అరె అరె అరె ఆరారే ఇదేమిటో ఇదేమిటో
గుండెల్లో ఏదో బరువవుతుందమ్మో
నీ ప్రేమ నాకు కావాలి
నా పేరు చివర పేరల్లే నువు నిలవాలీ
రాజు నువ్వే కావాలి
నీ రాణి నేనే అవ్వాలి
శ్వాసలో శ్వాసనై నిను కలవాలి
గుండె లోలోతుల్లో నిన్ను దాచుకోవాలి
పంచ ప్రాణాలుగా నిన్ను పెంచుకోవాలి
ఏ జన్మకైనా నాకు తోడు నువ్వే కావాలి
నీ నీడ నాకు లాలి పాడాలి
ఓ నువ్వు నాకు కావాలి
నీ ప్రేమ నాకు కావాలి
నా పేరు చివర పేరల్లే నువు నిలవాలీ
ఒక్క క్షణం ముందుగా యెద సవ్వడిలా లేదుగా
ఏం జరిగిందే ఇంతలోనె మాయగా మాయగా
ఓ పచ్చదనం నిండుగా
ఓ కొత్తదనం పండుగా
నా మనసంతా అల్లుకుంది హాయిగా
నీ మారుతున్న తీరుతెన్ను ముచ్చటగా వుందే
ఏ పూల బాణం గుచ్చుకుందే సూటిగా
అంత దూరానున్నా చెంత చేర్చావుగా
అనుకున్నంత అయ్యేంతగా
ఓ ఊపిరిలో కోరికా వున్న చోటే ఆగకా
నీ చిరునామా చేరుకుంది తిన్నగా సన్నగా
ఓ చేరువయే తారకా నిను కదననే లేనికా
నీ కళలన్ని పంచుకుంట కమ్మగా హా
మది భారమంతా నీకు పంచి తేలిక పడుతున్నా
కనురెప్ప నేడు బరువయ్యిందే వింతగా
ప్రేమ మొదలైందిలా నాలో తొలిసారిగా
నమ్మలేనంత గిలిగింతగా ఓఓఓ
ఓ నువ్వు నాకు కావాలి
నీ ప్రేమ నాకు కావాలి
నా పేరు చివర పేరల్లే నువు నిలవాలీ
నాననానన నాననానన
