Showing posts with label కీలుగుఱ్ఱం (1949). Show all posts
Showing posts with label కీలుగుఱ్ఱం (1949). Show all posts

కీలుగుఱ్ఱం (1949)

చిత్రం: కీలుగుఱ్ఱం (1949)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: తాపీ ధర్మారావు
నేపధ్య గానం: ఘంటసాల, శ్రీదేవి


పల్లవి:

ఎంత కృపామతివే ..భవాని...ఎంత దయానిధివే
ఎంత కృపామతివే ..భవాని...ఎంత దయానిధివే


చరణం 1:

కత్తివాదరకు బలిగానుండే
కన్యకు గూర్చితి కళ్యాణ మహా...
కన్యకు గూర్చితి కళ్యాణ మహా
ఎంత కృపామతివే ..భవాని...ఎంత దయానిధివే

చరణం 2:

ఏదో పనిపై ఏగే వానికి...
ఏదో పనిపై ఏగే వానికి ..ఈ విద్యావతి ఈ మనోహారిణి
ఇచ్చి నన్ను కరుణించితివా... హహ...విద్యావతి.....!
ఎంత కృపామతివే ..భవాని...ఎంత దయానిధివే


చరణం 3:

నూతనముగా ఈ లేత మారుతము
నూతనముగా ఈ లేత మారుతము
గీతా గానము చేయుగదా...
హృదయ తంత్రులను కదలించుటచే
హృదయ తంత్రులను కదలించుటచే ..వదలిన గానమో... ఏమో
వదలిన గానమో... ఏమో...
ప్రణయ దేవతలు పాడుచు నుండే సామ గానమే ఏమో...
ప్రణయ దేవతలు పాడుచు నుండే సామ గానమే ఏమో...సామ గానమే ఏమో...