Showing posts with label Mano. Show all posts
Showing posts with label Mano. Show all posts

జమదగ్ని(1988)





చిత్రం: జమదగ్ని(1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సాహితి
గానం: మనో, జానకి



ఇది స్వాతి జల్లు ఒణికింది ఒళ్ళు
వయసంది ఝల్లు వాటేసి వెళ్ళు
పెళ్ళాడే వాడా పెనవేసే తోడా

ఇది స్వాతి జల్లు ఒణికింది ఒళ్ళు
నీ నీలి కళ్ళు అవునంటే చాలు
అల్లాడే దానా అలవాటైపోనా..

ఇది స్వాతి జల్లు

నీలి కోక నీటికి తడిసే పైట గుట్టు బైటపడే
పెళ్ళి కాని పిల్లకి చలితో పెద్ద చిక్కు వచ్చి పడే
నీలి కోక నీటికి తడిసే పైట గుట్టు బైటపడే
పెళ్ళి కాని పిల్లకి చలితో పెద్ద చిక్కు వచ్చి పడే
కన్నె ఈడు కాగిపోయెరా...
పడిన నీరు ఆవిరాయెనా
నాలో తాకే గిలిగింతే గంతే వేసే ఇన్నాళ్ళూ
నీకై కాచే వయసంతా మల్లై పూచే
కౌగిట్లో నీ ముంత కొప్పంత
రేపేయనా తీపంత చూపేయనా

ఇది స్వాతి జల్లు ఒణికింది ఒళ్ళు
వయసంది ఝల్లు

చిన్నదాని అందాల నడుమే సన్నగుంది ఎందుకని
అందగాని చేతికి ఇట్టే అందుతుంది అందుకని
చిన్నదాని అందాల నడుమే సన్నగుంది ఎందుకని
అందగాని చేతికి ఇట్టే అందుతుంది అందుకని
బుగ్గమీద సొట్ట ఎందుకే సక్కనోడి తీపి ముద్దుకే
నాకివ్వాళా సోయగాల సోకివ్వాలా
శోభనాల రేయవ్వాల యవ్వనాల హాయివ్వాలా
ఈ పూటా మన జంట చలిమంట
కాగాలిరా గిల్లంత తీరాలిరా

ఇది స్వాతి జల్లు ఒణికింది ఒళ్ళు
వయసంది ఝల్లు వాటేసి వెళ్ళు
అల్లాడే దానా అలవాటైపోనా..
ఇది స్వాతి జల్లు ఒణికింది ఒళ్ళు
వయసంది ఝల్లూ...

ప్రేమించుకుందాం.. రా (1997)




చిత్రం:  ప్రేమించుకుందాం.. రా (1997)
సంగీతం: మహేష్
గీతరచయిత: భువనచంద్ర
నేపధ్య గానం: బాలు

పల్లవి:

సూర్యకిరీటమే నీవా.. చంద్ర సుమానివే నీవా
మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో
తొలకరి మేఘ ఛాయలో మెరిసిన తారవో
వాత్సాయన వన వాసినీ.. కావేరీ

సూర్యకిరీటమే నీవా.. చంద్రసుమానివే నీవా

చరణం 1:

పెదవి తాకి స్వాతిముత్యం పగడమయ్యిందా
తనువు తాకి శ్వేతపుష్పం అరుణమయ్యిందా
నీ ఒడి మన్మధ యాగ సీమా..
నీ సరి ఎవ్వరు లేరే భామా...
నీతోనే పుట్టింది ప్రేమా...

కన్నె శకుంతలే నీవా.. కావ్య సుమానివే నీవా
చల్లని వెన్నెల హాయిని వివరించేదెలా
వెచ్చని ఊహల వీణని వినిపించేదెలా
వాత్సాయన వన వాసినీ.. కావేరీ...

సూర్యకిరీటమే నీవా.. చంద్రసుమానివే నీవా...

చరణం 2:

ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ...
ఆ.. ఆ.. ఆ....

సొగసుభారమోపలేక నడుము చిక్కిందా...
జాలిగొన్న జాణతనమే జఘనమయ్యిందా...
తుమ్మెద ఎరుగని తేనె పువ్వా..
సౌందర్యానికి తావి నువ్వా..
ప్రియమార దరిచేర రావా...

సూర్యకిరీటమే నీవా.. చంద్రసుమానివే నీవా
మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో
తొలకరి మేఘ ఛాయలో మెరిసిన తారవో
వాత్సాయన వన వాసినీ.. కావేరీ...

************ ************** *************** ************

చిత్రం:  ప్రేమించుకుందాం.. రా (1997)
సంగీతం:  మహేష్
గీతరచయిత:  సిరివెన్నెల
నేపధ్య గానం:  బాలు, చిత్ర


పల్లవి:

మేఘాలే తాకింది హైహైలెస్స
నవరాగంలో నవ్వింది నా మోనాలిసా
ఈ గాలి రేపింది నాలో నిష
చేలరేగాలి రమ్మంది హల్లో అంటూ..
ఒళ్ళోవాలే అందాల అప్సరస

మేఘాలే తాకింది హైహైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా
ఈ గాలి రేపింది నాలో నిష
అది నా శ్వాసలో చేరి హల్లో అంటూ..
అల్లేసింది నీ మీద నా ఆశ

చరణం 1:

తొలిసారి నిను చూసి మనసాగక
పిలిచానే చిలకమ్మ మెల మెల్లగ
తెలుగంత తీయంగ... నువ్వు పలికావే స్నేహంగా

చెలిమన్న వలవేసి నను లాగగా
చేరాను నీ నీడ చల చల్లగా
గిలిగింత కలిగేలా... తొలి వలపంటే తేలిసేలా
హా.. కునుకన్న మాటే నను చేరక
తిరిగాను తేలుసా ఏం తోచక

 ఆ.. ఆ.. ఆ..
మేఘాలే తాకింది హైహైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా

చరణం 2:

తొలి పొద్దు వెలుగంత చిరువేడిగా
నిలువెల్ల పులకింత చిగురించగా
దిగులేదో హాయేదో.. గుర్తు చెరిపింది ఈ వింత

ఒక మత్తు కలిగింది గమ్మత్తుగా
నిజం ఏదో కల ఏదో మరిపించగా
పగలేదో రేయేదో... రెండు కలిశాయి నీ చెంత

ప్రేమంటే ఇంతే ఏమో మరి
దానంతు ఏదో చూస్తే సరి

ఆ..ఆ..ఆ..
మేఘాలే తాకింది హైహైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా
ఈ గాలి రేపింది నాలో నిష
అది నా శ్వాసలో చేరి హల్లో అంటూ...
అల్లేసింది నీ మీద నా ఆశ..
మేఘాలే తాకింది హైహైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా

************ ************** *************** ************

చిత్రం: ప్రేమించుకుందాం.. రా (1997)
సంగీతం: మహేష్
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: మనో, చిత్ర, స్వర్ణలత

పల్లవి:

పెళ్ళికళ వచ్చేసిందే బాలా..
పల్లకిని తెచ్చేసిందే బాలా...
హడావిడిగా రెడి అవుదాం చలో లైలా
ముచ్చటగ మేళం వుంది... ఆజా ఆజా
తద్దినక తాళం వుంది... ఆజా ఆజా
మంటపం రమ్మంటుంది... ఆజా ఆజా
జంటపడు వేళయింది... ఆజా ఆజా

పెళ్ళికళ వచ్చేసిందే బాలా..
పల్లకిని తెచ్చేసిందే బాలా...

చరణం 1:

అక్షితలు వేసేసింది షాదీ
అడ్డుతెర తీసేసింది షాదీ
స్వయంవరమే శభాషంది హలో డార్లింగ్
ఇష్టపడు కన్యాదానం.. లేజా లేజా
జానెమన్ ఏ దుళన్ కో... లేజా లేజా
మై డియర్ హబ్బి ముజ్కో... లేజా లేజా
ఆశపడు అందం చందం... లేజా లేజా

అక్షితలు వేసేసింది షాదీ
అడ్డుతెర తీసేసింది షాదీ

చరణం 2:

ఆలుమగలై పోయామే... భామా
అసలు కథ బాకీ వుంది... రామ్మా
అమాంతంగా ప్రోసీడ్ అవుదాం చలో జాణా

మల్లెలతో మంచం సిద్ధం... దేఖో దేఖో
అల్లరితో మంత్రం వేద్దాం.. దేఖో దేఖో
మన్మధుని ఆహ్వానిద్దాం... దేఖో దేఖో
ముద్దులతో సన్మానిద్దాం... దేఖో దేఖో
ఆలుమగలై పోయామే... భామా
అసలు కథ బాకీ వుంది... రామ్మా
అమాంతంగా ప్రోసీడ్ అవుదాం చలో జాణా.. ఆ.. ఆ..




************ ************** *************** ************


చిత్రం : ప్రేమించుకుందాం.. రా (1997)
సంగీతం :  మహేష్
గీతరచయిత :  భువనచంద్ర
నేపధ్య గానం :  బాలు, చిత్ర, సంగీత్ సాజిత్

పల్లవి:

సంబరాల తోటలో వలపుమొగ్గ విచ్చుకుంది చూడరా
సన్నజాజితీగలా ప్రియున్ని ఎట్టా హత్తుకుంది చూడరా
లక్షమాటలేలరా ప్రేమన్న రెండు అక్షరాలు చాలురా
వేయి జన్మలేలరా వలపు పండు ఒక్కరోజు చాలురా

చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నొ చూడనా
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నొ చూడనా

నీడలాగ తోడు వుంటా పారిజాతమా
గుండెలోనె దాచుకుంటా నిన్ను ప్రాణమా
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నొ చూడనా

చరణం 1:

నీ వాకిట ముగ్గునవుతా.. సందెపొద్దు వాలినాక సిగ్గునౌతా
నువ్వెళ్ళే దారిలోన నీడనిచ్చు గున్నమావి చెట్టునవుతా
నా నవ్వులె నీవంట కంటిపాపలాగ నిన్ను చూసుకుంటా
కన్నీటిని పంచుకుంటా కాలమంత నీకు నేను కావలుంటా
ప్రేమకన్న గొప్పదేది సృష్టిలోన లేదురా

చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నొ చూడనా
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నొ చూడనా

చరణం 2:

ధనమున్నా లేకున్నా గుప్పెడంత ప్రేమవుంది గుండెలోన
చావైనా బ్రతుకైనా నిన్ను విడిచి వుండలేను క్షణమైనా
ఆమాటే చాలునంట ఎన్ని బాధలైనా నేను ఓర్చుకుంటా
నీ చేయి పట్టుకుంటా కాళ్ళు కడిగి నన్ను నేనే ఇచ్చుకుంటా
సృష్టిలోనే అందమైన ప్రేమ జంట మీదిరా

చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నొ చూడనా
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నొ చూడనా

హాయ్ నుదిటిబొట్టు మీద ఒట్టు నిన్ను వీడను
మల్లెపూల మీద ఒట్టు మాట దాటను
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నొ చూడనా
లక్ష మాటలేలరా ప్రేమన్న రెండు అక్షరాలు చాలురా
వేయి జన్మలేలరా వలపు పండు ఒక్కరోజు చాలురా

************ ************** *************** ************


చిత్రం :  ప్రేమించుకుందాం.. రా (1997)
సంగీతం :  మహేష్
గీతరచయిత : భువనచంద్ర
నేపధ్య గానం :  బాలు, చిత్ర

పల్లవి:

అలా చూడు ప్రేమ లోకం పిలుస్తున్నదీ
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నదీ
ప్రపంచమంతా దాటేద్దాం పద అన్నదీ
ప్రేమించుకుందాం రా నేస్తం మన వయస్సు తపస్సు తరించు వరమిది

అలా చూడు ప్రేమ లోకం పిలుస్తున్నదీ
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నదీ

చరణం 1:

ప్రతి జన్మ నీతోనే ముడేశాడు బ్రహ్మ
అనే నమ్మి నీ పేరే జపించానులేమ్మా
అదే పాట నా దాక ఏలా చేరనమ్మా
ప్రతీ బాట నా వైపే నిన్నే పంపెనమ్మా
నిరంతరం నీ వూసేదో నను రమ్మన్నదీ
ప్రతి క్షణం నీ ధ్యాసేగా కల వరించి వరించి రప్పించుకున్నది

అలా చూడు ప్రేమ లోకం పిలుస్తున్నదీ
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నదీ

చరణం 2:

అలల్లాంటి ఈ రాగం నువ్వే నేర్పలేదా
తుఫానంటి ఈ వేగం నువ్విచ్చింది కాదా
వెలేవేసి లోకాన్ని ఎటో వెళ్ళిపోదాం
ఏదో చేసి కాలాన్ని అలా ఆగమందాం
రహస్య రాజ్యం చేరే జత కథే ఇది
సుఖాల తీరం కోరే మన ప్రయాణమివాళ ఫలించు క్షణమిది

అలా చూడు ప్రేమ లోకం పిలుస్తున్నదీ
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నదీ
ప్రపంచమంతా దాటేద్దాం పద అన్నదీ
ప్రేమించుకుందాం రా నేస్తం మన వయస్సు తపస్సు తరించు వరమిది
అలా చూడు ప్రేమ లోకం పిలుస్తున్నదీ
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నదీ 

విక్కీ దాదా (1989)

 


చిత్రం: విక్కీ దాదా (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: మనో, జానకి


పల్లవి:
ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా
ఒళ్ళోకి రానీవ్వు ఎంత చెడ్డా
మొగ్గేసేలే అందానికే.. సిగ్గేసెలే పగ్గానికే
బీటే కొట్టేసి నా లైన్ లో పెట్టనా
ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా
నీతోనే నే కాలు జారి పడ్డా
ముద్దాడితే ముందుండనా.. ముప్పూటలా తోడవ్వనా
లైటే తీసేసి నీ లైన్ లో పెట్టుకో

ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా
ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా

చరణం: 1
నాకేమో పిచ్చాకలి... తీరేదే ఎట్టామరి
ఒల్లంతా ఒకటే చలి... తీరేనా ఈ రాతిరి
మెరుపు విరుపు రెండింతలై...
ఉడుకు దుడుకు రెట్టింపులై...
అది వేసిందమ్మ నీ తోడు
వల వేసిందయ్యో నా ఈడు...
పచ్చా పచ్చాగ కౌగిళ్లు కోరెదా

ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా
ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా

చరణం: 2
పైపైనే మోమాటమూ.. లోలోనా ఆరాటము
అంతేలే పోరాటము.. ఆడేలే కోలాటము
కలిసి కలిసి కవ్వింతగా...
వయసుసొగసు తుళ్ళింతగా
దులిపేసిందయ్యో నీ జోరు..
తొలి రోజుల్లోనే బేజారు...
నచ్చేదిచ్చేస్తే ఏ గొడవా లేదుగా

ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా
ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా
ముద్దాడితే ముందుండనా.. ముప్పూటలా తోడవ్వనా
బీటే కొట్టేసి నా లైన్ లో పెట్టనా
ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా
ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా


******  *******  *******


చిత్రం: విక్కీ దాదా (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

గంట గంటకీ మోత గుంటదీ
రోజు రోజుకీ మోజుగుంటదీ
ఏ కొమ్మ వంచాలి అమ్మా
ఏ రెమ్మ తుంచాలి అమ్మా
ఆకలుండదూ నిద్దరుండదూ
తుంటరీడు హద్దులన్ని తుంగలోకి తొక్కినాక

గంట గంటకీ మోత గుంటదీ
పూట పూటకీ పులకరిస్తదీ
నాకేదొ కవాలి అమ్మా
నేనెట్ట చెప్పలి అమ్మా
కొంగు నిలవదూ కోరికాగదూ
కుర్రవాడు బుగ్గ పండు గంటి పెట్టి యెల్లినాక

ఆవురావురంటు నీ అందమంటుకుంటూ
నిలెసి కలేసి వరించా
ఆపు ఆపు అంటు నీ ఆశనందుకుంటు
మజాలో నిజాలే గ్రహించా
మంచి చేసుకో మచ్చ మాయా
గిల్లి చూసుకో కజ్జి కాయా
అందమిచ్చుకో అస్మదీయ
తప్పు కాదులే తస్మదీయ
బుగ్గలోన చలాకి గిలాబి
ముద్దులోన జిలేబి షరాబి
వెన్నెలెందుకూ వన్నెలెందుకూ
మత్తులోన పడ్డదంట హత్తుకున్న వత్తిడింక

గంట గంటకీ మోత గుంటదీ
పూట పూటకీ పులకరిస్తదీ

సైగ చేసుకుంటు సరాగమాడుకుంటూ
షరాలే మరోలా విదించా
ఒల్లు ముట్టుకుంటు వసంత మాడుకుంటూ
చలేస్తే ఇలాగే వదించా
సొమ్ము చేసుకో సోకువాడ
కౌగిలింతలో కాకినాడ
సంధి చేసుకో సందకాడ
పొందు దాటిపో పొద్దు కాడ
మల్లె పూల మసాల నిషాలా
అల్లుకోవె ఇలాగె కుషీగా
ముందు చూడదూ వెనక చూడదూ
వయసు గంట కొట్టినాక వలచుకున్న ప్రేమ జంట

గంట గంటకీ మోత గుంటదీ
పూట పూటకీ పులకరిస్తదీ
ఏ కొమ్మ వంచాలి అమ్మా
నేనెట్ట చెప్పలి అమ్మా
ఆకలుండదూ నిద్దరుండదూ
కుర్రవాడు బుగ్గ పండు గంటి పెట్టి యెల్లినాక


******  *******  *******


చిత్రం: విక్కీ దాదా (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

బ్యూటి బ్యూటి నాదె నాదె
స్వీటి స్వీటి నీకె నీకె
గొప్పగా లాలిపాప్పుగా
సండె సంద్య వేల సరిహద్దులు దాటి పోరా
మల్లి మాఘ వేలా మన మద్యన పంతమేలా

బ్యూటి బ్యూటి నాదె నాదె
స్వీటి స్వీటి నీకె నీకె

అల్లుకున్న సోకు అజంత
అందగాడి తోనె బజంతా
కౌగిలింతలోనె కథంతా
కల్లుమూసుకుంటె అదెంతా
సిగ్గు పడ్డ కన్నె బుగ్గ జీడి పప్పు
ఒప్పుకుంటె తప్పుకన్న లేదు ఒప్పు
సిగ్గు పడ్డ కన్నె బుగ్గ జీడి పప్పు
ఒప్పుకుంటె తప్పుకన్న లేదు ఒప్పు
ఆడుకో నేడె వేడి వేడి ఈడు జోడు లిమ్మనిక్కు
వండే వచ్చి చూడు వలపంచులు దాటి పోతా
హాఫ్ డే చాలు నాకు నీ అంతే తేల్చుకుంటా

బ్యూటి బ్యూటి నాదె నాదె
స్వీటి స్వీటి నీకె నీకె

అందుకొప్పుకుంటె చాలు అవస్తా
అందముంటె చాలు శ్రమిస్తా
చాటు కొంచమైతె క్షమిస్తా
ఏటె ఈటె లాగ తెగిస్తా
చంప మీద చెయ్యి తీసి తగ్గు తగ్గూ
ఈవిటీస్ చేసుకుంట ఈవినింగూ
చంప మీద చెయ్యి తీసి తగ్గు తగ్గూ
ఈవిటీస్ చేసుకుంట ఈవినింగూ
ఆడుకో నేడె టింగు టంగు గింగిరాల పింగు పాంగు
ఫిఫ్టీ అయ్యి చూడు అహ మఫ్తీ మన్మధుడ్నీ
సేఫ్టీ ముందు చూడూ అహ సెక్సీ కుర్ర దాన్నీ

బ్యూటి బ్యూటి నాదె నాదె
స్వీటి స్వీటి నీకె నీకె
గొప్పగా లాలిపాప్పుగా
సండె సంద్య వేల సరిహద్దులు దాటి పోరా
మల్లి మాఘ వేలా మన మద్యన పంతమేలా

విక్కి దాద ఓకె ఓకె
విక్కి దాద ఓకె ఓకె


******  *******  *******


చిత్రం: విక్కీ దాదా (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారీందమ్మో
మారిందయ్యో మారిందయ్యో చూపు రంగు మారిందయ్యో
చేమంతి పూలతో చెలగాటమా
పూబంది ముద్దులే జమకట్టనా
ఇట్ట తిట్టబడి తిరగబడి చెల్లుబడి

జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారీందమ్మో
మారిందయ్యో మారిందయ్యో చూపు రంగు మారిందయ్యో

నీ తలుకులే బెలుకులై కొత్తగా
నీ పలుపులె వలపులై వెచ్చగా
పువ్వో నీ అందమతా పందిల్ల దాక రావలమ్మో
రంగో నీ ఆశలన్ని ఈనాడు దోస్తిగా మారలయ్యో
అరవిరి సొగసులు కావలమ్మో
అడిగిన వరసలు నేనెనయ్యో
మూడె ముల్లు పడి జంట పడి ప్రేమ గుడి

జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారీందమ్మో
మారిందయ్యో మారిందయ్యో చూపు రంగు మారిందయ్యో

ఏ వరములో చక చకా అందగా
ఆ వరములే వయసులే దిద్దగా
లైఫ్ యే ఈ నాడు ముచ్చట్లు జతగా చేసిందయ్యో
లవ్ ఏ నీ పాట నవ్వె నీ తోట కళగా మారిందమ్మో
కలిసిన మనసుల సంకిల్లలో
ముడిపడు మమతల సందిల్లలో
నీకే కంటబడి కట్టబడి కొంగుముడి

జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారీందమ్మో
మారిందయ్యో మారిందయ్యో చూపు రంగు మారిందయ్యో
చేమంతి పూలతో చెలగాటమా
పూబంది ముద్దులే జమకట్టనా
ఇట్ట తిట్టబడి తిరగబడి చెల్లుబడి

జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారీందమ్మో
మారిందయ్యో మారిందయ్యో చూపు రంగు మారిందయ్యో

సూత్రధారులు (1989)



చిత్రం: సూత్రధారులు (1989)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: మాడుగుల నాగ ఫణి శర్మ
గానం: సుశీల, యస్. పి. పల్లవి 


పల్లవి:
శ్రీమత్ గజాననం నత్వా
స్తుత్వా శ్రీ సత్య సాయినమ్
శ్రీహరికథాపితామహమహమ్
వందే నారాయణదాస సత్గురుమ్

శ్రీరస్తూ ...శుభమస్తూ...
శ్రీరస్తు శుభమస్తు
సత్కథా లహరికి.. హరికీ ..
ఆగమల లతల కొసల విరిసినా విరికి... హరికీ
కోటి కొంగుల ముడుల పుణ్యంబు సిరికి... హరికీ
సిరికీ... హరికీ ..శ్రీరస్తు శుభమస్తు

చరణం: 1
యత్ర శ్రీకృష్ణ సంకీర్తనమ్..
తత్ర శుభమంగళ సంవర్తనమ్ ...అని ఆర్యోక్తి..
అలాంటి సర్వమంగళమోహనాకారుడైన ...
శ్రీకృష్ణుడీ అనేకా అనేక లీలా వినోదములలో ...
రుక్మిణీ కల్యాణ సత్కథా మధురాతి మధురమైనది

అందలి నాయికామణి ...ఆ రమణీ లలిత పల్లవపాణి
నీళసుందరవేణి ...అందాలపూబోని ...ఆ రుక్మిణి
అందాలపూబోని ...ఆ రుక్మిణి ...

కనులవి తెరచిన చాలు ...యదునందను అందమే గ్రోలూ
కరములు కదలిన చాలు ...కరివరదుని పదముల వ్రాలు
పెదవులు మెదిలిన చాలు ...హరిజపముల తపములదేలు
ఉల్లమంతా నల్లనయ్యే ...వలపు ఓపని వెల్లువై...

చరణం: 2
అంతలో..
యదుకేశరుతో హరితో ..గిరితో మనవియ్యము
గియ్యము కూడదని ...శిశుపాలుని పాలొనరితునని
తన సోదరుడాడిన మాటవిని ...దిగులుగొనీ ..దిక్కెవ్వరనీ....

తలపోసి ...తలపోసి తెలవారగా ...తనువెల్ల తపనలో తడియారగా ...

 

తలపోసి తలపోసి తెలవారగా ...తనువెల్ల తపనలో తడియారగా ...
ప్రళయమే రానున్నదనియించెను...
ప్రణయసందేశ మా స్వామీ కంపెనూ..

ఆ లలిత పల్లవపాణి ...నీళసుందరవేణి ...అందాలపూబోని
ఆ రుక్మిణిమణికి ...శ్రీరస్తు శుభమస్తు...
శ్రీరస్తు శుభమస్తు

చరణం: 3
అగ్రజుడైన రుక్మి తన పంతమే తనదిగ
శిశుపాలుని కిచ్చి వివాహము జరిపింప నిశ్చయించగా
ఆ చిన్నారి రుక్మిణి
రానన్నాడో... తానై రానున్నాడో ...
ప్రభువు ఏమన్నాడో ...ఏమనుకున్నాడో
అని మనసున విలవిలలాడు తరుణంబున
అది గ్రహించని చెలికత్తెలా రుక్మిణీదేవికీ...

తిలకము దిద్దిరదే... కళ్యాణ తిలకము దిద్దిరదే
చేలముకట్టిరదే... బంగారు చేలము కట్టిరదే
బాసికముంచిరదే ...నుదుటను బాసికముంచిరదే
పదములనళడిరదే ...పారాణి పదములనళదిరదే ...

ఇవ్విదమ్మున అలంకరింపబడిన రుక్మిణిదేవీ...
శిలపై అశువులుబాయు బలిపౌశువు చందమ్మున...
అందమ్మును ఆనందమును వీడి...
డెందమ్మున కుందుచుండాగా.....

అదిగో వచ్చెను వాడే హరి శ్రీహరీ
అదిగో వచ్చెను వాడే హరి శ్రీహరీ
శ్రీరుక్మిణి హృదయప్రణయాక్షరీ

అదిగో వచ్చెను వాడె ...
వచ్చీ వైరుల ద్రుంచి ...వరరత్న మై నిలచి
వనితా మనోరధము తీర్చీ ..రథము బూంచి
జయవెట్ట జనకోటీ .... వెడలే రుక్మిణి తోటి

అదిగో అదిగో వాడే హరి శ్రీహరి...

స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా...
న్యాయేన మార్గేన మహిమ్ మహీశాః...
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యమ్
లోకా సమస్తా సుఖినో భవంతు....


*******  *******  *******


చిత్రం:  సూత్రధారులు (1989)
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం:  సినారె
గానం: యస్.పి. బాలు, యస్. పి. శైలజ 

పల్లవి:
లాలేలో లిల్లేలేలో రామలా లొయిలాల అమ్మలాలో
లాలేలో లిల్లేలేలో రామలా లొయిలాల అమ్మలాలో...

ఊ..ఊ..మూడు బురుజుల కోట ముత్యాల తోట
ముంగిట్లో చిన్నారి బావకు మురిపాల పీటా

మూడు బురుజుల కోట ముత్యాల తోట
సందిట్లో వయ్యారి మరదలికి సరసాల మూట

లాలేలో లిల్లేలేలో రామలా వొయిలాల అమ్మలాలో
లాలేలో లిల్లేలేలో రామలా వొయిలాల అమ్మలాలో

చరణం: 1
ఓ... ఇంతలేసి కళ్ళున్నఇంతి మనసు చేమంతా? ముద్దబంతా? చెప్పరాదా చిగురంత..
ఇంతలోనే చెప్పుకుంటే కొంటె వయసు అన్నన్నా వదిలేనా.. నన్నైనా... నిన్నైనా ..

 


ఇంతలేసి కళ్ళున్న..ఇంతి మనసు చేమంతా? ముద్దబంతా? చెప్పరాదా చిగురంత...
ఇంతలోనే చెప్పుకుంటె కొంటె వయసు.. అన్నన్నా... వదిలేనా నన్నైనా... నిన్నైనా ...

కిన్నెరల్లే కన్నె పరువం ..ఉ..ఉ.. కన్ను గీటి కవ్విస్తే ..
ఉన్న వేడి ఉప్పెనల్లే..ఏ..ఏ.. ఉరకలేసి ఊరిస్తే...

లాలేలో లిల్లేలేలో రామలావొయిలాల అమ్మలాలో
లాలేలో లిల్లేలేలో రామలావొయిలాల అమ్మలాలో

చరణం: 2
ఓ... గడుసు గాలి పడుచు మొగ్గ తడిమిపోతే కాయౌనా? పండౌనా? కామదేవుని పండగౌనా?

కాముడై లగ్గమెట్టి కబురుపెడితే వారమేల? వర్జమేల? వల్లమాలిన వంకలేల?

గడుసు గాలి పడుచు మొగ్గ తడిమిపోతే కాయౌనా? పండౌనా? కామదేవుని పండగౌనా?

కాముడై లగ్గమెట్టి కబురుపెడితే వారమేల? వర్జమేల? వల్లమాలిన వంకలేల?

ముసురుకున్న ముద్దులన్నీ మూడుముళ్ళ గుత్తులైతే ..కలవరించు పొద్దులన్ని..ఈ..ఈ.. కాగిపోయి కౌగిలైతే...

మూడు బురుజుల కోట.. ముత్యాల తోట
సందిట్లో వయ్యారి మరదలికి.. సరసాల మూట ...
లాలేలో లిల్లేలేలో రామలావొయిలాల అమ్మలాలో
లాలేలో లిల్లేలేలో రామలావొయిలాల అమ్మలాలో...


*******  *******  *******


చిత్రం: సూత్రధారులు (1989)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం:  యస్.పి.బాలు, మనో 

పల్లవి:
మహారాజరాజ శ్రీ మహనీయులందరికీ వందనాలు.. వంద వందనాలు
మహారాజరాజ శ్రీ మహనీయులందరికీ వందనాలు.. వంద వందనాలు
హరిహరులను సేవించే ఈ దాసులాడేటి తందనాలూ.. తకిట తందనాలూ
హరిహరులను సేవించే ఈ దాసులాడేటి తందనాలూ.. తకిట తందనాలూ

వందనాలూ.. వంద వందనాలూ
తందనాలూ.. తకిట తందనాలూ

చరణం: 1
సన్నాయి స్వరమెత్తి చిన్నారి బసవన్నా..
చెన్నార చిందాడ కన్నార కనులారా

సిరులిచ్చే దీవించే సింహాదిరప్పన్నా..
సిరిగజ్జలల్లాడ చెవులార విన్నారా

ముంగిళ్ళ బసవన్నా మురిసీ ఆడేవేళా..
ముంగిళ్ళ బసవన్నా మురిసీ ఆడేవేళా
గుండె గుడిలో శివుడు మేలుకోవాలా
కోదండ రామన్నా.. గోవుల్ల గోపన్నా...
కోలాటమాడుతూ కొలువూ తీరాలా..

మహారాజ రాజశ్రీ మహనీయులందరికి.. వందనాలూ వంద వందనాలూ
తందనాలూ తకిట తందనాలూ
వందనాలూ వంద వందనాలూ


*******  *******  *******


చిత్రం:  సూత్రధారులు (1989)
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం:  సినారె
గానం:  యస్. పి. శైలజ 

పల్లవి:
జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా.. జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా.. నిత్యమల్లే పూల జోలా

జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా.. జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా.. నిత్యమల్లే పూల జోలా

లొలొలొలొలొ హాయి.. హాయే...
లొలొలొలొలొ హాయి.. హాయే

చరణం: 1
ఆ..ఆ.. రేపల్లే గోపన్నా రేపు మరచి నిదరోయే రేపు మరచి నిదరోయే
యాదగిరి నరసన్నా ఆదమరచి నిదరోయే ఆదమరచి నిదరోయే

ఏడుకొండల ఎంకన్నా ఎప్పుడనగా నిదరోయే ఎప్పుడనగా నిదరోయే
కోడె పిల్లాడా నీకేమో కునుకైనా రాదాయే కునుకైనా

లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే
జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా.. జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా.. నిత్యమల్లే పూల జోలా

చరణం: 2
మీనావతారమెత్తి మేని చుట్టు రాబోకురా
అరెరెరెరె యాహి యాహి యాహి యాహి యాహి యాహి
యాహి యాహి యాహి యాహి యాహి యాహి
కృష్ణావతారమెత్తి కోకలెత్తుకు పోబోకురా
అయ్యయయ్యో యాహి యాహి యాహి యాహి యాహి యాహి
హా హా హ హా హా.. హాహాహాహా

వామనావతరమెత్తి.. వామనావతరమెత్తి.. సామిలాగా ఐపోకు
బుద్ధావతారమెత్తి బోధి చెట్టుని అంటి ఉండకు
రఘు వంశ తిలకుడివై రాముడివై రమణుడివై.. రాముడివై రమణుడివై
సీతతోనే ఉండిపోరా గీత నువ్వే దిద్దిపోరా
ఈ సీతతోనే ఉండిపోరా నా గీత నువ్వే దిద్దిపోరా
లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే

జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా
లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే


*******  *******  *******


చిత్రం:  సూత్రధారులు (1989)
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం:  సినారె
గానం:  యస్.పి.బాలు, యస్.పి.శైలజ 

పల్లవి:
అయ్యా... రావయ్యా...
కొలిచినందుకు నిన్ను కోదండరామా
కొలిచినందుకు నిన్ను కోదండరామా
కోటిదివ్వెల పాటి కొడుకువైనావా

తలచినందుకు నిన్ను దశరథ రామా
వెండికొండలసాటి తండ్రివైనావా

జయ రామా.. జగదభి రామా
పరంధామా.. పావన నామా
జయ రామా.. జగదభి రామా
పరంధామా.. పావన నామా

చరణం: 1
బుడిబుడి నడకల బుడతడవై.. ఒడిలో ఒదిగిన ఓ రయ్యా
బుడిబుడి నడకల బుడతడవై.. ఒడిలో ఒదిగిన ఓ రయ్యా
కలల పంటగా...  బతుకు పండగా
కలల పంటగా...  బతుకు పండగా
కల్యాణ రాముడిలా కదలి వచ్చావా

జయ రామా.. జగదభి రామా
పరంధామా.. పావన నామా
జయ రామా.. జగదభి రామా
పరంధామా.. పావన నామా

చరణం: 2
నడిచే నడవడి ఒరవడిగా... నలుగురు పొగడగా ఓరయ్యా
నడిచే నడవడి ఒరవడిగా... నలుగురు పొగడగా ఓరయ్యా
నీతికి పేరుగా...  ఖ్యాతికి మారుగా
నీతికి పేరుగా...  ఖ్యాతికి మారుగా
సాకేతరాముడిలా సాగిపోవయ్యా

జయ రామా.. జగదభి రామా
పరంధామా.. పావన నామా
జయ రామా.. జగదభి రామా
పరంధామా.. పావన నామా

చరణం: 3
ఎంతటి వాడోయ్... రామ చంద్రుడు
ఎంతటి వాడోయ్... రామ చంద్రుడు
ఆ తాటకిని చెండాడినాడోయ్... యాగమును కాపాడినా
డెంతటి వాడోయ్ రామ చంద్రుడు
ఓహో డెంతటి వాడోయ్ రామ చంద్రుడు

హొయ్ మిధిలకు వచ్చీ...  రామయ్య రాముడు
శివునిల్లు విరిచీ.. రామయ్య రాముడు
ఓహో సీతను చేపట్టి..  రామయ్య రాముడు
హొయ్ హొయ్ సీతను చేపట్టి.. రామయ్య రాముడు
సీతారాముడు అయ్యేదెపుడు

జయ రామా.. జగదభి రామా
పరంధామా.. పావన నామా
జయ రామా.. జగదభి రామా
పరంధామా.. పావన నామా

శివ (1989)




చిత్రం: శివ (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర


ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్
సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్నుగీటితే...
చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే

ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్

చరణం: 1
గాలి మళ్లుతున్నది పిల్ల జోలికెళ్లమన్నది
లేత లేతగున్నది పిట్టకూతకొచ్చి ఉన్నది
కవ్వించే మిస్సు కాదన్నా కిస్సు
నువ్వైతే ప్లస్సు ఏనాడో యస్సు
క్లోజప్పులో కొత్త మోజిప్పుడే వింతగా ఉంటే
మోహాలలో పిచ్చి దాహాలతో మత్తుగా ఉంటే
వెన్నెలంటి ఆడపిల్ల వెన్నుతట్టి రెచ్చగొట్టగా  సరాగమాడే వేళ

ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్
సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్నుగీటితే...
చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే

చరణం: 2
లైఫు బోరుగున్నది కొత్త కైపు కోరుతున్నది
గోల గోలగున్నది ఈడు గోడదూకమన్నది
నువ్వే నా లక్కు నీ మీదే హక్కు
పారేస్తే లుక్కు ఎక్కింది కిక్కు
నీ బాణమే కొంటె కోణాలతో మెత్తగా తాకే
నా ఈలకే ఒళ్లు ఉయ్యాలగా హాయిగా తేలేలే
సింగమంటి చిన్నవాడు చీకటింట దీపమెట్టగా
వసంతమాడే వేళ

ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్
సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్నుగీటితే
చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే
ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్



***********   ***********  *********



చిత్రం: శివ (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో, ఎస్. జానకి

సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు
విరహాల గోల ఇంకానా వీలు కాదు
సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు
విరహాల గోల ఇంకానా వీలు కాదు
వంటిట్లో గారాలు ఒళ్ళంతా కారాలే సారు
చురుకైన ఈడు ఒద్దన్నా ఊరుకోదు
విరజాజి పూలు వంటిట్లో వాడరాదు

సూర్యుడే చుర చుర చూసినా
చీరనే వదలడు చీకటే చెదిరినా
కాకులే కేకలు వేసినా కౌగిలే వదలను వాకిలే పిలిచినా
స్నానానికే సాయమే రావాలనే తగువా
నీ చూపులే సోకుగా కావాలనే సరదా
పాపిడి తీసి పౌదరు పూసి బైటికే పంపేయనా
పైటతో పాటే లోనికిరానా పాపలా పారాడనా
తియ్యగ తిడుతూనే లాలించనా

సరసాలు చాలు శ్రీవారు తాన నాన
విరహాల గోల ఇంకానా ఊహు ఊహు

కొత్తగా కుదిరిన వేడుక
మత్తుగా పెదవుల నీడకే చేరదా
ఎందుకో తికమక తొందర
బొత్తిగా కుదురుగ ఉండనే ఉండడా
ఆరారగా చేరక తీరేదెలా గొడవా
ఆరాటమే ఆగదా సాయంత్రమే పడదా
మోహమే తీరే ఊతమే రాదా మోజులే చెల్లించవా
జాబిలే రాడా జాజులే తేడా రాతిరే రాదా ఇక
ఆగదే అందాక ఈడు గోల

చురుకైన ఈడు ఒద్దన్నా ఊరుకోదు
విరజాజి పూలు వంటిట్లో వాడరాదు
ఊరించే దూరాలు ఊ అంటే తియ్యంగ తీరు
సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు


**********    **********   *********


చిత్రం: శివ (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ

బోటని పాఠముంది మ్యాటని ఆట ఉంది
దేనికో ఓటు చెప్పరా...
హిస్టరీ లెక్చరుంది మిస్టరీ పిక్చరుంది
సోదరా ఏది బెస్ట్ రా
బోటని క్లాసంటే బోరు బోరు
హిస్టరీ రొష్టు కన్న రెస్ట్ మేలు
పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు
బ్రేకులు డిస్కోలు చూపుతారు

జగడ జగడ జగడ జగడ జాం (4)

దువ్వెనే కోడిజుట్టు నవ్వెనే ఏడ్చినట్టు
ఎవ్వరే కొత్త నవాబు
కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు
ఎవ్వరి వింత గరీబు
జోరుగా వచ్చాడే జేమ్స్ బాండ్
గీరగా వేస్తాడే ఈల సౌండ్
నీడలా వెంటాడే వీడి బ్రాండ్
ఫోజులే చూస్తుంటే ఒళ్ళు మండు

జగడ జగడ జగడ జగడ జాం (4)

అయ్యో మార్చినే తలుచు కుంటే
మూర్చలే ముంచుకొచ్చే
మార్గమే చెప్పు గురువా
ఆ చి తాళం రాదు మార్చట మార్చి
తాళం లో పాడురా వెధవా
మార్చినే తలుచు కుంటే
మూర్చలే ముంచుకొచ్చే
మార్గమే చెప్పు గురువా
కొండలా కోర్సు ఉంది ఎంతకీ తగ్గనంది
ఏందిరా ఇంత గొడవా
ఎందుకీ హైరానా వెర్రినాయన
వెళ్ళరా సులువైన దారిలోన
ఉందిరా సెప్టెంబర్ మార్చి పైన
హోయ్ వాయిదా పద్దతుంది దేనికైనా

మాక్సిమం మార్కులిచ్చు
మాథ్స్ లో ధ్యాస ఉంచు
కొద్దిగా ఒళ్ళు వంచురా ఒరేయ్
తందన తందనాన తందన తందనాన
తందన తందనాననా
క్రాఫ్ పై ఉన్న శ్రద్ధ గ్రాఫ్ పై పెట్టు కాస్త
ఫస్ట్ రాంక్ పొందవచ్చురా తందన
అరె ఏం సర్
లెక్కలు ఎక్కాలు తెల్వనోళ్లు
లక్కుతోని లచ్చలల్లో మునిగిపోతరు
పుస్తకాల్తో కుస్తీలు పట్టేటోళ్లు
సర్కారు క్లర్క్ అయ్యి మురిగిపోతరు

జగడ జగడ జగడ జగడ జాం (4)


********    *********   *********


చిత్రం: శివ (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఎన్నియల్లో.. మల్లియల్లో.. ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో.. తుళ్ళింతల్లో.. ఎన్నెన్ని కావ్యాలో
ఒంపుల్లో ఉన్న హంపి శిల్పాలు
ఒళ్ళంటుకుంటె చాలు నాట్యాలు
శృంగార వీణ రాగాలే... హోయ్!

ఎన్నియల్లో మల్లియల్లో.. ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో తుళ్ళింతల్లో.. ఎన్నెన్ని కావ్యాలో


సిగ్గేయగా.. బుగ్గ మొగ్గ.. మందార ధూళే దులిపే
జారేసినా.. పైటంచునా.. అబ్బాయి కళ్ళే నిలిచే
సందిళ్ళకే చలి వేస్తుంటే.. అందించవా సొగసంతా
ఒత్తిళ్ళతో ఒలిచేస్తోంటే.. వడ్డించనా వయసంతా
వెలుగులో కలబడే కళలు కన్నా
తనువులో తపనలే కదిపిన కధకళి లోనా

ఎన్నియల్లో.. మల్లియల్లో.. ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో.. తుళ్ళింతల్లో.. ఎన్నెన్ని కావ్యాలో

ఈ చీకటే.. ఓ చీరగా.. నా చాటు అందాలడిగే
ఈ దివ్వెలా.. క్రీనీడలే.. నీ సోకులన్నీ కడిగే
నీ మబ్బులే గుడి కడుతుంటే .. జాబిల్లిలా పడుకోనా
తబ్బిబుతో తడబడుతుంటే.. నీ గుండెలో నిదరోనా
ఉదయమే అరుణమై.. ఉరుముతున్నా
చెదరని నిదరలో.. కుదిరిన పడకలలోనా

ఎన్నియల్లో.. మల్లియల్లో.. ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో.. తుళ్ళింతల్లో.. ఎన్నెన్ని కావ్యాలో
ఒంపుల్లో ఉన్న హంపి శిల్పాలు
ఒళ్ళంటుకుంటె చాలు నాట్యాలు
శృంగార వీణ రాగాలే... హోయ్!

ఎన్నియల్లో మల్లియల్లో ఎన్నెన్ని అందాలో
లలలల..లలలలలా..

లంకేశ్వరుడు (1989)

 

చిత్రం: లంకేశ్వరుడు (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: మనో, యస్. జానకి


జివ్వుమని కొండగాలి
కత్తిలా గుచ్చుతోంది
వెచ్చనీ.. కోరికా.. రగిలిందిలే
నీవే నా ప్రేయసివే
నీకేలే అందుకో ప్రేమ గీతం

కస్సుమని పిల్లగాలి
నిప్పులా అంటుతోంది
తియ్యనీ.. కానుకా.. దొరికిందిలే
నీవే నా ప్రేమవులే
నీకేలే అందుకో ప్రేమ గీతం

జివ్వుమని కొండగాలి
కత్తిలా గుచ్చుతోంది

ఒంపుల్లో సొంపుల్లో అందముంది
కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది
ఒంపుల్లో సొంపుల్లో అందముంది
కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది
కాశ్మీర కొండల్లో అందాలకే
కొత్త అందాలు ఇచ్చావో...
కాశ్మీర వాగుల్లో పరుగులకే
కొత్త అడుగుల్ని నేర్పావో...
నేనే నిను కోరి చేరి వాలి పోవాలి

కస్సుమని పిల్లగాలి
నిప్పులా అంటుతోంది

మంచల్లే కరగాలి మురిపాలు
సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు
మంచల్లే కరగాలి మురిపాలు
సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు
కొమ్మల్లొ పూలన్ని పానుపుగా
మన ముందుంచే పూలగాలీ...
పూవుల్లొ దాగున్న అందాలనే
మన ముందుంచే గంధాలుగా...
నేనే నిను కోరి చేరి వాలి పోవాలి

జివ్వుమని కొండగాలి
కత్తిలా గుచ్చుతోంది
కస్సుమని పిల్లగాలి
నిప్పులా అంటుతోంది


*********  *********   ********


చిత్రం: లంకేశ్వరుడు (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: మనో, యస్. జానకి

ఏ బాబు ఎ ఎ బాబు ఏదో ఒకటి చేద్దాం బాబు
నిన్నటి కల్లో మొన్నటి కల్లో నిన్నటి కల్లో మొన్నటి కల్లో
తల్లో ఒళ్ళో  హోలు మొత్తం నువ్వే నువ్వే బాబు
ఏ పాప ఎ ఎ పాప ఏదో ఒకటి చేద్దాం పాప
నిన్నటి కల్లో మొన్నటి కల్లో నిన్నటి కల్లో మొన్నటి కల్లో
తల్లో ఒళ్ళో హోలు మొత్తం నువ్వే నువ్వే నువ్వే పాప

ఏ బాబు ఎ ఎ బాబు ఏదో ఒకటి చేద్దాం బాబు

బుస గొట్టె నాగుల్లాగ నువ్వు నేను రేగాలి
కసి తిరా కింద మీదా ఆడాలి
సడి రేగి గుండల్లోన నన్నె చుట్టుకుపొవలి
చలరేగి మంటల్లోన కాల్చాలి
ఇది ఏమి సరుకో - అమ్మయి చురుకో
ఇది ఏమి సరుకో - అమ్మయి చురుకో
తాకిందమ్మో - సోకిందమ్మో
రేగిందమ్మో  - లేచిందమ్మో
తల్లో ఒళ్ళో హోలు మొత్తం నువ్వే నువ్వే బాబు

ఏ బాబు ఎ ఎ బాబు ఏదో ఒకటి చేద్దాం బాబు

విసిరేసే గాలి వాన నీలో నాలో కురవాలి
తడిపేసి నాలో నిన్ను కలపాలి
పడి లేచే  కెరటాలల్లె ఆటుపోటు చూడాలి
అసలైన లోతుల్లోన మునగాలి
ఇది ఏమి సలుపో  - అమ్మాయి బులుపో
ఇది ఏమి సలుపో  - అమ్మాయి బులుపో
కాటేసింది - వాటెసింది
తడిమేసింది - కుదిపేసింది
తల్లో ఒళ్ళో హోలు మొత్తం నువ్వే నువ్వే బాబు

ఏ పాప ఎ ఎ పాప ఏదో ఒకటి చేద్దాం పాప
నిన్నటి కల్లో మొన్నటి కల్లో నిన్నటి కల్లో మొన్నటి కల్లో
తల్లో ఒళ్ళో హోలు మొత్తం నువ్వే నువ్వే నువ్వే పాప
ఏ బాబు ఎ ఎ బాబు ఏదో ఒకటి చేద్దాం బాబు
ఏ పాప ఎ ఎ పాప ఏదో ఒకటి చేద్దాం పాప


*********  *********  *********


చిత్రం:  లంకేశ్వరుడు (1989)
సంగీతం:  రాజ్-కోటి
సాహిత్యం:  దాసరి
గానం:  యస్.పి.బాలు,  జానకి

పల్లవి:
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
పదహారేళ్ళ వయసు
పడిపడి లేచే మనసు

పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో

చరణం: 1
రెండు రెండు కళ్ళు.. చూడ చూడ ఒళ్ళు
వేడి వేడి సెగలు.. ప్రేమ కోరు పొగలు
చూడ గుండె ఝల్లు.. లోన వానజల్లు
లేనిపోని దిగులు.. రేయిపగలు రగులు
ఆడ పిల్ల సబ్బు బిళ్ళ రాసుకుంటే
కన్నె పిల్ల అగ్గి పుల్ల రాజుకుంటే
ఆడ పిల్ల సబ్బు బిళ్ళ.. కన్నె పిల్ల అగ్గి పుల్ల
రాసుకుంటే.. రాజుకుంటే

పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు

చరణం: 2
పిల్లదాని ఊపు .. కుర్రకారు ఆపు
పైన చూడ పొగరు..  లోన చూడ వగరు
పిల్ల కాదు పిడుగు..  గుండె కోసి అడుగు
దాచలేని ఉడుకు..  దోచుకోని సరుకు
అందమైన ఆడపిల్ల పట్టుకుంటే
చూడలేక చందమామ తప్పుకుంటే
అందమైన ఆడపిల్ల..  చూడలేక చందమామ
పట్టుకుంటే తప్పుకుంటే

పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు

పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో

స్వాతిచినుకులు (1989)




చిత్రం: స్వాతిచినుకులు (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: మనో, జానకి


మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..లాలలా..లాలలాల
నిన్ను కన్నా..మనసు విన్నా
ఎదలో..మోహనాలాపన..ఆ

నీడలోనా..వెలుగులోనా
అనుబంధాల..ఆరాధన..ఆ

నాకు నీవు...నీకు నేను
తోడు వుందాము..ఏడేడు జన్మలెత్తినా

నిన్ను కన్నా..మనసు విన్నా
ఎదలో..మోహనాలాపన..ఆ
నిన్ను కన్నా..

నీ కళ్ళు పాడేటి..కధలు..ఊఊఊ
అధరాలలో..పొంగు సుధలు..ఊఊఉ
ఇటు ప్రేమించుకున్నాక..ఎదలు..ఊఊఊ
పేరంట మాడేటి...పొదలు..ఊఊఊఉ
చేమంతిపూల..సీమంతమాడే
హేమంత వేళ..ఈ రాసలీల
వెయ్యేళ్ళ వెన్నెల్లు..కాయాలిలే

నిన్ను కన్నా..మనసు విన్నా
ఎదలో..మోహనాలాపన..ఆ

నాకు నీవు...నీకు నేను
తోడు వుందాము..ఏడేడు జన్మలెత్తినా

నిన్ను కన్నా..మనసు విన్నా

కౌగిళ్ళలో పండు..కలలు..ఊఊఉ
వేవిళ్లలో దాటు..నెలలు..ఊఊఊ
బిగిసందిళ్లకేటందు..కళలు..ఊఊఉ
సందేళ మందార..గెలలు..ఊఊఉ
రాసేదికాదు..ఈ చైత్రగీతం
రాగాలు తీసే..ఈ ప్రేమవేదం
పూలారబోసింది..ఈ తోటలో

నిన్ను కన్నా..మనసు విన్నా
ఎదలో..మోహనాలాపన..ఆ

నీడలోనా..వెలుగులోనా
అనుబంధాల..ఆరాధన..ఆ

నాకు నీవు..ఆ..నీకు నేను..ఆ
తోడు వుందాము..ఏడేడు జన్మలెత్తినా

నిన్ను కన్నా..మనసు విన్నా
ఎదలో..మోహనాలాపన..ఆ
నిన్ను కన్నా..

కొండపల్లి రాజా (1993)

చిత్రం: కొండపల్లి రాజా (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: మనో , చిత్ర
నటీనటులు: వెంకటేష్ , సుమన్ , నగ్మా
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: కె.వి.వి.సత్యనారాయణ
విడుదల తేది: 09.07.1993

అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మా
వచ్చాడే చీర దొంగ తీర్చాడే సిగ్గు బెంగ
సందేళ్ళ సామిరంగ చందమమల్లే హొయ్ హొయ్ హోయ్
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా
ఏదారి కాయాలంట గోదారి ఈ దాలంట
వయ్యారి పాలపిట్ట పాడుతుంటే హాయ్ హాయ్ హోయ్
తగులుతున్న తాకిడి
మొగళి తేనె దోపిడి
నా సోకు వేసింది మారాకు
అట్టైతె నాదే నీ నాజూకు

అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మా
వచ్చాడే చీర దొంగ తీర్చాడే సిగ్గు బెంగ
సందేళ్ళ సామిరంగ చందమమల్లే హొయ్ హొయ్ హోయ్
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా

కోరస్:
గొల్లవాడే గొల్లపిల్లవాడే
పాలవాడే మీకు ఈడు జోడే

పాలుగారే బుగ్గా మొగ్గా పిండేస్తా
మల్లె పూలల్లోని సోకు నీకు దండేస్తా
పాలే పంచి పక్కంగాను తోడేస్తా
నువ్వు పాలిస్తుంటే పండుచెండు విందిస్తా
రాగాల రాస లీలల్లో రగడ
నీకేర రాతిరేలల్లో మగడా
పాలరాతి మందిరం
పంచదార పంజరం
నా గోల వేసెటి ఈలలుతో  నీ వెన్న జున్ను వేడెక్కిస్తా

అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మా
వచ్చాడే చీర దొంగ తీర్చాడే సిగ్గు బెంగ
సందేళ్ళ సామిరంగ చందమమల్లే హొయ్ హొయ్ హోయ్

మణిక్యాల మెడలోన మారాజ
నీకు అందిస్తున్నా స్త్రీ రోజా
వోణి కొద్ది బోణి కొట్టే పూబోణి
నీకు రాసిస్తాలే మల్లెల్లోని మాగాణి
యుద్దాలు చేసుకుందామా చలిలో
అందాలు పూసుకుంటాలే జతలో
వలపు కోట వాయణం
వయసు కోరు శోభనం
నీతోటి కొలువున్న వేళలలో
ఈ రోజా పూజా రాజా నీకే

అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మా
వచ్చాడే చీర దొంగ తీర్చాడే సిగ్గు బెంగ
సందేళ్ళ సామిరంగ చందమమల్లే హొయ్ హొయ్ హోయ్
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా
ఏదారి కాయాలంట గోదారి ఈ దాలంట
వయ్యారి పాలపిట్ట పాడుతుంటే హాయ్ హాయ్ హోయ్
తగులుతున్న తాకిడి
మొగళి తేనె దోపిడి
నా సోకు వేసింది మారాకు
అట్టైతె నాదే నీ నాజూకు