Showing posts with label Pawan Kalyan. Show all posts
Showing posts with label Pawan Kalyan. Show all posts

భీమ్లా నాయక్ (2022)




సెభాష్
ఆడాగాదు ఈడాగాదు
అమీరోళ్ల మేడాగాదు
గుర్రం నీళ్ల గుట్టాకాడ
అలుగూ వాగు తాండాలోన
బెమ్మాజెముడు చెట్టున్నాది

బెమ్మజెముడు చెట్టుకింద
అమ్మా నెప్పులు పడతన్నాది
ఎండాలేదు రేతిరిగాదు
ఎగూసుక్కా పొడవంగానే
పుట్టిండాడు పులిపిల్ల

పుట్టిండాడు పులిపిల్ల
నల్లామల తాలూకాల
అమ్మా పేరు మీరాబాయి
నాయన పేరు సోమ్లా గండు

నాయన పేరు సోమ్లా గండు
తాత పేరు బహద్దూర్
ముత్తులతాత ఈర్యానాయక్
పెట్టినపేరు భీమ్లానాయక్
సెభాష్ భీమ్లానాయకా

భీమ్లానాయక్

ఇరగదీసే ఈడి ఫైరు సల్లగుండు
ఖాకీ డ్రెస్సు పక్కనెడితే వీడే పెద్దగూండా
నిమ్మళంగ కనబడే నిప్పు కొండ
ముట్టుకుంటే తాట లేసిపోద్ది తప్పకుండా
ఇస్తిరి నలగని చొక్కా పొగరుగ తిరిగే తిక్క
చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్కా విరుగును బొక్క
భీం భీం భీం భీం భీమ్లానాయక్ బుర్ర రాం కీర్తన పాడించే లారీ గాయక్
భీం భీం భీం భీం భీమ్లానాయక్ దంచి దడదడదడలాడించే డ్యూటి సేవక్
ఆ జుట్టునట్టా సవరించినాడో సింగాలు జూలు విదిలించిన
ఆ షర్టునట్టా మడతెట్టినాడో రంగాన పులులు గాండ్రించినట్టే
ఆ కాలి బూటు బిగట్టినాడో తొడగొట్టి వేట మొదలెట్టినట్టే

భీమ్లానాయక్ భీమ్లానాయక్

ఎవ్వడైన ఈడి ముందు గడ్డిపోస
ఎర్రి గంతులేస్తే ఇరిగిపోద్ది ఎన్నుపూస
కుమ్మడంలో విడి ఒక బ్రాండు తెల్సా
వీడి దెబ్బతిన్న ప్రతివాడు పాస్టు టెన్సా
నడిచే రూటే స్ట్రెయిటు పలికే మాటే రైటు
టెంపరుమెంటే హాటు పవరుకు ఎత్తిన గేటు ఆ నేమ్ ప్లేటు
భీం భీం భీం భీం భీమ్లానాయక్ బుర్ర రాం కీర్తన పాడించే లారీ గాయక్
భీం భీం భీం భీం భీమ్లానాయక్ దంచి దడదడదడలాడించే డ్యూటీ సేవక్

గుంటూరుకారం ఆ యూనిఫారం మంటెత్తిపోద్ది నకరాలు చేస్తే
లావాదుమారం లారి విహారం - పెట్రేగిపోద్ది నేరాలు చూస్తే
సెలవంటూ అనడు శనాదివారం అల్ రౌండ్ ది క్లాకు పిస్తాలు దోస్తే


************** ***************** ************** ***********************


 
చిత్రం: భీమ్లా నాయక్ (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి
గానం: చిత్ర

ఈసింత నన్నట్ట న న న న
కూసింత పంజెయ్యనియ్యవు
ఎంతోడివే గాని మ్మ్ మ్మ్ న న
ముద్దిస్తే మారాము సెయ్యవు

పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేది
నాఇంటి పెనివిటివే
బొట్టెట్టి ముద్దెట్టి నను చేరదీసిన
దేవుళ్ళ సరిసాటివే

నా బంగారి మావ…నా బలశాలి మావ
నా మెళ్లోని నల్లపూసల్లో మణిపూసవే
నా సుడిగాలి మావ

ఈసింత నన్నిట్ట పోనేపోనియ్యవు
కూసింత పంజెయ్యనియ్యవు
ఎంతోడి వేగాని సొంతోడివే నువ్వు
ముద్దిస్తే మారాము సెయ్యవు
గాలి కౌగిళ్లుగా చుట్టుముట్టేసి ఉంటావు
ఊపిరాడనీవురయ్యా
నా పుట్టుమచ్చలకు తోడబుట్టినావు
నీకు నాకు ధిష్ఠి తియ్య

అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమేందయ్యా నీకు
నా మీన…అంత ఇష్టమేందయ్యా నీకూ

ఈసింత నన్నిట్ట పోనేపోనియ్యవు
కూసింత పంజెయ్యనియ్యవు
ఎంతోడివే గాని సొంతోడివే నువ్వు
ముద్దిస్తే మారాము సెయ్యవు

గాలి కౌగిళ్లుగా చుట్టుముట్టేసి ఉంటావు
ఊపిరాడనీవురయ్యా
నా పుట్టుమచ్చలకు తోడబుట్టినావు
నీకు నాకు ధిష్ఠి తియ్య

అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమేందయ్యా నీకు
నా మీన…అంత ఇష్టమేందయ్యా నీకూ

ఏ తల్లి కన్నాదో నిన్నూ
కోటి కలలకు రారాజై వెలిసినావంట
ఏ పూట పుట్టినావో నువ్వు
అది అచ్చంగా పున్నమి అయ్యుంటాదంట

వెలకట్టలేనన్ని వెలుగుల్ని
నా కంట పూయించినావంట నువ్వు
ఎత్తు కొండమీది కోహినూరే గాదు
గుండెలోతు ప్రాణమైనా ఇస్తావు

అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమేందయ్యా నీకు
నా మీన…అంత ఇష్టమేందయ్యా నీకూ

అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమేందయ్యా నీకు
నా మీన…అంత ఇష్టమేందయ్యా నీకూ



************** ***************** ************** ***********************

 
చిత్రం: భీమ్లా నాయక్ (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: త్రివిక్రమ్ శ్రీనివాస్ 
గానం: అరుణ్ కౌండిన్య 

లాలా భీమ్లా
అడవిపులి గొడవపడి 
ఒడిసిపట్టు దంచి కొట్టు 
కట్టిపట్టు ఆదరగొట్టు 

గడ గడ గడ  గుండెలదర 
దడ దడ దడ  దున్నే బెదిరే 

అలగల గల గల గల లాలా
అలగల గల గల గల భీమ్లా (4)

అడవిపులి గొడవపడి 
ఒడిసిపట్టు దంచి కొట్టు 

పది పడగల పాము పైన 
పాదమెట్టిన సామి తోడు
పిడిగులొచ్చి మీద పడితే 
కొండ గొడుగు నెత్తినోడు

లాలా భీమ్లా
ఎద్దులోచ్చి మీద పడితే 
గుద్ది గుద్ది సంపినోడు
ఎదురొచ్చిన పహిల్వాన్ని 
పైకి పైకి ఇసిరినోడు 
లాలా భీమ్లా

లాలా భీమ్లా
అడవిపులి గొడవపడి 
ఒడిసిపట్టు దంచి కొట్టు 
కట్టిపట్టు ఆదరగొట్టు 

అలగల గల గల గల లాలా
అలగల గల గల గల భీమ్లా (4)

అడవిపులి గొడవపడి 
ఒడిసిపట్టు దంచి కొట్టు 
కట్టిపట్టు ఆదరగొట్టు 

భీమ్లా నాయక్
భీమ్లా నాయక్
భీమ్లా నాయక్


************** ***************** ************** ***********************

 
చిత్రం: భీమ్లా నాయక్ (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సాహితి చాగంటి, కుమ్మరి దుర్గవ్వ

కిందున్న మడుసులకా
కోపాలు తెమలవు
పైనున్న సామెమో
కిమ్మని పలకడు

దూకేటి కత్తులా
కనికరమెరుగవు
అంటుకున్న అగ్గీలోన
ఆనవాళ్లు మిగలవు

సెబుతున్న నీ మంచి సెడ్డా
ఆంతోటి పంథాలు పోబోకు బిడ్డ

సెబుతున్న నీ మంచి సెడ్డా
ఆంతోటి పంథాలు పోబోకు బిడ్డ

సిగురాకు సిట్టడవి గడ్డ
చిచ్చులో అట్టుడికి పోరాదు బిడ్డా

పుట్టతేనే బువ్వ పెట్నా
సెలయేటి నీళ్లు జింక
పాలు పట్నా

ఊడల్ల ఉయ్యాల గట్టి
పెంచి నిన్ను ఉస్తాదల్లే
నించోబెట్నా

పచ్చన్ని బతికిత్తే నీకు
ఎల్లెల్లి కచ్చళ్ళ పడబోకు బిడ్డా

సెబుతున్న నీ మంచి సెడ్డా
ఆంతోటి పంథాలు పోబోకు బిడ్డ

సిగురాకు సిట్టడవి గడ్డ
చిచ్చులో అట్టుడికి పోరాదు బిడ్డా

మగువా మగువా...

మహిళామణులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వకీల్ సాబ్ సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.




మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా 

అటు ఇటు అన్నింటా, నువ్వే జగమంతా
పరుగులు తీస్తావు ఇంటా బయట
అలుపని రవ్వంత అననే అనవంట
వెలుగులు పూస్తావు వెళ్లే దారంత
స.. గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ.స... 
గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ... గ.మ.ప.గ.స...

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా

నీ కాటుక కనులు విప్పారకపోతే 
ఈ భూమికి తెలవారదుగా
నీ గాజుల చేయి కదలాడకపోతే 
ఏ మనుగడ కొనసాగదుగా
 
ప్రతి వరసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా 
అంతులేని నీ శ్రమా అంచనాలకందునా
ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా 
నీవులేని జగతిలో దీపమే వెలుగునా
నీదగు లాలనలో ప్రియమగు పాలనలో 
 
ప్రతి ఒక మగవాడు పసివాడేగా
ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా 
ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా 

స.. గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ.స... 
గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ.స...

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా 



చిత్రం : వకీల్ సాబ్ (2021)
సంగీతం : ఎస్.ఎస్.థమన్   
సాహిత్యం : రామజోగయ్యశాస్త్రి 
గానం : సిధ్ శ్రీరామ్ 


అత్తారింటికి దారేది (2013)

చిత్రం: అత్తారింటికి దారేది (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శంకర్ మహదేవన్


హేయ్ బొంగరాలంటి కళ్ళు తిప్పింది ఉంగరాలున్న జుట్టు తిప్పింది
గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పిందీ...
అమ్మో బాపు గారి బొమ్మో
ఓలమ్మో మల్లెపూల కొమ్మో...
రబ్బరు గాజుల రంగు తీసింది
బుగ్గల అంచున ఎరుపు రాసింది
రిబ్బను కట్టిన గాలి పటంలా నన్నెగరేసిందీ...
అమ్మో దాని చూపు గమ్మో
ఓలమ్మో ఓల్డ్ మోంక్ రమ్మో... హై
పగడాల పెదవుల్తో పడగొట్టిందీ పిల్లా
కత్తులులేని యుద్ధం చేసి నన్నే గెలిచింది
ఏకంగా యెదపైనే నర్తించిందీ...
అబ్బా నాట్యంలోని ముద్దర చూసి నిద్దర నాదే పోయింది...

అమ్మో బాపు గారి బొమ్మో హే హే హే
ఓలమ్మో మల్లెపూల కొమ్మో... హో హో

మొన్న మేడ మీద బట్టలారేస్తూ
కూని రాగమేదొ తీసేస్తూ
పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్లా...
నిన్న కాఫీ గ్లాసు చేతికందిస్తూ
నాజూకైన వేళ్ళు తాకిస్తూ
మెత్తని మత్తుల విద్యుత్ తీగై ఒత్తిడి పెంచిందే మళ్ళా... హోయ్
కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది
ఓరగా చూసే చూపు నావైపే అనిపిస్తుంది
పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసింది
చీర చెంగు చివరంచుల్లో నన్నె బంధీ చేసింది
పొద్దు పొద్దున్నే హల్లో అంటుందీ
పొద్దు పోతె చాలు కల్లోకొస్తుందీ
పొద్దస్తమానం పొయినంత దూరం గుర్తొస్తుంటుందీ...

అమ్మో బాపు గారి బొమ్మో హే హే హే
ఓలమ్మో మల్లెపూల కొమ్మో...

సయ్యో అయ్యయ్యో మయ్యో అయ్యయ్యో రయ్యో అయ్యయ్యో అహ అహ అహ అహ
సయ్యో అయ్యయ్యో మయ్యో అయ్యయ్యో రయ్యో అయ్యయ్యో అహ అహ అహ అహ

యే మాయా లోకంలోనో నన్ను మెల్లగ తోసేసింది
తలుపులు మూసింది తాళం పోగెట్టేసిందీ
ఆ మబ్బుల అంచుల దాకా నా మనసుని మోసేసింది
చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగింది.
తిన్నగా గుండెను పట్టి గుప్పిట పెట్టి మూసేసింది
అందమే గంధపు గాలై మళ్ళీ ఊపిరి పోసింది
తియ్యని ముచ్చటలెన్నో ఆలోచన్లో అచ్చేసింది
ప్రేమనే కళ్లద్దాలు చూపులకే తగిలించింది
కోసల దేశపు రాజకుమారి ఆశలు రేపిన ఖండాల పోరి
పూసల దండలొ నన్నే గుచ్చి మెళ్ళో వేసిందీ

అమ్మో బాపు గారి బొమ్మో హే హే హే
ఓలమ్మో మల్లెపూల కొమ్మో... ఓ...



*********   ********   ********



చిత్రం: అత్తారింటికి దారేది (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: తాళ్ళపాక అన్నమాచార్య
గానం: పాలక్కడ్ శ్రీరామ్, ఎమ్. ఎస్. సుబ్బలక్ష్మి, రీటా

దేవదేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి రణపుంగవం రామం
దేవదేవం భజే దివ్య ప్రభావం

వేల సుమ గంధముల గాలి అలలా
కలల చిరునవ్వులతో కదిలినాడు
రాల హృదయాల తడిమేటి తడిలా
కరుణగల వరుణుడై కరిగినాడు

అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం
ఆవిరి మేఘాలే ఆతని సొంతం
అరమరికల వైరం కాల్చెడి అంగారం
వెలుగుల వైభోగం ఆతని నయనం

ప్రాణ ఋణబంధముల తరువును
పుడమిగ నిలుపుటె తన గుణం

దేవదేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి రణపుంగవం రామం
దేవదేవం భజే దివ్య ప్రభావం





*********   ********   ********



చిత్రం: అత్తారింటికి దారేది (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: నరేంద్ర, డేవిడ్ సిమన్

ఓహ్ మై గాడ్!! ఐ కాంట్ బిలీవ్ దట్ యు సెడ్ దట్
ఆర్ యామ్ ఐ డ్రీమింగ్ దట్ ఐ హియర్డ్ దట్
మై హార్ట్ ఈస్ రేజింగ్ లైక్ ఎ చీతా
సో ఐ వన్నా సింగ్ దిస్ కొత్త పాట

ఓసోసి పిల్ల పోరి ఓ చిన్న మాట జారి
ఏం దెబ్బ తీసినావె
రాకాసి రాకుమారి కోపంగ పళ్ళు నూరి
ఐ లవ్ యు చెప్పినావే
అందంగ పెట్టినావె స్పాటు గుండె తాకిందె ప్రేమ గన్ను షాటు
ఏది లెఫ్టు ఏది నాకు రైటు
మందు కొట్టకుండనే నేను టైటు
క్యాట్ బాలు లాగిపెట్టి మల్లె పూలు జల్లినట్టు
షర్టు జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు
పిచ్చి పిచ్చి గుందే

కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే హోయ్

ఓహ్ మై గాడ్!! ఐ కాంట్ బిలీవ్ దట్ యు సెడ్ దట్
ఆర్ యామ్ ఐ డ్రీమింగ్ దట్ ఐ హియర్డ్ దట్
మై హార్ట్ ఈస్ రేజింగ్ లైక్ ఎ చీతా
సో ఐ వన్నా సింగ్ దిస్ కొత్త పాట

పెదవి స్ట్రా బెరి పలుకు క్యాట్బరీ
సొగసు తీగలో కదిలింది పూల నర్సరీ
కళ్ళలో కలల గేలరీ చిలిపి చూపులో
కొలువుంది ద్రాక్ష మాధురి
అత్తరేదొ జల్లినావే అత్త గారి పిల్ల
సిత్తరాల నవ్వు పైన రత్తనాలు జల్లా
కొత్త ప్రేమ మత్తు నన్ను హత్తుకుంటె యిల్లా
పిచ్చి పిచ్చి గుందే

కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే హోయ్

హే మహంకాళి జాతర్లో మైకు సెట్టు మోగినట్టు మైండంత గోల గుందే
బెంగాళి స్వీటు లోన భంగేదో కలిపితిన్న ఫీలింగు కుమ్ముతుందే
కౌబాయ్ డ్రెస్సు వేసినట్టు క్రిష్ణ రాయలోని గుర్రమెక్కినట్టు
భూమ్మీద ఉన్న చోటే ఉంటూ ఆ మూను మీద కాలు పెట్టినట్టు
సిమ్ము లేని సెల్లు లోకి ఇన్ కమింగు వచ్చినట్టు
సింగరేణి బొగ్గు తీసి ఫేసు పౌడరద్దినట్టు
పిచ్చి పిచ్చి గుందే

కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే హోయ్





*********   ********   ********



చిత్రం: అత్తారింటికి దారేది (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్
గానం: దేవి శ్రీ ప్రసాద్

నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హో అదేమిటే
నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హొయ్
ఓయ్ ఆ ఆ ఏ అవతలకి పో

నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హొయ్
నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హై

ఏమిటో ఏమ్మాయో చేసినావె కంటి చూపుతోటి
ఏమిటో ఇదేమి రోగమో అంటించినావె ఒంటి ఊపుతోటి
ముంచే వరదలా కాల్చే ప్రమిధలా చంపావే మరదలా

నిన్ను చూడగానే... నా చిట్టి గుండె
నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హొయ్
నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హై

వన్స్ మోర్ విత్ ఫీల్
ఓహ్ నో

ఏ అంత పెద్ద ఆకాశం అంతులేని ఆ నీలం
నీ చేప కళ్ల లోతుల్లో ఎట్ట నింపావె ఇరగదీసావే
ఏయ్ భూమిలోన బంగారం
దాగి ఉందనేది ఓ సత్యం
దాన్ని నువ్వు భూమి పైన పెరిగేస్తూ ఇట్ట తిరిగేస్తూ తిరగ రాసావే
ఏయ్ అలా నువ్వు చీర కట్టి చిందులేస్తె చీమలా నేను వెంట పడనా
నావలా నువ్వు తూగుతూ నడుస్తు ఉంటె
కాపలాకి నేను వెంట రానా
కృష్ణ రాధలా, నొప్పి బాధలా ఉందాం రావె మరదలా

నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హై

ఆ హుం ఆ హుం ఆ హుం ఆ హుం
అత్తలేని కోడలుత్తమురాలు ఓరమ్మా కోడల్లేని అత్త గుణవంతురాలు ఆ హుం ఆ హుం
హోయ్ కోడల కోడల కొడుకు పెళ్ళామా ఓరమ్మా పచ్చి పాల మీద మీగడేదమ్మా
హా వేడి పాలలోన వెన్న లేదమ్మా ఆ హుం ఆ హుం
ప్లీజ్ డ్యాన్స్ యార్

మోనలీస చిత్రాన్ని గీసినోడు ఎవడైనా
ఈ పాల సీస అందాన్ని చూడనే లేదు ఇంక ఏం లాభం
కోహినూరు వజ్రాన్ని ఎత్తుకెళ్లినోడు రాజైనా
దాని మెరుపు నీలోనే దాగిఉందని తెలియలే పాపం
ఇంతిలా నువ్వు పుట్టుకొస్తె నేను మాత్రమెంతని పొగిడి పాడగలను
తెలుగు భాషలో నాకు తెలిసిన పదాలు అన్ని గుమ్మరించి ఇంత రాసినాను
సిరివెన్నెల మూటలా వేటూరి పాటలా ముద్దుగున్నావె మరదలా

నిన్ను చూడగానె నా చిట్టి గుండె...
నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హొయ్
నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హై





*********   ********   ********



చిత్రం: అత్తారింటికి దారేది (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మల్గాడి శుభ, డేవిడ్ సిమన్

ఓరి దేవుడో దేవుడో ఏంపిల్లగాడే
మిల్లీమీటరైన వదలకుండా దిల్లో నిండినాడే
హాఁ కళ్ళల్లోన కత్తులున్న తీవ్రవాదిలా
మాటల్లోన మత్తులున్న మంత్రవాదిలా
పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో ఆఁ పట్టుకో
Hey It's time to party now (2)

నోటికొచ్చిన పాటేదో పాడెయ్ పాడెయ్ పాడెయ్ పాడెయ్
ఒంటికొచ్చిన డేన్సేదో చేసెయ్ చేసెయ్ రో
It's time to party (2)
చేతికందిన డ్రింకేదోతాగెయ్ తాగెయ్ తాగెయ్ తాగెయ్
లోకమంతా ఉయ్యాలే ఊగెయ్ ఊగెయ్ రో
It's time to party  (2)

Come on Come on Lets chill n thrill n kill it now
Come on Come on పిచ్చెక్కించేద్దాం రో
Come on Come on Lets rock it shake it break it now
Come on Come on తెగ జల్సా చేద్దాం రో
It's time to party now
It's time to party now  రావే ఓ పిల్లా
It's time to party now  చేద్దాం గోల
It's time to party now రావే ఓ పిల్లా
మనకంటే గొప్పోళ్ళా టాటా బిర్లా

ఓరి దేవుడో దేవుడో ఏంపిల్లగాడే
మిల్లీమీటరైన వదలకుండా దిల్లో నిండినాడే
హాఁ కళ్ళల్లోన కత్తులున్న తీవ్రవాదిలా
మాటల్లోన మత్తులున్న మంతవాదిలా
పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో ఆఁ పట్టుకో

ఎడిసన్ను బల్బులోని ఫిలమెంటు వైరు నేను
అట్టా నను టచ్ చేశావో ఇట్టా స్విచ్చానౌతాను
It's time to party (2)
హే మైక్రోవేవ్ మంటలాగా సైలెంటు ఫైరు నేను
నువు కొంచెం మనసిచ్చావో టాలెంటే చూపిస్తాను
It's time to party (2)
హే బాయ్ అబ్బాయ్ లవ్వు గాడుకు నువ్వు క్లోనింగా
అమ్మోయ్ అమ్మాయ్ తొలి చూపుకె ఇంతటి ఫాలోయింగా
It's time to party now
It's time to party now  రావే ఓ పిల్లా
It's time to party now  చేద్దాం గోల

హాఁ మైనేం ఈజ్ మార్గరీటా మాక్ టైల్లా పుట్టానంటా
చూపుల్తో అందమంతా సరదాగా సిప్ చేయ్ మంటా
It's time to party (2)
వాచ్ మేనే లేని చోట వయసే ఓ పూల తోట
వెల్కమ్మని పిలిచావంటే తుమ్మెదలా వాలిపోతా
It's time to party (2)
హల్లో హల్లో అని పిలవాలా నినుపేరెట్టి
పిల్లో పిల్లో నను లాగొద్దట్టా దారం కట్టి
It's time to party now
It's time to party now  రావే ఓ పిల్లా
It's time to party now  చేద్దాం గోల

It's time to party (3)





*********   ********   ********



చిత్రం: అత్తారింటికి దారేది (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీ మణి
గానం: విజయ్ ప్రకాష్, ఎమ్. ఎల్. ఆర్. కార్తీకేయన్

గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలి మబ్బు కోసం
తరలింది తనకు తానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నగమె తన వాసం వనవాసం

భైరవుడొ భార్గవుడొ భాస్కరుడొ మరి రక్కసుడొ
ఉక్కు తీగలాంటి ఒంటి నైజం వీడు మెరుపులన్ని ఒక్కటైన తేజం
రక్షకుడొ దక్షకుడొ పరీక్షలకె సుశిక్షితుడో
శత్రువు అంటు లేని వింత యుద్ధం వీడి గుండె లోతు గాయమైన శబ్ధం
నడిచొచ్చె నర్తన శౌరీ పరిగెత్తె పరాక్రమ శైలీ
హలాహలం ధరించిన ధగ్ ధగ్ హృదయుడొ

వీడు ఆరడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టూ

గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలి మబ్బు కోసం
తరలింది తనకు తానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నగమె తన వాసం వనవాసం

దివి నుంచి భువి పైకి భగ భగ మని కురిసేటి
వినిపించని కిరణం చప్పుడు వీడు
వడివడిగా వడగళ్లై ధడ ధడమని జారేటి
కనిపించని జడి వానేగ వీడూ
శంఖంలొ దాగేటి పోటెత్తిన సంద్రం హోరితడు
శోకాన్నె దాచేసే అశోకుడు వీడురొ

వీడు ఆరడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టూ

తన మొదలే వదులుకొని పైకెదిగిన కొమ్మలకి చిగురించిన చోటుని చూపిస్తాడు
తన దిశనే మార్చుకొని ప్రభవించె సూర్యుడికి తన తూరుపు పరిచయమె చేస్తాడూ
రావణుడొ రాఘవుడొ మనసును దోచె మాధవుడో
సైనికుడొ శ్రామికుడొ అసాధ్యుడు వీడురో

వీడు ఆరడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టూ

గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలి మబ్బు కోసం
తరలింది తనకు తానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నగమె తన వాసం వనవాసం

బద్రి (2000)



చిత్రం: బద్రి (2000)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: వేటూరి
గానం: రమణ గోగుల, సునీత


పల్లవి:
వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం
ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం
హేహేహే ప్రాయమే అగ్నికల్పం
హేహేహే ప్రాణమే మేఘశిల్పం

చరణం: 1
ఓ ప్రియురాలా పరువమనే పున్నమిలో
ఈ విరహాలే పెదవులు అడగని దాహాల
ఇది మంచు కణాల తనువులు కరిగిన తరుణాల
ఈ నయనాల భువిగగనాల గోల హేల హేల

చరణం: 2
నీ హృదయాల ప్రణయమనే ప్రాణంలా
సావిరహేల ఎదలను వదలని మోహాలా
తొలిప్రేమ వనాల విసిరిన యవ్వన పవనాల
ఓ జవరాల శుభశకునాల కరిగే కలల అలల

వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం
ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం
హేహేహే ప్రాయమే అగ్నికల్పం
హేహేహే ప్రాణమే మేఘశిల్పం
ఓ మాజీ రే...



********  *******   ********



చిత్రం: బద్రి (2000)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: చంద్రబోస్
గానం: రమణ గోగుల, సునీత

పల్లవి:
బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే
రంగీలా పాటల్లో రాగం నువ్వేలే
ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మా
ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో
లవ్ వైరస్సే సోకిందయ్యో

చరణం: 1
రాకెట్ కంటే ఫాస్టుగా దూసుకుపోయే
ఈ కాలం ప్రేమికులం
బుల్లెట్ కంటే స్పీడుగా అల్లుకుపోయే
చలికాలం శ్రామికులం
అడ్డురాదంట నో ఎంట్రీ కుర్ర రహదారిలో
హద్దుకాదంట ఏ కంట్రీ వింత లవ్ యాత్రలో

ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మా
ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో
లవ్ వైరస్సే సోకిందయ్యో

చరణం: 2
స్పీడోమీటర్‌కందని వేగం చూపే
జోడైన జంట ఇది
మూడో మనిషి ఉండని లోకం చేరే
జోరైన టూరు ఇది
అందుకున్నాక టేకాఫే హాల్ట్ కాదెప్పుడు
సర్దుకున్నాక హా హా హా అలుపురాదెప్పుడు

ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మా
ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో
లవ్ వైరస్సే సోకిందయ్యో

బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే
రంగీలా పాటల్లో రాగం నువ్వేలే
ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మా
ఓ మిస్సయ్య మిస్సయ్య హయ్య
లవ్ వైరస్సే సోకిందయ్య




********  *******   ********



చిత్రం: బద్రి (2000)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: వేటూరి
గానం: రమణ గోగుల, సునీత

అస్సయ్యం అస్సయ్యం ఎంగిలి అస్సయ్యం
ఛీ పాడు సిగ్గేలేదు పట్టిందేమో దెయ్యం

హే చలి పిడుగుల్లో వెనకడుగే నాస్తి
గొడుగొకటేలే పడుచోళ్ళ ఆస్తి
తడి గొడవల్లో నీ తళుకే చూస్తి
యమ ఇరుకుల్లో పడి నలిగే కుస్తీ
వానొస్తే ఏం వయసే చేద్దాం స్వాహ
నీ సొత్తు యావత్తూ స్వాహ హేయ్...

ఏకాంతం సాయంత్రం నీ సాంతం నాకె సొంతం
ఓ బాబు శాంతం శాంతం వద్దోయి పంతం
నీ బుగ్గ చేస్తా శుభ్రం ఇస్తాలే ఓ చుమ్మా చుమ్మా
స్నానంలో నా ప్రతిబింబం చూస్తే ఏం లాభం
పాహి నారాయణా హరి ఓం పడుచు పారాయణా

Every time i see u girl i just go crazy
ఎవరైన చూసారంటే ప్రేమే మాజి
Every time i kiss you, you just take it easy
అయ్యయ్యయ్యో కానయ్యో రాజి
ఓ ఆకాశం లో వెలిగే జిం జిం తార
నాకోసం దిగి వస్తావా ఓ సితార

చలిగా చామంతి బంతి విసిరిందీ పూబంతి
లవ్ గేం లో ఓడించాకా లబ్జంతా నీది
మోడల్ ని టచ్ చేస్తుంటే మేడంకెంతో పిచ్చెక్కింది
ఎలిమెంట్రీ ప్రేమల్లోన ఎలిఫంట్ వచ్చింది
జోహారు ఓ మన్మధ రతి ఓం జోరు చల్లారదా

Every time i see u girl i just go crazy
ఎవరైన చూసారంటే ప్రేమే మాజి
Every time i kiss you, you just take it easy
అయ్యయ్యయ్యో కానయ్యో రాజి
ఓ వేణు గానాల తొలి పిలుపే రాధ
వేయి స్వరాల అది నేననరాదా
ఏమైతేనేం తగిలే ఊసుల బాణం
తియ్యంగా తీసిందీ ప్రాణం
ఓ తియ్యంగా తీసిందీ ప్రాణం
ఓ తియ్యంగా తీసిందీ ప్రాణం



********  *******   ********



చిత్రం: బద్రి (2000)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: వేటూరి
గానం: రమణ గోగుల, సునీత

వరమంటి మనసే పొంది విసిరేసుకుంటానంటే పరిహాసమవదా జీవితం
ఉదయాలు ఎదురుగ వుండి కనుమూసి అడుగేస్తుంటే పడదోసి పోదా జీవితం

పువ్వంటి మనసును కోసి ఆ పైన జాలిగ చూసి
ఓదార్పు కోరే నేస్తమా
దేహాన్ని జ్వాలగ చేసి జీవితాన్ని చితిలో తోసి
తలరాత అంటే న్యాయమా

ఎడారంట పరిగెడతావ దరీ దారి లేదంటావ
తడి లేక అలసే ప్రాణమా
పాదాలు నీవంటావా పయనాలు మాత్రం కావా
పైవాడి పైనా భారమా ఆ...
కాలన్ని కవ్వించేలా పనిలేని పంతాలేలా
అటుపై విధిపై నిందలా ఆ...




********  *******   ********



చిత్రం: బద్రి (2000)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: వేటూరి
గానం: రమణ గోగుల, సునీత

హే చికీతా కొమోస్తాస్
హే చికీతా కొమోస్తాస్ జాయిన్ అయితే జమస్తాస్
ఆ సహారా దిల్ బహారా ముద్దు గుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్
హాయ్ చిరుతా నమస్తే నా జంటకొస్తే యమస్తే
ఆ మొరాకో ప్రేమరాకో పైట చాటిస్తా చోటిస్తా

Each time I think of you my heart goes boom boom boom
When you are in front of me I just go wroom wroom wroom
Dhoom dhoom dhoom handsome from king kango
Lets do the dance tango

వయ్యారి కలలే నిజమై వలచే పిలిచే
య య య సహారా సౌందర్య మనోజ మాధుర్య
హమేషా మొదటే మొహమాటకమేలా
ఈరోజే రాతిరికి ఈ వెన్నెలేలా
ఈ వేళ కౌగిలికి దిగుతా మిగతా కధలే చెబుతా

హే చికీతా కొమోస్తాస్ జాయిన్ అయితే జమస్తాస్
ఆ మొరాకో ప్రేమరాకో పైట చాటిస్తా చోటిస్తా
హే చికీతా చికీతా  చికీతా I Get You
చికీతా  చికీతా  చికీతా Come Get Me

Love love love love is the way to go
you know i need some more
సుతారి సుఖమే మనదై మనువై మనమై
సై సై సై మనస్సే దోచేసెయ్ మాటుంటే ఇచ్చేసెయ్
హే... చిలకే పలికే చిలిపివచనాల
నేపాలు తోటలకు ఓ నైటు రారా
ఈ ఘాటు ప్రేమలకు పరదా అరుదై సరదా వరదా

హే చికీతా కొమోస్తాస్ జాయిన్ అయితే జమస్తాస్
ఆ సహారా దిల్ బహారా ముద్దు గుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్

నే ప్రేమిస్తే నువ్వేమిస్తావ్ (2)

బాలు (ABCDEFG) (2005)



చిత్రం: బాలు (ABCDEFG) (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: రంజిత్, మహాలక్ష్మి అయ్యర్


అతి మెత్తని మనసుని రువ్వి
మతి మొత్తం తబ్బుబ్బీ
నచ్చావోయ్ అచ్చ తెలుగబ్బీ
సుతి మెత్తని కనులతొకుమ్మీ సుమగంధం విరజిమ్మీ నచ్చావొయ్ అచ్చ తెలుగమ్మీ
రౌడి అబ్బి నిను చూడంగానే మనసుబ్బీ
వచ్చానబ్బీ అబ్బీ
రాగలమ్మీ నువు పిలవంగానే నిను నమ్మీ
వలచానమ్మీ అమ్మీ
నన్నయ్యకి అన్నయ్ నువ్వై గురజాడ గురువే నువ్వై
నవ కవితలు రాసెయ్ ఓ రబ్బీ

సుతి మెత్తని కనులతొకుమ్మీ సుమగంధం విరజిమ్మీ నచ్చావొయ్ అచ్చ తెలుగమ్మీ

లేపాక్షి నంది నీ రూపులో చేపాక్షినయ్యా నీ చెరువులో
అద్దంకి టీర నీ మేనిలో అడ్డంకినయ్యా నీ త్రోవలో
కోనలు తలకోనలు నీ మీసాలలో
ఏరులు కొల్లేరులు నీ మురిపాలలో
మేడలు బెజవాడలు నీ పరువాలలో
దాడులు పలనాడులు నీ పంతాలలో
అమరావతి శిల్పాన్ని నేనై చిగురించా
నీ నీడలో నీడలో
హైద్రాబాది బిర్యాని రుచినే చవి చూశా
నీ తోడులో తోడులో
గోదావరిఖనిలో కన్నా ఖనిజాలు నాలో మిన్న
సోదాలే చేసెయ్ ఓ రబ్బి

ఆ కోన సీమ నీ కులుకులో కోటప్ప కొండ నీ గుండెలో
ఆ కాక రేగె నా తనువులో ఓ కాకతీయ నీ చెలిమితో
మేలిమి శివ తాండవం నీ పాదాలలో
బాసర మంత్రాలయం నీ బంధాలలో
నైరుతి రుతు మారుతం ఇక నీ రాకతో
నైజాముల పరిపాలనం మన నడిజాములో
అరకు లోయ ఇరుకుల్లో నేనే పడుతున్నా
ఈ వేళలో ఈ వేళలో లో
విఠలాచార్యా వింతలనే నేనే చూస్తున్నా
నీ లీలలో లీలలో
ఆ రామగుండంలోని వెలుగంతా చూపిస్తాలే
ఈ ప్రేమల్లోనే ఓ లమ్మి

అతి మెత్తని మనసుని రువ్వి మతి మొత్తం తబ్బుబ్బీ నచ్చావోయ్ అచ్చ తెలుగబ్బీ
సుతి మెత్తని కనులతొకుమ్మీ సుమగంధం విరజిమ్మీ నచ్చావొయ్ అచ్చ తెలుగమ్మీ ఓ ఓ




********  *******   ********



చిత్రం: బాలు (ABCDEFG) (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: కే. కే.

ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే
ఆలోచిస్తే అంతా ఇంతింతే
కన్ను ఇంతే కనుపాప ఇంతే
లోకం లోతు చూడాలంతే

ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే
ఆలోచిస్తే అంతా ఇంతింతే
కన్ను ఇంతే కనుపాప ఇంతే
లోకం లోతు చూడాలంతే

ఛరణం: 1
మొగ్గల్లోన దాగుంది కాయో పండో
కనిపెట్టాలి ముందే
మబ్బుల్లోన దాగుందీ చినుకో తూఫానో
పసిగట్టాలి ముందే
మనుషుల్లో మంచోడెవరో ముంచేదెవరో
మనసెట్టీ చూడాలంతే
ఈ మట్టి లోని వజ్రం చూడు
బొగ్గులోని అగ్గిని చూడు
అన్నిటికన్నా నీలోని నిన్నే చూడు
అలా చూస్తే ఎదురే లేదంతే
నువ్వలా చేస్తే తిరుగే లేదంతే
రాసి ఫలాలన్ని వచ్చును నీ వెంటే
తొమ్మిది గ్రహాలన్ని పనులే మాని
తిరుగును నీ చుట్టే

ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే
ఆలోచిస్తే అంతా ఇంతింతే

ఛరణం: 2
గుడిసెల్లోని పేదలకి స్నేహితుడయ్యే
గుణముండాలి నీలో
మేడల్లోని అమ్మడికి ప్రేమికుడయ్యే
పొగరుండాలి నీలో
దేశన్నే శోకం నుంచి చీకటి నుంచి
రక్షించే సైనికుడవ్వాలి
నీ పనుల్లోను శ్రామికుడల్లే
పగలురేయి కార్మికుడల్లే
సముద్రంలో నావికుడల్లే ముందుకు పొతుంటే
జనం మెచ్చే నాయకుడవుతావు
జగం మెచ్చే ఉత్తముడౌతవు
ప్రపంచంలో దేవుడివౌతావు
ఈ భూమ్మీద అస్సలు సిస్సలు మానవుడౌతావు

ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే
ఆలోచిస్తే అంతా ఇంతింతే
కన్ను ఇంతే కనుపాప ఇంతే
లోకం లోతు చూడాలంతే




********  *******   ********


చిత్రం: బాలు (ABCDEFG) (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత

కన్ను కొట్టినా నన్ను కుట్టవా రేగే తేనీగ
కంట చూసినా కందిపోతవే తూగే తూనీగ
కన్ను కొట్టినా నన్ను కుట్టవా రేగే తేనీగ
హే కంట చూసినా కందిపోతవే తూగే తూనీగ
అయినా సరే అన్నాగా సిద్ధంగానే ఉన్నాగా
అందం అంతా నిండా కందేందుకే అందిస్తున్నాగా
దేవుడా అమ్మాయంటె ఇలా కూడా ఉంటుందా
ఎక్కడా మచ్చుక్కూడా ఆడ లక్షణం లేకుండా
ఎంతకీ తెగించావే పైగా ఎందుకు ఈ నింద
అందుకే తప్పనిసరై ముందడుగేశా కాస్తంత

కన్ను కొట్టినా నన్ను కుట్టవా రేగే తేనీగ
కంట చూసినా కందిపోతవే తూగే తూనీగ

చరణం: 1
పెదవిచ్చి వరం వద్దనుకుంటావా
విదిలించీ వ్రతం ముద్దనుకున్నావా
బెదిరించే గుణం ప్రేమని అంటావా
శృతి మించే తనం క్షేమం అంటావా
వెచ్చగా నెచ్చెలి వస్తే వెళ్లిపోమంటావా
వెల్లువై ముంచుకువస్తే తాళదే పడవ
నది లోతెంతుందో ఒడ్డున ఉండే చూస్తూ ఉంటావా

దేవుడా అమ్మాయంటె ఇలా కూడా ఉంటుందా
ఎక్కడా మచ్చుక్కూడా ఆడ లక్షణం లేకుండా
ఎంతకీ తెగించావే పైగా ఎందుకు ఈ నింద
అందుకే తప్పనిసరై ముందడుగేశా కాస్తంత

చరణం: 2
వాస్తు లోపం ఉందా నా ఒంటి వంపుల్లో
దృష్టిదోషం ఉందా నీ కంటి చూపుల్లో
ఈడు తాపం ఇలా వీధెక్కు చిందుల్లో
ఏమి లాభం పిల్లా ఇబ్బందితనంలో
యవ్వనం నివ్వెరపోదా కోరికే లేదంటే
చెప్పినా నమ్మవు కదా తీరికే లేదంటె
అరె పాపం అని పాపాయిని పాలించలేవా

దేవుడా అమ్మాయంటె ఇలా కూడా ఉంటుందా
ఎక్కడా మచ్చుక్కూడా ఆడ లక్షణం లేకుండా
ఎంతకీ తెగించావే పైగా ఎందుకు ఈ నింద
అందుకే తప్పనిసరై ముందడుగేశా కాస్తంత

కన్ను కొట్టినా నన్ను కుట్టవా రేగే తేనీగ
కంట చూసినా కందిపోతవే తూగే తూనీగ
అయినా సరే అన్నాగా సిద్ధంగానే ఉన్నాగా
అందం అంతా నిండా కందేందుకే అందిస్తున్నాగా
దేవుడా అమ్మాయంటె ఇలా కూడా ఉంటుందా
ఎక్కడా మచ్చుక్కూడా ఆడ లక్షణం లేకుండా
ఎంతకీ తెగించావే పైగా ఎందుకు ఈ నింద
అందుకే తప్పనిసరై ముందడుగేశా కాస్తంత




********  *******   ********



చిత్రం: బాలు (ABCDEFG) (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: మురళీధర్, చిత్ర

లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన
ఈ ప్రేమ సరిగమ నువ్వేగా
కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన
ఏదైనా వెనకన నువ్వేగా
ఎన్నెన్నో వరములు కురిసిన గుండెల్లో వలపై ఎగసిన
ఈ ఆనందం నీ చిరునవ్వేగా
నీతోనే కలిసిన క్షణమున నీలోని అణువణువణువున
నీవే నీవే నీవే నీవుగా

లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన
ఈ ప్రేమ సరిగమ నువ్వేగా
కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన
ఏదైనా వెనకన నువ్వేగా

చరణం: 1
ఈ పూవ్వు కోరిందిరా ప్రేమాభిషేకాలనే
నా చూపు పంపిందిలే పన్నీటి మేఘాలనే
బుగ్గపై చిరు చుక్కవై జుట్టువై సిరిబొట్టువై
నాతోనే నువ్వుండిపో
ఊపిరై ఎద తీపినై ఊపునై కనుచూపునై
నీలోనే నేనుంటినే
నీ రామ చిలకను నేనై నా రామచంద్రుడు నీవై
కలిసి ఉంటె అంతే చాలురా

లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన
ఈ ప్రేమ సరిగమ నువ్వేగా
కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన
ఏదైనా వెనకన నువ్వేగా

చరణం: 2
ఈ రాధ బృందావనం సుస్వాగతం అందిరా
నా ప్రేమ సింహాసనం నీ గుండెలో ఉన్నదే
పక్కగా రారమ్మని కమ్మగా ముద్దిమ్మనీ
ఎన్నాళ్ళు కోరాలి రా
ఎప్పుడు కనురెప్పలా చప్పుడై యదలోపల
ఉంటూనె ఉన్నానుగా
సన్నాయి స్వరముల మధురిమ
పున్నాగ పువ్వుల ఘుమ ఘుమ
అన్ని నీవై నన్నే చేర రా

లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన
ఈ ప్రేమ సరిగమ నువ్వేగా
కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన
ఏదైనా వెనకన నువ్వేగా
ఎన్నెన్నో వరములు కురిసిన గుండెల్లో వలపై ఎగసిన
ఈ ఆనందం నీ చిరునవ్వేగా
నీతోనే కలిసిన క్షణమున నీలోని అణువణువణువున
నీవే నీవే నీవే నీవుగా

లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన
ఈ ప్రేమ సరిగమ నువ్వేగా



********  *******   ********


చిత్రం: బాలు (ABCDEFG) (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్, శ్రేయ గోషల్

నీలో జరిగేతంతూ చూస్తూనే ఉన్నా
దీన్నే తొలిప్రేమ అంటారే మైనా
ఏదో జరిగిందంటూ నీతో చెప్పానా
చాల్లే ఇట్టాంటివి చాలానే విన్నా
అంటే అన్నానంటూ కోపాలేనా
నువ్వే చెప్పు నే తప్పన్నానా
పోన్లే నీకేంటంటా నాకేమైనా
ఏదో సాయం నిన్నిమ్మన్నానా
వలపంటే నిప్పులాంటిది కలకాలం దాచలేనిది
సలహా విని ఒప్పుకోవే ఇకనైనా
ఓ సర్లే ఈ ప్రేమ సంగతి నాలాగే నీకు కొత్తది
ఐనా ముందు నీకే తెలిసేనా

ప్రతిరోజు నడిరాతిరిలో చేస్తావా స్నానాలు
ఒళ్ళంతా చెమటలు పడితే తప్పవుగా చన్నీళ్ళు
వణికించే చలికాలంలో ఏమా ఆవిర్లు
ఉడికించే ఆలోచనలు పుడుతున్నవి కాబోలు
ఇంతిదిగా వేడెక్కే ఊహలు రేపిందెవరు
నీలా నను వేధించే దుష్టులు ఎవరుంటారు
అదిగో ఆ ఉలుకే చెబుతుంది నువు దాచాలనుకున్నా...
దీన్నే లవ్ లవ్  పడిపోటం అంటున్నా
చాల్లే ఇట్టాంటివి చాలానే విన్నా

ఒంట్లో బాగుంటం లేదా ఈ మధ్యన నీకసలు
నాకేం ఎంచక్కా ఉన్నా నీకెందుకు ఈ దిగులు
అంతా సరిగానే ఉంటే ఎరుపెక్కాయేం కళ్ళు
వెంటాడే కలలొస్తుంటే నిదరుండదు తెల్లార్లు
ఐతేమరి నువ్వెపుడు కనలేదా ఏ కలలు
నా కలలో ఏనాడు నువు రాలేదిన్నాళ్ళు
అదిగో ఆ మాటే నీనోటే చెప్పించాలనుకున్నా
దీన్నే లవ్ లవ్  పడిపోటం అంటున్నా
ఊఁ అవునా ఏమో నే కాదనలేకున్నా

నీలో జరిగేతంతూ చూస్తూనే ఉన్నా
దీన్నే తొలిప్రేమ అంటారే మైనా
నాలో జరిగేతంతూ చూస్తూనే ఉన్నా
దీన్నే తొలిప్రేమ అంటారో ఏమో
అంటే అన్నానంటూ కోపాలేనా
నువ్వే చెప్పు నే తప్పన్నానా
పోన్లే నీకేంటంటా నాకేమైనా
ఏదో సాయం నిన్నిమ్మన్నానా
వలపంటే నిప్పులాంటిది కలకాలం దాచలేనిది
సలహా విని ఓప్పుకోవే ఇకనైనా
ఆ సర్లే ఈ ప్రేమ సంగతి నాలాగే నీకు కొత్తది
ఐనా ముందు నీకే తెలిసేనా


********  *******   ********


చిత్రం: బాలు (ABCDEFG) (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: నితిన్ రైక్వార్
గానం: కునాల్ గంజవాల

ఆర్ నహి తో పార్ వర్న జీన హై బేకార్
జీ వైసె జీ జైసె జీనేకొ దిల్ బోలా
తో ఉస్కేలియె షాయరికా దుష్మన్ కేలియె
జంగల్కా షేర్ కర్దేగా ఢేర్ క్యా సంఝా

హట్ హట్ జా హట్ హట్ జా
చల్ ఫుట్ జా చల్ ఫుట్ జా
యా డర్ర్ డర్ర్కే మిట్ జా
యా డర్ కొ డరా దిఖ్ జా బిందాస్!

భేజా జొ మేర సట్కా
ఝట్కే మె ఉస్కొ పట్కా
జో రాస్తే మె ఖట్కా
మైన్ హైద్రబాది లడ్కా హే హే హే

చల్తా హై కాల ధందా
ఆంఖేన్ హై ఫిర్ భి అంధా
దెఖో హర్ ఏక్ బందా
ముర్దా హై ఫిర్ బి జిందా
No morals... nothing... nothing
హే హే హే హే హే హే హే హే హే

భగ్వాన్ కౌన్ కైసా
ఐసా కహున్ య వైసా
చల్తా హై ఫిర్ క్యున్ వైసా
అరెయ్ కిస్కొ పడి హై క్యా బిందాస్!

భగ్వాన్ కౌన్ కైసా
ఐసా కహున్ య వైసా
చల్తా హై ఫిర్ క్యున్ వైసా
అరెయ్ కిస్కొ పడి హై క్యా బిందాస్!

సబ్ కుచ్ హై భిక్ర భిక్రా
అరెయ్ ఇన్సానియత్ క కచ్రా
ఉఫ్ఫ్ ఇన్ లడ్కియొన్ క నఖ్రా
క్యున్ దేదియా కరారా బిందాస్!
There is no love in this world
There is no love in this world

లెహరా రహా హై ఝండా
సర్కర్ క్యున్ హై ఠండా
క్యున్ ఆజ్ భి బనా హై
ఫుట్ పాత్ ఘర్ కిసీకా బిందాస్!

లెహరా రహా హై ఝండా
సర్కర్ క్యున్ హై ఠనండా
క్యున్ ఆజ్ భి బనా హై
ఫుట్ పాత్ ఘర్ కిసీకా

మైన్ హూన్ కహిన్ దీవానా
Thats right hyderabad కా సోనా
That's me That's me
హొ జావూంగ మైన్ హాజిర్
బస్ యాద్ ముఝ్కొ కర్నా బిందాస్!
Think of me... i'll be there
Think of me... i'll be there

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (1996)


Image result for akkada ammayi ikkada abbayi

చిత్రం: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి (All Songs)
గానం: యస్. పి. బాలు, చిత్ర
నటీనటులు: పవన్ కళ్యాణ్, సుప్రియ
దర్శకత్వం: ఈ.వి.వి. సత్యన్నారాయణ
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 11.10.1996

బావ బావ ముద్దు బావ
కోరస్: బావ బావ బుజ్జి బావ
           బావ బావ బుజ్జి బావ
భామ భామ ముద్దు భామ
కోరస్: భామ భామ చిట్టి భామ
           భామ భామ చిట్టి భామ
పిలిచానుగా నాజూకుగా
నా ఉహలో ఓ ప్రేమిక
ఊగిందిలే నా కోరిక
ఊరించకే నా మేనకా
కోరస్: బావ బావ బుజ్జి బావ
           బావ బావ బుజ్జి బావ
భామ భామ చిట్టి భామ
భామ భామ చిట్టి భామ
బావ బావ ముద్దు బావ
కోరస్: బావ బావ బుజ్జి బావ
           బావ బావ బుజ్జి బావ

అందాలే అదుపు వొదిలి నిను అల్లుకు పోతుంటే
సెలవంటూ అణిగి మణిగి ఇక సిగ్గే వెళుతుంటే
చెలికాడే కలిసి మెలిసి కలకాలం తోడుంటే
జవరాలే జతగ జతిగ సుఖతాళం వేస్తుంటే
యవ్వనాలే జివ్వనాలే
కన్నె గువ్వే రివ్వనాలే
నీది నాది మోజంటు చెంతకొచ్చి చేపట్టు
చేతికందే ప్రేమ తేనేపట్టు
నీకు నాకు నచ్చేట్టు ప్రేమ బాకీ తీరేట్టు
సోయగాలు నాకు కానుకెట్టు
చెలి నీదే రారా రా...

భామ భామ ముద్దు భామ
కోరస్: భామ భామ చిట్టి భామ
          భామ భామ చిట్టి భామ

సరదాగా జరిగి వరిగి రుచులేవో చూపించే
సరసంగా కుదిరి అదిరి స్వర్గాలే కనిపించే
పరదాలే చెదిరి బెదిరి సుఖమేదో ఇటుదించి
దొరలాగా దొరికి దొరికి నడిపించే మురిపించే
హాఁ ఎంత మొహం వింత దాహం
ఇంతలోనే అంత తాపం
ముచ్చటాడు కోనివ్వు ముద్దు పెట్టుకోనివ్వు
చూడగానే పుట్టుకొచ్చే లవ్వు
ఘాటు ప్రేమ అబ్బాయి నీటు భామ నీదోయి
స్వాగతాలు చెప్పెనోయి రేయి
అరె సోకే ఓకే రా...

బావ బావ ముద్దు బావ
కోరస్: బావ బావ బుజ్జి బావ
           బావ బావ బుజ్జి బావ
భామ భామ ముద్దు భామ
కోరస్: భామ భామ చిట్టి భామ
           భామ భామ చిట్టి భామ

పిలిచానుగా నాజూకుగా
నా ఉహలో ఓ ప్రేమిక
ఊగిందిలే నా కోరిక
ఊరించకే నా మేనకా
కోరస్: బావ బావ బుజ్జి బావ
           బావ బావ బుజ్జి బావ
భామ భామ చిట్టి భామ
భామ భామ చిట్టి భామ



********  *******   ********


చిత్రం: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. జానకి

ఓ దైవమా... ఇది న్యాయమా...
అనురాగమే... అపరాదమా...

ఓ ఓ ప్రేమా ఓ ఓ ప్రేమా
ప్రాణం పోసే ప్రేమ పగతో మండాలా
చెలిమిని పంచే ప్రేమ చెరలో ఉండాలా
ఎదురీదుమా ప్రేమ విధి రాతనే ఎదురించుమా
తడబాటే బాటై సాగాలమ్మ ఓ ప్రేమ

ఓ ఓ ప్రేమా ఓ ఓ ప్రేమా

కనియపెంచు వారే కసిపెంచు కుంటే
దీవించు వారు ఇంకెవ్వరు హోయ్ ఇంకెవ్వరు
కలిసుండలేని కలహాలు మావి దీవించు దారి
కనిపించదు  కనిపించదు
ఈ ప్రేమేగా మీకు జన్మం ఇచ్చింది
ఆ ప్రేమే లేదంటే లోకంలేముంది
ఈ సత్యం చూడని పెద్దరికం విలువేమున్నది

ఓ ఓ ప్రేమా ఓ ఓ ప్రేమా

వేటాడుతున్నా వేధించుతున్నా
లొంగేది కాదు ప్రేమన్నది హోయ్ ప్రేమన్నది
భలమెంత ఉన్నా ధనమెంత ఉన్నా
తొనికేది కాదు ఈ పెన్నిధి హోయ్ ఈ పెన్నిధి
చిగురిస్తుంది ప్రేమా చితిలో తోసినా
ఎదురిస్తుంది ప్రేమా ఎదనే కోసినా
మరుజన్మకు సైతం మరువని నేస్తం ఈ ప్రేమా

ఓ ఓ ప్రేమా ఓ ఓ ప్రేమా