చిత్రం: ఆస్థిపరులు (1966)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: సుశీల
పల్లవి:
సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు..
సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ.. సోగ్గాడు..
చరణం 1:
కట్టె తుపాకెత్తుకోని కట్ట మీద నడుస్తుంటే కాలుజారి పడ్డాడే సోగ్గాడు
కట్టె తుపాకెత్తుకోని కట్ట మీద నడుస్తుంటే కాలుజారి పడ్డాడే సోగ్గాడు
పగటివేషగాడల్లే పల్లెటూళ్ళు తిరుగుతుంటే కుక్కపిల్ల భౌ అంది.. ఆయ్.. పడుసు పిల్ల ఫక్కుమంది.. హహహ..
సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ.. సోగ్గాడు..
చరణం 2:
కళ్ళజోడు ఏసికోని గళ్ళకోటు తొడుక్కోని పిల్లగాలికొచ్చాడే సొగ్గాడు
కళ్ళజోడు ఏసికోని గళ్ళకోటు తొడుక్కోని పిల్లగాలికొచ్చాడే సొగ్గాడు
చిట్టివలస వాగుకాడ పిట్ట తుర్రుమంటేనూ..
చిట్టివలస వాగుకాడ పిట్ట తుర్రుమంటేనూ.. బిక్కమొగమేసాడు సుక్కలొంక చూసాడూ..
బిక్కమొగమేసాడు సుక్కలొంక చూసాడూ..
సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ.. సోగ్గాడు..
చరణం 3:
మూతి మీసం గొరుక్కోని.. బోసి మొహం పెట్టుకోని యాట కోసం వచ్చాడే సోగ్గాడు
మూతి మీసం గొరుక్కోని.. బోసి మొహం పెట్టుకోని యాట కోసం వచ్చాడే సోగ్గాడు
బుల్లిదొర వచ్చెనని కుక్కపిల్ల ఎక్కిరిస్తే ఎర్రిమొహం ఏసాడు.. హోయ్.. మిర్రిమిర్రి చూసాడు.. హూ..హోయ్..
సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు..
సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ.. సోగ్గాడు..
*********** ************ ************
చిత్రం: ఆస్థిపరులు (1966)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: ఘంటసాల
పల్లవి:
మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా
ముందు ముందు ఉందిలే సంబరాల జాతరా
మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా
ముందు ముందు ఉందిలే సంబరాల జాతరా
మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా రా రా
చరణం 1:
దోరవయసు అలవి కాని భారమయింది
ఆ బరువు మోయలేక నడుము పలచబడింది
దోరవయసు అలవి కాని భారమయింది
ఆ బరువు మోయలేక నడుము పలచబడింది
నడుములేని నడకే ఒక నాట్యమయింది
నడుములేని నడకే ఒక నాట్యమయింది
చూచి చూచి బావ మనసు సొమ్మసిల్లింది.. సొమ్మసిల్లింది
చరణం 2:
అత్తకూతురంటేనే హక్కు ఉందిలే
అల్లరెంత చేసినా చెల్లుతుందిలే
అత్తకూతురంటేనే హక్కు ఉందిలే
అల్లరెంత చేసినా చెల్లుతుందిలే
ముక్కు తాడు వేయువేళ ముంచుకొచ్చు సిగ్గులో
ముక్కు తాడు వేయువేళ ముంచుకొచ్చు సిగ్గులో
ఇంత అత్త కూతురూ కొత్త పెళ్ళి కూతురే .. కొత్త పెళ్ళి కూతురే
*********** ************ ************
చిత్రం: ఆస్థిపరులు (1966)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: ఘంటసాల
పల్లవి:
చిట్టి అమ్మలూ... చిన్ని నాన్నలూ...
మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు
చిట్టి అమ్మలూ... చిన్ని నాన్నలూ...
మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు...
చిట్టి అమ్మలూ....
చరణం 1:
ఎవరికెవరు వేశారు బంధము
ఒకొరికొకరమైనాము ప్రాణము
ఎవరికెవరు వేశారు బంధము
ఒకొరికొకరమైనాము ప్రాణము
నీకు నేను అమ్మనూ నాన్ననూ... నీకు నేను అమ్మనూ నాన్ననూ ..
నాకు నీవే లోకాన సర్వమూ... నాకు నీవే లోకాన సర్వమూ ...
చరణం 2:
హృదయాలను మూయవీ తలుపులు
విడదీశారమ్మా మన తనువులు
ఉన్నవాళ్ళే నీకింక నీ వాళ్ళు
ఉన్నవాళ్ళే నీకింక నీ వాళ్ళు ..
తుడిచివేయవమ్మా నీ కన్నీళ్ళు
చరణం 3:
అన్న ఒడి వెచ్చదనం కోసం
కన్ను మూయకున్నావు పాపం
ఎదను చీల్చి పాడుతున్న జోలలు
ఎదను చీల్చి పాడుతున్న జోలలు ..
నిదురపుచ్చులే నిన్ను అమ్మలు
నిదురపుచ్చులే నిన్ను అమ్మలు ...

No comments:
Post a Comment