Showing posts with label Namita. Show all posts
Showing posts with label Namita. Show all posts

ఒక రాజు ఒక రాణి (2003)

చిత్రం: ఒక రాజు ఒక రాణి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: త్రివిక్రమ్ శ్రీనివాస్
గానం: చక్రి


స్వరాల వీణ ఈ వేళలోన
నీకేమైయిందే ఆకాశమా
స్వరాల వీణ ఈ వేళలోన
నీకేమైయిందే ఆకాశమా
ఎండలో ఇలా పూల వానలా
మెరుపు కూడ మల్లె తీగలా
నేలపై ఇలా నా అడుగు నిలవదా
లోకమంత కొత్త చోటులా
నువ్వు తప్ప కళ్ళ ముందు లేరు ఎవరు నమ్మవా

స్వరాల వీణ ఈ వేళలోన
నీకేమైయిందే ఆకాశమా

రేయి చీర కప్పుకున్న చందమామని
నిన్ను చూసి ఒక్కసారి పలకరించి వెళ్ళని
తారలన్ని అల్లుకున్న మేఘమాలని
వాలు కళ్ళ సాగరాన కాటుకల్లె మారని
వాలే పొద్దులా జారే నీ జడ
నడుము పై నాట్యమే ఆడితే
విరిసే పువ్వులా కురిసే మంచులా
నువ్వలా చల్లగా నవ్వితే
నేను చూడలేను చూశాక ఆగలేను
ఎన్నాళ్ళు నిన్ను ఒదిలి ఉండను

స్వరాల వీణ ఈ వేళలోన
నీకేమైయిందే ఆకాశమా

మూసి ఉన్న రెప్పలల్లో కలల వనములా
నిదుర రాని వేళలోన కలవరింతలా ఇలా
ఊపిరంత ఊహలతో నిండిపోయినా
గుండె లోన నిన్ను ఇంక దాచి ఉంచడం ఎలా
నేనే నేనుగా లేనే లేనుగా
నాకే వింతగా ఉందిగా
నీలా ఎవ్వరు నన్నే ఎప్పుడు
కమ్ముకోలేదులే ఇంతగా
రేయి నిదుర రాదు
పగలంత కునుకు లేదు
ఆసలేమయిందో నాకే తెలియదు

స్వరాల వీణ ఈ వేళలోన
నీకేమైయిందే ఆకాశమా
ఎండలో ఇలా పూల వానలా
మెరుపు కూడ మల్లె తీగలా
నేలపై ఇలా నా అడుగు నిలవదా
లోకమంత కొత్త చోటులా
నువ్వు తప్ప కళ్ళ ముందు లేరు ఎవరు నమ్మవా

స్వరాల వీణ ఈ వేళలోన
నీకేమైయిందే ఆకాశమా



*******  ********  ********


చిత్రం: ఒక రాజు ఒక రాణి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: త్రివిక్రమ్ శ్రీనివాస్
గానం: చక్రి

నా ప్రాణం నా ప్రణయం నా లోకం అన్ని నువ్వె
నా మౌనం నా గానం నా గుణ్డెల సవ్వడి నువ్వె
నువ్వే ఆశా నువ్వే స్వాస
నువ్వు లేని ఈ నిమిషం యుగమైన అవదుగ

నాలో ఉన్న నిన్ను మరిచె పొలేని నేను
తీరం లేని అలలా నిజమే కాలేని కలలా
నాలొ లేని నేను కలవాలంటునె నిన్ను
నీరే లేని నదిలా కన్నీరై ఉన్న మదిలా
వర్షం కొరి యండే చూసి మండే భూమిలా
ప్రేమే కోరి విరహం చూసి మిగిలా నేనిలా
వేరే దారి చూపె వేళ నిన్నే చేరుకొనా

నీ కౌగిళ్ళలోనే కాలం మాయమవని
నీ వేడి ఉపిరిలొ ఇక నన్నేఎ కరిగిపోని
నా ప్రతి అడుగులొను వెంటాడే ఙ్నాపకాలు
నువ్వే లేని నాడు చనిపొయే వరమే చాలు
వేళ్ళే దారి ముళ్ళే చల్లి నన్నే ఆపితె
నీళ్ళే మారి నిప్పై పొంగి నన్నే ముంచితే
గాలే జాలి చూపే వేళ పువ్వై చేరుకొనా


*******  ********  ********


చిత్రం: ఒక రాజు ఒక రాణి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: త్రివిక్రమ్ శ్రీనివాస్
గానం: కౌసల్య

లలలల లలాలలల లలలల లలాలలల
లాలలల లలలాల లాలలల
చికిట చికిట తం చికి చికి చికితం
చికిట చికిట తం చికినక చికితం
చికిట చికిట తం చికి చికి చికితం
థకిట థకిట తం చికినక చికితం

కలలు కంటాను నేనీ వేళ
పగలు రాత్రితో ఒకటయ్యేల
కలిపి చూడాలి నింగీ నేల
ఇంద్రధనసు ఉయ్యాలయ్యెల
చలి పుట్టే ఎండల్లోన చెమటొచ్చె వానేదైనా
కనిపెడదాం కాసేపైన హో హో
Nine o' clock కూసే కోడి
Round the clock ఆడి పాడి
సరదాగా గడిపెద్దామ హూ

కలలు కంటాను నేనీ వేళ
పగలు రాత్రితో ఒకటయ్యేల

ప్రియురాలై ఈ నేల ఆకశం చూసే వేళ
కదిలొచ్చే ప్రతి చినుకు ఓ ముత్యం అయిపోలేదా
ప్రతి పూవ్వు చిరునవ్వై చెప్పాలి హెల్లొ
ఈ గాలి జొ లాలి పాడాలి ఇలలో
కన్నీళ్ళే లేని ప్రపంచం తాగే నీళ్ళున్న సముద్రం
తెచ్చెఏదాం ఇప్పటికైనా హూ
కన్నీళ్ళే లేని ప్రపంచం తాగే నీళ్ళున్న సముద్రం
తెచ్చెద్దాం ఎప్పటికైనా హొ హొ
కన్నీళ్ళే లేని ప్రపంచం తాగే నీళ్ళున్న సముద్రం
తెచ్చెద్దాం ఎప్పటికైనా హొ హొ

కలలు కంటాను నేనీ వేళ
పగలు రాత్రితో ఒకటయ్యేల

చెయ్యేత్తి పిలిచానా చుక్కల్లొ చంద్రుడు కూడా
పరిగెత్తి దిగివచ్చి నా జళ్ళొ పూవైపోడా
కొమ్మలనే కుర్చీలా వాడె కొయిల
వాసంతం విరిసింది కూ అనవే ఎలా
వదిలేద్దాం కోపం ద్వేషం నవ్వేగా నా సందేశం
పుట్టడమే విజయం కాదా హూ
వదిలేద్దాం కోపం ద్వేషం నవ్వేగా నా సందేశం
పుట్టడమే విజయం కాదా హూ

కలలు కంటాను నేనీ వేళ
పగలు రాత్రితో ఒకటయ్యేల
కలిపి చూడాలి నింగీ నేల
ఇంద్రధనసు ఉయ్యాలయ్యెల
చలి పుట్టే ఎండల్లోన చెమటొచ్చె వానేదైనా
కనిపెడదాం కాసేపైన హో హో
Nine o' clock కూసే కోడి
Round the clock ఆడి పాడి
సరదాగా గడిపెద్దామ హూ

బిల్లా (2009)

చిత్రం: బిల్లా (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రీటా


ఎల్లోరా శిల్పాన్ని వస్తున్నా నీకేసి
నాలో అందాలన్నీ అందిస్తా పోగేసి
ఎల్లొరా శిల్పాన్ని వస్తున్నా నీకేసి
నాలో అందాలన్నీ అందిస్తా పోగేసి

నన్నె పడగొట్టెల నీ పొగరె నచ్చింది
మూడె చెడగొట్టెల నీ పొగరె గిచింది
కనుకే మెరుపై తల వెస నీ మీద
దూకె దుడుకై ఒళ్ళొ పడిపొరాద
నా నా నష హూ
నీకె ఓటేసుకున్న నిన్నె పట్టేసుకొన,
నీ పై ఒట్టేసుకున్న నాతొ కట్టేసుకున్న

లొకాలే ఏలుతొంది నువ్వైన
నీ తొ నె పందెమెసుకొన,
వెటాదె లడి కూన నీ కాన
సిమ్హన్నె లొంగదీసుకొన
లెఫ్ట్ రైట్ నీ పై నా సొగసె గురిపెడత
రైటో రాంగో నీకు నా వయసె బలిపెడతా
మనసే అతికె మగవాడివి నువ్వేగా
కసితో రగిలే నవ నాగిని నేనేగా
నా నా నష హూ
నీకె ఓటేసుకున్న నిన్నే పట్టేసుకోన
నీపై ఒట్టేసుకున్న నాతొ కట్టేసుకున్న

నీకొసం వేచి ఉంది దిల్ మెరా
ఆనందం అంతు చూసుకోరా
ఆరటం దాటుతోంది పొలిమేర
ఆహ్వానం మన్నించి దొరికిపోరా
అందం చందం మొత్తం అత్తర్లా కురిపిస్తా
ఖుల్లం కుల్ల స్వర్గం అంచుల్లో మురిపిస్తా
చలిలొ ఝలకొ చెలరేగాలే చాల
సెగలు పొగలు చల్లరాలీ వేళ
నా నా నష హూ




**********   **********   **********



చిత్రం: బిల్లా (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మనో , రంజిత్, కన్నన్

హరి లో రంగ హరి హరి లో రంగ హరి
చేయ్యెస్తే చోరి చోరి కిరి కిరి
చోరి లో రంగసరి దేశంలో లేడు మరి
దొంగల్లో దాదా దొంగ ఈడే మరి

అబ్బా రంగా నువు చాకు రా
నిజంగా నువు కొక్ రా
సామి రంగా  నువు సూపర్ ఎహె
హరి లో రంగ హరి హరి లో రంగ హరి
లుక్కెస్తే లెక్కసరీ కిరి కిరి

దాగుడు మూత దండాకోరు పారహుషారు
ఈడొచ్చాడంటే ఊరు వాడా మాయ బజారు
చిటికెల్లోన శాల్తిలన్నీ గల్లంతవ్వాలి
జన జంతర్ మంతర్ మంతరమేస్తె కొంపల్ కొల్లేరే
మన పూలన్ దేవి పుట్టిన రోజే నువ్వు పుట్టావే
శోబారాజుకి ఎనకటి జన్మలో ఫ్రె౦డ్ అయి ఉంటవ్ లే
నీకు కాఫీ ఇస్తే కప్పు సాసరు లేపే టైపే లే
పేరింటేనే జేబులన్ని దడుసుకుంటాయె
ఓరా చుపు లోనే తాళాలన్ని తెరుసుకుంటాయే
ఇట్టా టచ్చింగ్ ఇస్తే బీరువాలే బావురుమంటాయే

అబ్బా రంగా నువు కింగ్ రా
పచ్చి దోంగా ఉపీంగ్ రా
సామి రంగా నువు బంపర్ ఏహె

యదు వంశ సుధాంబరి చంధ్రా స్వామి రారా
రత్నాకర సమగంభీరా స్వామి రారా
శత కొటి మన్మాధాకారా స్వామి రారా
పర రాజ శత్రుసంహారా స్వామి రారా
నారి జన మానస చోరా చోరా చోరా చోరా..

లేడీస్ అంతా నీ చుట్టూరా చేక్కర్లేస్తారే
ఓరి గోపి కృష్ణ గొడలు దూకీ రా రా అంటారే
నువ్వు చేయ్యెసుకుంటె పరుసు మనసు నీదేన౦టారే
చిన్న పెద్ద పేద గోప్ప తెడాలె లేవే
నోటన్నాకా వందా వేయ్యి అన్ని ఒకటేలే
సేతికంది దేదో సప్పున నొక్కి వెలిపొతుండాలే

అబ్బా రంగా నువు కత్తి రా
టింగు రంగా నువు కంచు రా
సామి రంగా నువు ముదురు ఏహె

ఐటమ్స్ అన్ని నీకడకొచ్చి గగ్గోలంటే
నీ కాడుంటాం ఎత్తకపొమ్మని బతిమాలాస్తుంటే
అంతో ఇంతో సాయం చెస్తే తప్పే లేదసలే
మనిసన్నాకా పుట్టేసీనాక ఏదోటి సేయల్లే
మనకొచ్చిందేదో నచ్చిందేదో సేస్తా ఉండాల్లే
అరె మంచో సెడ్డో మనకంటూ ఓ గుర్తింపుండాలే

అబ్బా రంగా నువు కేక రా
సుబ్బా రంగా నువు నొక్కరా
ముందెనకా నువు సుడకఏహె
హరి లో రంగ హరి హరి లో రంగ హరి
లుక్కేస్తే లెక్కసరి కిరి కిరి

పిన్నీసయినా పిస్తోలు అయినా
జాకెట్ అయిన చాక్లెట్ అయినా
చీకుల తట్టా చేపలబుట్టా
సారా పాకెట్ డైమండ్ లాకెట్
అట్లా కాడా రుబ్బు రోలు ఆంజీనేయాసామి తాడు
దేన్ని వదలడురోయ్



**********   **********   **********


చిత్రం: బిల్లా (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హేమచంద్ర, మాళవిక

మసాలా మిర్చి పిల్ల మజా చేద్దాం వత్తావా
నసాలా మంటేత్తేలా మీఠా ముద్దే ఇస్తావా
సీ పోరా రావద్దన్నా రయ్యా రయ్యా వత్తావా
పో పో రా పొమ్మన్నాగా వచ్చిందారే పోతావా

బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ
పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మాళీ
ఐతే యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ
గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ
యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ
గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ

చరణం: 1
కొరివి పిల్లడా నీక్కొంచెం దూకుడెక్కువా
సరదా సాలిత్తావా సరసం కానిత్తావా
ఉరికి రాకలా నాకేమో చొరవ తక్కువా
వరసే మారుత్తావా మురిపెం తీరుత్తావా
ఛూమంతరమేస్తాలే బ్రహ్మచారి
ముచ్చట్లే తీరాలంటే నీముందరుంది కోరే దారి

బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ
పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మాళీ
యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ
గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ
యాడుందే తాళి ఐ వొన వొన మే క్యూ ఆలీ
గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ

చరణం: 2
బూరె బుగ్గని బుజిగాడా బుజ్జగించవా
శిలకా సనువిత్తావా సురుకే సవి సూత్తావా
ముద్దబంతిని ముద్దారా ముట్టడించవా
తళుకే తలిగిత్తావా కులుకే ఒలికిత్తావా
అతిగా ఉడుకెత్తావే సామి రంగా
ఐతే సుతి మెత్తంగా గిల్లుకోవా కోవా రావా

బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ
పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మాళీ
యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ
గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ
యాడుందే తాళి ఐ వొన వొన మే క్యూ ఆలీ
గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ




**********   **********   **********



చిత్రం: బిల్లా (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రంజిత్, నవీన్ మాధవ్

నేనుండే స్టైలే ఇలా ఎదిగానే నియంతలా
ఎవరైనా సలాం అనేలా
అడుగడుగు ఒకేలా నడవనుగా ఏవేళా
ఎవరు నన్నూహించేలా
నే వలా విసిరితే విలా విలా
నేనలా కదిలితే హల్లా గుల్లా
మై నేమ్ ఈజ్ బిల్లా బి ఫర్ బిల్లా
ఒకటే సైన్యంలా వచ్చా నిల్లా
మై నేమ్ ఈజ్  బిల్లా బిజిలి బిల్లా
మెరుపే మనిషైతే ఉంటాదిల్లా

ఎనీమి ఎవ్వడైనా యముడిని నేనేనంటా
డేంజర్ ఖతం చూపిస్తా
భయమే నాకెదురైనా దాన్ని బంతాడెస్తా
పాతాళంలో పాతేస్తా
నా కదం పిడుగుకు చలి జ్వరం
ఆయుధం నాకది ఆరోప్రాణం
మై నేమ్ ఈజ్ బిల్లా థండర్ బిల్లా
నాకే ఎదురొచ్చి నిలిచేదెల్లా
మై నేమ్ ఈజ్  బిల్లా టైగర్ బిల్లా
పంజా గురిపెడితే తప్పేదెల్లా

మనిషిని నమ్మను నేను మనసును వాడను నేను
నీడై నన్నే చూస్తు౦టా
మూడో కన్నే కన్ను ముప్పే రానివ్వను
మరణంపైనే గెలుస్తా
నా గతం నిన్నటితోనే ఖతం
ఈ క్షణం నే పోరాడే రణం
మై నేమ్ ఈజ్  బిల్లా డెడ్లీ బిల్లా
దూకే లావాని ఆపేదెలా
మై నేమ్ ఈజ్  బిల్లా ఓన్లీ బిల్లా
ఎపుడేం చేస్తానో చెప్పేదెలా

సింహా (2010)




చిత్రం: సింహా (2010)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గాత్రం: హరిహరన్, కౌసల్య


బంగారు కొండ మరుమల్లె దండ
మనసైన అండ నువ్వేరా
బంగారు కొండ మరుమల్లె దండ
మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీరూపు నిండా
నా బ్రతుకు పండ రావేరా
శ్వాశించలేను నిను చూడకుండా
జీవించలేను నిను చేరకుండా
ఏకాంత సరసాలు సాయంత్ర సరదాలు
ప్రేమంతరాగాలు పలికించు ప్రియుడ
గోరంత విరహాలు కొండంత మురిపాలు
జల్లంత జలసాలు జరిపించు ఘనుడ
నీ అడుగు జాడ అది నాకు మేడ

బంగారు కొండ మరుమల్లె దండ
మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీరూపు నిండా
నా బ్రతుకు పండ రావేరా

ఈ మహారాజు చిరునవ్వునే
నా మణిహార మనుకొందున
ఈ వనరాణి కొనచూపునే
నా ధన దాన్యమనిపించనా
నువ్వే నువ్వే నరసింహ స్తోత్రం
ఒడిలో గుడిలో వల్లించనా
నువ్వై నావే గాయత్రి మంత్రం
పగలు రేయి జపియించనా
నీ కరుణ కిరణాలు హృదయాన ఉదయాలు
నీవెంటే నామనుగడ నీగుండె నా తలగడ

బంగారు కొండ మరుమల్లె దండ
మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీరూపు నిండా
నా బ్రతుకు పండ రావేరా

నీ మీసాల గిలిగింతకే
ఆ మోసాలు మొదలాయేనా
నీ మునివేళ్ళ తగిలింతకే
ఆ మునిమాపు కదలాయేనా
నీకే నీకే సోగసాభిషేకం
నిముషం నిముషం చేయించనా
నీతో తనువు మనసు మమేకం
మనదోలోకం అనిపించనా
సంసార కావ్యాలు సంస్కార కార్యాలు
కలగలుపు గుణవంతుడ
కలియుగపు భగవంతుడా

బంగారు కొండ మరుమల్లె దండ
మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీరూపు నిండా
నా బ్రతుకు పండ రావేరా


*********   **********   ********


చిత్రం: సింహ (2010)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గాత్రం: కునాల్ గంజ్ వాల, టీనా

జానకీ జానకీ జానకీ ఎక్కడికి పోతావే జానకీ
జానకీ జానకీ జానకీ ఎక్కడికి పోతావే జానకీ
దేనికీ దేనికీ దేనికీ వెనకేనేకే పడతావు దేనికీ?
ఎహ్ వచ్చెయ్ వచ్చెయ్ గట్టు చాటుకి
చమటెక్కిస్తా తెల్ల చీరకి
సర్లే అంటె ఒక్క పుటకి కావలంట మాటి మాటికీ
అరేయ్ అందాలే దాచోద్దె హైసలకడి దాటికి

జానకీ... జానకీ...
జానకీ జానకీ జానకీ ఎక్కడికి పోతావే జానకీ
దేనికీ దేనికీ దేనికీ వెనకేనేకే పడతావు దేనికీ?

సోయగాల సంపదే హైలైటు
ఎలా పెంచినావొ చెప్పవె సెక్రేటు
కౌగిలింత ఒక్కటె టాబ్లెట్
నిన్ను పట్టుకున్న ఫీవరే హంఫట్టూ
వరెవా నువ్వు ఇంత తేరగా ఇస్తుంటే
తిమ్మిరే తిర్చేసుకొనా
ఇస్ లా మన్నిస్త నిస్ గా లాగిస్తే
వయసునే వడ్డించుకోనా
ఎ బరిలొ నాదేలే గెలుపు
హే త్వరగ ముసేయి తలుపు
చలో నా రాణి నువ్వే లే మల్లెపుల్ల కొటకీ

జానకీ...జానకీ...
జానకీ జానకీ జానకీ ఎక్కడికి పోతావే జానకీ
దేనికీ దేనికీ దేనికీ వెనకేనేకే పడతావు దేనికీ?

లిప్పు తోటి లిప్పుకే లింకెట్టు
ఇక మొగుతాయ్ యవ్వనాల ట్రంపెట్టు
మాయదారి సిగ్గులే కప్పెట్టు
జరా ఒంటిలోన ఎక్కడో తీపెట్టు
జోరుగా నే పైట జారగా ఈ పుటా
జాతరే నా గుండెలోనా
ఎహ్ ఆగలేనంటుంటే ఆపుగా చూస్తుంటే
ఆకలే తీర్చేసిపోనా
హేయ్ అదిరే నీ ఒంటి మెరుపు
ఆ పరువాలే పట్టు పరుపు
మరి లేటైతే బాగోదే లేటు నైటు ఆటకి

జానకీ...జానకీ...
come on Baby...come on...
జానకీ జానకీ జానకీ ఎక్కడికి పోతావే జానకీ
దేనికీ దేనికీ దేనికీ వెనకేనేకే పడతావు దేనికీ??
దేనికీ??