చిత్రం : బాటసారి ( 1961)
సంగీతం: మాస్టర్ వేణు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం : భానుమతి
పల్లవి :
ఉపకార చింతే నేరమా... కరుణే నిషేదమా
నిలాపనిందలే ఈ లోక నైజమా... న్యాయమే కానగ జాలరా
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై.. అనేరా ఈ తీరునా ఈ లోకులు
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై.. అనేరా ఈ తీరునా ఈ లోకులు
చరణం 1 :
పాముల కన్నులతో కనేరా పరుల
పాలను పోసిన చేతినే కరచేరా
నీడనొసంగిన వారికే కీడు చేసేరా
న్యాయమే కానగజాలరా
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై అనేరా ఈ తీరునా ఈ లోకులు
చరణం 2 :
నా మనసు.. నడత ఎరిగినవారే అపవాదు వేసినా
నమ్మేరా పెదవారు నా మాట
న్యాయమే కానగజాలరా
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై... అనేరా ఈ తీరునా ఈ లోకులు
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై... అనేరా ఈ తీరునా ఈ లోకులు
******** ********** ********** ***********
చిత్రం : బాటసారి ( 1961)
సంగీతం: మాస్టర్ వేణు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం : లీల
పల్లవి :
శరణమునీవే దేవి... కరుణా నాపై చూపవే
శరణమునీవే దేవి... కరుణా నాపై చూపవే
శరణమునీవే దేవి
చరణం 1 :
నిన్నె నమ్ముకొని బ్రతికెదనమ్మ
పతిని దూరము చేయకుమమ్మ
నిన్నె నమ్ముకొని బ్రతికెదనమ్మ
పతిని దూరము చేయకుమమ్మ
పసుపుకుంకుమ నిలుపగదమ్మ రాజరాజేశ్వరి
శరణమునీవే దేవి కరుణా... నాపై చూపవే
శరణమునీవే దేవి
చరణం 2 :
మాపై జాలిని పూనగలేవా... ఆపద తీరుపజాలవా
మాపై జాలిని పూనగలేవా... ఆపద తీరుపజాలవా
విధికి జీవులు బానిసలేనా... కథ వ్యధగా ముగిసేనా
మాపై జాలిని పూనవా... ఆపద తీరుపజాలవా
విధికి జీవులు బానిసలా... కథ వ్యధగా ముగిసేనా
******** ********** ********** ***********
చిత్రం : బాటసారి ( 1961)
సంగీతం: మాస్టర్ వేణు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం : భానుమతి
పల్లవి :
లోకమెరుగని బాలా
లోకమెరుగని బాలా... ఆ... ఆ
లోకమెరుగని బాలా
దీని పోకడ చిత్రము చాలా... ఆ... ఆ
లోకమెరుగని బాలా
కనులను మూసిని మనసుని తెరచి కనుమా నిజము బేలా
ఆ ఆ లోకమెరుగని బాలా... ఆ... ఆ
ఆ ఆ లోకమెరుగని బాలా... ఆ... ఆ
చరణం 1 :
ఎందును కానని అందము కనిన... డెందము చిందెనుగానవా
సుందర కవితా శిల్పము వెలసి
సుందర కవితా శిల్పము వెలసి
విందులు చేయునుగా... ఆ... ఆ
ఇదియే స్థిరమని మురిసే మనుపే
ఇదియే స్థిరమని మురిసే మనుపే
కలయే మారు సుమా... ఆ... ఆ...
లోకమెరుగని బాలా
చరణం 2 :
దిగులు వగలు తెలిసే వయసున కలుగును ఊహలెవో
అవి చెలిగి మదిలో ఆశలు రేగ
చెలిగి మదిలో ఆశలు రేగ
ఆపద మూగునుగా... ఆ.. ఆ.. ఆ
ఏల కలుగును ఎరిగే మునుపే
ఏల కలుగును ఎరిగే మునుపే
కాలము తీరునుగా ఆ ఆ
లోకమెరుగని బాలా... ఆ... ఆ
లోకమెరుగని బాలా
******** ********** ********** ***********
చిత్రం : బాటసారి ( 1961)
సంగీతం: మాస్టర్ వేణు
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: భానుమతి, జిక్కి
పల్లవి:
కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని
కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని
భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని
భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని
మనసున నిండి పలుకగరాని తలపులున్నవి కొన్ని
తలపులున్నవి కొన్ని
చరణం 1:
సృష్టి చేసినది దేవుడైన మరి నాశము నేల సృజించే
పలుకు నొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించే
కనుల నొసగినది దేవుడైన మరి అంధులనేల సృజించే
కనుల నొసగినది దేవుడైన మరి అంధులనేల సృజించే
వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటినేల సృజించే
పెను చీకటినేల సృజించే
చరణం 2:
వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం
వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం
అల్పబుద్దితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం … సలుపకు పరిహాసం
బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం
బదులు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం
బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం
బదులు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం...
******** ********** ********** ***********
చిత్రం : బాటసారి ( 1961)
సంగీతం: మాస్టర్ వేణు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం : భానుమతి
పల్లవి:
ఓ బాటసారి.. నను మరువకోయి
మజిలీ ఎటైనా.. ఆ ఆ.. మనుమాసుఖాన
ఓ బాటసారి.. నను మరువకోయి
మజిలీ ఎటైనా.. ఆ ఆ... మనుమాసుఖాన
చరణం 1:
సమాజానికీ.. దైవానికి.. బలియైతి నేను వెలియైతినే..
వగేగాని నీపై.. పగలేని దానా.. కడమాట కైనా నేనోచుకోనా
ఓ బాటసారి.. నను మరువకోయి
మజిలీ ఎటైనా.. ఆ ఆ... మనుమాసుఖాన
చరణం 2:
శృతి చేసినావు.. ఈ మూగవీణ.. ఆ.. ఆ...
సుధామాధురి.. ఈ ఈ ఈ.. చవే చూపినావు.. ఊ...
సదా మాసిపోని.. స్మృతే నాకు వీడి..
మనోవీణ నీవు కొనిపోయెనోయి
ఓ బాటసారి.. నను మరువకోయి
మజిలీ ఎటైనా.. ఆ ఆ... మనుమాసుఖాన