Showing posts with label Murali Mohan. Show all posts
Showing posts with label Murali Mohan. Show all posts

ఆంధ్రకేసరి (1983)

 

చిత్రం: ఆంధ్రకేసరి (1983) 

సంగీతం: సత్యం
గీతరచయిత: ఆరుద్ర 
నేపధ్య గానం: బాలు 


పల్లవి: 

నమః సోమాయచ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయచ 
నమశ్శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ 
నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో హంత్రే చ హనీయసే 
చ నమో వృక్షేభ్యోహరి కేశేభ్యో నమస్తారాయ నమశ్శంభవే చ 
మయో భవే చ నమశ్శంకరాయ చ మయస్కరాయ చ 
నమశ్శివాయ చ శివతరాయ చ 

వేదంలా ఘోషించే గోదావరి 
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి 
వేదంలా ఘోషించే గోదావరి 
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి 
శతాబ్దాల చరిత గల సుందర నగరం 
శతాబ్దాల చరిత గల సుందర నగరం 
గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం 
వేదంలా ఘోషించే గోదావరి 
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి 

చరణం 1: 

రాజరాజ నరేంద్రుడు.. కాకతీయులు 
తేజమున్న మేటి దొరలు.. రెడ్డి రాజులు 
గజపతులు.. నరపతులు.. ఏలిన ఊరు 
ఆ కథలన్ని నినదించె గౌతమి హోరు 
వేదంలా ఘోషించే గోదావరి 
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి 
చరణం 2: 

శ్రీవాణి గిరిజాస్చిరాయ దథతో వక్షో ముఖాంగేశు 
యే లోకానాం స్థితిమావహంత్య విహితాం స్త్రీపుంస యోగోద్భవాం 
దేవేదత్రయమూర్తాయ స్త్రిపురుష సంపూజితాపస్సురైర్భూయాశుః 
పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరాశ్రేయసే... 

ఆది కవిత నన్నయ్యా రాసెనిచ్చటా 
శ్రీనాధ కవి నివాసమూ పెద్ద ముచ్చటా 
ఆది కవిత నన్నయ్యా రాసెనిచ్చటా 
శ్రీనాధ కవి నివాసమూ పెద్ద ముచ్చటా 
కవిసార్వభౌములకిది ఆలవాలము 
కవిసార్వభౌములకిది ఆలవాలము 
నవ కవితలు వికసించె నందనవనము 

వేదంలా ఘోషించే గోదావరి 
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి 

చరణం 3: 

దిట్టమైన శిల్పాల దేవళాలు 
కట్టుకథల చిత్రాంగి కనక మేడలు 
దిట్టమైన శిల్పాల దేవళాలు 
కట్టుకథల చిత్రాంగి కనక మేడలు 
కొట్టుకొని పోయె కొన్ని కొటిలింగాలు 
వీరేశలింగమొకడు మిగిలెను చాలు 

వేదంలా ఘోషించే గోదావరి 
అమరదామంలా శోభిల్ల్లే రాజమహేంద్రి 
శతాబ్దాల చరిత గల సుందర నగరం 
గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం 
వేదంలా ఘోషించే గోదావరి 
అమరదామంలా శోభిల్లే రాజమహేంద్రి 
వేదంలా ఘోషించే గోదావరి 
అమరదామంలా శోభిల్లే రాజమహేంద్రి

మా బంగారక్క (1977)



చిత్రం :  మా బంగారక్క (1977)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  సుశీల, రామకృష్ణ  

పల్లవి :

చేత వెన్నా ముద్ద.. చెంగల్వాపూదండా
చేత వెన్నా ముద్ద.. చెంగల్వాపూదండా
లింగులిటుకు.. లింగులిటుకు..
తింటే మటుకు గుటుకు గుటుకు
చేత వెన్నా ముద్ద.. చెంగల్వాపూదండా

చరణం 1:

ఓ చిలకా.. రాచిలకా
నిన్ను పట్టేసి పంజరంలో పెట్టేస్తే.. ఏం చేస్తావు?
ఏం చేస్తావు.. నువ్వేం చేస్తావు?

ఏం చేస్తానా.. ఏం చేస్తానా...
జువ్వలు పటపట కొరుకుతా.. రివ్వున పై పైకెగురుతా...
రెప రెప రెప రెప రెప రెప రెప రెప...

చేత వెన్నా ముద్ద.. చెంగల్వాపూదండా

చరణం 2:

ఓ ఏరా.. సెలయేరా..
నిన్ను గట్టువేసి కదలకుండా కట్టెస్తే.. ఏం చేస్తావు...
ఏం చేస్తావు.. నువ్వేం చేస్తావు?

ఏం చేస్తానా.. ఏం చేస్తానా...
కస్సున బుస్సున పొంగుతా...
గట్టును తెంచుకొని పొర్లుతా..
జలజలజలజలజలజల....

చేతవెన్నె ముద్ద.. చెంగల్వాపూదండా

చరణం 3:

ఓ గాలి.. పైరగాలి
నిన్ను బుడగలోకి ఊదేసి.. ముడివేస్తే.. ఏం చేస్తావు?
ఏం చేస్తావు.. నువ్వేం చేస్తావు?

ఏం చేస్తానా.. ఏం చేస్తానా...
ఫటాఫటామని పేలుతా.. చిటారుకొమ్మల ఊగుతా..
చేతవెన్నా ముద్ద.. చెంగల్వాపూదండా

ఓ యమ్మ.. ఓ బుట్టబొమ్మ
నిన్ను ఎవడేనా చినవాడు ఎత్తుకుపోతే ఏం చేస్తావు?
ఏం చేస్తావు.. నువ్వేం చేస్తావు?....

చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977)




చిత్రం : చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : దాసం గోపాలకృష్ణ
నేపధ్య గానం : ఎల్. ఆర్. అంజలి, శారద  


పల్లవి :

చీటికిమాటికి చిట్టెమ్మంటే చీపురు దెబ్బలు తింటవురోయ్... రయ్యో కొయ్యోడా
నువ్వు చీపురు దెబ్బలు తింటవురోయ్... రయ్యో కొయ్యోడా
కొయ్యోడు కొయ్యోడంటే నువ్వు కొరడా దెబ్బలు తింటావే లమ్మీ చిట్టెమ్మి
నువ్వు కొరడా దెబ్బలు తింటావే లమ్మీ చిట్టెమ్మి

చరణం 1 :

చినబాబుంటాడు పెదబాబుంటాడు కాపులుంటరు కరణాలుంటరు
చినబాబుంటాడు పెదబాబుంటాడు కాపులుంటరు కరణాలుంటరు
చిట్టెమ్మ అని పిలవకురా... రయ్యో కొయ్యోడా
నీ చిన్నెలన్ని చాలురో... రయ్యో కొయ్యోడా
నీ చిన్నెలన్ని చాలురో... రయ్యో కొయ్యోడా


పిన్నలు పెద్దలు మన్నిస్తారు... కాపులు కరణాలు దీవిస్తారు
పిన్నలు పెద్దలు మన్నిస్తారు... కాపులు కరణాలు దీవిస్తారు
ముద్దుల అత్త కూతురివే.. లమ్మీ చిట్టెమ్మి
నిను ముచ్చటగానే పిలవాలే లమ్మీ చిట్టెమ్మి
నిను ముచ్చటగానే పిలవాలే లమ్మీ చిట్టెమ్మి.. ఓలమ్మీ..చిట్టెమ్మి

చీటికిమాటికి చిట్టెమ్మంటే చీపురు దెబ్బలు తింటవురోయ్... రయ్యో కొయ్యోడా
నువ్వు చీపురు దెబ్బలు తింటవురోయ్... రయ్యో కొయ్యోడా
కొయ్యోడు కొయ్యోడంటే నువ్వు కొరడా దెబ్బలు తింటావే లమ్మీ చిట్టెమ్మి
నువ్వు కొరడా దెబ్బలు తింటావే లమ్మీ చిట్టెమ్మి 

చరణం 2 :


వరసా వరసా వక్కల ఆకు... కురసా కురసా ముక్కలి పీఠ
పిల్లకు పిల్లాడు తోడంటా... నీకు నాకు పెళ్ళంట.. ఆహా.. అలాగా
తోడంటా... పెళ్ళంటా
తోడంటా... పెళ్ళంటా
పెళ్ళంటా... తోడంటా
పెళ్ళంటా... తోడంటా

ఏయ్.. నేను జీళ్ళ సీతయ్య మరదలినోయ్.. రయ్యో కొయ్యోడా
నువ్వు ఒళ్లు దగ్గర ఉంచుకో... రయ్యో కొయ్యోడా
నువ్వు ఒళ్లు దగ్గర ఉంచుకో... రయ్యో కొయ్యోడా
నువు జీళ్ళ సీతయ్య మరదలివా... లమ్మీ చిట్టెమ్మి
నేను మేడ మంగమ్మ దత్తుడినే... లమ్మీ చిట్టెమ్మి
నేను మేడ మంగమ్మ దత్తుడినే... లమ్మీ చిట్టెమ్మి
ఓలమ్మీ.. చిట్టెమ్మి


చీటికిమాటికి చిట్టెమ్మంటే చీపురు దెబ్బలు తింటవురోయ్... రయ్యో కొయ్యోడా
నువ్వు చీపురు దెబ్బలు తింటవురోయ్... రయ్యో కొయ్యోడా
కొయ్యోడు కొయ్యోడంటే నువ్వు కొరడా దెబ్బలు తింటావే లమ్మీ చిట్టెమ్మి
నువ్వు కొరడా దెబ్బలు తింటావే లమ్మీ చిట్టెమ్మి 


********** *********** ***********
చిత్రం: చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977)
సంగీతం: రమేశ్ నాయుడు
గీతరచయిత: దాసం గోపాలకృష్ణ
నేపధ్య గానం: సుశీల 


పల్లవి :
చుక్కల్లో పెద చుక్క చందమామా
ఎలుగులకే ఎలుగమ్మ ఎన్నెలమ్మా
ఆ చందమామకు ఈ ఎన్నెలమ్మకు చల్లని గోదారి ఒడిలో పెళ్ళమ్మా..
ముత్యాలజల్లమ్మా...

చుక్కల్లో పెద చుక్క చందమామా
ఎలుగులకే ఎలుగమ్మ ఎన్నెలమ్మా
ఆ చందమామకు ఈ ఎన్నెలమ్మకు చల్లని గోదారి ఒడిలో పెళ్ళమ్మా..
ముత్యాలజల్లమ్మా...


చరణం 1 :


ఏటి గాలికి పెళ్ళికొడుకులో ఎగిసే బాసల అలలెన్నో..ఓ..ఓ..
పడవ ఇసురుతో పెళ్ళిపడుచులో పలికే తీయని కలలెన్నో..ఓ..ఓ..
అరమూసే ఆ కళ్ళే చెబుతాయి...
ఇరబూసే నీ అందాలే చెబుతాయి...



చుక్కల్లో పెద చుక్క చందమామా
ఎలుగులకే ఎలుగమ్మ ఎన్నెలమ్మా
ఆ చందమామకు ఈ ఎన్నెలమ్మకు చల్లని గోదారి ఒడిలో పెళ్ళమ్మా..
ముత్యాలజల్లమ్మా...

చరణం 2 :


ఉలకని పలకని మూగరాలివని తెలిసే అందరు వస్తారు..ఊ..ఊ
కోరినవన్నీ అవుతాయనుకొని గుండె నింపుకొని వెళతారు..ఊ..ఊ..
మౌనంగా ఎన్నాళ్ళు ఉంటావోయమ్మ..
మనసార ఈసారైన దీవించవమ్మా..
మనసార ఈసారైన దీవించవమ్మా..


చుక్కల్లో పెద చుక్క చందమామా
ఎలుగులకే ఎలుగమ్మ ఎన్నెలమ్మా
ఆ చందమామకు ఈ ఎన్నెలమ్మకు చల్లని గోదారి ఒడిలో పెళ్ళమ్మా..
ముత్యాలజల్లమ్మా...

********** *********** ***********
చిత్రం : చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : దాసం గోపాలకృష్ణ
నేపధ్య గానం : రమేశ్ నాయుడు



పల్లవి :


ఆ.. ఓ.. ఆ...హా.. ఆ..
తల్లి గోదారికే ...
తల్లి గోదారికే... ఆటుపోటుంటే
తప్పుతుందా మనిసికీ...తలరాత
తప్పుతుందా మనిసికీ..ఆ...హా.. ఆ.. 

ఎలుగు ఎనకాలనే సీకటుందని తెలిసి
ఎలుగు ఎనకాలనే సీకటుందని తెలిసి
సీకటికి దడిసేదేమిటి... ఓ మనసా.. సీకటికి దడిసేదేమిటి



చరణం 1 :


భగభగ మండే సూరీడుని పొగమబ్బు కమ్మేయదా
చల్లగా వెలిగే సెందురున్ని అమవాస మింగేయదా
ఆ సూర్యచంద్రులే అగచాట్లపాలైతే....
తప్పుతుందా మనిసికీ...తలరాత
తప్పుతుందా మనిసికీ ... 


చరణం 2 :

అవతార పురుషుడు ఆ రామచంద్రుడు.. అడవులపాలు కాలేదా
అంతటా తానైన గోపాల కృష్ణుడు..  అపనిందలను మోయలేదా
అంతటి దేవుళ్ళే అగచాట్ల పాలైతే
తప్పుతుందా మనిసికీ...తలరాత
తప్పుతుందా మనిసికీ...


********** *********** ***********
చిత్రం: చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977)
సంగీతం: రమేశ్ నాయుడు
గీతరచయిత: దాసం గోపాలకృష్ణ
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

సువ్వి ఆ హు సువ్వి ఆ హు ....సువ్వి...సువ్వి

సువ్వి కస్తూరి రంగా
సువ్వి కావేటి రంగా
సువ్వి రామాభిరామ
సువ్వి లాలీ

సువ్వి కస్తూరి రంగా
సువ్వి కావేటి రంగా
సువ్వి రామాభిరామ
సువ్వి లాలీ

హైలేసా హయ్యా .. హైలేసా హయ్యా .. హైలేసా హయ్యా .. హైలేసా హయ్యా ..

చరణం 1:

అద్దమరేతిరి నిద్దురలోన ముద్దుల కృష్ణుడు ఓ చెలియా
అద్దమరేతిరి నిద్దురలోన ముద్దుల కృష్ణుడు ఓ చెలియా
నా వద్దకు వచ్చెను ఓ సఖియా

సువ్వి కస్తూరి రంగా
సువ్వి కావేటి రంగా
సువ్వి రామాభిరామ
సువ్వి లాలీ

ఉ ఉ హు హయ్యా ... ఉ ఉ హు హయ్యా ... ఉ ఉ హు హయ్యా ...
ఉ ఉ హు హయ్యా ... ఉ ఉ హు హయ్యా ... ఉ ఉ హు హయ్యా ...

చరణం 2:

వంగి వంగి నను తొంగి చూచెను
కొంగు పట్టుకుని లగేనుగా
వంగి వంగి నను తొంగి చూచెను
కొంగు పట్టుకుని లగేనుగా
భల్ చెంగున యమునకు సాగేనుగా

సువ్వి కస్తూరి రంగా
సువ్వి కావేటి రంగా
సువ్వి రామాభిరామ
సువ్వి లాలీ ......

చరణం 3:

అల్లావనమున కొల్లలుగా వున్నా గొల్ల భామలను కూడితిని
నే గొల్లా భామనై అడితిని ...నే గొల్ల భామనై అడితినీ...

సువ్వి కస్తూరి రంగా
సువ్వి కావేటి రంగా
సువ్వి రామాభిరామ
సువ్వి లాలీ ....
సువ్వి...ఆహూం...సువ్వీ..ఆహుం..

నిద్దుర లేచి అద్దము చూడ ముద్దుల ముద్దర ఓ చెలియా ...
నిద్దుర లేచి అద్దము చూడ ముద్దుల ముద్దర ఓ చెలియా ...
హబ్బ... అద్దినట్టుంది ఓ సఖియా...

సువ్వి కస్తూరి రంగా
సువ్వి కావేటి రంగా
సువ్వి రామాభిరామ
సువ్వి లాలీ....

సువ్వి...ఆహూం...సువ్వీ..ఆహుం..
సువ్వి...ఆహూం...సువ్వీ..ఆహుం..
సువ్వి...ఆహూం...సువ్వీ..ఆహుం..

********** *********** ***********

చిత్రం: చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977)
సంగీతం: రమేశ్ నాయుడు
గీతరచయిత: దాసం గోపాలకృష్ణ
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

ఏంటబ్బాయా..ఇదేటబ్బాయా...
నా దుంప తెంచావు...నా కొంప ముంచావు..
నా వాలకం చూసి నా వాళ్ళడిగితే...
ఏం చెప్పేది ..నేనేం చెప్పేది...
ఏం చెప్పేది ..నేనేం చెప్పేది...
హమ్మా...ఏం చెప్పేది ..నేనేం చెప్పేది...


ఏంటి చిట్టెమ్మ ..ఇదేం గోలమ్మా..
కుళ్ళుమోతోళ్ళు..నిను కూకలేస్తేను..
టాపు లేపలేవా..టోపీ వేయ్యలేవా..
ఏదో చెప్పేసేయ్...నువ్వేదో చెప్పేసేయ్...
ఏదో చెప్పేసేయ్...నువ్వేదో చెప్పేసేయ్...
హబ్బా...ఏదో చెప్పేసేయ్...నువ్వేదో చెప్పేసేయ్...

చరణం 1:

కొత్తపల్లి కోక నే కోరి కట్టుకొచ్చా..
ఆవురావురుమంటు నన్నదిమి పట్టుకున్నావ్...
కొత్తపల్లి కోక నే కోరి కట్టుకొచ్చా..
ఆవురావురుమంటు నన్నదిమి పట్టుకున్నావ్...
నలిపి నలిపి వేశావ్..మురికి మురికి చేశావ్...

ఏం చెప్పేది ..నేనేం చెప్పేది...
అయ్యయ్యయ్యొ.. చెప్పేది ..నేనేం చెప్పేది...
హమ్మా...ఏం చెప్పేది ..నేనేం చెప్పేది...

కోకనదరు చూసి.. కోడెగిత్త బెదరి...
తాడు తెంచుకోని..తరిమి తరిమి వేసి...
కోకనదరు చూసి ..కోడెగిత్త బెదరి...
తాడు తెంచుకోని..తరిమి తరిమి వేసి...
బిత్తర బిత్తర చేసిందని వత్తి వత్తి పలకలేవా...

ఏదో చెప్పేసేయ్...నువ్వేదో చెప్పేసేయ్...
ఏదో చెప్పేసేయ్...నువ్వేదో చెప్పేసేయ్...
అరెరే...ఏదో చెప్పేసేయ్...నువ్వేదో చెప్పేసేయ్...

చరణం 2:

జుట్టు చెదిరిపోయే...నా బొట్టు కరిగిపోయే...
బుగ్గలేమో కంది...మల్లెమొగ్గలేమో కమిలే...
జుట్టు చెదిరిపోయే...నా బొట్టు కరిగిపోయే...
బుగ్గలేమో కంది...మల్లెమొగ్గలేమో కమిలే...
ముస్తాబులన్నీ కూడా ముదనష్టమైపోయే...

ఏం చెప్పేది ..నేనేం చెప్పేది...
ఏం చెప్పేది ..నేనేం చెప్పేది...
హ..హ.....ఏం చెప్పేది ..నేనేం చెప్పేది...

కొబ్బరితోట కాడ కోతిపిల్లను చూసి..
ఎక్కిరించబోతే...ఎగిరి గంతులేసి...
కొబ్బరితోట కాడ కోతిపిల్లను చూసి..
ఎక్కిరించబోతే...ఎగిరి గంతులేసి...
చిదిమి చిదిమి వదిలిందని గదిమి గదిమి చెప్పలేవా...

ఏదో చెప్పేసేయ్...నువ్వేదో చెప్పేసేయ్...
హబ్బ.. చెప్పేసేయ్...నువ్వేదో చెప్పేసేయ్...

అహ..ఏం చెప్పేది ..నేనేం చెప్పేది...
అరెరే.. ఏదో చెప్పేసేయ్...నువ్వేదో చెప్పేసేయ్...
అయ్యో..ఏం చెప్పేది ..నేనేం చెప్పేది...
ఏదో చెప్పేసేయ్...నువ్వేదో చెప్పేసేయ్...

కల్పన (1977)



చిత్రం: కల్పన (1977)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

వదలనురా నిను రఘురామా...
వదలనురా నిను రఘురామా..

నా జీవితమే.. నవపారిజాతము
నా జీవితమే.. నవపారిజాతము
ఏనాడో..ఓ... నీకే..ఏ..ఏ..ఏఏ..ఏఏ..ఏఏ
అంకితమూ..

వదలనురా నిను రఘురామా...

చరణం 1:

నా భావములో.. జీవము నీవే
నా గానములో.. మాధురి నీవే

నా భావములో.. జీవము నీవే
నా గానములో.. మాధురి నీవే

తోడు నీడా..ఆ..ఆ.. మనుగడ నీవే
తోడు నీడా..ఆ..ఆ.. మనుగడ నీవే

నను నడిపించే దైవము నీవే..
వదలను.. వదలను.. వదలనురా నిను రఘురామా

చరణం 2:

కోరను ఎపుడూ.. సిరిసంపదలు
అడగను నిన్నూ.. వేరే వరములు

కోరను ఎపుడూ.. సిరిసంపదలు
అడగను నిన్నూ.. వేరే వరములు

పావనమౌ నీ పదములే చాలు
పావనమౌ నీ పదములే చాలు

నను పాలించే సౌభాగ్యాలు..

వదలను... వదలను..
వదలను రా నిను రఘురామా..
నా జీవితమే నవపారిజాతము..
ఏనాడో అది నీకే... ఏ..ఏ..ఏ..ఏ
అంకితము......

********* ************ *************** ********
చిత్రం: కల్పన (1977)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: సుశీల, జి.ఆనంద్

పల్లవి:

దిక్కులు చూడకు రామయ్యా.. పక్కనే ఉన్నది సీతమ్మా
దిక్కులు చూడకు రామయ్యా.. పక్కనే ఉన్నది సీతమ్మా..సీతమ్మా..

సిరిమల్లె నవ్వుల సీతమ్మా.. ముందుకు రావే ముద్దుల గుమ్మ
సిరిమల్లె నవ్వుల సీతమ్మా... ముందుకు రావే ముద్దుల గుమ్మ...ముద్దులగుమ్మా
దిక్కులు చూడకు రామయ్య

చరణం 1:

ఎదనే దాచుకుంటావో... నా ఎదనే దాగిఉంటావో..ఓ...
ఎదనే దాచుకుంటావో... నా ఎదనే దాగిఉంటావో..ఓ...

కదలికలన్నీ కథలుగ అల్లి కవితలే రాసుకుంటావో..రామయ్యా..

పొన్నలు పూచిన నవ్వు... సిరివెన్నెల దోచి నాకివ్వు.
పొన్నలు పూచిన నవ్వు... సిరివెన్నెల దోచి నాకివ్వు.
ఆ వెన్నెలలో... నీ కన్నులలో... ఆ వెన్నెలలో..నీ కన్నులలో..
సన్నజాజులే రువ్వు.. కను సన్నజాజులే రువ్వు.. సన్నజాజులే రువ్వు..
కను సన్నజాజులే రువ్వు.. సీతమ్మా..సీతమ్మా దిక్కులు చూడకు రామయ్య

చరణం 2:

కలలో మేలుకుంటావో.. నా కళలే ఏలుకుంటావో..
కలలో మేలుకుంటావో.. నా కళలే ఏలుకుంటావో..

కలలిక మాని కలయికలో..నా కనులలో చూసుకుంటావో.. రామయ్యా

వెల్లువలైనది సొగసు.. తొలివేకూవ నీ మనసు..
వెల్లువలైనది సొగసు.. తొలివేకూవ నీ మనసు..

ఆ వెల్లువలో... నా పల్లవిలో.. ఆ వెల్లువలో.. నా పల్లవిలో..
రాగమే పలికించు.. అనురాగమై పులకించు..రాగమే పలికించు..
అనురాగమై పులకించు..సీతమ్మా..సీతమ్మా.. దిక్కులు చూడకు రామయ్య

********* ************ *************** ********
చిత్రం: కల్పన (1977)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు

పల్లవి:

ఇది నా కల్పన.. కవితాలాపన.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ

ఒక ఉదయంలో... నా హృదయంలో
ఒక ఉదయంలో... నా హృదయంలో
విరిసిన మందారం.. మెరిసిన సింధూరం..
విరిసిన మందారం.. మెరిసిన సింధూరం..

కల్పనా.. అది ఒక కల్పన.. అది నా కల్పన

ఒక ఉదయంలో... నా హృదయంలో
విరిసిన మందారం.. మెరిసిన సింధూరం..

చరణం 1:

తార తారకి నడుమ ఆకాశం ఎందుకో
పాట పాటకి నడుమ ఆవేశం ఎందుకో..

తార తారకి నడుమ ఆకాశం ఎందుకో
పాట పాటకి నడుమ ఆవేశం ఎందుకో..

మనిషి మనిషికీ మద్య మనసనేది ఎందుకో
మనసే గుడిగా.. మనిషికి ముడిగా..
మమత ఎందుకో.. మమత ఎందుకో..

తెలియని ఆవేదనే ఆలాపన
తెలుసుకున్న వేదనే కల్పనా..
అది ఒక కల్పన.. అది నా కల్పన...

ఒక ఉదయంలో... నా హృదయంలో
విరిసిన మందారం.. మెరిసిన సింధూరం..

చరణం 2:

దివ్వె దివ్వెలో వెలుగు నీ రూపం పొందితే
పువ్వు పువ్వునా మధువు నీ కోసం పొంగితే

దివ్వె దివ్వెలో వెలుగు నీ రూపం పొందితే
పువ్వు పువ్వునా మధువు నీ కోసం పొంగితే

కవి మనస్సులో ఉషస్సు కారు చీకటౌతుంటే
మిగిలిన కథలో.. పగిలిన ఎదలో..
ఈ కవితలెందుకో.. కవితలెందుకో..

తెలియని ఆవేదనే ఆలాపన
తెలుసుకున్న వేదనే కల్పనా..
అది ఒక కల్పన.. అది నా కల్పన..

ఒక ఉదయంలో... నా హృదయంలో
విరిసిన మందారం.. మెరిసిన సింధూరం..
విరిసిన మందారం.. మెరిసిన సింధూరం..

కల్పనా.. అది ఒక కల్పన.. అది నా కల్పన

ఇదెక్కడి న్యాయం (1977)



చిత్రం: ఇదెక్కడి న్యాయం (1977)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: రామకృష్ణ, సుశీల

పల్లవి:

అందాలన్ని.. అందాలన్ని నీలోనే దాగున్నాయి
అవి సందడి చేస్తూ నన్నే రా రమ్మనాయి
బిత్తర చూపులు మానెయ్యి... మెత్తని చెయ్యి అందియ్యి
బిత్తర చూపులు మానెయ్యి... మెత్తని చెయ్యి అందియ్యి
పద పదా.. అదిగో పొదా.. ప్రియసుధ.. ప్రియసుధ.. జయసుధా.. హా...

అందాలన్ని.. అందాలన్ని నీలోనే దాగున్నాయి
అవి సందడి చేస్తూ నన్నే రా రమ్మనాయి
బిత్తర చూపులు మానెయ్యి...మెత్తని చెయ్యి అందియ్యి
బిత్తర చూపులు మానెయ్యి... మెత్తని చెయ్యి అందియ్యి
పద పదా.. ఇదిగో సుధా.. ప్రియసుధ.. ప్రియసుధ.. జయసుధా.. ఆ...

చరణం 1:

నా కళ్ళు ఇన్నాళ్ళు నీ చుట్టే తిరిగేవి..
నా కళ్ళు ఇన్నాళ్ళు నీ చుట్టే తిరిగేవి..
మదిలోన కోరికల జడి వాన కురిసేది..జడివాన కురిసేది
చేప్పాలంటే.. పెదవులు ఆగేవి తడబడి...
ఎప్పుడు చూడూ నాలో ఉప్పెనలాంటి అలజడి ....
పద పదా.. అదిగో పొదా..ప్రియసుధ.. ప్రియసుధ.. జయసుధా.. హా...

అందాలన్ని నీలోనే దాగున్నాయి
అవి సందడి చేస్తూ నన్నే రా రమ్మనాయి

చరణం 2:

ఎదురెదురు నువ్వుంటే ఏ మెరుపో మెరిసేది ...
ఎదురెదురు నువ్వుంటే ఏ మెరుపో మెరిసేది ...
చిరు సిగ్గు తెరలోన అది కాస్త అణిగేది..అది కాస్త అణిగేది
ఎవరేమన్నా.. మనది ఎదురులేని పరవడి...
ఇద్దరి జంటా.. వలచే పడుచు వాళ్ళకు ఒరవడి
పద పదా.. ఇదిగో సుధా.. ప్రియసుధ.. ప్రియసుధ.. జయసుధా..ఆ...

అందాలన్ని.. అందాలన్ని నీలోనే దాగున్నాయి
అవి సందడి చేస్తూ నన్నే రా రమ్మనాయి
బిత్తర చూపులు మానెయ్యి మెత్తని చెయ్యి అందియ్యి
పద పదా.. అదిగో పొదా.. ప్రియసుధ.. ప్రియసుధ.. జయసుధా.. హా...

అందాలన్ని.. అందాలన్ని నీలోనే దాగున్నాయి
అవి సందడి చేస్తూ నన్నే రా రమ్మనాయి
బిత్తర చూపులు మానెయ్యి మెత్తని చెయ్యి అందియ్యి
పద పదా.. ఇదిగో సుధా.. ప్రియసుధ.. ప్రియసుధ.. జయసుధా.. ఆ...

ఆమె కథ (1977)



చిత్రం : ఆమె కథ (1977)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల  

పల్లవి :

తహ తహ మని ఊపిరంత ఆవిరి ఐతే... చూపులన్ని ఆకలైతే
తపించాను నీవే ప్రాణమై..ఆ... ఆ.. ఆ... తపించాను నీవే ప్రాణమై

తడి పొడి తడి వెన్నెలేదో వెచ్చనైతే... మల్లెపూల వేసవైతే
జపించాను నీవే ధ్యానమై..ఆ.. ఆ.. ఆ.. ఆ.. జపించాను నీవే ధ్యానమై

జబు జబు జబు జబు జబురే..హహహహహ..జబు జబు జబు జబురే
జబు జబు జబు జబు జబురే..హహహహహ..జబు జబు జబు జబ్ 

చరణం 1 :

చుక్క పొడుస్తే చిలిపిగ నన్నే చూసినట్లు ఉంది
చురకలు వేసినట్లు ఉంది

గులాబి రెమ్మా గుచ్చుకొంటే గిచ్చినట్లు ఉంది
ముద్దులు ఇచ్చినట్లు ఉంది

మాపటేల అవుతుంటే.. హాయ్ మల్లెపూలు నవుతుంటే
మాపటేల అవుతుంటే..ఏ..మల్లెపూలు నవుతుంటే
మసకలోన వయసు మనసు.. కలిసి మెలిసి బుసకొడుతుంటే

అర్ధరాత్రి అవుతున్నా... ఆటవిడుపు లేకున్నా
మరులకన్నా సిరిలే లేవులే 

తహ తహ మని ఊపిరంత ఆవిరి ఐతే.. చూపులన్ని ఆకలైతే
జపించాను నీవే ధ్యానమై..ఆ ఆ ఆ ఆ.. జపించాను నీవే ధ్యానమై 

జబు జబు జబు జబు జబురే..హహహహహ..జబు జబు జబు జబెరే
జబు జబు జబు జబు జబురే..హహహహహ..జబు జబు జబు జబ్ 


చరణం 2 : 

మిడిసిపడే నీ అందం కడలి పొంగల్లే ఉంది..
ఒడిసి పట్టాలని ఉందీ
ఎంత తీరినా తీరని కోరిక వెన్నెల కాసింది..
అయినా ఎండల్లే ఉంది

పాత కొత్తలవుతుంటే.. కొత్త వింతలవుతుంటే
పాత కొత్తలవుతుంటే..ఏ.. కొత్త వింతలవుతుంటే
జవనాలే పవనాలై... మరువలేని మరువాలైతే

ఎంత చేరువౌవుతున్నా... ఎంత కలిసి పోతున్నా
మనువులోని తనివే తీరదు

తహ తహ మని ఊపిరంత ఆవిరి ఐతే... చూపులన్ని ఆకలైతే
జపించాను నీవే ధ్యానమై..ఆ ఆ ఆ ఆ... జపించాను నీవే ధ్యానమై 

జబు జబు జబు జబు జబురే..హహహహహ..జబు జబు జబు జబెరే
జబు జబు జబు జబు జబురే..హహహహహ..జబు జబు జబు జబ్
చుపు చుపు చుపురే..ఆ హహహహ..చుపు చుపు చుపురే 



****** ************* *****************
చిత్రం: ఆమె కథ (1977) 
సంగీతం: చక్రవర్తి 
గీతరచయిత: వేటూరి 
నేపధ్య గానం: జి. ఆనంద్, సుశీల 

పల్లవి: 

పువ్వులనడుగు... నవ్వులనడుగు... 
పువ్వులనడుగు నవ్వులనడుగు... రివ్వున ఎగిరే గువ్వలనడుగు... 
నువ్వంటే నాకెంత ప్రేమో... ఇది ఏనాటి అనుబంధమో... ఓ... ఓ... 

కొమ్మలనడుగు... ఆఁహాఁహాఁహాఁ... రెమ్మలనడుగు ఆఁహాఁహాఁహాఁ... 
కొమ్మలనడుగు రెమ్మలనడుగు... ఝుమ్మని పాడే తుమ్మెదనడుగు... 
నువ్వంటే నాకెంత ప్రేమో... ఇది ఏనాటి అనుబంధమో... 

చరణం 1: 

పల్లె పదానికి పల్లవినై...ఈ.. 
పడుచందానికి పల్లకినై...ఈ.. 
పెదవి పల్లవి కలిపేస్తా... 
నా పల్లవి నీలో పలికిస్తా...ఆ.. 
నీవు నేనుగా పూవు తావిగా.... 
జన్మ జన్మలకు విడని జంటగా... 
నీవే.. నా దీవెనా... ఆ..ఆ.. 
ఈ పొద్దు చాలక నా ముద్దు తీరగ 
రేపన్నదేలేక చెలరేగిపోతా.... 

పువ్వులనడుగు... 
పువ్వులనడుగు నవ్వులనడుగు... రివ్వున ఎగిరే గువ్వలనడుగు... 
నువ్వంటే నాకెంత ప్రేమో... ఇది ఏనాటి అనుబంధమో... 

చరణం 2: 

పొడిచే పొద్దుల తూరుపునై...ఈ..ఈ.. 
వాలే పొద్దుల పడమరనై...ఈ..ఈ.. 
దిక్కులు నీలో కలిపేస్తా...ఆ..ఆ.. 
నా దిక్కువి నీవని పూజిస్తా..ఆ..ఆ.. 
నింగి సాక్షిగా నేల సాక్షిగా... మమతల మల్లెల మనస్సాక్షిగా... 
నీవే నా దేవతా.... 

ఆ...ఆ...ఆ... 

వెయ్యేళ్ల కోరిక నూరేళ్లు చాలక... ఏడేడు జన్మలు నీదాననౌతా... 

కొమ్మలనడుగు... 
కొమ్మలనడుగు రెమ్మలనడుగు... ఝుమ్మని పాడే తుమ్మెదనడుగు... 
నువ్వంటే... నువ్వంటే... నాకెంత ప్రేమో... ప్రేమో... 
ఇది ఏనాటి అనుబంధమో...ఓ...

****** ************* *****************


చిత్రం: ఆమె కథ (1977)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, బి.వసంత, ఎల్.ఆర్.అంజలి

పల్లవి:

పతియే ప్రత్యక్షా దైవమే... ఏయ్...
పతియే ప్రత్యక్షా దైవమే..
భక్తియుక్తునతో భర్త సేవలకు పూలు తెచ్చుకో పూజ చేసుకో...
అబ్బోహో చూత్తాములే ఊఁఊఁ...

సతియే గులహాలచిమిలే... లే..
సతియే గులహాలచిమిలే
తెలివితేటలతో దెబ్బలేతుకొని బుద్ధి తెచ్చుకో బాగచూసుకో...
బాగా తూతుకో... ఆఁ..

పతియే గులహాలచిమిలే
ఛీ ఛీ ఛీ... ఛీ
పతియే ప్రత్యక్షా దైవమే..ఏ..
ఛీ ఛీ ఛీ ఛీ...

చరణం 1:

గీసిన గీటు దాటిన సీత గతి విన్నావు కదా..
సీత లేక చీలాములు పడ్డా తిప్పలు విన్నాలే
మాటకు మాట ఎదురొచ్చావా నీ గతి అంతేలే
మాటలొచ్చిన మనిషిని నేనూ మట్టిబొమ్మననుకున్నావా..
సంపాయించే మొగాణ్ణి పట్టుకు సతాయించకే సుభాషిణీ..
సుభాషిణీ.. సుభాషిణీ..
ఆ.. సుభాషిణీ.. సుభాషిణీ..
సంపాయించం నీకేం తెలుసు నిమ్మకాయ పులుసూ...
అఘోరించావ్...
నోలు మూసుకో భీమాండనేయ
నోలు మూసుకో భీమాండనేయ
తెంపరి కూతలు కూసావంటే కొంప నుంచి నిను గెంటేస్తా..
తప్పులు కూతలు కూసావంటే చెప్పు తీసుకుని తన్నిస్తా

పతియే.. ఆ.. పతియే.. ఆ.. పతియే.. పులహాలచిమిలే..
ఇదుగో.. ఇది..ఇది.. ఏవిటే నువ్వు
పతియే.. ఆ.. పతియే.. ఈ.. పతియే.. ప్రత్యక్షా దైవమే.. దైవమే.. దైవమే..

చరణం 2:

ఇది ఇల్లా.. వల్లకాడా.. కాపురముండే ఇల్లా చేపల మార్కెట్టా..
ఏళ్ళు ఒచ్చిన తల్లితండ్రులా.. కళ్ళు తెరవని పిల్లకుంకలా..
ఒరేయ్.. వేలెడు లేరు.. రాస్కెళ్ళూ.. పెద్దల్నెదిస్తార్రా...
మిమ్మల్ని చీల్చి.. ఆ తర్వాత అదేంటి.. చండాడేసి పూడ్చిబెట్టడం జరగబోతోంది..
హా.. గుర్తులేదా నాన్నా..
ఉన్నూ..
హిరణ్యకశిపుడి కొడుకు తండ్రికే ఎదురుతిరగలేదా..
లవకుశులే ఆ రామచంద్రుని కళ్ళు తెరవలేదా..
ఇరుగూ పొరుగూ విన్నారంటే పురుగుల్లాగా చూస్తారు..
బుద్ధిలేని ఈ పెద్దలవల్లే పిల్లాజెల్లా చెడిపోతారు..
తల్లో బళ్ళో పిల్లో దానికి చెప్పి చూడరా బుడుగా..
చెప్పి చూడరా బుడుగా.. దానికి చెప్పీ చూడరో బుడుగో..

చందా కందా నందా వాళ్ళకు సదవులు చెప్పేదెవలూ..
నే కాదు..
ఎల్లి అలగవే పిల్లా పిలుగా
ఎల్లి అలగవే పిల్లా పిలుగా
ఎంత కడిగినా ఎంత ఉతికినా ఎలుక తోక నలుపేలే..
ఇకపై కొట్టుకు సచ్చారంటే ఇపుడే ఏట్లో దూకేస్తాం..
ఇపుడే ఏట్లో దూకేస్తాం..

అర్ధాంగి (1977)


చిత్రం :  అర్ధాంగి (1977)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  సుశీల 



పల్లవి :

నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం

అది ఈనాడైనా ఏనాడైనా.. నీకే నీకే అంకితం.. 
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం

చరణం 1 :

తెరచిన నా కన్నులలో ఎపుడు నీ రూపమే
మూసిన నా కన్నులలో ఎపుడు నీ కలల దీపమే
తెరచిన నా కన్నులలో ఎపుడు నీ రూపమే
మూసిన నా కన్నులలో ఎపుడు నీ కలల దీపమే  

కనులే కలలై.. కలలే కనులై
కనులే కలలై.. కలలే కనులై
చూసిన అందాలు అనుబంధాలు.. అవి నీకే నీకే అంకితం 

నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం


చరణం 2 :

నిండిన నా గుండెలలో ఎపుడూ నీ ధ్యానమే
పండిన ఆ ధ్యానంలో ఎపుడూ నీ ప్రణయ గానమే
నిండిన నా గుండెలలో ఎపుడూ నీ ధ్యానమే
పండిన ఆ ధ్యానంలో ఎపుడూ నీ ప్రణయ గానమే
ధ్యానమే గానమై.. గానమే ప్రాణమై
ధ్యానమే గానమై.. గానమే ప్రాణమై
పలికిన రాగాలు అనురాగాలు.. అవి నీకే నీకే అంకితం  

నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం

తొలిరేయి గడిచింది (1977)



చిత్రం: తొలిరేయి గడిచింది (1977)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: సినారె
గానం: పి.సుశీల, ఎస్.పి.బాలు



ఈ తీయని వేళ  నా ఊహల లోన
మల్లెలు విరిసే తేనెలు కురిసే
జల జల జల జల

ఈ తీయని వేళ  నా ఊహల లోన

నీల మేఘమాలికలోన
నీ కురులూగెనులే
పైరగాలి ఊయలలోన
నీ మది పాడెనులే

నా మదిలోని రాగిణులన్నీ
నీకై మ్రోగెనులే

ఈ తీయని వేళ  నా ఊహల లోన

లేలేత కోరికలన్నీ
పూచెను పరువాలై
దాచలేని భావనలన్నీ
లేచెను కెరటాలై

కన్నులలోన కలకల లాడే
కలలే కిరణాలై

ఈ తీయని వేళ  నా ఊహల లోన