Showing posts with label Mammootty. Show all posts
Showing posts with label Mammootty. Show all posts

స్వాతికిరణం (1992)





చిత్రం : స్వాతికిరణం (1992)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  సిరివెన్నెల
నేపధ్య గానం :   వాణీజయరాం  

పల్లవి : 

 శివాని.. భవాని.. శర్వాణి..
గిరినందిని శివరంజని భవభంజని జననీ
గిరినందిని శివరంజని భవభంజని జననీ
శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేని... నీ సుతుడనే శివాని
శివాని.. భవాని.. శర్వాణి.. 

చరణం 1 :

 శృంగారం తరంగించు... సౌందర్యలహరివని ...
శృంగారం తరంగించు.. సౌందర్యలహరివని ...
శాంతం మూర్తీభవించు.. శివానందలహరివని... 
 శాంతం మూర్తీభవించు.. శివానందలహరివని... 

కరుణ జిలుగు సిరినగవుల కనకధారవీవని .. 
నీ దరహాసమే దాసుల దరి చేర్చే దారియని .. 
 శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేని.. నీ సుతుడనే శివాని
శివాని.. భవాని.. శర్వాణి.. 

చరణం 2 :

 రౌద్రవీర.. రసోద్రిక్త ... భద్రకాళి నీవని
భీతావహ భక్తాళికి..  అభయపాళి నీవని 
సమమ మగమ మదద దమగ దసని సరిససస
సనిసనిదని దపదప మప  మపదాని మపగరిస 
 గా గా గ గ గా గా గ గ రిగరిసాని సని సరిగరిగ
భీభత్సానల కీలవు.. భీషణాస్త్ర కేళివని 
భీషణాస్త్ర కేళివని...
అద్భుతమౌ.. అతులితమౌ.. లీల జూపినావని

గిరినందిని శివరంజని భవభంజని జననీ
శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేని.. నీ సుతుడనే శివాని
శివాని.. భవాని.. శర్వాణి.. 


******************** ********************** ********************* ******************
చిత్రం : స్వాతికిరణం (1992)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :   బాలు  

పల్లవి :

సా రిగమపదని సా నిదపమగరిసరి ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సంగీత సాహిత్య సమలంకృతే..
సంగీత సాహిత్య సమలంకృతే... సంగీత సాహిత్య సమలంకృతే
స్వర రాగ పదయోగ సమభూషితే
సంగీత సాహిత్య సమలంకృతే.. స్వర రాగ పదయోగ సమభూషితే

హే భారతి! మనసాస్మరామి... హే భారతి మనసాస్మరామి
శ్రీ భారతి శిరసానమామి... శ్రీ భారతి శిరసానమామి
సంగీత సాహిత్య సమలంకృతే... ఏ ఏ ఏ... 

చరణం 1 :

వేద వేదాంత వనవాసిని.. పూర్ణ శశిహాసిని
నాద నాదాంత పరివేశిని.. ఆత్మా సంభాషిని
వేద వేదాంత వనవాసిని.. పూర్ణ శశిహాసిని
నాద నాదాంత పరివేశిని.. ఆత్మా సంభాషిని

వ్యాస వాల్మీకి వాగ్దాయిని..
వ్యాస వాల్మీకి వాగ్దాయిని.. జ్ఞానవల్లి సముల్లాసిని 
 
 
సంగీత సాహిత్య సమలంకృతే.. స్వర రాగ పదయోగ సమభూషితే
సంగీత సాహిత్య సమలంకృతే....
 

చరణం 2 :

బ్రహ్మ రసజ్ఞాగ్ర  సంచారిణి... ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
బ్రహ్మ రసజ్ఞాగ్ర  సంచారిణి ... భవ్య ఫలకారిణి
నిత్య చైతన్య నిజరూపిణి.. సత్య సందీపిణి
బ్రహ్మ రసజ్ఞాగ్ర  సంచారిణి భవ్య ఫలకారిణి
నిత్య చైతణ్య నిజరూపిణి సత్య సందీపిణి
సకల సుకళా సమున్వేషిని...
సకల సుకళా సమున్వేషిని... సర్వ రస భావ సంజీవిని  

సంగీత సాహిత్య సమలంకృతే.. స్వర రాగ పదయోగ సమభూషితే
హే భారతి! మనసాస్మరామి... శ్రీ భారతి శిరసానమామి
సంగీత సాహిత్య సమలంకృతే... ఏ.. ఏ.. ఏ..

******************** ********************** ********************* ******************
చిత్రం : స్వాతికిరణం (1992)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :   చిత్ర, వాణీజయరాం 

పల్లవి :

శృతి నీవు గతి నీవు.. ఈ నా కృతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు.. ఈ నా కృతి నీవు భారతి
ఈ నా కృతి నీవు భారతి.. ఈ నా కృతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు.. ఈ నా కృతి నీవు భారతి
 

దృతి నీవు ద్యుతి నీవు.. శరణాగతి నీవు భారతి
దృతి నీవు ద్యుతి నీవు.. శరణాగతి నీవు భారతి..
శరణాగతి నీవు భారతి ...

చరణం 1 :

నీ పదములొత్తిన పదము.. ఈ పదము నిత్య కైవల్య పధము
నీ కొలువు కోరిన తనువు.. ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలవు

కోరిన మిగిలిన కోరికేమి?.. నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప
చేరినా ఇక చేరువున్నదేమి?.. నీ శ్రీ చరణ దివ్య సన్నిధి తప్ప 
 
శృతి నీవు గతి నీవు.. ఈ నా కృతి నీవు భారతి
 దృతి నీవు ద్యుతి నీవు.. శరణాగతి నీవు భారతి

చరణం 2 :

శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులే
అల అన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే
శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులే
అల అన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే

త్యాగయ్య గళ సీమ రాజిల్లిన అనంత రాగాలు నీ మూర్తులే
ఈ కరుణ నెలకున్న ప్రతి రచనం... జననీ భవ తారక మంత్రాక్షరం 
 
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి


******************** ********************** ********************* ******************

చిత్రం : స్వాతికిరణం (1992)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  సిరివెన్నెల
నేపధ్య గానం :   వాణీజయరాం

పల్లవి :

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే.. వింధ్య విలాసిని  వారాహి త్రిపురాంబికే
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే.. వింధ్య విలాసిని  వారాహి త్రిపురాంబికే  
భవతి విధ్యాం దేహి.. భగవతి సర్వార్ధసాధికే.. సత్యాద్రచంద్రికే

మాంపాహీ మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మాయాత్మికే 
మాంపాహీ మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మాయాత్మికే  

చరణం 1 :

ఆపాత మధురము.. సంగీతము...
అంచిత సంగాతము.. సంచిత సంకేతము
ఆపాత మధురము.. సంగీతము...
అంచిత సంగాతము.. సంచిత సంకేతము

శ్రీ భారతీ క్షీర సంపాతము.. అమృత సంపాతము.. సుకృత సంపాకము
శ్రీ భారతీ క్షీర సంపాతము.. అమృత సంపాతము.. సుకృత సంపాకము

సరిగమస్వరధుని సారవరూధినీ.. సామసునాధ వినోదిని
సకల కళ కళ్యాణి సుహాసిని.. శ్రీ రాగాలయ వాసిని 
 
మాం పాహీ మకరంద మందాకిని
మాం పాహీ సుజ్ణ్జాన సంవర్ధిని 
వైష్ణవి.. భార్గవి.. వాగ్దేవి.. త్రిగుణాత్మికే.. 
వింధ్య విలాసిని...  వారాహి...  త్రిపురాంబికే 

చరణం 2 :

ఆలోచనామృతము సాహిత్యమూ.. సహిత హిత సత్యము.. శారదా స్తన్యము
ఆలోచనామృతము సాహిత్యమూ.. సహిత హిత సత్యము.. శారదా స్తన్యము 
సారస్వతాక్షర సారధ్యము.. జ్ణ్జానసామ్రాజ్యము.. జన్మసాఫల్యమూ
సారస్వతాక్షర సారధ్యము.. జ్ణ్జానసామ్రాజ్యము.. జన్మసాఫల్యమూ

సరసవక్షోభిని సారసలోచినీ వాణీపుస్తకధారినీ
వర్ణాలంకృత వైభవశాలిని వరకవితా చింతామణి
మాం పాహీ సారోగ్య సంధాయినీ
మాం పాహీ శ్రీచక్ర సింహాసినీ..  
 
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే.. వింధ్య విలాసిని  వారాహి త్రిపురాంబికే  
భవతి విధ్యాం దేహి.. భగవతి సర్వార్ధసాధికే.. సత్యాద్రచంద్రికే

మాంపాహీ మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మాయాత్మికే 
 


******************** ********************** ********************* ******************
చిత్రం : స్వాతికిరణం (1992)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :   బాలు, చిత్ర

పల్లవి :
సా రి గ మ ప మ గ మ స రి రీ స
ప మ గ మ స రి స
సా రి గ మ ప ని స ని ప మ గ మ స రి రీ సా 
 
ప్రణతి ప్రణతి ప్రణతి... ప మ ప మ గ మ స రి సా
ప్రణతి ప్రణతి ప్రణతి... ప్రణవ నాద జగతికి
పమప మమప మ ప నీ
ప్రణుతి ప్రణుతి ప్రణుతి... ప్రధమ కళా సృష్టికి  
ప్రణతి ప్రణతి ప్రణతి... ప్రణవ నాద జగతికి
 

చరణం 1 :

పూల ఎదలలోపులకలు పొడిపించే భ్రమరరవం...  ఓం కారమా
సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం...  ఐం కారమా
పూల ఎదలలోపులకలు పొడిపించే భ్రమరరవం...  ఓం కారమా
సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం...  ఐం కారమా

పైరు పాపలకు జోలలు పాడే గాలుల సవ్వడి..  హ్రీం కారమా హ్రీం కారమా
గిరుల శిరసులను జారే ఝరుల నడల అలజడి.. శ్రీం కారమా శ్రీం కారమా

ఆ బీజాక్షర విగతికి అర్పించే జ్యోతలివే  
 
ప్రణతి ప్రణతి ప్రణతి... ప్రణవ నాద జగతికి

చరణం 2 :

పంచభూతముల పరీష్వంగమున ప్రకృతి పొందిన పదస్పందన అది కవనమా?
మ గ మ పా ప మ పా పా ప ప ప నిపపప నిపపప నిపాపపమ
గ ప మ ప మ గా
అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన కేళనా అది నటనమా ? అది నటనమా?

కంటి తుదల హరివింటి పొదల తళుకందిన
సవర్ణ లేఖనా.. అది చిత్రమా ? అది చిత్రమా?
మౌన శిలల చైతన్య మూర్తులుగ మలచిన
సజీవ కల్పనా.. అది శిల్పమా? అది శిల్పమా?

ఆ లలిత కళా సృష్టికి అర్పించే జ్యోతలివే


ప్రణతి ప్రణతి ప్రణతి... ప్రణవ నాద జగతికి
ప్రణుతి ప్రణుతి ప్రణుతి... ప్రధమ కళా సృష్టికి  
ప్రణతి ప్రణతి ప్రణతి... ప్రణవ నాద జగతికి

******************** ********************** ********************* ******************
చిత్రం : స్వాతికిరణం (1992)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  సిరివెన్నెల
నేపధ్య గానం :   వాణీజయరాం

పల్లవి :

తెలి మంచు కరిగింది..  తలుపు తీయనా ప్రభూ....
ఇల గొంతు వొణికింది.. పిలుపు నీయనా ప్రభూ....
తెలి మంచు కరిగింది..  తలుపు తీయనా ప్రభూ....
ఇల గొంతు వొణికింది.. పిలుపు నీయనా ప్రభూ....

నీ దోవ పొడవునా.. కువకువలా స్వాగతము
నీ కాలి అలికిడికి.. మెలకువల వందనము 
తెలి మంచు కరిగింది..  తలుపు తీయనా ప్రభూ....

చరణం 1 :

ఈ పూల రాగాల పులకింత గమకాలు.. గారాబు కవనాల గాలి సంగతులు
ఈ పూల రాగాల పులకింత గమకాలు.. గారాబు కవనాల గాలి సంగతులు

నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు
పల్లవించును ప్రభూ పవళించు భువనాలు...
భాను మూర్తీ ... నీ ప్రాణకీర్తన విని.. పలుకనీ 
ప్రణతులనీ ప్రణవ శృతినీ.. పాడనీ ప్రకృతినీ ప్రథమ కృతిని 
తెలి మంచు కరిగింది..  తలుపు తీయనా ప్రభూ....

చరణం 2 :

భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు.. నీ రాజసానికవి నీరాజనాలు
భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు.. నీ రాజసానికవి నీరాజనాలు

పసరు పవనాలలో.. పసికూన రాగాలు
పసిడి కిరణాల పడి పదును దేరిన చాలు.. తాలయూర్చు
తలిరాకు బహుపరాకులు విని దొరలనీ 
దోర నగవు దొంతరనీ... తరలనీ దారి తొలగి రాతిరిని

తెలి మంచు కరిగింది..  తలుపు తీయనా ప్రభూ....
ఇల గొంతు వొణికింది.. పిలుపు నీయనా ప్రభూ....

నీ దోవ పొడవునా.. కువకువలా స్వాగతము
నీ కాలి అలికిడికి.. మెలకువల వందనము 
తెలి మంచు కరిగింది..  తలుపు తీయనా ప్రభూ....

******************** ********************** ********************* ******************
చిత్రం : స్వాతికిరణం (1992)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  సిరివెన్నెల
నేపధ్య గానం :  చిత్ర, వాణీజయరాం

పల్లవి :
జాలిగా జాబిలమ్మ.. రేయి రేయంతా..
జాలిగా జాబిలమ్మ.. రేయి రేయంతా
రెప్పవేయనే లేదు ఎందుచేత ఎందుచేత?
పదహారు కళలని పదిలంగా ఉంచనీ
పదహారు కళలని పదిలంగా ఉంచనీ
ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చుపెట్టుట చేత

చరణం 1 :

కాటుక కంటినీరు పెదవులనంటనీకు
చిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకు

నీ బుజ్జి గణపతిని.. బుజ్జగించి చెబుతున్నా
నీ బుజ్జి గణపతిని.. బుజ్జగించి చెబుతున్నా
నీ కుంకమకెపుడూ పొద్దుగుంకదమ్మా 

చరణం 2 :

సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి..
సంతసాన మునిగింది సంతు లేని పార్వతి
సుతుడన్న మతి మరచి.. శూలాన మెడ విరిచి
పెద్దరికము చూపే చిచ్చుకంటి పెనిమిటి

ప్రాణపతినంటుందా?.. బిడ్డ గతి కంటుందా?
ప్రాణపతినంటుందా?..  బిడ్డ గతి కంటుందా?

ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి
కాలకూటము కన్న..  ఘాటైన గరళమిది
గొంతునులిమే గురుతై వెంటనే ఉంటుంది.. 

చరణం 3 :

ఆటు పోటు ఘటనలివి.. ఆటవిడుపు నటనలివి
ఆదిశక్తివి నీవు.. అంటవు నిన్నేవి
నీ బుజ్జి గణపతిని.. బుజ్జగించి చెబుతున్నా
కంచి కెళ్ళిపోయేవే కథలన్నీ .... 

******************** ********************** ********************* ******************
చిత్రం : స్వాతికిరణం (1992)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  వెన్నెలకంటి
నేపధ్య గానం :  వాణీజయరాం

పల్లవి :

కొండాకోనల్లో లోయ్యల్లో.. గోదారి గంగమ్మా సాయల్లో
కొండాకోనల్లో లోయ్యల్లో.. గోదారి గంగమ్మా సాయల్లో 
 
కోరి కోరి కూసింది కోయిలమ్మ
కోరి కోరి కూసింది కోయిలమ్మా ఈ కోయిలమ్మా
 
కొండాకోనల్లో లోయ్యల్లో... గోదారి గంగమ్మా సాయల్లో...
ఆ... గోదారి గంగమ్మా సాయల్లో...

చరణం 1 :

నేల పల్లవి పాడంగా.. నీలి మబ్బు ఆడంగా
రివ్వున గువ్వే సాగంగా.. నవ్వే మువ్వై మ్రోగంగా
నీలి మబ్బు ఆడంగా.. నవ్వే మువ్వై మ్రోగంగా

ఉంగా ఉంగా రాగంగా.. ఉల్లాసాలే ఊరంగా
ఉంగా ఉంగా రాగంగా.. ఉల్లాసాలే ఊరంగా
ఊపిరి ఊయల లూగంగా.. రేపటి ఆశలు తీరంగా

తెనుగుదనము నోరూరంగా.. తేటగీతి గారాబంగా
తెనుగుదనము నోరూరంగా.. తేటగీతి గారాబంగా
తెమ్మెరపై ఊరేగంగా .. వయ్యారంగా..
 
కొండాకోనల్లో లోయ్యల్లో... గోదారి గంగమ్మా సాయల్లో...
ఆ... గోదారి గంగమ్మా సాయల్లో...
 

చరణం 2 :

ఝుమ్మని తుమ్మెద తీయంగా.. కమ్మనీ రాగం తీయ్యంగా
జాజిమల్లి సంపెంగ.. జానపదాలే నింపంగా
కమ్మన్ని రాగం తీయ్యంగా.. జానపదాలే నింపంగా

చెట్టు పుట్ట నెయ్యంగా.. చెట్టాపట్టా లేయంగా
చెట్టు పుట్ట నెయ్యంగా.. చెట్టాపట్టా లేయంగా
చిలక పలుకులు చిత్రంగా.. చిలికే తేనెలు చిక్కంగా

ఏటి పాట లాలించంగా.. తోట తల్లి లాలించంగా
ఏటి పాట లాలించంగా.. తోట తల్లి లాలించంగా
స్వరాలన్నీ దీవించంగా.. సావాసంగా
 
 
కొండాకోనల్లో లోయ్యల్లో... గోదారి గంగమ్మా సాయల్లో...
లోయ్యల్లో... సాయల్లో...
 లోయ్యల్లో... సాయల్లో...
 లోయ్యల్లో... సాయల్లో...
 ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...

******************** ********************** ********************* ******************

చిత్రం :  స్వాతికిరణం (1992)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సిరివెన్నెల
నేపధ్య గానం :  వాణీజయరాం

పల్లవి :  
ఆ.... ఆ... ఆ.... ఆ.....

ఆనతి నీయరా.. హరా
సన్నుతి సేయగా.. సమ్మతి నీయరా.. దొరా...
సన్నిధి చేరగా... ఆనతి నీయరా.. హరా
సన్నుతి సేయగా.. సమ్మతి నీయరా దొరా...
సన్నిధి చేరగా.... ఆనతి నీయరా.... హరా...
 

నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాలవాణితో విరించి విశ్వనాటకం
నీ సైగ కానిదే జగాన సాగునా ఆ యోగమాయతో మురారి దివ్యపాలనమ్

వసుమతిలో ప్రతి క్షణం.. పశుపతి నీ అధీనమై
వసుమతిలో ప్రతి క్షణం.. పశుపతి నీ అధీనమై
కదులునుగా సదా సదాశివ
ఆనతి నీయరా.. హరా

చరణం 1 :

ని ని స ని ప నీ ప మ గ స గ... ఆనతి నీయరా!
అచలనాధ అర్చింతునురా... ఆనతినీయరా!

పమ పని పమ పని పమ పని గమ పని
సని సగ సని సగ సని సగ పని సగ
గమగసా నిపమ గమగస సగసని... ఆనతినీయరా!
జంగమ దేవర సేవలు గొనరా...
మంగళ దాయక దీవెనలిడరా!
సాష్ఠాంగముగ దండము సేతురా... ఆనతినీయరా!

చరణం 2 :

సానిప గమపానిపమ
గమగ పాప పప
మపని పాప పప
గగమ గాస సస
నిసగ సాస సస
సగ గస గప పమ పస నిస
గసని సాగ సాగ
సని సాగ సాగ
సగ గాస సాస
సని సాగ గ
గసగ గా
పద గస గా స ని పమగమ గా... ఆనతినీయరా!

శంకరా...  శంకించకురా!
వంక జాబిలిని జడను ముడుచుకొని...
విసపు నాగులను చంకనెత్తుకొని...
నిలకడనెరుగని గంగనేలి...  ఏ వంకలేని నా వంకనొక్క
కడగంటి చూపు పడనీయవేమి.. నీ కింకరుణిక సేవించుకొందురా!
ఆనతినీయరా... 

చరణం 3 :

పప పమప నినిపమగస గగ
పప పమప నినిపమగస గగ
గమపని గా మపనిస మా పనిసగ నీ స పా ని మా ప గా మ సా గామ
పప పమప నినిపమగస గగ

గమపని గా
మపనిస మా
పనిసగ నీ స పా ని మా ప గా మ సా గా మ
పప పమప నినిపమగస గగా
గమపని గమపని స మపనిసగని
గమపని గమపని స మపనిసగని
స పని మ ప గ మ సా గా మ
పప పమప నినిపమగస గ గా
గామాపని గమాపాని స మపానీసగని
స పని మ ప గ మ సా గా మ
పప పమప నినిపమగస గ గా గా

గగ మమ పప నిగ.. తక తకిట తకధిమి
మమ పప నినిసమ.. తక తకిట తకధిమి
పపనినిసస గని.. తక తకిట తకధిమి
సపని మప గమ సగమ
పప పమప నినిపమగస గ గా

రక్షా...  ధర శిక్షా దీక్షా దక్ష!
విరూపాక్ష! నీ కృపా వీక్షణాపేక్షిత ప్రతీక్షనుపేక్ష సేయక..
పరీక్ష సేయక.. రక్ష.. రక్ష.. యను ప్రార్ధన వినరా!
ఆనతినీయరా...  హరా!
సన్నుతి సేయగా.. సమ్మతి నీయరా దొరా...
సన్నిధి చేరగా.... ఆనతి నీయరా.... హరా

ప్రియురాలు పిలిచింది (2000)




చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: ఏ.ఎమ్.రత్నం ,  శివ గణేశ్
గానం: శంకర్ మహదేవన్


లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయ మందువే

గంధపు గాలిని తలుపులు ఆపుట
న్యాయమా.... న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె
మౌనమా.... మౌనమా
చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే
అదే నేను ఋజువే చేయ నూరేళ్లు చాలవే

లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే ఏమి చేయమందువే

గంధపు గాలిని తలుపులు ఆపుట
న్యాయమా.... న్యాయమ
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె
మౌనమా.... మౌనమా
చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే
అదే నేను ఋజువే చేయ నూరేళ్లు చాలవే

లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే ఏమి చేయమందువే

హృదయమొక అద్దమని నీ రూపు బింబమని
తెలిపేను హృదయం నీకు సొంతమనీ....
బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి
అద్దాల ఊయల బింబమూగె చెలీ....
నువు తేల్చి చెప్పవే పిల్లా
లేక కాల్చి చంపవే లైలా
నా జీవితం నీ కనుపాపలతో
వెంటాడి ఇక వేటాడొద్దే

లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే ఏమి చేయమందువే

గంధపు గాలిని తలుపులు ఆపుట
న్యాయమా.... న్యాయమ
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె
మౌనమా.... మౌనమా

తెల్లారి పోతున్నా విడిపోని రాత్రేది
వాసనలు వీచే నీ కురులే సఖీ....
లోకాన చీకటైన వెలుగున్న చోటేది
సూరీడు మెచ్చే నీ కనులే చెలీ....
విశ్వ సుందరీమణులె వచ్చి
నీ పాద పూజ చేస్తారే
నా ప్రియ సఖియా ఇక భయమేలా
నా మనసెరిగి నా తోడుగ రావే

ఏమి చేయమందువే ఏమి చేయమందువే
ఏమి చేయమందువే ఏమి చేయమందువే
న్యాయమా... న్యాయమ
ఏమి చేయమందువే ఏమి చేయమందువే
మౌనమా... మౌనమా
ఏమి చేయమందువే




*********   ********   *********



చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: ఏ.ఎమ్.రత్నం ,  శివ గణేశ్
గానం:  సాధనా సర్గమ్

పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా
పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా
అహా నేడే రావాలి నా దీపావళి పండగా
నేడే రావాలి నా దీపావళి పండగా
రేపటి స్వప్నాన్నీ నేనెట్టా నమ్మేది
నే నాటితె రోజా నేడే పూయునే
పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా

పగలే ఇక వెన్నెలా...
పగలే ఇక వెన్నెలా వస్తే పాపమా
రేయిలో హరివిల్లే వస్తే నేరమా
బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్
బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్
కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం
నూరు కలలను చూచినచో ఆరు కలలును ఫలియించు కలలే దరీచేరవా

పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా

నా పేరే పాటగా కోయిలే పాడనీ
నే కోరినట్టుగా పరువం మారనీ
భరతం తం తం మదిలో తం తోం ధిం
భరతం తం తం మదిలో తం తోం ధిం
చిరుగాలి కొంచం వచ్చి నా మోమంతా నిమరని
రేపు అన్నది దేవునికి నేడు అన్నది మనుషులకూ
బ్రతుకే బతికేందుకూ

పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా
అహా నేడే రావాలి నా దీపావళి పండగా
నేడే రావాలి నా దీపావళి పండగా
రేపటి స్వప్నాన్నీ నేనెట్టా నమ్మేది
నే నాటితె రోజా నేడే పూయునే



*********   ********   *********



చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: ఏ.ఎమ్.రత్నం ,  శివ గణేశ్
గానం:  చిత్ర

దోబూచులాటేలరా
దోబూచులాటేలరా గోపాల
నా మనసంత నీవేనురా
దోబూచులాటేలరా గోపాల
నా మనసంత నీవేనురా
ఆ యేటి గట్టునేనడిగ
చిరు గాలి నాపి నే నడిగ
ఆ యేటి గట్టునేనడిగ
చిరు గాలి నాపి నే నడిగ
ఆకాశాన్నడిగ బదులే లేదు
ఆకాశాన్నడిగ బదులే లేదు
చివరికి నిన్నే చూశా
హౄదయపు గుడిలో చూశా
చివరికి నిన్నే చూశా
హౄదయపు గుడిలో చూశా

దోబూచులాటేలరా గోపాల
నా మనసంత నీవేనురా

నా మది నీకొక ఆటాడు బొమ్మయ
నా మది నీకొక ఆటాడు బొమ్మయ
నాకిక ఆశలు వేరేవి లేవయ్య
ఎదలో రొదాగదయా
నీ అధరాలు అందించ రా గోపాలా ఆ
నీ అధరాలు అందించ రా గోపాల
నీ కౌగిళిలొ కరిగించ రా
నీ తనువే ఇక నా వలువా
పాలకడలి నాది నా గానం
నీ వన్నె మారలేదేమి
పాలకడలి నాది నా గానం
నీ వన్నె మారలేదేమి
నా ఏదలొ చేరి వన్నె మర్చుకో
ఊపురి నీవై సాగ
పెదవుల మెరుపు నువు కాగ చేరగ రా

దోబూచులాటేలరా గోపాల
నా మనసంత నీవేనురా

గగనమే వర్షించ గిరి నెత్తి కాచావు
గగనమే వర్షించ గిరి నెత్తి కాచావు
నయనాలు వర్షించ నన్నెట్ట బ్రోచేవు
పువ్వునకనే నీ మతమా
నేనొక్క స్త్రీ నే కదా గోపల
అది తిలకించ కనులే లేవా
నీ కలలే నేనే కాదా
అనుక్షనము ఉలికెనా మనసు
అరె మూగ కాదు నా వయసు
నా ఊపిరిలోన ఊపిరి నీవై ప్రాణం పోనికుండ
యెప్పుడు నీవే అండ కాపాడ రా

దోబూచులాటేలరా గోపాల
నా మనసంత నీవేనురా




*********   ********   *********



చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: ఏ.ఎమ్.రత్నం ,  శివ గణేశ్
గానం:  చిత్ర , శ్రీనివాస్


నెలే పొడిచెనని చంద్రుడొచ్చెనని
తుళ్ళీ పడెనులే నా హృదయం
నీడ చూసినా నువ్వేనంటు
ఈ హృదయం పొంగీ పొరలును

నెలే పొడిచెనని చంద్రుడొచ్చెనని
తుళ్ళీ పడెనులే నా హృదయం
నీడ చూసినా నువ్వేనంటు
ఈ హృదయం పొంగీ పొరలును

ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
కళ్ళలో కలిసెనో అమ్మమ్మ వేకువే చెరిపెనో
కవిత నెతికి ఇవ్వండీ లేక నా కలను తిరిగి ఇవ్వండీ

ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా

సంధ్య వేళలొ మనసు మూల
మరుగైన మోము మది వెదికెలే
మండుటెండలో నగర వీధిలో
మసలి మసలి మది వాడెలే
మబ్బు చిందు చిరు చినుకు చినుకుకు
మధ్య నిన్ను మది వెదికెలే
అలల నురుగు లో కలల ప్రేమికుని
గుచ్చి గుచ్చి మది వెదికెలే
సుందర వదనం ఒక పరి చూచిన
మనసే శాంతించూ...ఊ...
ముని వ్రేళ్ళతో నువ్వక పరి తాకిన
మళ్ళి మళ్ళి పుట్టెదనే..ఏ...

నెలే పొడిచెనని చంద్రుడొచ్చెనని
తుళ్ళీ పడెనులే నా హృదయం
నీడ చూసినా నువ్వేనంటు
ఈ హృదయం పొంగీ పొరలును

ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా

ఒకే చూపును ఒకే మాటను ఒకే స్పర్శ మది కోరెలే
ముద్దులిచు మురిపాల సెగలను ఎల్ల వేళలా కొరులే
చెమట నీటీ నీ మంచి గంధముగ ఎంచ మని మది కోరెలే
మోము పైన కేశములు గుచ్చిన తీపి హయి చెప్పుకోదులే ఆఆ... కోదు లే...ఏ..
రాయి తో చేసిన మనసే నాదని చెలియ కు తెలిపితినే
రాయి మధ్యలో పెరిగిన లత లా నువు నాలో తొలచితివే

ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా

యాత్ర (2019)



చిత్రం : యాత్ర (2019)
సంగీతం : కె.కృష్ణ కుమార్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కాలభైరవ

నీ కనులలో కొలిమై
రగిలే కలేదో
నిజమై తెలవారనీ
వెతికే వెలుగై రానీ

ఈ నాటి ఈ సుప్రభాత గీతం
నీకిదే అన్నదీ స్వాగతం
ఈ సందెలో స్వర్ణ వర్ణ చిత్రం
చూపదా అల్లదే చేరనున్న లక్ష్యం

ఎక్కడో పైన లేదు యుద్ధమన్నది
అంతరంగమే కదనరంగమైనదీ
ప్రాణమే బాణమల్లె తరుముతున్నది
నిన్ను నీవే జయించిరార
రాజశేఖరా అంటున్నదీ

మనసులో మండుటెంటలాగా
నిప్పులే చెరగనీ నిశ్చయం
నీ గుండెలో మంచుకొండలాగా
నిత్యమూ నిలవనీ నమ్మకం

వసుధకే వందనం చెయ్యకుండా
నింగిపైకి ఎగురుతుంద గెలుపు జండా
ఆశయం నెత్తురై పొంగకుండా
శ్వాసలోని సమర శంఖమాగుతుందా

ఈ నాటి ఈ సుప్రభాత గీతం
నీకిదే అన్నదీ స్వాగతం
ఈ సందెలో స్వర్ణ వర్ణ చిత్రం
చూపదా అల్లదే చేరనున్న లక్ష్యం

ఎక్కడో పైన లేదు యుద్ధమన్నది
అంతరంగమే కదనరంగమైనదీ
ప్రాణమే బాణమల్లె తరుముతున్నది
నిన్ను నీవే జయించిరార
రాజశేఖరా అంటున్నదీ

మనసులో మండుటెంటలాగా
నిప్పులే చెరగనీ నిశ్చయం
నీ గుండెలో మంచుకొండలాగా
నిత్యమూ నిలవనీ నమ్మకం

వసుధకే వందనం చెయ్యకుండా
నింగిపైకి ఎగురుతుంద గెలుపు జండా
ఆశయం నెత్తురై పొంగకుండా
శ్వాసలోని సమర శంఖమాగుతుందా 

దళపతి (1991)




చిత్రం: దళపతి (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర


అరె చిలకమ్మా చిటికేయంటా నువు రాగాలే పాడాలంటా
ఇక సాగాలి మేళాలంటా ఈ సరదాలే రేగాలంటా
ఓ చిన్నోడా పందిర వేయరా ఓ రోజూపూవు మాలే తేరా
ఈ చినదాని మెడలో వేయరా నడిరేయంతా సందడిచేయరా
ఆ టక్కరిగాడే అహ ఈ బుల్లోడే నను కట్టివేసే మొనగాడే లేడే

చరణం: 1
చీకుచింత లేదు చిందులేసే ఊరు పాటా ఆటా ఇది ఏందంటా
అహ ఊరి లోనివారు ఒక్కటైనారు నీకు నాకు వరసేనంటా
పండగ నేడే మన ఊరికే ఆశలు రేపే కలలూరేనే
వాడనిదంట ఈ వేడుకే అందరికింకా వెత తీరేనే
అహ ఈ పూట కానీరా ఆటా పాటా
బుల్లెమ్మా నవ్విందంటా మణిముత్యాలే రాలేనంటా
అరె మామయ్య రేగాడంట నా మనసంతా దోచాడంట
నీ మాటే నాకు ఓ వెండి కోట
నువు నాదేనంటా నీతోనే ఉంటా

చరణం: 2
వేడుకైన వేళ వెన్నెలమ్మలాగ దీపం నీవై వెలగాలంట
అహ చీకటంతా పోయే పట్టపగలాయే ఏలా దీపం ఇక మనకంట
జాతికి నేడే మంచికాలమే నమ్మకముంటే వచ్చి తీరేనే
ఊరికి నీవే మేలుకోరితే కోరికలన్నీ రేపే తీరేనే
అరె ఆనందం నీ సొంతం అంతేకాదా
చిట్టెమ్మా నన్నే చూడు జత చేరమ్మా నాతో పాడు
మురిపాల పండగపూట మన ముచ్చట్లే సాగాలంట

అహ నువు సై అంటే నీ తోడై ఉంటా
నీ కళ్లల్లోన నే కాపురముంటా



*********  ********  ********



చిత్రం: దళపతి
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి.బాలు, కె.జె.యేసుదాస్ & కోరస్

సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి
సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి
ఈనాడూ..ఊరంతటా..రాగాలా దీపాలటా
మీకొసం వెలిగేనట...ఉల్లాసం మీదేనటా.. హొయ్...

సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి

వద్దంటా నే పాతదనాన్ని ముద్దంటా నే కొత్తదనాన్ని
కొత్తగ ఇపుడే పుట్టావనీ అనుకో మంటారా... రేయ్..
బతుకే దారి పోతే ఎంటీ బాటేదైనా నీకది ఏంటి..
నారుని వేసే ఆ పై వాడే నీరే పోస్తాడే...హోయ్..
మూల బడి వున్న బుట్టా తట్టా తీసి
భోగి మంటల్లోన నీవే వెయ్యరా..హోయ్..
తెల్లవారగానే సంకురాత్రి కాదా
పొంగే పాలు అందరి పాలు హాయిగా
నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు
అంతకంటే సందడేది లేదే... హోయ్

సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి

ఈనాడూ..ఊరంతటా..రాగాలా దీపాలటా
మీకొసం వెలిగేనట...ఉల్లాసం మీదేనటా.. హొయ్
సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి

బంధాలేంటి భందువులేంటి.. పోతే ఎంటి వస్తే ఏంటీ
తిండే లేదని దిగులే పడని జన్మే నాదీరా..హ హ
మనసే ఇచ్చి చెయ్యందించి తోడూ నీడై మిత్రుడు కలిసే
ఆతనికంటే చుట్టాలెవరూ నాకే లేరంటా
హృదయం మాత్రం నాదే.. ఊపిరి కాదా తనదే
నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తాలే
నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నానీవేళ
తన మాటే నాకు వేదం అంటా ఏ వేళా
శోకం వీడే స్వర్గం చూసే..రాగం పాడే తాళం వేసే
పాటలు పాడే పువ్వుల జంటా మేమే

సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి
ఈనాడు..ఊరంతటా..రాగాల దీపాలట
మీకొసం వెలిగేనట...ఉల్లాసం మీదేనటా..హొయ్...
సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి


*********  ********  ********


చిత్రం: దళపతి (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల

ఆడ జన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
సాగనీ నా పాట ఎటు సాగునో నీ బాట
ఇది కాదా దేవుని ఆట
ఆడ జన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో

చరణం: 1
మాటాడే నీ కన్నులే నాకవి పున్నమి వెన్నెలే
నీ చిరుబోసి నవ్వురా నాకది జాజి పువ్వురా
వీధినే పడి వాడిపోవునో
దైవ సన్నిధినే చేరునో ఇక ఏమౌనో

చరణం: 2
ఆడ జన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
సాగనీ నా పాట ఎటు సాగునో నీ బాట
ఇది కాదా దేవుని ఆట
ఆడ జన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో


*********  ********  ********


చిత్రం: దళపతి (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

పల్లవి:
సుందరి నేనే నువ్వంట చూడని నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంట జన్మకే తోడై నేనుంట
గుండెలో నిండమంటా నీడగా పాడమంట
నా సిరి నీవేనట

చరణం: 1
అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా
మధురాల మధువులు చిందే చల్లని ప్రేమే మాయమా
రేపవలు నిద్దురలోన ఎద నీ తోడే కోరును
యుద్దాన ఏమైనా నా ఆత్మే నిన్నే చేరును
ఎద తెలుపు ఈ వేళ ఏల ఈ శోధన..
జాబిలిని నీవడుగు తెలుపు నా వేదన
నాలో ప్రేమే మరిచావో ప్రేమే నన్నే గెలిచేనే

చరణం: 2
పూవులే ముళ్ళై తోచు నీవే నన్ను వీడితే
ఊహలే పూలై పూచు నీ ఎద మాటున చేరితే
మాసాలు వారాలవును నీవు, నేను కుడితే
వారాలు మాసాలవును బాటే మారి సాగితే
పొంగునీ బంధాలే నీ దరి చేరితే
గాయాలు ఆరేను నీ దరి చేరితే
నీవే కదా నా ప్రాణం నీవే కదా నా లోకం


*********  ********  ********


చిత్రం: దళపతి (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: స్వర్ణలత

యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా
రేయి గడిచెనూ పగలు గడిచెనూ మాధవుండు రాలేదే
రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే
రేయి గడిచెనూ పగలు గడిచెనూ మాధవుండు రాలేదే
రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే

చరణం: 1
యదుకుమారుడే లేని వేళలో
వెతలు రగిలెనే రాధ గుండెలో
యదుకుమారుడే లేని వేళలో
వెతలు రగిలెనే రాధ గుండెలో
పాపం రాధా

యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా