చిత్రం : అమ్మకోసం (1970)
సంగీతం : ఆదినారాయణరావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు
పల్లవి :
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఓ..ఓహొ..హో..
హేహేయ్...
గువ్వలా ఎగిరిపోవాలి.. ఈ..ఈ..ఈ..
ఆ తల్లి గూటికే చేరుకోవాలీ... ఈ..ఈ..ఈ..
గువ్వలా ఎగిరిపోవాలి.. ఈ..ఈ..ఈ..
ఆ తల్లి గూటికే చేరుకోవాలీ... ఈ..ఈ..ఈ..
చరణం 1 :
ఇన్నాళ్ళు రగిలెను చెరసాలలో... మూగకన్నీరు మిగిలెను కనుపాపలో
ఇన్నాళ్ళు రగిలెను చెరసాలలో... మూగకన్నీరు మిగిలెను కనుపాపలో
ఆ కన్నీరు తుడిచే పన్నీరు చిలికే...
ఆ కన్నీరు తుడిచే పన్నీరు చిలికే...
చల్లని ఆ చేయి కావాలి.... ఆమె చెరణాలపై వాలిపోవాలి
గువ్వలా ఎగిరిపోవాలి.. ఈ..ఈ..ఈ..
ఆ తల్లి గూటికే చేరుకోవాలీ... ఈ..ఈ..ఈ
చరణం 2 :
జగమంత ఒక వింత చదరంగము... పాడు విధియేమో కనరాని సుడిగుండము
జగమంత ఒక వింత చదరంగము... పాడు విధియేమో కనరాని సుడిగుండము
ఆ లోతులు చూసీ రీతులు తెలిసీ
ఆ లోతులు చూసీ రీతులు తెలిసి...
అలలాగా చెలరేగి పోవాలి... నేననుకున్న గమ్యం చేరాలీ
గువ్వలా ఎగిరిపోవాలి.. ఈ..ఈ..ఈ..
ఆ తల్లి గూటికే చేరుకోవాలీ... ఈ..ఈ..ఈ