చిత్రం : మేలుకొలుపు (1978)సంగీతం : మాస్టర్ వేణుగీతరచయిత : సినారెనేపథ్య గానం : జానకిపల్లవి :దారి తప్పిన బాలల్లారా... దగా పడిన యువకుల్లారాచెడు అనవద్దు... చెడు వినవద్దు... చెడు కనవద్దుఇది బాపూజీ పిలుపు... ఇదే మేలుకొలుపు... ఇదే మేలుకొలుపుచెడు అనవద్దు... చెడు వినవద్దు... చెడు కనవద్దుఇది బాపూజీ పిలుపు... ఇదే మేలుకొలుపు... ఇదే మేలుకొలుపుచరణం 1 :ఇంటిని కాల్చే మంటల్లాగా ఎందుకు బ్రతకాలి?ఆ ఇంటికి చల్లని జ్యోతుల్లాగా ఎపుడూ వెలగాలిఇంటిని కాల్చే మంటల్లాగా ఎందుకు బ్రతకాలిఆ ఇంటికి చల్లని జ్యోతుల్లాగా ఎపుడూ వెలగాలిమానవతయే మన దైవం... మంచితనమే మన ధర్మంమానవతయే మన దైవం... మంచితనమే మన ధర్మంచెడు అనవద్దు... చెడు వినవద్దు... చెడు కనవద్దుఇది బాపూజీ పిలుపు... ఇదే మేలుకొలుపు... ఇదే మేలుకొలుపుచరణం 2 :చక్కని తెలివి విషమించిందా రక్కసులౌతారుచక్కని తెలివి విషమించిందా రక్కసులౌతారుఅది మంచిదారిలో మలచుకొంటిరా మహాత్ములౌతారుమహాత్ములౌతారు..పరోపకారం పరమగుణం... పరమగుణంసహనం మన ఆభరణం... ఆభరణం..చెడు అనవద్దు... చెడు వినవద్దు... చెడు కనవద్దుఇది బాపూజీ పిలుపు... ఇదే మేలుకొలుపు... ఇదే మేలుకొలుపు**************** **************** ***************చిత్రం: మేలుకొలుపు (1978)సంగీతం: మాస్టర్ వేణుసాహిత్యం: దాశరథిగానం: ఎస్.పి. బాలు, సుశీలపల్లవి:కనరాని నీవే కనిపించినావే...అనురాగ వీణ పలికించినావేకనరాని నీవే..అహా..కనిపించినావే...ఆహా..అనురాగ వీణ..ఆ..పలికించినావే.... ఆచరణం: 1కలలన్ని నేడు నిజమాయె చూడు....కలలన్ని నేడు నిజమాయె చూడుఏనాటికైనా విడిపోదు తోడూ....ఇన్నాళ్ళు నీకై వేచాను నేను...ఇనాళ్ళు నీకై వేచాను నేను...ఎడబాటు దాటి చేరాను నిన్ను.. చేరాను నిన్నుఉందాము మనము... ఒక గూటిలోనేనడిచేము మనము... ఒక బాటలోనేచరణం: 2మ్రోగింది అందె..నా రాజు కోసంవేసింది చిందు.. నా మూగ హృదయంహృదయాలు రెండు ఉయ్యాలలూగేహృదయాలు రెండు ఉయ్యాలలూగేజత చేరి నేడు సైయ్యాటలాడేకనుపాపలాగా... నిను చూసుకోనాపసిపాపలాగా... నిను దాచుకోనాకనరాని నీవే కనిపించినావే... అనురాగ వీణ పలికించినావే
Labels
మేలుకొలుపు (1978)
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment