Showing posts with label అరుణ కిరణం (1986). Show all posts
Showing posts with label అరుణ కిరణం (1986). Show all posts

అరుణ కిరణం (1986)

చిత్రం :  అరుణ కిరణం (1986)
సంగీతం :   చక్రవర్తి
గీతరచయిత :  అదృష్ట దీపక్
నేపథ్య గానం :  బాలు, జానకి


పల్లవి :
అందెనా బృందావనీ పొంగెనా మందాకిని
పాపల్లే పారాడనా నీ పాదాలు ముద్దాడనా 

మపపదనిసరి గమపమపమప
ససనిస దమదసనిసగ
అందెనా బృందావనీ... పొంగెనా మందాకిని


చరణం 1 :

ప్రభాతాల కాంతులే... శుభలేఖ రాయగా
వసంతాల వన్నెలే... పారాణి తీర్చగా

కిలకిల నవ్వే కిరణాలే... తొరగలు వేసే హరిణాలై
ఊగాలి హృదయాలు... తలలూపాలి గగనాలు

మపపదనిసరి గమపమపమప
ససనిస దమదసనిసగ 

అందెనా బృందావనీ ... పొంగెనా మందాకిని

చరణం 2 :

ఎదిగి ఉన్న కోరికా.. మొదటి ముద్దు మీటగా
ఎదుగుతున్న తీపితో... పెదవి హద్దు దాటగా

తీరని తలపులు మల్లికలై... తీయగ కుదిరిన అల్లికలై
సాగాలి మన బ్రతుకు... కొనసాగాలి కడ వరకు

మపపదనిసరి గమపమపమప
ససనిస దమదసనిసగ 

అందెనా బృందావనీ...  పొంగెనా మందాకిని
పాపల్లే పారాడనా...  నీ పాదాలు ముద్దాడనా