చిత్రం: అల వైకంఠ పురంలో (2020)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సిద్ శ్రీరామ్
పల్లవి:
నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
నీ కళ్లకు కావలి కాస్తాయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు
సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున (2)
నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
చరణం: 1
మల్లెల మాసమా.. మంజుల హాసమా..
ప్రతి మలుపులోన ఎదురుపడిన వెన్నెల వనమా...
విరిసిన పించెమా.. విరుల ప్రపంచమా..
ఎన్నెన్ని వన్నె చిన్నెలంటె ఎన్నగ వశమా..
అరె, నా గాలే తగిలినా.. నా నీడే తరిమినా..
ఉలకవా.. పలకవా.. భామా..
ఎంతో బ్రతిమాలినా.. ఇంతేనా అంగనా..
మదిని మీటు మధురమైన మనవిని వినుమా...
సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున (2)
నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
నీ కళ్లకు కావలి కాస్తాయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
****** ****** ******
చిత్రం: అల వైకంఠ పురంలో (2020)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: అనురాగ్ కులకర్ణి, మంగ్లి సత్యవతి
హేయ్ బ్రదర్ ఆపమ్మా
ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా
అబ్బా.. కడుపు నిండిపోయింది బంగారం...
బంటు గానికి ట్వెంటీ టు
బస్తీ మస్తు కట్-ఔటూ
బచ్చాగాన్ల బ్యాచుండేది
వచ్చినమంటే సుట్టు
కిక్కే జాలక ఓ నైటూ
ఎక్కి డొక్కు బుల్లెట్టు
సందు సందుల మందు కోసం
ఎతుకుతాంటే రూటు
సిల్కు చీర కట్టుకొని
చిల్డ్ బీరు మెరిసినట్లు
పొట్లంగట్టిన బిర్యానీ
బొట్టు బిల్ల వెట్టినట్లు
బంగ్లా మీద నిల్పోనుందిరో సందామావ
సుక్క తాగక సక్కరొచ్చరో ఎం అందం మావ
జింక లెక్క దుంకుతుంటెరో ఆ సందామావ
జుంకి జారి చిక్కుకుందిరో నా దిల్లుకు మావ
పల్లవి:
రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో (2)
రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో (2)
చరణం: 1
హెయ్! తమలపాకే ఎస్తుంటే
కమ్మగ వాసన ఒస్తా వే
ఎర్రగ పండిన ఋధలు రెండు
యాది కొస్తాయే.
అరె ఫువ్వుల అంగీ ఎస్తుంటే
గుండీ నువ్వై పూస్తావే
పండూకున్న గుండెలో దూరి
లొల్లే చేస్తావే
అరెయ్ ఇంటి ముందు లైటు
మినుకు మినుకుమంటాంటే
నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గుపుట్టిందే
సీరకొంగు తలుపు సాటు సిక్కుకుంటాంటే
ఎహె.. నువ్వు లాగినట్టు ఒళ్ళు
జల్లుమంటాందే
చరణం: 2
నాగస్వరం ఊదుతుంటే నాగు పాము ఊగినట్టు
ఎంటపడి వస్తున్న నీ
పట్టగొలుసు సప్పుడింటు
పట్టనట్లే తిరుగుతున్నవే ఓ సందామాన
పక్కకు పోయి తొంగిజూస్తవే
ఎం టెక్కురా మావ,
రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో (5)
*********** *************** ***************
సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు..
పట్టు పట్టినాడా ఒగ్గనే ఒగ్గడు..
పెత్తనాలు నడిపేడు సిత్తరాల సిరపడు
ఊరూరు ఒగ్గేసినా ఉడుంపట్టు ఒగ్గడు..
బుగతోడి ఆంబోతూ రంకేసి కుమ్మబోతే
బుగతోడి ఆంబోతూ రంకేసి కుమ్మబోతే …
కొమ్ములుడదీసి మరి.. పీపలుదినాడురో
జడలిప్పి మర్రి చెట్టు దయ్యల కొమ్పంటే
జడలిప్పి మర్రి చెట్టు దయ్యల కొమ్పంటే..
దయ్యముతొ కయ్యానికి తొడగొట్టి దిగాడు…
అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు
అమ్మోరి జాతరలో ఒంటి తలా రావణుడు…
గుంటలెంట పడితేనూ గుద్ది గుండ చేసినాడు
గుంతలెంట పడితేనూ గుద్ది గుండ చేసినాడు…
పున్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే
పున్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే…
రోమ్ముమీదోక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు
రోమ్ముమీదోక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు…
పది మంది నాగలేని పది మూరల సోరసేప
పది మంది నాగలేని పది మూరల సోరసేప
ఒడుపుగా ఒంటి సేత్తోఒడ్డుకోట్టుకోచినాడు
ఒడుపుగా ఒంటి సేత్తోఒడ్డుకోట్టుకోచినాడు
సాముసేసే కండతోటి దేనికైనా గట్టిపోటీ
సాముసేసే కండతోటి దేనికైనా గట్టిపోటీ…
అడుగడుగు ఎసినాడ అదిరెను అవతలోడు
సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు..
ఉత్తరాల ఊరి సివర సిత్తరాల సిరపడు
గండు పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు
సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు..
ఉత్తరాల ఊరి సివర సిత్తరాల సిరపడు
గండు పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు
సక్కనమ్మ యెనకబడ్డ పోకిరొల్ల ఐరగదంతె
సక్కనమ్మ యెనకబడ్డ పోకిరొల్ల ఐరగదంతె
సక్కనమ్మ కల్లల్లో యేల యేల సుక్కలచ్చే
సక్కనమ్మ కల్లల్లో యేల యేల సుక్కలచ్చే
