Showing posts with label Anushka. Show all posts
Showing posts with label Anushka. Show all posts

బలాదూర్ (2008)

చిత్రం: బలాదూర్ (2008)
సంగీతం: కె. యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాహుల్ నంబియర్

నువ్వు కొంచం తేడా నీ నవ్వు కొంచం తేడా
ఆ మాట కొంచెం తేడా ఆ చూపు కొంచెం తేడా
అందుకనే నువు నచ్చావోయ్ అందుకనే నువు నచ్చావోయ్ థోడా థోడా థోడా
నువ్వు కొంచం తేడా నీ నడక కొంచం తేడా
నీ సరుకు కొంచెం తేడా నీ శకలు కొంచెం తేడా
అందుకనే నువు నచ్చావే అందుకనే నువు నచ్చావే థోడా థోడా థోడా

చీర చుట్టుకొని రమ్మంటే వోణి కట్టుకొని వస్తావు
వోణి కట్టుకొని రమ్మంటే నైటీ లోనే వస్తావు
గేటు తీసుకొని రమ్మంటే గోడదూకి నువ్వొస్తావు
గోడదూకి నేను రమ్మంటే కిటికీ లోంచే వస్తావు
అందరుంటే కొంతే తేడా ఒంటిగుంటే చాలా తేడా
పట్టపగలు కొద్దిగ తేడా చీకటైతే బాగా తేడా
ఎంతని ఎన్నని చెప్పలోయ్ ఒకటా రెండా ముడా

నువ్వు కొంచం తేడా నీ నవ్వు కొంచం తేడా
ఆ మాట కొంచెం తేడా ఆ చూపు కొంచెం తేడా
అందుకనే నువు నచ్చావోయ్ అందుకనే నువు నచ్చావే థోడా థోడా థోడా

హే రపప్పా... హే రపప్పా...
హే రపా రపా రపా రపా హే రపా రపా
హే రపా రపా రపా రపా హే రపా రపా ఆ...
బల్లవేసి బజ్జోమంటే మంచమేయ్యమని అంటావు
మంచమేసి నిదరోమంటే నన్నే ముంచేస్తుంటావు
బుగ్గపైన చెయ్యేస్తుంటే సిగ్గు అంటు అటు జరిగేవు
సిగ్గు అనుకొని వెళుతుంటే సిగ్నల్స్ ఏవో ఇస్తావు
తప్పు అంటే మినిమం తేడా ఒప్పుకుంటే మొత్తం తేడా
బుజ్జగిస్తే స్వల్పం తేడా రెచ్చగొడితే సర్వం తేడా
ఈడును ఎక్కడ దాచాలోయ్ ఎడా ఈడా ఏడా

నువ్వు కొంచం తేడా నీ పనులు కొంచం తేడా
నీ కథలు కొంచెం తేడా సంగతులు కొంచెం తేడా
అందుకనే నువు నచ్చావోయ్ అందుకనే నువు నచ్చావోయ్ థోడా థోడా థోడా

నువ్వు కొంచం తేడా నీ రూటు కొంచం తేడా
నీ టేస్ట్ కొంచెం తేడా నీ బుద్ది కొంచెం తేడా
అందుకనే నువు నచ్చావే అందుకనే నువు నచ్చావే థోడా థోడా థోడా


*********   *********   **********


చిత్రం: బలాదూర్ (2008)
సంగీతం: కె. యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు, సుజాత మోహన్

రంగు రంగు వాన ఇది నంగణాచి వాన
నను ముట్టుకుంటే ముద్దై పోనా
చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన
నను చుట్టుకుంటే మంటైపోనా
రానా దరి రానా తెర తెంపేయనా
శాన పరిశాన సిరి వంపేయన
కానా జతకాన చలి చెంపేయన
మైనా తడిమేయ్ నా తడి సంపాదన
నాకు నీకు నీకు నాకు వానే కదా వంతెన

రంగు రంగు వాన ఇది నంగణాచి వాన
నను ముట్టుకుంటే ముద్దై పోనా
చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన
నను చుట్టుకుంటే మంటైపోనా

ఊదిలాగ ఒకటి అరె సూదిలాగ ఒకటి
చిరుచినుకులన్ని కురిసే ఈ పైనా
బంతిలాగా ఒకటి అణుబాంబు లాగ ఒకటి
తొలి చినుకులన్ని తగిలాయి లోన
చేయాలంది వాన నీతోనే రవాణా
చూడాలంది వాన నీలోనే దిఖానా
బావిలోన నిలిచిపోర మనసుపైకి నిచ్చన

చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన
నను చుట్టుకుంటే మంటైపోనా
రంగు రంగు వాన ఇది నంగణాచి వాన
నను ముట్టుకుంటే ముద్దై పోనా

చినుకు చీర కట్టి అరె ఒణుకు పూలు పెట్టి
వరదల్లే కదిలి వస్తుంది జాణ
మబ్బు గొడుగు పట్టి మెరుపిట్ట అడుగుపెట్టి
హరివిల్లులాగ ఒళ్లే పరిచేనా
ముంచేసింది వాన నీతోని సుఖానా
పంచేసింది వాన నాలోని నమూనా
వాన లాగా చల్లిపోన వలపు మూల మూలన

రంగు రంగు వాన ఇది నంగణాచి వాన
నను ముట్టుకుంటే ముద్దై పోనా
చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన
నను చుట్టుకుంటే మంటైపోనా
రానా దరి రానా తెర తెంపేయనా
శాన పరిశాన సిరి వంపేయన
కానా జతకాన చలి చెంపేయన
మైనా తడిమేయ్ నా తడి సంపాదన
నాకు నీకు నీకు నాకు వానే కదా వంతెన

రంగు రంగు వాన ఇది నంగణాచి వాన
నను ముట్టుకుంటే ముద్దై పోనా
చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన
నను చుట్టుకుంటే మంటైపోనా



*********   *********   **********


చిత్రం: బలాదూర్ (2008)
సంగీతం: కె. యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కారుణ్య, చిత్ర

గుండెలొ ఇల్లుంది ఇంట్లొ చొటుందీ
అందులొ నువ్వె వుంటావా అతిగా ముద్దె ఇస్తావా
గుండెలొ ఇల్లుంటె ఇంట్లొ చొటుంటె
అందులొ నెనె వుంటాగా అతిగా అతిగా నన్నె ఇస్తగా
వెంటనె త్వరపడి వస్తావ
నూరెళ్ళుండె నొటె రాస్తవ వ వ వ వ

నెపురు వయ్యరి దెయ్యం
నీవైపు చూస్తెనె భయం
అయ్యింది నీతొటి కయ్యం
అది ప్రెమకు ప్రారంభం
తీరంగ చూసావు సొద్యం
తగ్గింది నాలొని పైత్యం
ఇది ఇద్దరి సంబందం
మయ్యల నువ్వె ఒచ్చి హాయినె తెచ్చవా
మంత్రమై నువ్వె ఒచ్చి మత్తులొ ముంచవా
కొపించి తప్పించి నాలొన వ్యాపించి ప్రెమ పంచవా

ఇన్నళ్ళు నువ్వంటె భారం
ఒళ్ళంత పూసావు కారం
ఇవ్వళె వెసావు హారం
ఇక నువ్వె నా తీరం
ఇన్నళ్ళు పెట్టాను శాపం
ఇలొన పెట్టాను కొపం
తెలిసింది నాలొని లొపం
ఇక నువ్వె నా లొకం
ఎండల నువ్వె ఒచ్చి నీడల మారవా
ఉప్పెనై ముందె ఒచ్చి ఊయలై చెరవా
సాదించి వాదించి ఆపైన స్పందించి
ప్రాణం అయ్యవా

మిర్చి (2013)

చిత్రం: మిర్చి (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: జస్ప్రీత్ జాస్జ్, సుచిత్ర

ఆరడుగుల అందగాడు
నన్ను బార్బీ గర్ల్ అన్నాడూ
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి
నన్ను బేబీ డాల్ అన్నాడూ

హాల్లో సంగారిట హాల్లో సంగారిట
నువ్వే నా హార్లిక్స్ బూస్ట్ అండ్ బోర్న్విట
మైహూమా అగరిత మైహూమా అగరిత
ఇందా నా అందాన్నే తాగై గట గట
పిల్లా నీ కళ్ళల్లో దాగుందో తల్వారే
పిల్లోడి కండల్లో దాగుందో పట్కారే
చున్నిలా చుట్టేస్తా అజారే ఏ ఏ ఏ ఏ
బార్బీ గర్ల్ ఉమ్మా బేబీ డాల్ ఉమ్మా
ఒళ్లే జిగెల్ జిగెల్ జిగెల్ మంటూందే
బార్బీ గర్ల్ ఉమ్మా బేబీ డాల్ ఉమ్మా
గుండె గుభెల్ గుభెల్ గుభెల్ మంటూందే
హాల్లో సంగారిట హాల్లో సంగారిట
నువ్వే నా హార్లిక్స్ బూస్ట్ అండ్ బోర్న్విట
మైహూమా ఆగరిత మైహూమా ఆగరిత
ఇందా నా అందాన్నే తాగై గట గట

చరణం: 1
డోంట్ టచ్ మీ మెత్తంగా
డోంట్ కిస్ మీ తీయంగా
ప్లీజ్ గిచ్ మీ కారంగా
పెదవుల్లో ల్యాండ్మైనే
జర పేల్చేసేయ్ రా తీవ్రంగా
ఊ ఒల్లేమో ఓ పక్క మంటేక్కీ ఉన్నాది
143 సెంటిగ్రేడ్ సెగల్లో ఉన్నాది
పిల్లేమో ఫ్రీజర్ లో చాక్లేట్ లా ఉన్నది
యమ్మీ యమ్మీ టేస్ట్ చూసుకో
బార్బీ గర్ల్ ఉమ్మా బేబీ డాల్ ఉమ్మా
గుండె జిగెల్ జిగెల్ జిగెల్ మంటూందే
బార్బీ గర్ల్ ఉమ్మా బేబీ డాల్ ఉమ్మా
గుండె గుభెల్ గుభెల్ గుభెల్ మంటూందే

చరణం: 2
బ్రేక్ చేస్తా బీడియాన్ని
షేప్ చేస్తా పర్వాణి
అటాక్ చేస్తా పరువాన్ని
తుఫ్ఫనై దూకేస్తా నిఖెల్టు పిల్ల ఫట్తని
ఏయ్ హైజ్యాక్ చేస్తావో కిడ్నాప్ చేస్తావో
తగినట్టుండాలది నీ నా స్పీడు కి
హైప్నాటైస్ అవ్తావో మెస్మెరైజే అవ్తావో
ఓపెన్ సీజన్ ఫుల్ రొమాన్స్ కి
బార్బీ గర్ల్ బేబీ డాల్
గుండె జిగెల్ జిగెల్ జిగెల్ మంటుందే
బార్బీ గర్ల్ బేబీ డాల్
గుండె గుభెల్ గుభెల్ గుభెల్ మంటుందే




*********   *********  **********




చిత్రం: మిర్చి (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: దేవి శ్రీ ప్రసాద్, గీతామాధురి

నీటిలోని చాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసెమో గిల గిల కొట్టెస్కుంటందే
డార్లింగే ఓసీ నా డార్లింగే డార్లింగే ఏంది ఈ ఫీలింగే
హేయ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాతిరీ కల్లోకొచ్చిందే
డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే ఏంది ఈ ఫీలింగే
ఓ సచిన్ బేటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు
బుర్ర గిర్ర గిర్ర మందే డార్లింగే
రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలో కుక్కేసినట్టు
ఉక్క పోసేస్తందే రారో డార్లింగే
ఎహె చేసిన వైటింగ్ చాల్లేగాని ఇప్పటికిప్పుడు పెట్టావే మీటింగే

డార్లింగే ఓసీ నా డార్లింగే డార్లింగే బేగిరాయె డార్లింగే
డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బేగిరారో డార్లింగే

హేయ్ నువ్వో చిచ్చు బుడ్డి నేనో అగ్గీపుల్ల రాయె పిల్ల మోగించేద్దాం దీపావళి మోత
నువ్వో కత్తి పీట నేనేమో ఆపిలంట నీ పర పర చూపుల కోత నాకు ఇష్టమంటా
హేయ్ గల్ఫ్ సెంట్ బుడ్డల్లే గుప్పు గుప్పుమన్నదే ఒంటి నిండా చల్లెసుకుంట రాయె డార్లింగే
గంప కింది కోడల్లే పూటకో ముద్దిచ్చి ,ప్రేమగా పెంచుకుంట రారో డార్లింగే

డార్లింగే ఓసీ నా డార్లింగే డార్లింగే బేగిరాయె డార్లింగే
డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బేగిరారో డార్లింగే

ఓ జడ్లో తురుముకున్న మల్లెపూల చండే నలిగి
విల విలా నిన్ను తిట్టే రోజు ఎప్పటికొస్తాదబ్బి
పెద్దోళ్లిచ్చుకున్న పాత పందిరి మంచం ఇరిగి
గొల్ళు మానె టైమ్ తొందర్లోనే రానున్నదే బేబీ
ఉట్టి మీది బొబ్బట్టు నోటి లోన పడేట్టూ
అవురావురంటు ఏదో చేసేయ్ డార్లింగే
అయ్యా కత్తిలాంటి నీ వయసు రంగు రంగు పుల్ల ఐస్ టేస్టే చూసేస్కుంట వచ్చెయ్ డార్లింగే

డార్లింగే ఓసీ నా డార్లింగే డార్లింగే బేగిరాయె డార్లింగే
డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బేగిరారో డార్లింగే





*********   ********   *********




చిత్రం: మిర్చి (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: విజయ్ ప్రకాష్, అనిత కార్తికేయన్

కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే
చాటుగ నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే
ఘాటుగ పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే
రాటుగ సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే
లేటుగు ఇంతందాన్ని చూశానా అనిపిస్తుందే
నా మనసే నీవైపొస్తుందే

ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి

నీ మతి పోగొడుతుంటె నాకెంతో సరదాగుందే
ఆశలు రేపేడుతుంటే నాకెంతో సరదాగుందే
నిన్నిల్లా  అల్లాడిస్తే నాకెంతో సరదాగుందే
అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుందే
నీ కష్టం చూస్తూ  అందం అయ్యయ్యొ అనుకుంటునే
ఇలాగే ఇంకాసేపంటుంటే

ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి

తెలుసుకుంటావా తెలుపమంటావా
మనసు అంచుల్లో నించున్న నా కలని
ఎదురు చూస్తున్న ఎదుటనే ఉన్న
బదులు దొరికేట్టు పలికించు నీ స్వరాన్ని
వేల గొంతుల్లోన మోగిందే మౌనం నువ్వున్న చోటే నేనని
చూసి చుడంగానే చెప్పిందే ప్రాణం నేన్నీదాన్నై పోయానని

ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి

తరచి చూస్తూనే తరగదంటున్న తళుకు వర్ణాల నీ మేను పూలగనీ
నలిగిపొతునే వెలిగిపొతున్న తనివి తీరేట్టు సంధించు చూపులన్ని
కంటి రెప్పలు రెండు పెదవుల్లా మారి నిన్నే తీరేస్తామన్నాయే
నేడో రేపో అది తప్పదుగా మరి నీకోసం ఎదైనా సరే

ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి




*********   ********   *********




చిత్రం: మిర్చి (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మికా సింగ్

ఖోల్ తేరీ ఖిడ్కీ ఖోల్ తేరీ ఖిడ్కీ (2)
వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికీ
Lets party party right now oh సోనియే
Lets party party right now

ఖోల్ తేరీ ఖిడ్కీ ఖోల్ తేరీ ఖిడ్కీ
వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికీ
Lets party party right now oh సోనియే
Lets party party right now

Lets live lets live like there is no tomorrow
Lets sing lets dance like we don't know the meaning of sorrow
బుజ్జి లైఫిది మనల్ని నమ్ముకున్నది
దాన్ని ముద్దు చేసి హద్దు దాటుదాం
యాహుం యాహుం బోలో యాహుం యాహుం
కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం
యాహుం యాహుం బోలో యాహుం యాహుం
కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం
యాహుం యాహుం బోలో యాహుం యాహుం
కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం

ఖోల్ తేరీ ఖిడ్కీ ఖోల్ తేరీ ఖిడ్కీ
వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికీ
Lets party party right now oh సోనియే
Lets party party right now

లైఫనేది స్టైలుగున్న జీన్స్ ప్యాంటురా
చిరుగులెన్ని ఉన్నా డోంట్ కేర్
జివ్వుమన్న Champagne నురగ లెక్కలో
ఆల్ ద టైం జోష్ పొంగాలే
రెక్కలున్న డ్రీమ్సున్నాయ్
గాల్లో తేలే గట్సున్నాయ్
క్రేజీ క్రేజీ థాట్సున్నాయ్
కిస్ మీ అంది ఓపెన్ స్కై
జెట్టు స్పీడులో ఫ్రీకి అటిట్యూడ్తో లాంగ్ డ్రైవ్కెళదాం లైఫ్తో

యాహుం యాహుం బోలో యాహుం యాహుం
కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం
యాహుం యాహుం బోలో యాహుం యాహుం
కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం
యాహుం యాహుం బోలో యాహుం యాహుం
కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం
యాహుం యాహుం బోలో యాహుం యాహుం
కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం

ఆక్స్ఫర్డ్ డిక్ష్నరీలో దొరకనందిరా
జిందగీకా అసలు సిసలు మీనింగ్
ఆక్సిజన్లో స్వచ్ఛమైన ఊపిరేదిరా
దాన్లో ఆనందాన్ని చేసి చూడు మిక్సింగ్
సెలబ్రేషన్ స్విచ్ ఆన్
సంబరాల సైక్లోన్
లివ్ లైక్ ఎ ఫుల్ మూన్
కమాన్ ఎవ్రీ సెకండ్ రాక్ ఆన్
ఛోటీ జిందగీ సైజు పెంచలేనిది
దీన్లో హ్యాపీనెస్ రేంజ్ పెంచుదాం

యాహుం యాహుం బోలో యాహుం యాహుం
కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం
యాహుం యాహుం బోలో యాహుం యాహుం
కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం
యాహుం యాహుం బోలో యాహుం యాహుం
కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం
యాహుం యాహుం బోలో యాహుం యాహుం
కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం




*********  ********  ********




చిత్రం: మిర్చి (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కైలాష్ కెహర్

పండగలా దిగివచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు
మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు

పండగలా దిగివచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు
మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు

అయ్యంటే ఆనందం అయ్యంటే సంతోషం మా అయ్యకు అయ్యై నీవు
కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం ఇట్టాగే పదికాలాలు ఉండనివ్వు

పండగలా దిగివచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు
ఓ మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు

ఓ జోలాలి అనలేదే చిననాడు నిన్నెపుడూ ఈ ఊరి ఉయ్యాలా
ఓ నీ పాదం ముద్దాడి పులకించి పోయిందే ఈ నేల ఈయాలా
మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా
ఓ మా పిల్ల పాపల్లో మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా
గుండె కలిగిన గుణము కలిగిన అయ్యా కొడుకువుగా
వేరు మూలము వెతికి మా జత చేరినావు ఇలా

పండగలా దిగివచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు
ఓ మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు

ఓ పెదవుల్లో వెన్నెళ్ళు గుండెల్లో కన్నీళ్ళు ఇన్నాళ్లు ఇన్నేళ్ళు
ఓ అచ్చంగా నీవల్లే మా సామి కళ్ళల్లో చుశామీ తిరనాళ్లు
ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిశాయి ముంగిల్లు
మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా మీ వాళ్ళు అయినోళ్ళు
అడుగు మోపిన నిన్ను చూసి అదిరె పలనాడు
ఇక కలుగు దాటి బయట పడగా బెదరడా పగవాడు

పండగలా దిగివచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు
ఓ మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు




*********   ********   *********




చిత్రం: మిర్చి (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: చిన్నపొన్ను

హే మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే
కోరస్: మిర్చి మిర్చి మిర్చి మిర్చి
ఏ మిర మిర మీసం తిప్పి మిసైలల్లే దూకాడే
కోరస్: మిర్చి మిర్చి మిర్చి మిర్చి

ఆ మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే
కోరస్: మిర్చి మిర్చి మిర్చి మిర్చి
ఆ మిర మిర మీసం తిప్పి మిసైలల్లే దూకాడే
కోరస్: మిర్చి మిర్చి మిర్చి మిర్చి

ఆ నిప్పుకు మల్లే నికార్సైన ఆకారం
అడుగెట్టిన చోట అదిరిపొద్ది గుడారం
అబ్బా ఇప్పటికన్నా మొదలవుతాది యవ్వరం
ఇది చెప్పుడు చాలు దుమ్మొ దుమ్మొ దుమ్మారమ్

ఆ మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే
కోరస్: మిర్చి మిర్చి మిర్చి మిర్చి
ఆ మిర మిర మీసం తిప్పి మిసైలల్లే దూకాడే
కోరస్: మిర్చి మిర్చి మిర్చి మిర్చి

ఎక్కడికైనా బైదెల్లాడో బంగారం
గుండెలు తట్టి మోగిస్తాడు అలారాం
ఏ దిక్కులు ముట్టి పుట్టిస్తాడో కల్లోలం
ఎన్ని లెక్కలు వేసి ఎవ్వరు మాత్రం చెప్పగలం

మిర్చి మిర్చి మిర్చి
మిర్చి మిర్చి మిర్చి




*********   *********   *********




చిత్రం: మిర్చి (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కైలాష్ కెహర్

నీ చూపుల పొంగిన పొగరు
మా ఊపిరి దీపపు చమురు
ఇకపై మా రేపటి వెలుగెవరూ
ముందడుగై నడిపేదెవరు
ముప్పును తెగనరికేదెవరు
నువు లేనిదే కన్నీరే ఊరు

బిల్లా (2009)

చిత్రం: బిల్లా (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రీటా


ఎల్లోరా శిల్పాన్ని వస్తున్నా నీకేసి
నాలో అందాలన్నీ అందిస్తా పోగేసి
ఎల్లొరా శిల్పాన్ని వస్తున్నా నీకేసి
నాలో అందాలన్నీ అందిస్తా పోగేసి

నన్నె పడగొట్టెల నీ పొగరె నచ్చింది
మూడె చెడగొట్టెల నీ పొగరె గిచింది
కనుకే మెరుపై తల వెస నీ మీద
దూకె దుడుకై ఒళ్ళొ పడిపొరాద
నా నా నష హూ
నీకె ఓటేసుకున్న నిన్నె పట్టేసుకొన,
నీ పై ఒట్టేసుకున్న నాతొ కట్టేసుకున్న

లొకాలే ఏలుతొంది నువ్వైన
నీ తొ నె పందెమెసుకొన,
వెటాదె లడి కూన నీ కాన
సిమ్హన్నె లొంగదీసుకొన
లెఫ్ట్ రైట్ నీ పై నా సొగసె గురిపెడత
రైటో రాంగో నీకు నా వయసె బలిపెడతా
మనసే అతికె మగవాడివి నువ్వేగా
కసితో రగిలే నవ నాగిని నేనేగా
నా నా నష హూ
నీకె ఓటేసుకున్న నిన్నే పట్టేసుకోన
నీపై ఒట్టేసుకున్న నాతొ కట్టేసుకున్న

నీకొసం వేచి ఉంది దిల్ మెరా
ఆనందం అంతు చూసుకోరా
ఆరటం దాటుతోంది పొలిమేర
ఆహ్వానం మన్నించి దొరికిపోరా
అందం చందం మొత్తం అత్తర్లా కురిపిస్తా
ఖుల్లం కుల్ల స్వర్గం అంచుల్లో మురిపిస్తా
చలిలొ ఝలకొ చెలరేగాలే చాల
సెగలు పొగలు చల్లరాలీ వేళ
నా నా నష హూ




**********   **********   **********



చిత్రం: బిల్లా (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మనో , రంజిత్, కన్నన్

హరి లో రంగ హరి హరి లో రంగ హరి
చేయ్యెస్తే చోరి చోరి కిరి కిరి
చోరి లో రంగసరి దేశంలో లేడు మరి
దొంగల్లో దాదా దొంగ ఈడే మరి

అబ్బా రంగా నువు చాకు రా
నిజంగా నువు కొక్ రా
సామి రంగా  నువు సూపర్ ఎహె
హరి లో రంగ హరి హరి లో రంగ హరి
లుక్కెస్తే లెక్కసరీ కిరి కిరి

దాగుడు మూత దండాకోరు పారహుషారు
ఈడొచ్చాడంటే ఊరు వాడా మాయ బజారు
చిటికెల్లోన శాల్తిలన్నీ గల్లంతవ్వాలి
జన జంతర్ మంతర్ మంతరమేస్తె కొంపల్ కొల్లేరే
మన పూలన్ దేవి పుట్టిన రోజే నువ్వు పుట్టావే
శోబారాజుకి ఎనకటి జన్మలో ఫ్రె౦డ్ అయి ఉంటవ్ లే
నీకు కాఫీ ఇస్తే కప్పు సాసరు లేపే టైపే లే
పేరింటేనే జేబులన్ని దడుసుకుంటాయె
ఓరా చుపు లోనే తాళాలన్ని తెరుసుకుంటాయే
ఇట్టా టచ్చింగ్ ఇస్తే బీరువాలే బావురుమంటాయే

అబ్బా రంగా నువు కింగ్ రా
పచ్చి దోంగా ఉపీంగ్ రా
సామి రంగా నువు బంపర్ ఏహె

యదు వంశ సుధాంబరి చంధ్రా స్వామి రారా
రత్నాకర సమగంభీరా స్వామి రారా
శత కొటి మన్మాధాకారా స్వామి రారా
పర రాజ శత్రుసంహారా స్వామి రారా
నారి జన మానస చోరా చోరా చోరా చోరా..

లేడీస్ అంతా నీ చుట్టూరా చేక్కర్లేస్తారే
ఓరి గోపి కృష్ణ గొడలు దూకీ రా రా అంటారే
నువ్వు చేయ్యెసుకుంటె పరుసు మనసు నీదేన౦టారే
చిన్న పెద్ద పేద గోప్ప తెడాలె లేవే
నోటన్నాకా వందా వేయ్యి అన్ని ఒకటేలే
సేతికంది దేదో సప్పున నొక్కి వెలిపొతుండాలే

అబ్బా రంగా నువు కత్తి రా
టింగు రంగా నువు కంచు రా
సామి రంగా నువు ముదురు ఏహె

ఐటమ్స్ అన్ని నీకడకొచ్చి గగ్గోలంటే
నీ కాడుంటాం ఎత్తకపొమ్మని బతిమాలాస్తుంటే
అంతో ఇంతో సాయం చెస్తే తప్పే లేదసలే
మనిసన్నాకా పుట్టేసీనాక ఏదోటి సేయల్లే
మనకొచ్చిందేదో నచ్చిందేదో సేస్తా ఉండాల్లే
అరె మంచో సెడ్డో మనకంటూ ఓ గుర్తింపుండాలే

అబ్బా రంగా నువు కేక రా
సుబ్బా రంగా నువు నొక్కరా
ముందెనకా నువు సుడకఏహె
హరి లో రంగ హరి హరి లో రంగ హరి
లుక్కేస్తే లెక్కసరి కిరి కిరి

పిన్నీసయినా పిస్తోలు అయినా
జాకెట్ అయిన చాక్లెట్ అయినా
చీకుల తట్టా చేపలబుట్టా
సారా పాకెట్ డైమండ్ లాకెట్
అట్లా కాడా రుబ్బు రోలు ఆంజీనేయాసామి తాడు
దేన్ని వదలడురోయ్



**********   **********   **********


చిత్రం: బిల్లా (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హేమచంద్ర, మాళవిక

మసాలా మిర్చి పిల్ల మజా చేద్దాం వత్తావా
నసాలా మంటేత్తేలా మీఠా ముద్దే ఇస్తావా
సీ పోరా రావద్దన్నా రయ్యా రయ్యా వత్తావా
పో పో రా పొమ్మన్నాగా వచ్చిందారే పోతావా

బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ
పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మాళీ
ఐతే యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ
గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ
యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ
గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ

చరణం: 1
కొరివి పిల్లడా నీక్కొంచెం దూకుడెక్కువా
సరదా సాలిత్తావా సరసం కానిత్తావా
ఉరికి రాకలా నాకేమో చొరవ తక్కువా
వరసే మారుత్తావా మురిపెం తీరుత్తావా
ఛూమంతరమేస్తాలే బ్రహ్మచారి
ముచ్చట్లే తీరాలంటే నీముందరుంది కోరే దారి

బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ
పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మాళీ
యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ
గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ
యాడుందే తాళి ఐ వొన వొన మే క్యూ ఆలీ
గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ

చరణం: 2
బూరె బుగ్గని బుజిగాడా బుజ్జగించవా
శిలకా సనువిత్తావా సురుకే సవి సూత్తావా
ముద్దబంతిని ముద్దారా ముట్టడించవా
తళుకే తలిగిత్తావా కులుకే ఒలికిత్తావా
అతిగా ఉడుకెత్తావే సామి రంగా
ఐతే సుతి మెత్తంగా గిల్లుకోవా కోవా రావా

బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ
పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మాళీ
యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ
గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ
యాడుందే తాళి ఐ వొన వొన మే క్యూ ఆలీ
గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ




**********   **********   **********



చిత్రం: బిల్లా (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రంజిత్, నవీన్ మాధవ్

నేనుండే స్టైలే ఇలా ఎదిగానే నియంతలా
ఎవరైనా సలాం అనేలా
అడుగడుగు ఒకేలా నడవనుగా ఏవేళా
ఎవరు నన్నూహించేలా
నే వలా విసిరితే విలా విలా
నేనలా కదిలితే హల్లా గుల్లా
మై నేమ్ ఈజ్ బిల్లా బి ఫర్ బిల్లా
ఒకటే సైన్యంలా వచ్చా నిల్లా
మై నేమ్ ఈజ్  బిల్లా బిజిలి బిల్లా
మెరుపే మనిషైతే ఉంటాదిల్లా

ఎనీమి ఎవ్వడైనా యముడిని నేనేనంటా
డేంజర్ ఖతం చూపిస్తా
భయమే నాకెదురైనా దాన్ని బంతాడెస్తా
పాతాళంలో పాతేస్తా
నా కదం పిడుగుకు చలి జ్వరం
ఆయుధం నాకది ఆరోప్రాణం
మై నేమ్ ఈజ్ బిల్లా థండర్ బిల్లా
నాకే ఎదురొచ్చి నిలిచేదెల్లా
మై నేమ్ ఈజ్  బిల్లా టైగర్ బిల్లా
పంజా గురిపెడితే తప్పేదెల్లా

మనిషిని నమ్మను నేను మనసును వాడను నేను
నీడై నన్నే చూస్తు౦టా
మూడో కన్నే కన్ను ముప్పే రానివ్వను
మరణంపైనే గెలుస్తా
నా గతం నిన్నటితోనే ఖతం
ఈ క్షణం నే పోరాడే రణం
మై నేమ్ ఈజ్  బిల్లా డెడ్లీ బిల్లా
దూకే లావాని ఆపేదెలా
మై నేమ్ ఈజ్  బిల్లా ఓన్లీ బిల్లా
ఎపుడేం చేస్తానో చెప్పేదెలా

అరుంధతి (2009)

చిత్రం: అరుంధతి (2009)
సంగీతం: కోటి
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: కైలాష్ ఖేర్


కమ్ముకున్నా చీకట్లోనా
కుమ్ముకొచ్చే వెలుతురమ్మా
కచ్చకట్టీ కత్తిపడితే
చిచ్చురేపే కాళివమ్మా
నీ కన్ను ఉరిమి చూడగానే
దూసిన కత్తి వణికిపోవునమ్మా
కుంచె పట్టి బొమ్మగీస్తే
అదే నీ గుండెకే అద్దమమ్మా
అందరినీ ఆదరించే దయామయి
అన్నపూర్ణ నీవమ్మా
ఆలన పాలనలో నువ్వే
ఈ నేలకు తల్లివమ్మా
నువ్వు పలికేదే తిరుగులేని వేదం
నువ్వు చేసేదే ఎదురులేని చట్టం
ఓర్పులోన ధరణి మాతవమ్మా
తీర్పులోన ధర్మమూర్తివమ్మా

జేజెమ్మా మాయమ్మా జేజెమ్మా ఓయమ్మా
జేజెమ్మా జేజెమ్మా మా జేజెమ్మా (2)

నువ్వు రుద్రరూపమెత్తగానే
కాలమే దద్దరిల్లి పోయేనమ్మా
రుద్రశక్తులకు నీ ధాటితో
గుండెలే బద్దలైపోయేనమ్మా
బుసగొట్టే కామాంధుని
కసితీరక తొక్కవమ్మా
పుట్టుగడ్డ ఆదుకున్న
ఆ అపర భద్రకాళి నీవమ్మా
మాటనిలుపుకొంటివమ్మా జేజెమ్మా
మళ్ళి జన్మ ఎత్తినావమ్మా

ఎంత దీక్ష పూనినావమ్మా
గుండెలో నిప్పులే నింపినావమ్మా
త్యాగమంటే నీదమ్మా
నరకమే కొంగులోన ముడిచావమ్మా
నిన్నుచూసి మృత్యువుకే జేజెమ్మా
కళ్లు చెమ్మగిల్లినాయమ్మా
ఈ జారుతున్న రక్తధారలే
నీ తెగువకు హారతులు పట్టేనవ్మూ...

ఓ... ఓ...
ఆ... ఆ...
దిక్కులన్నీ శూన్యమాయే
వెలుతురంతా చీకటాయే
ఆశలన్నీ ఇంకిపోయే
శ్వాస మాత్రం మిగిలిపోయే



********   *********   *********


చిత్రం: అరుంధతి (2009)
సంగీతం: కోటి
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: మురళి, సందీప్, శ్రీ కృష్ణ

పల్లవి:
చందమామ నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే
వెన్నెలంత నవ్వే నవ్వే నవ్వే నవ్వే నవ్వే
మబ్బుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావే
చుక్కలే ముత్యాలల్లే మెళ్ళో వేశావే

డోలారే డోలారే ఢం కోలాటాలాడే క్షణం
డోలారే డోలారే ఢం ఇల్లంతా బృందావనం
పూసే ఈ సంపంగి చెంపల్లో సిగ్గెంతో పొంగే క్షణం
దూకే ఆ గుండెల్లో తొందర్లే చూద్దామా తొంగి మనం

డోలారే డోలారే ఢం కోలాటాలాడే క్షణం
డోలారే డోలారే ఢం ఇల్లంతా బృందావనం
ఇల్లంతా బృందావనం

చరణం: 1
ఇన్నాళ్ళు వేచింది మా ముంగిలి
ఇలా సందళ్ళే రావాలని
ఇన్నేళ్ళు చూసింది మా మామిడి
ఇలా గుమ్మంలో ఉండాలని
మురిసే ప్రేమల్లో ఉయ్యాలూపంగా
తనిలా పెరిగింది గారాబంగా
నడిచే శ్రీలక్ష్మి పాదం మోపంగా
సిరులే చిందాయి వైభోగంగా
వరించి తరించి వాడె వస్తున్నాడు అడ్డం లెగండోయ్

హే... డోలారే డోలారే ఢం అరె వారేవా ఏం సోయగం
డోలారే డోలారే ఢం నువ్వేగా నాలో సగం
డోలారే డోలారే ఢం...

కార్తీకదీపం కాంతుల్లో రూపం శ్రీగౌరివోలె లేదా
శివుడల్లే చేరగా సౌభాగ్య సంపద
జేజమ్మా జేజమ్మా జేజమ్మా జేజమ్మా
జేజమ్మా జేజమ్మా మా జేజమ్మా

చరణం: 2
నాతోటే  నాచోరే ఓ సోనియే
నువ్వే పుట్టావే మేరే లియే
నాకంటి పాపల్లే చూస్తానులే
అనే మాటిచ్చుకుంటానులే
మనసే బంగారం అంటారోయ్ అంతా
ఇహ పో నీ పంటే పండిందంట
అడుగే వేస్తుందోయ్ నిత్యం నీవెంట
కలలోనైనా నిను విడిపోదంట
ఫలించే కలల్లో తుళ్ళే వయ్యారిని అంతా చూడండోయ్

డోలారే డోలారే ఢం నా చుట్టూ ఈ సంబంధం
డోలారే డోలారే ఢం ఏ జన్మదో ఈ వరం
ప్రాణంలో నే దాచుకుంటాను పంచేటి ఆ ప్రాయము
జన్మంతా గుర్తుంచుకుంటాను ఈనాటి ఆనందము

డోలారే డోలారే ఢం
ఇల్లంతా బృందావనం ఇల్లంతా బృందావనం

డాన్ (2007)



చిత్రం: డాన్ (2007)
సంగీతం: రాఘవ లారెన్స్ , చిన్నా
సాహిత్యం: విశ్వా
గానం: విశ్వా, సుచిత్ర


ఏదొ వుంది లే ఏదొ వుంది లే
దాస్తువున్న దాగలెనిదెదొ వుందిలే
ఏదొ వుంది లే ఏదొ వుంది లే
వాలు కళ్ళు మొపలెనిదెదొ వుంది లే
నీ తలపుల్లొన ఎదొ వుంది లే
నీ చిరునవుల్లొ ఎదొ వుంది లే
నీ అలికిడిలొన ఎదొ వుంది ఒరవడిలొన ఎదొ వుంది
ఏదొ వుంది లే....
నా మన్మదుడ, ఒ చందురుడ, నా ఇందురుడ.మన్మదుడా...

చరణం: 1
తడి తడి పొడి పొడి తపనలలొ
తనువుని తడిమిన తొలి దసలొ
మనసుని ముదిపాదు మధురిమలొ
కులుకుల మెలికల కధకలిలొ

కలిపి చూస్తే నీలొ వాడి
వెలికి తీస్త నీతి కూడి
కరిగిపొన నీతొ ఓడి
నీథొ లేడి
సిరులతి చెస్తా దాడి
కుదిరి చూడు ఈడుజొడి
what's the beat style
on the world wide yo yo yo
నా మన్మధుద||

చరణం: 2
Some thing in ur eyes ok
some thing in ur eyes o
Some thing in ur eyes ok
ఏదొ ఏదొ ఏదొ
సిరి సిరి సొగసుల తమకములొ
తొలి తొలి వలపుల తికమకలొ
తడ పడు ఉరుముల అలజడిలొ
కలిమిని ఎరుగని కలయికలొ
కురుదులెక కచ్ఛ దారి
అడుగు వేసి ఆరి తీరి
ఒడికి చేరి ఏరి కోరి
జడుపులేక చూస్తే నారి
మడతపెట్టి వేసెయ్ గోరి
ఉడుకుతొంది బాడి బాడి
what's the beat style
on the world wide yo yo yo



*********  ********  ********


చిత్రం: డాన్ (2007)
సంగీతం: రాఘవ లారెన్స్ , చిన్నా
సాహిత్యం: చిన్నీ చరణ్
గానం: శంకర్ మహదేవన్

దడ పుట్టిస్తా నీకు దడ పుట్టిస్తా
నా డాన్ అన్న పెరు చెప్పి దద పుట్టిస్తా
చమట పట్టిస్తా నీకు చెమట పట్టిస్తా
న డాన్ అన్న డాబు చూపి చెమట పట్టిస్తా

సాయం కోరి వస్తే చెయ్యందిస్తా
అన్యాయం చెయ్యకుంటే తలంటె తీస్తా
అన్నలే నడిచొస్త కన్నిలే తుడి చేస్తా
తెలుగు గడ్డమీద అడుగెసీ..
అన్నె సొంత బగ బగ
తెలుగొడంటె నీకు చూపించెస్తా దడ

చరణం: 1
అ జర జర జర జర జర జర
కాసుకోర మామ ఇక చూసుకోర మామ
తప్పుకోర మామ తప్పొపుకోర మామ
కత్తిలంటి కల్లతొటి కనిపెడతాడు
పపమింక ఎక్కడున్న పసిగడతాడు
దిమ్మతిరిగి దుమ్ము లెచినొలకి అరెయ్
మొసమన్నమట వింటే మండిపడతాడు
మ మ మాసు అంటే అతడె కాస్కో
నువ్వంటి మనకుంటి పులిలాంటి తెగువుంది
తెలుగు గడ్డమీద చెయ్యెస్తే
తెగ బడి వస్తాం తలలే తెగ నరికెస్తాం
తెలుగొదంటే నీకు చూపించేస్తం

చరణం: 2
అ జర జర జర జర జర జర
మాటైనర మామ న మాట ఇనర మామ
తెలుసుకోర మామ నువ్వు తెలుసుకొర మామ
ఉప్పు గడ్డ రల్లతొటి తొక్కెస్తాడు
తిక్కరేగెనంటే తాట తెసెస్తాడు
వెనకా ముందు చూడడింక ఎగిరిథంతాడు
నువ్వు ఏడ వున్న అతడే వొదలదు
బతుకు మీద ఆశ వుంటె నువ్వె కనబడు
అన్న రెచిపొతే నీపని చూడురొ
పొగరున్న చిన్నొడు పొగిడెస్తే పడబొడు
తెలుగు నేలమీద చెయ్యెస్తే
నిప్పులు కురిపిస్తాం మెం ఉప్పెనల వసతాం
తప్పుని కడిగేస్తాం తప్పదిక నరికేస్తాం



*********  ********  ********


చిత్రం: డాన్ (2007)
సంగీతం: రాఘవ లారెన్స్ , చిన్నా
సాహిత్యం: చిన్నీ చరణ్
గానం: రాఘవేంద్ర

ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు
నాలొ అలజడి రేపిందీ నీ చిరునవ్వు
ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు
నాలొ అలజడి రేపిందీ నీ చిరునవ్వు
నా కన్నులొన నీ రూపం నాకన్నా ఎంతో అపురూపం
అనిపించే చిన్నారి ఈ అనుభూతే నాకు తొలిసారి

చరణం: 1
నిన్ను చూస్తె నిన్నలేని చలనం నాలోన నాలోన
కన్ను మూస్తె నిన్ను కలిసే కలలే ఓ లలన
ఎందుకొ నా గుండెలోన ఎదో హైరాన హైరాన
ఎంతమంది ఎదుటవున్న వొంటరినౌతున్నా
ఈ అల్లరి నీదేనా నను అల్లిన థిల్లాన
అనుకున్నాన మరి నాలోన ఈ నమ్మని కమ్మని కథ మొదలౌనని

చరణం: 2
మెరుపులాంటి సొగసులెన్నో నన్నే చూస్తున్నా చూస్తున్నా
నెనుమాత్రం నిన్ను చూస్తు కలవరపడుతున్నా
ఊహలన్ని వాస్తవాలై నీలా మారేనా మారేనా
ఊపిరేదో రూపమైతె అది నీవే మైనా
అ దైవం ఎదురైన ఈ భావం నిలిచేనా
అనుకున్నాన మరి నాలోన ఈ నమ్మని కమ్మని కథ మొదలౌనని



*********  ********  ********


చిత్రం: డాన్ (2007)
సంగీతం: రాఘవ లారెన్స్ , చిన్నా
సాహిత్యం: చిన్నీ చరణ్
గానం: హరీష్ రాఘవేంద్ర, సైంధవి

ముద్దు పెట్టు ముద్దె పెట్టు ముద్దు మీద ముద్దె పెట్టు
ముత్యం లాంటి ముద్దె పెట్టు ముచ్చటగా పెట్టు పెట్టు
ఉమ్మ అ ఉమ్మ
ముద్దు పెట్టు ముద్దె పెట్టు మదుర్లాంటి ముద్దు పెట్టు
ముద్దు పెట్టు ముద్దె పెట్టు మూడు ముళ్ళు పడేటట్టు
ఉమ్మ అ ఉమ్మ
తొలి తొలి ముద్దె పెదిటే
నా తనువంత తెలియని గిలిగింత
మరి మరి ముద్దె పెటితె
నా మనసంత తీయని పులకింత ఆ
ఉమ్మ అ ఉమ్మ అ ఉమ్మ అ ఉమ్మ అ ఉమ్మ అ ఉమ్మ

చరణం: 1
నున్నని నా బుగ్గలపై ముద్దు పెడితే
అ నునుపంతా ఎరుపెక్కింది అయ్యయొ
ఎర్రని నా పెదవులపై ముద్దు పెడితే
అ ఎరుపంతా మెరుపైంది అయ్యయొ
నుదుటున ముద్దు పెదితే పై పై కి వదంట
ఎవరును చూదకుంటే నె సై అంటా
నడుముకి ముద్దు పెదితే నడుమెదొ గలాట
నాభికి ముద్దు పెడితే నవ్వుల పంట
కల్లొకొచ్చి వొల్లొ కొచ్చి గిల్లి గిచ్ఛి మల్లి ఇచే


చరణం: 2
మెత్తని నా పాదం పై ముద్దు పెడితే
అ మైకం నా తలకెక్కింది అయ్యయొ
తాపంతొ తలపైనే ముద్దు పెడితే
ఒరయ్యొ అది ఎగపొతుంది అయ్యయొ
అ పద్దొ ముద్దు ఆపదకో ఒముద్దు
అడగకనే ఇవ్వు అస్సలు ముద్దు
కనులకు ఒ ముద్దు చుముకానికి ఒ ముద్దు
మెడ ఒంపున ముద్దు ముద్దు
అయ్యయయ్యొ ఆపై వొద్దు వుండలయ్యొ అక్కడ హద్దు


కోరి కోరి పెట్టు పెట్టు
కలిసి కలిసి పెట్టు పెట్టు
కొరికి కొరికి పెట్టు పెట్టు
కరిచి కరిచి పెట్టు పెట్టు
ఉమ్మ అ ఉమ్మా ఉమ్మ



*********  ********  ********


చిత్రం: డాన్ (2007)
సంగీతం: రాఘవ లారెన్స్ , చిన్నా
సాహిత్యం: చందు మధు
గానం: హరిహరన్ , రీటా

నీకై నేను నాకై నువ్వు వుంటే చాలు కద
మనలొ మనము మనకై మనము వుంటే చలు కద
అకాశం మనతోడు ఈ నేలే మననీడై
నీకై నేను నాకై నువ్వు వుంటే చాలు కద
అకాశం మనతోడు ఈ నేలే మననీడై

చరణం:1
ప్రాణమున్నది నీకొసం ప్రేమ వున్నది మనకొసం
నువ్వు నేనుగ నేనే నువ్వుగ మారిపొయె రొజు ఇది
ప్రాణమన్నది వీడిపొయింద మన ప్రేమే మారనిది
లొకాలు దాటి మనమూ పయనిద్దమ
ఎ ప్రేమ సాక్షిగ జీవిద్దామ

చరణం:2
నేను వున్నది నీకొసం నిన్ను చేరమన్నది ఈ క్షణం
గుండే గుటిలొ గూడు కట్టిన నెలవంకవు నీవేలే
కన్నె గువ్వల తన గుండెలొ కొలువున్నది నీవేలె
కాలాలు ఆగిపొని ఒ న ప్రేమ
ఈ క్షణమే తీరిపోని నా ఈ జన్మ


*********  ********  ********



చిత్రం: డాన్ (2007)
సంగీతం: రాఘవ లారెన్స్ , చిన్నా
సాహిత్యం: చిన్నీ చరణ్
గానం: శంకర్ మహదేవన్

సు సు సురీన్న ఒక్కసరి ఆడు అన్న
దుమ్ములెచి పొవలి వూరు వాడ
ఉల్లసంగ ఉత్సహంగా సు సు

నిన్ను మాతొ నడిపడు దైవమె
అనుబందంగ హె హె
అన్న నీకై ఇస్తాము ప్రాణమే
అనందంగ హె హె
Many Many Happy Returns 2 u సురి అన్న సురి అన్న హె
Many Many Happy Returns 2 u సురి అన్న హె సురి అన్న సు సు

చరణం: 1
అండ దండ నువ్వేలె గుండెనిండ నువ్వేలే
నిండు చందమామంటె నువ్వేలే నువ్వేలే
పేదవాళ్ళ మనస్సుల్లొ దెవుడల్లె నిలిచావు
పేటలొని జనమంత నీవాల్లే నీవాల్లే
ఎంతా పుణ్యమొ మరి మనస్సు మురిసిపొయెలె
ఇంత మంది వుండగా నాకు ఎదురులేదు
wish u happy birthday 2 u సురి అన్న సురి అన్న హె
wish u happy birthday 2 u సురి అన్న హె సురి అన్న సు సు

చరణం: 2
స్నెహమనె నీ పేరే
త్యాగమంటె నీ పేరే
ఇంత మంచి నీ మనసుకు జొహరె జొహరె
అప్తులెవరూ లెరంటా ఆస్తులేవి వద్దంట
అన్న రూటే తొడుంటె చలంట చలంట
పెద్ద తల్లి సాక్షిగ
నాకు అన్ని మీరులె
ఎన్ని జన్మలెత్తినా
మిమ్ము వీడి పోనులీ

లక్ష్యం (2007)



చిత్రం: లక్ష్యం (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తిక్ , శ్రేయగోషల్


చక్కెరకేళి పండు చక్కెర కేళి పండు నాతోడు
నీడై నువ్వుండు
పిప్పరమెంటు పిల్లా, పిప్పరమెంటు పిల్లా నా ఈడు
జోడై నువ్వుండు
తొలిప్రేమ నేడు నీ పేరు రాదా, పిలిచింది చూడు
నిజంగా నిజంగా
మనసైన వాడు చెయ్యందుకోగా ముందె ఉన్నాడు
నిజంగా నిజంగా
ఆమాటే మళ్ళి అను

చరణం: 1
నేనంటే నువ్వంటూ చేతల్లో చూపెట్టు నా మనసు
నమ్మేట్టుగా
నాలోనే నువ్వుంటూ, నేనన్ను దీవింతు
సందేహము వింతగా
వద్దనుకున్నా నేను ఊపిరిలా ఉంటాను
ఇద్దరమంటూ లేనేలేమని నేనంటున్నాను

చరణం: 2
రాకాసి చూపుల్తో నాకేసి చూస్తావేం నేనరిగిపోనా మరీ,
మారాణి నవ్వుల్తో ప్రాణాలు లాగేసి గారాలు పోకే మరీ,
సర్లే కానీ బాబూ ఈ సారికి ఇలా కానివ్వు.
ఇప్పుడు ఎప్పుడు తప్పని సరిగా చేస్తాలే తప్పు



**********   *********   ***********


చిత్రం: లక్ష్యం (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: మధుబాలకృష్ణన్

గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా
ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనురా
అలుపే రాని కేరింతలు తను మురిసీ మన రాగాలలో
అనురాగాలలో తను కూడా మనలాగే మురిసీ

చరణం: 1
ఇందరుండగా ఇరుకైన ఇంటిలో
కష్టాలకింక చోటు లేక చేరుకోవుగా
కాంతులుండగా ప్రతి వారి కంటిలో
ఆ రంగుదాటి కంటినీరు పొంగిరాదుగా
చొరవలు లేని సంతోషం అలకలు ఉన్నా అరనిమిషం
ఎన్నెన్నొ ఉన్నాయి లేని దొకటే కల్మషం

చరణం: 2
అమ్మ వాకిలి నాన్నేమో లోగిలి
ఈ చిన్ని పాప చంటి నవ్వు ఇంటి జాబిలి
అన్నగోపురం వదినమ్మ గుమ్మమై
ఇక తమ్ముడేమో కోటగోడ లాంటి కావలి
మనసే ఏ తిధులు లోకాలే అతిధులు


*******   *******   *******


చిత్రం: లక్ష్యం (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: రంజిత్

ఎవడు..ఎవడు..ఎవడు..
ఎవడూ..ఎవడూ...ఎవడూ...

నా కాఫీ కలిపేవాడు, నా కంచం కడిగేవాడు
నా కష్టం తీర్చేవాడు నాక్కావాలి
నా కూడా ఉండేది. నా డ్రెస్ పిండేది
నన్నే ఇస్త్రీ చెయ్యనిదీ నాక్కావాలి
నా పైట చిక్కేవాడు, నా వెనకా నక్కేవాడు, నా
ముందు మొక్కేవాడు నాక్కావాలి
నా పైకే ఎక్కేది, నా బ్యాకే నొక్కేది, నన్నొదిలి
చెక్కేయనిది నాక్కావాలి
సరియైన మొగుడు ఎవ్వడు
సుగుణాల మగువ ఎవ్వరూ
ఎన్నో బంధించేవాడు, ఎదురేదీ ఎరగనివాడు A.T.M
అయ్యేవాడు ఎవ్వడు ఎవ్వరు ఎవ్వడు ఎవ్వరు
ఎవ్వడు ఎవ్వడు హే...

చరణం: 1
మందూ, సిగరెట్టూ చెడు అలవాటంటూ ఉండని
వాడే కావాలి
లాగు ఊరేగు అది మగలక్షణమని చెప్పేలేడీ
కావాలి
అమ్మా, ఆంటీస్ అస్సలెవ్వరివంకా చూడనివాడే
కావాలి
చూడు తెగ చూడు అందరిలో నన్నే చూడమని
తనుతొలగాలి
ఎంతందముగా ఉన్నావంటూ పొగడాలి
నిజాలు చెబితే నమ్మాలి
ఎంతో ఎంతో ఖర్చే పెట్టి తిప్పాలి.
నవ్వుతానే తీర్చాలి
ఏమైనా చేసేవాడు ఏమన్నా నమ్మేవాడు ఆ తగిన
పసివాడు ఎవ్వడు ఎవ్వడు ఎవ్వడు ఎవ్వడూ
హే...

చరణం: 2
పెళ్ళే అయ్యాక ఇక లవ్వాడే వాడే వడే కావాలి
లవ్వే చేశాక ఇక పెళ్ళి గిళ్ళి ఆడే లేడీ కావాలి
ఆరు మరి ఏడు సాయంత్రం లోగా ఇంటికి తానేరావాలి
అయిదు గంటలకే ఉదయాన్నే వస్తే తలుపే తాను తీయాలి
అందరికన్నా నన్నే మిన్నగా చూడాలి
నా వాళ్ళూ నాకూ కావాలి
సాకులు చెప్పే రాజస్థానే నిండాలి
కన్నీళ్ళు కూడా కరగాలి



*******   *******   *******



చిత్రం: లక్ష్యం (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం:
గానం: హేమచంద్ర

నిలువమని నన్ను అడుగవలన..నిలువకుండ పొతివి లలన..
ఒర చూపుల చిన్నదాన..ఒక సారి రావె లలన...

నిలువవె వాలు కనులదాన..వయ్యారి హంస నడకదాన..

నీ నడకల హొయలున్నదె జాణ..
నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటే నిలువదె నా మనసు..
ఊ లలన అది నీకెం తెలుసు..
నిలువవె వాలు కనులదాన..వయ్యారి హంస నడకదాన..
నీ నడకల హొయలున్నదె జాణ..

ఎవరని ఎంచుకుని నవొ..వరుడని బ్రాంతి పడినవొ..
ఎవరని ఎంచుకుని నవొ..బ్రాంతి పడినవొ..సిగ్గు పడి తొలగేవొ..
విరహాగ్నిలొ నన్ను తొసిపొయేవొ..
నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటె నిలువదె నా మనసు..
ఊ లలన అది నీకెం తెలుసు..

ఒక సారి నన్ను చుడరాద..జంట చెర సమయం ఇది కాద..
ఒక సారి నను చుడరాద..సమయం ఇది కాద..చాలు నీ మరియాద..
వగలాడివె నీ వాడనె కాన...
నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటె నిలువదె నా మనసు..
ఊ లలన అది నీకెం తెలుసు..

నిలువవె వాలు కనులదాన..వయ్యారి హంస నడకదాన..
నీ నడకల హొయలునదె జాణ..
నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటె నిలువదె నా మనసు..
ఊ లలన అధి నీకెం తెలుసు..

నిలువవె వాలు కనులదాన..వయ్యారి హంస నడకదాన..
నీ నడకల హొయలున్నదె జాణ..



**********   *********   *********



చిత్రం: లక్ష్యం (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు, సుజాత

సుక్కు సుక్కు సుక్కు సుక్కు
సుక్కు సుక్కు సుక్కు సుక్కు సుక్కు
సుక్కు సుకుమారీ సుకుమారీ సొగసియ్యవేమే పిసినారి
తగ్గు తగ్గు తగ్గు తగ్గు బ్రహ్మచారీ బ్రహ్మచారీ నడవొద్దు నువ్వే అడ్డదారి
మనసిచ్చావే ముద్దుగా మాటిచ్చావే ముద్దుగా
మనసిచ్చాగా ముద్దుగా మాటిచ్చాగా ముద్దుగా
అవసరమొచ్చి ముద్దిమ్మంటే
హరి హరి హరి హరి నువ్వు చాలా పొదుపరి
కిరి కిరి కిరి కిరి ఇక చాలోయ్ చాలోయ్ గడసరి

చరణం : 1
ఆడా ఇడా ఇమ్మంటే నీడ మిద ముద్దిస్తావు ఆటాడేద్దాం రమ్మంటే
నై నై నై నై నై నై పోను పోను పోనంటే ఫోనులేనే ముద్దిస్తాను పై పై
కెళదాం పదమంటే
నై నై నై నై నై నై అబ్టా అబ్టా చేస్తుంటే తలనొప్పిగుందని అంటావు
మంటై వెంటై పడుతుంటే ఇది మంచి రాస కాదంటాను
ఆడాళ్ళంతా ఎప్పుడూ ఇంతే హరి హరి హరి హరి నువ్వు చాలా చాలా పొదుపరి
కిరి కిరి కిరి కిరి ఇక చాలోయ్ చాలోయ్ గడసరి

చరణం: 2
చేతికి ముద్దే పెట్టేస్తే చెంప మీద ఇమ్మంటావు చెంపకి ముద్దే రుద్దేస్తే
తకతై తై తకతై తై
నోటికి ముద్దే అందిస్తే గీత దాటి రమ్మంటావు గీతే దాటి నువ్వొస్తే
తకతై తై తకతై తై
సిగ్గు బిడియం ఇవ్వడమూ నోకు దాగి మరి నవ్వడమూ మరి మగవాళ్ళంతా
ఎప్పుడూ ఇంతే