Showing posts with label Anu Emmanuel. Show all posts
Showing posts with label Anu Emmanuel. Show all posts

అజ్ఞాతవాసి (2018)




చిత్రం: అజ్ఞాతవాసి (2018)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
సాహిత్యం: శ్రీమణి
గానం: అనిరుద్ రవిచంద్రన్
నటీనటులు: పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్ , అనుఇమాన్యుయేల్
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: రాధాకృష్ణ (చినబాబు)
విడుదల తేది: 2018

బయటకొచ్చి చూస్తే టైమేమో 3 O'Clock
ఇంటికెళ్లే 12 B రూటు మొత్తం రోడ్ బ్లాక్
బయటకొచ్చి చూస్తే టైమేమో 3 O'Clock
ఇంటికెళ్లే 12 B రూటు మొత్తం రోడ్ బ్లాక్

ఓయ్
నీ చేతికున్న బేంగిల్సే తాలమేసె నా శాండిల్సే
వాక్ వే లో చూస్తే పువ్వులా రెక్కలు ఫుల్ గా కప్పేసే
కార్నర్ లో కాఫీ షాప్ వేడి వేడిగా విజిలేసే
బస్ కిటికీ దగ్గర కాలేజ్ స్టూడెంట్స్ ఫోన్లో మోగే
FM లో ఎవరో పాడితే ఒళ్ళంత ఎందుకో ఊగెనే
ఆపిల్ పండులా సూరీడె
యారోప్లైన్ లా నాగుండే
తేలిందె గాలిలో మబ్బులా
జారిందే నేలపై నీడలా
ముల్లై గుచ్చెనే షడెన్ గా చల్లగాలే విలన్ల

బయటకొచ్చి చూస్తే టైమేమో 3 O'Clock
ఇంటికెళ్లే 12 B రూటు మొత్తం రోడ్ బ్లాక్
బయటకొచ్చి చూస్తే టైమేమో 3 O'Clock
ఇంటికెళ్లే 12 B రూటు మొత్తం రోడ్ బ్లాక్

నీ పక్కనున్న వేళ కార్ హార్న్ కూడా
క్లాసికల్ మ్యూజిగ్గా
ఈ మండుటెండ కూడా ఏసి జల్లుతోంది
నీ నవ్వులోని మేజిక్కా
టాక్సీ హైర్ చేసి నువ్వు బేరమాడుతుంటే
క్యూట్ గుందే బేసిగ్గా
బ్రేక్స్ వేసినప్పుడల్లా నీ బుగ్గనన్నుతాకి
సారి చెప్పె నాజూగ్గా
నువ్వున్న కిటికీ ఏవైపొ వెతికి
వాట్స్ ఆప్ చేస్తావా
మబ్బుల్ని కదిపి మొహమాట పెట్టి
చంద్రుణ్ణి తెస్తాగా

బయటకొచ్చి చూస్తే టైమేమో 3 O'Clock
ఇంటికెళ్లే 12 B రూటు మొత్తం రోడ్ బ్లాక్
బయటకొచ్చి చూస్తే టైమేమో 3 O'Clock
ఇంటికెళ్లే 12 B రూటు మొత్తం రోడ్ బ్లాక్


*******  *******  ******


చిత్రం: అజ్ఞాతవాసి (2018)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అనిరుద్ రవిచంద్రన్

గాలివాలుగా ఓ గులాభి వాలి
గాయమైనదీ నా గుండెకు తగిలి
తపించిపోనా ప్రతీక్షణం ఇలాగ నీకోసం
తరించిపోనా చెలీ ఇలా దొరికితె నీ స్నేహం
ఏం చేశావే మబ్బులను పువ్వుల్లో తడిపీ
తేనెజడిలొ ముంచేసావే గాలులకు గందం రాసి
పైకి విసురుతావే
ఏం చేస్తావె మెరుపు చురకత్తుల్నీ దూసి
పడుచు యెదలో దించేశావే
తలపునే తునకలు చేసీ తపన పెంచుతావే

నడిచే హరివిల్లా నను నువ్విల్ల గురు పెడుతుంటే యెల
అణువణువున విలవిలమనదా ప్రాణం నిలువెల్లా
నిలు నిలు నిలు నిలబడు పిల్ల గాలిపటంలా ఎగరకె అల్లా
సుకుమారి సొగసునలా ఒంటరిగా వదలాలా చూస్తేనే

గాలివాలుగా ఓ గులాభి వాలి
గాయమైనదీ నా గుండెకు తగిలి
తపించిపోనా ప్రతీక్షణం ఇలాగ నీకోసం
తరించిపోనా చెలీ ఇలా దొరికితె నీ స్నేహం...హుమ్...

కొరా కొరా కోపమేలా చురా చురా చూపులేలా
మనోహరి మాడిపోనా అంత ఉడికిస్తే
అరె అనీ జాలిపడవేం పాపం కదే ప్రేయసీ
సరే అని చల్లబడవే మోసీ పిసాచీ
ఉహూ అలా తిప్పుకుంటూ ఊలిపోకే ఊర్వసీ
అహొ అలా నవ్వుతావే మీసం మెలేసీ
ఎన్నాళ్ళింకా ఊరికే ఊహల్లో ఉంటాం పెంకి పిల్లా
చాల్లే ఇంకా మానుకో ముందూ వెనక చూసుకోని పంతం
ఆలొచిద్దాం చక్కగా కూర్చొని చర్చిద్దాం
చాలు యుద్ధం రాజీకొద్దాం వద్దిగా కలిసొస్తే
నీకేమిటంట కష్టం

నడిచే హరివిల్లా ననువ్ నువ్విల్ల గురు పెడుతుంటే యెల అణువణువున విలవిలమనద ప్రాణం నిలువెల్లా
నిలు నిలు నిలు నిలబడు పిల్ల గాలిపటంలా ఎగరకె అల్లా సుకుమారీ సొగసునలా ఒంటరిగా వదలాలా
ఏం చెయ్యాలోలే

గాలివాలుగా ఓ గులాభి వాలి
గాయమైనదీ నా గుండెకు తగిలి
తపించిపోనా ప్రతీక్షణం ఇలాగ నీకోసం
తరించిపోనా చెలీ ఇలా దొరికితె నీ స్నేహం హూఁ...

మజ్ను (2016)






కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే
తనివి తీరా చూద్దామంటే పారిపోతావే

రాతిరంతా కలలోకొచ్చి తీపి కబురులు చెబుతావే
తెల్లవారే ఎదురైవస్తే జారుకుంటావే
ఊరించకే ఊరించకే ఆ కొంటె చూపుతోటి నన్ను చంపకే
కవ్వించకే కవ్వించకే నీ నవ్వు తోటి మాయ చెయ్యకులే చెలియా

కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే
తనివి తీరా చూద్దామంటే పారిపోతావే

ఆ దొంగ చూపు హాజరేదో నాకు వేస్తావులే
ఎదురే ఉంటే చూడవులే
నే వెళిపోతుంటే నువ్వు తొంగి చూస్తావులే

నీ గుండెలోన ఎన్ని వేల ప్రేమ లేఖలో
నీ కళ్ళలోకి ఒక్కసారి చూస్తేనే తెలిసిందిలే

కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే
తనివి తీరా చూద్దామంటే పారిపోతావే

పుస్తకాలలో నువ్వు రాసుకున్న పేరేమిటో ఎగిరే పేజీ చెప్పిందే
నీ కదిలే పెదవే చిరు సాక్షమిచ్చిందిలే

నను నువ్వు దాటి వెళ్ళిపోవు తొందరెందుకో
నీ నీడ నిన్ను వీడి నాకు ఎదురొచ్చి చెప్పిందిలే

సిగ్గు నీకే చాలా అందం ... ముద్దు ముద్దుగ ఉంటావే
ఎంత ముద్దుగ ఉంటే మాత్రం అంత సిగ్గేంటే

ఎంత దాచాలనుకున్నావో అంత బయటే పడతావే
ఎంత మౌనం ఒలికేసావో అంత తెలిసావే
తెలిసిందిలే తెలిసిందిలే నీ మూగ కళ్ళలోని భావమేమిటో
దొరికిందిలే దొరికిందిలే నీ దొంగ నవ్వుకర్థమేమిటో ఇపుడే

చిత్రం : మజ్ను (2016)
సంగీతం : గోపీ సుందర్
సాహిత్యం : శ్రీమణి
గానం : సుచిత్ సురేశన్

~~~~*~~~~~~*~~~~~~*~~~~~*~~~~~~~~~*~~~~~~~~~*~~~~~~



కల ఇదో నిజమిదో తెలియదే మరి ఎలా
జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా
అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా
పదమని నీ వైపు తరుముతోంది నన్నిలా
నామాట వినదు మనసు ఏంటిలా
కుదురుగ కాసేపు ఉండనీదులే ఇలా
పదే పదే ఇదే నీ వల్లనే

జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా
అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా
జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా
అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా

జోరే పెంచావె గుండె లయలలోన నువ్వే ఇలా
దారే మార్చావే ఏదో మాయ చేసేలా
వాలు కనులలోనా దాచేసినావా ఆ నింగిలోన లేదు నీలం
హాయి లోయలోనా తోసేసినావా ఇదేలే నీ ఇంద్రజాలం

జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా
అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా

నాపై వర్ణాల పూల జల్లులేవో కురిసేనులే
నేనే నీ నవ్వు తలచుకున్న వేళలో
చల్లగాలిలాగ నీ వూసులేవో మెల్లిగానె నన్ను గిల్లిపోయే
నీలి మబ్బులాగ నా ఆశలేవో పైపైన నింగిలోన తేలే

జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా
అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా
పదమని నీ వైపు తరుముతోంది నన్నిలా
నామాట వినదు మనసు ఏంటిలా
కుదురుగ కాసేపు ఉండనీదులే ఇలా
పదే పదే ఇదే నీ వల్లనే

జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా
అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా

చిత్రం : మజ్ను (2016)
సంగీతం : గోపీ సుందర్
సాహిత్యం : రాంబాబు గోశాల
గానం : నరేష్ అయ్యర్

~~~~*~~~~~~*~~~~~~*~~~~~*~~~~~~~~~*~~~~~~~~~*~~~~~~

ఓయ్.. మేఘంలా
తేలిందే నా చిన్ని మనసే
హే.. మిలమిలలా
మిణుగురులా మారింది వరసే
కనులకి ఈ రోజిలా అందంగా
లోకం కనిపించెనే నీవల్ల

చాలా బావుందే నీ వెంటుంటే
ఏదో అవుతుందే నీతోవుంటే

ఓయ్.. మేఘంలా
తేలిందే నా చిన్ని మనసే
హే...మిలమిలలా
మిణుగురులా మారింది వరసే

కళ్ళగంత కట్టినా
కళ్ళముందు వాలెనే
వింతలన్నీ నువ్వు పక్కనుంటే
పిల్లగాలి కూడా పాడుతోంది కొత్త పాటే
ఓ...ఓ...

ఎంత దూరమెళ్లినా
జంటకట్టి వచ్చేనే
కాలి గుర్తులన్నీ మనవెంటే
మండుటెండ వెండి వెన్నెలై పూసే

పెదవులు తెలియని రాగం తీసే
ఓ...ఓ...
తలుపులు తియ్యని కవితలు రాసే
ఒక ఆశే... విరబూసే
నా  మనసు  పలికేది నీ ఊసే

ఓయ్.. మేఘంలా
తేలిందే నా చిన్ని మనసే
హే...మిలమిలలా
మిణుగురులా మారింది వరసే

చెయ్యిపెట్టి ఆపనా
తిట్టికొట్టి ఆపనా
పరుగుపెట్టే ఈ నిమిషాన్ని
ఈ క్షణమే శాశ్వతమే అయిపోని
ఓ...ఓ...
వెళ్లనివ్వనంతగా హత్తుకున్నాయిగా
ఈ తీపి జ్ఞాపకాలన్నీ
ఊపిరున్నదాకా చిన్ని గుండె దాచిపెట్టుకోనీ

ఎంతని ఆపను నా ప్రాణాన్నీ హో
ఏమని దాచను నా హృదయాన్ని
నీతోనే చెప్పేయ్ నీ
ఈ బయట పడలేని మౌనాన్ని

ఓయ్...నీవల్లే
గువ్వల్లే ఎగిరింది మనసే
హే... ఈరోజే...
నా కలలో వుందెవరో తెలిసే
పుట్టిన ఇన్నాళ్లకా వచ్చేది
వేడుక ఇన్నేళ్లకా తెచ్చేది

చాలా బావుందే... నీ వెంటుంటే
ఏదో అవుతుందే.. నీతోవుంటే

చిత్రం : మజ్ను (2016)
సంగీతం : గోపీ సుందర్
సాహిత్యం : శ్రీమణి
గానం : చిన్మయి
~~~~*~~~~~~*~~~~~~*~~~~~*~~~~~~~~~*~~~~~~~~~*~~~~~~