహసనా

మాడినీ.. మనోన్మణి

నాదబింధు కళాధరీ బ్రామరీ...

నాదబింధు కళాధరీ బ్రామరీ... పరమేశ్వరీ

నాదబింధు కళాధరీ బ్రామరీ... పరమేశ్వరీ



**************** *************** **************



చిత్రం :  రహస్యం (1967)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  మల్లాది

నేపధ్య గానం :  ఘంటసాల,  సుశీల, పి.లీల


పల్లవి :


అంబా పరాకు దేవీ పరాకు

మమ్మేలు మా శారదంబా పరాకు

అంబా పరాకు దేవీ పరాకు

మమ్మేలు మా శారదంబా పరాకు


ఉమా మహేశ్వర ప్రసాద లబ్ధ పూర్ణ జీవనా గజాననా..

బహుపరాక్ బహుపరాక్...


చండభుజాయమండల దోధూయమాన వైరిగణా.. షడాననా

బహుపరాక్ బహుపరాక్..


మంగళాద్రి నారసింహ... బహుపరాక్ బహుపరాక్...

బంగరు తల్లి కనకదుర్గ.. బహుపరాక్ బహుపరాక్..

కృష్ణాతీర కూచెన్నపూడి నిలయా గోపాలదేవ.. బహుపరాక్...


అవధరించరయ్యా విద్యలనాదరించరయ్యా

అవధరించరయ్యా విద్యలనాదరించరయ్యా

లలితకళల విలువ తెలియు సరసులు పదింపదిగ పరవశులయ్యే

అవధరించరయ్యా విద్యల నాదరించరయ్యా


ఈశుని మ్రోల.. హిమగిరి బాల..

ఈశుని మ్రోల.. హిమగిరి బాల..కన్నెతనము ధన్యమయిన గాథ

కణకణలాడే తామసాన కాముని రూపము బాపీ..ఆ కోపీ..

కాకలు తీరీ కను తెరచి తను తెలసీ

తన లలనను పరిణయమాడిన ప్రబంధము

అవధరించరయ్యా విద్యల నాదరించరయ్యా..


చరణం 1 :


రావో.. రావో.. లోల లోల లోలంబాలక రావో....

రావో రావో లోల లోల లోలం బాలక రావో

లోకోన్నత మహోన్నతుని తనయ మేనాకుమారి

లోకోన్నత మహోన్నతుని తనయ మేనాకుమారి

రాజ సులోచన రాజాననా...

రావో రావో లోల లోల లోలంబాలక రావో


చెలువారు మోమున లేలేత నగవులా

కలహంస గమనాన కలికీ ఎక్కడికే

మానస సరసినీ మణి పద్మదళముల

రాణించు అల రాజహంస సన్నిధికే


వావిలి పూవుల మాలలు గైసేసి

వావిలి పూవుల మాలలు గైసేసి

వయ్యారి నడల బాలా ఎక్కడికే

వయ్యారి నడల బాలా ఎక్కడికే


కన్నారా నన్నేల కైలాస నిలయాన

కొలువైన అల దేవదేవు సన్నిధికే ....


తగదిది తగదిది తగదిది

ధరణీధర వర సుకుమారీ

తగదిది తగదిది తగదిది

ధరణీధర వర సుకుమారీ.. తగదిదీ ..

 

అండగా మదనుడుండగా

మన విరిశరముల పదనుండగా

నిను బోలిన కులపావని తానై

వరు నరయగ బోవలెనా ...ఆ.....ఆ....ఆ...

తగదిది తగదిది తగదిది

ధరణీధర వర సుకుమారీ..


కోరిన వాడెవడైనా ఎంతటి ఘనుడైనా

కోలనేయనా సరసను కూలనేయనా

కనుగొనల ననమొనల గాసి చేసి.. నీ దాసు చేయనా

తగదిది తగదిది తగదిది

ధరణీధర వర సుకుమారీ.. తగదిదీ ..

చరణం 2 :

ఈశుని దాసుని చేతువా... అపసద... అపచారము కాదా

ఈశుని దాసుని చేతువా..

కోలల కూలెడు అలసుడు కాడూ... ఆదిదేవుడే అతడూ...

సేవలు చేసి ప్రసన్నుని చేయ.. నా స్వామి నన్నేలు నోయీ...నీ సాయమే వలదోయీ...

ఈశుని దాసుని చేతువా..


కాని పనీ మదనా.. కాని పని మదనా..

అది నీ చేతకాని పని మదనా...

అహంకరింతువ.. హరుని జయింతువ

అహంకరింతువ.. హరుని జయింతువ

అది నీ చేతకాని పని మదనా ..... కాని పని మదనా...


చిలుక తత్తడి రౌత ఎందుకీ హుంకరింతా

చిలుక తత్తడి రౌత ఎందుకీ హుంకరింతా

వినకపోతివా ఇంతటితో..

వినకపోతివా ఇంతటితో.. నీ విరిశరముల పని సరి..

సింగిణి పని సరి..  తేజో పని సరి.. చిగురికి నీ పని సరి మదనా

కాని పని మదనా....

చిలుక తత్తడి రౌత ఎందుకీ హుంకరింతా... చిలుక తత్తడి రౌత


సామగ సాగమ సాధారా.. శారద నీరద సాకారా

ధీనా ధీనా ధీసారా ... సామగ సాగమ సాధారా


ఇవె కైమోడ్పులు ...  ఇవె సరిజోతలు

వినతులివే అరవిందోజ్వలా... ఇదె వకుళాంజలి మహనీయా

ఇదె హృదయాంజలి... ఈశా మహేశా

సామగ సాగమ సాధారా.. శారద నీరద సాకారా

ధీనా ధీనా ధీసారా ... సామగ సాగమ సాధారా


విరులన్ నిను పూజ సేయగా... విధిగా నిన్నొక గేస్తు జేయగా

దొరకొన్న రసావతారు చిచ్చరకంటన్ పరిమార్తువా ప్రభూ...

కరుణన్ గిరిరాజ కన్యకన్ సతిగా తాము పరిగ్రహింపగా

మరుడేపున రూపున వర్థిలుగా...

రతి మాంగల్యము రక్ష సేయరా ప్రభూ... ప్రభూ... పతిభిక్ష ప్రభూ....


అంబాయని అసమశరుడు నను పిలిచెను వినవో

జనకుడవై ఆదరణగ తనయునిగా జేకొనవో

అంబాయని అసమశరుడు నను పిలిచెను వినవో...


మనమే నీ మననమై... తనువే నీ ధ్యానమై

నీ భావన లీనమైన గిరిబాలనేలవో


శరణం భవ శరణం భవ శరణం భవ స్వామీ...

పరిపాలయ పరిపాలయ పరిపాలయ మాం స్వామీ..



బిడియపడి భీష్మించి పెళ్ళికొడుకైనట్టి జగమేలు తండ్రికి.. జయమంగళం

జగమేలు తండ్రికి.. జయమంగళం...

విరులచే వరునిచే కరము చేకొనజేయు జగమేలు తల్లికి.. జయమంగళం

కూచేన్నపూడి భాగవతుల సేవలందే దేవదేవా శ్రీ వేణుగోపాల.. మంగళం..

త్రైలోక్య మందార శుభమంగళం...


**************** *************** **************

చిత్రం :  రహస్యం (1967)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  మల్లాది

నేపధ్య గానం :  పి. లీల


పల్లవి :


శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా

శ్రీగిరి నిలయా గిరామయా సర్వమంగళా

 శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా

శ్రీగిరి నిలయా గిరామయా సర్వమంగళా

శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా


చరణం 1 :


జగముల చిరునగవుల పరిపాలించే జననీ

అనయము మము కనికరమున కాపాడే జననీ

జగముల చిరునగవుల పరిపాలించే జననీ

అనయము మము కనికరమున కాపాడే జననీ

మనసే నీ వశమై స్మరణే జీవనమై

మనసే నీ వశమై స్మరణే జీవనమై

మాయని వరమీయవె పరమేశ్వరి మంగళనాయకి

 

శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా

 


చరణం 2 :


అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి

అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి

రవ్వల తళుకుల కళలా జ్యోతుల కప్పుర హారతి

సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి

 

శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా

శ్రీగిరి నిలయా గిరామయా సర్వమంగళా

శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా

 

**************** *************** ************** 

చిత్రం :  రహస్యం (1967)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  మల్లాది

నేపధ్య గానం :  ఘంటసాల,  సుశీల


పల్లవి :


ఉన్నదిలే... దాగున్నదిలే...

నీ కన్నుల ఏదో ఉన్నదిలే...అది నన్నే కోరుతున్నదిలే

ఈ వెన్నెలలో సై అన్నదిలే


ఉన్నదిలే... దాగున్నదిలే

నీ కన్నుల ఏదో ఉన్నదిలే...అది నన్నే కోరుతున్నదిలే

ఈ వెన్నెలలో సై అన్నదిలే


చరణం 1 :


కన్నెపూల వన్నెలేవో... కన్ను గీటుతున్నవీ

కన్నెపూల వన్నెలేవో ... కన్ను గీటు తున్నవి

మేనిలోన ఊహలేవో... వీణ మీటుచున్నవి...

వీణ మీటుచున్నవి

 

ఉన్నదిలే ... దాగున్నదిలే...

నీ కన్నుల ఏదో ఉన్నదిలే... అది నన్నే కోరుతున్నదిలే

ఈ వెన్నెలలో  సై  అన్నదిలే


చరణం 2 :


గుండెలోన కోరికలేవో...దండలల్లుకున్నవి...ఈ...ఈ..

గుండెలోన కోరికలేవో...దండలల్లుకున్నవి...

అందరాని పోంగులేవో..తొందరించుచున్నవి

..తొందరించుచున్నవి


ఉన్నదిలే... దాగున్నదిలే...

నీ కన్నుల ఏదో ఉన్నదిలే... అది నన్నే కోరుతున్నదిలే

ఈ వెన్నెలలో సై అన్నదిలే


చరణం 3 :


ఇన్నినాళ్ళ పుణ్యమంతా ... ఎదుటనిలిచి ఉన్నది

ఇన్నినాళ్ళ పుణ్యమంతా ... ఎదుటనిలిచి ఉన్నది

యుగయుగాల ప్రేమగాధ... చిగురువేయుచున్నది...

చిగురువేయుచున్నది...


ఉన్నదిలే... దాగున్నదిలే...

నీ కన్నుల ఏదో ఉన్నదిలే... అది నన్నే కోరుతున్నదిలే

ఈ వెన్నెలలో సై అన్నదిలే...

  

కలిమిలేములు (1962)

చిత్రం: కలిమిలేములు (1962)
సంగీతం: అశ్వత్థామ
గీతరచయిత: మల్లాది
నేపధ్య గానం: ఘంటసాల, జానకి

పల్లవి:

గాలిలో... గాలిలో...
తేలే పూలడోలలో... డోలలో...
పన్నీరు చల్లే వెన్నెల తీవ
కన్నుల కలకల ఏమో
చిననాటి ఆనందసీమలో...

అలనాటి ఆనందసీమలో
అదే చెలిమిగ విహరించేయమని
అనుకున్న కన్నె కలలే
చిననాటి ఆనందసీమలో...

చరణం 1:

గాలిలో... గాలిలో...
అలారుగ... అలారుగ...
గాలిలో అలలు అలలుగ అలారుగ
గానమేలే కనకవీణ
నగుమోమున తళతళ ఏమో
చిననాటి ఆనందసీమలో...

అలనాటి కలల వేడుకలే
మనసైన వాని చేరువచేయ
మోదములో ఆదమరచే పరవశమే
చిననాటి ఆనందసీమలో...

చరణం 2:

గగనాన వెలిగే రేరాజు
చెంగల్వకు కలకాలము చేరువె
ఆ పలుకే నిజమై ఆ మనసే తనదై
కన్నెవలపు మాయని పున్నమి వెలుగాయే
చిననాటి ఆనందసీమలో...

ఇంటి గుట్టు (1958)

చిత్రం: ఇంటి గుట్టు (1958)
సంగీతం: యమ్. యస్. ప్రకాష్
సాహిత్యం: మల్లాది రామకృష్ణ శాస్త్రి
గానం: జిక్కి (పి.జి.కృష్ణవేణి)


నీ లీలలన్ని చాలించవోయి
నీకన్న నేను నిరజాన నోయి
రారా గోపాలా చేర రారా
కొంటెవాడ నీ ఆటలు సాగానీనురా

నీ లీలలన్ని చాలించవోయి
నీకన్న నేను నిరజాన నోయి
రారా గోపాలా చేర రారా
కొంటెవాడ నీ ఆటలు సాగానీనురా

కోమలి పిలుపు విన్నావురా
కోరిన పలుక కున్నావురా
కోమలి పిలుపు విన్నావురా
కోరిన పలుక కున్నావురా

తోడుగ తిరిగే దొరవౌరా
ఏ నీడన దాగే విజేలను రా
ఏ నీడన దాగే విజేలను రా

మొనగాడ నా వాడ ఏ కోనవాడ
మొనగాడ నా వాడ ఏ కోనవాడ
రారా నటనలు చాలులేరా
కొంటెవాడ నీ ఆటలు సాగానీనురా

హాయిగ కలిసి ఉందామురా
మాయలు పగలు మానేయరా
హాయిగ కలిసి ఉందామురా
మాయలు పగలు మానేయరా
వేషాము మోసాలు చాలు లేరా
ఇక దరిచేర రావా సరే లేరా
ఇక దరిచేర రావా సరే లేరా

మొనగాడ నా వాడ ఏ కోనవాడ
మొనగాడ నా వాడ ఏ కోనవాడ
రారా నటనలు చాలులేరా
కొంటెవాడ నీ ఆటలు సాగానీనురా

నీ లీలలన్ని చాలించవోయి
నీకన్న నేను నిరజాన నోయి
రారా గోపాలా చేర రారా
కొంటెవాడ నీ ఆటలు సాగానీనురా

జయభేరి (1959)

నీవెంత నెరజాణవౌరా
చిత్రం : జయభేరి (1959)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : మల్లాది
నేపధ్య గానం : ఎం. ఎల్. వసంత కుమారి


పల్లవి :

నీవెంత నెరజాణవౌరా...
సుకుమారా... కళామోహనా.. సంగీతానంద...

నీవెంత నెరజాణవౌరా...
సుకుమారా... కళామోహనా.. సంగీతానంద...

నీవెంత నెరజాణవౌరా...
ఆ... ఆ.. ఆ...

అనుపల్లవి :
తెనెలు చిలికించు గానము వినగానే...
తెనెలు చిలికించు గానము వినగానే... ఈ మేను పులకించురా
సరసులు తలలూచు సొగసరి నిను జూడా
సరసులు తలలూచు సొగసరి నిను జూడా
ఉల్లంబు కల్లోల మేరా సమ్మోహనాంగ

నీవెంత నెరజాణవౌరా...
ఆ... ఆ.. ఆ...
నీవెంత నెరజాణవౌరా... 


చరణం 1 :


చనువుగ దరి చేరి మరి మరి మురిపించు
పరువముగలదానరా.. స్వామీ...
చనువుగ దరి చేరి మరి మరి మురిపించు
పరువముగలదానరా.. స్వామీ...

సిరిగన కనులాన.. ఆ... ఆ.. ఆ...
సిరిగన కనులాన.. సిగలో విరులానా
మౌనమే వినోదమా... ఇదే సరాగమా నవమదన

నీవెంత నెరజాణవౌరా...
ఆ... ఆ.. ఆ...
నీవెంత నెరజాణవౌరా... 



చరణం 2 :


బాలను లాలించి ఏలుట మరియాద కాదన వాదౌనురా.. స్వామీ
బాలను లాలించి ఏలుట మరియాద కాదన వాదౌనురా..

మీరిన మోదాన వేమరు నిను వేడు
భామను వరించరా.. తరించరా...
శృంగారధామ ఏలరా... యీ మోడి చాలురా
సరసుడవని వింటిరా.. చతురత కనుగొంటిరా

వన్నె చిన్నె గమనించవేలరా... వన్నెకాడ కరుణించవేలరా
వగలొలికే పలుకులతో నను చేకొమ్మని... నీ కొమ్మని.. నీ సొమ్మని
దరా పురంధరా.. యిదే మనవీ మన్నన సేయరా నాదమయా
మనవి వినర... మనసు పడర పరమ రసిక శిఖామణి...



నీవెంత నెరజాణవౌరా...
సుకుమారా... కళామోహనా.. సంగీతానంద...

నీవెంత నెరజాణవౌరా...
ఆ... ఆ.. ఆ...

****** *********** ************** *   
సంగీత సాహిత్యమే మేమే
చిత్రం: జయభేరి (1959)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
సంగీత సాహిత్యమే మేమే.. నవశృంగార లాలిత్యమే మేమే
సంగీత సాహిత్యమే మేమే.. నవశృంగార లాలిత్యమే మేమే
రాగానికి లాస్యం చేసి.. భావానికి జీవం పోసి
రాగానికి లాస్యం చేసి.. భావానికి జీవం పోసి
నాట్యాన లోకాలేలేము.. మాసరి మేమేగా

సంగీత సాహిత్యమే మేమే.. నవశృంగార లాలిత్యమే మేమే

చరణం 1:

కాకతి సామ్రాజ్య లక్ష్మి రుద్రమ్మదేవి అరిభయంకర కడ్గధారణే నేను
అలనాటి పలనాటి వరబాలచంద్రుల శౌర్యప్రతాపాల సారమే నేను
ననుమించి నన్నొంచగల ధీరులెవరు
పరమ మాహేశ్వరుడు పాల్గురితోమన్న పలుకులల్లిన వీరగాథలే నేను
మురిపించు శృంగారి మువ్వపురి క్షేత్ర్యయ్య పదకవితలో మధురభావమే నేను
కవి కోకిలల మంజుగానమే నేను
కవి సింహముల చండగర్జనే నేను

చరణం 2:

నవ్యభావాల్ జీవనదులుగా ఉప్పొంగ మణులు పండే తెలుగు మాగాణమే మేము
జాణు తెనుగే మేము జాతి ఘనతే మేము
జాణు తెనుగే మేము జాతి ఘనతే మేము
ఇక దిగ్విజయ యాత్ర సాగించమా..ఆ..
జగమెల్ల మార్మోగ జయభేరి మ్రోగించమా..ఆ..
జయభేరి జయభేరి జయభేరి మ్రోగించమా..ఆ..

****** *********** ************** *   
రాగమయీ రావే
చిత్రం: జయభేరి (1959)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: మల్లాది
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

రాగమయీ రావే అనురాగ మయీ రావే
రాగమయీ రావే అనురాగ మయీ రావే...
రాగమయీ రావే....

నీలాల గగనాన నిండిన వెన్నెల..ఆ..ఆ..ఆ..
నీలాల గగనాన నిండిన వెన్నెల
నీ చిరునవ్వుల కలకల లాడగా

రాగమయీ రావే అనురాగ మయీ రావే...
రాగమయీ రావే

చరణం 1:

చిగురులు మేసిన చిన్నారి కోయిల
మరిమరి మురిసే మాధురి నీవే
చిగురులు మేసిన చిన్నారి కోయిల
మరిమరి మురిసే మాధురి నీవే
తనువై మనసై నెలరాయనితో
కలువలు కులికే సరసాలు నీవే
సరసాలు నీవే సరాగాలు నీవే

రాగమయీ రావే అనురాగ మయీ రావే...
రాగమయీ రావే...

చరణం 2:

సంధ్యలలో... సంధ్యలలో హాయిగ సాగే చల్లని గాలిలో
మరుమల్లెల విరజాజుల పరిమళమే నీవు
జిలుగే సింగారమైన
చుక్క కన్నెలు అంబరాన...ఆ..ఆ...ఆ
జిలుగే సింగారమైన
చుక్క కన్నెలు అంబరాన
సంబరపడు చక్కిలిగింతల పరవశమే నేను
నవ పరిమళమే నీవు
రావే రాగమయీ నా అనురాగమయీ
రావే రాగమయీ నా అనురాగమయీ....

చరణం 3:

నీడ చూసి నీవనుకొని పులకరింతునే అలవికాని మమతలతో కలువరింతునే..

నీకోసమే ఆవేదన... నీ రూపమే ఆలాపన
కన్నెలందరూ కలలు కనే అందాలన్నీ నీవే
నిన్నందుకొనీ మైమరచే ఆనందమంతా నేనే
రావే రాగమయీ నా అనురాగమయీ...
రావే రాగమయీ నా అనురాగమయి....

****** *********** ************** *   
రసికరాజ తగువారము కామా

చిత్రం: జయభేరి (1959)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: మల్లాది
నేపధ్య గానం: ఘంటసాల


పల్లవి :

ఆ.. ఆ... ఆ... ఆ... ఆ... ఆ..
ఆ... ఆ... ఆ... ఆ...

రసికరాజ తగువారము కామా...
రసికరాజ తగువారము కామా..
ఆ... ఆ... ఆ... ఆ...
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ....

రసిక రాజ తగువారము కామా...
అగడు సేయ తగవా... ఆ... ఆ.. ఆ... ఆ
ఏలు దొరవు అరమరికలు ఏలా...
ఏల వేల సరసాల సురసాల...
ఏలు దొరవు.. అరమరికలు ఏలా
ఏల వేల సరసాల సురసాల... ఏలు దొరా...


చరణం 1 :

నిన్ను తలచి.. గుణగానము జేసి...
నిన్ను తలచి... గుణగానము జేసి..
నిన్ను తలచి... గుణగానము జేసి..
దివ్యనామ మధుపానము జేసి...

నిన్ను తలచి...
పా దపమ గరిసా... నిన్ను తలచి...

దనిప నిదసనిప మగరిస నిసరిస నిససని
సమగమపమ గమగనిసనిప మగమగ సనిస
నిసరిమగ మరినిసనిస దనిస నిపమప మగరిస... నిన్ను తలచి...

దనిస దనిస దనిసని దసనిపమగామాప.. దనిసనిపగామాద

నిరిస దని గమప గనిస గమరిసరిస సరిసనిసని నిసనిద
నిస నిసని సనిప మగమదినిస
సరిస నిసని పనిప మపమ నిసని పనిప మపమ గమగ
నిగనిసరిస నిసని సని సరి సరి సనినిసనిపమగరినిస..

ససససస సనిదని సనిసస సనిదని సనిసస సనిగమగదరి నిసమప సనిదపమమగిరి
నినినినినిని నినినినినిని దదదదదద దదదదదద

దదని దదని దదని దన్ని దన్ని దదని దదని దదని దన్ని దన్ని
దనిసపమపగమ మగినిప గగగమమమ గగగనిరి రిరిరి
గగగమమ రిరిరినిస రిస గగరి నిసరిస గనిస నిసనిస నిసనిసరి
నిసని సనిదనిసని గమగమదని దనిసరి గగని నిగరిస
పమగమరిసమప గమనిసనిస పమగమని దనిసనిస
పమగమదనిస నిసరిస నిపసనిపమగమ సనిపమగప సనిపమగప పమగరిస...


చరణం 2 :

నిన్ను తలచి గుణగానము జేసి
దివ్యనామ మధుపానము జేసి...
సారసాక్ష మనసా వచసా...
ఆ... ఆ... ఆ... ఆ....
ఆ... ఆ... ఆ... ఆ... అ....
సారసాక్ష మనసా వచసా... నీ సరస చేరగనే...
సదా.. వేడనా...
ఏలు దొరవు అరమరికలు ఏలా
ఏల వేల సరసాల సురసాల... ఏలు దొరా...
ఆ... ఆ... ఆ...

****** *********** ************** *   
యమునా తీరమున
చిత్రం: జయభేరి (1959)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

ఆ..ఆ... ఆ... ఆ... ఆ.. ఆ..
యమునా తీరమున... సంధ్యా సమయమున
యమునా తీరమున... సంధ్యా సమయమున
వేయి కనులతో రాధ.. వేచి యున్నది కాదా..

మంజు ఏం ఆపేసావ్... ఏమి లేదు
ఆపకు మంజు.. నీ కాలి మువ్వల సవ్వడి
నా పాటకు నడక నేర్పాలి
నా గానానికి జీవం పొయ్యాలి

ఆ...
రావోయి రాసవిహారి... ఈ... ఈ..
ఇటు రావోయి వనమాలి... ఈ... ఈ..
ఆ... ఆ... ఆ... ఆ ఆ ఆ ఆ ఆ

యమునా తీరమున సంధ్యా సమయమున
యమునా తీరమున సంధ్యా సమయమున
వేయి కనులతో రాధ.. ఆ... ఆ
వేయి కనులతో రాధ... వేచి యున్నది కాదా
యమునా తీరమునా

చరణం 1:

బాస చేసి రావేల మదన గోపాలా.. ఆ... ఆ... ఆ...
ఆ... ఆ... ఆ...
బాస చేసి రావేల... మదన గోపాలా
నీవు లేని జీవితము... తావి లేని పూవు కదా

యమునా తీరమున... సంధ్యా సమయమున
యమునా తీరమున... సంధ్యా సమయమున
వేయి కనులతో రాధ... వేచి యున్నది కాదా
యమునా తీరమునా... ఆ... ఆ... ఆ...

చరణం 2:

పూపొదలో దాగనేల... పో పోరా సామి...
ఇంతసేపు ఏ ఇంతికి వంత పాడినావో...
దాని చెంతకె పోరాదో...

రానంత సేపు విరహమా...
నేను రాగానే కలహమా...
రాగానే కలహమా...

నీ మేన సరసాల చిన్నెలు...
అవి ఏ కొమ్మ కొనగోటి ఆనవాలూ...
ఏ కొమ్మ కొనగోటి ఆనవాలూ...

దోబూచులాడితి నీతోనే...
ఇవి ఈ కొమ్మ గురుతులు కాబోలు...
ఈ కొమ్మ గురుతులు కాబోలు...

నేను నమ్మనులే...
నేను నమ్మనులే.. నీ మాటలు
అవి కమ్మని.. పన్నీటి మూటలు
నా మాట నమ్మవే రాధికా...
ఈ మాధవుడు నీ వాడేగా...
రాధికా... మాధవా...
రాధికా... మాధవా...
రాధికా... మాధవా...
రాధికా... మాధవా...

****** *********** ************** *   
చిత్రం: జయభేరి (1959)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: మల్లాది
నేపధ్య గానం: ఘంటసాల, పి. బి. శ్రీనివాస్, రఘునాథ పాణీ

పల్లవి:

ఆ...దిననన తానా...
ఆ...ఆ...ఆ..రి..నన...

మది శారదా దేవి మందిరమే...
మది శారదా దేవి మందిరమే...
కుదురైన నీమమున కొలిచేవారి...
మది శారదా దేవి మందిరమే... ఏ... ఏ..

చరణం 1:

రాగ భావమమరే గమకముల...
ఆ... ఆ... ఆ.. ఆ... ఆ.....
రాగ భావమమరే గమకముల...
రాగ భావమమరే గమకముల...
రాగ భావమమరే గమకముల...

నాద సాధనలే దేవికి పూజా..
ఆ... ఆ... ఆ..
నాద సాధనలే దేవికి పూజా..
నాద సాధనలే దేవికి పూజా..
నాద సాధనలే....
ఆ... ఆ... ఆ.. ఆ... ఆ.....
నాద సాధనలే...
ఆ... ఆ... ఆ.. ఆ... ఆ.....
నాద సాధనలే..
ఆ... ఆ... ఆ... ఆ.. ఆ... ఆ.....
నాద సాధనలే దేవికి పూజా..
ఆ... ఆ... ఆ.. ఆ... ఆ.... ఆ..
ఆ... ఆ... ఆ.. ఆ... ఆ.... ఆ..
నాద సాధనలే దేవికి పూజా..

తరళతానములే హారములౌ...ఉ... ఉ...
తరళతానములే హారములౌ....
తరళతానములే హారములౌ...
తరళతానములే హారములౌ...

సరిస రిసరిస నిసనిస గరిగ సనిదనిరిగ రిగ
మగమనిదని రిగ రిగ గమగ మగమనిదని
రిగ రిగ సమగదమనిదని రిగ రిగ
రిగ రిమగదపనిస రిగ రిగ
సరిసని నిసనిద పమగరిస
నిసనిదప మగరిస రిప
గరినిదప గరిససద..
గరిగగరిని గరిగ నిరిని
నిగనిరిని నిగనిరిని
నిగనిరిని నిగనిగనిరిని
మగ మమగ దపమగ నిదపమపగ
సనిదపమగ గరిసనిస నిసనిదప సనిదపమగ

తరళతానములే హారములౌ...
వరదాయిని కని గురుతెరిగిన
మన మది శారదా దేవి మందిరమే...
కుదురైన నీమమున కొలిచేవారి...
మది శారదా దేవి మందిరమే... ఏ... ఏ..

****** *********** ************** *   

నీదాన నన్నదిరా
చిత్రం: జయభేరి (1959)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: మల్లాది
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

ఊఁహూఁహూఁహూఁ... ఊఁహుఁహుఁ హుఁహుఁహుఁ...

నీదాన నన్నదిరా... నిన్నే నమ్మిన చిన్నదిరా
నీదాన నన్నదిరా... నిన్నే నమ్మిన చిన్నదిరా

తానే మధుకలశమని... మనసే నందనమని
మువ్వలతో.. నవ్వులతో.. మోమోటముగా కులికి

నీదాన నన్నదిరా... నిన్నే నమ్మిన చిన్నదిరా...ఆ...

చరణం 1:

చుక్క... చుక్క...
చుక్కల కన్న తానే చక్కనిదాననన్నదిరా...
ఆ...హ...ఆ..

చుక్కల కన్న తానే చక్కనిదాననన్నదిరా... ఉహ్...
చక్కని సామీ...
చక్కని సామీ... ఈ... అని పక్కన జేరి.. పలుకరించి...

నీదాన నన్నదిరా...అహహ... నిన్నే నమ్మిన చిన్నదిరా...
ఆ...అ...ఆ...ఆ...

****** *********** ************** *   

నందుని చరితము వినుమా
చిత్రం: జయభేరి (1959)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: శ్రీశ్రీ
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

అధికులనీ.. అధములని... నరుని దృష్టిలోనే భేదాలు
శివుని దృష్టిలో... అంతా సమానురే.... ఏ... ఏ... ఏ... ఏ..

నందుని చరితము వినుమా.. ఆ.. ఆ..
పరమానందము గనుమా.. ఆ.. ఆ
పరమానందము గనుమా..ఆ..
నందుని చరితము వినుమా.. ఆ.. ఆ
పరమానందము గనుమా... ఆ... ఆ
పరమానందము గనుమా...

చరణం 1:

ఆదనూరులో మాలవాడలో....
ఆదనూరులో... మాలవాడలో... పేదవాడుగా జనియించి
చిదంబరేశ్వరుని పదాంబుజములే మదిలో నిలిపి కొలిచేను...

నందుని చరితము వినుమా.. ఆ.. ఆ
పరమానందము గనుమా... ఆ... ఆ
పరమానందము గనుమా...

చరణం 2:

తన యజమానుని ఆనతి వేడెను... శివుని చూడగా మనసు పడి
తన యజమానుని ఆనతి వేడెను... శివుని చూడగా మనసు పడి
పొలాల సేద్యము.. ముగించి రమ్మని...
పొలాల సేద్యము... ముగించి రమ్మని
గడువే విధించె యజమాని...

యజమాని ఆనతిచ్చిన గడువులో...
ఏ రీతి పొలము పండిచుటో ఎరుగక..
అలమటించు తన భక్తుని కార్యము...
ఆ శివుడే నెరవేర్చె... ఏ... ఏ.. ఏ.. ఏ...

పరుగున పోయెను చిదంబరానికి... భక్తుడు నందుడు ఆత్రమున
పరుగున పోయెను చిదంబరానికి... భక్తుడు నందుడు ఆత్రమున
చిదంబరములో శివుని దర్శనం... చేయగరాదనె పూజారి...
ఆశాభంగము పొందిన నందుడు... ఆ గుడి ముందే మూర్చిల్లె
అంతట శివుడే అతనిని బ్రోచి... పరంజ్యోతిగా వెలయించె...

చిరంజీవులు (1956)

చిత్రం : చిరంజీవులు (1956)

సంగీతం : ఘంటసాల

గీతరచయిత : మల్లాది

నేపధ్య గానం : ఘంటసాల


పల్లవి :


మనసు నీదే మమత నాదే

నా దానవే...  నే నీవాడనే

మనసు నీదే మమత నాదే

నా దానవే...  నే నీవాడనే


చరణం 1 : 



చివురు మామిడి పందిళ్ల నీడా... నిలిచింది చిలక నా కోసమే

చివురు మామిడి పందిళ్ల నీడా... నిలిచింది చిలక నా కోసమే

చివురంటి చిన్నదానా... నా దానవే నే నీవాడనే


మనసు నీదే మమత నాదే

నా దానవే...  నే నీవాడనే


చరణం 2 :


కనుల కాటుక కళ్యాణ తిలకం... నగుమోము కలకల నా కోసమే

కనుల కాటుక కళ్యాణ తిలకం... నగుమోము కలకల నా కోసమే

చిరునవ్వు చిన్నదాన... నా దానవే నే నీవాడనే



మనసు నీదే మమత నాదే

నా దానవే...  నే నీవాడనే


చరణం 3 :


పువ్వులు జల్లి పన్నీరు జల్లి...  దీవించిమీ వారు పంపేరులే

పువ్వులు జల్లి పన్నీరు జల్లి...  దీవించిమీ వారు పంపేరులే

మనసైన చిన్నదానా మీ ఇంటికి మా...  ఇంటికీ 




మనసు నీదే మమత నాదే

నా దానవే...  నే నీవాడనే

 

************ ************ *********************** ********


చిత్రం: చిరంజీవులు (1956)

సంగీతం: ఘంటసాల

గీతరచయిత: మల్లాది

నేపధ్య గానం: పి.లీల, ఘంటసాల 



పల్లవి :    



ఎందాక.. ఎందాక..  ఎందాక?

అందాక.. అందాక.. అందాక


ఎందాక.. ఎందాక..  ఎందాక?

అందాక.. అందాక.. అందాక


ఎందాక.. ఎందాక..  ఎందాక?

అందాక.. అందాక.. అందాక



ఈ ఉరుకేమిటి ఈ పరుగేమిటి

ఈ ఉరుకేమిటి ఈ పరుగేమిటి


ఓఓఓఓఓఓఓఓఓఓ.....హేయ్...

ఎందాక.. ఎందాక..  ఎందాక?

అందాక.. అందాక.. అందాక


చరణం 1 :


చివ్వునపోయి రివ్వున వాలి

చిలకను సింగారించాలి

ఓ..చిలకను సింగారించాలి

పువ్వులతోనా... ఆహా... రవ్వలతోనే హా...

మా నాన్న కోడలు బంగారుబొమ్మా

మా నాన్న కోడలు బంగారుబొమ్మా


ఓఓఓఓఓఓఓఓఓఓ.....హేయ్...


ఎందాక.. ఎందాక..  ఎందాక?

అందాక.. అందాక.. అందాక



చరణం 2 :



అయితే గియితే అమ్మాయి ఎవరో

ఆడేపాడే అందాల బాల

అయితే గియితే అమ్మాయి ఎవరో

ఆడేపాడే అందాల బాల

అయితే బువ్వో... నేతి మిఠాయి ఆ...

పక్కింటి అబ్బాయి బంగారు తండ్రి

పక్కింటి అబ్బాయి బంగారు తండ్రి


ఓఓఓఓఓఓఓఓఓఓ.....హేయ్...


ఎందాక.. ఎందాక..  ఎందాక?

అందాక.. అందాక.. అందాక

హేయ్...

ఎందాక? ఎందాక? ఎందాక?

అందాక అందాక అందాక


చరణం 3 :


కన్నులు నిండే కలకలలే

కన్నెకు సొమ్ముగ తేవాలి

నవకాలొలికే నీ చిరునవ్వే

నవకాలొలికే నీ చిరునవ్వే

చిలకకు సింగారం కావాలి

కావాలి కావాలి కావాలి

పరుగున రావాలి రావాలి రావాలి

కావాలి కావాలి కావాలి

పరుగున రావాలి రావాలి రావాలి 



చిత్రం: చిరంజీవులు (1956)

సంగీతం: ఘంటసాల

గీతరచయిత: మల్లాది

నేపధ్య గానం: పి.లీల, ఘంటసాల 



పల్లవి :    



కనుపాప కరవైన కనులెందుకో

తనవారె పరులైన బ్రతుకెందుకో   

కనుపాప కరవైన కనులెందుకో

తనవారె పరులైన బ్రతుకెందుకో     



చరణం 1 :


విరజాజి శిలపైన రాలేందుకే... మరుమల్లె కెంధూళి కలసేందుకే

విరజాజి శిలపైన రాలేందుకే... మరుమల్లె కెంధూళి కలసేందుకే

మనసైన చినదాని మనసిందుకే రగిలేందుకే 


కనుపాప కరవైన కనులెందుకో

తనవారె పరులైన బ్రతుకెందుకో  


చరణం 2 :


అలనాటి మురిపాలు కలలాయెనా... చిననాటి కలలన్ని కథలాయెనా

అలనాటి మురిపాలు కలలాయెనా... చిననాటి కలలన్ని కథలాయెనా

తలపోసి తలపోసి కుమిలేందుకా తనువిందుకా



కనుపాప కరవైన కనులెందుకో

తనవారె పరులైన బ్రతుకెందుకో  


చరణం 3 :


తనవారు తనవారె విడిపోరులే... కనుమూసి గగనాన కలసేరులే

తనవారు తనవారె విడిపోరులే... కనుమూసి గగనాన కలసేరులే

ఏనాటికైనాను నీదాననే...  నీదాననే


చిననాటి మన పాట మిగిలేనులే

కలకాల మీ గాథ రగిలేనులే... రగిలేనులే




************ ************ *********************** ********


చిత్రం: చిరంజీవులు (1956)

సంగీతం: ఘంటసాల

గీతరచయిత: మల్లాది

నేపధ్య గానం: పి.లీల


పల్లవి:


తెల్లవారవచ్చె తెలియక నా సామి

తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా

మళ్ళీ పరుండేవు లేరా

మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు ….

మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు

మారాము చాలింకలేరా … మారాము చాలింకలేరా


తెల్లవారవచ్చె తెలియక నా సామి

తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా

మళ్ళీ పరుండేవు లేరా


చరణం 1:


కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా

కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా

తరుణులందరు దధి చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా

తరుణులందరు దధి చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా

దైవరాయా నిదురలేరా


చరణం 2:


నల్లనయ్య రారా నను కన్నవాడా బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా

నల్లనయ్య రారా నను కన్నవాడా బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా

నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువుగాని రారా

నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువుగాని రారా

వెన్న తిందువుగాని రారా



************ ************ *********************** ********


చిత్రం: చిరంజీవులు (1956)

సంగీతం: ఘంటసాల

గీతరచయిత: మల్లాది

నేపధ్య గానం: ఘంటసాల, పి. లీల


పల్లవి:


హాయ్...

చికిలింత చిగురు సంపంగి గుబురు

చిన దాని మనసు చినదాని మీద మనసూ

చికిలింత చిగురు సంపంగి గుబురు

చిన దాని మనసు చినదాని మీద మనసూ


మనసైన చినదానికి అందానికి...

మనసైన చినదానికి అందానికి...

కనుసైగ మీద మనసు


ఆ..ఆ..ఆ..ఆ..


చరణం 1:


అరె.. చెంపకు చేరడేసి కన్నులున్న చిన్నది

చిన్నదాని సిగలో రేకలెన్నో

గవ్వకన్ను రైక మీద చుక్కలెన్నో


ఎన్నుకో ...

ఎన్నుకో వన్నె లెన్నుకో చిన్నె లెన్నుకో

వన్నెచిన్నె లెన్నుకో ఎన్నికైన చిన్నవాడా


ఆ..

ఆ..


పైర గాలి ఘుమఘుమలో

చెంగావి చెంగు రిమ రిమలో

ఆ..ఆ..ఆ..


చరణం 2:


అరె దిరెసిన పువ్వు మీద చిలుకూ ముగ్గులు

చిన్నదాని బుగ్గ మీద చిలిపి సిగ్గులు

మల్లెల దొంతరలు మరు మల్లె దొంతరలు


మనసే ..

ఆహా..


మనసే మరుమల్లె దొంతర

మన ఊసే విరజాజి దొంతర

పాల వెన్నెలలో ..మురిపాల వెన్నెలలో..