Showing posts with label అడ్డా (2013). Show all posts
Showing posts with label అడ్డా (2013). Show all posts

అడ్డా (2013)

చిత్రం: అడ్డా (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: విజయ్ ప్రకాష్

ఎక్కడ ఉన్నా నీ ధ్యాసే
ఏం చేస్తున్నా నీ ఊసే
ఎప్పటికైనా నిను కలిసే వీలుందా అసలే

వేచింది నీకోసమే నే కోరింది నీ క్షేమమే
ఇదే ఇదే ప్రేమంటే ఎలా ఎలా నమ్మేదే
ఇవన్ని ప్రతి బంధంలో  ఉన్నాయి ఇంతకుముందే
అదో ఇదో తేలేదెలా

ఎక్కడ ఉన్నా నీ ధ్యాసే
ఏం చేస్తున్నా నీ ఊసే
ఎప్పటికైనా నిను కలిసే వీలుందా అసలే

ఎప్పటినుండో చూస్తున్నా ఎందరినో గమనిస్తున్నా
అందుకనే నేనాలోచిస్తూ ఉన్నా
ఏమో నాకే నా పైనే నమ్మకమిక రాలేదే
నీపై ఇష్టం ఎంతున్నా ఏం చేస్తా
అయిన ఎందుకో మనసే వప్పదే
పోనీ ఆ నిజం నీతో చప్పదే
అయోమయం పోయేదెలా ఓ..

రేపో మాపో నావల్లే నీకేమి అవ్వకూడదని
ఇవ్వాళే నే దూరం అవుతూ ఉన్నా
ప్రాణాలైనా ఇచ్చేలా అనిపించిందే నిను చూస్తే
దాన్నే ప్రేమనుకుంటే నా పొరపాటే
నాలో ఉన్నది స్పష్టం కానిదే
నువ్వేం చేసినా ఎలా ఆపనే
లోలో నిజం తెలిసేదెలా ఓ...