Showing posts with label కన్యాకుమారి (1977). Show all posts
Showing posts with label కన్యాకుమారి (1977). Show all posts

కన్యాకుమారి (1977)

చిత్రం: కన్యాకుమారి (1977)
సంగీతం: బాలు
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల  


పల్లవి : 

తొలి సంధ్యకు తూరుపు ఎరుపు
మలి సంధ్యకు పడమర ఎరుపు
తెలియదు నాకు పడమర తూరుపు
తెలిసిందొకటే ఎరుపు.. నా చెలియ పెదవి ఎరుపు


తొలి సంధ్యకు తూరుపు ఎరుపు
మలి సంధ్యకు పడమర ఎరుపు 


చరణం 1 :

ఇరు సంధ్యల ఇరుకున నడుమ.. మరుమల్లెల వలపే మనది
ఇరు పెదవుల ఎరుపుల నడుమ.. చిరునవ్వుల చిలుకే మనది

తొలి సంధ్యకు తూరుపు ఎరుపు
మలి సంధ్యకు పడమర ఎరుపు 


చరణం 2 :

చిరువెన్నెలొలుకు సిగమల్లె తెలుపు
చిరునవ్వులోని మరుమల్లె తెలుపు
తొలిరోజులందు... చెలి మోజులందు... విరజాజులన్ని తెలుపు

అరమూత కనుల నునులేత వలపు
తెర తీసి నాకు తెలుపు
తెనిగించి మనసు తెలుపు


తొలి సంధ్యకు తూరుపు ఎరుపు
మలి సంధ్యకు పడమర ఎరుపు 


చరణం 3 :


చెలి కాటుక మబ్బుల వెన్నెల..
తొలి కోరిక మదిలో కోయిల
మన కలయిక సంధ్యారాగం..
ప్రతిరాగం జీవన రాగం



తొలి సంధ్యకు.. తూరుపు ఎరుపు
మలి సంధ్యకు.. పడమర ఎరుపు
తెలియదు నాకు పడమర తూరుపు
తెలిసిందొకటే ఎరుపు.. నా చెలియ పెదవి ఎరుపు


తొలి సంధ్యకు.. తూరుపు ఎరుపు
మలి సంధ్యకు.. పడమర ఎరుపు 


****** *************
చిత్రం: కన్యాకుమారి (1977) 
సంగీతం: బాలు 
గీతరచయిత: వేటూరి 
నేపధ్య గానం: బాలు 

పల్లవి: 

ఓహో చెలీ.. ఓ ఓ నా చెలీ 
ఇది తొలి పాట.. ఒక చెలి పాట 
వినిపించనా ఈ పూట.. నా పాట 

ఇది తొలి పాట.. ఒక చెలి పాట 
వినిపించనా ఈ పూట.. నా పాట 

చరణం 1: 

ఎదుట నీవు.. ఎదలో నీవు.. ఎదిగి ఒదిగి నాతో ఉంటే 
మాటలన్ని పాటలై మధువులొలుకు మమతే పాట 
నీలి నీలి నీ కన్నులలో.. నీడలైన నా కవితలలో 
నీ చల్లని చరణాలే నిలుపుకున్న వలపీ పాట 
పరిమళించు ఆ బంధాలే పరవశించి.. పాడనా.. పాడనా..పాడనా 


ఓహో చెలీ.. ఓ ఓ నా చెలీ 
ఇది తొలి పాట.. ఒక చెలి పాట 
వినిపించనా ఈ పూట.. నా పాట 

చరణం 2: 

చీకటిలో వాకిట నిలిచి... దోసిట సిరిమల్లెలు తొలిచి 

నిదుర కాచి నీకై వేచి... నిలువెల్లా కవితలు చేసి 

కదలి కదలి నీవోస్తుంటే...  కడలి పొంగులనిపిస్తుంటే 

వెన్నెలనై.. నీలో అలనై.. నీ వెల్లువకే వేణూవునై

పొరలిపొంగు నీ అందాలే పరవశించి పాడనా.. ఆహాహా 
పొరలిపొంగు నీ అందాలే పరవశించి పాడనా... పాడనా... పాడనా 



ఓహో చెలీ.. ఓ.. నా చెలీ 

ఇది తొలి పాట... ఒక చెలి పాట 

వినిపించనా ఈ పూట... నా పాట

ఇది తొలి పాట... ఆ...
ఇది తొలి పాట... ఉమ్మ్.. 
ఇది చెలి పాటా...