Showing posts with label Yuvan Shankar Raja. Show all posts
Showing posts with label Yuvan Shankar Raja. Show all posts

గోవిందుడు అందరివాడేలే (2014)

చిత్రం: గోవిందుడు అందరివాడేలే (2014)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిన్మయి

రా రా కుమారా రాజసాన ఏలగా
ఎదపై చేరనీరా పూలమాలె నేనుగా
నీవు తీసె శ్వాసలో ఊయలూగే ఆశతో
పంపుతున్నా నా ప్రాణాన్ని నీ వైపుగా...

చరణం: 1
నీ తలపులతో మరిగిపోయె ఒంటరి తనమూ ఇష్టమే
నీ కబురులతో కరిగిపోయె ప్రతి ఒక క్షణమూ ఇష్టమే
కలలే నిజమయేలా కళ్లు తెరిచిన కోరిక ఇష్టం
నిజమే కల అయేలా ఒళ్లు మరచిన
అయోమయం మరింత ఇష్టం

రా రా రాకుమారా రాజసాన ఏలగా
ఎదపై చేరనీరా పూలమాలె నేనుగా

చరణం: 2
బరువనిపించే బిడియమంతా నీ చేతులలో వాలనీ
బతకడమంటే ఎంత మధురం నీ చేతలలో తెలియనీ
నేనేం చేసుకోను నీవు పంచని ఈ హృదయాన్ని
ఇంకేం కోరుకోను నిన్ను మించిన మరోవరం ఏదైనా గానీ...




*********   **********   **********



చిత్రం: గోవిందుడు అందరివాడేలే (2014)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: హరిహరన్

తానన నననా తనాన తననన నననా
తానన నననా తనాన తననన నననా
తననాన నననా తాన నననా తాన నననననా

నీలి రంగు చీరలోన
చందమామ నీవె జాణ
ఎట్ట నిన్ను అందుకోనే..
ఏడు రంగుల్లున్న నడుము
బొంగరంలా తిప్పేదానా
నిన్ను ఎట్టా అదుముకోనే.. హేహేహే..
ముద్దులిచ్చి మురిపిస్తావే
కౌగిలించి కవ్విస్తావే
అంతలోనే జారిపోతావే...
మెరుపల్లె మెరిసి జాణ
వరదల్లె ముంచె జాణా...
ఈ భూమి పైన నీ మాయలోన
పడనోడు ఎవడె జాణా...
జాణ అంటే జీవితం జీవితమే నెరజాణరా
దానితో సయ్యాడరా యేటికి ఎదురీదరా

రాక రాక నీకై వచ్చి
పొన్నమంటి చిన్నది ఇచ్చే
కౌగిలింత బతుకున వచ్చే సుఖమనుకో
పూవు లాగ ఎదురే వచ్చి
ముల్లు లాగ ఎదలో గుచ్చి
మాయమయే భామ వంటిదె కష్టమనుకో..
ఎదీ కడదాక రాదని తెలుపుతుంది నీ జీవితం
నీతో నువు అతిథివనుకొని వెయ్ రా అడుగెయ్ రా వెయ్..
జాణ కాని జాణరా జీవితమే నెరజాణరా
జీవితం ఒక వింత రా ఆడుకుంటె పూబంతిరా

సాహసాన పొలమే దున్ని
పంట తీసె బలమే ఉంటే
ప్రతి రోజు ఒక సంక్రాంతి అవుతుందిలా..
బతుకు పోరు బరిలో నిలిచి
నీకు నీవె ఆయుధమైతే
ప్రతి పూట విజయ దశమియే వస్తుంది రా
నీపై విధి విసిరె నిప్పుతో ఆడుకుంటె దీపావళి
చెయ్ రా ప్రతి ఘడియ పండగే చెయ్ రా చెయ్ రా చెయ్
జీవితం అను రంగుల రాట్నమెక్కి ఊరేగరా
జీవితం ఒక జాతర చెయ్యడానికే జన్మరా
ఆ.. ఆ.. ఆ.. ఆ..



*********   **********   **********


చిత్రం: గోవిందుడు అందరివాడేలే (2014)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: చంద్రబోస్
గానం: రంజిత్, విజయ్ యేసుదాసు, సుర్ముకి, శ్రీవర్ధిని

చిన్నారికి వోణీలిచ్చెయ్..
వయ్యారిపై బాణాలేసేయ్..
చిన్నారికి వోణీలిచ్చె
వయ్యారిపై బాణాలేసే
శుభకార్యం జరుపుటకై
వచ్చాడు వచ్చాడు బంగారి బావ
బంగారి బావ బంగారి బావా...

బావగారి చూపే బంతి పువ్వై పూసిందే
బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే..
మరదలి మాటల్లో మందారం జారిందే
కలిసిన బంధంలో కురిసేనే ఇలా
పువ్వుల చినుకులే... పువ్వుల చినుకులే...

బావగారి చూపే బంతి పువ్వై పూసిందే
బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే
మరదలి మాటల్లో మందారం జారిందే
కలిసిన బంధంలో కురిసేనే ఇలా
పువ్వుల చినుకులే హే... పువ్వుల చినుకులే హే...

హో హో హో హో హో...

లంగా తోటి వోణీకుంది ఓ బంధం
ఈ రాజా తోటి రాణికుంది అనుబంధం
పాదాలకి అందెలకుంది ఓ బంధం
ఈ ప్రాయానికి అల్లరికుంది అనుబంధం
వాలు జడ జాజులు ఓ జంట
వడ్డాణము నడుము ఓ జంట
ఇక నీతో నేనవుతా జంటా...
చేతులకి జంటే గోరింట లేకపోతె కాలే లేదంట
నా వెంటే నువ్వుంటే కురిపిస్తా నీపై
బంగరు చినుకులే హే... బంగరు చినుకులే హే...

బావగారి చూపే బంతి పువ్వై పూసిందే
బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే

నవ్వుల్లోన బంధం అందం మెరుస్తుంది
అరె బాధల్లోన బంధం బలం తెలుస్తుంది
ఏ రూపం లేని ప్రాణం తానై నిలుస్తుంది
ఆ ప్రాణం పోయే క్షణం దాక తపిస్తుంది
కమ్మనైన బంధం ఈనాడే కోవెలల్లె మారే ఈచోటే
ఈ కోవెల్లో భక్తుడు నేనే...
అల్లుకున్న బంధం ఇవ్వాళే ఇల్లుకట్టుకుంది ఈ చోటే
ఈ ఇంట్లో మనవడినై
ఈ ఇంట్లో మనవాడినై కురిపిస్తా మీపై
ప్రేమల చినుకులే హే... ప్రేమల చినుకులే హే...

బావగారి చూపే బంతి పువ్వై పూసిందే
బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే..
మరదలి మాటల్లో మందారం జారిందే
కలిసిన బంధంలో కురిసేనే ఇలా
పువ్వుల చినుకులే హే... పువ్వుల చినుకులే హే...




*********   **********   **********



చిత్రం: గోవిందుడు అందరివాడేలే (2014)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రంజిత్

యో ప్రతి చోట నాకే స్వాగతం
అందిస్తోంది జీవితం పంచిస్తోంది అమృతం
సంతోషం నా చుట్టు ఉండే లోకం
చిరునవ్వే నే చేసే సంతకం
డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ
డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ
డు డు డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ
డు డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ
దూకే సుడి గాలిని హగ్ చేస్తా గుండెతో
కలిపేస్థా శ్వాసలో వంద యేళ్ళ బంధంలా
కురిసే వడగళ్ళని కరిగిస్తా ప్రేమతో
జారే జడివానలో జల్సా చెయ్యంగా

హె హె  ప్రతి చోట నాకే స్వాగతం
అందిస్తోంది జీవితం పంచిస్తోంది అమృతం
సంతోషం నా చుట్టు ఉండే లోకం
చిరునవ్వే నే చేసే సంతకం

ఆకలి నిద్దుర ఊపిరి మాదిరి
తోడుగా కోరుకో సంతోషాన్ని కూడ
ఏమి లేనోడు మస్తీలేనోడే
అన్నీ ఉన్నోడు హ్యాపీగున్నోడే
సాగే సమయాన్ని సరదాతొ నింపాలిగా
సంకెళ్ళే లేని సందళ్ళుగా నేడే
డు డు డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ
డు డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ
డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రి రిథమ్
డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రి రిథమ్
డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రి రిథమ్
డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రిథమ్
డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రి రిథమ్
డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రి రిథమ్
డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రి రిథమ్
రి రి రి రిథమ్ రి రి రి రిథమ్
డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రి రిథమ్
డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రిథమ్
డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రి రిథమ్
రి రి రి రిథమ్ రి రి రి రిథమ్
డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రి రిథమ్
డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రిథమ్
డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రి రిథమ్
రి రి రి రిథమ్ రి రి రి రిథమ్

నేననే మాటను నా అనే వాళ్లుగా
మార్చితే ఏర్పడే బంధమే కుటుంబం
నాలుగ్గోడల్నే ఇల్లనుకోలేము
నాలుగు మనసుల్ని ఒక్కటి చేద్దాము
బుజ్జి భూగోళం పువ్వల్లే నవ్వాలంటే
ప్రతి ఇంటింట పండాలిగా శాంతి
డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ
డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ
డు డు డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ
డు డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ



*********   **********   **********



చిత్రం: గోవిందుడు అందరివాడేలే (2014)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: లక్ష్మీ భోపాల్
గానం: కార్తిక్, హరిచరన్, యమ్.యమ్.మానసి, రీటా

కో కో కోడి మందెక్కేసి రంగేసిందబ్బా
అరె పిల్లని చూసి పిచ్చెక్కేసి తొడగొట్టిందబ్బా
అరె రబ్బా రబ్బా బాగుందబ్బా రిబ్బను జడదెబ్బ
అరె రబ్బా రబ్బా అదిరిందబ్బా ఒంపుల వడదెబ్బా..
యబ్బా యబ్బా గిలిగిలి యబ్బా గొడవెట్టిందబ్బా
అడియబ్బా యబ్బా ఊపిరి డబ్బా ఉడికెత్తిందబ్బా
అడియబ్బా యబ్బా రైకల జబ్బ చిటికేసిందబ్బా
అడియబ్బా యబ్బా సుక్కల జుబ్బ సురుకెత్తిందబ్బా
లండనే వదిలొచ్చానే పండగే చేయిస్తానే
ఉండవే గుండెలోన బావ మరదలిగా
మనసుపడి పడి చచ్చానే కులుకుతూ
గల గల గబ గబ చక చక పరుగున సరసకు రా...

అరె రబ్బా రబ్బా బాగుందబ్బా రిబ్బను జడదెబ్బ
అరె రబ్బా రబ్బా అదిరిందబ్బా ఒంపుల వడదెబ్బా.. హో..

పిల్లోడని చనువిస్తే గిల్లేస్తడే చంటోడు
సయ్యాటకే రమ్మంటడే రాకాసోడే..
కారంగా ముద్దిచ్చుకో గారంగా హగ్గిచ్చుకో
గుత్తంగా సోకిచ్చుకో అల్లేసుకో..
వలలేస్తాడే తుంటరి కలలోకొస్తాడే..
పూల పాదాల బంగారి కల నిజమే చేసి మొగుడైపోతా
సూపర్ బాబా అంతేరబ్బాయ్ హాయ్ హాయ్ రబ్బా...
హాయ్ హాయ్

పగలంతా పొగలొచ్చే నిదరోయినా సెగలొచ్చే
ఎటు చూసినా ఎదురొచ్చే నీ అందమే..
అందాలకే తోడొస్తే అచ్చంగా వచ్చేస్తలే
కదదాకా ఉంటాను నీ కౌగిల్లలో..
నువు ఔనంటే ఇప్పుడే ఎత్తుకుపోతానే..
అనుకోలేదే ఎప్పుడు నాకిష్టుడు కృష్ణుడిలా వస్తాడని
టచ్ చేసావే గిచ్చేసావే వచ్చేసాం మేమే...

అరె రబ్బా రబ్బా రబ్బా రబ్బా తరనర నానేనా
అరె రబ్బా రబ్బా రబ్బా రబ్బా తరనర నానేనా..
అరె రబ్బా రబ్బా బాగుందబ్బా రిబ్బను జడదెబ్బ
అరె రబ్బా రబ్బా అదిరిందబ్బా ఒంపుల వడదెబ్బా.. హై..



*********   **********   **********



చిత్రం: గోవిందుడు అందరివాడేలే (2014)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: శ్రీమణి
గానం: జవేద్ ఆలీ

గులాబి కళ్ళు రెండు ముల్లు చేసి
గుండెలోకి గుచ్చుతున్నావే.. ఓహో...
జిలేబి ఒళ్ళు చేసినట్టు నువ్వే
ఆశ పెట్టి చంపుతున్నవే.. ఓహో...
రాకాసి తేనెలె పెదాలలో పోగే చేసి ఊరించి
ఉడికించి పోతావె రాక్షసి సరాసరి
నీ నడుము మడతల్లో నను మడత పెట్టావె
ఊర్వశి నీలో నిషా నషాలానికంటే
ఓ ఇంగ్లీషు ముద్దియ్యవే పిల్లా పిల్లా ఓ.. ఓహో...

నాతోటి నీకింత తగువెందుకే నా ముద్దు నాకివ్వకా
అసలింత నీకింత పొగరెందుకే పిసరంత ముద్దివ్వకా
నాపైన కోపమే చల్లార్చుకో ముద్దుల్తొ వేడిగా
నాపై ఉక్రోషమే తీర్చేసుకో పెదాల్తొ తీయగా
పిసినారి నారివే గోదావరి నా గుండెల్లో ఉప్పొంగి
ఉడికేంత ముద్దియ్యవే మరి మనోహరి
నీ ముక్కోపమందాల కసితీర ముద్దియ్యవే...

ఏం మధువు దాగుందో ఈ మగువలో చూస్తేనె కిక్కెక్కెలా
ఆ షేక్స్‌పియరైనా నిను చూసెనో ఓ దేవదాసవ్వడా
నీ ఫ్రెంచ్ కిస్సునే అందించవే పరదేశి నేననా
నీ పెంకి ముద్దునే భరించగా స్వదేశినవ్వనా
ఓ ఆడ బాంబులా పిల్లా నువ్వే నీ అందాలు పేల్చేసి
నా అంతు తేల్చేసి న్యూక్లియర్ రియాక్టరై
నా అణువణువు అణుబాంబు ముద్దుల్తొ ముంచెయ్యవే...

గులాబి కళ్ళు రెండు ముల్లు చేసి
గుండెలోకి గుచ్చుతున్నావే.. ఓహో...
జిలేబి ఒళ్ళు చేసినట్టు నువ్వే
ఆశ పెట్టి చంపుతున్నవే.. ఓహో...
రాకాసి తేనెలె పెదాలలో పొగే చేసి ఊరించి
ఉడికించి పోతావె రాక్షసి సరాసరి
నీ నడుము మడతల్లో నను మడత పెట్టావె
ఊర్వశి నీలో నిషా నషాలానికంటే
ఓ ఇంగ్లీషు ముద్దియ్యవే పిల్లా పిల్లా ఓ.. ఓహో...

ఓయ్ (2009)

చిత్రం: ఓయ్ (2009)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: చంద్రబోస్
గానం: సిద్దార్ధ్


నూట డెబ్భైఆరు బీచ్ హౌస్ లో ప్రేమదేవతా
యల్లోచుడిదార్ వైట్ చున్ని తో దోచే నా ఎద
ఓయ్..ఓయ్..అంటు casual గా పిలిచెరో
ఓయ్..ఓయ్.. ఇరవై సార్లు కల్లో కలిసెరో
ఓయ్..ఓయ్..ఎంప్టీ గుండె నిండ నిలిచెరో
ఓయ్...ఊ..ఊ..ఊ
Love@1st sight నాలో కలిగే
Love@1st sight నన్ను కదిపే
Love@1st sight నాకే దొరికే
Love@1st sight నన్ను కొరికే

నూట డెబ్భైఆరు బీచ్ హౌస్ లో ప్రేమదేవతా !!


రూపం లోన Beautiful, చేతల్లోన dutyful, మాటల్లోన fundamental...
అన్నిట్లోన capable, అందర్లోన Careful, అంతేలేని sentimental
సినిమాలో మెరిసేటి పాత్ర,City లోన దొరకదు రా...
నిజంగానే తగిలెను తార,వైజాగు నగరపు చివరన

ఝల్ ఝల్ జరిగే
Love@1st sight ఛిల్ కలిగే
Love@1st sight పల్ పల్ పెరిగే
Love@1st sight పైకెదిగే

హేయ్...హేయ్...
డబ్బంటేనే Alergy,భక్తంటేనే Energy నమ్ముతుంది Numerology...
ఇంటి ముందు nostory అంతేలేదు అల్లరి, ఒప్పుకోదు Humorology
ఉండాల్సింది తన వాదల్లో,చ్రాల్సింది Military లో
ఏదో ఉంది strong thing తనలో, లాగింది మనసును చిటికెలో
Some సంబరమే
Love@1st sight వహ్ వరమే
Love@1st sight ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ క్షణమే,
Love@1st sight ఓ యుగమే

నూట డెబ్భైఆరు బీచ్ హౌస్ లో ప్రేమదేవతా
యల్లోచుడిదార్ వైట్ చున్ని తో దోచే నా ఎద
ఓయ్..ఓయ్..అంటు casual గా పిలిచెరో
ఓయ్..ఓయ్.. ఇరవై సార్లు కల్లో కలిసెరో
ఓయ్..ఓయ్..ఎంప్టీ గుండె నిండ నిలిచెరో
ఓయ్..ఊ..ఊ..ఊ..
Love@1st sight నాలో కలిగే
Love@1st sight నన్ను కదిపే
Love@1st sight నాకే దొరికే
Love@1st sight నన్ను కొరికే
Love@1st sight నన్ను కొరికే



********   *********   ********



చిత్రం: ఓయ్ (2009)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: వనమాలి
గానం: కె. కె.

చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావని
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని
నిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ
నిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ
ప్రతి జన్మ నీతోనే I am waiting for you baby
ప్రతి జన్మ నీతోనే I am waiting for you baby
ఓ..ఓ..ఓ..ఓ... ఓ..ఓ..ఓ..ఓ...

చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావని
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని


నువ్వూ నేను ఏకం అయ్యే ప్రేమల్లోన ఓ..ఓ..
పొంగే ప్రళయం నిన్నూ నన్ను వంచించేనా
పువ్వే ముళ్ళై కాటేస్తోందా..ఆ..ఆ...
నీరే నిప్పై కాల్చేస్తోందా..ఆ..ఆ...
విధినైనా వెలేయనా నిను గెలిచేయనా
నీకోసం నిరీక్షణ ఓ..ఓ..
I am waiting for you baby
ప్రతి జన్మ నీతోనే I am waiting for you baby

ఓ..ఓ..ఓ..ఓ... ఓ..ఓ..ఓ..ఓ...

ప్రేమనే ఒకే మాటే ఆమెలో గతించిందా
వీడని భయం ఏదో గుండెనే తొలుస్తోందా
ఆ ఊహే తన మదిలో కలతలే రేపెనా
విధినైనా వెలేయనా నిను గెలిచేయనా
నీకోసం నిరీక్షణ ఓ..ఓ..
I am waiting for you baby

చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావని
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని
నిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ
నిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ
ప్రతి జన్మ నీతోనే I am waiting for you baby
ప్రతి జన్మ నీతోనే I am waiting for you baby




*********   **********   **********



చిత్రం: ఓయ్ (2009)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: వనమాలి
గానం: యువన్ శంకర్ రాజా

నన్నొదిలి నీడ వెళ్ళిపోతోందా..
కన్నోదిలి చూపు వెళ్ళిపోతోందా..
వేకువనే సందె వాలిపోతోందే..
చీకటిలో ఉదయముండి పోయిందే ..
నా యదనే తోలిచిన గురుతిక నిను తెస్తుందా..
నీ జతలో గడిపిన బతుకిక బలి అవుతుందా..
నువ్వుంటే నేనుంటా ప్రేమా ..
పోవద్దె పోవద్దె ప్రేమా...
నన్నొదిలి నీడ వెళ్ళిపోతోందా..
కన్నోదిలి చూపు వెళ్ళిపోతోందా..

ఇన్ని నాళ్ళు నీ వెంటే సాగుతున్న నా పాదం..
వెంట పడిన అడుగేదంటోందే..ఓ..ఓ...
నిన్నదాక నీ రూపం నింపుకున్న కనుపాపే..
నువ్వు లేక నను నిలదీస్తుందే ..
కోరుకున్న జీవితమే చేరువైన ఈ క్షణమే..
జాలిలేని విధిరాతే శాపమైనదే..
మరుజన్మే ఉన్నదంటే బ్రహ్మనైనా అడిగేదొకటే..
గనమంతా మమ్ము తన ఆటలిక సాగని చోటే..

నువ్వుంటే నేనుంటా ప్రేమా ..
పోవద్దె పోవద్దె ప్రేమా...
నువ్వుంటే నేనుంటా ప్రేమా ..
పోవద్దె పోవద్దె ప్రేమా...




*********   **********   **********



చిత్రం: ఓయ్ (2009)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: తోషి సబ్రీ, ప్రియ

అప్పుడెప్పుడో జరిగిన కథలో ఇప్పుడప్పుడే జరగని కలలో ఎప్పుడైన ఈ పని లేని ఆలొచన దండగే కదా
ఉన్నదొక్కటే నడిచే సమయం దానితోనే నువ్వు చేసెయ్ పయనం
మరు నిమిషం లేదంటు లైఫే గడిపెయి మెరుపులా
గల గల పారేటి నది ఎక్కనైనా ఆగేనా అది మనసుకు కట్టొద్దు గది
ఉన్న హద్దులన్ని దాటుకెళ్తే పండగే మరి
శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ
శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ

ఎన్నో మలుపులు కలిసిన జీవితమే చెలిమై వెలిగిపోవాలంటే
తెలుసుకోవే వేసే ప్రతి అడుగు పడనీ ఆలోచనకు గమ్యం ఏదో తెలిసీ సాగిపొవే
రేపటికై కలలు కంటు కలలన్నీ నిజం చేస్తూ ఆశే నీ శ్వాస ఐతే రాతే మారిపోదా
శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ
శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ

అంతు లేని ఓ అందం ఉంది అందుకోమనే లోకం మందీ
అందుకోసమే చెపుతున్నా రాజీ పడటం మానుకో
కనులకు నచ్చింది చూసెయ్ మనసుకు తోచింది చేసెయ్
అడిగితె ఈమాట చెప్పెయ్ నవ్వుతుండగానె మగ్గి పొతే స్వర్గమే అని
శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ
శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ



*********   **********   **********


చిత్రం: ఓయ్ (2009)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: కార్తిక్, సునిధి చౌహన్

సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పది రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూటగట్టుకొని నింగి మధ్యలొ పరిగెడతావా
వంద అడుగుల నీటి లోతులో నిట్టనిలువుగా నిలబడతావా
నా గుండెలో ఎన్నో ఆశలే ఇలా రేగితే నిన్నే చేరితే
క్షణం ఆగక నే కొరితే ఎల్లాగో ఎల్లాగో మరి

నా ప్రేమగ నిన్ను మార్చుకున్నాఓ హో ..... ఆ ఆశలు లోతు చూడలేనా
నీ ప్రేమగ నేను మారుతున్నాఓ.. ఆనందపు అంచు తాకలేనా

సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పది రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా

చిగురుల తోనే చీరను నేసి చేతికి అందించవా
కలువలతోనే అంచులు వేసి కానుక పంపించనా
అడిగినదేదో అదే ఇవ్వకుండా అంతకు మించి అందిచేది ప్రేమ
కనుపాపలపై రంగుల లోకం గీస్తావా


నా ప్రేమగ నిన్ను మార్చుకున్నాఓ హో ..... ఆ ఆశలు లోతు చూడలేనా
నీ ప్రేమగ నేను మారుతున్నాఓ.. ఆనందపు అంచు తాకలేనా

సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పది రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూటగట్టుకొని నింగి మధ్యలొ పరిగెడతావా
వంద అడుగుల నీటి లోతులో నిట్టనిలువుగా నిలబడతావా

మెలకువ లోన కలలను కన్నా నిజములు చేస్తావనీ
చిలిపిగ నేనే చినుకౌతున్నా నీ కల పండాలని
పిలువక ముందే ప్రియా అంటూ నిన్నే చేరుకునేదే మనసులోని ప్రేమ
ప్రాణములోనే అమృతమేదో నింపేయవా


నా ప్రేమగ నిన్ను మార్చుకున్నాఓ హో ..... ఆ ఆశలు లోతు చూడలేనా
నీ ప్రేమగ నేను మారుతున్నాఓ.. ఆనందపు అంచు తాకలేనా

సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పది రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూటగట్టుకొని నింగి మధ్యలొ పరిగెడతావా
వంద అడుగుల నీటి లోతులో నిట్టనిలువుగా నిలబడతావా

రాజు భాయ్ (2007)



చిత్రం: రాజు భాయ్ (2007)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హరీష్ రాఘవేంద్ర


ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు
తెలవారింది లేలెమ్మంటూ వెలుగేదో చూపావు
మరి నాకు ఓ మనసుందంటు తెలిసేలా చేసావు
మెరుపల్లే కలిసావు మైమరపే ఇచ్చావు నీలోనే కలిపావు

ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు

ఎటు చూసినా ఏం చేసినా ఏ దారిలో అడుగేసినా
నలువైపులా నాకెదురే ఉందా మైనా మైనా
ఏ మబ్బులో దూకాడినా ఏ హాయిలో తేలాడినా
నాకింతగా ఆనందం ఉందా నిన్నా మొన్న
ఎవ్వరికైనా ఏ యదకైనా ప్రేమలో పడితే ఇంతేనా
అవుననుకున్నా కాదనుకున్నా అనుకోనిదే జరిగిందిగా
నా తీరు తెన్ను మారుతోందిగా
ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు

కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణాం నువ్వైపోయావు

దేవతా దేవత దేవత దేవత
అది నా దేవత దేవతా దేవత దేవత దేవతా
చెలి చూపులో చిరుగాయమై మలిచూపులో మటుమాయమై
తొలిప్రేమ గా నే మొదలవుతున్నా కలలే కన్నా
నా శ్వాసలో తను లీనమై నా నిన్నలన్ని శూన్యమై
ఈ జీవితం చెలి కోసం అన్నా ఎవరేమన్నా
ఎక్కడి నేను ఎక్కడున్నాను చాలా దూరం నడిచాను
తియ్యని దిగులై పడిఉన్నాను
చెలి లేనిదే బతికేదెలా ఏ ఊపిరైనా ఉత్తి గాలిలే

ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు
తెలవారింది లేలెమ్మంటూ వెలుగేదో చూపావు
మరి నాకు ఓ మనసుందంటు తెలిసేలా చేసావు
మెరుపల్లే కలిసావు మైమరపే ఇచ్చావు నీలోనే కలిపావు

ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే (2007)



చిత్రం: ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే (2007)
సంగీతం: యావన్ శంకర్ రాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు


అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా ఉన్న ఏ పోలిక
అరుదైనా చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా

చరణం: 1
కన్యాదానంగా ఈ సంపద చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా
పొందాలనుకున్నా పొందే వీలుందా అందరికి అందనిదీ సుందరి నీడ
ఇందరి చేతులు పంచిన మమత పచ్చగా పెంచిన పూలతో
నిత్యం విరిసే నందనమవదా
అందానికే అందం అనిపించగా
దిగివచ్చినొ ఏమో దివి కానుక
అరుదైనా చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా

చరణం: 2
తన వయ్యారంతో ఈ చిన్నది లాగిందో ఎందరిని నిలబడనీకా
ఎన్నో ఒంపులతో పొంగే ఈ నది తనే మదిని ముంచిందో ఎవరికి ఎరుకా
తొలిపరిచయమొక తియ్యని కలగా
నిలిపిన హృదయమే సాక్షిగా
ప్రతి జ్ఞాపకం దీవించగా చెలి జీవితం వెలిగించగా...
అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా


********   *********   *********


చిత్రం: ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే (2007)
సంగీతం: యావన్ శంకర్ రాజా
సాహిత్యం: కులశేఖర్
గానం: ఉదిత్ నారాయణ్

Can you feel her?
Is your heart speaking to her?
Can you feel the love?
Yes...

ఏమైందీ ఈ వేళా ఎదలోఈసందడేలా
మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయువేళా
చెలి కులుకులు చూడ పల్లవి:
ఏమైందీ ఈ వేళా ఎదలోఈసందడేలా
మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయువేళా
చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేలా
ఏ శిల్పి చెక్కెనీ శిల్పం సరికొత్తగా ఉంది రూపం
కనురెప్ప వేయనీదు ఆ అందం
మనసులోన వింతమోహం
మరువలేని ఇంద్రజాలం వానలోన ఇంత దాహం

చరణం: 1
చినుకులలో వానవిల్లూ నేలకిలా జారెనే
తళుకుమనే ఆమె ముందూ వెలవెల వెలబోయెనే
తన సొగసే తీగలాగ నా మనసే లాగెనే
అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే
నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే
చిలిపి కనులు తాళమేసే చినుకు తడిపి చిందులేసే
మనసు మురిసి పాట పాడే తనువు మరిచి ఆటలాడే
ఏమైందీ ఈ వేళా ఎదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయు వేళా
చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేలా

చరణం: 2
ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింకా
ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసేనా
తన నడుము ఒంపులోనే నెలవంక పూచెనా
కనుల ఎదుటే కలగ నిలిచా
కలలు నిజమై జగము మరిచా
మొదటిసారి మెరుపు చూశా కడలిలాగే ఉరకలేశా


*********    **********    ********


చిత్రం: ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే (2007)
సంగీతం: యావన్ శంకర్ రాజా
సాహిత్యం: చంద్రబోస్
గానం: కార్తీక్, గాయత్రి అయ్యర్

నా మనసుకి ప్రాణం పోసీ..
నీ మనసును కానుక చేసీ
నిలిచావే ప్రేమను పంచీ  ఓ ఓ ఓ ఓ ఓ
ఒహొ హొ ఓ ఓ ఓ ఓ

నా మనసుకి ప్రాణం పోసి
నీ మనసుని కానుక చేసి
నిలిచావే ప్రేమను పంచి ఓ ఓ ఓ ఓ ఓ

నా వయసుకి వంతెన వేసి
నా వలపుల వాకిలి తీసి
మది తెర తెరిచి ముందే పరచి
ఉన్నావు లోకం మరిచి

నా మనసుకి ప్రాణం పోసీ
నీ మనసును కానుక చేసీ
నిలిచావే ప్రేమను పంచీ ఓ ఓ ఓ ఓ ఓ
ఒహొ హొ ఓ ఓ ఓ ఓ

నీ చూపుకి సూర్యుడు చలువాయే
నీ స్పర్శకి చంద్రుడు చెమటాయే
నీ చొరవకి నీ చెలిమికి మొదలాయే మాయే మాయే
నీ అడుగుకు ఆకులు పువులాయే
నీ కులుకికి కాకులు కవులాయే
నీ కలలకి నీ కథలకి కదలాడే హాయే హాయే
అందంగా నన్నే పొగిడి అటుపైన ఏదో అడిగి
నా మనసునె ఒక సరసులో అలజడులే సృష్టించావే

నా మనసుకి ప్రాణం పోసీ
నీ మనసును కానుక చేసీ
నిలిచావే ప్రేమను పంచీ ఓ ఓ ఓ ఓ ఓ
ఒహొ హొ ఓ ఓ ఓ ఓ

ఒక మాట ప్రేమగ పలకాలే
ఒక అడుగు జత పడి నడవాలే
ఆ గురుతులు నా గుండెలో
ప్రతి జన్మలో పదిలం పదిలం
ఒక సారి ఒడిలో ఒదగాలే
ఎద పైన నిదుర పోవాలే
తీయ తీయని నీ స్మృతులతో
బ్రతికేస్తా నిమిషం నిమిషం
నీ ఆశలు గమనించాలే
నీ ఆత్రుత గుర్తించాలే
ఎటు తేలక బదులీయక మౌనంగా చూస్తున్నాలే




***********   *********    *********


చిత్రం: ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే (2007)
సంగీతం: యావన్ శంకర్ రాజా
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిచరన్ , జెన్నీ మతాంగి, భార్గవి పిళ్ళై

ఓ బేబీ ఓ బేబీ
ఓ బేబీ ఓ బేబీ
యు ఆర్ సో సెక్సీ
ఓ బేబీ ఓ బేబీ
ఓ బేబీ ఓ బేబీ
యు ఆర్ గివ్ టచ్ మీ

కళ్లలో స్వర్గం నువ్వే
గుండెలో నరకం నువ్వే
మాటలో మధురం నువ్వే
గొంతులో గరళం నువ్వే
నా ప్రేమగాథ నువ్వే
ఓ చెలియ చెలియా
ప్రియమైన బాధ నువ్వే
నా ప్రేమజోల నువ్వే
ఓ సఖియ సఖియా
మదిలోన జ్వాల నువ్వే

చరణం: 1
పువ్వై పువ్వై పరిమళించినావే
ముళ్లై ముళ్లై మనసు కోసినావే
మెరుపై మెరుపై వెలుగు పంచినావే
పిడుగై పిడుగై కలలు కూల్చినావే
ప్రేమకు అర్థం అంటే
కన్నీట్లో పడవేనా
ప్రేమకు గమ్యం అంటే
సుడిగుండంలోకేనా
చరితల్లోనే ఉందమ్మా
చేరద్దంటూ ఈ ప్రేమ
వినక మతిపోయి
ప్రేమించానమ్మా
కనుక మూల్యాన్ని
చెల్లించానమ్మా

॥ప్రేమగాథ॥

చరణం: 2
నువ్వే నువ్వే ఆదరించినావే
ఆపై ఆపై చీదరించినావే
నిన్నే నిన్నే ఆశ్రయించగానే
నాలో నాలో ఆశ తుంచినావే
కోవెలలో కర్పూరం
నా తనువును కాల్చిందే
దేవత మెళ్లో హారం
ఉరి తాడై బిగిసిందే
ప్రేమపైనే నమ్మకం
కోల్పోయానే ఈ క్షణం
ప్రేమ పనిలేని చోటుకి వెళ్లాలి
నువ్వు కనలేని గూటికి చేరాలి




*********   *********   *********


చిత్రం: ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే (2007)
సంగీతం: యావన్ శంకర్ రాజా
సాహిత్యం: కందికొండ
గానం: అద్నాన్ సామి, అనుష్క మంచందా, శ్వేత

హాయ్! ఆర్ యూ సింగిల్?
అయామ్ యువర్   డ్రింక్!
హే లెట్స్ గో అవుట్ మాన్!
యువర్ ప్లేస్ ఆర్ మైన్?

చెలి చెమకు కనులు వలవేసెనులే తొలిగ తొలిగా
తడి చెరుకు పెదవి నను పిలిచెనులే జతగ జతగా
పసి నడుమే నయగారా..అడుగేసే నను చేరా

చెలి చెమకు కనులు వలవేసెనులే తొలిగ తొలిగా
తడి చెరుకు పెదవి నను పిలిచెనులే జతగ జతగా

సిమ్హమల్లే పొగరు ఉందీ..నన్ను గిచ్చీ చంపుతుందీ
చక్కిలి నొక్కా..చేరర పక్కా

హే వన్నె చిన్నె ఉన్న కన్నె..లాగమాకే పైకి నన్నే
సెగతో నా మతి పోయెనా..నీ పరువం మడతడి పోవులే
అంత మగసిరి నీలోనా..ఉన్నది కద మరి రావా
చప్పునొచ్చెయ్ .. వహ్చ్చి వాటెయ్ .. చురకలే వేసేయ్

అంతగ త్వరపడలేనులే..నా మదిలో చోటిక లేదులే
ఆడుకో కధకళి ఆటలే.. పాడుకో చలిగిలి పాటలే

చెమకు కనులు వలవేసెనులే తొలిగ తొలిగా
తడి చెరుకు పెదవి నను పిలిచెనులే జతగ జతగా

హే రూపు చూపీ కవ్విస్తారూ..గుండె పిండీ చంపుతారూ
మగువల జన్మా..అరె ఏవిటిర బ్రహ్మా
హో అవును అంటే కాదు అనిలే..కాదు అంటే అవును అనిలే
చల్లగ అల్లుకు పోవులే..మా చూపుల భాషలు వేరులే
ఆశ కలిగెను నీ పైనా..అల్ల్రి పెరిగెను నవ్వునా
దాచలేకా చెప్పలేకా ఏమిటో తడబాటూ

గుప్పెడు మనసున ఆశలూ..నెరవేరవు పూర్తిగ ఊహలూ
చెప్పకు పొడి పొడి మాటలే..అనుకున్నది అందితె హాయిలే

నాపేరు శివ (2010)




చిత్రం : నాపేరు శివ (2010)
సంగీతం : యువన్‌శంకర్‌రాజా
సాహిత్యం: సాహితి
గానం : హరిచరణ్

పల్లవి:
వెన్నెల చేతపట్టి తేనా పిండి బొమ్మ చేసి ఈనా
ఓహో ఆటలాడుదాం
పాటపాడుదాం చంద్రవంక పైన
నింగికి వెయ్యి నిచ్చెనలు
మేఘము చెయ్యి మాలికలు
వెల్‌కమ్ కడదాం చెలిమితో పై మెట్లు (2)

చరణం: 1
రేయి చూసి బెదురేలా వేదనెంతో పడనేలా
చీకటి లేక ఈ లోకాన జాబిలి అందం తెలిసేనా
కలలు నమ్ముకోనేలా కరుగు వేళ వగపేలా
కలలో పూచే పూవులు అన్నీ
చేతిలో మిలమిల మెరిసేనా
ఆ నింగికి మల్లే ఓ బంధం
మబ్బులు కమ్మిన ఎద మౌనం
కలిసొచ్చే రోజున వలపై రాదా
ప్రియమౌ అనుబంధం

చరణం: 2
కలత చెందు ఒక నిమిషం
గడిచిపోతే సంతోషం
నిలువున జ్వాలై మండేటపుడే
దీపపు వెలుగుకు ఉత్సాహం
కడలిలోన నది ఐక్యం
ఉనికి విడిన ఉప్పు గుణం
చినుకే ఐనా వానగ మారి
చివరికి కాదా మణిముత్యం
ఈ జీవితమన్నది ఓ వలయం
విశ్రాంతెరుగని ఓ స్వప్నం
అది మొదలే లేని ముగియని కథనీ
పొందకు దుఃఖాన్ని


*******  ******  ******


చిత్రం: నాపేరు శివ (2011)
సంగీతం: యువన్‌శంకర్‌రాజా
సాహిత్యం: సాహితి
గానం: కార్తీక్


పల్లవి:
మనసే గువ్వై ఎగిసేనమ్మో
చెలిమి మాటే వినపడగా
పసిపాపల్లే తడబడినానే నీ చూపెదనే తాకంగా
ఎద నాడే చేజారే నీ చెయ్యే నన్ను సోకగా
మంచల్లే కరిగేనే ఈ గాలే నాపై వీచగా
అయ్యయ్యో ప్రేమే పుట్టెనే
అది అణగని ఆశై పట్టెనే
నా ఎదలో ఏదో మెరుపై మెరిసి తలుపే తట్టేనే
కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతేచాలు
నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతేచాలు

చరణం: 1
చెంతకొచ్చి నువు నిలవడం నిన్ను కలిసి
నే వెళ్లడం అనుదినం జరిగెడి ఈ నాటకం
ఒక సగాన్ని చెప్పేయడం మరు సగాన్ని
దాపెట్టడం తెలిసెలే తెలిసెలే కారణం
కాలాలు పూచెలే వేగాలు వేచెలే
కలువా నీ కాటుక కన్నుల చూపులు
గారడి చేసేలే

చరణం: 2
నా కంటికి ఏమైనదో రేయంతా
ఎరుగదు కునుకును
ప్రియా నువు లేనిదే నీ లేను ఓవ్ ఓహో
నా మీద నీ సువాసన ఏనాడో వీచగ కోరెను
ఎలా నిను చేరక బతికేను ఓవ్ ఓహో
నా ఇరు కళ్లకే ఓ హరివిల్లువే
నీ విరిసే నవ్వులే ఎదలో పూల జల్లులే

రామ్ (2006)

చిత్రం: రామ్ (2006)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిచరన్, శ్వేతా మోహన్


నువ్వేనా ఎదలొ నువ్వేనా నువ్వేనా ఎదురుగ నువ్వేనా

అడుగడుగున నన్నే నడిపే రహదారిని నువ్వేనా
అణువనువున నన్నే తడిపే రస గోదారివి నువ్వేనా

నువ్వేన నువ్వేనా…..


నువ్వేనా ఎదలొ నువ్వేనా నువ్వేనా ఎదురుగా నువ్వేనా



నీలినింగి నువ్వేనా నేలరాజు నవ్వు నువ్వేనా

గాలి ఈల నువ్వేనా ఆ నువ్వు నేను కానా..
పూల మాల నువ్వేనా ఆ మేఘమాల నువ్వేనా
రాగామాల నువ్వేనా నీలోనా నేను లెనా
ప్రపంచము సమస్తమూ సామాప్తమవుతున్న
చారో సాఘం మరో జగం అనేది మనమేనా

నువ్వేనా నువ్వేనా……

నువ్వేనా ఎడాలో నువ్వేనా నువు నువ్వేనా ఎదురుగా నువ్వేనా

చెంప నురుపు నువ్వేనా నా పెదవి బెరుపు నువ్వేనా

ముద్దు ముడుపు నువ్వేనా అనలేను ఎందుకన్నా..
సొగసు నదులు నువ్వేనా చరసాల నిధులు నువ్వేనా
మధన తిధులు నువ్వేనా ఇకపాయినా ఆపుతున్న…
వసంతమో ఏ మంత్రమో షరత్తు ఏదయినా
యుగాంతము సుఖాంతమయి చరిత్ర మనదే…..

నువ్వేనా ఎడాలో నువ్వేనా నువ్వేనా ఎదురుగా నువ్వేనా…

పంజా (2011)




చిత్రం: పంజా (2011)
సంగీతం: యావన్ శంకర్ రాజా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సలోని రాయ్
నటీనటులు: పవన్ కళ్యాణ్ , సరా జానే డైస్, అంజలీ లావణ్య
దర్శకత్వం: విష్ణు వర్ధన్
నిర్మాతలు: నీలిమ తిరుమల శెట్టి, నాగేష్ ముంత, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
విడుదల తేది: 09.12.2011

వెయ్ రా చెయ్ వెయ్ రా ఎక్కడెక్కడో చెయ్ వెయ్ రా
ఎక్కడెక్కడో చెయ్ వెయ్ రా అక్కడేదో చేసేయ్ రా
కసి కౌగిలివై రార నను పిట పిట పిండేయ్ రా
ఉన్న ఊపిరి తీసెయ్ రా కొత్త ఊపిరి పోసేయ్ రా
తలగడలా నలిపేయ్ రా అలజడినే అనిచెయ్ రా
కల నేను నువ్వు కోరుకోని నిధిలా దొరికారా
వెయ్ రా చెయ్ వెయ్ రా ఎక్కడెక్కడో చెయ్ వెయ్ రా
ఎక్కడెక్కడో చెయ్ వెయ్ రా అక్కడేదో చేసేయ్ రా

చరణం: 1
హే సన్నజాజి నగరంలా తళుకుల తగరంలా
పంజరాన పావురంలా నిచేత చిక్కనివేళా
నా చూపేరో గంజావనం గమ్మత్తు పీల్చుకోరా
దాహలలో దావానలం ఉఫ్అంటు చల్లార్చు కోరా
రానా ఇటు రానా ఒళ్లు వేడై పిలిచారా
అరె నరములోని ఏక్ తార నీకై వేచెనురా
టచ్ మీ యు కెన్ టచ్ మీ
యు కెన్ ఫీల్ మీ యు కెన్ ఫీల్ మీ
యు కెన్ కిస్ మీ యు కెన్  టీజ్ మీ
ఏదేదో చేసేయ్ రా

చరణం: 2
ఏలో యలలేలో యలలేలో యలలేలో
యలలేలో యలలేలో ఏదేదో చేసేయ్ రా
హే అందంమైన ఆడ చీత ఆకలేసి దూకుతుంటా
వేటగాడి ఈటే తోనే ఇష్టంగా ఆటాడుకుంటా
ఎవ్వరికీ ఇవ్వనిది నీతోనే పంచుకుంటా
అందరికి అందనిది నీకోసమందించుకుంటా
ఏ పిచ్చుకా నువ్వెంత అని పిడుగై పడమంట
ఈ ఉడుకు దుడుకు ఊపు చూసి ఆహా అనుకుంటా
టచ్ మీ యు కెన్ టచ్ మీ
యు కెన్ ఫీల్ మీ యు కెన్ ఫీల్ మీ
యు కెన్ కిస్ మీ యు కెన్  టీజ్ మీ
ఏదేదో చేసేయ్ రా
వెయ్ రా చెయ్ వెయ్ రా టచ్ మీ యు కెన్ టచ్ మీ
ఎక్కడెక్కడో చెయ్ వెయ్ రా ఏదేదో చేసేయ్ రా
కౌగిలివై రార నను పిట పిట పిండేయ్ రా
ఉన్న ఊపిరి తీసెయ్ రా కొత్త ఊపిరి పోసేయ్ రా
తలగడలా నలిపేయ్ రా అలజడినే అనిచెయ్ రా
కల నేను నువ్వు కోరుకోని నిధిలా దొరికారా
టచ్ మీ యు కెన్ టచ్ మీ
యు కెన్ ఫీల్ మీ యు కెన్ ఫీల్ మీ
యు కెన్ కిస్ మీ యు కెన్  టీజ్ మీ
ఏదేదో చేసేయ్ రా


********   ********   *******


చిత్రం: పంజా (2011)
సంగీతం: యావన్ శంకర్ రాజా
సాహిత్యం: చంద్రబోస్
గానం: బెల్లి రాజ్ , ప్రియ

అనుకోనేలేదుగా కలకానేకాదుగా
కలిసొచ్చే కాలమల్లె నిలిచావులే
అనుకుంటే చాలుగా కనువిందే చేయగా
కదిలోచ్చే తీరమల్లె కలిశా నేనే
ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే
ఒకే చూపు ఒకే శ్వాస మరో జగమైతే మనమేలే
సుఖాలన్నీ మన చుట్టూ చేరే
శుభాలన్ని మన చుట్టమయ్యే నేడే

ఐదు ప్రాణాల సాక్షిగా నాలుగు కాలాల సాక్షిగా
మూడు పూటల్లో రెండు గుండెల్లో ఒక్కటే ప్రేమగా
కొంటె దూరాలు కొద్దిగా కంటి నేరాలు కొద్దిగా
కొన్ని కౌగిల్లు కొత్త ఎంగిళ్ళు ప్రేమగా మారగా
ఉల్లాసమే ఉద్యోగామాయే
సంతోషమే సంపాదనాయే
ఇదే బాటై ఎదే మాటై ఇలాగే లోకాలని ఎలాలిలే
ఒకే నువ్వు ఒకే నేను చేరోసగమైతే ప్రేమేలే
ఒకే నవ్వు ఒకే నడక మరోజగమైతే మనమేలే

అనుకోనేలేదుగా కలకానేకాదుగా
కలిసొచ్చే కాలమల్లె నిలిచావులే
అనుకుంటే చాలుగా కనువిందే చేయగా
కదిలోచ్చే తీరమల్లె కలిశా నేనే
ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే
ఒకే చూపు ఒకే శ్వాస మరో జగమైతే మనమేలే



********   ********   *******


చిత్రం: పంజా (2011)
సంగీతం: యావన్ శంకర్ రాజా
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిచరన్, శ్వేతా పండిట్

ఎలా ఎలా ఎలా ఎలా
నాలో కళా చూపేదేలా
ఎడారిలో గోదారిలా
నాలో అలా ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పెదేలా
నీ పరిచయం లోన పొందా జన్మ మరలా

ఎలా ఎలా ఎలా ఎలా
నాలో కళా చూపేదేలా
ఎడారిలో గోదారిలా
నాలో అలా ఆపేదెలా

నిన్నలోని నిమిషమైన గురుతు రాదే ఈక్షణం
నేటిలోని సంబరాన ఉరకలేసే జీవనం
ఈ స్నేహమే వరం ఈ భావమే నిజం
ఇది తెలుపభోతే భాష చాల్లెదెలా
నా భాషలోన తీయంధనం
నా భాటలోన పచ్చంధనం
పసి పాపలాగా నవ్వే గుణం
నీ వల్లే నీ వల్లే వెలిగింది నా నీడ
నీ నీడలో నే చేరాలని
నూరేళ్ళ పయనాలు చేయాలని
ఈ పరవశం లోన నిలిచా ప్రాణ శిలలా

ఎలా ఎలా ఎలా ఎలా
నాలో కళా చూపేదేలా
ఎడారిలో గోదారిలా
నాలో అలా ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పెదెలా
నీ పరిచయం లోన పొందా జన్మ మరలా

I wanna hold you
I wanna hold you in my heart
I wanna hold you
I wanna hold you in my heart



********   ********   *******


చిత్రం: పంజా (2011)
సంగీతం: యావన్ శంకర్ రాజా
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్వేతా పండిట్

క్షణం క్షణం ప్రతిక్షణం
కోరే ధనం పచ్చందనం
నిజం నిజం నిరంతరం
మీరే కదా ఆరోప్రాణం
మీ బాధలే నే పంచుకోనా
మీ హాయినే హోయ్ నేర్పించనా
మన నవ్వుతో నవ్వుతుంది
ఈ ప్రపంచం

వస్తున్నా నేస్తం...
అందిస్తాలే నవ జీవితం (2)


********   ********   *******


చిత్రం: పంజా (2011)
సంగీతం: యావన్ శంకర్ రాజా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: యావన్ శంకర్ రాజా

నీ చుర చుర చుర చూపులే పంజా
సల సల సల ఊపిరే పంజా
నరనరమున నెత్తురే పంజా
అణువణువున సత్తువే పంజా
అదుపెరుగని వేగమే పంజా
అదరని పెను ధైర్యమే పంజా
పెదవంచున మౌనమే పంజా
పదునగు ఆలోచనే పంజా

చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి తప్పదనే యుద్ధముగా వేకువ చూడద రేపటి కాంతి
ఆకాశం నీ పంజా
అది గెలవాలి అసలైనా గుండె దమ్ము గా
ఆవేశం నీ పంజా
అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా

ఆటుపోటు లేనే లేని సాగరమే ఉంటుందా ?
ఎత్తు పల్లం లేనే లేని రహదారు అంటూ ఉందా ?
ఆకురాలని కొమ్మరెమ్మలు చిగురయ్యే వీలుందా ?
ఏదేమైన తుది వరకు ఎదురీత సాగాలిగా...
అడుగడుగు అలజడిగా
నీ జీవితమే నీ సేత్రువు కాగా
బెదిరించే ఆపదనే ఎదిరించే గుణమే గా పంజా

ఆకాశం నీ పంజా
అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా
ఆవేశం నీ పంజా
అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యం గా

చుర చుర చుర చూపులే పంజా
సల సల సల ఊపిరే పంజా
నరనరమున నెత్తురు పంజా
అణువణువునా సత్తువే పంజా
అదుపెరుగని వేగమే పంజా
అదరని పెను ధైర్యమే పంజా
పెదవంచున మౌనమే పంజా పదునగు ఆలోచనే పంజా


********   ********   *******


చిత్రం: పంజా (2011)
సంగీతం: యావన్ శంకర్ రాజా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హేమచంద్ర, సత్యన్, పవన్ కళ్యాణ్, బ్రహ్మానందం

ఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరిగాడు
మన ఊరికి వచ్చాడు మనవాడైపోయాడు
మచ్చలేని చంద్రుడు మంచితో మండుతున్న సూర్యుడు
చెడుతో చెడుగుడాడుకుంటాడు
పాపారాయుడు పాపారాయుడు పాపారాయుడు
ఆ ఇట్టాంటోడుగాని ఉరికొక్కడుంటే
చీకు చింతలన్ని తీరిపోయినట్టే
చీకటన్న మాట పారిపోయినట్టే హా

అర్రెరే నువ్వు అపరా జే
అయ్యా ఏమి చేస్తున్నావురా
వస్తాన్నానయ్యా
come on I say
అయ్యా తమరిగురించే పడుతన్నాడయ్యా
నువ్వొక పని చెయ్ - అయ్యా
వాడిలాగా పెద్ద పెద్ద పదాలు వాడకుండా
చిన్న చిన్న పదాలు ఉపయోగించి
నీ నోటితో నువ్వే పాడు
నేనా అయ్యా పాడమ్మా నువ్వు కొట్టరా

ఎదవలకే ఎదవ పనికిమాలిన చవట
తాగుబోతు కుయ్యా తిరుగుబోతు జెఫ్ఫా
పోలీసు డ్రెస్సులో ఉన్న ఫోర్ ట్వెంటీ గాడని
రే అబ్బో అబ్బా
come here
ఏందయ్యా కొట్టావట్టా
తిడతన్నావేమిటిరా
అది కాదు ఎదో ఫ్లోలో
ఆగు అర్దం కాకపొయినా ఆడు తిట్టిందే బాగుందిరా
ఇది మరీ దారుణంగా వుంది
ఒక పని చెయ్యి మరీ అంత హైలో కాకుండా
మరీ అంత లోలో కాకుండా
మీడియమ్‌గా తిట్టేయ్‌రా
you can do better ప్లీజ్ రా
ఈసారి చూడయ్యా కొట్టు

అరేయ్ భూమికి జానెడు భూలోక వీరుడు
చూపులకి మామూలోడు
ఈ మొనగాడు చాలానే సరుకున్నోడు
మీసంలేని మగధీరుడు సూరుడు
సూపర్ మేన్ టైపే వీడు
జనాల ముందు సింపుల్ మేన్ అనిపిస్తాడు
తన బలమేంటో తనకే తెలియని
ఆల్ ఇన్ ఒన్ ఆంజనేయుడు
చేసిన మంచిని మర్చిపోయే గజని కజినే వీడు
తర్వాత తర్వాతేంటి కొట్టు

పాపారాయుడు పాపారాయుడు
పాపారాయుడు పాపారాయుడు హా

పై పై లుక్సు చూసి వేసుకున్న డ్రెస్సు చూసి
మనిషిని వెయ్యరాదు అంచనా
సమయం వచ్చిందంటే సరిగ్గా తెలుస్తుంది
ఎవ్వడిలో ఎంతుందో స్టామినా
సిక్సు ప్యాకు బాడీ లేకపోయినా
పాపారాయుడి సింగల్ హ్యాండ్ చితకేస్తాది
కట్ అవుట్ చూస్తే కామేడిగున్నా
ఈ పోటుగాడి కంటి చూపు నరికేస్తాది
ఇరగేస్తాది ఆ తర్వాత తర్వాతేంటి కొట్టు

అన్నా ఈ మూవ్‌మెంట్ చూడు అన్న
అన్నా మళ్ళీ ఇది
అరెరే మూవ్‌మెంట్ మర్చరా మూవ్‌మెంట్ మార్చు
అది అది అరె అరెర్రె అబ్బో

నిన్నా మొన్న నీ పైన వెక్కిరించారు ఈ ఊరి జనాలు
అరే ఇప్పుడైతే పిలిచి నీకు పిల్లనిస్తారు
నిన్న చూస్తే దగా కోరు ఇయ్యాలేమో అయ్యాగారు
ఛీ పో అని తిట్టినోళ్ళే సలాం సలాం అని అన్నారు

చుట్టు పక్క పదూళ్ళల్లో ఏ సమస్య వచ్చినా
ఇకపై నువ్వే దిక్కు దేవుడో
వాళ్ళూ వీళ్ళోచ్చి కాళ్ళా వెళ్ళా పడినా
అసలే నొదలకు ఎప్పుడు
అండాదండై మా తోడు నువ్వే లేకుంటే
మమ్మల్ని కాపాడేదెవ్వడూ

అయ్యా మీరు దేవుడయ్యా మరి కొట్టు
అబ్బ అబ్బ మెల్లగా కొట్టరా ఇంకా మెల్లగా కొంచెం మెల్లగా
ఆ ఇంకా మెల్లగా కొడితే తుస్స్ అంతే ఏం వినపడదు అన్న
కొట్టరా కొట్టు కొట్టు కొట్టు

బ్రతికున్నప్పుడే బంగారు విగ్రహం సెంటర్‌లో నిలబెట్టేద్దాం
శ్రీ పాపా గారి గొప్పతనం టాం టాం వేద్దాం
హోలీ దీపావళి లాగే తన పుట్టినరోజు పండగలా జరిపించేద్దాం
దానికేమో పాపావళి అని పేరెడదాం
చందాలెన్నో పోగు చేసి పాలరాతి గుడి కట్టిద్దాం
పాపారాయుడి వీరగాధను స్కూల్లో పాఠం చేద్దాం
తర్వాత తర్వాతేంటి కొట్టు