Showing posts with label పెళ్ళి చేసి చూడు (1952). Show all posts
Showing posts with label పెళ్ళి చేసి చూడు (1952). Show all posts

పెళ్ళి చేసి చూడు (1952)

చిత్రం : పెళ్ళి చేసి చూడు (1952)

సంగీతం : ఘంటసాల

గీతరచయిత : ఊటుకూరి సత్యనారాయణ

నేపధ్య గానం : ఎ.పి.కోమల, కె. రాణి, ఉడుతా సరోజిని





పల్లవి :

బ్రహ్మయ్యా... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

బ్రహ్మయ్యా... ఓ బ్రహ్మయ్యా

బ్రహ్మయ్యా... ఓ బ్రహ్మయ్యా


లోకమునే మురిపించే చక్కని ఓ చుక్కను....

లోకమునే మురిపించే చక్కని ఓ చుక్కను

నాకు పెళ్ళి చేయనిచో ఇంక బ్రతుకలేనయ్యా

బ్రహ్మయ్యా... ఓ బ్రహ్మయ్యా





చరణం 1 :



ఏరికోరి తెస్తినిరా... నీకు తగిన పిల్లరా

మారుమాటపల్కదురా... మురిపమెల్ల తీర్చుకోరా

మారుమాటపల్కదురా... మురిపమెల్ల తీర్చుకోరా


అహహా.. ఆ.. ఆ.. ఆ.. ఆ

ఎంత గొప్ప దేవుడవో... నాదు కోర్క తీర్చినావు

ఇంక నేను ధన్యుడను... నీదు మేలు మరువనయ్యా


బ్రహ్మయ్యా... ఓ బ్రహ్మయ్యా




చరణం 2 :



ఏయ్... ఇదిగో...

చూడు.. నిన్నే.. నేను.. నీ భర్తని...

అరే పల్కదే....


మారుపల్కదేమయ్యా... మూగపిల్లనిచ్చావా... ఆ... ఆ..

మారుపల్కదేమయ్యా... మూగపిల్లనిచ్చావా...

నోరు ఇచ్చి కావవయ్యా.. భక్తులతో పరిహాసమా...


మేలుకోరి ముత్తినిరా... గళము విప్పమనకురా

నోరు గలా భార్యలతో నరులు వేగలేరురా

నోరు గలా భార్యలతో నరులు వేగలేరురా


నీకెందుకు నేవేగెద.. నోరు విప్పి పోవయ్యా

అయితే ఇక నీ ఖర్మం... అనుభవించు తిమ్మయ్యా

తిమ్మయ్యా.. ఓ తిమ్మయ్యా



చరణం 3 :



ఒహొ.. హో.. ఓ.. ఓ.. ఓ.. ఓ...

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ...

ప్రేయసీ.. ఓ ప్రియా.. ఆ.. ఆ... నా ప్రియా

ప్రేయసీ.. ఓ ప్రియా.. ఆ.. ఆ... నా ప్రియా


ప్రియము సోపు నోరుమూసుకొని కొనితేవోయ్...

నోరుమూసుకొని కొనితేవోయ్...

మాయలు సేకో.. సెంటూ పౌడర్.. ఇంపుగ పోయే డ్యూక్ కార్

గోల్డు వాచి... ముఖమల్ స్లిప్పర్.. ముచ్చటగొలిపే బొచ్చుకుక్కా

అవ్వా.. హా... ఆ...

గోల్డు వాచి... ముఖమల్ స్లిప్పర్.. ముచ్చటగొలిపే బొచ్చుకుక్కా

కోరినవన్నీ నోరు మూసుకొని కొనితేవోయ్...

లేకపోతే విడాకులోయ్... ఆ 


ఔరా ఇంత గయ్యాళిని మెడకు గట్టినావయ్యా

ఆ.. ఆ.. ఆ.. ఆ..

ఔరా ఇంత గయ్యాళిని మెడకు గట్టినావయ్యా

పోరు తాళలేనయ్యా... నోరు మరలమూయవయ్యా

బ్రహ్మయ్యా... ఓ బ్రహ్మయ్యా



చరణం 4 :



నా నోటిని మరలమూయ ఎవరికేన తరమౌనా?

నా నోటిని మరలమూయ ఎవరికేన తరమౌనా?

ఏది రమ్మను చూద్దాం.. బ్రహ్మ ఎట్టి తెలిసేనో 


ఔనమ్మా.. ఔ.. ఔనమ్మా

ఔనమ్మా.. ఔ.. ఔనమ్మా

నా చేతుల కాని పని స్త్రీల నోరు మూయడమే...

ఆ... ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ

నా చేతుల కాని పని స్త్రీల నోరు మూయడమే...

తల్లీ నే వాగలేను.. పోయి వచ్చు శెలవిమ్మ


ఇంతేనా నీ తెలివి ఏమి రాత రాశావు...

ఇంతేనా నీ తెలివి ఏమి రాత రాశావు...

బ్రహ్మయ్యా... ఓ బ్రహ్మయ్యా







చిత్రం : పెళ్ళి చేసి చూడు (1952)

సంగీతం : ఘంటసాల

గీతరచయిత : పింగళి

నేపధ్య గానం : ఘంటసాల



పల్లవి:


రాధను రా .. నీ రాధను రా

రాధను రా .. నీ రాధను రా

రాసలీలల ఊసే తెలియని కసుగాయలకా రాధను రా

రాసలీలల ఊసే తెలియని కసుగాయలకా రాధను రా

వలపున కుమిలే ప్రణయ జీవులకు వల్లమాలిన బాధను రా

రాధను రా .. నీ రాధను రా


చరణం 1:


ఎంతో తెలిసిన వేదాంతులకే అంతు దొరకని గాధను రా

ఎంతో తెలిసిన వేదాంతులకే అంతు దొరకని గాధను రా

మధురానగరి మర్మమెరిగిన మాధవ నీకెటు బోధను రా

రాధను రా .. నీ రాధను రా

రాధను రా .. నీ దానను రా






చిత్రం : పెళ్ళి చేసి చూడు (1952)

సంగీతం : ఘంటసాల

గీతరచయిత : పింగళి

నేపధ్య గానం : ఘంటసాల



పల్లవి:


ఓ... భావి భారత భాగ్య విధాతలార

యువతీ యువకులార..ఆ..ఆ..

స్వానుభవమున చాటు నా సందేశమిదే... వరెవహ్

పెళ్ళి  చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాలంగడపాలోయ్ 

ఎల్లరు సుఖము చూడాలోయ్ మీరెల్లరు హాయిగ ఉండాలోయ్



చరణం :1


కట్నాల మోజులో మన జీవితాలనే బలి చేసి

కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా

పట్నాల పల్లెల దేశ దేశాల మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖపడగా

తాదీనా తకదీనా ...తంగిటిత తకిటతకిటతోం...

ఇంటా బయట జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్.. తరంపం.. 

పరంపం ఇంటా బయట జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్

కంటి పాపలై దంపతులెపుడు చంటి పాపలను సాకాలోయ్

కంటి పాపలై దంపతులెపుడు చంటి పాపలను సాకాలోయ్


పెళ్ళి  చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాలంగడపాలోయ్ 

ఎల్లరు సుఖము చూడాలోయ్ మీరెల్లరు హాయిగ ఉండాలోయ్ 


చరణం :2


నవ భావముల నవ రాగముల ఆ..ఆ..నవ జీవనమే నడపాలోయ్

నవ భావముల నవ రాగముల నవ జీవనమే నడపాలోయ్

భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్

భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్


పెళ్ళి  చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాలంగడపాలోయ్ 

ఎల్లరు సుఖము చూడాలోయ్ మీరెల్లరు హాయిగ ఉండాలోయ్ 

హాయిగా... ఉండాలోయ్






చిత్రం : పెళ్ళి చేసి చూడు (1952)

సంగీతం : ఘంటసాల

గీతరచయిత : పింగళి

నేపధ్య గానం : ఘంటసాల



పల్లవి:


ఓ .. మనసులోని మనసా ఆ .. ఆ .. ఆ .. ఏమిటే నీ రభస ..

ఏమిటే నీ రభస .. నా మనసులోని మనసా

ఏమిటే నీ రభస .. నా మనసులోని మనసా


చరణం 1:


ఇల్లలికిన పండుగటే ఒళ్ళు తెలిసి మెలగరటే

ఇల్లలికిన పండుగటే ఒళ్ళు తెలిసి మెలగరటే

పాలు కాచి చేజేతులా ఒళకపోసుకుందురటే

పాలు కాచి చేజేతులా ఒళకపోసుకుందురటే


ఏమిటే నీ రభస .. నా మనసులోని మనసా .. ఏమిటే నీ రభస...


చరణం 2:


నిజము తెలియనంత వరకే ఆటపాటలెన్నైనా

నిజము తెలియనంత వరకే ఆటపాటలెన్నైనా

అసలు రూపు పసిగడితే అధోగతి తప్పునటే

అసలు రూపు పసిగడితే అధోగతి తప్పునటే


ఏమిటే నీ రభస .. నా మనసులోని మనసా .. ఏమిటే నీ రభస..


చరణం 3:


హద్దుపద్దు లేకుండా పెద్దలతో ఆటలటే

హద్దుపద్దు లేకుండా పెద్దలతో ఆటలటే

జాణతనము చాలింపుము జాణవులే .. నెరజాణవులే..

జాణతనము చాలింపుము జాణవులే .. నెరజాణవులే..

ఏమిటే నీ రభస .. నా మనసులోని మనసా .. ఏమిటే నీ రభస..






చిత్రం : పెళ్ళి చేసి చూడు (1952)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత : పింగళి

నేపధ్య గానం : పి. లీల


పల్లవి:


ఏడుకొండలవాడ వెంకటారమణా..

సద్దు సేయక నీవు నిదుర పోవయ్యా


చరణం 1:


పాల సంద్రపుటలలు పట్టె మంచముగా

పున్నమీ వెన్నెలలు పూలపానుపుగా

పాల సంద్రపుటలలు పట్టె మంచముగా

పున్నమీ వెన్నెలలు పూలపానుపుగా

కనులనొలికే వలపు పన్నీరు జల్లుగా

అన్ని అమరించె నీ అలివేలుమంగా

అన్ని అమరించె నీ అలివేలుమంగా


ఏడుకొండలవాడ వెంకటారమణా

సద్దు సేయక నీవు నిదుర పోవయ్యా


చరణం 2:


నాపాలి దైవమని నమ్ముకున్నానయ్య

నా భాగ్యదేవతా నను మరువకయ్య

బీబినాంచారమ్మ పొంచి ఉన్నాదయ్య

బీబినాంచారమ్మ పొంచి ఉన్నాదయ్య

చాటు చేసుకు ఎటులో చెంత చేరెదనయ్య

చాటు చేసుకు ఎటులో చెంత చేరెదనయ్య


ఏడుకొండలవాడ వెంకటారమణా

సద్దు సాయకా దొంగా నిదుర పోవయ్యా


చిత్రం : పెళ్ళి చేసి చూడు (1952)

సంగీతం : ఘంటసాల

గీతరచయిత :  పింగళి

నేపధ్య గానం :  ఘంటసాల,  పి. లీల


పల్లవి:


    ఎవరో ..ఎవరో.. ఈ నవ నాటక సూత్రదారులు ఎవరో .. ఎవరో

    ఎవరా .. ఎవరా .. ఎవరా ..ఎవరా

    మంచి వారు మా మామగారిని వంచన చేసీంది ఎవరో వారే


చరణం 1:


    మనవులుగా అమాయక చూపుల మనసును లాగినది ఎవరో

    మనవులుగా అమాయక చూపుల మనసును లాగినది ఎవరో

    నిను విడజాలా నీదాన నేనని నను నిలవేసినదెవరో ..ఎవరో వారే


చరణం 2:


    ప్రియ సఖి పై గల ప్రేమను చాటి భయమును విడచినదెవరో

    ప్రియ సఖి పై గల ప్రేమను చాటి భయమును విడచినదెవరో

    న్యాయవాది అన్యాయవాదియై మాయలు నేర్చినదెవరో .. ఎవరో వారే


చరణం 3:


    హృదయములో విశాల భావం ఉదయము జేర్చినదెవరో

    హృదయములో విశాల భావం ఉదయము జేర్చినదెవరో

    చదువుల సారము సంసారమునకే పదిలము చేసినదెవరో.. ఎవరో.. వారే..

    వారే..వీరు..

    వీరే వారు .. వారే వీరు