Showing posts with label అగ్ని సమాధి (1978). Show all posts
Showing posts with label అగ్ని సమాధి (1978). Show all posts

అగ్ని సమాధి (1978)


చిత్రం : అగ్ని సమాధి (1978)
సంగీతం : సత్యం
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, జానకి  


పల్లవి : 

ప్రణయ పిపాసి హృదయ నివాసి
పొంగులుగా రంగులుగా ఒంపులుగా సొంపులుగా
మోహంగా దాహంగా ఉరికి ఉరికి ఒడికి చేరరా

ప్రణయ పిపాసి హృదయ నివాసి
పొంగులుగా రంగులుగా ఒంపులుగా సొంపులుగా
మోహంగా దాహంగా ఉరికి ఉరికి ఒడికి చేరరా 

ప్రణయ పిపాసి హృదయ నివాసి


చరణం 1 :

సెలయేటి రాగాల ఎలదేటి గానాల విన్నాను నీ పాటలెన్నో
హరివిల్లు ఎదలోనా విరిజల్లు జడిలోనా కన్నాను నీ వన్నెలెన్నో

స్వప్నాలెన్నో స్వర్గాలెన్నో... భావలెన్నో భోగాలెన్నో
కలుపుకున్న కనులలోనా నిలిపి చూడగా  


ప్రణయ పిపాసి హృదయ నివాసి
పొంగులుగా రంగులుగా ఒంపులుగా సొంపులుగా
మోహంగా దాహంగా ఉరికి ఉరికి ఒడికి చేరరా 

ప్రణయ పిపాసి హృదయ నివాసి


చరణం 2 :

అనురాగ గిరిలోనా ఆనందశిఖరాన శివతాండవం నీవు కాగా
సగమైన దేహాన సరితూగు వేగాన సతి లాస్యమే నీవు కాగా
జాబిలి వంగీ  సిగలో పువ్వై... ఎదలో ఎరుపే పెదవుల ఎరుపై..
మెరిసిపోయి మురిసిపోయి ముద్దులాడగా

ప్రణయ పిపాసి హృదయ నివాసి
పొంగులుగా రంగులుగా ఒంపులుగా సొంపులుగా
మోహంగా దాహంగా ఉరికి ఉరికి ఒడికి చేరరా 

ప్రణయ పిపాసి హృదయ నివాసి

*********** ************* ************


చిత్రం : అగ్ని సమాధి (1978)
సంగీతం : సత్యం
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, జానకి  


పల్లవి: 


ప్రియతమా... నీ ఊపిరే నాకు ప్రాణం
నీ చూపులే నాకు దీపం
నీవే లేని నాడు...  నేనే శూన్యము
నీతో ఉన్న నేడు...  బ్రతుకే స్వర్గము..
ప్రియతమా... నీ ఊపిరే నాకు ప్రాణం



చరణం 1 :

తోడు నీడై.. అడుగుల జాడై.. నడిచే నడకలు నీవే
తేనియ వలపై.. తీయని పిలుపై.. పలికే పలుకులు నీవే 

ఈ అనురాగమే జీవితమూ.. ఈ అనుబంధమే శాశ్వతమూ
నాలో నీవై.. నీలో నేనై.. ఒకటై పోదాం నేడే ..
ప్రియతమా.... నీ ఊపిరే నాకు ప్రాణం 


చరణం 2 :


ఎన్ని తరాల.. ఎన్ని యుగాల...  మారని మనసు నీవు
ఎన్నడు లేని.. ఎవరికి లేని.. మాయని మమతవు నీవు

ఎదలో ఉన్నది ఆలయము...  అది నా దేవత మందిరము
మన ఈ జంటే.. గుడి జేగంటై.. మోగాలి కలకాలం..

ప్రియతమా....  నీ ఊపిరే నాకు ప్రాణం
నీ చూపులే నాకు దీపం
నీవే లేని నాడు...  నేనే శూన్యము
నీతో ఉన్న నేడు...  బ్రతుకే స్వర్గము..

ప్రియతమా.... నీ ఊపిరే నాకు ప్రాణం...