Showing posts with label sandeep chowta. Show all posts
Showing posts with label sandeep chowta. Show all posts

సలీం (2009)

చిత్రం: సలీం (2009)
సంగీతం: సందీప్ చౌత
సాహిత్యం: చంద్రబోస్ (All Songs)
గానం: నిఖితా నిగమ్


ఈవేళలో హాయిలోమాయలో మాటరాని మత్తులో
i wanna talk to you
i wanna talk to you
హొయ్ ఒయ్ ఒయ్ హొయ్ ఒయ్ ఒయ్
నేనిన్నాళ్ళు నన్నే దాచి ఉన్నాను నాఊహలో
హొయ్ ఒయ్ ఒయ్ హొయ్ ఒయ్ ఒయ్
నేనీనాడు నన్నేదాటి ఉ౦డాలి నీ గు౦డెలో
i wanna talk to you
i wanna talk to you

పెదాలలో ప్రక౦పనే తొలి సాక్ష్య౦
పదాలలో ప్రవాహమే మలి సాక్ష్య౦
చెక్కిళ్ళలో సి౦ధూరమే చిరు సాక్ష్య౦
నా కళ్ళలో సముద్రమే తుది సాక్ష్య౦
అణువణువు నేడు అనేక గొ౦తులై
కణకణముకూ స్వరాల త౦త్రులై
ఒకే మాటనీ సదా స్మరి౦చుతున్నా
అదేమాటనీ చెప్పేస్తూ ఉన్నా..
i love you! i love you!
ఏ౦చేయనూ ఏమని చెప్పనూ
what do i do without you !
i wanna talk to you
i wanna talk to you

వెన్నెల్లలో అ౦ది౦చనా ఆహ్వాన౦
కన్నీళ్ళతో చేయి౦చనా అభిషేక౦
కౌగిళ్ళలొ దాచేయనా నీస్నేహ౦
ప్రాణాలలో ని౦పేయనా నీరూప౦
నీ శ్వాసలోన సుమాలగాలినై
నీ కాళ్ళ లోన సుగ౦ధ ధూలినై
ఎన్నో మాటలూ వినిపి౦చు వీలులేక
ఒకే మాటతో వివరి౦చేస్తున్నా
i love you i love you!
ఏ౦చేయనూ ఏమనీ చెప్పనూ
what do i do without you
i wanna talk to you
i wanna talk to you

జోష్ (2009)

చిత్రం: జోష్ (2009)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్


నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు
నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు

నిన్నిప్పుడు చూస్తే చాలు
చిన్నప్పటి చిలిపి క్షణాలు
గుండెల్లో గువ్వల గుంపై వాలు
నీతో అడుగేస్తే చాలు
మునుముందుకు సాగవు కాళ్ళు
ఉంటుందా వెనకకి వెళ్ళే వీలు
కాలాన్నే తిప్పేసిందీ లీలా
బాల్యాన్నే రప్పించిందీవేళా
పెద్దరికాలన్నీ చినబోయేలా
పొద్దెరగని మరుపేదో పెరిగేలా

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు

నిలబడి చూస్తాయే ఆగి లేళ్ళు సెలయేళ్ళు
చిత్రంగా నీవైపలా
పరుగులు తీస్తాయే లేచి రాళ్ళు రాదార్లు
నీలాగా నలువైపులా
భూమి అంత నీ పేరంటానికి బొమ్మరిల్లు కాదా
సమయమంత నీ తారంగానికి సొమ్మసిల్లి పోదా
చేదైనా తీపౌతుందే నీ సంతోషం చూసీ
చెడు కూడా చెడుతుందే నీ సావాసాన్ని చేసి
చేదైనా తీపౌతుందే నీ సంతోషం చూసి
చెడు కూడా చెడుతుందే నీ సావాసాన్ని చేసి

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు

నువ్వేం చూస్తున్నా ఎంతో వింతల్లే అన్నీ
గమనించే ఆశ్చర్యమా
యే పనిచేస్తున్నా ఏదో ఘనకార్యం లాగే
గర్వించే పసిప్రాయమా
చుక్కలన్ని దిగి నీ చూపుల్లో కొలువు ఉండిపోగా
చీకటన్నదిక రాలేదే నీ కంటిపాప దాకా
ప్రతి పూట పండుగలాగే ఉంటుందనిపించేలా
తెలిసేలా నేర్పేటందుకు నువ్వే పాఠశాల
ప్రతి పూట పండుగలాగే ఉంటుందనిపించేలా
తెలిసేలా నేర్పేటందుకు నువ్వే పాఠశాల

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు

నిన్నిప్పుడు చూస్తే చాలు
చిన్నప్పటి చిలిపి క్షణాలు
గుండెల్లో గువ్వల గుంపై వాలు
కాలాన్నే తిప్పేసిందీలీలా
బాల్యాన్నేరప్పించిందీవేళా
పెద్దరికాలన్నీ చినబోయేలా
పొద్దెరగని మరుపేదో పెరిగేలా

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు


*********   *********   *********


చిత్రం: జోష్ (2009)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: బెన్నీ దయాల్, రంజిత్

ఆగే పీచే ఆలోచిస్తే సాగలేవోయ్ సందేహిస్తే
సాహసంగా ముందడుగేస్తే ఈ క్షణం నీదిరా
ఏ పనైనా చెయ్యాలంటే నిర్ణయం నీదవ్వాలంతే
నిప్పు నైనా నేర్పుగ దాటే యవ్వనం నీదిరా
బీ కేర్ ఫుల్ మాటలో అర్ధమేం వున్నా గాని
నీలో ఫియర్ లేదనీ అందరూ చూడని
లేలో డియర్ ఇప్పుడే ఎదురయేఅవకాశాన్ని
నౌ ఆర్ నెవెర్ తెలుసుకో సత్యాన్ని
I am a bad bad boy, bad bad boy
I am a bad bad boy
I am a bad bad boy, bad bad boy
అని ఎవరు అనుకొనీ

ఆగే పీచే ఆలోచిస్తే సాగలేవోయ్ సందేహిస్తే
సాహసంగా ముందడుగేస్తే ఈ క్షణం నీదిరా

చరణం: 1
లోకమెంతో పెద్దది కాదుర పొల్చుకుంటే చిన్నదే చూడర
చీకటి లేని వేకువ రాని చోటసలెక్కడ వున్నది సోదరా
ఇష్టమైతే సమ్మర్ హీట్ చల్లగ అనిపిస్తుంది
నచ్చకుంటే చంద్రుడి లైట్ నల్లగా కనిపిస్తుంది
ఏదో ట్రబుల్ ఉండదా స్వర్గలొకంలో ఐనా
డైలీ స్ట్రగుల్ తప్పదే ఎక్కడున్నా
I am a bad bad boy, bad bad boy
I am a bad bad boy
I am a bad bad boy, bad bad boy
అని ఎవరు అనుకొనీ

ఆగే పీచే ఆలోచిస్తే సాగలేవోయ్ సందేహిస్తే
సాహసంగా ముందడుగేస్తే ఈ క్షణం నీదిరా

చరణం: 2
లైఫనేది చిన్నది కాదుర బౌండరికి అది అందదు సోదరా
నిన్నలాగే వుండదు నిత్యం రేపు అన్నది సరికొత్త ఉగాదిరా
ఎప్పుడైనా గెలుపును గెలిచే చాన్సు నీకూ ఉన్నదిరా
గాయమైనా హాయనుకుంటే సమరమైనా సరదారా
ఏ రొజు ను అడగదా జీవితం నా సిగ్నేచర్
ఏ హిస్టరీ చదవదా నా చాప్టర్
I am a bad bad boy, bad bad boy
I am a bad bad boy
I am a bad bad boy, bad bad boy
అని ఎవరు అనుకొనీ

ఆగే పీచే ఆలోచిస్తే సాగలేవోయ్ సందేహిస్తే
సాహసంగా ముందడుగేస్తే ఈ క్షణం నీదిరా
ఏ పనైనా చెయ్యాలంటే నిర్ణయం నీదవ్వాలంతే
నిప్పు నైనా నేర్పుగ దాటే యవ్వనం నీదిరా



*********   *********   *********


చిత్రం: జోష్ (2009)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సందీప్ చౌతా, కునాల్ గంజ్ వాలా

ఓయ్ ఓయ్ వయసుకి తోవ చెప్పకొయ్ రైటో లెఫ్టో
ఓయ్ ఓయ్ మనసుకు తోచినట్టు చెయ్ ఓయ్ ఓయ్
ఓయ్ ఓయ్ వయసుకి తోవ చెప్పకొయ్ రైటో లెఫ్టో
ఓయ్ ఓయ్ మనసుకు తోచినట్టు చెయ్ ఓయ్ ఓయ్

ఎన్నాళ్ళు వొళ్ళో వుంటాం పసిపాపలల్లె
భూమ్మీద పాదం పడకుండా
ఎన్నాళ్ళు బళ్ళో వింటాం బెంచీలమల్లే
బూజెత్తి పోదా బ్రైనంతా

డీరి డీరిడీ బీ రెడీ యవ్వనం పరమ కిలాడి
దీని గారడీ చూడనీ తక్షణం వెంటపడి (2)

జోష్… జోష్… జోష్….

చరణం: 1
కళ్ళుండేం లాభం కాలాన్నేం చూస్తాం
క్లాస్రూంలో బ్లాకుబోర్డై చూస్తుంటే
కాళ్ళుండేం లాభం కదలము యేమాత్రం
కాలేజీ ఖైదీలై పడి వుంటే
పాతికేళ్ళకీ పూర్తి కాని ఈ పుస్తకాలతో ఎదురీత
ఎందుకంటె యెం చెప్పగలవు బేటా
జీవితాన్నెలా దాటగలవురా సొంత అనుభవం
లేకుండా అందుచేత ఇది మాయలేడి వేటా
చెప్పిందెలాగా వినరు ఈ కుర్రకారు
అయినా మరెందుకు ఈ పొరు
ఉప్పెనను ఆపేదెవరు పారా హుషారు
మీకే ప్రమాదం మాస్టారు

డీరి డీరిడీ బీ రెడీ యవ్వనం పరమ కిలాడి
దీని గారడీ చూడనీ తక్షణం వెంటపడి (2)

చరణం: 2
ఉరికే వేగంతొ ఊహాలొకం లో
ఊరేగె ఊత్సాహం మా సొంతం
ఆపే హద్దులతో సాగే యుధ్ధంలో
సాధించే స్వాతంత్రం మాకిష్టం
నరనరాలలో ఉడుకుతున్నదీ నిప్పుటేరులా యువరక్తం
నివురు చాటుగా నిద్దరొదు నిత్యం
నీతిగోలతో నోటిగాలితో ఆపలేరుగా ఏ మాత్రం
తెలిసి తెలిసి అసలెందుకంత పంతం
ఓ ఈ జొష్ సాధ్యం కాదా సుడిగాలి లాగ
కామోష్ అవడం మర్యాదా
మా ఫోర్సు క్రైమవుతుందా బోఫోర్సు లాగా
శాబాషు అనుకోడం రాదా

డీరి డీరిడీ బీ రెడీ యవ్వనం పరమ కిలాడి
దీని గారడీ చూడనీ తక్షణం వెంటపడి (2)

With josh if u not had enough
u can get high enough
Say josh if u not had enough
u can get high enough



*********   *********   *********



చిత్రం: జోష్ (2009)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాహుల్ విద్యా, ఉజ్జయిని ముఖర్జీ

పల్లవి:
ఎవ్వరికీ కనపడదే ప్రేమది ఏ రూపం
ఏ చెవికీ వినబడదే ప్రేమది ఏ రాగం
కనకే... అపురాపం కలిగే... అనురాగం

ఎవ్వరికీ కనపడదే ప్రేమది ఏ రూపం
ఏ చెవికీ వినబడదే ప్రేమది ఏ రాగం
కనకే... అపురాపం కలిగే... అనురాగం

అనుపల్లవి:
ఎదలోనే కొలువున్నా ఎదురైనా పోల్చలేక
నిజమేలే అనుకున్నా రుజువేది తేల్చలేక
మరెలా... ఆ... ఆ... ఆ...

ఎవ్వరికీ కనపడదే ప్రేమది ఏ రూపం
ఏ చెవికీ వినబడదే ప్రేమది ఏ రాగం

చరణం: 1
దారి అడగక పాదం నడుస్తున్నదా
వేళ తెలుపక కాలం గడుస్తున్నదా
తడి ఉన్నదా... ఎదలో తడిమి చూసుకో...
చెలిమిగ అడిగితే చెలి చెంత
చిలిపిగ పలకదా వయసంతా
జతపడు వలపులు గుడిగంట
తలపుల తలుపులు తడుతుందా
చూస్తూనే పసికూన ఎదిగిందా ఇంతలోన
చెబితేనే ఇపుడైనా తెలిసిందా ఈ క్షణాన
అవునా... ఆ... ఆ... ఆ...

ఎవ్వరికీ కనపడదే ప్రేమది ఏ రూపం
ఏ చెవికీ వినబడదే ప్రేమది ఏ రాగం

చరణం: 2
కళ్ళు నువ్వొస్తుంటే మెరుస్తున్నవి
వెళ్ళివస్తానంటే కురుస్తున్నవి
కొన్నాళ్ళుగా నాలో ఇన్ని వింతలు ఓహో
గలగల కబురులు చెబుతున్నా
వదలదు గుబులుగ ఘడియైనా
మది అనవలసినదేదైనా పెదవుల వెనకనె అణిగేనా
హృదయంలో వింత భావం పదమేదీ లేని కావ్యం
ప్రణయంలో ప్రియ నాదం వింటూనే ఉంది ప్రాణం
తెలుసా... ఆ... ఆ... ఆ...

ఎవ్వరికీ కనపడదే ప్రేమది ఏ రూపం
ఏ చెవికీ వినబడదే ప్రేమది ఏ రాగం


*********   *********   *********


చిత్రం: జోష్ (2009)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సౌమ్యారావు

పల్లవి:
నువ్వెళ్ళని చోటుంటుందా
నువ్వెరుగని మాటుంటుందా
గాలి నన్ను రానీ నీ వెంటా
నువు చూసొచ్చిన ప్రతి వింతా
నేనెవ్వరికీ చెప్పొద్దా
నీ ఊసులనే ఊకొడుతూ వింటా
ఒక్క చోట నిలవొద్దు అంటూ
తెగ తరుముతున్న ఈ ఉత్సాహం
దారి కోరి నిన్నడుగుతుంది స్నేహం

ఆవారా హవా అదిరిపడి ఔరా అంటావా
హాయిగా నాతో వస్తావా సాయ పడతావా (2)

నువ్వెళ్ళని చోటుంటుందా
నువ్వెరుగని మాటుంటుందా
గాలి నన్ను రానీ నీ వెంటా

చరణం: 1
వేళాపాళా గోళీ మార్ విసిరేసా చూడు వాచీని
అప్పుడప్పుడు నవ్వుదామా టైం టేబుల్ వేసుకుని
దాగుడుమూత దండాకోరు ఎవ్వరికి జాడచెప్పమని
ఇట్టే తప్పించుకోమా ఆపేసే చూపుల్నీ
పట్టకంటు పట్టించుకోని పాటల్లె సాగనీ పొద్దంతా
ఒద్దు అంటూ ఆపేది ఎవ్వరంటా
కాటుకపిట్టల్లా కళ్ళెగిరి వాలిన చోటల్లా
ఎన్ని వర్ణాలో చూడిల్లా తెలుగు పోగుల్లా

ఆవారా హవా అదిరిపడి ఔరా అంటావా
హాయిగా నాతో వస్తావా సాయ పడతావా

చరణం: 2
కిటికీ లోంచి చూడాలా కదిలెళ్ళే అన్ని ఋతువుల్ని
చెయ్యారా తాకరాదా వేకువని వెన్నెల్ని
గుమ్మం బయటే ఆపాలా ఎదురొచ్చే చిన్ని ఆశలని
గుండెల్లో చోటులేదా ఊరించె ఊహలకి
పంజరాన్ని విడిపించుకున్న బంగారు చిలకనై ఈ పూట
ఎగిరి ఎగిరి ఆకాశమందుకుంటా
ఎల్లలు ఆగేనా అల్లరిగ దూకే వేగేనా
అదుపులో ఉంచె వీలేనా నన్ను నేనైనా

ఆవారా హవా అదిరిపడి ఔరా అంటావా
హాయిగా నాతో వస్తావా సాయ పడతావా

నువ్వెళ్ళని చోటుంటుందా
నువ్వెరుగని మాటుంటుందా
గాలి నన్ను రానీ నీ వెంటా (2)

సూపర్ (2005)



చిత్రం: సూపర్ (2005)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అనుష్క మంచంద

మిల మిల మిల మెరిసిన కనులకు
ఎందుకో అసలెందుకో ఈ కలవరములే
చలి చలి చలి గిలి గిలి చలి గిలి
ఏమిటో ఇడి ఏమిటొ ఈ చలి చలి గిలే
బంగారు వీడేనా నా నిండు సెందురూడు
బంగారు వీడేనేమొ నే కలలు కన్న వాడు
బంగారు వీడేనా నా నిండు సెందురూడు
బంగారూ వీడేనేమొ కలలు కన్న మొగుడు
మిల మిల మిల మెరిసిన కనులకు
ఎందుకో అసలెందుకో ఈ కలవరమునా..

ఉన్న చోట ఉండనీడు చూడే వీడు ఊరుకోడు
ఏదొ మాయ చేస్తుంటాడమ్మా....
పొమ్మంటున్నా పోనే పోడు కల్లో కొచ్చి కూర్చుంటాడు
ఆగం ఆగం చేస్తున్నాడమ్మా
ఘడియ ఘడియకి ఓ ఊ ఓ ఊ నడుము తడుముడయ్యో
తడవ తడవకి ఓ ఊ ఓ ఊ చిలిపి చెడుగుడయ్యో
బంగారు వీడేనా నా నిండు సెందురూడు
బంగారు వీడేనేమొ నే కలలు కన్న వాడు
బంగారు వీడేనా నా నిండు సెందురూడు
బంగారూ వీడేనేమొ కలలు కన్న మొగుడు
మిల మిల మిల మెరిసిన కనులకు
ఎందుకో అసలెందుకో ఈ కలవరమునా..
చలి చలి చలి గిలి గిలి చలి గిలి
ఏమిటో ఇడి ఏమిటొ ఈ చలి చలి గిలే

తోడు కోరే తుంటరోడు వీల్లేదన్నా ఊరుకోడు
ప్రాణాలన్ని తోడేస్తాడమ్మా
నవ్వుతాడె అండగాడు ఈడు జోడు బాగుంటాడు
ప్రేమో ఏమొ అవుతున్నాదమ్మా
వలపు తలపులేవో వయసు తెరిచెనేమో
చిలక పలుకులేవో మనసు పలికేనేమో
బంగారు వీడేనా నా నిండు సెందురూడు
బంగారు వీడేనేమొ నే కలలు కన్న వాడు
బంగారు వీడేనా నా నిండు సెందురూడు
బంగారూ వీడేనేమొ కలలు కన్న మొగుడు
మిల మిల మిల మెరిసిన కనులకు
ఎందుకో అసలెందుకో ఈ కలవరమునా..
చలి చలి చలి గిలి గిలి చలి గిలి
ఏమిటో ఇడి ఏమిటొ ఈ చలి చలి గిలే
చలి చలి గిలేనా..చలి చలి గిలేనా..చలి చలి గిలే..నా..


******  ******  ******


చిత్రం: సూపర్ (2005)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: కందికొండ
గానం: సోను కక్కర్

అక్కడ్ బక్కడ్ బొంబై బో
అస్సీ నబ్బీ పూరే సో
తప్పదు మనిషై పుట్టాక
బతకాళి సచ్చే దాకా
పర్సు నిండా డబ్బుంటే బస్ ప్యార్ హువా..ప్యార్ హువా
జేబు ఖాలై రోడ్ న ప్‌డీతే క్యా హూఆ క్యా హూఆ
దొరికినన్థ దోచుకో
దోచుకుందీ దాచుకో
కార్ బంగ్లా తీస్కో
హో లైఫ్ నీదే కుమ్ముకో

చరణం: 1
హాయిరె హాయిరె మనుషులంతా మాయెరే ..
దెఖోరె ......దెఖోరె
హాయిరె హాయిరె లోకమంతా చోరీ లే
సోచొరె ...సోచొరె
నేడు నీకై నీ ముందే నిలు చున్దిరూ...చున్దిరొ
రేపు కోసం ఆరాటం ఆపెయ్యారో వెయ్యారో
నేడు నీకై నీ ముందే నిలు చున్దిరూ...చున్దిరొ
రేపు కోసం ఆరాటం ఆపెయ్యారో వెయ్యారో
దొరికినన్థ దోచుకో
దోచుకుందీ దాచుకో
కార్ బంగ్లా తీస్కో
హో లైఫ్ నీదే కుమ్ముకో

చరణం: 2
హాయిరె హాయిరె దిల్ నిండా లవ్ ఏ రే ఆజా రే ..ఆజా రే
హాయిరె హాయిరె ఇష్క్ విష్క్ నీదెలె లేజారే ..లేజారే
గుండె లోన ప్రేముంటే చెప్పలిరో పాలిరో
కళ్ళు వొళ్ళు పెనవేసి బతకాళిరో కాలిరో
గుండె లోన ప్రేముంటే చెప్పలిరో పాలిరో
కళ్ళు వొళ్ళు పెనవేసి బతకాళిరో కాలిరో
దొరికినన్థ దోచుకో
దోచుకుందీ దాచుకో
కార్ బంగ్లా తీస్కో
హో లైఫ్ నీదే కుమ్ముకో


******  ******  ******


చిత్రం: సూపర్ (2005)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: కందికొండ
గానం: సందీప్ చౌతా, నిఖిత

మస్తానా వ వ్వారే వారే వస్తానా
మస్తానా సోకుల్ని సోడా చేస్తానా

నా చోటి చోటి మీటీ మీటీ నాటీ నాటి సాథి నువ్వేనా
మస్తానా వ వ్వారే వారే వస్తానా
చూపుల్తో కూస్త వస్తున్నా
నా చోటి చోటి మీటీ మీటీ నాటీ నాటి సాథి నువ్వేనా
i love u love u love u..love u..
love u..love u...love uuuuuuu

చరణం: 1
అందాలే చందాలే అంటూ
అందుతూ వెన్నెలాయె
నీరుంది నిప్పున్ది నీలోన
తాపాలే దీపాలే పెట్టి అల్లరి ఆకతాయి
ఆడేది ఆర్పేది నువ్వేన
గుచ్చైనా గుచ్చైనా నీ చూపే గుండెళ్లోన
గుచ్చైనా గుచ్చైనా చానా
తెచ్చైనా తెచ్చైనా నీ నవ్వే ఎన్దల్లొన
తెచ్చైనా తెచ్చైనా చానా
i love u love u love u..love u..
love u..love u...love uuuuuuu


******  ******  ******


చిత్రం: సూపర్ (2005)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: విశ్వా
గానం: సౌమ్య , ఉదిత్ నారాయణ్

గిచ్చి గిచ్చి చంప మాకు హోయీలా
తాకు తుంటే ఒలా ఒలా
కోరికై నాలో చాలా
పట్టపగలె వెన్నెలీయ్యాలా
పైన పైన మొమాటాల
లోన లోన ఆరాటాల
బస్ తూహే మేరా

చరణం: 1
సరసన సరాగాలు కురిపిస్తే
తదుపరి వరాలన్ని నీవె
తనువుని మరో మారు తాడిమెస్తే
విరివిగ వయ్యరాలు నీవె
ఈడు రాసు కున్దె ఇల్ల
వద్దకొస్తా పిల్ల మల్లా
చెయ్యమాకు హల్లా గుల్ల
చూసే తట్టు పిల్లా జల్లా

చరణం: 2
ఎదురుగ ఇలా నీవు కదిలోస్తే
మనసిక ఎటొ వెళ్ళిపోయే
పదే పదే ఏదే ఇలా నీవైతే
పద పద మనీ సదా పోరే
బోలెడంత ఎత్థున్నొడ
బోలెడంత సత్తున్నొడ
హే ...
ఉందా నీకు తోడు నీడ
ముడె పడి ఎడా పెడ

నిన్నే పెళ్ళాడుతా (1996)




చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: జిక్కి, రామకృష్ణ, సందీప్, రాజేష్, బలరామ

పల్లవి:
బబంబం బబంబం బబంబం బబంబం ..బబంబంహై హై

నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా
సరేరా కుమారా అలాగే కానీరా
మా కళ్ళల్లో కారం కొట్టి మీరు మాత్రం జారుకుంటారా
సెలక్షన్ చూశాం ..శభాషంటున్నాం
అహా...
ముహూర్తం చూస్తాం తథాస్తు అనేసి ముడేసి తరించిపోతాం
ఆపై మాతో మీకేం పనిరా మాయమైపోతాములేరా
సరేరా కుమారా అలాగే కానీరా !

నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇచ్చావా పాపం

చరణం: 1
ప్రేమదాకా ఓ..కే... పెళ్లి మాత్రం షాకే..
చాలురా నారదా నీ హరికథ...పెళ్లయే యోగమే నీకున్నదా ?
ఇంటిలో ఇందరం ఉన్నాం కదా..కోరితే సాయమే చేస్తాం కదా
పార్కులో సీను .. తప్పురా శ్రీను
అందుకని నిన్ను సాక్షిగా ముందుంచి ముద్దాడుకుంటార్రా కుర్రాళ్ళు !

ఈ మహలక్ష్మీ ఇంటికి వస్తే మేము మాత్రం కాదంటామా
సరేరా కుమారా అలాగే కానీరా
నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే... మ్మ్...మ్మ్..

చరణం: 2
సిగ్గుపడవే పండు .. నువ్వు కాదురా ఫ్రెండు..
ఆడుతూ పాడుతూ మీ ఊరొస్తాం..అమ్మడు కాసుకో అల్లరి చేస్తాం
విందులు మెక్కుతూ వంకలు పెడతాం...చీటికి మాటికి చెలరేగుతాం

అల్లుడిని తెస్తాం కాళ్ళు కడిగిస్తాం
పెళ్లి కాగానే అందర్నీ తరిమేసి మిమ్మల్ని గదిలోకి నెట్టేసి..
ఖర్చెంతైందో లెక్కలు వేస్తూ మేలుకుంటాం మీకు పోటీగా
లలల్లా లలల్లా లలల్లా లలల్లా

నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా
సెలక్షన్ చూశాం..వాహ్.. శభాషంటున్నాం..
ముహూర్తం చూస్తాం తథాస్తు అనేసి ముడేసి తరించిపోతాం
ఆపై మాతో మీకేం పనిరా మాయమైపోతాములేరా
బబంబం బబంబం బబంబం బబంబం ..బబంబంహై..హై..హై...
నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా...


*****  *****  *****


చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సౌమ్య

పల్లవి:
గ్రీకువీరుడూ..గ్రీకువీరుడూ
గ్రీకువీరుడూ నా రాకుమారుడూ కలల్లోనె ఇంకా ఉన్నాడూ
film స్టారులూ క్రికెట్టు వీరులూ కళ్ళుకుట్టి చూసే కుర్రాడూ
DREAM BOY.....
రూపులో చంద్రుడూ చూపులో సూర్యుడు
DREAM BOY.....
ఊరనీ పేరనీ జాడనే చెప్పడూ..ఏమి చెప్పనూ ఎలాగ చెప్పనూ...
ఎంత గొప్పవాడే నావాడూ..రెప్ప మూసినా ఏటైపు చూసినా
కళ్ళముందు వాడే ఉన్నాడూ..
ఎంతో...ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ
ఎవ్వరూ...వాడితో చెప్పరే ఎదురుగా రమ్మనీ
గ్రీకువీరుడు...గ్రీకువీరుడు...
గ్రీకువీరుడు...గ్రీకువీరుడు...

చరణం: 1
నడకలోని ఠీవి చూసి సింహమైన చిన్నపోదా..
నవ్వులోని తీరుచూసి చల్లగాలి కరిగిపోదా...
style లో వాడంత వాడు లేడూ..
నన్ను కోరినా మగాళ్ళు ఎవ్వరూ
నాకు నచ్చలేదే what to...do...
నేను కోరినా ఏకైక పురుషుడూ..ఇక్కడే ఎక్కడో ఉన్నాడు
ఎంతో...ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ..
ఎందుకో...ఆకలీ నిద్దరా ఉండనే ఉండదే
గ్రీకువీరుడు...గ్రీకువీరుడు...
గ్రీకువీరుడు...గ్రీకువీరుడు...

చరణం: 2
లోకమంత ఒక్కటైన లెక్కచేయనన్నవాడూ
కోరుకున్న ఆడపిల్ల కళ్ళముందు నిలవలేడూ
చూస్తా ఎన్నాళ్ళు దాగుతాడూ

కన్నె ఊహలో వుయ్యాలలూగుతూ..ఎంత అల్లరైనా చేస్తాడూ
ఉన్నపాటుగా కొర్రుక్కు తిననుగా ఎందుకంత దూరం ఉంటాడూ
ఎంతో...ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ
ఎవ్వరూ...వాడితో చెప్పరే ఎదురుగా రమ్మనీ
గ్రీకువీరుడు...గ్రీకువీరుడు...
గ్రీకువీరుడు...గ్రీకువీరుడు...


*****  *****  *****


చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సంజీవ్, సుజాత

పల్లవి:
కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే
ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే

కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే

చరణం: 1
మది దాచుకున్నా రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదేలా
నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా
గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగటం

చరణం: 2
అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను మదిలోని మాటేదని
తల వంచుకొని నేను తెగ ఎదురు చూశాను నీ తెగువ చూడాలనీ
చూస్తూనే రేయంతా తెలవారిపోతుందో ఏమో ఎలా ఆపటం


*****  *****  *****


చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్

పల్లవి:
ఎటో వెళ్లిపోయింది మనసు...
ఎటో వెళ్లిపోయింది మనసు...
ఇలా ఒంటరైయింది వయసు..ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో
ఎటో వెళ్లిపోయింది మనసు ఎటెళ్ళిందో అది నీకు తెలుసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో.

చరణం: 1
ఏ స్నేహమూ కావాలని ఇన్నాలుగా తెలియలేదూ
ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదూ..
చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో..

చరణం: 2
కలలన్నవి కోలువుండని కనులుండి ఏం లాభమందీ
ఏ కదలికా కనిపించని శిలలాంటి బ్రతుకెందుకందీ..
తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుంది అంటూ..


*****  *****  *****


చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్, సౌమ్య

పల్లవి:
హబ్బబ్బ దూకుతోంది లేత ఈడు నీ చూపు లాగి
ఒళ్ళంతా పాకుతుంది వింత కైపు నీ ఊహ తాగి
ఇంకా ఏదో కావాలంటూ

వేడెక్కి వేగుతోంది కోడే యీడు నీ శ్వాస తాగి
కవ్వింత రేగుతోంది కోరుకున్న నీ స్పర్శ సోకీ
ఇంకా ఏదో కావాలంటూ..యే

చరణం: 1
ఆ..ఆ
వొంపు వొంపులోన ఉరికింది తాపం
చంపుతోంది నన్ను నాజూకు రూపం
ఏం చేసినా చాలు అనలేని ఈ వేళలో
ఇంకా ఏదో ఐపోమంటూ...

ఉప్పొంగి దూకుతోంది లేత యీడు నీ చూపు లాగి
ఒళ్ళంతా పాకుతుంది వింత కైపు నీ ఊహ తాగి

చరణం: 2
ఆ..ఆ..
గోటిగాటు తీపి గాయాలు రేపి
పంటిగాటు తోటి ప్రాయాన్ని లేపి
నరనరములా నిప్పు రాజేసిన మత్తులో
ఇంకా యేదో చేసేయ్‌మంటూ
వేడెక్కి వేగుతోంది కోడే యీడు నీ శ్వాస తాగి
కవ్వింత రేగుతోంది కోరుకున్న నీ స్పర్శ సోకీ

ఇంకా ఏదో కావాలంటూ
ఇంకా ఏదో కావాలంటూ
ఇంకా ఏదో కావాలంటూ
ఇంకా ఏదో....