Showing posts with label 1963. Show all posts
Showing posts with label 1963. Show all posts

శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)

చిత్రం :  శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  పింగళి
నేపధ్య గానం :  సుశీల


పల్లవి :


స్వాముల సేవకు వేళాయె... వైళమె రారే చెలులారా
స్వాముల సేవకు వేళాయె.. వైళమె రారే చెలులారా
ఆశీర్వాదము లభించుగా... చేసే పూజలు ఫలించుగా..
స్వాముల సేవకు వేళాయె... వైళమె రారే చెలులారా

చరణం 1 :

ఎన్ని తీర్థములు సేవించారో... ఎన్ని మహిమలను గణియించారో
విజయం చేసిరి మహానుభావులు... మన జీవితములు తరించుగా
స్వాముల సేవకు వేళాయె... వైళమె రారే చెలులారా


చరణం 2 :

లీలాశుకులో.. ఋష్యశృంగులో... మన యతీంద్రులై వెలసిరిగా
ఏమి పూజలో.. ఏమి ధ్యానమో.. మన లోకములో ఉండరుగా
స్వాముల సేవకు వేళాయె... వైళమె రారే చెలులారా


చరణం 3 :

ఏయే వేళలకేమి ప్రియములో... ఆ వేళలకవి జరుపవలె
సవ్వడి చేయక... సందడి చేయక... భయభక్తులతో మెలగవలె
స్వాముల సేవకు వేళాయె... వైళమె రారే చెలులారా


*********** ************ ************
చిత్రం :  శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  పింగళి
నేపధ్య గానం :  ఎస్. వరలక్ష్మి


పల్లవి :


వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా
ప్రాణపదముగ పెంచుకొంటిమి నిను మరవగలేములే...
వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా....

చరణం 1 :

వాసుదేవుని చెల్లెలా... నీ ఆశయే ఫలియించెలే...
వాసుదేవుని చెల్లెలా... నీ ఆశయే ఫలియించెలే...
దేవదేవుల గెలువజాలిన బావయే పతి ఆయెలే...
వేయి శుభములు కలుగు నీకు... పోయి రావే మరదలా


చరణం 2 :

భరతవంశము నేలవలసిన వీరపత్నివి నీవెలే
భరతవంశము నేలవలసిన వీరపత్నివి నీవెలే
వీరధీరకుమారమణితో మరల వత్తువుగానిలే...

వేయి శుభములు కలుగు నీకు... పోయి రావే మరదలా
ప్రాణపదముగ పెంచుకొంటిమి నిను మరవగలేములే...
వేయి శుభములు కలుగు నీకు... పోయి రావే మరదలా....


*********** ************ ************
మనసు పరిమళించెనే
చిత్రం :  శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  పింగళి
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల


పల్లవి :
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
మనసు పరిమళించెనే..  తనువు పరవశించెనే
నవ వసంత గానముతో.. నీవు నటన సేయగనే

మనసు పరిమళించెనే..  తనువు పరవశించెనే
నవ వసంత రాగముతో.. నీవు చెంత నిలువగనే
మనసు పరిమళించెనే.. తనువు పరవశించెనే

చరణం 1 :

నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా
ఆ..... ఆ.... . ఆ..... ఆ....
నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా
గలగలగల సెలయేరులలో కలకలములు రేగగా
మనసు పరిమళించెనే.. ఆ.. ఆ.. హా..
తనువు పరవశించెనే.. ఓ..ఓ..ఓ..
నవ వసంత గానముతో... నీవు చెంత నిలువగనే

మనసు పరిమళించెనే... తనువు పరవశించెనే

చరణం 2 :

క్రొత్త పూల నెత్తావులతో మత్తుగాలి వీచగా
ఆహ .. ఆ . అ ఆ
క్రొత్త పూల నెత్తావులతో మత్తుగాలి వీచగా
భ్రమరమ్ములు గుములు గుములుగా...  ఝుం ఝుమ్మని పాడగా

మనసు పరిమళించెనే... తనువు పరవశించెనే

చరణం 3 :

తెలి మబ్బులు కొండ కొనలపై హంసల వలె ఆడగా
అహా .. ఆ . అ.. ఆ
తెలి మబ్బులు కొండ కొనలపై హంసల వలె ఆడగా
రంగరంగ వైభవములతో ప్రకృతి విందు సేయగా

మనసు పరిమళించెనే...  తనువు పరవశించెనే
నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే
మనసు పరిమళించెనే... తనువు పరవశించెనే

*********** ************ ************
చిత్రం :  శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  పింగళి
నేపధ్య గానం :  సుశీల


పల్లవి :

నీకై వేచితినయ్యా... ఓ.. ఏకాంత రామయ్యా... ఆ..
నీకై కాచితినయ్యా...ఆ...ఆ..

నీకై వేచితినయ్యా... ఓ ఏకాంత రామయ్యా... ఆ..
నీకై కాచితినయ్యా...ఆ...ఆ..
నీకై కాచితినయ్యా...


చరణం 1 :

నీవీ క్షణమున వచ్చెదవోయని... ఎదురులు చూచితినయ్యా..ఆ..
ఎదురులు చూచితినయ్యా....

నీవు నడతువని త్రోవ త్రోవల... పూవుల పరచితినయ్యా...

నీకై వేచితినయ్యా... ఓ ఏకాంత రామయ్యా..
నీకై కాచితినయ్యా...


చరణం 2 :

చిగురాకులలో గాలి కదిలినా.. నీవని భ్రమచితినయ్యా..ఆ...
నీవని భ్రమచితినయ్యా..
చిలుక పలికినా.. నీ పిలుపేయని... ఉలుకున కలగితినయ్యా...ఆ...

నీకై వేచితినయ్యా... ఓ ఏకాంత రామయ్యా..
నీకై కాచితినయ్యా...


చరణం 3 :

నీకు ప్రియముగా విరిసిన పూవుల మాలికలల్లితినయ్యా..ఆ..
మాలికలల్లితినయ్యా...
మనసున నిలిచిన మంగళ రూపము.. ఎన్నడు చూచెదనయ్యా...ఆ..

నీకై వేచితినయ్యా... ఓ ఏకాంత రామయ్యా..ఆ
నీకై కాచితినయ్యా...ఆ...ఆ..
నీకై కాచితినయ్యా...


*********** ************ ************
చిత్రం :  శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  పింగళి
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల


పల్లవి :

తపము ఫలించిన శుభవేళా.. బెదరగనేలా ప్రియురాలా
తపము ఫలించిన శుభవేళా.. బెదరగనేలా ప్రియురాలా
ఎదుట నిలువుమని మంత్రము వేసి చెదరగనేలా జవరాలా
తపము ఫలించిన శుభవేళా బెదరగనేలా ప్రియురాలా

చరణం 1 :

తెలిమబ్బులలో జాబిలి వలెనే మేలిముసుగులో దాగెదవేలా
తెలిమబ్బులలో జాబిలి వలెనే మేలిముసుగులో దాగెదవేలా
వలచి వరించి.. మనసు హరించి.. నను దికురించగనేలా

తపము ఫలించిన శుభవేళా బెదరగనేలా ప్రియురాలా

చరణం 2 :

చూపులతోనే పలుకరించుచూ.. చాటున వలపులు చిలకరించుచూ
చూపులతోనే పలుకరించుచూ.. చాటున వలపులు చిలకరించుచూ
కోరిక తీరే తరుణము రాగా తీరా ఇపుడీ జాగేలా

తపము ఫలించిన శుభవేళా.. బెదరగనేలా ప్రియురాలా



*********** ************ ************
చిత్రం :  శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  పింగళి
నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి :

చాలదా ఈ పూజ దేవి... చాలదా ఈ కొలువు దేవి...
నీ భక్తునింత నిరాదరణ చేయనేలా...ఆ..
చాలదా ఈ పూజ దేవీ ....

చరణం 1 :

నీ వాలు చూపులే... నా ప్రాణము...
నీ మందహాసమే... నా జీవము...

తపము జపము చేసి అలసి సొలసి పోతినే...
ఇక కనికరించి ఈ బాధను బాపవేలా.....ఆ...
చాలదా ఈ పూజ దేవి... చాలదా ఈ కొలువు దేవి...

చరణం 2 :

నీ అందెల గలగలలే... ప్రణవ నాదము
నీ కంకణ రవళియే... ప్రణయ గీతము

నీ కటాక్ష వీక్షణమే నాకు మోక్షము...
కరుణజూపి ఈ దీనుని కావవేలా.. ఆ..

చాలదా ఈ పూజ దేవీ... చాలదా ఈ కొలువు దేవీ

చరణం 3 :

నీవులేని నిముషాలే యుగములాయెనే
చెంతనుండి మాటలేని యోగమాయెనే

వరము కోరి ఈ చెరలో చిక్కుబడితినే...
జాలి దలిచి ముక్తి నొసగ జాలమేలా...ఆ..ఆ..

చాలదా ఈ పూజ దేవీ... చాలదా ఈ కొలువు దేవీ
నీ భక్తునింత నిరాదరణ చేయనేలా.. ఆ...
చాలదా ఈ పూజ దేవీ...



*********** ************ ************
చిత్రం :  శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం :  ఘంటసాల

పల్లవి :

అలిగితివా సఖీ ప్రియ కలత మానవా
అలిగితివా సఖీ ప్రియ కలత మానవా
ప్రియమారగ నీ దాసుని ఏలజాలవా
అలిగితివా సఖీ ప్రియ కలత మానవా...

చరణం 1 :

లేని తగవు నటింతువా మనసు తెలియ నెంచితివా
లేని తగవు నటింతువా మనసు తెలియ నెంచితివా
ఈ పరీక్ష మాని ఇంక దయనుజూడవా ...ఆ..ఆ...

అలిగితివా సఖీ ప్రియ కలత మానవా

చరణం 2 :

నీవె నాకు ప్రాణమని నీయానతి మీరనని
నీవె నాకు ప్రాణమని నీయానతి మీరనని
సత్యాపతి నా బిరుదని నింద యెరుగవా...ఆ...ఆ..

అలిగితివా సఖీ ప్రియ కలత మానవా

చరణం 3 :

ప్రియురాలివి సరసనుండి విరహమిటుల విధింతువా
ఆ...ఆ...ఆ..ఆ...ఆ...ఆ...ఆ...
ప్రియురాలివి సరసనుండి విరహమిటుల విధింతువా
భరియింపగ నా తరమా కనికరింపవా..ఆ...ఆ...ఆ..

నను  భవదీయ దాసుని మనంబున నెయ్యపుఁగింకఁ బూని తా
చిన యది నాకు మన్ననయ! చెల్వగు నీ పదపల్లవంబు మ
త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే
ననియెద! అల్క మానవుగదా యికనైన అరాళకుంతలా!

*********** ************ ************

చిత్రం :  శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల 

పల్లవి :

అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
మనసున మంగళవాద్యమాహా మోగెలే....

చరణం 1 :

నావలెనే నా బావ కుడా... నాకై తపములు చేయునులే..
తపము ఫలించి నను వరియించి..
తరుణములోనె బిరాళ నన్ను చేరునులే ...

అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
మనసున మంగళవాద్యమాహా మ్రోగెలే...

చరణం 2 :

అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే
అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే
మనసున మంగళవాద్యమాహా మోగెనులే

కుడికన్ను అదిరే... కుడిభుజమదిరే
కోరిన చెలి నను తలచనులే ....
చిరకాలముగా కాంచిన కలలు
నిజమౌ తరుణము వచ్చెనులే ...

అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే
మనసున మంగళవాద్యమాహా మోగెలే

చరణం 2 :

మల్లెతోరణల మంటపమందె కనులు మనసులు కలియునులే...
కలసిన మనసుల కళరవళములతో.. జీవితమంతా వసంతగానమౌనులే...

అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే...
మనసున మంగళవాద్యమాహా మోగెలే..

శ్రీ తిరుపతమ్మ కథ (1963)

చిత్రం :  శ్రీ తిరుపతమ్మ కథ (1963)
సంగీతం :  పామర్తి
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల

పల్లవి :

ఉం...ఉం...ఉం...

పూవై విరిసిన పున్నమి వేళ... బిడియము నీకెలా..బేలా..
పూవై విరిసిన పున్నమి వేళ... బిడియము నీకెలా..బేలా
పూవై విరిసిన పున్నమి వేళా...

చరణం 1 :

చల్లని గాలులు సందడి చేసే... తొలి తొలి వలపులు తొందర చేసే
చల్లని గాలులు సందడి చేసే... తొలి తొలి వలపులు తొందర చేసే
జలతారంచుల మేలిముసుగులో... తలను వాల్తువేలా.. బేలా..

పూవై విరిసిన పున్నమి వేళ... బిడియము నీకెలా..బేలా
పూవై విరిసిన పున్నమి వేళా...

చరణం 2 :

మొదట మూగినవి మొలక నవ్వులు.. పిదప సాగినవి బెదరు చూపులు..
ఊ..హ.....ఆ.....హ...ఆ.....
మొదట మూగినవి మొలక నవ్వులు.. పిదప సాగినవి బెదరు చూపులు
తెలిసెనులే నీ తలపులేమిటో .... తొలగిపోదువేలా...బేలా...

పూవై విరిసిన పున్నమి వేళ... బిడియము నీకెలా..బేలా
పూవై విరిసిన పున్నమి వేళా...

చరణం 3 :

తీయని వలపుల.. పాయసమాని.. మాయని మమతల.. ఊయలలూగి...
తీయని వలపుల.. పాయసమాని.. మాయని మమతల.. ఊయలలూగి
ఇరువురమొకటై పరవశించగా... ఇంకా జాగేలా.. బేలా...

పూవై విరిసిన పున్నమి వేళ... బిడియము నీకెలా..బేలా
పూవై విరిసిన పున్నమి వేళా...

లవకుశ (1963)

చిత్రం : లవకుశ (1963)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  లీల, సుశీల


పల్లవి :

ఆ..ఆ..ఆ..

శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా
ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా
శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా
ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా

చెలువుమీర పంచవటి సీమలో
తమ కొలువు సేయ సౌమిత్రీ ప్రేమతో
తన కొలువు తీరె రాఘవుడూ భామతో..

శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా
ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా


చరణం 1 :

రాముగని ప్రేమగొనే రావణు చెల్లీ
ముకు చెవులు కోసె సౌమిత్రీ రోసిల్లీ
రావణుడామాట విని పంతము పూనీ
మైథిలినీ కొనిపోయే మాయలు పన్నీ

శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా
ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా

చరణం 2 :

రఘుపతిని రవిసుతునీ కలిపెను హనుమా
నృపుజేసెను సుగ్రీవుని రామవచన మహిమా
ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపులా
హనుమంతుడు లంకజేరి వెదకెను నలుదిశలా

శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా
ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా

ఆ... నాథా .... రఘునాథా.... పాహి పాహి...
పాహి అని అశోకవనిని శోకించే సీత
పాహి అని అశోకవనిని శోకించే సీత
దరికి జెని ముద్రికనిడి తెలిపె విభుని వార్త

ఆ జనని శిరోమణి అందుకొని పావనీ
ఆ జనని శిరోమణి అందుకొని పావనీ
లంక కాల్చి రాముని కడకేగెను రివురివ్వుమని

శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా
ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా 


చరణం 3 :

దశరథసూనుడు లంకను డాసి దశకంటు తలను కోసి
దశరధసూనుడు లంకను డాసి దశకంటు తలను కోసి
ఆతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికే
చేరవచ్చు ఇల్లాలిని చూసీ శీలపరీక్షను కోరె రఘుపతీ
అయోనిజ పైనే అనుమానమా...
ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలికా ఈ పరిక్షా....

పతి ఆనతి తలదాలిచి అగ్నిదూకె సీతా
పతి ఆనతి తలదాలిచి అగ్నిదూకె సీతా
కుతవాహుడు చల్లబడి సాధించెను మాతా
కుతవాహుడు చల్లబడి సాధించెను మాతా
సురలు పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేత

శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా
ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా
ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా..
వినుడోయమ్మా వినుడోయమ్మా.....

శ్రీరాఘవం దశరాథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం.. అరవింద దళాయతాక్షం
రామం.. నిశాచర వినాశకరం.. నమామీ!!

************** ************ ************
చిత్రం :  లవకుశ (1963)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  లీల, సుశీల


పల్లవి :

ఓ ఓ ఓ....
వినుడు వినుడు రామాయణ గాధా.. వినుడీ మనసారా
వినుడు వినుడు రామాయణ గాధా.. వినుడీ మనసారా
ఆలపించినా ఆలకించినా ఆనందమొలికించే గాధ

వినుడు వినుడు రామాయణ గాధా.. వినుడీ మనసారా


చరణం 1 :

శ్రీరాముని రారాజు సేయగా కోరెను దశరధ భూజాని
పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళ వార్త వినీ
ఆ ఆ ఆ ఆ ..... ఆ ఆ ఆ ఆ
పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళ వార్త వినీ
కారు చిచ్చుగా మారెను కైకా మందర మాట వినీ.. మందర మాట వినీ

వినుడు వినుడు రామాయణ గాధా వినుడీ మనసారా


చరణం 2 :

అలుక తెలిసి ఏతెంచిన భూపతినడిగెను వరములు ఆ తన్వి
జరుపవలయు పట్టాభిషేకమూ భరతుడికీ పృధివీ
మెలగవలయు పదునాలుగేడులూ రాముడు కారడవీ
చెలియ మాటకూ ఔను కాదనీ పలుకడు భూజానీ
కూలే భువిపైని...

వినుడు వినుడు రామాయణ గాధా వినుడీ మనసారా


చరణం 3 :

కౌసలేయు రావించి మహీపతి ఆనతి తెలిపెను పినతల్లి
మోసమెరిగి సౌమిత్రి కటారీ దూసెను రోసిల్లీ
దోసమనీ వెనుదీసె తమ్మునీ రాముడు దయశాలీ
వనవాస దీక్షకూ సెలవు కోరె పినతల్లీ పదాల వ్రాలి

ఆ..... ఆ... ఆ... ఆ...
వెడలినాడు రాఘవుడూ అడవికేగగా
పడతి సీత సౌమిత్రీ తోడు నీడగా
వెడలినాడు రాఘవుడూ అడవికేగగా
పడతి సీత సౌమిత్రీ తోడు నీడగా
గోడుగోడున అయోధ్య ఘొల్లుమన్నదీ
వీడకుమా మనలేనని వేడుకున్నదీ
అడుగులబడి రాఘవా....
అడుగలబడి రాఘవా ఆగమన్నదీ..
ఆగమన్నదీ .. ఆగమన్నదీ
అడలి అడలి కన్నీరై అరయుచున్నదీ

************** ************ ************
చిత్రం :  లవకుశ (1963)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  లీల, సుశీల

పల్లవి :

లేరు కుశలవుల సాటి.. సరి వీరులు ధారుణిలో ఓ ఓ ఓ .....
లేరు కుశలవుల సాటి.. సరి వీరులు ధారుణిలో ఓ ఓ ఓ ......
లేరు కుశలవుల సాటి .....

తల్లి దీవెన తాతయ్య కరుణ వెన్నుకాయగా వెరువగనేలా .....
ఆ ఆ ఆ....ఆ ఆ ఆ... ఆ ఆ ఆ....
తల్లి దీవెన తాతయ్య కరుణ వెన్నుకాయగా వెరువగనేలా
హయమును విడువుముగా ... ఆ ఆ ఆ...

లేరు కుశలవుల సాటి .....

చరణం 1 :

బీరములాడి రాముని తమ్ములు దురమున మాతో నిలువగలేక .....
బీరములాడి రాముని తమ్ములు దురమున మాతో నిలువగలేక
పరువము మాసిరిగా ఆ ఆ ఆ .....
పరువము మాసిరిగా ఆ ఆ ఆ .....
లేరు కుశలవుల సాటి .....


చరణం 2 :

పరాజయమ్మే ఎరుగని రాముని రణమున మేమే గెలిచితిమేమి .....
పరాజయమ్మే ఎరుగని రాముని రణమున మేమే గెలిచితిమేమి
యశమిక మాదేగా ఆ ఆ ఆ...ఆ ఆ ఆ...
యశమిక మాదేగా ఆ ఆ ఆ ... ఆ ఆ ఆ...
యశమిక మాదేగా.. ఆ ఆ ఆ ఆ... ఆ ఆ ఆ ఆ...ఆ ఆ ఆఅ.....ఆ ఆ...

లేరు కుశలవుల సాటి ..... సరి వీరులు ధారుణిలో ఓ ఓ ఓ .....
లేరు కుశలవుల సాటి .....

************** ************ ************

చిత్రం :  లవకుశ (1963)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  సదాశివబ్రహ్మం
నేపధ్య గానం :  లీల, సుశీల

పల్లవి :

ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా
ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా మారడవి విదేమమ్మా



చరణం 1 :

శ్రీరాముని మించిన నీ వీర కుమారులము మేము
శ్రీరాముని మించిన నీ వీర కుమారులము మేము
కోరితే బంగారు కొండ కొని తేగలమమ్మా


ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా


చరణం 2 :

తల్లి చింత తీర్పలేని తనయుల బ్రతుకెందుకమ్మా
తల్లి చింత తీర్పలేని తనయుల బ్రతుకెందుకమ్మా
వల్లకాదు చెప్పకున్న వదలము నీ పాదములా



ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా మారాడ విదేమమ్మా
ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా




************** ************ ************
చిత్రం :  లవకుశ (1963)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  సముద్రాల రాఘవాచార్య
నేపధ్య గానం :  లీల, సుశీల




పల్లవి :

రామకథను వినరయ్యా .....
రామకథను వినరయ్యా .....
ఇహపర సుఖములనొసగే సీతారామకథను వినరయ్యా
రామకథను వినరయ్యా .....



అయోధ్యా నగరానికి రాజు దశరధ మహారాజు
ఆ రాజుకు రాణులు మువ్వురు... కౌసల్యా.. సుమిత్రా... కైకేయీ
నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు
రామలక్ష్మణభరతశత్రుఘ్నులు.... ఆ.. ఆ... ఆ.. ఆ...

రామకథను వినరయ్యా ...
ఇహపర సుఖములనొసగే సీతారామకథను వినరయ్యా


చరణం 1 :

ఘడియ ఏని రఘురాముని విడచి గడుపలేని ఆ భూజాని
కౌశిక యాగము కాచి రమ్మని...
కౌశిక యాగము కాచి రమ్మని... పలికెను నీరదశ్యాముని

రామకథను వినరయ్యా .....



చరణం 2 :


తాటకి దునిమి జన్నము గాచి... తపసుల దీవన తలదాల్చి
జనకుని యాగము చూచు నెపమ్మున .....
జనకుని యాగము చూచు నెపమ్మున
చనియెను మిధిలకు దాశరధి

రామకథను వినరయ్యా .....


చరణం 3 :


మదనకోటి సుకుమారుని కనుగొని
మిథిలకు మిథిలయే మురిసినది
ధరణిజ మదిలో మెరసిన మోదము...
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ....
ధరణిజ మదిలో మెరసిన మోదము... కన్నుల వెన్నెల విరిసినది

రామకథను వినరయ్యా .....

చరణం 4 :


హరుని విల్లు రఘునాధుడు చేగొని
ఎక్కిడ ఫెళఫెళ విరిగినది
కళకళలాడే సీతారాముల...
ఆ... ఆ... ఆ... ఆ...
కళకళలాడే సీతారాముల...
ఆ... ఆ... ఆ... ఆ...
కళకళలాడే సీతారాముల...
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ
కళకళలాడే సీతారాముల... కన్నులు కరములు కలిసినవి

రామకథను వినరయ్యా .....
ఇహపర సుఖములనొసగే సీతారామకథను వినరయ్యా

************** ************ ************
చిత్రం :  లవకుశ (1963)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి :

సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను ..... సీతమ్మా .....
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను ..... సీతమ్మా
సందేహించకుమమ్మా .....


చరణం 1 :

ఒకే బాణము ఒకటే మాట ..... ఒక్క భామకే రాముని ప్రేమ .....
ఒకే బాణము ఒకటే మాట ..... ఒక్క భామకే రాముని ప్రేమ
మిన్నే విరిగిపడినా ... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ...
మిన్నే విరిగిపడినా వ్రతభంగమ్ము కానీడమ్మా ఆ ఆ ఆ...

సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా .....
సందేహించకుమమ్మా ....

చరణం 2 :

రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు .....
రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు
నాదు జపము తపము నా కావ్యమ్మె వృథయగునమ్మా .....
నాదు జపము తపము నా కావ్యమ్మె వృథయగునమ్మా ఆ ఆ ఆ

సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను ..... సీతమ్మా .....

************** ************ ************
చిత్రం :  లవకుశ (1963)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :   లీల, సుశీల

పల్లవి :

రామ సుగుణధామ రఘువంశ జలధిసోమా...
శ్రీ రామ సుగుణధామా
సీతామనోభిరామా సాకేతసార్వభౌమా
శ్రీ రామ సుగుణధామా

చరణం 1 :

మందస్మిత సుందర వదనారవింద రామా
ఇందీవర శ్యామలాంగ వందితసుత్రామా
మందార మరందోపమ మధుర మధుర నామా
మందార మరందోపమ మధుర మధుర నామా
శ్రీ రామ సుగుణధామా రఘువంశ జలధిసోమా...
శ్రీ రామ సుగుణధామా

చరణం 2 :

అవతారపురుష రావణాది దైత్యవి రామా
నవనీత హృదయ ధర్మనిరత రాజల రామా
పవమాన తనయ సన్నుత పరమాత్మ పరంధామా
పవమాన తనయ సన్నుత పరమాత్మ పరంధామా
శ్రీ రామ సుగుణధామ రఘువంశ జలధిసోమా
సీతామనోభిరామా... సాకేతసార్వభౌమా...
సీతామనోభిరామా...


************** ************ ************
చిత్రం :  లవకుశ (1963)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  ఘంటసాల, లీల, సుశీల

పల్లవి :

జయ జయ రాం జయ రఘురాం జయ జయ రాం జయ రఘురాం

జగధబి రాముడు శ్రీరాముడే.. రఘుకుల సోముడు ఆ రాముడే
జగధబి రాముడు శ్రీరాముడే.. రఘుకుల సోముడు ఆ రాముడే
జగధబి రాముడు శ్రీరాముడే..
జనకుని మాటన తలపై నిలిపి.. తన సుఖముల విడి వనితావణి తో
వనములకేగిన ధర్మావతారుడు.. జగధబి రాముడు శ్రీరాముడే

చరణం 1 :

కరమున ధనువు శరములు దాలిచి.. కరమున ధనువు
ఆ ఆ..ఆ..ఆ.... ఆ ఆ..ఆ..ఆ... ఆ ఆ..ఆ..ఆ
కరమున ధనువు శరములు దాలిచి.. ఇరువది చేతుల దొరనే కూలిచి
సురలను గాంచిన వీరాధివీరుడు.. జగధబి రాముడు శ్రీరాముడే

చరణం 2 :

ఆలుమగల అనురాగాలకు ఆలుమగల అనురాగాలకు
పోలిక సీతారాములే అనగా..  పొలిక సీతారాములే అనగా
వెలసిన ఆదర్శ ప్రేమావతారుడు.. జగధబి రాముడు శ్రీరాముడే

నిరతము ధర్మము నెరపీ నిలిపీ..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నిరతము ధర్మము నెరపీ నిలిపీ.. నరులకు సురలకు తరతరాలకు
 ఒరవడి అయినా వర యుగపురుషుడు.. జగధబి రాముడు శ్రీరాముడే

చరణం 3 :

ఇనకులమణి సరితూగే తనయుడు అన్నయూ ప్రభువు లేనే లేడని
ఇనకులమణి సరితుగే తనయుడు అన్నయూ ప్రభువు లేనే లేడని
జనులు భజించే పురుషోత్తముడు...

జగధబి రాముడు శ్రీరాముడే... రఘుకుల సోముడు ఆ రాముడే
జగధబి రాముడు శ్రీరాముడే...
జయ జయ రాం జయ రఘురాం జయ జయ రాం జయ రఘురాం

************** ************ ************

చిత్రం :  లవకుశ (1963)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  కోసరాజు
నేపధ్య గానం :  ఘంటసాల 

పల్లవి :

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు
ఓ...ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు

చరణం 1:

కంచె నిజముగ చేను మేసినా కాదను వారెవరు
రాజే ఇది శాసనమని పల్కినా ప్రతిఘటించు వారెవరు
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు

కరుణామయురిది కాదనలేరా కఠిన కార్యమనబోరా
సాథ్వులకెపుడు వెతలేనా తీరని ధుఃఖపు కథలేనా
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు

చరణం 2 :

ఇనకులమున జనియించిన నృపధులు ఈ దారుణము సహించెదరా
వినువీధిని శ్రేణులుగా నిల్చి విడ్డూరముగా చూచెదరా
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు

ఎండకన్ను ఎరుగని ఇల్లాలికి ఎందుకో ఈ వనవాసాలు
తరచి చూచినా బోధపడవులే దైవ చిద్విలాసాలు
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు


అగ్నిపరీక్షకే నిల్చిన సాథ్విని అనుమానించుట న్యాయమా??
అల్పుని మాటయే జనవాక్యమ్మని అల్పుని మాటయే జనవాక్యమ్మని
అనుసరించుటే ధర్మమా??


ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు... ఎవరూహించెదరు

లక్షాధికారి (1963)

చిత్రం :  లక్షాధికారి (1963)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :   సుశీల


పల్లవి :

దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక వదలను.. వదలను.. వదలనులే

దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక వదలను.. వదలను.. వదలనులే


చరణం 1 :

నీ సన్నని మీసంలో విలాసం వన్నెలు చిలికింది
నీ నున్నని బుగ్గలపై పున్నమి వెన్నెల మెరిసింది
నీ ఓర చూపులను గని.. బంగారు తూపులనుకొని
నీ ఓర చూపులను గని..  తూపులనుకొని మురిసిపోతానూ.. పరవసించేనూ
 నీ కన్నులు రమ్మని పిలిచేదాక కదలను..కదలను..కదలనులే

దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక వదలను..వదలను..వదలనులే

చరణం 2 :

పొదలలోన వున్నా పూల గంధాలు దాగలేవు
మట్టిలోన వున్నా.. మణుల అందాలు మాసిపోవు
నీలోని రూపమును గని.. రతనాల దీపమనుకొని
నీలోని రూపమును గని.. దీపమనుకొని
మదిని నిలిపేను.. జగము మరచేనూ
నీ పెదవుల నవ్వులు విరిసే దాక విడువను..విడువను..విడువనులే

దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక..వదలను..వదలను..వదలనులే

***********************

చిత్రం :  లక్షాధికారి (1963)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  సుశీల


పల్లవి :

ఆ.. ఆ.. ఆ..
ఓ...ఓ.. ఓ..
ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది
ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది
అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది
ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది


చరణం 1 :

చిన్నవాడు ఓర చూపు చూసి నవ్వెను
వెన్నెలాగ లేత మనసు కరిగిపోయెను
చిన్నవాడు ఓర చూపు చూసి నవ్వెను
వెన్నెలాగ లేత మనసు కరిగిపోయెను

చేయి చేయి కలపగానే మెరుపు మెరిసెను
ఆ మెరుపులోన నా మేను జలదరించెను



ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది
అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది
ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది


చరణం 2 :

కనులలోన గులాబీలు పూయుచున్నవి..
మునుపులేని అనుభవాలు ముసురుకున్నవి
కనులలోన గులాబీలు పూయుచున్నవి..
మునుపులేని అనుభవాలు ముసురుకున్నవి

మధురమైన మైకమేదో కలుగుచున్నది
ఆ మైక మందు నేనేదో మారిపోతిని



ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది
అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది
ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది


చరణం 3 :


చల్ల గాలి అతను ఊసు తెలుపుతున్నది
మల్లెతీగలాగ ఆశ అల్లుకున్నది
చల్ల గాలి అతను ఊసు తెలుపుతున్నది
మల్లెతీగలాగ ఆశ అల్లుకున్నది

కన్నెవలపు అతని చుట్టు తిరుగుతున్నది
ఆ వన్నెకాణ్ణి విడిచి తాను రానన్నది 


ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది
అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది
ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది


******************************
చిత్రం :  లక్షాధికారి (1963)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల,  సుశీల

పల్లవి :

మబ్బులో ఏముంది...
నా మనసులో ఏముంది.. నా మనసులో ఏముంది?
మబ్బులో కన్నీరు..

నీ మనసులో పన్నిరు.. నీ మనసులో పన్నీరు..
అవునా..ఉహు..ఊ..ఊ....

చరణం 1:

తోటలో ఏముంది.. నా మాట లో ఏముంది? నా మాటలో ఏముంది?
తోటలో మల్లియలు.. నీ మాటలో తేనియలు.. నీ మాటలో తేనియలు ..
ఉహు..ఊ..ఊ..ఊ..
ఊహు..ఊ..ఊ..ఊ..

చరణం 2 :

చేనులో ఏముంది?.. నా మేనులో ఏముంది?.. నా మేనులో ఏముంది?
చేనులో బంగారం.. నీ మేనులో సింగారం... నీ మేనులో సింగారం

ఏటిలో ఏముంది?.. నా పాటలో ఏముంది?... నా పాటలో ఏముంది?
ఏటిలో గలగలలు.. నీ పాటలో సరిగమలు... నీ పాటలో సరిగమలు

నేనులో ఏముందీ?.. నీవులో ఏముంది?... నీవులో ఏముంది?
నేనులో నీవుంది... నీవులో నేనుంది... నీవులో నేనుంది

నేనులో నీవుంది నీవులో నేనుంది
నీవులో నేనుంది నేనులో నీవుంది...
అహ..ఆ..అహ..ఆ..

**********************************

చిత్రం :  లక్షాధికారి (1963)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం : ఘంటసాల,   సుశీల


సాకీ :


హాయ్.. హాయ్.. హాయ్
నా చెంప తాకగానే... చెలీ.. నీ చేయి కందెనేమో
నా చూపు సోకగానే... అరెరె.. నాజూకు తగ్గెనేమో
నా చెంప తాకగానే... చెలీ.. నీ చేయి కందెనేమో
నా చూపు సోకగానే... అరెరె.. నాజూకు తగ్గెనేమో

నాపైన నీకు కోపమా.. కాదేమి విరహతాపమా
నాపైన నీకు కోపమా విరహతాపమా
పలుకగా రాదా... అలుక మరియాదా
నీ పదునౌ చూపుల అదిరింపులకే బెదరను బెదరను బెదరనులే 


పల్లవి :
దాచాలంటే దాగదులే.. దాగుడుమూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసేదాకా.. వదలను వదలను వదలనులే

చరణం 1 :


నీ కులుకు నడక చూచి.. రాజహంసలకు సిగ్గు కలిగె
నీ తళుకు మోము చూచి.. నింగి జాబిలికి నిగ్గు తరిగె
నీ కులుకు నడక చూచి.. రాజహంసలకు సిగ్గు కలిగె
నీ తళుకు మోము చూచి.. నింగి జాబిలికి నిగ్గు తరిగె


అయ్యారే మేని అందము.. బంగారు తీగ చందము
అయ్యారే మేని అందము.. తీగ చందము
మరులుగొలిపేనూ.. మనసు దోచేనూ
ఈ కమ్మని రాతిరి కరిగేదాకా.. కదలను కదలను కదలనులే

దాచాలంటే దాగదులే.. దాగుడుమూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసేదాకా.. వదలను వదలను వదలనులే

చరణం 2 :

నీ నల్లని వాల్జడలో.. విరిసిన మల్లెలు రమ్మనెను
నీ ఎర్రని బుగ్గలపై సిగ్గులు.. ఎదురై పొమ్మనెను
నీ నల్లని వాల్జడలో.. విరిసిన మల్లెలు రమ్మనెను
నీ ఎర్రని బుగ్గలపై సిగ్గులు.. ఎదురై పొమ్మనెను

నువు లేకపోతే ఓ చెలీ.. ఈ లోకమంతా చలి చలి
నువు లేకపోతే ఓ చెలీ.. లోకమే చలి
ఏమి చేసేనే..  ఎటుల సైచేనే
నీ వెచ్చని కౌగిట ఒదిగేదాకా.. విడువను విడువను విడువనులే

దాచాలంటే దాగదులే.. దాగుడుమూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసేదాకా.. వదలను వదలను వదలనులే



మూగ మనసులు (1963)

చిత్రం :  మూగ మనసులు (1963)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి :

పాడుతా తీయగా చల్లగా...
పాడుతా తీయగా చల్లగా...
పసిపాపలా నిదురపో తల్లిగా... బంగారు తల్లిగా...
పాడుతా తీయగా చల్లగా...



చరణం 1 :

కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది
కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది

కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకూ
కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకూ
ఆ కలిమి కూడ దోచుకునే దొరలు ఎందుకూ ?

పాడుతా తీయగా చల్లగా...
పసిపాపలా నిదురపో తల్లిగా... బంగారు తల్లిగా...
పాడుతా తీయగా చల్లగా...



చరణం 2 :



గుండే మంటలారిపే చన్నీళ్ళు...  కన్నీళ్ళు
ఉండమన్న ఉండవమ్మ చాన్నాళ్ళు..
గుండే మంటలారిపే చన్నీళ్ళు...  కన్నీళ్ళు
ఉండమన్న ఉండవమ్మ చాన్నాళ్ళు..

పోయినోళ్ళు అందరూ.. మంచోళ్ళు..
పోయినోళ్ళు అందరూ.. మంచోళ్ళు..
ఉన్నొళ్ళు పొయినోళ్ళ తీపి గురుతులు...

పాడుతా తీయగా చల్లగా...
పసిపాపలా నిదురపో తల్లిగా... బంగారు తల్లిగా...
పాడుతా తీయగా చల్లగా...


చరణం 2 :


మనిషిపోతే మాత్రమేమి మనసు ఉంటది
మనసుతోటి మనసెపుడో కలసిపొతదీ..
మనిషిపోతే మాత్రమేమి మనసు ఉంటది
మనసుతోటి మనసెపుడో కలసిపొతదీ..

చావుపుటక లేనిదమ్మ నేస్తమన్నదీ..
జనమజనమకది మరీ గట్టిపడతదీ......

పాడుతా తీయగా చల్లగా...
పసిపాపలా నిదురపో తల్లిగా... బంగారు తల్లిగా...
పాడుతా తీయగా చల్లగా



*** **** *************** *******

చిత్రం :  మూగ మనసులు (1963)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఘంటసాల

పల్లవి :

ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో..ఓ..
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే..


చరణం 1 :

పూలదండలో దారం దాగుందని తెలుసును
పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
పూలదండలో దారం దాగుందని తెలుసును
పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా
నవ్వినా.. ఎడ్చినా.. ఆ.. ఆ..
నవ్వినా.. ఎడ్చినా.. కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా..

ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే..

చరణం 2 :

మనసు మూగదే కాని బాసుండది దానికి
సెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇది..ఈ..
మనసు మూగదే కాని బాసుండది దానికి
సెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇది
ఎద మీద ఎదబెట్టి సొదలన్నీ ఇనుకో
ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో

ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే..


చరణం 3 :

ముక్కోటి దేవుళ్ళు మురిసి సూస్తుంటారు
ముందు జనమ బంధాలు ముడియేసి పెడతారు.. ఆ.. ఆ.. ఆ.. అ..
ముక్కోటి దేవుళ్ళు మురిసి సూస్తుంటారు
ముందు జనమ బంధాలు ముడియేసి పెడతారు
కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపుతీపి దీవెనలు
కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపుతీపి దీవెనలు
మూగమనసు బాసలు..
ఈ మూగమనసు బాసలు మీకిద్దరికి సేసలు

ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే
ముద్దబంతి పువ్వులో.. ఓ.. ఓ.. ఓ..

*** **** *************** *******

చిత్రం :  మూగ మనసులు (1963)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  జమునారాణి

పల్లవి :

ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం
ఉహు ఉహు ఉహు..
ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం..


చరణం 1 :

అడపదడప ఇద్దరు అలిగితనే అందం
అడపదడప ఇద్దరు అలిగితనే అందం
అలక తీరి కలిసేదే అందమైన బంధం
అలక తీరి కలిసేదే అందమైన బంధం

ఆ.. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం..

చరణం 2 :

చిన్నదాని బుగ్గలకు సిగ్గొస్తే అందం
చిన్నదాని బుగ్గలకు సిగ్గొస్తే అందం
బుగ్గమీద సిటికేసి దగ్గరొస్తే బంధం
ఆ బుగ్గమీద సిటికేసి దగ్గరొస్తే బంధం

హొయ్.. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం



చరణం 3 :

ఈడొచ్చిన పిల్లకు జోడుంటే అందం
ఈడొచ్చిన పిల్లకు జోడుంటే అందం
ఈడుజోడు కుదిరినాక మూడుముళ్ళే బంధం
ఈడుజోడు కుదిరినాక మూడుముళ్ళే బంధం
ఉహు ఉహు ఉహు

ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం

చరణం 4 :

తల్లి గోదారికి ఎల్లువొస్తే అందం
తల్లి గోదారికి ఎల్లువొస్తే అందం
ఎల్లువంటి బుల్లోడికి పిల్లగౌరి బంధం
ఎల్లువంటి బుల్లోడికి పిల్లగౌరి బంధం

డుర్ర్.. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం
హొయ్ ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం..
ఒహో... ఒహో.. హొయ్.. హొయ్..


*** **** *************** *******

చిత్రం : మూగ మనసులు (1963)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  సుశీల

పల్లవి :

మానూ మాకును కాను...
రాయీ రప్పను కానే కాను..
మామూలు మణిసిని నేను
నీ మణిసిని నేను..

మానూ మాకును కాను
రాయీ రప్పను కానే కాను..
మామూలు మణిసిని నేను
నీ మణిసిని నేను..

చరణం 1 :

నాకు ఒక మనసున్నాదీ నలుగురిలా అశున్నాదీ
కలలు కనే కళ్ళున్నాయి అవి కలత పడితే నీళ్ళున్నాయి

మానూ మాకును కాను..
రాయీ రప్పను కానే కాను.. మామూలు మణిసిని నేను
నీ మణిసిని నేను..


చరణం 2 :

పెమిదను తెచ్చి వొత్తిని యేసి
చమురును పోసి బెమ చూపేవా
ఇంతా సేసి యెలిగించేందుకు యెనక ముందు లాడేవా..

మానూ మాకును కాను..
రాయీ రప్పను కానే కాను.. మామూలు మణిసిని నేను
నీ మణిసిని నేను..


చరణం 3 :

మణిషితోటి ఏళాకోళం ఆడుకుంటే బాగుంటాది
మనసుతోటి ఆడకు మావా ఇరిగిపోతే అతకదు మల్లా..

మానూ మాకును కాను..
రాయీ రప్పను కానే కాను.. మామూలు మణిసిని నేను
నీ మణిసిని నేను..

*** **** *************** *******

చిత్రం :  మూగ మనసులు (1963)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల

పల్లవి :
నా పాట నీ నోట పలకాల సిలకనీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక

నా పాట నీ నోట పలకాల చిలక
పలకాల సిలక..
పలకాల చిలక..
యహా... చి కాదు.. సి.. సి.. సిలక
పలకాల సిలక..
ఆఁ..
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక..

చరణం 1:

పాట నువ్వు పాడాల పడవ నే నడపాల
పాట నువ్వు పాడాల పడవ నే నడపాల
నీటిలో నేను నీ నీడనే సూడాల
నీటిలో నేను నీ నీడనే సూడాల
నా నీడ సూసి నువ్వు కిల కిలా నవ్వాల
నా నీడ సూసి నువ్వు కిల కిలా నవ్వాల
పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల
పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల

నా పాట నీ నోట పలకాల సిలక
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక..

చరణం 2 :

కన్నుల్లు కలవాల ఎన్నెల్లు కాయాల
కన్నుల్లు కలవాల ఎన్నెల్లు కాయాల
ఎన్నెలకే మనమంటే కన్నుకుట్టాల
ఎన్నెలకే మనమంటే కన్నుకుట్టాల
నీ పైట నా పడవ తెరసాప కావాల.. ఆ.. ఆ.. ఆ..
ఆ.. అ.. ఓ.. ఓ.. ఓ..
నీ పైట నా పడవ తెరసాప కావాల
నీ సూపే సుక్కానిగ దారి సూపాల
నీ సూపే సుక్కానిగ దారి సూపాల

నా పాట నీ నోట పలకాల సిలక
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక..

చరణం 3 :

మనసున్న మణుసులే మనకు దేవుళ్ళు
మనసు కలిసిననాడె మనకు తిరణాళ్ళు
మనసున్న మణుసులే మనకు దేవుళ్ళు
మనసు కలిసిననాడె మనకు తిరణాళ్ళు
సూరేచంద్రుల తోటి సుక్కల్ల తోటి
సూరేచంద్రుల తోటి సుక్కల్ల తోటి
ఆటాడుకుందాము ఆడనే ఉందాము
ఆటాడుకుందాము ఆడనే ఉందాము

నా పాట నీ నోట పలకాల సిలక
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా.. ఆ.. ఆ..


*** **** *************** *******

చిత్రం :  మూగ మనసులు (1963)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  కొసరాజు
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల

పల్లవి :

హెయ్.. గౌరమ్మా నీ మొగుడెవరమ్మా
ఎవరమ్మా వాడెవరమ్మా.. ఆ..
గౌరమ్మా నీ మొగుడెవరమ్మా

సెప్పాలంటే సిగ్గు కదయ్యా.. ఆ..
ఆనవాళ్ళు నే సెబుతానయ్య.. సెప్పు.. సెప్పు..
సిగలో నెలవంక మెడలో నాగరాజు
సిగలో నెలవంక మెడలో నాగరాజు
ఆ రేడు నావాడు సరిరారు వేరెవరూ...

మావయ్యా నా మొగుడెవరయ్యా
ఎవరయ్యా వేరెవరయ్యా.. ఆ..
మావయ్యా నా మొగుడెవరయ్యా

చరణం 1 :

ఇల్లు వాకిలి లేనీవాడు.. లేనీ.. వాడూ.. లేనీవాడు..
బిచ్చమెత్తుకుని తిరిగేవాడు.. మాదాకవళం
ఇల్లు వాకిలి లేనీవాడు.. బిచ్చమెత్తుకుని తిరిగేవాడు
ఎగుడు దిగుడు కన్నులవాడు జంగందేవర నీ వాడా

గౌరమ్మా నీ మొగుడెవరమ్మా
ఎవరమ్మా వాడెవరమ్మా.. ఆ..
గౌరమ్మా నీ మొగుడెవరమ్మా

ఆకాశమే ఇల్లు.. లోకమే వాకిలీ..ఈ.. అవును..
బిచ్చమడిగేది భక్తీ.. ఈ.. బదులు ఇచ్చేది ముక్తి
బిచ్చమడిగేది భక్తీ.. బదులు ఇచ్చేది ముక్తి
బిచ్చమడిగేది భక్తీ.. బదులు ఇచ్చేది ముక్తి
బేసికన్నులే లేకుంటేను బెంబేలెత్తును ముల్లోకాలు

మావయ్యో నా మొగుడెవరయ్యా
ఎవరయ్యా వేరెవరయ్యా.. ఆ..
మావయ్యా నా మొగుడెవరయ్యా


చరణం 2 :

మొగుడు మొగుడని మురిసావే.. కులికావే.. పొగిడావే..
మొగుడు మొగుడని మురిసావే.. కులికావే.. పొగిడావే..
పిల్లోయ్.. నెత్తిని ఎవరినో ఎత్తుకొని నిత్యం దానినే కొలుసునట
అదియే ఆతని ఆలియట.. కోతలు ఎందుకు కోస్తావే..
కోతలు ఎందుకు కోస్తావే..

గౌరమ్మా నీ మొగుడెవరమ్మా
ఎవరమ్మా వాడెవరమ్మా.. ఆ..
గౌరమ్మా నీ మొగుడెవరమ్మా

ఎవరో పిలిస్తె వచ్చింది.. ఎవరి కోసమో పోతోంది.. మయాన మజిలీ ఏసింది
మయాన మజిలీ ఏసింది..
సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే చెల్లదులే
సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే చెల్లదులే
పళ్ళు పదారు రాలునులే..
పళ్ళు పదారు రాలునులే..

మావయ్యో నా మొగుడెవరయ్యా
ఎవరయ్యా వేరెవరయ్యా.. ఆ..

గౌరమ్మా నీ మొగుడెవరమ్మా
మావయ్యా.. గౌరమ్మా..
మావయ్యా.. గౌరమ్మా..

*** **** *************** *******

చిత్రం:  మూగ మనసులు (1963)
సంగీతం:  కె.వి. మహదేవన్
గీతరచయిత:  దాశరథి
నేపధ్య గానం:  సుశీల

పల్లవి:

ఓహో.. ఓ ఓ హోయ్..
ఓహోహో.. ఓ ఓ ఓ ఓ..

గోదారి గట్టుందీ.. గట్టుమీన సెట్టుందీ
సెట్టు కొమ్మన పిట్టుంది
పిట్ట మనసులో ఏముంది.. ఓ ఓ ఓ ఓ.. హోయ్..

గోదారి గట్టుందీ.. గట్టుమీన సెట్టుందీ
సెట్టు కొమ్మన పిట్టుంది
పిట్ట మనసులో ఏముంది.. ఓ ఓ ఓ ఓ.. హోయ్..

చరణం 1:

వగరు వగరుగా పొగరుంది.. పొగరుకు తగ్గ బిగువుంది
వగరు వగరుగా పొగరుంది.. పొగరుకు తగ్గ బిగువుంది
తీయ తీయగా సొగసుంది.. సొగసుని మించే మంచుంది
తీయ తీయగా సొగసుంది.. సొగసుని మించే మంచుంది.. ఈ.. ఈ.. ఈ..

గోదారి గట్టుందీ.. గట్టుమీన సెట్టుందీ
సెట్టు కొమ్మన పిట్టుంది
పిట్ట మనసులో ఏముంది.. ఓ ఓ ఓ ఓ.. హోయ్..

చరణం 2:

ఎన్నెల ఉందీ.. ఎండ ఉందీ.. పూవు ఉందీ.. ముల్లుంది
ఎన్నెల ఉందీ.. ఎండ ఉందీ.. పూవు ఉందీ.. ముల్లుంది
ఏది ఎవ్వరికి ఇవ్వాలో.. ఇడమరిసే ఆ ఇది ఉంది

గోదారి గట్టుందీ.. గట్టుమీన సెట్టుందీ
సెట్టు కొమ్మన పిట్టుంది
పిట్ట మనసులో ఏముంది.. ఓ ఓ ఓ ఓ.. హోయ్..


చరణం 3:

పిట్ట మనసు పిసరంతైనా.. పెపంచమంతా దాగుంది
పిట్ట మనసు పిసరంతైనా.. పెపంచమంతా దాగుంది
అంతు దొరకని నిండు గుండెలో.. ఎంత తోడితే అంతుంది
అంతు దొరకని నిండు గుండెలో.. ఎంత తోడితే అంతుంది.. ఈ.. ఈ.. ఈ..

గోదారి గట్టుందీ.. గట్టుమీన సెట్టుందీ
సెట్టు కొమ్మన పిట్టుంది
పిట్ట మనసులో ఏముంది.. ఓ ఓ ఓ ఓ.. హోయ్..

*** **** *************** *******

చిత్రం : మూగ మనసులు (1963)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి :

ఈనాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడి వేసెనో.. ఓ..ఓ..
ఈనాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడి వేసెనో.. ఓ..ఓ..
ఈనాటి ఈ బంధమేనాటిదో.. ఓ..ఓ..

చరణం 1 :

మబ్బులు కమ్మిన ఆకాశం.. మనువులు కలసిన మనకోసం
మబ్బులు కమ్మిన ఆకాశం.. మనువులు కలసిన మనకోసం
చలువల పందిరి వేసింది తొలి వలపుల చినుకులు చిలికింది
చలువల పందిరి వేసింది తొలి వలపుల చినుకులు చిలికింది

ఈనాటి ఈ బంధమేనాటిదో.. ఓ..ఓ..

చరణం 2 :

నీ జతలో..చల్లదనం నీ ఒడిలో..వెచ్చదనం
నీ జతలో చల్లదనం నీ ఒడిలో వెచ్చదనం
నీ చేతలలో చిలిపితనం చిత్తంలో వలపుధనం
నీ చేతలలో చిలిపితనం చిత్తంలో వలపుధనం
అనుభవించి దినం దినం పరవశించనా
పరవశించి క్షణంక్షణం కలవరించనా

ఈనాటి ఈ బంధమేనాటిదో.. ఓ..ఓ..

చరణం 3 :

ఎవరు పిలిచారనో..ఏమి చూడాలనో
ఎవరు పిలిచారనో ఏమి చూడాలనో
ఉప్పొంగి ఉరికింది గోదావరీ..గోదావరి
చెలికాని సరసలో.. సరికొత్త వధువులో
చెలికాని సరసలో.. సరికొత్త వధువులో
తొలినాటి భావాలు తెలుసుకోవాలని
ఉప్పొంగి ఉరికింది గోదావరీ

ఈనాటి ఈ బంధమేనాటిదో.. ఓ..ఓ..

మర్మయోగి (1963)

చిత్రం :  మర్మయోగి (1963)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  ఘంటసాల, జమునా రాణి



పల్లవి :

రావాలి రావాలి... రమ్మంటే రావాలి
రావాలి రావాలి
రకరకాల రసికతలెన్నో రాణిగారు తేవాలి
రాణిగారు తేవాలి

ఆగాలి ఆగాలి... ఆగమంటే ఆగాలీ..
ఆగాలి ఆగాలి...
ఆలుమగలమయ్యేదాకా.. అయ్యగారు ఆగాలి
అయ్యగారు ఆగాలి..
ఆగాలి ఆగాలి... ఆగమంటే ఆగాలీ..
ఆగాలి ఆగాలి...


చరణం 1 :


మదిలోన నేను.. మనువాడినాను... మరి జాల మేలా..
ఆ మనసులోనే.. అరుదైన హాయి.. ఊహించుకోవోయ్...
ఊహలోనికైనా నీవు ఓదార్చరావే...

ఆగాలి ఆగాలి... ఆగమంటే ఆగాలీ..ఆగాలి ఆగాలి...

చరణం 2 :

మగవారలయ్యో.. మది తెలుసుకోరు... తమ మాట తమదే...
ఈ ఆడవారు.. ఎవరైన ఇంతే.. మురిపించిరారు..
ఒక్కసారి వచ్చిన వనిత మరల వీడిపోదు...

రావాలి రావాలి... రమ్మంటే రావాలి
రావాలి రావాలి..

చరణం 3 :


సరదాలపైనా.. చన్నీళ్లు చల్లా.. మర్యాద కాదే
పగ్గాలు లేనీ.. ప్రణయాలలోనా.. సొగసేమికలదోయ్..
సోగకంటి సైగలు తెలిసే సోధించరాదే...

ఆగాలి ఆగాలి... ఆగమంటే ఆగాలీ..
ఆగాలి ఆగాలి...
రకరకాల రసికతలెన్నో... రాణిగారు తేవాలి
రాణిగారు తేవాలి
ఆహహ.. ఆహాహ.. ఆహహ.. ఆహాహా..ఆహాహహాహాహా....

******* ********* ******** *******


చిత్రం :  మర్మయోగి (1963)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  ఘంటసాల, పి. లీల

పల్లవి:

ఆ...ఆ...ఆ...ఓ...ఓ..ఓ..
నవ్వుల నదిలో పువ్వుల పడవ కదిలే
అది మైమరపించే హాయి... ఇక రానే రాదీ రేయి

నవ్వుల నదిలో పువ్వుల పడవ కదిలే
అది మైమరపించే హాయి ఇక రానే రాదీ రేయి

చరణం 1:

అనుకోని సుఖం పిలిచేను...అనురాగ మధువు వొలికేను
అనుకోని సుఖం పిలిచేను...అనురాగ మధువు వొలికేను
కొనగోటితో నిను తాకితే...పులకించవలయు ఈ మేను
అహ...అహ...అహ...

నవ్వుల నదిలో పువ్వుల పడవ కదిలే
అది మైమరపించే హాయి... ఇక రానే రాదీ రేయి

చరణం 2:

నిదురించవోయి వడిలోన...నిను వలచెనోయి నెరజాణ
నిదురించవోయి వడిలోన...నిను వలచెనోయి నెరజాణ
అరచేతిలో వైకుంఠము...దొరికేను నీకు నిముషాన

నవ్వుల నదిలో పువ్వుల పడవ కదిలే
అది మైమరపించే హాయి... ఇక రానే రాదీ రేయి
ఆ...ఆ...ఆ...ఓ...ఓ..ఓ...ఓ...ఓ...

మంచి-చెడు (1963)

చిత్రం :  మంచి-చెడు (1963)
సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల

పల్లవి:

రేపంటి రూపం కంటి.. పూవింటి తూపుల వంటి
నీ కంటి చూపుల వెంట నా పరుగంటి

రేపంటి వెలుగే కంటి.. పూవింటి దొరనే కంటి
నా కంటి కలలూ కళలూ నీ సొమ్మంటీ...

చరణం 1:

నా తోడు నీవైయుంటే.. నీ నీడ నేనేనంటి
ఈ జంట కంటే వేరే లేదు లేదంటి
నా తోడు నీవైయుంటే.. నీ నీడ నేనేనంటి
ఈ జంట కంటే వేరే లేదు లేదంటి

నీ పైన ఆశలు వుంచి.. ఆపైన కోటలు పెంచి
నీ పైన ఆశలు వుంచి.. ఆపైన కోటలు పెంచి

నీకోసం రేపూ మాపూ వుంటిని నిన్నంటి
రేపంటి రూపం కంటి.. పూవింటి తూపుల వంటి
నీ కంటి చూపుల వెంట నా పరుగంటి
చరణం 2:

నే మల్లెపువ్వై విరిసి.. నీ నల్లని జడలో వెలిసి
నీ చల్లని నవ్వుల కలసి వుంటే చాలంటి
నే మల్లెపువ్వై విరిసి.. నీ నల్లని జడలో వెలిసి
నీ చల్లని నవ్వుల కలసి వుంటే చాలంటి

నీ కాలి మువ్వల రవళి.. నా భావి మోహన మురళీ
నీ కాలి మువ్వల రవళి.. నా భావి మోహన మురళీ
ఈ రాగ సరళి తరలి పోదాం రమ్మంటి

రేపంటి వెలుగే కంటి.. పూవింటి దొరనే కంటి
నా కంటి కలలూ కళలూ నీ సొమ్మంటీ...
చరణం 3:

నీలోని మగసిరితోటి నాలోని సొగసులు పోటి
వేయించి నేనే ఓడిపోనీ పొమ్మంటి
నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి
రాగాలు రంజిళ్లు రోజే రాజీ రమ్మంటి...
రేపంటి వెలుగే కంటి.. పూవింటి దొరనే కంటి
నా కంటి కలలూ కళలూ నీ సొమ్మంటీ...
రేపంటి రూపం కంటి.. పూవింటి తూపుల వంటి
నీ కంటి చూపుల వెంట నా పరుగంటి

**** ******* ****** **************
చిత్రం :  మంచి-చెడు (1963)
సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఘంటసాల

పల్లవి:

పుడమి పుట్టెను నాకోసం.. పూలు పూచెను నాకోసం
కడలిపొంగెను నాకోసం.. తల్లిఒడినే పరచెను నాకోసం
పుడమి పుట్టెను నాకోసం.. పూలు పూచెను నాకోసం

పుడమి పుట్టెను నాకోసం.. పూలు పూచెను నాకోసం
కడలిపొంగెను నాకోసం.. తల్లిఒడినే పరచెను నాకోసం

చరణం 1:

నిన్న చీకటి తొలగెనులే.. నేడు వెలుగై వెలిగెనులే
నవ్యజీవన ప్రాభాతం.. నన్నే రమ్మని పిలిచెనులే
నవ్యజీవన ప్రాభాతం.. నన్నే రమ్మని పిలిచెనులే

పుడమి పుట్టెను నాకోసం.. పూలు పూచెను నాకోసం

చరణం 2:

ఉదయ భానుని కాంతులలో.. గగన మలిదిన రంగులలో
విశ్వశిల్పిని కన్నానూ.. వింట వానిని విన్నాను
విశ్వశిల్పిని కన్నానూ.. వింట వానిని విన్నాను

పుడమి పుట్టెను నాకోసం.. పూలు పూచెను నాకోసం

చరణం 3:

జగతి సకలం నాదైనా.. బ్రతుకు పువ్వుల బాటైనా
తల్లిమనసే గుడినాకూ.. తల్లి సేవే గురి నాకూ
తల్లిమనసే గుడినాకూ.. తల్లి సేవే గురి నాకూ

పుడమి పుట్టెను నాకోసం.. పూలు పూచెను నాకోసం
పుడమి పుట్టెను నాకోసం.. పూలు పూచెను నాకోసం
కడలి పొంగెను నాకోసం.. తల్లిఒడినే పరచెను నాకోసం
పుడమి పుట్టెను నాకోసం.. పూలు పూచెను నాకోసం

**** ******* ****** **************

చిత్రం :  మంచి-చెడు (1963)
సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్, రామ్మూర్తి
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  సుశీల

పల్లవి:

తోడు నీడ ఎవరులేని ఒంటరి..వాడు లోకమనే పాఠశాల చదువరీ...
చీకటిలో బ్రతుకు వెతుకు తెంపరీ...వాని చిత్తమున మెత్తదనం కలదుమరీ

తోడు నీడ ఎవరులేని ఒంటరి.. వాడు లోకమనే పాఠశాల చదువరీ...
తోడు నీడ ఎవరులేని ఒంటరి.. వాడు లోకమనే పాఠశాల చదువరీ..
చీకటిలో బ్రతుకు వెతుకు తెంపరీ... వాని చిత్తమున మెత్తదనం కలదు మరీ
చిత్తమున మెత్తదనం కలదు మరీ...

చరణం 1:

కన్నె సొమ్ము దోచుకొనే చోరుడు.. కన్నతల్లి అనే మాటవినీ కట్టుబడు
కన్నె సొమ్ము దోచుకొనే చోరుడు... కన్నతల్లి అనే మాటవినీ కట్టుబడు
ఉన్నదంత యిచ్చి ఊరడించునూ... తానె ఊరు చేరువరకు తోడువచ్చును
ఊరు చేరువరకు తోడు వచ్చును...

తోడు నీడ ఎవరులేని ఒంటరి.. వాడు లోకమనే పాఠశాల చదువరీ
లోకమనే పాఠశాల చదువరీ...

చరణం 2:

ఆకలైన పులిలాగే ఉరుకును... కాని మచ్చికతో మనసు నిచ్చివేయును
కళా హృదయమున్న మేలి రసికుడు... సదా కనులలోనే కదలాడే యువకుడు
కనులలోనే కదలాడే యువకుడు...

తోడు నీడ ఎవరులేని ఒంటరి.. వాడు లోకమనే పాఠశాల చదువరీ
లోకమనే పాఠశాల చదువరీ...

చరణం 3:

రేపు వాని మనసు మార వచ్చును... వాడు మాపు మాని పగలు తిరుగ వచ్చును
తల్లి మనసు చల్లదనము తెలియును... వాని ఉల్లమున ప్రేమ మధువు ఒలుకును...
ఉల్లమున ప్రేమ మధువు ఒలుకును...

తోడు నీడ ఎవరులేని ఒంటరి.. వాడు లోకమనే పాఠశాల చదువరీ..
చీకటిలో బ్రతుకు వెతుకు తెంపరీ... వాని చిత్తమున మెత్తదనం కలదుమరీ
చిత్తమున మెత్తదనం కలదుమరీ...

బందిపోటు (1963)

చిత్రం: బందిపోటు (1963)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

ఓహోహో...ఓ... ఓ...
ఓహోహో... ఓ... ఓ...
ఓహోహోహో... ఓ... ఓ...

వగలరాణివి నీవే సొగసు కాడను నేనే
ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే

వగల రాణివి నీవె సొగసు కాడను నేనె
ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే
వగల రాణివి నీవే..

చరణం 1:

పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం
పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం
రెండు కలసిన నిండు పున్నమి రేయి మన కోసం

వగల రాణివి నీవే .. ఓహోహో ఓ...
ఒహోహో ఓ..
ఒహోహో ఓ..ఓ..

చరణం 2:

ఓహోహొ ఓఓఓ
ఓహోహొ ఓఓఓ

దోర వయసు చినదాన కోర చూపుల నెరజాణ
దోర వయసు చినదాన కోర చూపుల నెరజాణ
బెదరుటెందుకు కదలు ముందుకు ప్రియుడనేగాన
వగల రాణివి నీవే ..

చరణం 3:

కోపమంత పైపైనే చూపులన్నీ నాపైనే
కోపమంత పైపైనే చూపులన్నీ నాపైనే
వరుని కౌగిట ఒరిగినంతట కరిగి పోదువులె

వగలరాణివి నీవే.. సొగసు కాడను నేనే
ఈడు కుదిరెను జోడు కుదిరెను.. తోడుగా రావే...

వగల రాణివి నీవే .. ఓహోహో ఓ...
ఓహోహో ఓ...
ఓహోహో ఓఓఓ...
******* ******** *********** ********


చిత్రం:  బందిపోటు (1963)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
ఊ హూ హూ.. ఊ ఊ ఊ... ఊ ఊ ఊ.... ఊ ఊ ఊ
ఊ హూ హూ.. ఊ ఊ ఊ... ఊ ఊ ఊ.... ఊ ఊ ఊ

ఊహలు గుసగుసలాడే... నా హృదయము ఊగిసలాడే
ప్రియా... ఊ
ఊహలు గుసగుసలాడే...  నా హృదయము ఊగిసలాడే

చరణం 1:

వలదన్న వినదీ మనసు.. కలనైన నిన్నే తలచు
వలదన్న వినదీ మనసు.. కలనైన నిన్నే తలచు
తొలిప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు

ఊహలు గుసగుసలాడే... నా హృదయము ఊగిసలాడే

చరణం 2:

నను కోరి చేరిన బేలా.... దూరాన నిలిచేవేలా
నను కోరి చేరిన బేలా.... దూరాన నిలిచేవేలా
నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడా

ఊహలు గుసగుసలాడే... నా హృదయము ఊగిసలాడే

చరణం 3:

దివి మల్లెపందిరి వేసే.... భువి పెళ్ళిపీటను వేసే..
దివి మల్లెపందిరి వేసే.... భువి పెళ్ళిపీటను వేసే..
నెర వెన్నెల కురిపించుచు నెలరాజు పెండ్లిని చేసే

ఊహలు గుసగుసలాడే... మన హృదయము ఊగిసలాడే

పునర్జన్మ (1963)

చిత్రం : పునర్జన్మ (1963)
సంగీతం :  టి . చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  సుశీల 


పల్లవి :

నీ కోసం...  నీ కోసం
నా గానం నా ప్రాణం నీ కోసం


నీ కోసం...  నీ కోసం
నా గానం నా ప్రాణం నీ కోసం


చరణం 1 :

నీ కన్నుల వెలుగులో...  నీలి నీడలెందుకో
నీ కన్నుల వెలుగులో...  నీలి నీడేందుకో
నీ వెన్నెల మోములో...  ఈ విషాదమెందుకో

నీ బాధను పంచుకొనగ...  నేనుంటిని కాదా
నేనుంటిని కాదా

నీ కోసం...  నీ కోసం
నా గానం నా ప్రాణం నీ కోసం


చరణం 2 :

నీ వేదనలోనే... నా వేదన లేదా
నీ వేదనలోనే... నా వేదన లేదా
నీ సన్నిధిలోనే... నా పెన్నిధి లేదా
నీ చిరునవ్వుల లోనే... జీవింతును గాదా
జీవింతును గాదా

నీ కోసం...  నీ కోసం
నా గానం నా ప్రాణం నీ కోసం


చరణం 3 :


నింగి నిదురపోయే...  నేల నిదురపోయే
నింగి నిదురపోయే...  నేల నిదురపోయే
గాలి నిదురపోయే...  లోకాలే నిదుర పోయే
నా హృదయమే నీ పానుపుగా...  నిదురించగ లేవా
నిదురించగ రావా


నీ కోసం...  నీ కోసం
నా గానం నా ప్రాణం నీ కోసం


****** **********  ****** *********

చిత్రం : పునర్జన్మ (1963)
సంగీతం :  టి . చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  సుశీల 

పల్లవి :


ఉమ్..ఊ.. ఆ..ఆ..ఆ.. ఓ..ఓ..ఓ.. ఆ..ఆ..ఆ..

దీపాలు వెలిగె...  పరదాలు తొలగె
దీపాలు వెలిగె...  పరదాలు తొలగె..
ప్రియురాలు పిలిచె రావోయి
ప్రియురాలు పిలిచె రావోయి

దీపాలు వెలిగె...  పరదాలు తొలగె..
ప్రియురాలు పిలిచె రావోయి
ప్రియురాలు పిలిచె రావోయి



చరణం 1 :

నా వయసు నీది...  నీ వలపు నాది
నా వయసు నీది నీ వలపు నాది.. మన మనసులు కలసినవోయి

నీ అడుగు జాడ...  నా పూల మేడ
నీ అడుగు జాడ నా పూల మేడ.. మనమిరువురమొకటేలేవోయి

దీపాలు వెలిగె పరదాలు తొలగె.. ప్రియురాలు పిలిచె రావోయి

చరణం 2 :


నా తోడు నీవు...  నీ నీడ నేను
నా తోడు నీవు నీ నీడ నేను... మన ఇరువురిదే ఈ రేయి

ఇక జాగుసేయ తగదోయి నీకు
ఇక జాగుసేయ తగదోయి నీకు.. నా చల్లని రాజా రావోయి

దీపాలు వెలిగె.. పరదాలు తొలగె
దీపాలు వెలిగె.. పరదాలు తొలగె..


****** **********  ****** *********

చిత్రం : పునర్జన్మ (1963)
సంగీతం :  టి . చలపతిరావు
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం :  ఘంటసాల

పల్లవి:

ఓ..ఓ..ఓ..ఓ.. సజీవ శిల్ప సుందరి..
నా..ఆ.. జీవన రాగమంజరి..ఈ..ఈ..ఈ..
ఎవరివో.. ఎవరివో..
ఎవరివో.. నీవెవరివో
ఎవరివో.. ఎవరివో..
నా భావనలో.. నా సాధనలో
నా భావనలో నా సాధనలో.. నాట్యము చేసే రాణివో
ఎవరివో.. నీవెవరివో..

చరణం :1

దివినే వదలి భువికేదెంచిన.. తేనెల వెన్నెల సోనవో
కవితావేశమే కలలై అలలై.. కురిసిన.. పువ్వుల.. వానవో..ఓ..

ఎవరివో.. నీవెవరివో..
ఎవరివో.. ఎవరివో..

చరణం : 2

నవ వసంతమున నందనవనమున..ఆ..ఆ..ఆ..
నవ వసంతమున నందనవనమున.. కోయిల పాడిన పాటవో..ఓ..
నవ వసంతమున నందనవనమున.. కోయిల పాడిన పాటవో
వలపు కొలనులో కలకల విరిసిన.. కలువుల.. కన్నుల.. కాంతివో
ఎవరివో.. నీవెవరివో..
ఎవరివో.. ఎవరివో..

చరణం : 3

నీ కర కంకణ నిక్వణమాది వాణీ వీణా నినాదమా
నీ పద నూపుర నిశ్వనమాది జలధి తరంగ మృదంగ రావమా
రావే మోహన రూపమా..
రావే నూతన తేజమా..
రావే..ఏ.. రావే..  

చదువుకున్న అమ్మాయిలు (1963)

చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం:  సుశీల

పల్లవి:

ఓ...ఓ...ఆ ...ఆ....ఓ....ఆ....
వినిపించని రాగాలే కనిపించని అందాలే
అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే కనిపించని అందాలే ఏ ఏ...

చరణం 1:

తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే
తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే
చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే
వలచే మనసే మనసు

వినిపించని రాగాలే కనిపించని అందాలే ఏ ఏ...

చరణం 2:

వలపే వసంతముల పులకించి పూచినది
వలపే వసంతముల పులకించి పూచినది
చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి
విరిసే వయసే వయసు

వినిపించని రాగాలే కనిపించని అందాలే...
చరణం 3:

వికసించెను నా వయసే మురిపించు ఈ సొగసే
విరితేనెల వెన్నెలలో కొరతేదో కనిపించే
ఎదలో ఎవరో మెరిసే
వినిపించని రాగాలే కనిపించని అందాలే...
అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే కనిపించని అందాలే


****** ******* *********** **********
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి,
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని
ఓ నన్నే నీదాన్ని చేసుకోవాలి

చరణం 1:

నవనాగరీక జీవితాన తేలుదాం,
నైటుక్లబ్బులందు నాట్యమాడి
సోలుదాం
హో హో హొ హో
నువ్వు అందమైన టిప్పుటాపు బాబువి,
నేను అంతకన్న అప్టుడేటు బేబిని

వగలాడి నీకు తాళి బరువు ఎందుకు,
ఎగతాళి చేసి దాని పరువు తీయకు

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైనజవ్వని
ఓ తల్లీ దయచేయి కోటిదండాలు

చరణం 2:

నేను పేరుపడిన వారి ఇంట పుట్టి పెరిగాను,
ఏదో హారుమణి వాయిస్తూ పాడుకుంటాను

దనిస నిదనిప మగదిస దిగమప

నేను చదువులేనిదాననని అలుసు నీకేల,
నీకు కలసివచ్చు లక్షలాస్తి విడిచిపోనేల

నీతో వియ్యం దినదినగండం,
మీ ఆస్తి కోసం ఆత్మ నేను అమ్ముకోజాల

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని

ఓ తల్లి దయచేయి కోటిదండాలు

చరణం 3:

సిరులూ నగలూ మాకు లేవోయి,
తళుకూ బెళుకుల మోజు లేదోయి
హహహా...
చదువూ సంస్కృతి సాంప్రదాయాలు
తెలుగుతనమే మా రత్నహారాలు

ధనరాశి కన్న నీ గుణమే మిన్న,
నీలో సంస్కారకాంతులున్నాయి

నీకో బ్రూటు దొరికిందీ
మెడలో జోలె కడుతుందీ
ఈమె కాలి గోటి ధూళి పాటి చేయరు
ఓ త్వరగా దయచేస్తె కోటి దండాలు


నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఓహో పక్కనున్న చక్కనైన జవ్వనీ,
హాయ్ నిన్నే నాదాన్ని చేసుకుంటాను


****** ******* *********** **********
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

కిలకిల నవ్వులు చిలికిన.. పలుకును నాలో బంగారువీణ
కరగిన కలలే నిలిచిన.. విరిసెను నాలో మందారమాల

చరణం 1:

రమ్మని మురళీరవమ్ములు పిలిచె
రమ్మని మురళీరవమ్ములు పిలిచె
అణువణువున బృందావని తోచె
తళతళలాడే తరగలపైన అందీఅందని అందాలు మెరిసె

కిలకిల నవ్వులు చిలికిన.. పలుకును నాలో బంగారువీణ

చరణం 2:

నీవున్న వేరే సింగారములేల
నీవున్న వేరే సింగారములేల
నీ పాదధూళి సింధూరము కాదా
మమతలు దూసి మాలలు చేసి గళమున నిలిపిన కళ్యాణి నీవే

కరగిన కలలే నిలిచిన.. విరిసెను నాలో మందారమాల

చరణం 3:

నీ కురులే నన్ను సోకిన వేళ
నీ కురులే నన్ను సోకిన వేళ
హాయిగ రగిలేను తీయని జ్వాల
గలగల పారే వలపులలోనే సాగెను జీవనరాగాల నావ

కిలకిల నవ్వులు చిలికిన.. పలుకును నాలో బంగారువీణ
కిలకిల నవ్వులు చిలికినా


****** ******* *********** **********
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, ఆశాలత కులకర్ణి

పల్లవి:

ఆఅ ఆఅ ఆఅ హా
ఓఓ ఓఓ ఓఓ హో

ఓహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది
చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నది

చరణం 1:

వెచ్చగ జవ్వని తాకితే పిచ్చిగ ఊహలు రేగునే
రెపరెపలాడే గుండెల్లోన ప్రేమ నిండేనే
అయ్యో పాపం .. తీరని తాపం
భావ కవిత్వం చాలునోయి పైత్యం లోన జారకోయి
పెళ్ళికి ముందు ప్రణయాలు ముళ్ళ బాణాలు

ఓహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది

చరణం 2:

పెద్దల అనుమతి తీసుకో
ప్రేమను సొంతం చేసుకో
హద్దుపద్దు మీరినా ఆటకట్టేను
యస్ అంటారు మావాళ్ళు
నో అంటేను జతరారు
తల్లి తండ్రి కూడంటే గుళ్ళో పెళ్ళి చేసుకుందాం
ధైర్యం చేసి నీవేగా దారి చూపావు

చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నది

చరణం 3:

మనసే దోచిన సుందరి
మమతే మల్లె పందిరి
పందిరిలోన మేనులు మరచి పరవశించాలి
అపుడే కాదు.. ఎపుడంటావు
తొందరలోనే మూడుముళ్ళు అందరిముందు వేయగానే
తోడునీడై కలకాలం సాగిపోదాము

ఓహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది
చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నదీ

ఓఓ ఓఓ ఓఓ హో
ఓఓ ఓఓ ఓఓ హో


****** ******* *********** **********
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

గుట్టుగా లేతరెమ్మల కులుకు నిన్ను
రొట్టెముక్కల మధ్యన పెట్టిరనుచూ
ఏల ఇట్టుల చింతింతువే టొమేటో
అతివలిద్దరి మధ్య నా గతిని గనుమా, ఆ . . .

ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము
ఒకటే హృదయం కోసమూ

చరణం 1:

ఒకరు సత్యభామ ఒకరేమొ రుక్మిణి
మధ్య నలిగినాడు మాధవుండు
ఇద్దరతివలున్న ఇరకాటమేనయా
విశ్వదాభిరామ వినుర వేమా.. ఆ . . .

ఆ . . ఓ . .
జతగా చెలిమీ చేసిరీ, అతిగా కరుణే చూపిరీ
ఆ . . .

చెలిమే వలపై మారితే శివశివ మనపని ఆఖరే
ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము
ఒకటే హృదయం కోసమూ
ఓ . . .

చరణం 2:

రామునిదొకటే బాణము జానకి ఆతని ప్రాణము
ఆ . . .
ప్రేమకు అదియే నీమము ప్రేయసి ఒకరే న్యాయము
ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము
ఒకటే హృదయం కోసమూ


****** ******* *********** **********
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: కొసరాజు
నేపధ్య గానం: మాధవపెద్ది సత్యం, స్వర్ణలత

పల్లవి:

ఆ...ఏమిటే...
ఏమిటి ఈ అవతారం?
ఎందుకు ఈ సింగారం?
ఏమిటి ఈ అవతారం?
ఎందుకు ఈ సింగారం?
పాత రోజులు గుర్తొస్తున్నవి
ఉన్నది ఏదో వ్యవహారం
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం

చరణం 1:

పౌడర్ దెచ్చెను నీకందం
బాగా వెయ్ వేలెడు మందం
పౌడర్ దెచ్చెను నీకందం
బాగా వెయ్ వేలెడు మందం
తట్టెడు పూలు తలను పెట్టుకుని
తయారైతివా చిట్టి వర్ధనం

చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం
చరణం 2:

ఆ...ఆ...ఓ...ఓ....
వయసులోన నే ముదురుదాననా
వయ్యారానికి తగనిదాననా
వయసులోన నే ముదురుదాననా
వయ్యారానికి తగనిదాననా
వరుసకాన్పులై వన్నె తగ్గినా
అందానికి నే తీసిపోదునా
ఏమిటి నా అపరాధం
ఎందుకు ఈ అవతారం


చరణం 3:

దేవకన్య ఇటు ఓహో...
దేవకన్య ఇటు దిగివచ్చిందని
భ్రమసి పోదునా కలనైనా
మహంకాళి నా పక్కనున్నదని
మరచిపోదునా ఎపుడైనా
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం

నీళ్ళు కలపని పాలవంటిది
పిండి కలపని వెన్న వంటిది
నీళ్ళు కలపని పాలవంటిది
పిండి కలపని వెన్న వంటిది
నిఖారుసైనది నా మనసు
ఊరూవాడకు ఇది తెలుసు
ఏమిటి ఈ అవతారం?
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం

****** ******* *********** **********

చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి

పల్లవి:

ఏమండోయ్.. నిదుర లేవండోయ్
ఏమండోయ్.. నిదుర లేవండోయ్
ఎందుకు కలలో కలవరింత
ఎవరిని తలచి పలవరింత
ఎదుటకురాగా ఏల ఈ మగత
ఏమండోయ్.. నిదుర లేవండోయ్

చరణం 1:

ప్రేయసి నిద్దుర లేపుట..మోము చూపుట
పెళ్ళికి తదుపరి ముచ్చట..
ముందు జరుగుట.. చాలా అరుదట
కమ్మని యోగం కలిసిరాగా కన్నులు మూసి కపటమేల
బిగువు బింకం ఇంక చాలండోయ్

ఏమండోయ్..నిదుర లేవండోయ్

చరణం 2:

యువతులు దగ్గర చేరినచో యువకులు ఉరకలు వేసెదరే
కోరిన కోమలి చేరగనే కులుకులు అలుసైపోయినవా
కోరిన కోమలి చేరగనే కులుకులు అలుసైపోయినవా
గురకలు తీసే కుంభకర్ణ నటన మానండోయ్

ఏమండోయ్..నిదుర లేవండోయ్

చరణం 3:

నేనే వలచి రానిచో చెంత లేనిచో
నిదురే రాదని అంటిరి బ్రతుకనంటిరి మోసగించిరి
నిద్రాదేవిని వీడకుంటే ఉద్యోగాలు ఊడునండోయ్
నిద్రాదేవిని వీడకుంటే ఉద్యోగాలు ఊడునండోయ్
ఇద్దరి ఆశలు ఇంక క్లోజండోయ్

ఏమండోయ్..నిదుర లేవండోయ్
ఏమండోయ్..నిదుర లేవండోయ్

****** ********* *******

చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

ఆడవాళ్ళ కోపంలో అందమున్నది
అహ అందులోనే అంతులేని అర్ధమున్నది.. అర్ధమున్నదీ
మొదటి రోజు కోపం అదో రకం శాపం
పోను పోను కలుగుతుంది భలే విరహ తాపం
బ్రహ్మచారి లేత మనసు పైకి తేలదు
తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు పొత్తు కుదరదు

చరణం 1:

పడుచు వాడి మిడిసిపాటు పైన పటారం
ఒక గడుసు పిల్ల కసర గానే లోన లొటారం
పడుచువానీ .. ఒహో...
పడుచు వాడి మిడిసిపాటు పైన పటారం
ఒక గడుసు పిల్ల కసర గానే లోన లొటారం

వగలాడి తీపి తిట్టు తొలి వలపు తేనె పట్టు
ఆ తేనె కోరి చెంత చేర చెడామడా కుట్టు

చరణం 2:

పెళ్లికాని వయసులోని పెంకి పిల్లలు ఒహో
తమ కళ్ళతోనే మంతనాలు చేయుచుందురు
పెళ్లికాని వయసులోని పెంకి పిల్లలు ఒహో
తమ కళ్ళతోనే మంతనాలు చేయుచుందురు

వేడుకొన్న రోషం అది పైకి పగటి వేషం
వెంటపడిన వీపు విమానం

చరణం 3:

చిలిపి కన్నె హృదయమెంతో చిత్రమైనది
అది చిక్కు పెట్టు క్రాసు వర్డు పజిలు వంటిది
చిలిపికన్నె.. ఉహూ...
చిలిపి కన్నె హృదయమెంతో చిత్రమైనది
అది చిక్కు పెట్టు క్రాసు వర్డు పజిలు వంటిది

ఆ పజిలు పూర్తి చేయి తగు ఫలితముండునోయి ఆ
మరపు రాని మధురమైన ప్రైజు దొరుకునోయి

అనురాగం (1963)

చిత్రం: అనురాగం (1963) 
సంగీతం: మాస్టర్ వేణు 
గీతరచయిత: సినారె 
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల 


పల్లవి: 

పదే పదే కన్నులివే బెదరునెందుకు 
ఏదో ఏదో చక్కిలిగింత కలిగినందుకు 
ఆ హా ఆ హా ఓ హో ఓ హో 
ఆ హా ఆహా ఓ హో ఓ హో 
ఒదిగి ఒదిగి లేత వలపు ఒదిగినందుకు 

పదే పదే కన్నులివే బెదరునెందుకు 
ఏదో ఏదో చక్కిలిగింత కలిగినందుకు 

చరణం 1: 
ఆ... ఓ... ఆ... ఓ... ఆ.... ఆ...
వ్వులలో రివ్వుమనే గువ్వజంటలేమనే.. ఏమనెనో 
ఏమనినా ఒంటరితనమింక చాలు చాలనే 
వ్వులలో రివ్వుమనే గువ్వజంటలేమనే.. ఏమనెనో 
ఏమనినా ఒంటరితనమింక చాలు చాలనే 

ఓ ఓ ఓ ఓ ... 
పదే పదే కన్నులివే బెదరునెందుకు 
ఏదో ఏదో చక్కిలిగింత కలిగినందుకు 

చరణం 2: 

చల్లని గాలి నీవైతే .. కమ్మని తావీ నేనవుతా 
కొమ్మవు నీవై రమ్మంటే .. కోకిల నేనై కూ అంటా 
చేరువనే చేరగనే చెంగులాగుటెందుకు.. జాణవులే 
జాణవులే చూపులతో బాణమేసినందుకు ... 

ఓ ఓ ఓ ... 
పదే పదే కన్నులివే బెదరునెందుకు 
ఏదో ఏదో చక్కిలిగింత కలిగినందుకు 
ఆ హా ఆ హా ఓ హో ఓ హో 
ఆ హా ఆహా ఓ హో ఓ హో 
ఒదిగి ఒదిగి లేత వలపు ఒదిగినందుకు...

పదే పదే కన్నులివే బెదరునెందుకు 
ఏదో ఏదో చక్కిలిగింత కలిగినందుకు 

నర్తనశాల (1963)

చిత్రం : నర్తనశాల (1963)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
రచయిత : తిక్కన
నేపధ్య గానం : ఘంటసాల 


పద్యము : 

ఎవ్వాని వాకిట నిభమద పంకంబు
రాజభూషణ రజోరాజి నడగు
ఎవ్వాని చారిత్ర మెల్లలోకములకు
నొజ్జయై వినయంబు నొఱపు గఱపు
ఎవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి
మానిత సంపద లీనుచుండు
ఎవ్వాని గుణలతలేడువారాశుల
కడపటి కొండపై గలయ బ్రాకు

నతడు భూరిప్రతాప మహాప్రదీప
దూర విఘటిత గర్వాంధకార వైరి
వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రి
తలుడు కేవల మర్త్యుడె ధర్మ సుతుడు

ఎవ్వాని వాకిట - ఎవరి వాకిట్లో, ఇభ - ఏనుగుల, మద - మద ధారల చేత ఏర్పడిన, పంకంబు - బురద, రాజ భూషణ - రాజులు వేసుకున్న ఆభరణాల, రజము - ధూళి, రాజి- గుట్ట , అడగు - అణగు (అణిగిపోతుందో)

ఎవ్వాని చారిత్రము - ఎవరి చరిత్ర అయితే, ఎల్ల లోకములకు, ఒజ్జయై - గురువై, వినయంబు - వినయముయొక్క, ఒఱపు - గొప్పదనుము లేదా పద్ధతి, కఱపు - నేర్పు (నేర్పుతుందో)

ఎవ్వని కడకంట - ఎవరి కను తుదల, నివ్వటిల్లెడు - వ్యాపించే , చూడ్కి - చూపు, మానిత - కొనియాడబడిన, సంపదలు- సంపదలు, ఈను చుండు - ప్రసాదించును (ప్రసాదిస్తూ ఉంటుందో)

ఎవ్వాని గుణలతలు - ఎవరి గుణములనే లతలు, ఏడు వారాశుల - సప్త సముద్రాల, కడపటి కొండపై - అవతల ఉన్న కొండపై, కలయన్ ప్రాకు - అంతటా ప్రాకుతున్నాయో
అతడు - ధర్మరాజు, భూరి ప్రతాప - అధికమైన ప్రతాపం అనే, మహా ప్రదీప - గొప్ప జ్యోతి చేత, దూర విఘటిత - దూరాలకి కొట్టివేయబడ్డ, గర్వాంధకార - గర్వమనే చీకటి గల, వైరి వీర - శత్రు వీరుల యొక్క, కోటీర - కిరీటములందు ఉన్న, మణి ఘృణి - మణుల యొక్క కాంతి, వేష్టిత - చుట్టబడిన, అంఘ్రితలుడు - పాదములు కలిగినవాడు
కేవల మర్త్యుడే - సాధారణమైన మనిషా ఇతను? ధర్మ సుతుడు - యమ ధర్మరాజుకు కొడుకైన యుధిష్టిరుడు.

ధర్మరాజు వాకిట ఎందరెందరో రాజులు ఏనుగులమీద వస్తారు. ఆ ఏనుగులనుంచి కారే మద ధారల వల్ల అక్కడంతా బురద బురదగా మారుతోంది. రాజులు ధరించినవన్నీ రత్నాభరణాలు. వాళ్ళేమో కిక్కిరిసి ఉన్నారు. ఆ రాపిడికి ఆ రత్నాలు ఒరుసుకొని రత్న ధూళి కిందంతా పడుతోంది. ఆ ధూళిరాశులు కిందనున్న బురదని పోగొడుతున్నాయి.
ఎవని చరిత్ర గురువై వినయముయొక్క పద్ధతినీ గొప్పతనాన్నీ లోకమంతటికీ నేర్పుతుందో
ఎవని కడకంటి చూపు గొప్ప సంపదలు ప్రసాదిస్తుందో
ఇక్కడ గుణములు లతలు కాబట్టి అవి ప్రాకుతాయి. ఎక్కడికి? సప్తసముద్రాల అవతలున్న కొండమీదకి. అంటే ఎవని గుణములు లోకమంతా అంతగా ప్రసిద్ధి పొందాయో అని.

అతనెవరు? తన అమోఘప్రతాపము అనే మహాజ్యోతి చేత శత్రు రాజుల గర్వమనే అంధకారం దూరమైపోయింది. అలా గర్వం తొలగింపబడిన ఆ రాజులు ఇతని కాళ్ళకి నిరంతరం మ్రొక్కుతూ ఉన్నారు. దానితో వాళ్ళ కిరీటాలలో ఉండే మణుల కాంతి ఎల్లెప్పుడూ అతని పాదాలని చుట్టుకొని ఉంది.

ఇక్కడ ధర్మరాజు సామాన్య మనిషా... కాదు. స్వయానా యమధర్మ రాజు కొడుకు అని అర్థం. అంటే ధర్మానికి ప్రతీకే ధర్మరాజు అని చెప్పడమే.

ఇది తిక్కనగారి పద్యము. ఈ మాట ద్రౌపది భీమార్జునలతో అంటుంది. నర్తనసాల సినిమాలో మాత్రము అర్జునుడు(బృహన్నల) ద్రౌపది, భీముడితో ధర్మరాజు గురించి చెప్పిన పద్యము.

**** ******** ********
చిత్రం : నర్తనశాల (1963)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
రచయిత : తిక్కన 
నేపధ్య గానం : ఘంటసాల 

పద్యము : 


ఉత్తర కుమారుడికి కౌరవ సేనను పరిచయం చేస్తూ...




కాంచనమయ వేదికా కనత్కేతనోజ్జ్వల విభ్రమమువాఁడు కలశజుండు
సింహలాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఖణమువాఁడు ద్రోణసుతుడు
కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుటధ్వజ సముల్లాసంబువాఁడు కృపుఁడు
లలిత కంబుప్రభాకలిత పతాకా విహారంబువాఁడు రాధాత్మజుండు

మణిమయోరగ రుచిజాల మహితమైన
పడగవాఁడు కురుక్షితిపతి మహోగ్ర
శిఖరఘన తాళతరువగు సిడమువాఁడు
సురనదీసూనుఁ డేర్పడఁ జూచికొనుము


"కాంచనమయ వేదికా కనత్కేతనోజ్జ్వల విభ్రమమువాఁడు కలశజుండు "
బంగారు రంగుతో చేసిన వేదిక మీద ప్రకాశిస్తున్న జెండా కల రథం మీద ఉన్నవాడు
‘కలశజుండు : (కుండలో పుట్టిన వాడు ) : ద్రోణుడు

"సింహ లాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఖణమువాఁడు ద్రోణసుతుడు " :
సింహపు తోకతో అలంకరించి ఉన్న రథంపై విరాజిల్లుతున్నవాడు ద్రోణసుతుడు అశ్వత్థామ.

"కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుటధ్వజ సముల్లాసంబు వాఁడు కృపుఁడు " :
బంగారు ఆవు-ఎద్దుల జంట గుర్తుగా కలిగినవాడు కృపుడు.

"లలితకంబు ప్రభాకలిత పతాకావిహారంబువాఁడు రాధాత్మజుండు "
"లలితంబుగా ప్రభావితమౌతున్న శంఖం పతాకముగా కలవాడు రాధ కుమారుడు కర్ణుడు.

"మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాఁడు కురుక్షితిపతి "
"మణులతో పొదిగిన పడగ గల నాగు పాము పతాకముగా కలవాడు కురు క్షితి పతి.. దుర్యోధనుడు.

"మహోగ్ర శిఖర ఘన తాళతరువగు సిడమువాఁడు సురనదీసూనుడు"
బ్రహ్మాండమైన తాళవృక్షం జెండాగా ఉన్నవాడు
సురనదీసూనుడు.. సురనదీ : గంగ
సూనుడు : కొడుకు ... భీష్మాచార్యుడు.

ఏర్పడఁజూచికొనుము : బాగా తేరిపార చూడు

కాంచనమయ వేదిక కేతనముగా కలవాడు ద్రోణాచార్యుడు. ఎగురుతున్న సింహం తోక కేతనముగా కలవాడు అశ్వథ్థామ. బంగారు గోవును కేతనముగా కలిగిన వాడు కృపాచార్యుడు. తెల్లని కేతనమ కల వాడు కర్ణుడు. పాము పడగను కేతనముగా కలిగిన వాడు సుయోధనడు. తాటి చెట్టును కేతనముగా అలంకరించిన వాడు భీష్ముడు.


తిక్కనగారు చేసిన చమత్కారం ఏమిటంటే... అందరికీ కేతనమనో, కేతువనో వాడక ఒకొక్కరికి ఒకో పదము వాడారు. కేతనము, కేతువు, ధ్వజము, పతాకము, పడగ, సిడము.

**** ******** ********
చిత్రం: నర్తనశాల (1963)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: బాలమురళీకృష్ణ, బెంగుళూరు లత

పల్లవి:

ఆ ఆ ఆ....

సలలిత రాగ సుధారససారం
సలలిత రాగ సుధారససారం
సర్వకళామయ నాట్యవిలాసం
సర్వకళామయ నాట్యవిలాసం

సలలిత రాగ సుధారససారం

మంజుల సౌరభ సుమకుంజముల
మంజుల సౌరభ సుమకుంజముల
రంజిలు మధుకర మృదు ఝంకారం
రంజిలు మధుకర మృదు ఝంకారం

సలలిత రాగ సుధారససారం
సర్వకళామయ నాట్యవిలాసం
సలలిత రాగ సుధారససారం

చరణం 1:

ని దా ద ప నీ ప నీ దా ప మ గ మ గ పా..... స రి గ

ఆ ఆ ఆ...

కల్పనలో ఊహించిన హొయలూ..ఊ..ఊ...ఆ..ఆ..
కల్పనలో ఊహించిన హొయలూ
శిల్పమనోహర రూపమునొందీ
శిల్పమనోహర రూపమునొందీ
పద కరళములా మృదు భంగిమలా
పద కరళములా మృదు భంగిమలా
ముదమార లయమీరు నటనాల సాగె

సలలిత రాగ సుధారససారం

ఝణన ఝణన ఝణ నొంపుర నాదం
ఆ ఆ.....
ఝణన ఝణన ఝణ నూపుర నాదం

భువిలో దివిలో రవళింపగా

ప ద ప మ పా ఆ.....
మ ని ద మ దా ఆ.....
గ మ ద నీ సా ఆ.....
రీ సా రీ సా ని ప ద దా నీ దా నీ దా మ ప నీ దా నీ దా ప మ గ ప

భువిలో దివిలో రవళింపగా
నాట్యము సలిపే నటరాయని
నాట్యము సలిపే నటరాయని
ఆనంద లీలా వినోదమే

సలలిత రాగ సుధారస సారం
సర్వకళామయ నాట్యవిలాసం
సలలిత రాగ సుధారస సారం

**** ******** ********

చిత్రం: నర్తనశాల (1963) 
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి 
గీతరచయిత: సముద్రాల (సీనియర్) 
నేపధ్య గానం: సుశీల 

పల్లవి: 

ఆ ఆ ఆ 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆ ఆ ఆఆ ఆ 

సఖియా వివరించవే ..... 

సఖియా వివరించవే 
వగలెరిగిన చెలునికి నా కథా 
సఖియా వివరించవే 
వగలెరిగిన చెలునికి నా కథా 

సఖియా వివరించవే ..... 

చరణం : 1 

నిన్ను జూచి కనులు చెదరి ..... 
కన్నె మనసు కానుక జేసి ..... 
నిన్ను జూచి కనులు చెదరి 
కన్నె మనసు కానుక జేసి 
మరువలేక మనసు రాక 
విరహాన చెలికాన వేగేనని 

సఖియా వివరించవే ..... 

చరణం : 2 

మల్లెపూలా మనసు దోచి 
పిల్లగాలి వీచేవేళా 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
మల్లెపూలా మనసు దోచి 
పిల్లగాలి వీచేవేళా 
కలువరేని వెలుగులోన 
సరసాల సరదాలు తీరేననీ 

సఖియా వివరించవే 
వగలెరిగిన చెలునికి నా కథా 
సఖియా వివరించవే .....


**** ******** ********


చిత్రం: నర్తనశాల (1963)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: జానకి

పల్లవి:

నరవరా....ఆ ఆ ఆ
నరవరా ఓ కురువరా.. నరవరా ఓ కురువరా
వీరుల నీకు సరి.. లేరనీ
సరసులలో జాణవనీ
విన్నారా.. కన్నారా..
విన్నారా కన్నారా కనులారా

చరణం 1:

సురపతి నెదిరించి రణాన పశుపతి మురిపించి బలాన
సురపతి నెదిరించి రణాన పశుపతి మురిపించి బలాన

సాటి లేని వీరుండన్న యశమును గన్నా
సాటి లేని వీరుండన్న యశమును గన్నా

అర్జున ఫల్గుణ పార్థ కిరీటి బిరుదు గొన్న విజయా 

నరవరా....ఆ ఆ ఆ 
నరవరా ఓ కురువరా.. నరవరా ఓ కురువరా 
వీరుల నీకు సరి.. లేరనీ 
సరసులలో జాణవనీ 
విన్నారా.. కన్నారా.. 
విన్నారా కన్నారా కనులారా 

చరణం 2:

నిను గనీ తల ఊచే ఉలూచీ కొనుమనీ చెయి సాచే సుభద్రా
నిను గనీ తల ఊచే ఉలూచీ కొనుమనీ చెయి సాచే సుభద్రా

నీదు వన్నె చిన్నె గన్న చెలువల మిన్న
నీదు వన్నె చిన్నె గన్న చెలువల మిన్న

అలరుల విలుతుని ములుకుల గురియై వలపులమ్ముకొనురా

నరవరా....ఆ ఆ ఆ 
నరవరా ఓ కురువరా.. నరవరా ఓ కురువరా 
వీరుల నీకు సరి.. లేరనీ 
సరసులలో జాణవనీ 
విన్నారా.. కన్నారా.. 
విన్నారా కన్నారా కనులారా 


**** ******** ********


చిత్రం: నర్తనశాల (1963)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
గీతరచయిత: సముద్రాల (జూనియర్)
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

దరికి రాబోకు రాబోకు రాజా
దరికి రాబోకు రాబోకు రాజా
ఓ... తేటి రాజా, వెర్రి రాజా
దరికి రాబోకు రాబోకు రాజా

చరణం 1:

మగువ మనసు కానగలేవో తగని మారాలు మానగ లేవో
మగువ మనసు కానగలేవో తగని మారాలు మానగ లేవో
నీకీనాడే మంగళమౌరా
నీకీనాడే మంగళమౌరా
ఆశా ఫలించీ తరించేవులే..ఏ..

దరికి రాబోకు రాబోకు రాజా
దరికి రాబోకు రాబోకు రాజా

చరణం 2:

మరుని శరాల చెలిమి మాలి పరువు పోనాది చేరగ రావోయ్
మరుని శరాల చెలిమి మాలి పరువు పోనాది చేరగ రావోయ్
నీవేనాడు కననీ విననీ
నీవేనాడు కననీ విననీ
శాంతి సుఖాల తేలేవులే..ఏ..

దరికి రాబోకు రాబోకు రాజా
దరికి రాబోకు రాబోకు రాజా
ఓ... తేటి రాజా... వెర్రి రాజా
దరికి రాబోకు రాబోకు రాజా

**** ******** ********



చిత్రం: నర్తనశాల (1963) 
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి 
గీతరచయిత: సముద్రాల (జూనియర్) 
నేపధ్య గానం: సుశీల 

పల్లవి: 

అమ్మా... అమ్మా.. 
జననీ శివకామిని... జయ శుభకారిని విజయ రూపిని 
జననీ శివకామిని జయ శుభకారిని విజయ రూపిని 
జననీ శివకామిని... 

చరణం 1: 

అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే 
అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే 
నీ చరణములే నమ్మితినమ్మ... 
నీ చరణములే నమ్మితినమ్మ... శరణము కోరితి అమ్మ భవాని..ఈ..ఈ

చరణం 2: 

నీదరినున్న తొలగు భయాలు.. నీ దయలున్న కలుగు జయాలు 
నీదరినున్న తొలగు భయాలు... నీ దయలున్న కలుగు జయాలు 
నిరతము మాకు నీడగ నిలచీ... 
నిరతము మాకు నీడగ నిలచీ జయమునీయవే అమ్మా... 
జయమునీయవే అమ్మ భవాని..ఈ..ఈ...

**** ******** ********

చిత్రం: నర్తనశాల (1963)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
గీతరచయిత: సముద్రాల (జూనియర్)
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

ఎవ్వరికోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే
సొగసరి ఒకపరి వివరించవే

చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరింతునో
గడుసరి ఏమని వివరింతునో

చరణం 1:

ఆ ఆ వలపులు చిలికే వగలాడి చూపు
పిలువక పిలిచి విరహాల రేపు

ఆ ఆ ఎదలో మెదలే చెలికానిరూపు
ఏవో తెలియని భావాల రేపు

ఈ నయగారం ప్రేమ సరాగం
ఈ నయగారం ప్రేమ సరాగం
అందించు అందరాని సంబరాలే 

ఎవ్వరికోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే 
సొగసరి ఒకపరి వివరించవే 

చరణం 2:

ఆ ఆ పరుగులు తీసే జవరాలి వయసు
మెరుపై మెరిసి మరపించు మనసు

ఆ ఆ ప్రణయం చిందే సరసాల గంధం
ఇరువురి నొకటిగ పెనవేయు బంధం
ఈ వయ్యారం ఈ సింగారం
ఈ వయ్యారం ఈ సింగారం
చిందించుచిన్ని చిన్ని వన్నెలెన్నో

ఎవ్వరికోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే 
సొగసరి ఒకపరి వివరించవే 
చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరింతునో 
గడుసరి ఏమని వివరింతునో