Showing posts with label మరకతమణి (2017). Show all posts
Showing posts with label మరకతమణి (2017). Show all posts

మరకతమణి (2017)

చిత్రం: మరకతమణి (2017)
సంగీతం: దిబు నినన్ థామస్
సాహిత్యం: రాకేందు మౌళి
గానం: ప్రదీప్ కుమార్


ఏ కవితలన్ని తెలిపినవి కనులు ఇవే
నా ఎద సడిలో శృతి గతినీ మార్చినవే
ఊహించు కున్నా జన్మాలు వేలు
నీతో క్షణమే చాలు
కదలాడెనే కలలా నిజం
కరిగించకే సమయాన్నిలా
లోలోననీ మౌనాలని
పలికించవే చిరునవ్వులా

కనిపించే తీరం కరిగేలా దూరం
దరిచేరే సమయం వరమై రానా
అందనిది అందం అందుకనే అందుం
అందరిలో తానే ఏంతో అందం
చలియా...

నీ చిటపటలా చూపులతో చురకెందుకో
రా చిగురెదలో చిరులతలా పెనవేసుకో
మరీ చికాకే మరిచికాను
మరీ మరీ కోరే మనస్సు నీ నవ్వే
ఏ బిడియపు మడి విడివడి ఇక
మనసుని తెలిపేసెయ్ వా

కదలాడెనే కలలా నిజం
కరిగించకే సమయాన్నిలా
లోలోననీ మౌనాలని
పలికించవే చిరునవ్వులా

ఏ కలతలిలా పరిచయము నా ఎదకు 
నీ గతములలో ఒక స్మృతిగా
ఊహించి నీతో జన్మాలు వేలు
పగిలే హృదయం చాలు

కదలాడెనే కలలా నిజం
కరిగించకే సమయాన్నిలా
లోలోననీ మౌనాలని
పలికించవే చిరునవ్వులా

కదలాడెనే కలలా నిజం
కరిగించకే సమయాన్నిలా
లోలోననీ మౌనాలని
పలికించవే చిరునవ్వులా