Showing posts with label మిత్రుడు (2009). Show all posts
Showing posts with label మిత్రుడు (2009). Show all posts

మిత్రుడు (2009)

చిత్రం: మిత్రుడు  (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సైందవి


పల్లవి:
ప్రియమణి అన్నాను నిన్నెప్పుడో
ప్రియమనే ఉన్నావు నా గుండెలో
ప్రియతమా అన్నాను నేనెన్నడో
ప్రియలయే రేగింది నా గుండెలో
నువ్వు చూస్తే ప్రేమ చేర వస్తే ప్రేమ
నాలో జివ్వు జివ్వు జివ్వుమందిలే
ఓ నమః ప్రేమ ఒళ్ళో మహా ప్రేమ
నీతో సై సై సై అందిలే

చరణం: 1
నీలోనే లోకాలు నీతోనే కాలాలు
ఈ జీవితం స్వాగతం
ఈ ప్రేమ తీరాలు కావింక దూరాలు
ఇదే మా ఇద్దరం
గులాబీల నూనూగు రెమ్మా
ఎలా తాకినా హాయిలే
చాలకీల ఈ చందమామ
ఇలా అందిన రేయిలే

ప్రియమణి అన్నాను నిన్నెప్పుడో
ప్రియమనే ఉన్నావు నా గుండెలో

చరణం: 2
ఈ పూల భాషల్లో  ఈ రాస లీలల్లో
ఝుం ఝుంమని వాలిపో
ఈ మందహసాన ఈ మల్లెమాసాల
రా రమ్మని వచ్చి వాలిపో
ముకుందాల ముద్దంత తీసి
నే ముమ్మాటు ముట్టించనా
వసంతాల పూతేని పోసి
నీ ఒళ్ళంత ముద్దాడనా

ప్రియమణి అన్నాను నిన్నెప్పుడో
ప్రియమనే ఉన్నావు నా గుండెలో
ప్రియతమా అన్నాను నేనెన్నడో
ప్రియలయే రేగింది నా గుండెలో