Showing posts with label Meena. Show all posts
Showing posts with label Meena. Show all posts

అమ్మాయి కోసం (2001)

చిత్రం: అమ్మాయి కోసం  (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: షణ్ముఖ శర్మ
గానం: ఉదిత్ నారాయణ్ , స్వర్ణలత


పల్లవి:
చాందిని నువ్వే నా చాందిని
చాందిని నువ్వే నా చాందిని
మనసుమేలుకొని మనవి చేసుకొని
చెలికి కానుక కానీ...
చాందిని నేనే నీ చాందిని

చరణం: 1
చినుకంటి బ్రతికినాది ముత్యంలా మారింది
నీ చేతి చలువ చేతనే
మౌనంలో కావ్యాలెన్నో మధురంగా  విన్నాలే
నీలోని ప్రేమవలనే
నీ చెలిమే వర్ణిస్తే ఏ కావ్యం సరిపోదు
ప్రణయంతో పోలిస్తే సరితూగే సిరి లేదు
పురివిప్పు ప్రియ భావమా

చాందిని నేనే నీ చాందిని

చరణం: 2
కలలన్ని ఆకాశంతో కబురే పంపే వేళ
హరివిల్లే చేతికందగా
శిల్పంలా మలిచావమ్మా ప్రేమే ప్రాణం చేసి
నేనేంటో నాకే చెప్పగా
చిరునవ్వుల వీణల్లో తొలివలపే సాగింది
సరికొత్తకోణం లో జగమెంతో బాగుంది
చిగురించు తొలి చైత్రమా

చాందిని నువ్వే నా చాందిని
చాందిని నేనే నీ చాందిని
మనసుమేలుకొని మనవి చేసుకొని
చెలికి కానుక కానీ...
చాందిని నేనే నీ చాందని

పుట్టింటికి రా.. చెల్లి (2014)

చిత్రం: పుట్టింటికి రా.. చెల్లి (2014)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: టిప్పు, సుజాత మోహన్


గుంతకల్లు గుమ్మచూడరో
రెండు కళ్ళు చాలబోవురో
పాలకొల్లు పిల్లగాడురో
గిల్లకుండ గిచ్చుతాడురో
ఓసారికే వద్దంటే ఎలా
నీ కౌగిలే అయ్యిందే వల
మనమాడాలి ఈ వేళ ఊగాలంట ఊరు వాడ

గుంతకల్లు గుమ్మచూడరో
ఆ రెండు కళ్ళు చాలబోవురో
పాలకొల్లు పిల్లగాడురో
గిల్లకుండ గిచ్చుతాడురో....

సత్తినపల్లి సెంటర్లలోన చీర కొని తెచ్చాలే
రాజమండ్రి సందులోన రైక నీకు కొన్నాలే
కాపుగారి కోటకాడి మల్లెలన్నీ తెచ్చాలే
భీమవరం రొయ్యతెచ్చి పులుసు వండి ఉంచాలే
సోకుల గంట తెగ మోగాలంటూ
అందినవన్నీ అందాలంటూ
ఆడిగినవన్ని ఇచ్చేసి ఇచ్చినవన్నీ దోచేసి
గుడు గుడు గుంచెం ఆడేసి చెడుగుడు పందెం వేసేసి
అందించు అందమంత అదిరేట్టు

గుంతకల్లు గుమ్మచూడరో
ఆ రెండు కళ్ళు చాలబోవురో
పాలకొల్లు పిల్లగాడురో
గిల్లకుండ గిచ్చుతాడురో....

రాణిగారి కోటలోన ఓణీలోన చూశాలే
నోరేవురి గోలచేస్తే ఆగలేక వచ్చాలే
ముద్దులన్ని మూటగట్టి దాచిపెట్టి  ఉంచాలే
కండలన్ని చూపుతుంటే ఉండలేక వచ్చాలే
అండా దండా ఉంటానమ్మో
ముందు వెనుకా నువ్వేనయ్యో
ఆశలు పొదలు చూపించి కౌగిలి సేద్యం చేయించి
సొగసులు కారం దంచేసి పలుకులు బెల్లం కలిపేసి
మోగిస్తా కసి కసి దరువేసి

గుంతకల్లు గుమ్మచూడరో
రెండు కళ్ళు చాలబోవురో
పాలకొల్లు పిల్లగాడురో
గిల్లకుండ గిచ్చుతాడురో
ఓసారికే వద్దంటే ఎలా
నీ కౌగిలే అయ్యిందే వల
మనమాడాలి ఈ వేళ ఊగాలంట ఊరు వాడ

గుంతకల్లు గుమ్మచూడరో
ఆ రెండు కళ్ళు చాలబోవురో
పాలకొల్లు పిల్లగాడురో
గిల్లకుండ గిచ్చుతాడురో....


******  ******  ******


చిత్రం: పుట్టింటికి రా.. చెల్లి (2014)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: శ్రీహర్ష
గానం: చిత్ర

చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా
జోలాలి జోజో లాలి జో
నే జోల పాటవుతా నువ్వు నిద్ర పోతేను
నవ్వించే ఆటవుతా నువ్వు ఆడుకుంటేను
ఏ దేవుడు రానే రాలేడే నా కన్నమ్మా
మన అమ్మను తేనేతేలేడే

చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో

ఆ కాలం గుచ్చింది కళ్ళల్లో ముళ్ళన్నీ
నే తీస్తా ముళ్ళన్నీ నువ్వేలే నాకన్నీ
కష్టాలు ఎన్నైనా నీకోసం పడతాను
మన అమ్మను తెమ్మంటే ఏ కాళ్ళను పడతాను
అమ్మలేని బ్రహ్మ రాత రాసినాడు
అమ్మనెత్తుకెళ్లి కోత కోసినాడు
నీకంటే నాకెవరున్నారే నా చెల్లెమ్మా
మన కన్న తల్లివి నువ్వమ్మా

చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో

నేలమ్మకు ఏదమ్మా బువ్వెట్టే వాళ్ళమ్మా
ఆకాశంకేదమ్మా ఆడిగిందిచ్చే తన అమ్మా
ఆ రాత నీ కేంటి నేనున్నా లోటేంటి
నీ తోడే నా లోకం తోడియ్యన నా ప్రాణం
ఇందుకే నేను ముందు పుట్టినాను
అమ్మ లా చూసే అన్ననైనాను
నీ ముందు ప్రాణాలెంతమ్మా నను కన్నమ్మా
నీకోసం నేనున్నానమ్మా

చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా
జోలాలి జోజో లాలి జో
నే జోల పాటవుతా నువ్వు నిద్ర పోతేను
నవ్వించే ఆటవుతా నువ్వు ఆడుకుంటేను
ఏ దేవుడు రానే రాలేడే నా కన్నమ్మా
మన అమ్మను తేనేతేలేడే

చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో


******  ******  ******


చిత్రం: పుట్టింటికి రా.. చెల్లి (2014)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: శ్రీహర్ష
గానం: మధుబాలకృష్ణన్

చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా
జోలాలి జోజో లాలి జో
నే జోల పాటవుతా నువ్వు నిద్ర పోతేను
నవ్వించే ఆటవుతా నువ్వు ఆడుకుంటేను
ఏ దేవుడు రానే రాలేడే నా కన్నమ్మా
మన అమ్మను తేనేతేలేడే

చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో

నేలమ్మకు ఏదమ్మా బువ్వెట్టే వాళ్ళమ్మా
ఆకాశంకేదమ్మా ఆడిగిందిచ్చే తన అమ్మా
ఆ రాత నీ కేంటి నేనున్నా లోటేంటి
నీ తోడే నా లోకం తోడియ్యన నా ప్రాణం
అమృతాన్ని తాగి అమ్మలాగ రానా
అమృతాన్ని మించే అమ్మప్రేమ తేన
నీకంటే నా కెవరున్నారే నా చెళ్ళమ్మా
ననుగన్నా తల్లివి నువ్వమ్మా

చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో

నీ నవ్వు చూడంగా ఉన్నాయి ఈ కళ్ళు
పువల్లే పెంచంగా ఉందమ్మా ఈ వళ్ళు
నీ కాలి చెప్పులుగా అరచేతులు ఇవిగోమ్మ
కలతంటూ రానీను కనులు చెమ్మ కానీను
గోరింటాకు నేనై నీ చేత పండుతాను
గోరువంక చెంత చిలక నిన్ను చేస్తాను
ప్రతి జన్మ నువ్వేలేవమ్మా నా చెల్లమ్మా
ఈ జన్మే అంతా నీదమ్మా

చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా
జోలాలి జోజో లాలి జో
అమ్మలేని ఆ బ్రహ్మ రాత రాసినాడమ్మా
అమ్మలేని వారిని చేసి కోత కోసినాడమ్మా
ఏ దేవుడు రానే రాలేడే నా కన్నమ్మా
మన అమ్మను తేనేతేలేడే

చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా
జోలాలి జోజో లాలి జో


******  ******  ******


చిత్రం: పుట్టింటికి రా.. చెల్లి (2014)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత మోహన్

గోపాలా గోపాలా గోపీలోల
వళ్ళంతా రేపావు ఏదో గోల (2)
ఎర్రని బుగ్గతో ఎగిరొచ్చిన సిగ్గుతో
వంపులు దాచి నన్ను చంపమాకు
అల్లరి నవ్వుతో చురకత్తుల చూపుతో
ఇట్టా సందులోకి లాగమాకు
వయ్యారి ఓ సారి వచ్చిపోవే
స్వర్గాన్నే నీ ముందు దించుతానే
వయ్యారి ఓ సారి వచ్చిపోవే
స్వర్గాన్నే నీ ముందు దించుతానే

గోపాలా గోపాలా గోపీలోల
వళ్ళంతా రేపావు ఏదో గోల (2)

ఎర్రని పెదవుల్లో మత్తున్నాదే
కోడె వయసే ఊగిందే
ఎర్రని పెదవుల్లో మత్తున్నాదే
కోడె వయసే ఊగిందే
తడిమే నీ చెయ్యే మహా వాటంగా ఉన్నది
ఎగసే పొంగులతో తెగ కసి రేపుతున్నది
నలత నడుము మడత  నువ్వు అందుకో ఇక
దడక దడక దడక దడక  మరి ఆగలేనిక
అందాల విందుంది సందకాడ
అందింది దోచేయి అండగాడా
అందాల విందుంది సందకాడ
అందింది దోచేయి అండగాడా

గోపాలా గోపాలా గోపీలోల
వళ్ళంతా రేపావు ఏదో గోల (2)

కౌగిలికొస్తావా కాంతామణి
చెక్కిలి ఇస్తావా చింతామణి
హే కౌగిలికొస్తావా కాంతామణి
చెక్కిలి ఇస్తావా చింతామణి
బాణీ చూపించు ఈ పూబోణి నీదిరా
రాణీ చేసేయ్నా నా శృంగార సీమకి
చిలుకు చిలుకు చిలుకు నాసోకు చిలకరా
తళుకు తళుకు తళుకు నాజూకు మొలకరా
ఆకాశం అదరాలి అల్లరోడా
పాతాళం పొంగాలి సక్కనోడా
ఆకాశం అదరాలి అల్లరోడా
పాతాళం పొంగాలి సక్కనోడా

గోపాలా గోపాలా గోపీలోల
వళ్ళంతా రేపావు ఏదో గోల (2)
ఎర్రని బుగ్గతో ఎగిరొచ్చిన సిగ్గుతో
వంపులు దాచి నన్ను చంపమాకు
అల్లరి నవ్వుతో చురకత్తుల చూపుతో
ఇట్టా సందులోకి లాగమాకు
వయ్యారి ఓ సారి వచ్చిపోవే
స్వర్గాన్నే నీ ముందు దించుతానే
వయ్యారి ఓ సారి వచ్చిపోవే
స్వర్గాన్నే నీ ముందు దించుతానే


******  ******  ******


చిత్రం: పుట్టింటికి రా.. చెల్లి (2014)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: శ్రీహర్ష
గానం: ఎస్. పి.బాలు, చిత్ర

అన్నాఅన్నా  అన్నా....
పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి
పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి
అత్తింట్లో కడతేరాల ఆడదాని రాత
అన్నలేడు కాబట్టేగా అడవికెళ్లే సీత
తలరాతే గా నన్ను చేర్చెను నరకం
చెడు నిందను మాపేసి వస్తే న్యాయం

పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి

వేసవికైనా నీరుంది ఓర్పుకు అయినా హద్దుంది
పాపం పెరిగితే భూదేవైనా కంపించకుంటుందా
చీర సారె సిరులిచ్చి మెట్టినింటికి నన్నిస్తే
పుట్టెడు నిందను కొంగున కట్టుకు
పుట్టింటికి వచ్చేదా
కాపుకాయనే లేనా కనులదాచుకొనా
తప్పుతో రాలేనన్నా నిప్పుతో వస్తా
ఎన్ని జన్మలైనా నీకు చెల్లినవుతాను
పేగు అదురుతోందమ్మ ప్రాణమొనుకు తోందమ్మ
పుట్టింటికి రామ్మా చెల్లమ్మ

పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి

కట్టిన తాలే కాదన్న ఈ కాకుల లోకం ఏదన్నా
మెట్టిన నరకం మంటలోంచి ఈ పుట్టింటికి స్వర్గానికి రా
ప్రేమే అంతటి విలువైంది పుట్టిన ఇల్లే చలువైంది
తప్పని అరిచే ఈ ఆచారం మెట్టింట్లో ఇరుకైంది
అన్న నీడ కాదంటూ బలిపశువవుతావా
గుండె పైన రాయల్లే బరువు పెంచరావా
నింగిలాగ నేనున్నా ఉరుము భయము నీకొద్దు
ఉరుము టారుముకొస్తున్నా జడుపు భయము ఇకలేదు
పుట్టింటికి రామ్మా చెల్లమ్మ

పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి
అత్తింట్లో కడతేరాల ఆడదాని రాత
అన్నలేడు కాబట్టేగా అడవికెళ్లే సీత
తలరాతే గా నన్ను చేర్చెను నరకం
చెడు నిందను మాపేసి వస్తే న్యాయం

పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి

దృశ్యం (2014)

చిత్రం: దృశ్యం (2014)
సంగీతం: శరత్
సాహిత్యం: చంద్రబోస్
గానం: విజయ్ ఏసుదాస్


నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం
గడిచే సమయం నడిపింది వింతజాలం
నీకైనా... నాకైనా...
గత క్షణములోన జరిగింది కాస్త మార్చేయటం సులభమా
మరు క్షణములోన జరిగేది ఏంటొ ఊహించటం సాధ్యమా...

నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం
నీకైనా... నాకైనా...
మరు క్షణములోన జరిగేది ఏంటొ ఊహించటం సాధ్యమా...

గాయాలు చేసేసేది ఈకాలమే గాయాన్ని మాన్పించేది ఈ కాలమే
గాయాలు చేసేసేది ఈకాలమే గాయాన్ని మాన్పించేది ఈ కాలమే
తనకే లేదు ప్రేమా జాలీ కరునా మనకే పోదు మనపై మమతా తపనా
కాలసంద్రానికే ఎదురీతే కాదా బ్రతుకంటే...

నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం
గడిచే సమయం నడిపింది వింతజాలం

కధ మలుపు తిప్పించేది ఈ కాలమే
కన్నీళ్లు తెప్పించేది ఈ కాలమే
కధ మలుపు తిప్పించేది ఈ కాలమే
కన్నీళ్లు తెప్పించేది ఈ కాలమే
తానే కరిగీ నిన్నే కదిపీ కుదిపీ
తానే తరిగీ నిన్నే తరిమీ తరిమీ
ఒక్క క్షణకాలమే వెంటాడేనంటా కలకాలం

నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం
గడిచే సమయం నడిపింది వింతజాలం
నీకైనా... నాకైనా...
గత క్షణములోన జరిగింది కాస్త మార్చేయటం సులభమా
మరు క్షణములోన జరిగేది ఏంటొ ఊహించటం సాధ్యమా...

నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం
నీకైనా... నాకైనా...
మరు క్షణములోన జరిగేది ఏంటొ ఊహించటం సాధ్యమా...



*********   ********   ********


చిత్రం: దృశ్యం (2014)
సంగీతం: శరత్
సాహిత్యం: చంద్రబోస్
గానం: నజీమ్ అర్షద్

ప్రతి రోజు పండుగ రోజే సరదాలు తోడుంటే
ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే
మదిలోన ఆనందాలా మెరుపులు మొదలైతె
ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే
ప్రతి మలుపు మమతేలే కధలెన్నొ మాతో కదిలేలె

ప్రతి రోజు పండుగ రోజే సరదాలు తోడుంటే
ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే

ఇంటిపేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమె
కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే
అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే
తుల్లి తుల్లి పొంగేనంట ఆటా పాటా
అల్లి బిల్లి ఆకాశంలో అమ్మా నాన్నా అక్కా చెల్లి
మల్లెపూల మొబ్బులైతే

ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే
ప్రతి మలుపు మమతేలే కధలెన్నొ మాతో కదిలేలె
ప్రతి రోజు పండుగ రోజే సరదాలు తోడుంటే
ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే

అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే
సుడిగాలికి చెడుజ్వాలకి తెగిపోదు ఈదారమే
గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిధ్యమే
గుమ్మం లోనే వాలేనంట దేవాలయం
చిన్ని చిన్ని కోపాలన్ని చిర్రు బుర్రు తాపాలన్నీ వచ్చీ పోయే ఉరుమైతే...

ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే
ప్రతి మలుపు మమతేలే కధలెన్నొ మాతో కదిలేలె
ప్రతి రోజు పండుగ రోజే సరదాలు తోడుంటే
ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే
మదిలోన ఆనందాలా మెరుపులు మొదలైతె
ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే
ప్రతి మలుపు మమతేలే కధలెన్నొ మాతో కదిలేలె

ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992)

చిత్రం: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, చిత్ర


ఆ ఒడ్డు ఈ ఒడ్డు నడిమద్య ఏరడ్డు
ఓలాల వచ్చి వాలాల…ఓలాల వచ్చి వాలాల

నీ బుగ్గ నా మొగ్గ నడిమద్య ఎవరడ్డు
చీపోలా తీపి కోపాలా…చీపోలా తీపి కోపాలా
కాదన్న చేస్తాను కన్నెంగిలీ
సిగ్గన్న చేస్తాను చీరెంగిలీ
ఏమన్న అనకున్న రేపన్న మాపన్న
ఇద్దరికి తప్పుదులే ఈడెంగిలి
ఓయ్ ఓలాల వచ్చి వాలాల…ఓలాల వచ్చి వాలాల

ఆ ఒడ్డు ఈ ఒడ్డు నడిమద్య ఏరడ్డు
ఓలాల వచ్చి వాలాల…ఓలాల వచ్చి వాలాల

వంగతోట కాడ నువ్వు వొంగుతుంటే
పైటకొంగు నిలవలేక జారుతుంటే
పైరేమి చూస్తావు చేనులోనా
ఈ పంట చూడు పిల్లగో చెంగులోనా
ఓయ్ నీ పిక్క బలుపు చూస్త నీ రెక్క నులుపు చూస్తా
నా కన్నె తలుపు తీస్త నీకున్న ఉడుకు చూస్తా
సింగారం చిగురందం వయ్యరం వడీందం
అన్నిటికి తప్పదులే ఆ ఎంగిలీ
ఓలాల వచ్చి వాలాల…ఓలాల వచ్చి వాలాల

ఆ ఒడ్డు ఈ ఒడ్డు నడిమద్య ఏరడ్డు
ఓలాల వచ్చి వాలాల…ఓలాల వచ్చి వాలాల

మెరక మీద నువ్వు అరక దున్నుతుంటే
నీ కుచ్చుపాగ గుండేలోన గుచ్చుకుంటే
పాగనేమి చూస్తావె పడుచుదాన
నా నాగలుంది చూడవే పదునులోనా
నీ ఒడ్డు పొడుగు చూస్తా..నా వొల్లె మరచి పోతా
నీ ఒంపే ఒలకబోస్తె..నీ ఒల్లొ మంచమేస్తా
శ్రీకారం సిగ్గందం…మందారం బుగ్గందం
ముచ్చతగ తప్పదులే ముద్దెంగిలి
ఓలాల వచ్చి వాలాల…ఓలాల వచ్చి వాలాల

ఆ ఒడ్డు ఈ ఒడ్డు నడిమద్య ఏరడ్డు
ఓలాల వచ్చి వాలాల…ఓలాల వచ్చి వాలాల
నీ బుగ్గ నా మొగ్గ నడిమద్య ఎవరడ్డు
చీపోలా తీపి కోపాలా…చీపోలా తీపి కోపాలా
ఓలాల వచ్చి వాలాల…ఓలాల వచ్చి వాలాల
ఓయ్ ఓలాల వచ్చి వాలాల…ఓలాల వచ్చి వాలాల


******  ******  *******

చిత్రం: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ
ఓసి కందిరీగ వేసుకోవె పాగ
నువ్వు చందమామ నాది సందె ప్రేమ
కాటు వేయకమ్మ కందుతుంది బొమ్మా

తెల్లచీరలో అందమే చూసే
నల్ల చీకటే నాకు ఆశా
అడ్డు చెప్పినా ఆగడే బావా
తెడ్డుకోరెనె పూల నావా
సొగసే..విరపోసుకున్న

నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ
ఓసి కందిరీగ వేసుకోవె పాగ
నువ్వు చందమామ నాది సందె ప్రేమ
కాటు వేయకమ్మ కందుతుంది బొమ్మా

పెదాలకు చేరెను పెళ్ళికి
చెందిన సందడి నీ ముద్దులాగ
వయస్సున కూసె వసంతం
లాడిన కోరిక సన్నయిలాగ
రుచించిన చెక్కిల్లలో..
రచించిన చేరాతలే..
వరించిన వారాలలో..
స్మురించెను సుభలేఖలై
మనసే.. మనువాడుకున్న

నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ
ఓసి కందిరీగ వేసుకోవె పాగ
నువ్వు చందమామ నాది సందె ప్రేమ
కాటు వేయకమ్మ కందుతుంది బొమ్మా

ముఖాలకు వేసిన ముచ్చిక
సిగ్గుల లేకలు రా రమ్మనేగా
సుఖాలుగ మారెను ఇద్దరి
వత్తిడి ప్రేమలు ఈ మధ్యనేగా
కథే ఇక మారిందిలే..
గతే ఒక్కటవుతుందిలే..
కలేసిన కాలాలో..
కలే నిజమయ్యిందిలే..
తొడిమే తడి చేసుకున్న

నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ
ఓసి కందిరీగ వేసుకోవె పాగ
నువ్వు చందమామ నాది సందె ప్రేమ
కాటు వేయకమ్మ కందుతుంది బొమ్మా

తెల్లచీరలో అందమే చూసే
నల్ల చీకటే నాకు ఆశా
అడ్డు చెప్పినా ఆగడే బావా
తెడ్డుకోరెనె పూల నావా
సొగసే..విరపోసుకున్న

నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ
ఓసి కందిరీగ వేసుకోవె పాగ
నువ్వు చందమామ నాది సందె ప్రేమ
కాటు వేయకమ్మ కందుతుంది బొమ్మా

******  ******  *******

చిత్రం: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర


పరువాల కోడి కొకొరొక్కొ అన్నదీ
బలిసింది బాడి పొగరెక్కి ఉన్నదీ
నాటు దెబ్బ పడీతే…కోలాట కొట్టిస్తా
నీ ఆట పట్టిస్తా
రూటు మార్చికొడితే
శివ తాండవాల చిచ్చుపెట్టి తొడగొడతాలే బుడతా

పరువాల కోడి కొకొరొక్కొ అన్నదీ
పసివాడి బాడి పదునెక్కి ఉన్నదీ
నాటు దెబ్బ పడీతే…కోలాట కొట్టిస్తా
నీ ఆట పట్టిస్తా
రూటు మార్చికొడితే
శివ తాండవాల చిచ్చుపెట్టి తొడగొడతాలే బుడతా

దెబ్బకు దెబ్బ తీసావంటె అదిరిపోతావులేవె బ్రతికిపోవే
యెత్తుకు యెత్తు వేసానంటె యెగిరిపోతావులేరా రసికవీరా
చెడిపోకు ముల్లు మీద ఆకుల్ల
పడి పోకు పల్లెటురి బైతుల్లా
నలిపేస్తా నాగమల్లి మొగ్గలా
దులిపేస్తా దుమ్ము నీకు మూతగా
నాకు తిక్క రేగితే నీ పీట లాగేస్తా సైఆటె ఆడేస్తా
టౌను పోసు కొడితే కొస రాజు పాట పాడి నిన్ను పదగుడతాలే మిడతా

పరువాల కోడి కొకొరొక్కొ అన్నదీ
పసివాడి బాడి పదునెక్కి ఉన్నదీ

చింపాంజీల చిందేసావా చిరిగిపోతుంది కాని చిలిపి రాణీ
క్యాబ్రె పట్టు పట్టానంటె అదిరిపోతావు రాజ అడుసుకూజా
ఓ కాంతా నీకు వెన్ను పోటునీ
సమంత ఫాక్స్ నాకు సాటిలే
మువ్వలున్న ముద్ద పప్పు నీవులే
గజ్జలున్న గంగిరెద్దు కానులే
పిచ్చి కూత పెడితే..నీ పీట లేపేస్త నీ సీటు చించేస్తా
కొత్త ఊపుకెడితే కుదురైన పాత కూచిపూడి మొదలెడతాలె..బుడతా

పరువాల కోడి కొకొరొక్కొ అన్నదీ
బలిసింది బాడి పొగరెక్కి ఉన్నదీ


******  ******  *******


చిత్రం: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర



తస్స చక్క తలాంగు చుక్క
ఎంతో చక్క చెక్కిల్ల చుక్క
తస్స చక్క తలాంగు చుక్క
ఎంతో చక్క చెక్కిల్ల చుక్క
కౌగిల్ల పాడుకి కరనం నీవే
ముద్దంటు పల్లకి మునసవి నీవె
రాగల పల్లకీ రానివి నీవే
నా ప్రేమ నగరుకి ప్రెసిడెంటువులే

తస్స చక్క తలాంగు చుక్క
ఎంతో చక్క చెక్కిల్ల చుక్క

నీకున్న రుచి కన్నె కసి దోచుకుంటా
ఉంటా జంటా
నీ ఆడ జలి ఈద గిలి పంచుకుంటా
ఇంటా వంటా
అసలే సోకు నన్నంటుకోకూ
కొసరే కొంగాటలో
కుదిపెయ్మాకు కుస్తీకి రాకు
మొదతి ముద్దాటలో
ముచ్చంట ముచ్చమట మెర మెర మెరిసే

తస్స చక్క తలాంగు చుక్క
ఎంతో చక్క చెక్కిల్ల చుక్క

తస్స చక్క…చక్క
తలాంగు చుక్క….చుక్క
ఎంతో చక్క…చక్క
చెక్కిల్ల చుక్క…చుక్క
నా సిగ్గు సిరి చీర పురి ఇచ్చుకుంటె
ఎట్ట తంటా
నీ కంటి గురి కండ సిరి గుచ్చుకుంటె
కొట్టె గంట
ముద్దబంతీ ముద్దొచెయిందీ ముసిగ నవ్విందిలే
నవ్వె కొద్ది నా ఈడు రద్ది ఎదనె కవ్వించలే
పూల జడ పాల మెడ మనువులు అడిగే

తస్స చక్క తలాంగు చుక్క
ఎంతో చక్క చెక్కిల్ల చుక్క

కౌగిల్ల పాడుకి కరనం నీవే
ముద్దంటు పల్లకి మునసవి నీవె
రాగల పల్లకీ రానివి నీవే
నా ప్రేమ నగరుకి ప్రెసిడెంటువులే
తస్స చక్క తలాంగు చుక్క
ఎంతో చక్క చెక్కిల్ల చుక్క

******  ******  *******

చిత్రం: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఉమ్మ కవాలి ఉంగా ఉంగా
ఊపు రావలి ఉంగ ఉంగ
అడగలేని ఆకలి పుట్టీ అలమటించి పోతున్నా
కలవ్లేని కౌగిలి పట్టి కలవరించి వస్తున్నా
ఏమ్మా దామ్మ నీలో జిమ్మ నాదే నమ్మ

ఉమ్మ కావాల ఉంగా ఉంగా
దమ్ము నీకుందా ఇందా ఇందా

అనుభవాల ఉప్పెనలోనే అందమంటుకుంటున్నా
అడ్డుగోడ దూకుడుతోనే వొడ్డు చేరుకుంటున్నా
ఏమ్మా దామ్మ గుమ్మ బొమ్మ నాదె నమ్మా

ఉమ్మ కవాలి ఉంగా ఉంగా
దమ్ము నీకుందా ఇందా ఇందా

వెచ్చనైన పక్కా విచ్చుకుంది రెక్కా
రెచ్చగొట్టినాకా రేపులేదికా
ఆకులోన వక్కా పెట్టకుంటె తిక్కా
అంటుకుంటె లక్కా ఎర్రకాటుకా
అదేదొ చేసి చూపనా ఎలాగొ అలాగ
సరేలె దారి చూపవా అలాగె బలేగా
పెర పెర పెదావుల కోసం
పాపం అంతొ ఇంతొ ఎంతొ కొంతొ

ఉమ్మ కావాలి ఉంగా ఉంగా
దమ్ము నీకుందా ఇందా ఇందా

మాయగుంది గోదా సోయగాల సోదా
అందమైన ఆదా అప్పుడె కదా
ఉక్కపోత మీదా ఊపిరాడలేదా
చెప్పలేని బాధా చెప్పలేని కథ
మరింత దోచి చూడనా మజాల ఖజాన
అదింక దాచలేనులే పలాన స్థలానా
ఇరువురి దరువుల తాలం మీద
తూలే రాగం తీయలమ్మా

ఉమ్మ కావాలి ఉంగా ఉంగా
దమ్ము నీకుందా ఇందా ఇందా

అడగలేని ఆకలి పుట్టీ అలమటించి పోతున్నా
అనుభవాల ఉప్పెనలోనే అందమంటుకుంటున్నా
ఏమ్మా దామ్మ నీలో జిమ్మ నాదే నమ్మ

ఉమ్మ కావాలి ఉంగా ఉంగా
దమ్ము నీకుందా ఇందా ఇందా

సూర్యవంశం (1998)

చిత్రం: సూర్యవంశం (1998)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: షణ్ముఖ శర్మ
గానం: హరిహరన్
నటీనటులు: వెంకటేష్ , మీనా, రాధిక, సంఘవి
దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు
నిర్మాత: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 25.02.1998

లాలాలా లాలా లాలాలా
లాలాలా లాలా లాలాలా
లలలలల లాల లలలలల లాల

రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే
నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే

రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే

ఆకాశం అందాలంటూ దూకే కెరటంలా ప్రేమే నాలో
ఆ హోరు నీ పేరునే పలికే మంత్రంలా నా గుండెలో
దారంతా చలువ పందిళ్ళే వేసి నీకోసం నీడై ఉన్నా
నాలో నేనే లేనే లేను
నేను నిన్నే నాలో కొలువుంచాను

రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే

మెరుపంటి నీ రాకకే మనసే మేఘంలా మారిందిలే
చిరుగాలై తలపే తాకి కదిలి నిలువెల్లా కరిగిందిలే
తొలి చినుకే తాకే నేలల్లె నేనే పులకించా నీ ఊహతో
రానే రావు ఓనామాలు
కాని నీలో చదివా ప్రియ వేదాలు

రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే
రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే


********   ********   ********



చిత్రం: సూర్యవంశం (1998)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: షణ్ముఖ శర్మ
గానం: చిత్ర

రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే
రోజావే చిన్ని రోజావే

చరణం: 1
ఆకాశం అందాలంటూ దూకే కెరటంలా ప్రేమే నాలో
ఆ హోరు నీ పేరునే పలికే మంత్రంలా నా గుండెలో
దారంతా చలువ పందిళ్ళే వేసి నీకోసం నీడై ఉన్నా
నాలో నేనే లేనే లేను నేను నిన్నే నాలో కొలువుంచాను

రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
రోజావే చిన్ని రోజావే

చరణం: 2
మెరుపంటి నీ రాకకే మనసే మేఘంలా మారిందిలే
చిరుగాలై తలపే తాకి కదిలి నిలువెల్లా కరిగిందిలే
తొలి చినుకే తాకే నేలల్లే నేనే పులకించా నీ ఊహతో
దైవం ముందు దీపంలాగ నిన్ను చూస్తూ కాలం గడిపేస్తాలే

రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే
రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే



**********   **********   ***********



చిత్రం: సూర్యవంశం (1998)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: ఈ.ఎస్.మూర్తి
గానం: యస్. పి. బాలు, చిత్ర

పల్లవి:
కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం
మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం
జోలగా లాలించగా నీ నీడ దొరికింది
కమ్మగా కలలీయగా నీ తోడూ నాకుంది
ఎద విల్లును వంచినవాడే నీ రాముడు అన్నది మనసే
గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై
నీవే ఆ చెలి, నిజమేనా జాబిలి

కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం

చరణం: 1
ఎదురుచూపులో ఇంత తీపని తెలయలేదు మునుపు
ఎదురు చూడని ఇంత హాయిని మరిచిపోదు మనసు
ఒదిగివుండి నీ వాకిటిలో బదులుకోరి నే నిలుచున్నా
దారి తెలియని చీకటిలో వెలుగు చూసి కాదంటానా
ఊరించే ఇది ఏ మాసం
ప్రేమించే ప్రతి గుండెను అందెల సందడి చేసే హేమంతం ఇది
మన సొంతం అయినది

కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం
మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం

చరణం: 2
మావితోట మగపెళ్ళి వారికి విడిది అంది చిలక
మనువు ముందరే మంతనాలకి కదిలే గోరువంక
జాబిలమ్మని జాజులతో తరలిరమ్మని అందామా
పేద మనసుకి పెళ్ళంటే అతిధులెవ్వరు రారమ్మ
నీకన్నా సిరుల మిన్న
ఓ మైన మన మనువులు మెచ్చిన మనసులు పెట్టిన సుముహూర్తం ఇది
వధువై రానా మరి

కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం
మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం
జోలగా లాలించగా నీ నీడ దొరికింది
కమ్మగా కలలీయగా నీ తోడూ నాకుంది
ఎద విల్లును వంచినవాడే నీ రాముడు అన్నది మనసే
గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై
నీవే ఆ చెలి, నిజమేనా జాబిలి



**********   **********   ***********


చిత్రం: సూర్యవంశం (1998)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, సుజాత

చుక్కలన్నీ ముగ్గులై ఫక్కుమన్న ముంగిలి
కళ్ళ ముందు కదిలీ చూపించె మంచి మజిలీ
ప్రతి పూట పూల బాటగా సుమ స్వాగతాలు పాడగా
స్వప్నసీమ చూద్దాం జత జైత్రయాత్ర చేద్దాం

చుక్కలన్నీ ముగ్గులై ఫక్కుమన్న ముంగిలి
కళ్ళ ముందు కదిలీ చూపించె మంచి మజిలీ

చరణం: 1
నువ్వే తోడుగా ఉండే జీవితం నిట్టూర్పు జాడేలేని నిత్య నూతనం
నువ్వే నీడగా పంచే స్నేహితం హేమంతం రానేరాని చైత్ర నందనం
ఎండల్లో చిందే చెమట అమృతం పోయగా గుండెల్లో నమ్మకాన్ని పెంచుదామా
ఇళ్ళల్లో నిష్టూరాల నిప్పులే కాంతిగా రేపట్లో అదృష్టాన్ని పోల్చుకోమా
నడిరేయి చేరనీయకా సుర్యదీపముందీ మన దారి చూపుతోందీ

చుక్కలన్నీ ముగ్గులై ఫక్కుమన్న ముంగిలి
కళ్ళ ముందు కదిలీ చూపించె మంచి మజిలీ

చరణం: 2
అన్ని రోజులూ సన్నజాజులై అందంగా అల్లుకుందాం చిన్ని మందిరం
నిన్న ఊహలే నేటి ఊయలై గారంగా పెంచుకుందాం స్నేహబంధనం
రంగేళి సంతోషాల చందనం చల్లుతూ ఈ గాలి అందుకుంది కొత్త జీవితం
ఉంగాల సంగీతాల రాగమే పాడుతూ సాగాలి సూర్యవంశ సుప్రభాతం
అంచుదాటు అమృతం పంచుతోంది నిత్యం మన ప్రేమ పారిజాతం

చుక్కలన్నీ ముగ్గులై ఫక్కుమన్న ముంగిలి
కళ్ళ ముందు కదిలీ చూపించె మంచి మజిలీ
ప్రతి పూట పూల బాటగా సుమ స్వాగతాలు పాడగా
స్వప్నసీమ చూద్దాం జత జైత్రయాత్ర చేద్దాం
చుక్కలన్నీ ముగ్గులై ఫక్కుమన్న ముంగిలి
లాల లాల లాలా లా లాల లాల లాలా
లాల లాల లాలా లా లాల లాల లాలా
లాల లాల లాలా లా లాల లాల లాలా




***********   ************   ************



చిత్రం: సూర్యవంశం (1998)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు

అడుగో మహరాజు పులిలా కదిలాడు
అడుగో మహరాజు పులిలా కదిలాడు
ఆ మీసాలు చూడు రోషాల జోడు వీరాధి వీరుడురా
దొర దీటైనవాడీ దేశాన లేడు మాపాలి దేవుడురా
ఆ చూపులో చురుకుదనం సూర్యున్ని లేపునురా
ఆ నవ్వులో చల్లదనం చంద్రున్ని చూపునురా
అడుగో మహరాజు పులిలా కదిలాడు

కోరస్: దొరపుట్టిన రోజంటా, దొరపుట్టిన రోజంటా ఊరికి తిరణాలంటా

ఏయ్ కొపమొచ్చెనంటె దొరకి ఈశ్వరుని నిప్పుకన్ను తెరచునురా
జాలి పుట్టినంటె దొరకి విష్ణుమూర్తి అభయము దొరకునురా
నీతికి తానే పెట్టని కోట దాటెరగడురా ఆడిన మాట
అరె సాటిలేని కీర్తి వున్న సూర్యవంశ వారసున్ని
మచ్చుకైన మచ్చలేని స్వచ్చమైన నాయకున్ని పొందిన ఊరు ఇది
అడుగో మహరాజు పులిలా కదిలాడు

అరె దిన్నా దిన్నకు దిన్న
ఓయ్ దిగి దిగి దిగి దిగి  దిగి దిగి దిగి దిగి
ఉన్నొళ్ళు నిన్నుచూసి మహరాజ
ఆళ్ళకేదో పోల్చుకోరా మహరాజ
లేనివాళ్ళు నిన్నుచూసి మహరాజ
కొంగుబంగారమనుకోరా మహరాజ
గొడ్రాళ్ళు నిన్నుచూసి మహరాజా...
అరె గొడ్రాళ్ళు నిన్నుచూసి మహరాజ తమ బిడ్డ నువ్వే అనుకోరా మహరాజ

నేల తల్లి పొంగుతున్నద్ది మా దొరని కన్నదన్న సంబరానికి
నీలి నింగి ఒంగుతున్నది మా దొరని ఒక్కసారి మొక్కడానికి
కలికాలంలో రాముడె అంటే
కలగాదండి మా దొర వుంటే
పాపమంత పారద్రోల తీర్ధయాత్రలెందుకంట
రెండుచేతులెత్తి నీకు దండమెడితె చాలునంట పుణ్యము పండునయా
దిన్నా దిన్నకు తా హేయ్ దిన్నా దిన్నకు తా

అడుగో మహరాజు పులిలా కదిలాడు
ఆ మీసాలు చూడు రోషాల జోడు వీరాధి వీరుడురా
హే హే దొర దీటైనవాడీ దేశాన లేడు మాపాలి దేవుడురా
ఆ చూపులో చురుకుదనం సూర్యున్ని లేపునురా
ఆ నవ్వులో చల్లదనం చంద్రున్ని చూపునురా



***********   ***********   ***********



చిత్రం: సూర్యవంశం (1998)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు, స్వర్ణలత

ఝలకు ఝలకు సిలుకు చీర ఝలకు ఝలకు
చమకు  చమకు జిలుగు రైక చమకు  చమకు
రా రమ్మన్నది పిల్లా ఒళ్ళో చేరుకో
వెచ్చని కౌగిట వెన్నలాగ కరిగిపో
కసిగా కవ్విస్తుంది నడుము నీ నడుము
ఉసిగా పట్టాలంటే టైము ఇది టైము

ఝలకు ఝలకు సిలుకు చీర ఝలకు ఝలకు
చమకు  చమకు జిలుగు రైక చమకు  చమకు

అరె నీ బుగ్గల్లోన ఏమున్నదో బాదం హల్వా ముక్క దాగున్నదో
అరె నీ చూపుల్లోన ఏమున్నదో పైటను తప్పించేసే పవరున్నదో
గుస గుస లాడేమంది సన్నారైక సొగసుగా
పట్టిమంచం బెదురుకుంటే చాప దిండు ఉందిగా
వాళుతున్నావి కళ్ళు అవి ఊపుతున్నవి ఒళ్ళు
పైన వెన్నెల జల్లు మదిలోన పుట్టెను జిల్లు

కసిగా కవ్విస్తుంది నడుము నీ నడుము
ఉసిగా పట్టాలంటే టైము ఇది టైము
ఝలకు ఝలకు సిలుకు చీర ఝలకు ఝలకు
చమకు  చమకు జిలుగు రైక చమకు  చమకు

చల్లగాలి వీస్తుంటే చలి కాచుకో నన్నే దుప్పటిగా పెనవేసుకో
ఒడిలో నువ్వుంటే చలి ఏవిటే జతగా ఒకటైతే మతిపోదటే
మల్లెపూలు నలిగాయంటే రెండో రెండు వేడుకే సత్తావున్న మగాడిచ్చే ముచ్చటైన కానుకే
వేడెక్కిపోతుంది పరుపు దాన్ని ఓడించ మంటుంది వలపు
కానివ్వు అందాల కొలువు నేడు కన్నెతనానికి శలవు

కసిగా కవ్విస్తుంది నడుము నీ నడుము
ఉసిగా పట్టాలంటే టైము ఇది టైము
ఝలకు ఝలకు సిలుకు చీర ఝలకు ఝలకు
చమకు  చమకు జిలుగు రైక చమకు  చమకు
రా రమ్మన్నది పిల్లా ఒళ్ళో చేరుకో
వెచ్చని కౌగిట వెన్నలాగ కరిగిపో
కసిగా కవ్విస్తుంది నడుము నీ నడుము
ఉసిగా పట్టాలంటే టైము ఇది టైము
ఝలకు ఝలకు సిలుకు చీర ఝలకు ఝలకు
చమకు  చమకు జిలుగు రైక చమకు  చమకు

ముద్దుల మొగుడు (1997)


చిత్రం: ముద్దుల మొగుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర
నటీనటులు: బాలకృష్ణ, మీనా

ఓ ముద్దుగుమ్మా నీ ముద్దుగుమ్మ మెక్కడుందొ చెప్పవమ్మా
ఓరందగాడ నా ముద్దబంతి మొగ్గ నీకు చిక్కదయ్యో
చెంగు దాటగా చెమ్మ చెక్కలాట
జోరుగుండదా జోడు గువ్వలాట
పాల ఈడు తోడుపెట్టి పచ్చిమీగడెక్కడంటే గోపాలా

ఓ ముద్దుగుమ్మా నీ ముద్దుగుమ్మ మెక్కడుందొ చెప్పవమ్మా
ఓరందగాడ నా ముద్దబంతి మొగ్గ నీకు చిక్కదయ్యో

కుర్రదాన కుశలమా కుతకొచ్చే పరువమా
గుట్టుదాటే ఘుమ ఘుమ కట్టుకోరా ప్రియతమా
ఈడే కోడై ఈలేసినా జాబిల్లోస్తుందా
జాబిళ్ళమ్మా కౌగిళ్ళలో జాగారిస్తుందా
గడప దాటని అందం కడప చేరినదా
మొదటిచూపుకు మొహం మొటిమ లేసినదా
పావడాల చెట్టుమీద పాలపిట్ట లాడుతుంటే పాపాలా

ఓ ముద్దుగుమ్మా నీ ముద్దుగుమ్మ మెక్కడుందొ చెప్పవమ్మా
ఓరందగాడ నా ముద్దబంతి మొగ్గ నీకు చిక్కదయ్యో

దోచుకున్నా దొరకవు దాచుకున్నా మెరుపులు
కస్సుమన్నా కదలవు కమ్ముకున్న వలపులు
ముద్దింటమ్మ ఆకళ్లలో ముప్పూట జరిగే
చేరింతమ్మ కుచ్చిళ్ళలో సిగ్గంతా ఎగిరే
తలుపు మూసిన తాపం తణుకు చేరినదా
మధుర మన్మధ బాణం ఆధరమడిగినదా
పాలపుంతలన్ని తోడు పాయసాలు జుర్రుకున్న గోపాలా

ఓ ముద్దుగుమ్మా నీ ముద్దుగుమ్మ మెక్కడుందొ చెప్పవమ్మా
ఓరందగాడ నా ముద్దబంతి మొగ్గ నీకు చిక్కదయ్యో
చెంగు దాటగా చెమ్మ చెక్కలాట
జోరుగుండదా జోడు గువ్వలాట
పాల ఈడు తోడుపెట్టి పచ్చిమీగడెక్కడంటే గోపాలా

********** ********* ***********

చిత్రం: ముద్దుల మొగుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

సాహో...
అరె గిలి గిలి గిలి మంజారో పింజారో
అబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో
అరె గిలి గిలి గిలి మంజారో పింజారో
అబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో
అబ్బ ఒంటిపూస తేలుకుంది చూపురో
దాని ఒంటినిండ ఓబరాల షేపురో
అబ్బ పెట్టుకున్న బంతికెంతో తిమ్మిరో
వాడ్ని తిట్టుకున్న నోటికెంతో తిమ్మిరో

మాఘమాసమొచ్చెనే మంట పుట్టుకొచ్చెనే
మంచు గాలి వీచెనే మంచమడ్డు కొచ్చెనే

సాహో...
అరెరెరరె గిలి గిలి గిలి మంజారో పింజారో
అబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో హోయ్

కంచె నువ్వు చేను నేను కందిచేనుకాడ చెంగు తీస్తలే
కన్ను నువ్వు రెప్ప నేను కన్నెదోసపండు దొంగిలిస్తలే హఁ
కంచె నువ్వు చేను నేను కందిచేనుకాడ చెంగు తీస్తలే
కన్ను నువ్వు రెప్ప నేను కన్నెదోసపండు దొంగిలిస్తలే
పొరపాటు చేశాక తిప్పలు మన చుట్టూ ఉంటాయి కప్పలు
అలవాటు ఐతేనే ఇప్పుడు అవుతుంది మేళాల చప్పుడు

యాహో...
అరె గిలి గిలి గిలి మంజారో పింజారో
అబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో హాయ్

వంగతోట దొంగమాట వచ్చివాలిపోవే పొద్దు గూకులు
అమ్మదొంగ నిమ్మలంగా ఎత్తుకెళ్లమాక గుత్తసోకులు
వంగతోట దొంగమాట వచ్చివాలిపోవే పొద్దు గూకులు
అమ్మదొంగ నిమ్మలంగా ఎత్తుకెళ్లమాక గుత్తసోకులు
ఆఁ చెలి తోడు కోరింది గుప్పెడు గిలిపెట్టే నా గుండె చప్పుడు
చలికాలం చంపెంగ నిప్పులు జరిగింది ఆ లగ్గమిప్పుడు

యమహో...
అరెరెరరె గిలి గిలి గిలి మంజారో పింజారో
అబ్బబ్బబ్బబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో
అబ్బ ఒంటిపూస తేలుకుంది చూపురో
దాని ఒంటినిండ ఓబరాల షేపురో
అబ్బ పెట్టుకున్న బంతికెంతో తిమ్మిరో
వాడ్ని తిట్టుకున్న నోటికెంతో తిమ్మిరో

మాఘమాసమొచ్చెనే మంట పుట్టుకొచ్చెనే
మంచు గాలి వీచెనే మంచమడ్డు కొచ్చెనే

సాహో...

********** ********* ***********

చిత్రం: ముద్దుల మొగుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

చిగురాకు చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని
ప్రియ గోరువంక అడిగే ఎటురమ్మని ఏదిమ్మని
సగమై జరిగే సంసారం
జతగా గడిపే జాగారం
పరువపు పరిమళ మల్లుకున్నదిలే

చిగురాకు చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని

కానిమ్మంటే కాకా పట్టి మళ్ళొస్తాలే చి పాడంటూ సింగారాలు
చిక్కానంటే సిగ్గమ్మత్తా వెళ్ళొస్తాను చొక్కాకంటే సిందూరాలు
రావే తల్లి అంటే రాదు గోల లీవే లేనే లేదు చారుశీల
అట్టే యిట్టె వచ్చే అబ్బలాల పుట్టించొద్దు అగ్గి మూల మూల
పెదవే మధువై రుచులడిగే మదిలో గదిలో శృతి చెరిగే
మనసులు కలిసిన మాఘమాసంలో

చిగురాకు చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని

అందాలన్నీ కౌగిళ్ళల్లో కర్పూరాలై తంటాకొచ్చే తాంబూలాలు
నచ్చేవన్ని గిచ్చంగానే మందారాలు పైటల్లోనా తంబురాలు
బావా బావా నీతో బంతులాట ఒళ్ళో కొస్తానంటె వంగతోట
అమ్మా నాన్నా అట అడుకుంటా అమ్మా అబ్బా అంటే తగ్గనంటా
మనసే అడిగే మధుమసం సొగసే కడిగే హేమంతం
మిస మిస వయసున మీగడొస్తుంటే

చిగురాకు చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని
ప్రియ గోరువంక అడిగే ఎటురమ్మని ఏదిమ్మని
సగమై జరిగే సంసారం
జతగా గడిపే జాగారం
పరువపు పరిమళ మల్లుకున్నదిలే