Showing posts with label Akkineni Nagarjuna. Show all posts
Showing posts with label Akkineni Nagarjuna. Show all posts

జగద్గురు ఆదిశంకర (2013)

 


చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ్ శ్రీ వత్స
సాహిత్యం: జె.కె.భారవి
గానం: శ్రీరామ చంద్ర 

ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...

ఆ.....భ్రమ అని తెలుసు
భ్రమ అని తెలుసు బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు 
ఆ.....కత అని తెలుసు
కత అని తేలుసు కతలన్ని కంచికే చేరునని తెలుసు 
తెలుసు తెర తొలుగుతుందని తెలుసు తెల్లారుతుందని తెలుసు 
ఈ కట్టే పుట్టుక్కుమంటాడని తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని 
ఎన్ని తెలిసి ఇరకాటంలో పడిపోతావు ఎందుకని 

మాయ ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ... 
మాయ ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...మా...య....

ఆ...వేదం తెలుసు - తైలం ఉన్నదకే దీపమను వేదాంతం తెలుసు
శాస్త్రం తెలుసు - శాశ్వతంగా ఉండేదేవ్వడీడా లేడని తెలుసు
తెలుసు ఇది నీటి మూటని తేలుసు లే  గాలి మేడని 
తెలుసు ఈ బుడగ టాప్పని పగిలిపోతదని 
తెలుసు ఉట్టి మీద ఉన్నదంతా హుష్ కాకి అని 
అన్ని తెలిసి అడుసులోపడి దోల్లుతుంటావు దేనికని

మాయ ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ... 
మాయ ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...మా...య....

ఆ...తేలిపోయింది  తెలిసిపోయింది
తేలిపోయింది తెలిసిపోయింది తెలియనిదేదో ఉన్నదని మనసా
తెలుసని ఎందరు చెబుతున్న అది ఉందో లేదో తేలది హంసా ....
కళ్ళు రెండు ముసెయ్యలంట  మూడో కంటిని తెరవాలంట...
మిన్ను, మన్ను, మిట్ట, పళ్ళెం, ఒక్కటిగా కనిపించాలంట ..
ఆడే వాడు ఆడించే వాడు ఏకపాత్రలని ఎరగాలంట..
ఆ ఎరుక వచ్చి రాగాలే...ఆ ఎరుక వచ్చి రాగాలే...
ఆ ఎరుక వచ్చి రాగాలే మాయంఅయిపొతుండటమాయ

మాయ ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ... 
మాయ ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...మా...య.....

హలోబ్రదర్ (1994)




చిత్రం : హలోబ్రదర్ (1994)
సంగీతం : రాజ్ కోటీ
సాహిత్యం : భువనచంద్ర
గానం : బాలు
 
కన్నెపిట్టరో కన్నుకొట్టరో ఓ..ఓ..ఓ
పాలపిట్టరో పైటపట్టరో ఓ..ఓ..ఓ
అరె అరె అరె కన్నెపిట్టరో కన్నుకొట్టరో ఓ..ఓ..ఓ
పాలపిట్టరో పైటపట్టరో ఓ..ఓ..ఓ
గుట్టు గుట్టుగా జట్టు కట్టరో
జంట చేరితే గంట కొట్టరో
ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను
పెట్టేయ్ కట్టి ఉట్టే కొట్టి తీరతాను
ఓ..ఓ..ఓ ఓ..ఓ..ఓ

చూపు చూపుకొక చిటికెల మేళం
చూసి పెట్టనా చిట్టెమ్మా
ఊపు ఊపుకొక తకధిమి తాళం
వేసిపెట్టనా చెప్పమ్మా
అదిరిపడిన కుడీ ఎడమల నడుమున
ఉడుకు వయసు ముడిపెట్టుకోనా
అసలు సిసలు లవ్ కిటుకులు తెలిసిన
పడుచు పనులు మొదలెట్టుకోనా
అదురే సరుకూ ముదిరే వరకూ
అటొ ఇటొ ఎటొ ఎటొ పడి పడి
కలేయనా అదొ ఇదొ కలబడి
ఓ..ఓ..ఓ ఓ..ఓ..ఓ 

కన్నెపిట్టరో కన్నుకొట్టరో ఓ..ఓ..ఓ
అరె పాలపిట్టరో పైటపట్టరో ఓ..ఓ..ఓ
గవ్వ తిరగబడి గలగలమంటే
గువ్వ గుండెలోన రిం జిం జిం
వేడి వేడి ఒడి చెడుగుడు అంటే
సోకులాడి పని రం పం పం
మిడిసి పడిన తడి తలుపుల మెరుపులు
మెరిసి మెరిసి పని పట్టమంటే
మతులు చెడిన చెలి జిగిబిగి బిగువులు
అరిచి అరిచి మొర పెట్టుకుంటే
పనిలో పనిగా ఒడిలో పడనా
చలో చలో చెకా చెకీ చం చం
కలేసుకో ప్రియా ప్రియా కమ్ కమ్
ఓ..ఓ..ఓ ఓ..ఓ..ఓ

కన్నెపిట్టరో కన్నుకొట్టరో ఓ..ఓ..ఓ
అరె పాలపిట్టరో పైటపట్టరో ఓ..ఓ..ఓ
గుట్టు గుట్టుగా జట్టు కట్టరో
జంట చేరితే గంట కొట్టరో
ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను
పెట్టేయ్ కట్టి ఉట్టే కొట్టి తీరతాను హా 

********** ************** ***********

చిత్రం :  హలో బ్రదర్ (1994)
సంగీతం :  రాజ్-కోటి
నేపధ్య గానం :  బాలు,  చిత్ర

ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
చేరాలి సొగసుల తీరం...
సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం...
తీరాలి వయసుల తాపం..
ఓ....ఓ...ఓ...ఓ...
ఓ....ఓ...ఓ...ఓ...
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా

చరణం 1:

అల్లరి కోయిల పాడిన పల్లవి...  స్వరాలలో నీ వుంటే.. పదాలలో నేనుంటా
వేకువ పూచిన తొలితొలి గీతిక  ప్రియా ప్రియా నీవైతే.. శృతిలయ నేనౌతా
కలకాలం కౌగిలై.. నిన్నే చేరుకోని..
కనురెప్పల నీడలో.. కలే ఒదిగి పోనీ..
ఓ ప్రియా.. ఓ.. దరిచేరితే దాచుకోనా..
తొలి ప్రేమలే దోచుకోనా..
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా


చరణం 2:

సవ్వడి చేయని యవ్వన వీణలు అలా అలా సవరించు... పదే పదే పలికించు
వయసులు కోరిన వెన్నెల మధువులు సఖి చెలి అందించు... సుఖాలలో తేలించు
పెదవులతో కమ్మని.. కథే రాసుకోనా..
ఒడి చేరి వెచ్చగా.. చలే కాచుకోనా
ఓ ప్రియా.. ఓ.. పరువాలనే పంచుకోనీ..
పడుచాటలే సాగిపోని..
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
చేరాలి సొగసుల తీరం...
సాగాలి తకధిమి తాళం..
తగ్గాలి  తనువుల దూరం...
తీరాలి వయసుల తాపం
ఓ....ఓ...ఓ...ఓ...

ఓ....ఓ...ఓ...ఓ...

********** ********************** *****************
చిత్రం : హలోబ్రదర్ (1994)
సంగీతం : రాజ్ కోటీ
సాహిత్యం : వేటూరి 
గానం : బాలు,చిత్ర 



మనసిచ్చి ఇచ్చి బరువాయే
వయసొచ్చి గిచ్చి గొడవాయే
ఇది ఏమి ప్రేమరో
ఇది ఎంత ఘటురో
ఇక చాలు లాలిజో

మనసిచ్చి ఇచ్చి బరువాయే
వయసొచ్చి గిచ్చి గొడవాయే

ఓసి వయసా నీకు తెలుసా ఈడు ఇరకాటం
ఓరి మనసా కోరి కలిసా తీర్చు బులపాటం
చలి వేలా ఎద గోలా
అదిరేలా అదరాలే అందాలే
చలి బలేలేవోయీ చెలే నీదోయె
పెదాలే తేన జల్లోయీ జతలో

మనసిచ్చి ఇచ్చి బరువాయే
వయసొచ్చి గిచ్చి గొడవాయే

ఓరి తనువా ఇంత చనువా చాటు చెలగాటం
ఓసి మగువా ఉంటె చొరవా లేదు మొహమాటం
తెర తీసా పెనవేసా
గురి చూసా పరిచేసా ప్రాయాలే
సొగసరీ నీ పేరు సరేలే జోరు
సరంటు లేదె సందేలా కథలో

మనసిచ్చి ఇచ్చి బరువాయే
వయసొచ్చి గిచ్చి గొడవాయే
ఇది ఏమి ప్రేమరో
ఇది ఎంత ఘటురో
ఇక చాలు లాలిజో

మనసిచ్చి ఇచ్చి బరువాయే
వయసొచ్చి గిచ్చి గొడవాయే

జానకిరాముడు (1988)




చిత్రం : జానకిరాముడు (1988)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల 

పల్లవి  :

అదిరింది మావా అదిరిందిరో
ముదిరింది ప్రేమ ముదిరిందిరో
ఉడుకు పుట్టి ఇన్నినాళ్లు.. ఉగ్గబట్టి ఉండబట్టి
వయసు పోరు తీరాలిరో... వలపు జోరు తేలాలిరో

అదిరింది పిల్లా అదిరిందిలే
కుదిరింది పెళ్లీ కుదిరిందిలే
ఉడుకు పుట్టి ఇన్నినాళ్లు... ఉగ్గబట్టి ఉండబట్టి
వయసు పోరు తీరాలిలే... వలపు జోరు తేలాలిలే


చరణం 1 :

ఆకులిస్తా పోకలిస్తా... కొరికి చూడు ఒక్కసారి
ఆశలన్ని వరసపెట్టి... తన్నుకొచ్చి గిల్లుతాయి

బుగ్గమీద పంటిగాటు... పడుతుంది ప్రతిసారి
సిగ్గుచీర తొలగిపోయి... నలుగుతుంది తొలిసారి

మాపటేల మేలుకున్న కళ్ల ఎరుపు తెల్లవారి
మావ గొప్ప ఊరికంత చాటుతుంది మరీ మరీ

ఒకసారి కసిపుడితే... మరుసారి మతిచెడితే
వయసు పోరు తీరాలిరో.... వలపు జోరు తేలాలిలే

అదిరింది పిల్లా అదిరిందిలే
కుదిరింది పెళ్లీ కుదిరిందిలే
ఉడుకు పుట్టి ఇన్నినాళ్లు... ఉగ్గబట్టి ఉండబట్టి
వయసు పోరు తీరాలిరో... వలపు జోరు తేలాలిరో


చరణం 2 :

పూలపక్క ముళ్లలాగ... మారుతుంది ఎప్పుడంట
పూనుకున్న కౌగిలింత... సడలిపోతే తప్పదంట

మొదటిరేయి పెట్టుబడికి... గిట్టుబాటు ఎప్పుడంట
మూడునాళ్ల ముచ్చటంతా... డస్సిపోతే గిట్టదంట

రేయి రేయి మొదటిరేయి... కావాలంటే ఎట్టాగంట
సూరీడొచ్చి తలపుతడితే... తియ్యకుంటే చాలంట
తొలిరేయి గిలిపుడితే... తుదిరేయి కలబడితే


వయసు పోరు తీరాలిరో... వలపు జోరు తేలాలిలే
అదిరింది పిల్లా అదిరిందిరో
కుదిరింది పెళ్లీ కుదిరిందిరో

ఉడుకు పుట్టి ఇన్నినాళ్లు... ఉగ్గబట్టి ఉండబట్టి
వయసు పోరు తీరాలిలే... వలపు జోరు తేలాలిరో
తాన తాన తానాననా... తాన తాన తానాననా


*************************** *****************************

చిత్రం: జానకిరాముడు (1988)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం
నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం
నీ పాదాలే రస వేదాలు నను కరిగించే నవ నాదాలు
అవి యదలో ఉంచిన చాలు.. ఏడేడు జన్మాలు…

నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం
నీ పాదాలే రస వేదాలు నను కరిగించే నవ నాదాలు
అవి యదలో ఉంచిన చాలు ఏడేడు జన్మాలు…

నీ చరణం కమలం

చరణం 1:

మువ్వలు పలికే మూగతనంలో మోమున మోహన రాగాలు
కన్నులు పలికే కలికితనంలో చూపున సంధ్యారాగాలు
మువ్వలు పలికే మూగతనంలో మోమున మోహన రాగాలు
కన్నులు పలికే కలికితనంలో చూపున సంధ్యారాగాలు

అంగ అంగమున అందచందములు ఒంపు ఒంపున హంపి శిల్పములు
అంగ అంగమున అందచందములు ఒంపు ఒంపున హంపి శిల్పములు
ఎదుటే నిలిచిన చాలు.. ఆరారు కాలాలు…

చరణం 2:

జతులే పలికే జాణతనంలో జారే పైటల కెరటాలు
శృతులే కలిసే రాగతనంలో పల్లవించిన పరువాలు
జతులే పలికే జాణతనంలో జారే పైటల కెరటాలు
శృతులే కలిసే రాగతనంలో పల్లవించిన పరువాలు
అడుగు అడుగున రంగవల్లికలు పెదవి అడుగున రాగమాలికలు
అడుగు అడుగున రంగవల్లికలు పెదవి అడుగున రాగమాలికలు
ఎదురై పిలిచినా చాలు.... నీ మౌన గీతాలు



*************************** *****************************
చిత్రం: జానకిరాముడు (1988) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 
నేపధ్య గానం: బాలు, చిత్ర 

పల్లవి: 

హా తానానె తననానా 
ఆ..... 

నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా 
పాడవే పాడవే కోయిలా 
పాడుతూ పరవశించు జన్మ జన్మలా 

నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా 
పాడవే పాడవే కోయిలా 
పాడుతూ పరవశించు జన్మ జన్మలా 

నా గొంతు శృతిలోనా... ఆ...నా గుండె లయలోనా 

చరణం 1: 

ఒక మాట పదిమాటలై అది పాట కావాలనీ 
ఒక జన్మ పది జన్మలై అనుబంధమవ్వాలనీ 
అన్నిటా ఒక మమతే పండాలని 
అది దండలో దారమై ఉండాలనీ 
అన్నిటా ఒక మమతే పండాలని 
అది దండలో దారమై ఉండాలనీ 
కడలిలో అలలుగా కడలేని కలలుగా నిలిచిపోవాలనీ.... 
పాడవే.. పాడవే.. కోయిలా 
పాడుతూ పరవశించు జన్మజన్మలా 

నా గొంతు శృతిలోనా...ఆ.. నా గుండె లయలోనా 

చరణం 2: 

ప్రతిరోజు నువు సూర్యుడై నన్ను నిదుర లేపాలనీ 
ప్రతిరేయి పసిపాపనై నీ ఒడినీ చేరాలనీ 
కోరికే ఒక జన్మ కావాలనీ 
అది తీరకే మరు జన్మ రావాలనీ 
కోరికే ఒక జన్మ కావాలనీ 
అది తీరకే మరు జన్మ రావాలనీ 
వలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా 
ఎగిరిపోవాలనీ... 
పాడవే.. పాడవే.. కోయిలా 
పాడుతూ పరవశించు జన్మజన్మలా 

నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా 
పాడవే పాడవే కోయిలా 
పాడుతూ పరవశించు జన్మజన్మలా 

తానానె తననానా..... 
తానానె తననానా.... 

విక్కీ దాదా (1989)

 


చిత్రం: విక్కీ దాదా (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: మనో, జానకి


పల్లవి:
ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా
ఒళ్ళోకి రానీవ్వు ఎంత చెడ్డా
మొగ్గేసేలే అందానికే.. సిగ్గేసెలే పగ్గానికే
బీటే కొట్టేసి నా లైన్ లో పెట్టనా
ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా
నీతోనే నే కాలు జారి పడ్డా
ముద్దాడితే ముందుండనా.. ముప్పూటలా తోడవ్వనా
లైటే తీసేసి నీ లైన్ లో పెట్టుకో

ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా
ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా

చరణం: 1
నాకేమో పిచ్చాకలి... తీరేదే ఎట్టామరి
ఒల్లంతా ఒకటే చలి... తీరేనా ఈ రాతిరి
మెరుపు విరుపు రెండింతలై...
ఉడుకు దుడుకు రెట్టింపులై...
అది వేసిందమ్మ నీ తోడు
వల వేసిందయ్యో నా ఈడు...
పచ్చా పచ్చాగ కౌగిళ్లు కోరెదా

ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా
ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా

చరణం: 2
పైపైనే మోమాటమూ.. లోలోనా ఆరాటము
అంతేలే పోరాటము.. ఆడేలే కోలాటము
కలిసి కలిసి కవ్వింతగా...
వయసుసొగసు తుళ్ళింతగా
దులిపేసిందయ్యో నీ జోరు..
తొలి రోజుల్లోనే బేజారు...
నచ్చేదిచ్చేస్తే ఏ గొడవా లేదుగా

ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా
ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా
ముద్దాడితే ముందుండనా.. ముప్పూటలా తోడవ్వనా
బీటే కొట్టేసి నా లైన్ లో పెట్టనా
ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా
ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా


******  *******  *******


చిత్రం: విక్కీ దాదా (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

గంట గంటకీ మోత గుంటదీ
రోజు రోజుకీ మోజుగుంటదీ
ఏ కొమ్మ వంచాలి అమ్మా
ఏ రెమ్మ తుంచాలి అమ్మా
ఆకలుండదూ నిద్దరుండదూ
తుంటరీడు హద్దులన్ని తుంగలోకి తొక్కినాక

గంట గంటకీ మోత గుంటదీ
పూట పూటకీ పులకరిస్తదీ
నాకేదొ కవాలి అమ్మా
నేనెట్ట చెప్పలి అమ్మా
కొంగు నిలవదూ కోరికాగదూ
కుర్రవాడు బుగ్గ పండు గంటి పెట్టి యెల్లినాక

ఆవురావురంటు నీ అందమంటుకుంటూ
నిలెసి కలేసి వరించా
ఆపు ఆపు అంటు నీ ఆశనందుకుంటు
మజాలో నిజాలే గ్రహించా
మంచి చేసుకో మచ్చ మాయా
గిల్లి చూసుకో కజ్జి కాయా
అందమిచ్చుకో అస్మదీయ
తప్పు కాదులే తస్మదీయ
బుగ్గలోన చలాకి గిలాబి
ముద్దులోన జిలేబి షరాబి
వెన్నెలెందుకూ వన్నెలెందుకూ
మత్తులోన పడ్డదంట హత్తుకున్న వత్తిడింక

గంట గంటకీ మోత గుంటదీ
పూట పూటకీ పులకరిస్తదీ

సైగ చేసుకుంటు సరాగమాడుకుంటూ
షరాలే మరోలా విదించా
ఒల్లు ముట్టుకుంటు వసంత మాడుకుంటూ
చలేస్తే ఇలాగే వదించా
సొమ్ము చేసుకో సోకువాడ
కౌగిలింతలో కాకినాడ
సంధి చేసుకో సందకాడ
పొందు దాటిపో పొద్దు కాడ
మల్లె పూల మసాల నిషాలా
అల్లుకోవె ఇలాగె కుషీగా
ముందు చూడదూ వెనక చూడదూ
వయసు గంట కొట్టినాక వలచుకున్న ప్రేమ జంట

గంట గంటకీ మోత గుంటదీ
పూట పూటకీ పులకరిస్తదీ
ఏ కొమ్మ వంచాలి అమ్మా
నేనెట్ట చెప్పలి అమ్మా
ఆకలుండదూ నిద్దరుండదూ
కుర్రవాడు బుగ్గ పండు గంటి పెట్టి యెల్లినాక


******  *******  *******


చిత్రం: విక్కీ దాదా (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

బ్యూటి బ్యూటి నాదె నాదె
స్వీటి స్వీటి నీకె నీకె
గొప్పగా లాలిపాప్పుగా
సండె సంద్య వేల సరిహద్దులు దాటి పోరా
మల్లి మాఘ వేలా మన మద్యన పంతమేలా

బ్యూటి బ్యూటి నాదె నాదె
స్వీటి స్వీటి నీకె నీకె

అల్లుకున్న సోకు అజంత
అందగాడి తోనె బజంతా
కౌగిలింతలోనె కథంతా
కల్లుమూసుకుంటె అదెంతా
సిగ్గు పడ్డ కన్నె బుగ్గ జీడి పప్పు
ఒప్పుకుంటె తప్పుకన్న లేదు ఒప్పు
సిగ్గు పడ్డ కన్నె బుగ్గ జీడి పప్పు
ఒప్పుకుంటె తప్పుకన్న లేదు ఒప్పు
ఆడుకో నేడె వేడి వేడి ఈడు జోడు లిమ్మనిక్కు
వండే వచ్చి చూడు వలపంచులు దాటి పోతా
హాఫ్ డే చాలు నాకు నీ అంతే తేల్చుకుంటా

బ్యూటి బ్యూటి నాదె నాదె
స్వీటి స్వీటి నీకె నీకె

అందుకొప్పుకుంటె చాలు అవస్తా
అందముంటె చాలు శ్రమిస్తా
చాటు కొంచమైతె క్షమిస్తా
ఏటె ఈటె లాగ తెగిస్తా
చంప మీద చెయ్యి తీసి తగ్గు తగ్గూ
ఈవిటీస్ చేసుకుంట ఈవినింగూ
చంప మీద చెయ్యి తీసి తగ్గు తగ్గూ
ఈవిటీస్ చేసుకుంట ఈవినింగూ
ఆడుకో నేడె టింగు టంగు గింగిరాల పింగు పాంగు
ఫిఫ్టీ అయ్యి చూడు అహ మఫ్తీ మన్మధుడ్నీ
సేఫ్టీ ముందు చూడూ అహ సెక్సీ కుర్ర దాన్నీ

బ్యూటి బ్యూటి నాదె నాదె
స్వీటి స్వీటి నీకె నీకె
గొప్పగా లాలిపాప్పుగా
సండె సంద్య వేల సరిహద్దులు దాటి పోరా
మల్లి మాఘ వేలా మన మద్యన పంతమేలా

విక్కి దాద ఓకె ఓకె
విక్కి దాద ఓకె ఓకె


******  *******  *******


చిత్రం: విక్కీ దాదా (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారీందమ్మో
మారిందయ్యో మారిందయ్యో చూపు రంగు మారిందయ్యో
చేమంతి పూలతో చెలగాటమా
పూబంది ముద్దులే జమకట్టనా
ఇట్ట తిట్టబడి తిరగబడి చెల్లుబడి

జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారీందమ్మో
మారిందయ్యో మారిందయ్యో చూపు రంగు మారిందయ్యో

నీ తలుకులే బెలుకులై కొత్తగా
నీ పలుపులె వలపులై వెచ్చగా
పువ్వో నీ అందమతా పందిల్ల దాక రావలమ్మో
రంగో నీ ఆశలన్ని ఈనాడు దోస్తిగా మారలయ్యో
అరవిరి సొగసులు కావలమ్మో
అడిగిన వరసలు నేనెనయ్యో
మూడె ముల్లు పడి జంట పడి ప్రేమ గుడి

జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారీందమ్మో
మారిందయ్యో మారిందయ్యో చూపు రంగు మారిందయ్యో

ఏ వరములో చక చకా అందగా
ఆ వరములే వయసులే దిద్దగా
లైఫ్ యే ఈ నాడు ముచ్చట్లు జతగా చేసిందయ్యో
లవ్ ఏ నీ పాట నవ్వె నీ తోట కళగా మారిందమ్మో
కలిసిన మనసుల సంకిల్లలో
ముడిపడు మమతల సందిల్లలో
నీకే కంటబడి కట్టబడి కొంగుముడి

జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారీందమ్మో
మారిందయ్యో మారిందయ్యో చూపు రంగు మారిందయ్యో
చేమంతి పూలతో చెలగాటమా
పూబంది ముద్దులే జమకట్టనా
ఇట్ట తిట్టబడి తిరగబడి చెల్లుబడి

జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారీందమ్మో
మారిందయ్యో మారిందయ్యో చూపు రంగు మారిందయ్యో

శివ (1989)




చిత్రం: శివ (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర


ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్
సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్నుగీటితే...
చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే

ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్

చరణం: 1
గాలి మళ్లుతున్నది పిల్ల జోలికెళ్లమన్నది
లేత లేతగున్నది పిట్టకూతకొచ్చి ఉన్నది
కవ్వించే మిస్సు కాదన్నా కిస్సు
నువ్వైతే ప్లస్సు ఏనాడో యస్సు
క్లోజప్పులో కొత్త మోజిప్పుడే వింతగా ఉంటే
మోహాలలో పిచ్చి దాహాలతో మత్తుగా ఉంటే
వెన్నెలంటి ఆడపిల్ల వెన్నుతట్టి రెచ్చగొట్టగా  సరాగమాడే వేళ

ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్
సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్నుగీటితే...
చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే

చరణం: 2
లైఫు బోరుగున్నది కొత్త కైపు కోరుతున్నది
గోల గోలగున్నది ఈడు గోడదూకమన్నది
నువ్వే నా లక్కు నీ మీదే హక్కు
పారేస్తే లుక్కు ఎక్కింది కిక్కు
నీ బాణమే కొంటె కోణాలతో మెత్తగా తాకే
నా ఈలకే ఒళ్లు ఉయ్యాలగా హాయిగా తేలేలే
సింగమంటి చిన్నవాడు చీకటింట దీపమెట్టగా
వసంతమాడే వేళ

ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్
సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్నుగీటితే
చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే
ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్



***********   ***********  *********



చిత్రం: శివ (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో, ఎస్. జానకి

సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు
విరహాల గోల ఇంకానా వీలు కాదు
సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు
విరహాల గోల ఇంకానా వీలు కాదు
వంటిట్లో గారాలు ఒళ్ళంతా కారాలే సారు
చురుకైన ఈడు ఒద్దన్నా ఊరుకోదు
విరజాజి పూలు వంటిట్లో వాడరాదు

సూర్యుడే చుర చుర చూసినా
చీరనే వదలడు చీకటే చెదిరినా
కాకులే కేకలు వేసినా కౌగిలే వదలను వాకిలే పిలిచినా
స్నానానికే సాయమే రావాలనే తగువా
నీ చూపులే సోకుగా కావాలనే సరదా
పాపిడి తీసి పౌదరు పూసి బైటికే పంపేయనా
పైటతో పాటే లోనికిరానా పాపలా పారాడనా
తియ్యగ తిడుతూనే లాలించనా

సరసాలు చాలు శ్రీవారు తాన నాన
విరహాల గోల ఇంకానా ఊహు ఊహు

కొత్తగా కుదిరిన వేడుక
మత్తుగా పెదవుల నీడకే చేరదా
ఎందుకో తికమక తొందర
బొత్తిగా కుదురుగ ఉండనే ఉండడా
ఆరారగా చేరక తీరేదెలా గొడవా
ఆరాటమే ఆగదా సాయంత్రమే పడదా
మోహమే తీరే ఊతమే రాదా మోజులే చెల్లించవా
జాబిలే రాడా జాజులే తేడా రాతిరే రాదా ఇక
ఆగదే అందాక ఈడు గోల

చురుకైన ఈడు ఒద్దన్నా ఊరుకోదు
విరజాజి పూలు వంటిట్లో వాడరాదు
ఊరించే దూరాలు ఊ అంటే తియ్యంగ తీరు
సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు


**********    **********   *********


చిత్రం: శివ (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ

బోటని పాఠముంది మ్యాటని ఆట ఉంది
దేనికో ఓటు చెప్పరా...
హిస్టరీ లెక్చరుంది మిస్టరీ పిక్చరుంది
సోదరా ఏది బెస్ట్ రా
బోటని క్లాసంటే బోరు బోరు
హిస్టరీ రొష్టు కన్న రెస్ట్ మేలు
పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు
బ్రేకులు డిస్కోలు చూపుతారు

జగడ జగడ జగడ జగడ జాం (4)

దువ్వెనే కోడిజుట్టు నవ్వెనే ఏడ్చినట్టు
ఎవ్వరే కొత్త నవాబు
కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు
ఎవ్వరి వింత గరీబు
జోరుగా వచ్చాడే జేమ్స్ బాండ్
గీరగా వేస్తాడే ఈల సౌండ్
నీడలా వెంటాడే వీడి బ్రాండ్
ఫోజులే చూస్తుంటే ఒళ్ళు మండు

జగడ జగడ జగడ జగడ జాం (4)

అయ్యో మార్చినే తలుచు కుంటే
మూర్చలే ముంచుకొచ్చే
మార్గమే చెప్పు గురువా
ఆ చి తాళం రాదు మార్చట మార్చి
తాళం లో పాడురా వెధవా
మార్చినే తలుచు కుంటే
మూర్చలే ముంచుకొచ్చే
మార్గమే చెప్పు గురువా
కొండలా కోర్సు ఉంది ఎంతకీ తగ్గనంది
ఏందిరా ఇంత గొడవా
ఎందుకీ హైరానా వెర్రినాయన
వెళ్ళరా సులువైన దారిలోన
ఉందిరా సెప్టెంబర్ మార్చి పైన
హోయ్ వాయిదా పద్దతుంది దేనికైనా

మాక్సిమం మార్కులిచ్చు
మాథ్స్ లో ధ్యాస ఉంచు
కొద్దిగా ఒళ్ళు వంచురా ఒరేయ్
తందన తందనాన తందన తందనాన
తందన తందనాననా
క్రాఫ్ పై ఉన్న శ్రద్ధ గ్రాఫ్ పై పెట్టు కాస్త
ఫస్ట్ రాంక్ పొందవచ్చురా తందన
అరె ఏం సర్
లెక్కలు ఎక్కాలు తెల్వనోళ్లు
లక్కుతోని లచ్చలల్లో మునిగిపోతరు
పుస్తకాల్తో కుస్తీలు పట్టేటోళ్లు
సర్కారు క్లర్క్ అయ్యి మురిగిపోతరు

జగడ జగడ జగడ జగడ జాం (4)


********    *********   *********


చిత్రం: శివ (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఎన్నియల్లో.. మల్లియల్లో.. ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో.. తుళ్ళింతల్లో.. ఎన్నెన్ని కావ్యాలో
ఒంపుల్లో ఉన్న హంపి శిల్పాలు
ఒళ్ళంటుకుంటె చాలు నాట్యాలు
శృంగార వీణ రాగాలే... హోయ్!

ఎన్నియల్లో మల్లియల్లో.. ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో తుళ్ళింతల్లో.. ఎన్నెన్ని కావ్యాలో


సిగ్గేయగా.. బుగ్గ మొగ్గ.. మందార ధూళే దులిపే
జారేసినా.. పైటంచునా.. అబ్బాయి కళ్ళే నిలిచే
సందిళ్ళకే చలి వేస్తుంటే.. అందించవా సొగసంతా
ఒత్తిళ్ళతో ఒలిచేస్తోంటే.. వడ్డించనా వయసంతా
వెలుగులో కలబడే కళలు కన్నా
తనువులో తపనలే కదిపిన కధకళి లోనా

ఎన్నియల్లో.. మల్లియల్లో.. ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో.. తుళ్ళింతల్లో.. ఎన్నెన్ని కావ్యాలో

ఈ చీకటే.. ఓ చీరగా.. నా చాటు అందాలడిగే
ఈ దివ్వెలా.. క్రీనీడలే.. నీ సోకులన్నీ కడిగే
నీ మబ్బులే గుడి కడుతుంటే .. జాబిల్లిలా పడుకోనా
తబ్బిబుతో తడబడుతుంటే.. నీ గుండెలో నిదరోనా
ఉదయమే అరుణమై.. ఉరుముతున్నా
చెదరని నిదరలో.. కుదిరిన పడకలలోనా

ఎన్నియల్లో.. మల్లియల్లో.. ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో.. తుళ్ళింతల్లో.. ఎన్నెన్ని కావ్యాలో
ఒంపుల్లో ఉన్న హంపి శిల్పాలు
ఒళ్ళంటుకుంటె చాలు నాట్యాలు
శృంగార వీణ రాగాలే... హోయ్!

ఎన్నియల్లో మల్లియల్లో ఎన్నెన్ని అందాలో
లలలల..లలలలలా..

అగ్ని (1989)




చిత్రం: అగ్ని (1989)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు


అందాల కోట లోన టింగు రంగ రంగసాని
రంగు పొంగు హంగు చూడరొ
ఓయబ్బ లిప్పు కేకు కొరకరో
శ్రుంగార పెటలోన లింగు లిటుకు దొగసాని
కంగు తిన్న కథలు చూడరో
ఓయబ్బ లాలిపప్పలడగరో
మందార గందమిచ్చి మంచమేసి పంచిపెట్టు నీ ఊపులే
సందేల ఈల వేసి గోల చేసి పంచనివ్వు నీ షేపులే
జనకుజ్ అనకు లబకు జబకు తకిట తదిమి దరువు మనదిలే

అందాల కోట లోన టింగు రంగ రంగసాని
రంగు పొంగు హంగు చూడరొ
ఓయబ్బ లిప్పు కేకు కొరకరో

గుట్టూ రట్టూ గుమ్మ లేడికీ కిలాడీకీ
చలకి చంపమీద ముద్దు గుద్ది ముట్టడించి పోదునా
ఓట్టు పొడుగు కోమలానిగికీ లవాంగికీ
బడాయి బుంగమూతి బెంగ తీర్చి యెంగిలెట్టి కొట్టనా
పిడికిలడిగినా పిడక నడుములో
జమలహాటు జముకు మీటనా
అదుపుతొలిగినా కుదుపు నడకలే
డబురు మీటు గుబులు పెంచనా
మండపేట తోపు కాడ మాపటెల ఊపు వచ్చి
మంచమీద దుప్పటేసి మల్లెమొగ్గ దీపమెట్టి
మజాల పట్టు నిన్ను పట్టనా

అందాల కోట లోన టింగు రంగ రంగసాని
రంగు పొంగు హంగు చూడరొ
ఓయబ్బ లిప్పు కేకు కొరకరో

టింగు టింగు చెంగు సానికీ బటానికీ
బజారు సందులోన విందు చేసి వీదికెక్కి పోదునా
వంగి వంగి వన్నె లాడికీ వయ్యరికీ
హమ్మము సోపు వేసి స్నోను వేసి పాపు ట్యూను పాదనా
పదుచు పలుకులా పదక రానికి
త్రిబులు కాటు ట్రబులు ఇవ్వనా
ఒడుకు తెలిసినా వలపు వేనికి
తమలపాకు తడిపి ఇవ్వనా
పూల పల్లి సంత డాటి పాల కొల్లు చేరినాక
చల్లకొచ్చి ముంత దాచి చక్కిలాలు చేతికిస్తె
షిఫాను చీర కట్టు జారులె

అందాల కోట లోన టింగు రంగ రంగసాని
రంగు పొంగు హంగు చూడరొ
ఓయబ్బ లిప్పు కేకు కొరకరో
శ్రుంగార పెటలోన లింగు లిటుకు దొగసాని
కంగు తిన్న కథలు చూడరో
ఓయబ్బ లాలిపప్పలడగరో
మందార గందమిచ్చి మంచమేసి పంచిపెట్టు నీ ఊపులే
సందేల ఈల వేసి గోల చేసి పంచనివ్వు నీ షేపులే
జనకు జనకు లబకు జబకు తకిట తదిమి దరువు మనదిలే


*******  *******  ******


చిత్రం: అగ్ని (1989)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

జాబిల్లి ఎండల్లొ సరసాలో సరదాలో కసిగా కథల మొదలాయే
ఈ పూల దండల్లొ గమకాలో చమకాలో తొలిగా చలిగా కథలాయే
తనువుల కదలిక నడుముల కలయిక యేమి తాలమో
అది నను అడగక బిగువునవదలక యెంత తాపమో

జాబిల్లి ఎండల్లొ సరసాలో సరదాలో కసిగా కథల మొదలాయే
ఈ పూల దండల్లొ గమకాలో చమకాలో తొలిగా చలిగా కథలాయే

చిన్నప్పుడు ఈడున్నప్పుడు వేడున్నప్పుడు రేగెచప్పుడు
యెక్కడికక్కడ యెక్కిడి తొక్కిడి
సోకుల సిక్కడి ముద్దుల ముట్టడి
సాగినప్పుడు తొనదరే పుట్టినప్పుడూ
ఈ గుప్పెడు నా గుట్టిప్పుడు
విడగొట్టిప్పుడు జతకట్టిప్పుడు
చక్కెర చెక్కిలి చెక్కిన యెంగిలి
అంటిన కౌగిలి అత్తిటి లోగిలి చేరినప్పుడు సిగ్గులు జారినప్పుడు
గాజుల మల్లెల మోజుల వెల్లువ రోజుక వెన్నెల చిలికిన వలపుల
అలికిడికి తడిచిన తనువుల సందెల చిందిన
చందన కుంకుమ వందనమన్నది ఇందనమైనది
ఇద్దరి మోహన లాహిరిలో

జాబిల్లి ఎండల్లొ సరసాలో సరదాలో కసిగా కథల మొదలాయే
ఈ పూల దండల్లొ గమకాలో చమకాలో తొలిగా చలిగా కథలాయే

మాటిచ్చుకో యెద చోటిచ్చుకో
పొద మాటిచ్చుకో పెదవే పుచ్చుకో
అత్తరు మల్లెల మత్తులలో పడి
ఒంటరి జీవుడు హత్తుకు పోయిన రాసలీలలో
ఇప్పుడె బాస చేసుకో
పువ్వందుకో చిర్నవ్వందుకో జత నువ్వెందుకో నీకు లవ్వెందుకో
మెత్తని కాముడి జిత్తులలో పడి
ఒత్తుకు పోయెడి ఒంపులలో సుడి తాకి చూడనా
చూడనీ తలుకు చూడనా
చుక్కల పందిట చిక్కనిసందిట
చెక్కిలి గిచ్చుట తెలిసిన వయసుల
మధన ముడి బిగసిన మనసుల
సందడి ఊహల సందుల దూరిన
పొందుల వేలకు విందులు కోరిన తేనెల వానల తాకిడిలో

జాబిల్లి ఎండల్లొ సరసాలో సరదాలో కసిగా కథల మొదలాయే
ఈ పూల దండల్లొ గమకాలో చమకాలో తొలిగా చలిగా కథలాయే
తనువుల కదలిక నడుముల కలయిక యేమి తాలమో
అది నను అడగక బిగువునవదలక యెంత తాపమో

జాబిల్లి ఎండల్లొ సరసాలో సరదాలో కసిగా కథల మొదలాయే
ఈ పూల దండల్లొ గమకాలో చమకాలో తొలిగా చలిగా కథలాయే


*******  *******  ******


చిత్రం: అగ్ని (1989)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

ప్రేమ నగరు ప్రేయసికి టాట చెప్పేశా
కామ నగరు కౌగిలిలో వాట కొట్టెశా
ప్రేమ లేని లోకంలో దేవదాసునీ
తాగి ఉన్న మైకంలొ కామదాసునీ
ఊహలలోన ఊర్వసి నీవే ప్రేయసి నీవే రావమ్మో

ప్రేమనగరు ప్రేమికుడా నీకే ఓటేసా
కామనగరు వాకిలిలో కాకపట్టెసా

సుందరానిగివే యమ యమ అందగత్తవే
సందుగుందుల పొడిచిన చందమామవే
మాయలేడి లా కనపడి మనసు దోచనే
వెర్రిపుట్టినా మదనా వేనువూదకా
పిచ్చి ఈలతో వసును రెచ్చగొట్టకా
పైట లాగితే పెదవికి ముద్దు వస్తదీ
నీస రసం ప్రేమ రసం గుండెకెక్కిందీ
నీ పరువం పడుచుదనం నాకునచ్చిందీ
పార్వతులైనా స్రీమతులైనా యేమతులైనా బలాదూర్

ప్రేమనగరు ప్రేమికుడా నీకే ఓటేసా
కామనగరు వాకిలిలో కాకపట్టెసా

మోజు పడితిని శివ శివ మోసపోతినీ
మొగుడి కోసమే వెతుకుతుంటినీ
మోడలింగు టీములో మొదటి ఫిగరునీ
సంద్య వేలకీ సలసల సోకులివ్వవే
మందువేలకీ చిమచిమ చీకులివ్వవే
మొదటి చూపు విసురికే మొగుడునతినే
నీ వలపూ నీ ఒడుపు నాకు నచ్చిందీ
నీ వరస నీ దరువు నాకు వచ్చిందీ
ప్రేమికుడినా యేనటుడైనా చీకటి లోనె బలదూర్

ప్రేమ నగరు ప్రేయసికి టాట చెప్పేశా
కామ నగరు కౌగిలిలో వాట కొట్టెశా
ప్రేమ లేని లోకంలో దేవదాసువీ
తాగి ఉన్న మైకంలొ కామదాసువీ
ఊహలలోన ఊర్వసి నేనె ప్రేయసి నేనె రావయ్యో

ప్రేమ నగరు ప్రేయసికి టాట చెప్పేశా
కామ నగరు కౌగిలిలో వాట కొట్టెశా

విజయ్ (1989)

 


చిత్రం: విజయ్ (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు , చిత్ర


వాన రాతిరి ఆరు బయట నను
కవ్వించి రమ్మంది కౌగిల్లు ఇమ్మంది కల కాదు గా
వాన రాతిరి పైట లాగి నను
ఇబ్బంది పెట్టొద్దు ఇంకేమొ చెయ్యొద్దు చలి గా

మోజె తీరాలి నీతో జోడి కుదరాలీ
దాహం తీర్చలి ఈ వేల నీ కౌగిలీ
ఐతె రానా వద్దన్ననా
అమ్మమ్మమ్మో అయ్యయ్యయ్యో

తొలకరి చినుకుకు మెరుపులు మెరిసెను నీ మేనులో
సొగసరి మునకలు పిలవక పిలిచెను ఈ వేలలో
తడిపిన సొగసుకు తపనలు రగిలెను నీ చూపుతో
తడి తడి పెదవులు తడబడి అడిగెను ఏమేమిటో
మెత్తనొ కోరిక రెపరెపలాడెను నాలో
వెచ్చని వయసే అల్లరి చేసె నాలో
జల్లుల్లోనా జతగా రార
అమ్మమ్మమ్మో అయ్యయ్యయ్యో

వాన రాతిరి ఆరు బయట నను
కవ్వించి రమ్మంది కౌగిల్లు ఇమ్మంది కల కాదు గా
వాన రాతిరి పైట లాగి నను
ఇబ్బంది పెట్టొద్దు ఇంకేమొ చెయ్యొద్దు చలి గా

మోజె తీరాలి నీతో జోడి కుదరాలీ
సాహం తీర్చలి ఈ వేల నీ కౌగిలీ
ఐతె రానా వద్దన్ననా
అమ్మమ్మమ్మో అయ్యయ్యయ్యో

తొలి తొలి కోరిక తొనదర చేసెను ఈ జల్లులో
చలి చలి వేలకు తహతహరేగెను నా గుండెలో
విరిసిన మొగ్గకి మెరిసిన బుగ్గకి నా ముద్దుకీ
అలసటి రేగెను అలసట తీరెను ఈ పూటకీ
చిరు చిరు ముద్దులు హద్దులు దాటిన వేలా
చిత్తడి జల్లులు తెచ్చెను మల్లెల గోలా
తియ్యని బాద వస్తే పోదా
అమ్మమ్మమ్మో అయ్యయ్యయ్యో

వాన రాతిరి ఆరు బయట నను
కవ్వించి రమ్మంది కౌగిల్లు ఇమ్మంది కల కాదు గా
వాన రాతిరి పైట లాగి నను
ఇబ్బంది పెట్టొద్దు ఇంకేమొ చెయ్యొద్దు చలి గా

మోజె తీరాలి నీతో జోడి కుదరాలీ
దాహం తీర్చలి ఈ వేల నీ కౌగిలీ
ఐతె రానా వద్దన్ననా
అమ్మమ్మమ్మో అయ్యయ్యయ్యో

సీతారామరాజు (1999)

చిత్రం: సీతారామరాజు (1999)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర


శ్రీవారు దొరగారు అయ్యగోరు
ఏంటండీ మీ పేరు ఆయ్ చెప్పండీ
వరదల్లే ప్రేమే పొంగి ఉరకలు వేసే వేళ
ముదు ముద్దుగ అంటాలెండి మీ సరదా తీరేలా
డార్లింగ్ గారు డార్లింగ్ గారు
గారెందుకు బంగారు వింటుంటే కంగారూ
గారంగ శృంగారంగా డార్లింగ్ అంటే చాలు
డార్లింగ్ కీ లింగు లిటుకు లింకులు పెడితే బోరు
ఓ మై డియరూ...  ఓ మై డియరూ

చరణం: 1
ఊఁ నరనరాల్లోన చలిజ్వరం చూడు తెగ కరుస్తున్నదే ఏం చేయనే...
ఊఁ కలవరంలోన చలివరం కోరు నసతెలుస్తున్నది మందీయనా...
కనుక్కోవ కుశలం కాస్తైన
అతుక్కోను సమయం చూస్తున్న
నచ్చావే నాటీ నాంచారు ఓ మై డియరూ
శ్రీవారు దొరగారు
మేరీ శ్రీమతి గారు

చరణం: 2
ఓ... యమతమాషాల తమ తతంగాల బుసబరించేదెలా ఇంటాయనో ఓయ్
ఊఁ మిసమిసల్లోని రస రహస్యాన్ని రగిలిస్తే మెల్లగ చల్లారునో
నిగారాల సొగసులు ఇవ్వాల
ఇలాంటేల అనుమతి కావాల
తయ్యారు అయ్యారా మీరూ డార్లింగ్ గారూ
అబ్బా... ఇంకానా
ప్యారి పెళ్ళాంగారు మేరీ శ్రీమతి గారు
సరసంలో  ముద్దే ముదిరి హద్దులు చెరిగే వేళ
చిలకల్లే చిలిపిగ నన్ను పిలావలే ప్రియురాల
ఓ మై డియరూ
మా ఊళ్లో ఆడాళ్ళూ ఏమయ్యె అంటారు ఊహూఁ
ఆ పిలుపే మోటుగా ఉంటే మారుస్తాలే తీరు ఆఁ
డార్లింగ్ కు గారొద్దంటే తీసేస్తాలే సారూ ఎస్ ఎస్
ఓ మై డియరూ
హాయ్ హాయ్ డియరూ
రా మై డియరూ
ఎస్ ఎస్ డియరూ


*********   *********   *********


చిత్రం: సీతారామరాజు (1999)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, యమ్.యమ్.కీరవాణి, రాధిక, శారద

పల్లవి :
ఛాంగురే ఛాంగురే మమత నిను కోరే
ఛాంగురే ఛాంగురే చెలిమి నిను చేరే
అల్లుకున్న బంధాలు చల్లుతున్న చందనాలు
వెల్లువైన వేళలో తిరిగి తెల్లవారే

చరణం: 1
అన్నయ్యా నీ అలక పైపైనేనని
తెలుసును లేవయ్యా
తమ్ముడూ నీకు తెలుసన్న సంగతి
నాకు తెలుసయ్యా
ఎన్ని కళలో వెంటతెచ్చెనంట
చూడ ముచ్చటైన మురిపెం
ఎన్ని సిరులో రాసిపోసెనంట
సంకురాత్రి వంటి సమయం
మనసే కోరే అనుబంధాలు దరిచేరే
తరతరాల తరగని వరాలగని అని
మనింటి మమతని మరిమరి పొగిడిన
పదుగురి కను వెలుగై
సాగుతున్న వేళలో మనది పూలదారే

చరణం: 2
కొమ్మలో కోయిలను కమ్మగ లేపిన
కిలకిల సంగీతం
గొంతులో మేలుకొని కోటి మువ్వల
కొంటె కోలాటం
ఎంత వరమో రామచంద్రుడంటి
అన్నగారి అనురాగం
ఏమి రుణమో లక్ష్మణుణ్ని మించి
చిన్నవాని అనుబంధం
ఇపుడే చే రే పది ఉగాదులొకసారే
ప్రియస్వరాలు చిలికిన వసంత వనముగ
అనేక జన్మల చిగురులు తొడిగిన
చెలిమికి కలకాలం
స్వాగతాలు పాడనీ సంబరాల హోరే

గ్రీకువీరుడు (2013)

చిత్రం: గ్రీకువీరుడు (2013)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిచరన్, వర్ధన


ఏ పరిక్షలో తనకు...ఏం ప్రయోజనం కలుగు..
అని తనంతనైనా అడగదేమి మనసు..
తీయని త్రుప్తి కలుగుతుందో..
తీరని నొప్పి మిగులుతుందో..
ఇది వరం అనాలొ...షాపం అనాలొ తేల్చుకోదెందుకో...

పొందేదేమిటో...పోయెదేమిటో ఏమో...
అసలీ మార్గమెందుకొ ఎంచుకుందో హ్రుదయం తనె ఇపుడూ..
గెలుపందించునో...హో..గెలుపే ఓడించునో..
జరిగేదేమిటంటె ఏం చెప్పనంది సమరం..ఫలితమేదో...

గతమేదొ తరుముతుంటె..ఆ స్మ్రుతులు చెరపకుంటె...
మది తపన తీర్చగల చెలిమి దొరుకుతుందా..
జన్మను మలుచుకున్న సత్యం..నమ్మదు సులువుగా ప్రపంచం..
ఆ మార్పు ఏమి సదించెనంటె ఏం చూపగలదు సాక్షం..

ఒంటరి యాత్రలో...ఎంతటి యాతనో అయినా..
మోయక తప్పదేమొ యేకాకి గుండె భారం..ఎన్నాలైనా..
యే తుది తీరమొ చూపించె.. ఎదే పరమార్దమో...
లోకం తెలుసుకునేల చేయగలదా కాలం..
ఎన్నడైనా....


*******  *******   ******


చిత్రం: గ్రీకువీరుడు (2013)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: రంజిత్, నవీన్ మాధవ్

i hate love stories... అందానికి నే దీవాన
weekend ప్రేమంటె... ముందుంటానె హసీనా
i hate love stories... pain is equal to ప్రేమా

oh rum and rise and shine... wanna won and women and wine
దబదీ దబదీఎ దబదీఎ బో
everyday is mine oh mine life is just too short
go give it all you got no matter where you touch me
i am hot right at the spot

డాల్లర్నే ప్రాణంకన్న ఎక్కువగ ప్రేమిస్తున్నా
కలలన్ని నే కొంటున్న ఆశలపై విసిరేస్తున్నా

oh rum and rise and shine... wanna won and women and wine
దబదీ దబదీఎ దబదీఎ బో
everyday is mine oh mine life is just too short
go give it all you got no matter where you touch me
i am hot right at the spot

సంతోషం ఒల్లొ తేలేదె ఏ జమాన
ప్రేయసి ప్రేమైన రేపటికెలె పురాన
లీగల్ ప్రేమంటె షాది అని నేనంటున్న

oh rum and rise and shine... wanna won and women and wine
దబదీ దబదీఎ దబదీఎ బో
everyday is mine oh mine life is just too short
go give it all you got no matter where you touch me
i am hot right at the spot

అనందం అంచుల పైన తేలడమె లైఫ్ అంటున్న
వేగంలో కాలం కన్న ముందే ఉండాలంటున్న

oh rum and rise and shine... wanna won and women and wine
దబదీ దబదీఎ దబదీఎ బో
everyday is mine oh mine life is just too short
go give it all you got no matter where you touch me
i am hot right at the spot


*******  *******   ******


చిత్రం: గ్రీకువీరుడు (2013)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: బాలాజీ
గానం: రంజిత్

oh baby am in love
o girl am shining like a star above
right now am feeling like u making me
crazy cause am faaling in love

baby u always mine
forever together we will always shine
i love u more than you never know
i can never ever let you go

నే విన్నది నిజమేన నువన్నది నేనేనా
నా గుండెల చప్పుడు ఇప్పుడు నీదేనా
నే కన్నులు మూస్తున్న నీ కలలే కంటున్నా
నీ ప్రేమకు నేనిక బానిసనవుతున్నా
హేయ్ నువు దొరికిన వరమని తెలిసే
నిను వదలక తిరిగెను మనసే
తడబడి ఎద పరుగులు తీసే
ప్రతి అడుగున నిన్నిక చుసె
నిను నను మనమని ముడి వేసే
చెరి సగమై పోయెను మనసే
చెరి సగమై పోయెను మనసే
చెరి సగమై పోయెను మనసే

oh baby am in love
o girl am shining like a star above
right now am feeling like u making me
crazy cause am faaling in love

baby u always mine
forever together we will always shine
i love u more than you never know
i can ever never let you go

నే విన్నది నిజమేన నువన్నది నేనేనా
నా గుండెల చప్పుడు ఇప్పుడు నీదేనా

హెయ్ అనువనువనువున హాయనిపించె గ్ఞాపకమే నీదిగా
నా నీడకు రూపం వుంటె అది నువ్వేగా
హెయ్ ప్రతి జన్మకు తోడుగ నేనై పరిచర్యలు చేయనా
ప్రతి క్షణమొక జన్మను చుస్తా నీ ఒడిలోన
నిన్ను నన్ను కలిపింది మధ్య దూరం
వేరే వున్నా మన ఇద్దరిదొక ప్రాణం
మన ఇద్దరిదొక ప్రాణం

oh baby am in love
o girl am shining like a star above
right now am feeling like u making me
crazy cause am faaling in love

baby u always mine
forever together we will always shine
i love u more than you never know
i can never ever let you go ... falling in love

నే విన్నది నిజమేన నువన్నది నేనెనా
నా గుండెల చప్పుడు ఇప్పుడు నీదేనా
నే కన్నులు మూస్తున్న నీ కలలే కంటున్నా
నీ ప్రేమకు నేనిక బానిసనవుతున్నా


*******  *******   ******


చిత్రం: గ్రీకువీరుడు (2013)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: సాహితి
గానం: యస్.పి.బాలు

ఒ నాడు వాషింగ్.టన్ లొ స్కేటింగ్ చేస్తు ఉండంగా
మబ్బుల్లొ జాబిలి లాగ నేనా పిల్లని చుశాగా
కల్లె చెదిరె ఆ అందం నా ముందె కనిపించంగ
నే సంబర పడిపోయ తను తికమక పడుతు నాపై పడిపోయె
hospital లొ చేర్చాక ఆ పిల్లె ఓ డాక్టర్ గా
తొలి పరిచయమయ్యాక నే మాటలు కలిపెశాలె సరదాగ
వింతగ మొదలె అయినా స్నేహమె అలా ప్రేమగ మరేనంటా
యెప్పటి నుంచో కన్న తీయని ఆ కలా అప్పుడు తీరేనంటా

ఒ నాడు వాషింగ్.టన్ లొ స్కేటింగ్ చేస్తు ఉండంగా
మబ్బుల్లొ జాబిలి లాగ నేనా పిల్లని చుశాగా

గారి గారి నీ love story
చివరికి యెట్టా గెలిచిందొ చెపుతవ ఓ బావ
అదో భారి so long story
ఓ.. బార్సింగు మల్లన్నా పిల్ల తండ్రి
తిప్పులు తిప్పాడె ఎన్నొ తిప్పలు పెట్టాడె
ఓ.. నా ఒల్లు గుల్లయినా చేసాను
వాడి పిల్ల కోసమె ఓ మల్ల యుద్ధమే
ప్రేమ కోసం మ్రుత్యువుతో పోరాడి నేనోడంగా
మనసెంతో వేదనగ తన కన్నులు జడి వానల్లే కురవంగా
బిడ్డ కోసం తన పంతం ఆ తండ్రె విడిచేయంగా
నా చెలియే నవ్వంగ తన ప్రేమనె నే గెలిచాగ గర్వంగా
నీ కథ వింటు ఉంటె నిండు ప్రేమలొ మాయగ ఉయ్యలూగే
నీ యెద తుల్లి ఆడె పెళ్ళి పాటలొ ఈ కథ ఎలా సాగె

చదస్తాల ఆ పిల్ల తల్లి
సంప్రదాయంతో మతినె పోగొట్టె మాహ తల్లి
నన్నె పిలిచి అల్లం టీ ఇచ్చి
హేయ్ తిధి వార ఫలాల మేలయిన జోడికుదిరినప్పుడె మేల తాలలందిలే
హేయ్ హీట్ అయిన గుర్రన్నె నేనెక్కి స్వారి
చేసినప్పుడె పెల్లి లగ్గలందిలే
తతలనాటి షివుడి వేలాడె కత్తె ఎచ్చి
నా చేతె పట్టించి నా నడుముకి చంకి పట్టి కట్టింది
పోట పోటి ఆ కుస్తి రంగాన్నే వేదిక చేసి
విరి జల్లుల జడి లోని మహా సందడిగా మా పెళ్ళె జరిపింది
కాలం కలిసె ఉంటె మీ కళ్యానమె ఇక్కడ జరిగుండేది
పెళ్ళి వైభోగన్నె మేము చూసుంటె ఎంతో బాగుండేది

ఒ నాడు వాషింగ్.టన్ లొ స్కేటింగ్ చేస్తు ఉండంగ
మబ్బుల్లొ జాబిలి లాగ నేనా పిల్లని చుసాగ


*******  *******   ******


చిత్రం: గ్రీకువీరుడు (2013)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: వనమాలి
గానం: మల్లికార్జున రావు

ఎవ్వరు లేరనీ బంధమె చేదనీ చూడనె లేదు ప్రేమ్మని ఇన్నళ్ళుగా

అందరు ఉండగా... ఒంటరయ్యానిలా
గుండెలొ మోయలేని కంటి నీరు సాక్షిగా కవాలి తోడు అందిగా ఎదెంతొ బాదగా
నిండుగ నూరెల్లనె ఇలా పంచుకొవాలనుందనీ తలే వంచి చెప్పాలి మీకని
నే మనిషిగా మారి మీ మనసులో చేరి మీ వాడిని అవ్వాలనీ.. ప్రతిక్షణం

నిన్నల లేననీ నేడునె వేరనీ ఈ క్షణం లోకానికి చెప్పేదెలా
ఉన్న మాట చెప్పేసీ... గుండె కోత కొయ్యాలా
దుక్కాన్నిలా మోస్తూనె సంతోషాన్ని ఇవ్వాలా
పదే పదే పెదాలపై విషన్నలా చిమ్మినా
ప్రతి క్షణం ఎల నను ముడెశని కోవెలా
అనుభందం అంటేనె బాదేలె అనుకున్ననాడు
ఆనందమే పంచి లాలించు ముంగిట్లొ నా ప్రాణమే కోరినా.. ఇచ్చేయనా

నిన్నల లేననీ నేడునె వేరనీ ఈ క్షణం లోకానికి చెప్పేదెలా

తప్పులన్ని ఒప్పయ్యె... స్వప్నమేదొ కంటున్నా
ఇన్నల్లునే చేదన్న ప్రేమె నాదయ్యేనా
ఎల ఎల నిన్నే వీడి యెటొ అటు సాగడం
నిజాలనే ఉరేసిన గతానికే జారడం
ప్రతీ జన్మ నీతోనె అడుగేసె వరమివ్వాలి నువ్వె
నా ముల్ల బాటల్లొ పూదారివి అయ్యావు నీ తోడు నాకెప్పుడు... కావలిలే

ఆజాద్ (2000)



చిత్రం: ఆజాద్ (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్ , మహాలక్ష్మి అయ్యర్


పల్లవి:
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా

కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా

కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా

చరణం: 1
ఓ... నిను చూడనీ నిశిరాతిరి
నిదరైనపోని కనుల పాపవో
ఒహో హో... నిను తాకని నిమిషాలలో
కునుకైన రాక కుమిలే భాదవో
గాలుల్లో ఊసులు కళ్ళల్లో ఆశలు
కౌగిట్లో పూసిన కామాక్షి పువ్వులు
ఏ తోటవైనా నీ పూజకేలే

కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా

చరణం: 2
ఓ... మలి సందెలో నులి వెచ్చగా
చలి దాచుకున్న చనువే హాయిలే
ఓ... నడిరేయిలో నడుమెక్కడో
తడిమేసుకున్న గొడవే తీపిలే
ఓ... వీణల్లో తీగలా తీగల్లో మూగలా
మీటే కవ్వింతలో పాటే కళ్యాణిగా
నా పాట వింటే నీ పైట జారే

కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా



*********   *********   *********



చిత్రం: ఆజాద్ (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర, హరిహరన్

పల్లవి:
సుడిగాలిలో తడి ఊహలో
చెలి సోకెనమ్మ ఏవో చలి ఊసులు
చెలి నేనుగా తొలిసారిగా
చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు
తెలిసిందమ్మ ఆడదానినని తెల్లారేసరికి
పిలిచిందమ్మా పురుషా అంటూ
మళ్ళి మళ్ళి ఒళ్ళే తుళ్ళింతై
ఓయమ్మో ఈ హాయమ్మో అమ్మమ్మో

సుడిగాలిలో తడి ఊహలో
చెలి సోకెనమ్మ ఏవో చలి ఊసులు
చెలి నేనుగా తొలిసారిగా
చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు

చరణం: 1
నా ఊహలో పుట్టుకొచ్చాడే ఊరించే ఈ కళ్ళతో
ఏ దాహమో పుట్టుకొచ్చిందే ఎన్నెళ్ళ ఎంగిళ్ళతో
వాడు జతపడితే ఎన్ని కితకితలు అందాలలో
ఆమె కనపడితే ఎన్ని కుతకుతలు సందేళలో
ఏమీ తోచదు పొద్దు పోదురా ముద్దు చేసిపోరా
రెప్పే వాలదు రేపు రాదులే
తుళ్ళే పాపా ఒళ్ళొకొచ్చెయ్ వే...
ఓయమ్మో  మా యమ్మో అమ్మమ్మో

సుడిగాలిలో తడి ఊహలో
చెలి సోకెనమ్మ ఏవో చలి ఊసులు
చెలి నీవుగా తొలిసారిగా
చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు

చరణం: 2
సంపెంగ పువ్వంటి నీ ముక్కు చల్లింది గంధాలు కౌగిట్లో
సిరివెన్నెలే రువ్వు నీ నవ్వు నిను చేర రమ్మంది చీకట్లో
దాని కిలకిలలకెన్ని కోకిలలు నా గూటిలో
వాడి గుసగుసలకెన్ని కోరికలు నా గుండెలో
కాలం సాగదు కాలు ఆగదు కాదు రేపు అనకే
దిండు కాపురం చెయ్యలేదులే
పాలు పండు అన్నీ నీతోనే...
ఓయమ్మో ఈ హాయమ్మో అమ్మమ్మో

సుడిగాలిలో తడి ఊహలో
చెలి సోకెనమ్మ ఏవో చలి ఊసులు
చెలి నీవుగా తొలిసారిగా
చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు
తెలిసిందమ్మ ఆడదానినని తెల్లారేసరికి
పిలిచిందమ్మా పురుషా అంటూ
మళ్ళి మళ్ళి ఒళ్ళే తుళ్ళింతై
ఓయమ్మో ఈ హాయమ్మో అమ్మమ్మో



*********   *********   *********



చిత్రం: ఆజాద్ (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: సుఖ్విందర్ సింగ్, చిత్ర

హాయ్ హాయ్ నాయకా అత్తమ్మ కొడకా
నా సొత్తు యావత్తు నీదింక
సై సై బాలిక అందాల చిలక
నీ సోకు నాజూకు నాదింక
చీర దులిపేసే చూపులకు జోహారు
సిగ్గు చిదిమేసే కోరికలే నా జోరు

ఒహో హోహో  హోహో హోహోహో (2)

హాయ్ హాయ్ నాయకా అత్తమ్మ కొడకా
నా సొత్తు యావత్తు నీదింక
సై సై బాలిక అందాల చిలక
నీ సోకు నాజూకు నాదింక

లలల లాలా లాలా లలలా (2)

చరణం: 1
ఎక్కడిదో ఈ వయసు చెలీ దక్కెనులే నీ దినుసు
తొక్కిడిలో నా సొగసు యమా ఉస్కులడి నా మనసు
మంచాలలో మల్లె కంచాలలో
వండి వార్చాను వయ్యారి నా తళుకులు
చెక్కిళ్ళలో వాటి పక్కిళ్ళలో
దిద్దుకున్నాను ముద్దులతో నా తెలుగులు
గుట్టు రైక ముడి పట్టు కదా నా పరువు
అది ఫట్టుమనే బీటు కదా నా దరువు

ఒహో హోహో  హోహో హోహోహో (2)

హాయ్ హాయ్ నాయకా అత్తమ్మ కొడకా
నా సొత్తు యావత్తు నీదింక
సై సై బాలిక అందాల చిలక
నీ సోకు నాజూకు నాదింక

చరణం: 2
ఒత్తిడిలో ఒక్క క్షణం
చిత్తడిలో అగ్ని కణం
అందుకనే ఆడతనం
ముద్దులకే మూలధనం
ఈడన్నది పుంజు కోడైనది
దాని కొక్కొరొకో నీకొరకేలే తెలుసుకో
తోడన్నది కొత్త జోడైనది
దాని జోరు మరి ఆగదులే ఈ వయసులో
కన్నె గువ్వ చెలి దువ్వి మరీ పోగొడతా
ఉన్న కోడె గిలి తవ్వి మరి రాబడతా

ఒహో హోహో  హోహో హోహోహో (2)

హాయ్ హాయ్ నాయకా అత్తమ్మ కొడకా
నా సొత్తు యావత్తు నీదింక
హే సై సై బాలిక అందాల చిలక
నీ సోకు నాజూకు నాదింక
చీర దులిపేసే చూపులకు జోహారు
సిగ్గు చిదిమేసే కోరికలే నా జోరు

ఒహో హోహో  హోహో  హోహోహో (2)
లలల లాలా లాలా లలలా (2)


*********   *********   *********


చిత్రం: ఆజాద్ (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, యస్.పి.బాలు, సుజాత

పల్లవి:
చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క (2)
చెమ్మ చెక్క చెమ్మ చెక్క (2)

చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్
చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్
కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్
సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్
సరదాల సంగీతంతో చెలరేగింది సన్నాయి
బరువైన సంతోషంతో తలవంచింది అమ్మాయి
పెళ్ళి సందళ్ళలో

చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్
చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్
కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్
సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్

చరణం: 1
ఊరు వాడ వచ్చి ఈడు జోడు మెచ్చి
సంబరంగ చూస్తారంట
కన్న వారు వచ్చి కన్నె దానమిచ్చి
కంటనీరు పెడతారంట
తడి కళ్ళే ప్రమిధలుగా వెలిగే పందిరిలోన
పరవళ్ళే అందెలుగా ఆడే అనందాన
పిట్ట కూత పంచె కట్టుకుంది మంత్రాలు వల్లిస్తూ
హేయ్ పిల్ల గాలి పెళ్లి పెద్దయ్యింది పన్నీరు చల్లిస్తూ
పెళ్లి సందళ్ళలో

చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్
చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్
కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్
సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్

చరణం: 2
పట్టు చీర కట్టి పూల జడ చుట్టి కొత్త కళ మురిసే వేళ
వాన విల్లు వంటి జాణ వన్నెలంటి వెయ్యి కళ్ళు మెరిసే వేళ
నిలువెల్లా విరిసింది పులకింతల పూదోట
విరిముళ్ళే విసిరింది పురి విప్పిన సయ్యాట
ఆడ జన్మ మేలుకుంది చూడు సరికొత్త రూపంతో
ఓయ్ అంగరంగ వైభవంగ నేడు జరిపించు వేడుకతో
పెళ్లి సందళ్ళలో

చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్
చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్
కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్
సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్
సరదాల సంగీతంతో చెలరేగింది సన్నాయి
బరువైన సంతోషంతో తలవంచింది అమ్మాయి
పెళ్ళి సందళ్ళలో

చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్
చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్
కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్
సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్

చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్
చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్
కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్
సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్


********   ********  ********


చిత్రం: ఆజాద్ (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్, వసుంధరా దాస్

పల్లవి:
సో సో సో అరె సోనారే నిను చూస్తే నోరూరే
దగ్గరికొస్తే దిల్ మాంగే మోరే
జో జో జో అరె ఎంజోరే చేస్తున్నా జోహారే
మాపటికొస్తే మాయ మచ్చింద్రే
యమరే అదిరే నీ అందం నాతో జమరే
కుదిరే ముదిరే ఈ సరసం వేస్తూ నెమరే
అరె హాయ్ అరె హాయ్
అరె హాయ్  హాయ్ హాయ్ హాయ్ హాయ్

జో జో జో అరె ఎంజోరే చేస్తున్నా జోహారే
మాపటికొస్తే మాయ మచ్చింద్రే
సో సో సో అరె సోనారే నిను చూస్తే నోరూరే
దగ్గరికొస్తే దిల్ మాంగే మోరే

చరణం: 1
చిన్న ముళ్ళు వెనకాల పెద్దముళ్లు తీరగాల
కన్నె పిల్ల వెనకాల కుర్రవాడు నడవాలి
పన్నెండైతే పెనవేయాలి హో హో హో హో
సమయం అక్కడ స్టాప్ అవ్వాలి హో హో హో
ఒడిలో వడిగా మొదలవని టిక్ టిక్ గొడవే
అరె హాయ్ అరె హాయ్
అరె హాయ్  హాయ్ హాయ్ హాయ్ హాయ్

సో సో సో అరె సోనారే నిను చూస్తే నోరూరే
దగ్గరికొస్తే దిల్ మాంగే మోరే
హేయ్ జో జో జో అరె ఎంజోరే చేస్తున్నా జోహారే మాపటికొస్తే మాయ మచ్చింద్రే

చరణం: 2
నవ్వులోనే పుడుతుండే అరె వెయ్యి వాట్ల విద్యుత్తే
నీ హార్ట్ బాటరీ లోనే అది అట్టిపెట్టుకో అంటే
బిల్లులు కట్టే బాదే మాయం హో హో హో హో
చార్జిలు పెంచితే మనకే నష్టం హో
నాకే ఓకే నీ పవరింకొకరికి షాకే
అరె హాయ్ అరె హాయ్
అరె హాయ్  హాయ్ హాయ్ హాయ్ హాయ్

అరె సో సో సో అరె సోనారే నిను చూస్తే నోరూరే
దగ్గరికొస్తే దిల్ మాంగే మోరే
జో జో జో అరె ఎంజోరే చేస్తున్నా జోహారే
మాపటికొస్తే మాయ మచ్చింద్రే
యమరే అదిరే నీ అందం నాతో జమరే
కుదిరే ముదిరే ఈ సరసం వేస్తూ నెమరే
అరె హాయ్ అరె హాయ్
అరె హాయ్  హాయ్ హాయ్ హాయ్ హాయ్


*********   *********   *********


చిత్రం: ఆజాద్ (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: అబిజిత్

కొయిల కొయిల కొయిల
కొయిల కొయిల కొయిల హోయ్ (2)

దమ్మరధం కదిలింది రధం చిరునవ్వుతో చెప్పేయ్ టాటా
బ్రహ్మకదం కలిపింది రిథమ్ పట్టాలను ఎక్కిన బాట
దుమ్మురేపుతూ రేగాలి బతుకు బండి సాగాలి
పలకరింతలే కావాలి పులకరించి పోవాలి

కొయిల కొయిల కొర కొయిలా
కొర కొయిల కొయిల కొర కొయిలా (4)

రెక్కలనే విప్పుకొని చుక్కలతీరం చేరుకొనే
గువ్వలలో ఆశబలం
ఉప్పెనకే ఎదురీదే ఊపిరి సలపని ఈతల్లో
చేపలకే ఉంది జయం
చుర చుర చూపుల సూర్యుడు పరుగాగేనా ఓ ఓ
సిరి సిరి వెన్నెల చంద్రుడు వెలుగారేనా

కొయిల కొయిల కొర కొయిలా
కొర కొయిల కొయిల కొర కొయిలా (4)

అమ్మా బైదెళ్ళినాది తల్లి బైదెళ్ళినాది
చెల్లి బైదెళ్ళినాదో
అన్నా బైదెళ్ళినాడు నాన్నా బైదెళ్ళినాడు
తమ్మి బైదెళ్ళినాడో

గుప్పుమనే గంధంతో విచ్చుకొనే పువ్వులకే
తెలియదులే గమ్యం
పచ్చదనం పరుచుకొని పంటగ మారే పడుచుదనం ప్రాయమనే కావ్యం
ఎవరికి వారే యమునా తీరే అయినా ఓ ఓ
తొలకరి ఆశల పయనం దిశ మారేనా

కొయిల కొయిల కొర కొయిలా
కొర కొయిల కొయిల కొర కొయిలా (2)

దమ్మరధం కదిలింది రధం చిరునవ్వుతో చెప్పేయ్ టాటా
బ్రహ్మకదం కలిపింది రిథమ్ పట్టాలను ఎక్కిన బాట
దుమ్మురేపుతూ రేగాలి బ్రతుకు బండి సాగాలి
పలకరింతలే కావాలి పులకరించి పోవాలి

కొయిల కొయిల కొర కొయిలా
కొర కొయిల కొయిల కొర కొయిలా (6)