Showing posts with label Navadeep. Show all posts
Showing posts with label Navadeep. Show all posts

ఆర్య2(2009)



చిత్రం: ఆర్య-2 (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: బాలాజి
గానం: కె.కె


ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో
తీయనైన ఈ బాధకీ ఉప్పు నీరు కంట దేనికో
రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో
ఓ నిన్ను చూసే ఈ కళ్ళకీ లోకమంత ఇంక ఎందుకో
రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో

I Love You... నా ఊపిరి ఆగిపోయినా
I Love You... నా ప్రాణం పోయినా
I Love You... నా ఊపిరి ఆగిపోయినా
I Love You... నా ప్రాణం పోయినా


ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో

కనులలోకొస్తావు కలలు నరికేస్తావు
సెకనుకోసారైనా చంపేస్తావూ
మంచులా ఉంటావు మంట పెడుతుంటావు
వెంటపడి నా మనసు మసి చేస్తావూ
తీసుకుంటె నువ్వు ఊపిరీ పోసుకుంట ఆయువే చెలీ
గుచ్చుకోకు ముళ్ళులా మరీ గుండెల్లో సరా సరీ !

I Love You... నా ఊపిరి ఆగిపోయినా
I Love You... నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో

చినుకులే నిను తాకీ మెరిసిపోతానంటే
మబ్బులే పోగేసి కాల్చెయ్యనా
చిలకలే నీ పలుకూ తిరిగి పలికాయంటే
తొలకరే లేకుండా పాతెయ్యనా
నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూలతోటనే
నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే !

I Love You... నా ఊపిరి ఆగిపోయినా
I Love You... నా ప్రాణం పోయినా
I Love You... నా ఊపిరి ఆగిపోయినా
I Love You... నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో


*********  *********   *********


చిత్రం: ఆర్య-2 (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: దేవిశ్రీ ప్రసాద్

ఛ… వాడికి నా మీద ప్రేమే లేదు హి డసంట్ లవ్ మి యు నో
నో హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్
అవునా ఎంత? ఊ... ఎంతంటే
ఆ మొదటి సారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టి కోపమంత
మొదటి సారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టి ద్వేషమంత
మొదటి సారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టి దోషమంత
చివరిసారి నీకు నిజం చెప్పినపుడు తీరినట్టి భారమంత
ఓ... ఇంకా...
హో తెల్ల తెల్లవారి పల్లెటూరిలోన
అల్లుకున్న వెలుగంత
పిల్ల లేగదూడ నోటికంటుకున్న ఆవు పాల నురగంత
హో చల్ల బువ్వలోన నంజుకుంటు తిన్న ఆవకాయ కారమంత
పెళ్లి ఈడుకొచ్చి తుళ్ళి ఆడుతున్న ఆడపిల్ల కోరికంత

బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్
బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్

హే అందమైన నీ కాలి కింద తిరిగే నేలకున్న బరువంత
నీలి నీలి నీ కళ్ళలోన మెరిసే నింగికున్న వయసంత
చల్లనైన నీ శ్వాసలోన తోణికే గాలికున్న గతమంతా
చుర్రుమన్న నీ చూపులోన ఎగసే నిప్పులాంటి నిజమంత

బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు,  లవ్స్ యు సో మచ్
బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్

హాయ్ పంటచేలలోని జీవమంత ఘంటసాల పాట భావమంత
పండగొచ్చినా పబ్బమోచ్చినా వంటశాలలోని వాసనంత
కుంభకర్ణుడి నిద్దరంత ఆంజనేయుడి ఆయువంత
కృష్ణ మూర్తిలో లీలలంత రామలాలి అంత

బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు,  లవ్స్ యు సో మచ్
బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్

పచ్చి వేప పుల్ల చేదు అంత రచ్చబండ పైన వాధనంత
అర్ధమైన కాకపోయినా భక్తికొద్ది విన్న వేదమంత
ఏటి నీటిలోని జాబిలంత ఏట ఏట వచ్చే జాతరంత
ఏకపాత్రలో నాటకాలలో నాటు గోలలంత

బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు,  లవ్స్ యు సో మచ్
బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్

అల్లరెక్కువైతే కన్నతల్లి వేసే మొట్టికాయ చనువంత
జల్లుపడ్డ వేళ పొంగి పొంగి పూసే మట్టిపూల విలువంత
హో బిక్కు బిక్కు మంటు పరీక్ష రాసే పిల్లగాడి బెదురంత
లక్షమందినైన సవాలు చేసే ఆటగాడి పొగరంత

బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్
బేబి బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు,  లవ్స్ యు టూ మచ్

ఎంత దగ్గరైన నీకు నాకు మధ్య ఉన్న అంతులేని దూరమంత
ఎంత చేరువైన నువ్వు నేను కలిసి చేరలేని తీరమంత
ఎంత ఓర్చుకున నువ్వు నాకు చేసే జ్ఞాపకాల గాయమంత
ఎంత గాయమైన హాయిగానే మార్చే మా తీపి స్నేహమంత

బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్
బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, ఐ లవ్ యు సో మచ్


*********  *********   *********


చిత్రం: ఆర్య-2 (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: వనమాలి
గానం: కునల్ గంజువాలా, మేఘా

ఓ... ఓ... ఓ... ఓ...
ఓ... ఓ... ఓ... ఓ...

కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై
ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమా

కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా

ఓ... ఓ... ఓ... ఓ...

పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను
ఇరుతీరాల్లో దేనికి చేరువ కాను
నిదురను దాటి నడిచిన ఓ కల నేను
ఇరుకన్నుల్లో దేనికి సొంతం కాను
నా ప్రేమే నేస్తం అయ్యిందా ఓ
నా సగమేదో ప్రశ్నగ మారిందా ఓ
నేడీ బంధానికి పేరుందా ఓ
ఉంటే విడదీసే వీలుందా ఓ

కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా

హే... హే... హే... హే...
హే... హే... హే... హే... హే... హే

అడిగినవన్నీ కాదని పంచిస్తూనే
మరునిముషంలో అలిగే పసివాడివిలే
నీ పెదవులపై వాడని నవ్వుల పువ్వే
నువు పెంచవా నీ కన్నీటిని చల్లి
సాగే మీ జంటని చూస్తుంటే ఓ
నా బాధంతటి అందంగా ఉందే ఓ
ఈ క్షణమే నూరేళ్ళవుతానంటే ఓ
మరుజన్మే క్షణమైనా చాలంతే ఓ

కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై
ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమ

ఓ... ఓ... ఓ... ఓ...
ఓ... ఓ... ఓ... ఓ...



*********  *********   *********


చిత్రం: ఆర్య-2 (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: వనమాలి
గానం: సాగర్

కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై
ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమా

కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా

ఓ... ఓ... ఓ... ఓ...

పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను
ఇరుతీరాల్లో దేనికి చేరువ కాను
నిదురను దాటి నడిచిన ఓ కల నేను
ఇరుకన్నుల్లో దేనికి సొంతం కాను
నా ప్రేమే నేస్తం అయ్యిందా ఓ
నా సగమేదో ప్రశ్నగ మారిందా ఓ
నేడీ బంధానికి పేరుందా ఓ
ఉంటే విడదీసే వీలుందా ఓ

కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా

ఓ... ఓ... ఓ... ఓ...


*********    *********   *********


చిత్రం: ఆర్య-2 (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: కేదారినాథ్ పరిమి
గానం: బాబా షెహగల్, దేవిశ్రీ ప్రసాద్


హే టిప్పుటాపు దొర కదిలిండో
ఎవరికి వీడు దొరకడు లెండో
ముదురండో గడుసండో తొడిగిన ముసుగండో
ఉప్పుకప్పు రంబు నొక్క లుక్కునుండో
వీడి లుక్కు చూసి మోసపోకండో
ఎదవండో బడవండో వలలో పడకండో

కమాన్ కమాన్ మోస్ట్ కన్నింగు
కమాన్ కమాన్ మస్తు టైమింగు
కమాన్ కమాన్ రైటులలొరాంగు ఏ యాయి యయ్యో
కమాన్ కమాన్ కోతలల కింగు
కమాన్ కమాన్ మార్చె తన రంగు
కమాన్ కమాన్ పక్కా ప్లానింగు ఏ యాయి యయ్యో

మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్

మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్

హో వీడో పెద్ద వెదవ ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు
వీడి గురించి చెప్పి చెప్పి నాలికంతా కందిపోయింది
కానీ ఎవడూ నమ్మడు పైగా ఈ రోజుల్లో
ఇలాంటోళ్ళకు డిమాండ్ కొంచెం ఎక్కువ
అయినా ఇంకోసారి ట్రై చేస్తా
తప్పకుండా వీడి తాటతీస్తా

సారీ నేను గుడ్ బాయ్ లా ఉండాలనుకొంటున్నాను
అందుకే అందరిముందు కాల్చను

హిప్పులూపుతున్న క్యాటు వాకులండో
క్రోకడైల్ వీడు కాలు జారకండో
బ్రూటండో బ్రైటండో లైఫే చూస్తుండో
మేడి పండులాంటి మ్యాన్ వీడండో
మ్యాన్ హోల్ లాంటి మైండు వీడిదండో
చీటండో చీపండో గజిబిజి పజిలండో

కమాన్ కమాన్ హీస్ గాట్ ఎ బాగ్ ఆఫ్ ట్రిక్స్
కమాన్ కమాన్ బివేర్ యు ట్వెంటీ చిక్స్
కమాన్ కమాన్ హార్టు హైజాకరు నమ్మొద్దే
కమాన్ కమాన్ హీస్ ద జ్యాదుగర్
కమాన్ కమాన్ హి గీవ్స్ యు ఫీవర్
కమాన్ కమాన్ హీస్ ద కూల్ క్రాకర్ తాకొద్దే హే

మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్

మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్

మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ (2)

కమాన్ కమాన్ ఓరి గోవిందో
కమాన్ కమాన్ వీడు గురివిందో
కమాన్ కమాన్ సందు దొరికిందో దోచేస్తాడయ్యో
కమాన్ కమాన్ హరియవో సాంబో
కమాన్ కమాన్ రేగింది పంబో
కమాన్ కమాన్ వీడ్ని ఆపాలి మేనకో రంభో
మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్
మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్



********    ********   *********



చిత్రం: ఆర్య-2 (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: కేదారినాథ్ పరిమి

       *****  (DSP Remix) ******

Yo Everybody  such  a feet on the floor
this DSP and Aarya once more

మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్
మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్

హే టిప్పుటాపు దొర కదిలిండో
ఎవరికి వీడు దొరకడు లెండో
హే టిప్పుటాపు దొర కదిలిండో
ఎవరికి వీడు దొరకడు లెండో
ముదురండో గడుసండో తొడిగెను ముసుగండో
ఉప్పుకప్పు రంబు నొక్క లుక్కునుండో
వీడి లుక్కు చూసి మోసపోకండో
ఎదవండో బడవండో వలలో పడకండో

కమాన్ కమాన్ మోస్ట్ కన్నింగు
కమాన్ కమాన్ మస్తు టైమింగు
కమాన్ కమాన్ రైటులలొరాంగు ఏ యాయి యయ్యో
కమాన్ కమాన్ కోతలల కింగు
కమాన్ కమాన్ మార్చె తన రంగు
కమాన్ కమాన్ పక్కా ప్లానింగు ఏ యాయి యయ్యో

మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్

మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్

హో వీడో పెద్ద వెదవ ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు
వీడి గురించి చెప్పి చెప్పి నాలికంతా ఎండిపోయింది
కానీ ఎవడూ నమ్మడు పైగా ఈ రోజుల్లో
ఇలాంటోళ్ళకు డిమాండ్ కొంచెం ఎక్కువ
అయినా ఇంకోసారి ట్రై చేస్తా
తప్పకుండా వీడి తాటతీస్తా

హిప్పులూపుతున్న క్యాటు వాకులండో
క్రోకడైల్ వీడు కాలు జారకండో
బ్రూటండో బ్రైటండో లైఫే చూస్తుండో
మేడి పండులాంటి మ్యాన్ వీడండో
మ్యాన్ హోల్ లాంటి మైండు వీడిదండో
చీటండో చీపండో గజిబిజి పజిలండో

కమాన్ కమాన్ హీస్ గాట్ ఎ బాగ్ ఆఫ్ ట్రిక్స్
కమాన్ కమాన్ బివేర్ యు ట్వెంటీ చిక్స్
కమాన్ కమాన్ హార్టు హైజాకరు నమ్మొద్దే
కమాన్ కమాన్ హీస్ ద జ్యాదుగర్
కమాన్ కమాన్ హి గీవ్స్ యు ఫీవర్
కమాన్ కమాన్ హీస్ ద కూల్ క్రాకర్ తాకొద్దే హే

మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్

మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్

కమాన్ కమాన్ ఓరి గోవిందో
కమాన్ కమాన్ వీడు గురివిందో
కమాన్ కమాన్ సందు దొరికిందో దోచేస్తాడయ్యో
కమాన్ కమాన్ హరియవో సాంబో
కమాన్ కమాన్ రేగింది పంబో
కమాన్ కమాన్ వీడ్ని ఆపాలి మేనకో రంభో

మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు
మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్

Yo Everybody  such  a feet on the floor
DSP will sing song more

Comon Everybody lets burn the floor DSP and Aarya once more



*********  *********   *********


చిత్రం: ఆర్య-2 (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: రంజిత్

మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్

పోయే పోయే లవ్వే పోయే పోతే పోయిందే
ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
పోయే పోయే లడికీ పోయే పోతే పోయిందే
ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
వెలుగంతా ఆరిపోయే కథ మారిపోయే
ఇక చీకటెంత బాగుందే
గెలుపంతా జారిపోయే నన్ను వీడిపోయే
ఇక ఓటమెంత బాగుందే

మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్

ఏ గలాసు వదిలిపోతుందే గొలుస్సు విరిగిపోతుందే
గులాబి రాలిపోతుందే లవ్ పోతే పోయిందే
సరస్సు నిండిపోతుందే సోగస్సు కరిగిపోతుందే
మనిషి లైఫే పోతుందే లవ్ పోతే పోయిందే
తలనొప్పి పారిపోయే శ్రమ తీరిపోయే
ఇక శూన్యమెంత బాగుందే
మది నొప్పి ఆరిపోయే పెదవాగిపోయే
ఇక మౌనమెంత బాగుందే...

మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్

హానెస్టుగుండే పనిలేదే ది బెస్టుగుండే పనిలేదే
హాబిట్సు మార్చే పనిలేదే ఏం మార్చే పనిలేదే
కెమిస్ట్రి కలిసే పనిలేదే కెరియరు మలిచే పనిలేదే
కెరాఫ్ తెలిపే పనిలేదే కేరింగ్తో పనిలేదే
ప్రేమించి గెలిచినోళ్ళు షాది జరిగినోళ్ళు ఇళ్ళల్లోనా మిగులుతారే
లవ్ చేసి ఓడినోడు లోకాన్నేలుతాడు హిస్టరీలోన వెలుగుతాడే...

మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్


*********  *********   *********


చిత్రం: ఆర్య-2 (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: ప్రియ హమేశ్

ఓ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే
హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే (2)
పాషు పాషు పరదేశి నేను ఫారిన్ నుంచి వచ్చేసాను
హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే (2)

రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ వదిలేసాను
హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే (2)
ఎయిర్ బస్సు ఎక్కి ఎక్కి రోతే పుట్టి ఎర్ర బస్సు మీద నాకు మోజే పుట్టి
ఎర్రకోట చేరినాను చేరినాక ఎదురు చూసినా
ఎవరి కోసం!

బోడి మూతి ముద్దులంటే బోరే కొట్టి కోరమీస కుర్రగాళ్ళ ఆరా పట్టి
బెంగుళూరు కెల్లినాను మంగళూరు కెల్లినాను
బీహారు కెల్లినాను జైపూరు కెల్లినాను
రాయలోరి సీమకొచ్చి సెట్ అయ్యాను
ఓహో మరిక్కడి కుర్రోల్లేం చేశారు?
కడపబాంబు కన్నులతో యేసి కన్నెకొంప పేల్చేసారు అమ్మనీ
హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే
వేట కత్తి ఒంట్లోన దూసి సిగ్గుగుత్తి తెంచేశారు
హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే
వాయించెహె

హే రింగ రింగా రింగా రింగ రింగా రింగా (2)

ఇదిగో తెల్లపిల్ల అదంతా సరేగాని అసలు ఈ రింగ రింగ గోలేంటి?
అసలుకేమో నా సొంత పేరు యాండ్రియానా స్పైసో రింగా
హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే
పలకలేక ఈల్లెట్టినారు ముద్దుపేరు  రింగా రింగా
హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే

జీన్స్ తీసి కట్టినారు ఓణీ లంగా పాపినారు పెట్టినారు సవరం బాగా
రాయిలాగా ఉన్న నన్ను రంగసాని చేసినారుగా
ఇంగ్లీషు మార్చినారు ఎటకారంగా!
ఇంటి యెనకకొచ్చినారు యమకారంగా
ఒంటిలోని వాటరంతా చెమటలాగ పిండినారు
ఒంపులోని అత్తరంత ఆవిరల్లే పీల్చినారు
ఒంపి ఒంపి సొంపులన్నీ తాగేశారు
అయిబాబోయ్ తాగేశారా? ఇంకేం చేశారు?
పుట్టుమచ్చలు లేక్కేట్టేశారు లేని మచ్చలు పుట్టించారు
హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే
ఆఁ ఉన్న కొలతలు మార్చేసినారు రాని మడతలు రప్పించారు

హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే

ఇదిగో ఫారిన్ అమ్మాయి ఎలా ఉందేటి మన కుర్రాళ్ళ పవర్?
హా పంచకట్టు కుర్రాల్లలోని పంచ్ నాకు తెలిసొచ్చింది
హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే
ముంతకల్లు లాగించేటోల్ల స్ట్రెంగ్త్ నాకు తెగ నచ్చింది

హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే

నీటి బెడ్ సరసమంటే గర్రు గర్రు నులకమంచమంటే ఇంకా కిర్రు కిర్రు
సుర్రుమన్న సీనులన్ని ఫోన్లో ఫ్రెండ్స్ తోటి చెప్పినా
చెప్పెసావేటి?
ఫైవ్ స్టార్ హోటల్ అంటే కచ్చా బిచ్చా
పంపు సెట్టు మేటర్ ఐతే రచ్చో రచ్చా
అన్నమాట చెప్పగానే ఐర్లండు గ్రీన్లాండు, న్యూజిలాండు, నెదర్లాండు థాయ్ లాండు
ఫిన్ లాండు అన్ని లాండుల పాపలీడ ల్యాండ్ అయ్యారు
లాండయ్యరా! మరి మేమేం చెయ్యాలి?
హాండు మీద హాన్డేసేయ్యండీ లాండు కబ్జా చేసేయ్యండీ

హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే
హాండు మీద హాన్డేసేస్తామే లాండు కబ్జా చేసేస్తామే
హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే
హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే

చందమామ (2007)


చిత్రం: చందమామ (2007)
సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్
గీతరచయిత: సుద్దాల అశోక్ తేజ
నేపధ్య గానం: కార్తీక్, ఎం. ఎం. శ్రీలేఖ, నోయెల్

పల్లవి:

రేగుముల్లోలే నాటు సిన్నాది బొడ్డు మల్లెలు సూడు అన్నాది
మీసాలు గుచ్చకుండా ఆఁహాఁ ఒరేయ్ బావో ముద్దాడుతావా అంది
కంది పూవల్లె ముట్టుకుంటాను కందిరీగల్లె కుట్టిపోతాను
కుచ్చిళ్ళు జారకుండా ఒరేయ్ బావో కౌగిళ్ళు ఇవ్వు నువ్వు
నీ నడుముకెంత పొగరబ్బా అది కదులుతుంటే వడదెబ్బ
నువు కెలకమాకు మనసబ్బా ఇక నిదుర రాదు నీయబ్బ
మీసాలు గుచ్చకుండా...
 

Come on Come on Come on Baby 
Shake your body baby 
Come on Come on Come on Baby 
Make me rock 
Come on Come on Come on Baby 
Save the song baby 
Come on Come on Come on Baby 
Make you rock 

చరణం 1:

కోనేటి నీళ్ళల్లో ఆ ఆ వంగిందిరో ఆ ఆ
కుండల్లే నా గుండె ముంచిందిరో
తను తడిసిందిరో నను తడిపిందిరో
ఆ పిట్ట గోడెక్కి నుంచుందిరో
కొమ్మొంచి కాయేదో తెంపిందిరో
అది జాంపండులా నను తింటుందిరో
ఎదురే పడితే ఎదలో గుండు సూదల్లె దిగుతావురో
తన కనులు గిలికి సింగారి ఛా! తన జడను విసిరి వయ్యారి ఆఁహాఁ
చిరు నగవు చిలికి ఒకసారి అబ్బో! కొస పెదవి కొరికి ప్రతిసారి
యహ మీసాలు గుచ్చకుండా ఒరేయ్ బావో ముద్దడతావా నువ్వు

మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళరా
మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళ వస్తివా
మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళరా
మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళ వస్తివా

చరణం 2:

ఆ జొన్న చేలల్లో పక్కందిరో
ఒళ్ళోన చెయ్యేస్తే సిగ్గందిరో
బులుపే తీరక కసి ఊరిందిరో
ఓసారి నాతోనే సై అంటేరో
దాసోహమౌతాను నూరెళ్ళురో
ఇక తన కాళ్ళకే పసుపవుతానురో
ఇదిగో పిల్లడో నువ్వు గుండెల్లో ప్రాణాలు తోడొద్దురో
నీ నడుము పైన ఒక మడతై పై జనమలోన ఇక పుడతా
అని చెలిమి చేరి మొర పెడితే తెగ కులుకులొలికి ఆ సిలక
మీసాలు గుచ్చకుండా ఒసేయ్ భామ ముద్దాడలేనే నేను

కంది పూవల్లె ముట్టుకుంటాను అహ కందిరీగల్లె కుట్టిపోతాను
కుచ్చిళ్ళు జారకుండా ఒరేయ్ బావో కౌగిళ్ళు ఇవ్వు నువ్వు
మీసాలు గుచ్చకుండా ఒరేయ్ బావో
మీసాలు గుచ్చకుండా ఒరేయ్ బావో
ముద్దాడుతావా అంది

చిత్రం: చందమామ (2007) 
సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్ 
గీతరచయిత: సాయి శ్రీహర్ష 
నేపధ్య గానం: హరిచరణ్, సుజాత 

పల్లవి: 

ముక్కుపై ముద్దు పెట్టు ముక్కెరై పోయేట్టు 
చెంపపై ముద్దు పెట్టు చెక్కరై పోయేట్టు 
మీసంపై ముద్దు పెట్టు మీదికే దూకేట్టు 
గడ్డంపై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు 

రరర రరర రరర... 

చరణం 1: 

మొదట నుదిటి మీద ఒక్క బొట్టు ముద్దు 
ఆ పిదప చెవికి చిన్న బుట్ట ముద్దు 
మత్తు మెడకు ఒక్క మొక్కజొన్న ముద్దు 
గమ్మత్తు గొంతుకొక్క సన్నజాజి ముద్దు 
బుగ్గ పండు కోరికేసే రౌడీ ముద్దు 
కొంటె ఈడు కాజేసే కేడి ముద్దు 
కంత్రి ముద్దు జగజ్జంత్రి ముద్దు 
కంత్రి ముద్దు జగజ్జంత్రి ముద్దు 
ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ఆ ఆ ఆ 
ముక్కుపై ముద్దు పెట్టు... 

చరణం 2: 

వగల నడుము మడత మీద వడ్డాణం ముద్దు 
ఈ నాభి చుట్టూ వేడి సెగల సిగ్గాణం ముద్దు 
ఓంటి వన్నె చిన్నె విన్నపాల ముద్దు 
పువ్వంటి కన్నెకొక్క జున్నుపాల ముద్దు 
అల్లరాణి వల్ల కానిగా అల్లరి ముద్దు 
అల్లసాని పద్య మంత అల్లిక ముద్దు 
ఆవకాయ్ ముద్దు ఆది ఆంధ్రా ముద్దు 
ఆవకాయ్ ముద్దు ఆది ఆంఢ్రా ముద్దు 
ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ఆ ఆ ఆ 

ముక్కుపై ముద్దు పెట్టు మీదికే దూకేట్టు 
చెంపపై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు ఆ ఆ ఆ 
ముక్కుపై ముద్దు పెట్టు..
చిత్రం: చందమామ (2007) 
సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్ 
గీతరచయిత: పెద్దాడ మూర్తి 
నేపధ్య గానం: రాజేష్ 

పల్లవి: 

పచ్చిపాల యవ్వనాల గువ్వలాట 
పంచుకుంటే….. రాతిరంతా జాతరంట 

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మా 
ఒళ్ళె వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా 
పట్టుచీరల్లో చందమామ .. 
ఏడువన్నెల్లో వెన్నెలమ్మా 
కన్నెరుపాన కోనసీమ … 
కోటితారల్లో ముద్దుగుమ్మా.. 
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మా 
ఒళ్ళె వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా 

యాలో యాల యేలో యేలో…యాలో యాలా యేలెలో.. 
యాలో యాల యేలో యేలో…యాలో యాలా యేలెలో.. 

చరణం 1: 

ఎదురే నిలిచే అధర మధుర దరహాసం 
ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం 
వెలిగే అందం…..చిలికే సొంతం ..వసంతం 
వరమై దొరికే అసలు సిసలు అపురూపం 
కలిసే వరకు….కలలో జరిగే విహారం 

పుష్యమాసానా మంచునీవో 
భోగిమంటల్లో వేడినీవో 
పూల గంధాల గాలినీ..వో 
పాలనురగల్లో తీపినీవో 

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మా 

చరణం 2: 

హెరె వె గొ... 

నాగమల్లి పూలతోన నంజుకున్న ముద్దులార 
సందెగాలి కొట్టగానె అరుబైట ఎన్నెలంతా 
సద్దుకున్న కన్నెజంట సద్దులాయెరో... ఒ... 
నారుమల్ల తోటకాడ నాయుడోరి ఎంకిపాట 
నాగమల్లి పూలతోన నంజుకున్న ముద్దులార 
సందెగాలి కొట్టగానే ఆరుబయట ఎన్నెలంతా 
సద్దుకున్న కన్నెజంట సద్దులాయెరో 

చరణం 3: 

ఎదలో జరిగే విరహ సెగల వనవాసం 
బదులే అడిగే మొదటి వలపు అభిషేకం 
వధువై బిడియం …ఒదిగే సమయం..ఎపుడో… 
జతగా పిలిచే అగరు పొగల సహవాసం 
జడతో జగడం…..జరిగే సరసం ….ఎపుడో 
అన్నిపువ్వుల్లో ఆమె నవ్వే….. 
అన్ని రంగుల్లో ఆమె రూపే.. 
అన్ని వేళల్లో ఆమె ధ్యాసే…. 
నన్ను మొత్తంగా మాయచేసే.. 

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మా 
ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా 
పట్టుచీరల్లో చందమామ .. 
ఏడువన్నెల్లో వెన్నెలమ్మా 
కన్నెరుపాన కోనసీమ … 
కోటితారల్లో ముద్దుగుమ్మా..


చిత్రం: చందమామ (2007) 
సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్ 
గీతరచయిత: అనంత శ్రీరామ్ 
నేపధ్య గానం: ఆషా భోంస్లే, కె.ఎం. రాధాకృష్ణన్ 

పల్లవి: 

ధీం తనక ధీం తకిటత ధీం తనక ధీం 
ధీం తనక ధీం తకిటత ధీం తనక ధీం 
ధీం తనక ధీం తకిటత ధీం తనక ధీం 
తరికిటతోం తనకధీం తంగిట తరికటతక 
తానిదానిదా తానిదానిదా 
గమద సనిద ఆ... 
ధీం తనక ధీం తకిటత ధీం తనక ధీం 
ఆ ఆ ఆ ఆ ఆ 
సనిసస నినిస నిస ససనిసస నినిసస 

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు 
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు 
పరుగులుగా పరుగులుగా అవే ఇలా 
ఇవ్వాళ నిన్నే చేరాయి 
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు 

చరణం 1: 

ససనిపస ససనిపిరి 
ససనిపస ససనిపిరి 
ససనిపస ససనిపిరి 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే 
పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే 
శ్వాసలోన పెనుతుఫానై ప్రళయమౌతోందిలా ఆ ఆ 

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు 
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు 

చరణం 2: 

ఆ ఆ ఆ ఆ ఆ 
గరిగ మమగ గరిగ మమగరిసని 
తరికిటతోం తరికిటతోం 
తరికిటతోం తరికిటతోం 
తరికిటతరికిటతోం తరికిటతరికిటతోం తరికిటతోం 
ఆ ఆ ఆ ఆ 
మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ 
మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ 
నిన్ను చూస్తూ ఆవిరౌతూ అంతమవ్వాలనీ 

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు 
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు 
పరుగులుగా పరుగులుగా అవే ఇలా 
ఇవ్వాళ నిన్నే చేరాయి 
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు