Showing posts with label ఆత్మీయుడు (1977). Show all posts
Showing posts with label ఆత్మీయుడు (1977). Show all posts

ఆత్మీయుడు (1977)

చిత్రం :  ఆత్మీయుడు (1977)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత :
నేపధ్య గానం : బాలు, సుశీల 

పల్లవి : 

అమ్మో... ఏం సోకు ఎంత సోకు... ఇన్నాళ్ళు లేని సోకు
ఏమయ్యిందీ రోజు నీకు... కన్నట్ట గీటమాకు.. నన్నిట్ట లాగమాకు
కన్నట్ట గీటమాకు.. నన్నిట్ట లాగమాకు

ఏం టెక్కు ఎంత టెక్కు... ఇన్నాళ్ళు లేని నిక్కు
ఏవయ్యిందీ రోజు నీకు... నన్నింక ఆప మాకు.. ఎన్నాళ్ళీ బాధ నాకు
నన్నింక ఆప మాకు.. ఎన్నాళ్ళీ బాధ నాకు

అమ్మో... అహ్హో...

చరణం 1 :

నడుమూగి పోయింది నీ నడకకు... జడ పోటి వచ్చింది ఆ నడుముకు
నడుమూగి పోయింది నీ నడకకు... జడ పోటి వచ్చింది ఆ నడుముకు

జడతోటి నీ చూపు ఎగబాకనీకు... జడతోటి నీ చూపు ఎగబాకనీకు
ఎద కంది పోతుంది ఆ ఉడుకుకు

ఏం టెక్కు ఎంత టెక్కు... ఇన్నాళ్ళు లేని నిక్కు
ఏవయ్యిందీ రోజు నీకు... నన్నింక ఆప మాకు.. ఎన్నాళ్ళీ బాధ నాకు
కన్నట్ట గీటమాకు.. నన్నిట్ట లాగమాకు 

చరణం 2 :

కాటుక కళ్ళకు కల రానివ్వకు... కలలోకొచ్చి కవ్వించకు
కాటుక కళ్ళకు కల రానివ్వకు... కలలోకొచ్చి కవ్వించకు

కంటిని రెప్పను విడదీయకు... కంటిని రెప్పను విడదీయకు
ఒంటరి చేసి వేధించకు...

ఏం సోకు ఎంత సోకు... ఇన్నాళ్ళు లేని సోకు
ఏమయ్యిందీ రోజు నీకు... కన్నట్ట గీటమాకు.. నన్నిట్ట లాగమాకు
నన్నింక ఆప మాకు.. ఎన్నాళ్ళీ బాధ నాకు
అమ్మో... అహ్హా...

చరణం 3 :

నేనోడిపోతాను నీ సొగసుకు... నా గెలుపు ఇస్తాను నీ పొగరుకు
నేనోడిపోతాను నీ సొగసుకు... నా గెలుపు ఇస్తాను నీ పొగరుకు

వయసుంది ఇద్దర్ని కలిపేందుకు... వయసుంది ఇద్దర్ని కలిపేందుకు
మనసుంది కలకాలం నిలిపేందుకు... 

ఏం టెక్కు ఎంత టెక్కు... ఇన్నాళ్ళు లేని నిక్కు
ఏవయ్యిందీ రోజు నీకు...

కన్నట్ట గీటమాకు.. నన్నిట్ట లాగమాకు
నన్నింక ఆప మాకు.. ఎన్నాళ్ళీ బాధ నాకు

కన్నట్ట గీటమాకు.. నన్నిట్ట లాగమాకు
నన్నింక ఆప మాకు.. ఎన్నాళ్ళీ బాధ నాకు

చిత్రం :  ఆత్మీయుడు (1977)
సంగీతం :  జె.వి. రాఘవులు
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల 

పల్లవి : 

అహ... బిందె మీద బిందె పెట్టి...
పైటకొంగు చుట్టపెట్టి...

అహ... బిందె మీద బిందె పెట్టి...
పైటకొంగు చుట్టపెట్టి...

ఎడమచెయ్యి ఎత్తి పట్టిందో.. కిలాడి పిల్లా
పడుచుదనం పంటకొచ్చిందో... కిలాడి పిల్లా
పడుచుదనం పంటకొచ్చిందో

బిందె మీద బిందె పెట్టి... చ్..చ్..చ్..
పైటకొంగు చుట్టపెట్టి... చ్..చ్..చ్..

అహ... బిందె మీద బిందె పెట్టి...
పైటకొంగు చుట్టపెట్టి...

కుడి చెయ్యి ఊపుకొచ్చిందో... కిలాడి గున్నా
గూబ కాస్త గుయ్యిమంటుందో... కిలాడి గున్నా
గూబ కాస్త గుయ్యిమంటుందో... 

చరణం 1 :

ఉల్లిపొర గల్ల చీర ఒంటికంటుకున్నది
ఒంటి మెరుపు జిగేల్ మని కంటి కొచ్చి తగిలింది

వెంటపడే కుర్రాడికి వేడెక్కిపోయింది...
వెంటపడే కుర్రాడికి వేడెక్కిపోయింది... అహా

ఆ వేడి చూపు తగిలి వేడి కాస్త ఆరింది...
కోక తడి కాస్త ఆరింది... ఓయబ్బో...

బిందె మీద బిందె పెట్టి... ఆ.. ఆ.. ఆ..
పైటకొంగు చుట్టపెట్టి... ఆ.. ఆ.. ఆ.. 

అహ... బిందె మీద బిందె పెట్టి...
పైటకొంగు చుట్టపెట్టి...

కుడి చెయ్యి ఊపుకొచ్చిందో... కిలాడి గున్నా
గూబ కాస్త గుయ్యిమంటుందో... కిలాడి గున్నా
గూబ కాస్త గుయ్యిమంటుందో... 

చరణం 2 :

ఇంటి దాకా వస్తావు ఈనాడు...
రేపు ఎందాకా ఉంటావు నా తోడు
ఇంటి దాకా వస్తావు ఈనాడు...
రేపు ఎందాకా ఉంటావు నా తోడు

ఇంటి లోకి రానిచ్చి చూడు... ఆ
నన్ను ఇంటి లోకి రానిచ్చి చూడు
నిన్నో ఇంటిదాన్ని చేయకుంటే అమ్మతోడు...

బిందె మీద బిందె పెట్టి... ఆ.. ఆ.. ఆ..
పైటకొంగు చుట్టపెట్టి... ఆహ.. ఊహూ.. ఏహేఓహో.. 

అహ... బిందె మీద బిందె పెట్టి...
పైటకొంగు చుట్టపెట్టి...

ఎడమచెయ్యి ఎత్తి పట్టిందో.. కిలాడి పిల్లా
పడుచుదనం పంటకొచ్చిందో... కిలాడి పిల్లా
పడుచుదనం పంటకొచ్చిందో

చరణం 3 :

గుమ్మడమ్మ గుమ్మడు.. గోపాలా కృష్ణుడు
కొంటె కృష్ణుడే కానీ కోకలెత్తుకెళ్ళడు

ఎత్తుకెళ్ళినా పాపం ఏం చేసుకుంటాడు
ఎత్తుకెళ్ళినా పాపం ఏం చేసుకుంటాడు
అత్తా నీ పిల్లదని... నీ అమ్మకే ఇస్తాడు
నీ అమ్మకే ఇస్తాడు... అయ్యో...

బిందె మీద బిందె పెట్టి... ఆహ.. ఆహ.. ఆహ..
పైటకొంగు చుట్టపెట్టి... ఆహ.. ఆహ.. ఆహ.. 

అహ... బిందె మీద బిందె పెట్టి...
పైటకొంగు చుట్టపెట్టి...

కుడి చెయ్యి ఊపుకొచ్చిందో... కిలాడి గున్నా
గూబకాస్త గుయ్యిమంటుందో... 

కిలాడి పిల్లా... పడుచుదనం పంటకొచ్చిందో
కిలాడి గున్నా... గూబకాస్త గుయ్యిమంటుందో...  

చిత్రం: ఆత్మీయుడు (1977) 
సంగీతం: జె.వి. రాఘవులు 
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 
నేపధ్య గానం: బాలు, సుశీల 

పల్లవి: 

అల్లో మల్లో..ఓ.. ఆకాశంలో..ఓ.. చల్లని వెన్నెల్లో.. 
ఆశలెన్నో.. ఊసులెన్నో అల్లరి కన్నుల్లో.. నీ అల్లరి కన్నుల్లో.. 

అల్లో మల్లో..ఓ.. ఆకాశంలో..ఓ.. చల్లని వెన్నెల్లో.. 
ఆకలెంతో.. దూకుడెంతో.. పోకిరి కన్నుల్లో.. నీ పోకిరి కన్నుల్లో.. 

చరణం 1: 

ఎర్రని సిగ్గు ఎగబాకింది నున్నని బుగ్గల్లో.. 
చిలిపి కోరికా చెడుగుడాడినది జిలిబిలి చూపుల్లో..ఓ.. 
ఎర్రని సిగ్గు ఎగబాకింది నున్నని బుగ్గల్లో.. 
చిలిపి కోరికా చెడుగుడాడినది జిలిబిలి చూపుల్లో.. 

దోబూచాడే నవ్వుల్లో.. తొందర తెలిపే పెదవుల్లో.. 
దోబూచాడే నవ్వుల్లో.. తొందర తెలిపే పెదవుల్లో.. 
తొణుకుతున్నది తొలకరి వలపు.. ముద్దుల ముడుపుల్లో..ఓ..ఓ.. 

అల్లోమల్లో..ఓ.. ఆకాశంలో..ఓ.. చల్లని వెన్నెల్లో.. 
ఆశలెన్నో.. ఊసులెన్నో అల్లరి కన్నుల్లో.. నీ అల్లరి కన్నుల్లో.. 

చరణం 2: 

తొలి హాయి చూడాలి.. తొలి రేయిలో.. 
తొలి ముద్ర వెయ్యాలి.. తొలి ముద్దులో.. 
తొలి హాయి చూడాలి.. తొలి రేయిలో.. 
తొలి ముద్ర వెయ్యాలి.. తొలి ముద్దులో.. 

మరుపొద్దు పొడవాలి.. నీ మోములో..ఓ.. 
మరుపొద్దు పొడవాలి.. నీ మోములో..ఓ.. 
మైమరచిపోవాలి.. ఆ గోములో.. ఆ గోములో.. 

అల్లోమల్లో..ఓ.. ఆకాశంలో..ఓ.. చల్లని వెన్నెల్లో.. 
ఆకలెంతో.. దూకుడెంతో.. పోకిరి కన్నుల్లో.. నీ పోకిరి కన్నుల్లో.. 

చరణం 3: 

విరబుయ్యాలి మోజుల జాజులు.. వెచ్చని కౌగిళ్ళో... 
ఆ వెచ్చదనాలు వెంటపడాలి.. ఒంటరి వేళల్లో..ఓ.. 
విరబుయ్యాలి మోజుల జాజులు.. వెచ్చని కౌగిళ్ళో... 
ఆ వెచ్చదనాలు వెంటపడాలి.. ఒంటరి వేళల్లో.. 

నలిగిన పువ్వుల గుసగుసలో.. నాలుగు కన్నుల అలసటలో.. 
నలిగిన పువ్వుల గుసగుసలో.. నాలుగు కన్నుల అలసటలో.. 
ఇద్దరి ఒద్దిగ కనిపించాలి...పొద్దుటి వెలుగుల్లో...ఓ.. 

అల్లో మల్లో..ఓ.. ఆకాశంలో..ఓ.. చల్లని వెన్నెల్లో.. 
ఆశలెన్నో.. ఊసులెన్నో.. అల్లరి కన్నుల్లో.. 
ఆకలెంతో.. దూకుడెంతో.. పోకిరి కన్నుల్లో.. 
నీ అల్లరి కన్నుల్లో.. 
నీ పోకిరి కన్నుల్లో..