Showing posts with label 2017. Show all posts
Showing posts with label 2017. Show all posts

యుద్ధంశరణంగచ్ఛామి (2017)




చిత్రం : యుద్ధంశరణంగచ్ఛామి (2017)
సంగీతం : వివేక్ సాగర్  
సాహిత్యం : కిట్టు విస్సాప్రగడ    
గానం : ట్రేసీ థార్టన్

అదేదో మాయల్లే 
అలా అలా అల్లిందా 
ఎద ఎదో లోయల్లో 
ఇలా జారింది మెల్లగా 

ఆ ఆ ఆకాశం వాలే 
కళ్ళలోన దాగితే 
చూపుల్లో చూపే 
అలాగే మెరుపు తీగల్లె 

ఆ అందాలే 
అమర్చి చూపిందా 
సూదల్లే గుండె 
గుచ్చి గుచ్చి చంపుతూ

కంగారే దాహంగా మారిందా 
గుటక వేసి చూస్తుంటే 
మోమాటం అడ్డమొచ్చి ఆరాటం 
అయ్యో ఊహలతో సద్దుకుందిగా 

అయ్యో అయ్యో చెయ్యి జారుతున్నా 
ప్రాణం తానే అందుకుందా 
ఏదో ఏదో హాయి చేరుతున్నా 
తీరే కొత్తగా తోచిందా 

సైగలో దాగిన భావం తెలియాలంటే 
భాషకే అందని విధంగా మనమే చేరి 
ఈ పెదవిపై తాకేలా 

మోమాటం అడ్డమొచ్చి ఆరాటం 
అయ్యో ఊహలతో సద్దుకుందిగా 
మోమాటం అడ్డమొచ్చి ఆరాటం 
ఏదో ఊహలతో సద్దుకుందిగా

రాజా ది గ్రేట్ (2017)

చిత్రం: రాజా ది గ్రేట్ (2017)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: ఎల్.వి.రేవంత్ , సాకేత్, రవితేజ


రాజా రాజా రాజా ది గ్రేట్ రా
హే తళ తళ టు థౌజండ్ నోటురా

రాజా రాజా రాజా ది గ్రేట్ రా
నువు తళ తళ టు థౌజండ్ నోటురా
హే రాజా రాజా రాజా ది గ్రేట్ రా
నువు అడుగేస్తే మారేది ఫేట్ రా
బ్లాక్ అండ్ వైట్ గున్న ఈ స్టిక్ లా
కలరే నింపుకున్న మా లైఫుతో
నువు కళ్లులేని వాడివని
నోర్ ముయ్ ఇప్పుడు టాపిక్ అవసమా
ఏం - ఇప్పుడది లేకుండా పాడలేవా
సారి గురు

డబుకు డిబుకు డబుకు డిబుకు  డప్పులే
ఆడిరిపోద్ది మేమేస్తే స్టెప్పులే
హే డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే
ఇంక బోలెడుంది మనదగ్గర స్టఫ్ లే

డబుకు డబుకు హే డబుకు డబుకు (2)

మా ట్రంఫ్ గాడు నువ్వేరో
ఆ వరల్డ్ కప్ నువ్వేరో
ట్రంఫ్ గాడు నువ్వేరో వరల్డ్ కప్ నువ్వేరో
గ్రౌండ్ నువ్వే బ్యాక్గ్రౌండ్ నువ్వే
మీరేసే విజిలే నా టానిక్
నను మోస్తున్న మీ బుజాలె టైటానిక్
భజనే చేస్తుంటే ఎక్కెర కిక్కు
ఇదే ఊపులోన వెలిపోదాం బొళ్లం కిక్కు
ఈడి చూపు సునామి
ఆపేహ్ ఎక్కడుందిరా చూపు
లేనిది పొగదొడ్డు ఉన్నది మాత్రమే పొగడండి

డబుకు డిబుకు డబుకు డిబుకు  డప్పులే
ఆడిరిపోద్ది మేమేస్తే స్టెప్పులే
హే డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే
ఇంక బోలెడుంది మనదగ్గర స్టఫ్ లే స్టఫ్ లే

నిను ఊరు వాడ తిప్పేత్తాం
నీకు ఫ్లెక్స్ లెన్నో కట్టేత్తాం
నిను ఊరు వాడ తిప్పేత్తాం విగ్రహాలు పెట్టేత్తం
ఇదిగో మైక్ యూత్ కి క్లాసే పీకు
మనమే అవ్వాలిర ఓ టాపిక్
మన సూరిట్లో రావాలిర బయో కిక్కు
కొట్టారా  కొట్టారా కొట్టో కొట్టు
మనపై ఉండాలిరా అందరి కిక్కు
అపుడు ఆటోమేటిక్ గా ఎక్కేస్తాం గిన్నిస్ బుక్

ఈడు చెయ్యేస్తే...
డౌటెందుకు రా చేతులైతే రెండూ ఉన్నాయి కంటిన్యూ
ఈడు చెయ్యేస్తే ఎంతైనా లక్ లే కిక్కు లే

డబుకు డిబుకు డబుకు డిబుకు  డప్పులే
ఆడిరిపోద్ది మేమేస్తే స్టెప్పులే
హే డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే
ఇంక బోలెడుంది మనదగ్గర స్టఫ్ లే

డబుకు డబుకు హే డబుకు డబుకు (2)



*******   *******   *******


చిత్రం: రాజా ది గ్రేట్ (2017)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: సాయి కార్తీక్

ఫ్లాష్.బాక్ లో నన్ను ఇడియట్
అని తిట్టిన సొదరులారా
చుసుకోండి నా జూలియట్ ని కన్నులారా

(ఏంట్రా మనకి అమ్మాయే పడదు
అన్నారు…ఇప్పుడు ఏమైందీ)

మా ఇంటి ముందు పోరీ
దాని పేరు మంగళ గౌరీ
నా ఫస్ట్ లవ్వు స్టొరీ
ప్రేమించ గౌరి చోరీ

ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో
దాని ఎనక ఎనక తిరిగినాను ఎన్ని సార్లో

కొట్టింది సైకిల్ బెల్లూ
కట్టిందిరా నా బిల్లూ
దాని ఘజ్జెలు ఘల్లు ఘల్లూ
జిలు జిల్లుమన్నది ఒల్లూ

ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో
లవ్వు లెటరులెన్నొ పెట్టా దాని పుస్తకాల్లో

చదువేమొ సెకండ్ ఇంటర్
నా వీస అపుదె ఎంతెర్
ఇక ముదురె లోపె మ్యటర్
చెడగొట్టినావుర పీటర్

నా ఫేసు కి లవ్వు వెస్తె అన్నావు ఎనియాలొ ఎన్నియలో
ఇప్పుడు నీ ఫేసు ఎక్కడ పెట్టుకుంటవ్ ఎనియాలొ యాలో

ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో
లక్కితోటె లక్కు కలిసొచ్చింది జిందగీలో

బి.కాం లోన రొజా
తెరిచింది లవ్ దర్వజా
ఎమ కాంగుండె రాజ
మోగించెయి బ్యాండు బాజా

ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో
సారు పడ్డాడయ్యొ రెండో సారి మల్లి ప్యార్లో

అంటింది శెంటు సొకూ
మారింది ఫ్రంటు బ్యాకు
తెచ్చాడు శీను బైకు
తిరిగాము సినిమా పార్కు

ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో
ముచ్చట్ట్లెన్నో ఆడినాము మేము లాండు ఫోన్లో

కట్ చెస్తె పెళ్ళి సీనూ
వరుడేమొ తోపు శీను
విరిగింది బ్యాకు బోనూ
మిగిలింది నాకు వైనూ

చాటుగ నన్ను చీటింగ్ చెసినవ్ ఎన్నియలొ ఎన్నియలో
ఈ స్టన్నింగ్ బ్యూటి మాటెమంటావ్ ఎన్నియాలొ యాలొ...


ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో
లక్కితోటె లక్కు కలిసొచ్చింది జిందగీలో

మనమేమొ సూపర్ హిట్టు
మన ప్రేమ కథలు ఫట్టు
మా అమ్మకొచ్చె డౌటు
తట్టము శాస్త్రి గేటు

ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో
హస్త రేఖలెన్నొ మస్తుగ చూసే బూతద్దాల్లో

ఫంచాంగం ఓపెన్ చెసి
ఏవేవొ లెక్కలు వేసి
చుసదు గురుడు రాసి
కుజ దోషం కన్.ఫర్మ్ చేసి

ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో
అస్సలు కన్యా యోగం లెదన్నాడు నా తలరాతలో

రాసాదు జాతక చక్రం
కోసాడు పాథిక యెకరం
చెసాడు యగ్నం యాగం
నా పైసలు అంతా ఆగం

స్వైపింగ్ చేసి లక్షలు నొక్కినవ్ ఎన్నియాలో ఎన్నియల్లో
గ్రహాలు కక్షలు తప్పి సక్కని సుక్కని దింపే నా వల్లో

ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో
లక్కితోటె లక్కు కలిసొచ్చింది జిందగీలో


*******   *******   *******


చిత్రం: రాజా ది గ్రేట్ (2017)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సమీరా భరద్వాజ్

నాకె నె నచ్చెస్తున్న
నాకె నె ముద్దొస్తున్న
నువ్వంటు నాలొకొచ్చి చెరాక

నన్నె ని కిచ్చెస్తున్న
నీ వైపే వచ్చెస్తున్న
నా మనసు నడిపిస్తున్న నీ దాక

ఇంకొ జన్మల్లె అనిపిస్తుంది సంతోషం
నెడె నీ లాగ ఎదురైంది నా కొసం
అడిగానని అనుకోకు రా
నన్ను నిలుపుకో నీ సరసనా

నాకె నె నచ్చెస్తున్న
నాకె నె ముద్దొస్తున్న
నువ్వంటు నాలొకొచ్చి చెరాక

చెక్కిల్లలో మందారమై
పరచుకున్నది బ్రుందావనం
ఎక్కిల్లలో రధమ్మలా
తలచుకుంది నిన్ను నా యవ్వనం

అన్ని భావాలు మాటల్లొన తెలేనా
అర్ధమయ్యెల నీతొ చెప్పుకొలేనూ
నువె తెలుసుకో జత కలుసుకో
నిన్ను కలవరించె కలలలో

నాకె నె నచ్చెస్తున్న
నాకె నె ముద్దొస్తున్న
నువ్వంటు నాలొకొచ్చి చెరాక

తుమ్మెదా ఝుం ఝుం తుమ్మెదా
ఈ నాల్లని వాడెంత ఆల్లరివాడె తుమ్మెదా
తుమ్మెదా ఝుం ఝుం తుమ్మెదా
నిండు నీలాల కన్నుల్లొ నిద్దర్ని దోచడె తుమ్మెదా

మీసాలు గుచ్చడె తుమ్మెదా
ముద్దు మొసాలు చెసాడె తుమ్మెదా
వాటెసుకున్నాడె తుమ్మెదా
వేడి వడ్డనం ఇచ్చడె తుమ్మెదా
తుమ్మెధ ఝుం ఝుం తుమ్మెదా
నిండు నీలాల కనుల్లొ నిద్దర్ని దోచడె తుమ్మెదా


*******   *******   *******


చిత్రం: రాజా ది గ్రేట్ (2017)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: యాజిన్ నజార్

అలబె అలబె అలబె
అలబె అలబె అలబె
చార్లి చాప్లిన్ నేనెగా
అలబె అలబె అలబె

ఫ్రెండు గైడు నీకు నేను కానా
నవ్వులెన్నో కానుకిచుకోనా
పండగల్లె నిన్ను మార్చుకోనా
ఎవరెక్కువ నీకన్నా

లైఫ్ అనేది లవ్లీ జాస్మీన్
సహజమెగ గాలి తూఫాన్
బెదిరిపోని పువ్వు లాగ బాధనే ఓర్చుకో

మొన్నలా మరి నిన్నే లేదె
నేటిలా ఏ రేపు రాదే
ఎవ్రిడే ఓ కొత్త పాఠం తప్పదు నెర్చుకో

కథ నడవదె నడవదు
కలగనే దిక్కులో
చిరు కలతలు నలతలు నలగవా
బ్రతుకనే లెక్కలో

అలబె అలబె అలబె
అలబె అలబె అలబె
చార్లి చాప్లిన్ నేనెగా
అలబె అలబె అలబె

ఫ్రెండు గైడు నీకు నేను కానా
నవ్వులెన్నో కానుకిచుకోనా
పండగల్లె నిన్ను మార్చుకోనా
ఎవరెక్కువ నీకన్నా

నక్షత్రం (2017)

చిత్రం: నక్షత్రం (2017)
సంగీతం: భీమస్ సెసిరోలె
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: భీమస్ సెసిరోలె


ఎ పాప ఏం పాపం చేసిందె నా గుండె
నీ అందం అంటించె మంటల్లొ చిక్కిందె

ఎ పాప ఏం పాపం చేసిందె నా గుండె
నీ అందం అంటించె మంటల్లొ చిక్కిందె

చల్లర్చె మేగం లాంటి ముద్దుల్తొ మందే
ఏ కొంచం దూరంగ ఉన్నా ఇబ్బందే...

ఆ చూపుతో నా కల్లనే తాగెయ్కే...
ఆ నవ్వుతో ప్రణాలనే తోడెయ్కే...

నువ్ ఈ పూటకి నాకందితే జీవితం అంతే...

అ పోయి పోయి నీ ఒంట్లో పడ్డా...
అ మళ్ళీ మళ్ళీ పైకెట్టా వస్తా

ఉన్నా ఉన్నా ఓ ఉక్కూ మనిషల్లే
నన్నే లాగే ఐస్కాంతం అయ్యవే
సంపేసెయ్ పర్లేదే ఇక ఇంకేం కావాలే...


*********   *********  ********



చిత్రం: నక్షత్రం (2017)
సంగీతం: భరత్ మధుసూదనన్
సాహిత్యం: శ్రీమణి
గానం: ఐశ్వర్య దాసరి, సాయి చరణ్

హెల్లొ పిల్లగాడ 420 మాయగాడా...
గుండెల్లోకె దూరి మా గుట్టే పట్టకు రా...
హెల్లొ పిల్లగాడ మా కల్లోకె వచ్చేయ్కు రా
మా సెల్లోకె నువ్ దూరి మరి సెల్ఫీ తియ్యకు రా...

ఆడపిల్లంటేనె అగ్గికే అడ్రస్ రా...
తట్టుకో గలననుంకుంటె టచ్చే చెయ్యరా...
కన్నె పిల్లంటేనే ఎన్నెన్నొ సీక్రెట్స్ రా...
తెలుసోకోవాలనుకుంటె ట్రయలే వెయ్యరా...

అమ్మమ్మమ్మొ కిల్లాడి ఇది ఆటంబాంబు లేడి
వెంటాడి వేటాడి నా గుండే పేల్చేరా...
అమ్మమ్మమ్మొ కిల్లాడి ఇది గోల్దెన్ చుక్కల లేడి
ఊరించి ఊరించి నా ఊపిరి తీసె తీసె

జిగేల్... జిగేల్... జిగేల్...

జిగేలంటు జిలుగులెన్నో చల్లుతున్నా నక్షత్రాన్ని
ఒక్కసరి తాకి చూడర...
విలాసాల కులాసాలె పరిమలించె సౌంధర్యాన్ని
జన్మ కొక్క సారి పొందరా...

అమ్మమ్మమ్మొ కిల్లాడి ఇది ఆటంబాంబు లేడి
వెంటాడి వేటాడి నా గుండే పేల్చేరా...
అమ్మమ్మమ్మొ కిల్లాడి ఇది గోల్దెన్ చుక్కల లేడి
ఊరించి ఊరించి నా ఊపిరి తీసె తీసె

ఆడపిల్లంటేనె అగ్గికే అడ్రస్ రా...
తట్టుకో గలననుంకుంటె టచ్చే చెయ్యరా...
కన్నె పిల్లంటేనే ఎన్నెన్నొ సీక్రెట్స్ రా...
తెలుసోకోవాలనుకుంటె ట్రయలే వెయ్యరా...

అమ్మమ్మమ్మొ కిల్లాడి ఇది ఆటంబాంబు లేడి
వెంటాడి వేటాడి నా గుండే పేల్చేరా...
అమ్మమ్మమ్మొ కిల్లాడి ఇది గోల్దెన్ చుక్కల లేడి
ఊరించి ఊరించి నా ఊపిరి తీసె తీసె




*********   *********  ********


చిత్రం: నక్షత్రం (2017)
సంగీతం: భీమస్ సెసిరోలె
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: భీమస్ సెసిరోలె , కాసర్ల శ్యామ్, రఘురాం

అహా... అహ... అహా...

హే లాయిరే లాయిరే లబ్బరు బొమ్మ
ఫేసు చూస్తె బెల్లం దిమ్మ
దీని ఊపే గంజాయ్ గమ్మా
రేసు గుర్రం ఇది జేజమ్మా...

దీని ఒల్లు చూస్తె పల్లి పట్టిరో...
దీని కల్లు చూస్తె సార పట్టిరో...
ఇది కొయ్య మీద రొయ్య సట్టిరో...
దీన్ని ముట్టుకోని సచ్చిపోతరో...

బూరె బుగ్గలు తాటి ముంజలు
గిల్లిగిచ్చి గిల్లిగంట ఆడమన్నయ్ రో
దోర పెదవులు తేనె పెట్టెలు
సూది గుచ్చి సుర్రు మంటు సుర్రు మన్నయ్రో...
ఎర్రా పిల్లా తిప్పూతుంటె
నిప్పు పుట్టి తప్పులెన్నొ చెయ్యమందిరో...
బిర్రూగున్న సొత్తూలల్లా
ఊరుతున్న సోకులెన్నొ తోడమంది రో...

దీని ఒల్లు చూస్తె పల్లి పట్టిరో...
దీని కల్లు చూస్తె సార పట్టిరో...

ఒక్కసారి దీని కాలు జారి మీద పడితె
యాది తోటే వందేల్లు ఉండొచ్చురో...
ఇంకొక్కసారి దీని పక్కచేరి
పుట్టుమచ్చలు లెక్కపెడితె స్వర్గం చూడొచ్చురో...

ఇచ్చేపోతా ఇచ్చేపోతా
దీన్ని చూసి కళ్ళు దానమిచ్చేపోత
సచ్చేపోతా సచ్చేపోతా
ఒక్కసారి ముట్టుకోని సచ్చేపోతా

దీని ఒల్లు చూస్తె పల్లి పట్టిరో...
దీని కల్లు చూస్తె సార పట్టిరో...


*********   *********  ********


చిత్రం: నక్షత్రం (2017)
సంగీతం: భరత్ మధుసూదనన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: నయనా నయ్యర్, అనురాగ్ కులకర్ణి

పెదవికి నువ్వంటె ప్రాణం
పెదవికి నువ్వంటె ప్రాణం
పిలవమని కలవమని అడిగినది ఆశతో
ఎదురుగ నువు నిలబడితె అదిరినది ఏమిటో...

పెదవికి నువ్వంటె ప్రాణం
పెదవికి నువ్వంటె ప్రాణం
పిలవమని కలవమని అడిగినది ఆశతో
ఎదురుగ నువు నిలబడితె అదిరినది ఏమిటో

నువ్వెక్కడుంటె నా పక్కనుంటె
కలతో పనిలేదు నా కల్లకీ
నువు హత్తుకుంటె ఆ మత్తు కంటె
గెలుపంటూ లేదు నా గుండెకీ
నాతోన నువ్వుంటె నీలోన నేనే
కరిగే క్షణమెంత బాగున్నదో
ఈ జన్మ ముగిసేది నీ ముద్దుతోనే
అనిపించె హాయి ఏ జన్మదో

పెదవికి నువ్వంటె ప్రాణం
పెదవికి నువ్వంటె ప్రాణం
పిలవమని కలవమని అడిగినది ఆశతో
ఎదురుగ నువు నిలబడితె అదిరినది ఏమిటో

పెదవికి నువ్వంటె ప్రాణం
పెదవికి నువ్వంటె ప్రాణం
పిలవమని కలవమని అడిగినది ఆశతో
ఎదురుగ నువు నిలబడితె అదిరినది ఏమిటో


*******   *******  ******


చిత్రం: నక్షత్రం (2017)
సంగీతం: హరిగౌర
సాహిత్యం: బాలాజి
గానం: హరిగౌర

సుడిగాలల్లే దూసుకెళరా
గమ్యం ఎటు ఉన్నా
తూఫానల్లే ఎగసిపడరా
గమనం ఏదైనా
కసి పెంచెయ్ రా
కండలే కరిగించేయ్ రా
కొలిమైపోరా నిప్పులే మరిగించెయ్ రా
అడుగు అడుగున

సుడిగాలల్లే దూసుకెళరా
గమ్యం ఎటు ఉన్నా ఓఓఓఓ

ఓర్పుగ ఉంటే నేర్చుకుంటే
ఓటమె ఒక ఖడ్గం
ఉప్పెనలున్నా నిప్పులున్నా
వదలకు నీ లక్ష్యం
నర నరమూ పిడికిలి చేసుకో
ప్రతి క్షణమూ వరమని వాడుకో
గురిపెడితే గుండెలు చీల్చరా
తలతెగినా కల ఛేధించరా
ఈ గాలి పంటిలో నీ పేరు మోసేలా
ఈ నేల గుండెల్లో నీ గురుతులుండేలా

సుడిగాలల్లే దూసుకెళరా
గమ్యం ఎటు ఉన్నా
తూఫానల్లే ఎగసిపడరా
గమనం ఏదైనా ఓఓఓ


మనసుకు నచ్చింది (2017)

చిత్రం: మనసుకు నచ్చింది (2017)
సంగీతం: రధన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: సమీరా భరద్వాజ్


పల్లవి:
పరిచయము లేదా నిను కలువలేదా
నువసలు తెలీదా ఏంటో ఈ వింతా
అలవాటే కద నువు కంటి పాపకి
తడబాటెందుకు నిను చూడటానికి
పదవే తల్లి పదమంటు నన్ను తరిమినది

పరిచయము లేదా నిను కలువలేదా
నువసలు తెలీదా ఏంటో ఈ వింతా

కోరస్:
హే నంగ నంగ నారె నంగ నారె
నంగ నంగ నారె నంగ నారె
సయ్యా ఓరే సయ్యా ఓరే సయ్యా (2)

చరణం: 1
జంటకథ లెన్నో విన్నా ఎంతబాగుందో అన్నా
ఇంత ఉంటుందని మాత్రం అనుకున్నానా
మొన్న మరి నీతో ఉన్నా నిన్న నీతోనే ఉన్నా
కొత్తగా కనుగున్నానా ఈ రోజున
ఈ అమ్మాయిలంతా ఇంతే అన్న నేనే
నా అందాలకింక మెరుగులు దిద్దినా
ఓ వయ్యారి నయ్యా ఓ సింగారి నయ్యా
ముస్తాబయ్యి నీకోసమడుగేసినా
నను చూస్తూ నువు పొగడాలనున్నది
నా వెనకాలే తిరగాలనున్నది
అరెరె ఎందుకు అసలింత నాకు ఇంత అవసరమా

పరిచయము లేదా నిను కలువలేదా
నువసలు తెలీదా ఏంటో ఈ వింతా

మరకతమణి (2017)

చిత్రం: మరకతమణి (2017)
సంగీతం: దిబు నినన్ థామస్
సాహిత్యం: రాకేందు మౌళి
గానం: ప్రదీప్ కుమార్


ఏ కవితలన్ని తెలిపినవి కనులు ఇవే
నా ఎద సడిలో శృతి గతినీ మార్చినవే
ఊహించు కున్నా జన్మాలు వేలు
నీతో క్షణమే చాలు
కదలాడెనే కలలా నిజం
కరిగించకే సమయాన్నిలా
లోలోననీ మౌనాలని
పలికించవే చిరునవ్వులా

కనిపించే తీరం కరిగేలా దూరం
దరిచేరే సమయం వరమై రానా
అందనిది అందం అందుకనే అందుం
అందరిలో తానే ఏంతో అందం
చలియా...

నీ చిటపటలా చూపులతో చురకెందుకో
రా చిగురెదలో చిరులతలా పెనవేసుకో
మరీ చికాకే మరిచికాను
మరీ మరీ కోరే మనస్సు నీ నవ్వే
ఏ బిడియపు మడి విడివడి ఇక
మనసుని తెలిపేసెయ్ వా

కదలాడెనే కలలా నిజం
కరిగించకే సమయాన్నిలా
లోలోననీ మౌనాలని
పలికించవే చిరునవ్వులా

ఏ కలతలిలా పరిచయము నా ఎదకు 
నీ గతములలో ఒక స్మృతిగా
ఊహించి నీతో జన్మాలు వేలు
పగిలే హృదయం చాలు

కదలాడెనే కలలా నిజం
కరిగించకే సమయాన్నిలా
లోలోననీ మౌనాలని
పలికించవే చిరునవ్వులా

కదలాడెనే కలలా నిజం
కరిగించకే సమయాన్నిలా
లోలోననీ మౌనాలని
పలికించవే చిరునవ్వులా

లై (2017)

చిత్రం: లై (2017)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: శ్యామ్ కాసర్ల
గానం: రాహుల్ సిప్లిగుంజ్, రమ్యా బెహ్రా

అదర నా గుండెలదర
నిదుర కంటికి రాదూ...
మదుర వెన్నెల గాసెను కదరా
ఈ సిన్నదొస్తె పగలు వెన్నెల గాసెను గదరా...

బొమ్మోలె ఉన్నదిర పోరి
బం బంబాటు గుందిరా నారి
లడ్డోలె ఉన్నదిర గోరి
లై లైలప్ప బుగ్గల్ది ప్యారి

బొమ్మోలె ఉన్నదిర పోరి
బం బంబాటు గుందిరా నారి
లడ్డోలె ఉన్నదిర గోరి
లై లైలప్ప బుగ్గల్ది ప్యారి

ఏడికెల్లి ఊడిబడ్డదీ మిస్సు
దీని నవ్వుతోనె ఎలిగిపోయె యు ఎస్సు
నడుమును జూత్తే అరెరెరె….
నడుమును జూత్తె నయగర ఫాల్స్
నేను బోత పయలెల్లిపోత
ఒక్కసారి ముట్టుకోని సచ్చిపోత
సచ్చిపోత

నేను బోత పయలెల్లిపోత
బాంచన్ నీ కాల్లు మొక్కి సచ్చిపోత
సచ్చిపోత

ట్రంపెట్ అల్లె ఒంపులున్న పోరి
ట్రంప్ లెక్క సంపుతుందిరో నారి
ర్యాంపు వాక్ చెసుకుంటు గోరి
స్టాంపు గుద్దినాది గుండె మీద ప్యారి

అందగత్తె ఎవ్వరంటె వయ్యారి పిల్ల
నీ ఒక్కపేరె కనపడ్డదె గూగుల్ ల
నువ్వు ఆగి ఒల్లు ఇరుసుకుంటె వయ్యారి పిల్ల
నాకు బొక్కలిరిగినట్టుందె రెండు పక్కల

నువ్వు లిప్పునట్ల గొరుకుతుంటె వయ్యారి పిల్ల
నిప్పు ఎల్ట పుట్టె తెలిసినాది నాకియ్యాల
నీ తోవకడ్డమొస్త నేను వయ్యారి పిల్ల
నన్ను పండబెట్టి తొక్కిపోవె చొవ్రాస్తల

సుక్కలెక్క సక్కగుంది పోరి
దీని సెమట సుక్క సెంటు నాకు వారి
అర్రె..
నన్ను గాని ఒప్పుకుంటె గోరి
నా స్కిన్ను ఒలిచి గుట్టిస్త సారీ

బొమ్మోలె ఉన్నదిర పోరి
బం బంబాటు గుందిరా నారి

జస్ట్ షెక్ మి అవ్ట్ అరె ఓ హొవ్లె
జస్ట్ టేక్ ఎ లూక్ ఆండ్ జా సాలె

నీ కొంటె సూపు తాకితెనె వయ్యారి పిల్ల
మునిగి తేలినట్టు ఉంటదె కాశిగంగల
నీ ఒంటి గాలి సోకితేనె వయ్యారి పిల్ల
సచ్చిపోయి నేను పుడతనె మల్లా మల్లా

గ్రీన్ సిగ్నల్ ఇయ్యరాదె వయ్యారి పిల్ల
గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటనె తెల్లారికల్ల
ఓ మంచిరోజు చూసి రావె వయ్యారి పిల్ల
ఫ్రెంచ్ వైను లెక్క దాచుకుంట నా గుండెల్ల

వైట్ హౌసు వన్నెలున్న పోరి
లైట్ హౌసు లెక్క సూపరాదె దారి
అరెరెరె…

రైట్ హాండ్ పట్టుకుంటె గోరి
నీకు డిస్ని లాండు రాసిస్త ప్యారి

బొమ్మోలె ఉన్నదిర పోరి
బం బంబాటు గుందిరా నారి



*********  *********  *********


చిత్రం: లై (2017)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: సాయి చరణ్ , సాహితి చాగంటి

ఏడమ్మ ఏడె
ఏడేడె
వరుడే…

రామయ్య కైనా నువ్వేలె
వరమే…

సీత కోరెను జింక
ఎప్పుడు వెల్లదు లంక

ఆపుతార మీరు
అసల మాట్టరు వేరు

పైకె జనకి టైపు
పెద్ద తాటకి డూపు

చూసి రమ్మనకింకా
కాల్చి వచ్చును లంక

తగదు లేరా పోరు
బోరూ బోరు
పదర చుపాలి ఇంక
హోరు జొరు

బజా వో…

it’s my Laggam time
it’s my Laggam time
say it One more time
it’s my Laggam time

ఏడమ్మ ఏడె
ఏడేడె
వరుడే…

హలా హలా
హలా హలా రె
ఖెలెవల
హలా హలా
హలా హలా రె
ఖెలెవల

ధగ ధగమను ఇస్పేటె
హె వదలడు పేకాటే
కుడి ఎడమలు లేనోడె

కదిలె గురు
సెగలు షురు
తగులుకుంటె
వదలడింకా
దిగులగుంటె
కత ముదిరె

హే..
గరీబునె మరి
షరాబుతొ సరి
నవాబులా నడిచేయ్నా

పాము నిచ్చెనలొ
ఇవాలె జారా
పైకి ఎగిరి
అవుతా రాజా

హీ..
సవాలులె ఇధి
జవాబు దెత్తది
నసీబునె తిరగెయ్నా

మచ్హ కీలెరిగి
పెట్టేస్తా వాద
రిచె అవదా
జీరొ ఖాతా

పెల్లంటె పోకరూ
మానేగ జోకరు
లైఫు లో వైఫుంటేనె
మరి షో...

ఏ...
మాంగల్యం తంతునా
విల్లే నె విరవనా
పెల్లితో సెట్టిల్ ఐపోనా...

తెల్ల తోలు పిల్లనే
పెల్లి చేసుకుంట
లెక్కలేని డాల్లర్లే
ముల్లె తెచ్చుకుంటా

తెల్ల తోలు పిల్లనే
పెల్లి చేసుకుంట
లెక్కలేని డాల్లర్లే
ముల్లె తెచ్చుకుంటా

పాహి అని అషొక వనిన
షొకించిన సీత
ఆ సీత
ఆ సీతా

షరదా

పాహి అనుచు
ఫొరైగ్న్ లొ వెచున్నది సీత
ఆ సీత
నా సీత
నా సీతా

హెయ్య్య్..
ఇన్నల్ల నా వొర్ర్య్
తీరెనిల్ల మరి
రెక్కల్లెని పరీ నెనె

రెండొ ఇల్లవదా
ఆ పైన నింగె
అప్పుడపుడూ దిగుతా నెలె

హెయ్య్య్..
వ్హొం ఎవెర్ ఇ మర్ర్య్
బబూ సొ సొ సొర్ర్య్
కొంగుకె నె ముడి వెయ్నా

కింగ్ Yఎ లెకుండా
అవుతాలె Qఉఈన్-ఎహ్
లిఫె అను రజ్యం ఎలెస్తానె

పెల్లైతె సుపెర్-ఊఉ
మొగుడెగా నౌకరూ
చూపుతూ చెసెస్తాలె
దివానా

మంగల్యం తంతునా
సంకెల్లె తెంచనా
గ్లొబె-ఊ నె చుట్టొచెయనా
సునొనా

తలుపు తన్నె
లుచ్క్ ఎహ్ షాడి Yఆరొ
తగులుకొరూ
ఎయ్ రూ తీన్మారు

బజఊఊ…

iT’s my laggam Time
iT’s my laggam Time
say iT One more Time
iT’s my laggam Time

iT’s my laggam Time
say iT One more Time
iT’s my laggam Time
iT’s my laggam Time
say iT One more Time


*********  *********  *********


చిత్రం: లై (2017)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: అనురాగ్ కులకర్ణి, సిందూరి

హై మిస్ సన్షైన్!!
కోపమా నీది సన్ సైన్?

ఫైర్ నువ్వు సేం టు సేం,
ఎమిటొ చెప్పు నా క్రైం?

సంబర్న్ సందడె పాకెట్ లొ నింపుదాం,
సమ్మే ట్రిప్ కె కోపాన్నె పంపుదాం..

ఉన్నట్టుంది చైన వాల్,
కూల్చొద్దింక నాపై చాలు.

కొట్టొద్దింక చి చి చి లు..
కట్టి పెట్టెయి నీ కొపాలు..

మ్మ్...మ్మ్... మ్మ్... మ్మ్....

హై మిస్ సన్షైన్!!
కోపమా నీది సన్ సైన్?

ఫైర్ నువ్వు సేం టు సేం,
ఎమిటొ చెప్పు నా క్రైం?

హై వాలెంటైన్..
మాయ లొ నువ్వు యైన్స్టైన్..

తెలిసి పడతాను లె,
యు ఆర్ ఈకూల్ టు మె స్కుఏర్..

కస్టం మోయడం నన్నెలె ఈ క్షనం..
ఇస్టం దాయడం నిన్ను నాలొ మక్సిమం..

వె జస్ట్ స్టె ఫర్ సం మోర్ టైం..
యెవరి సెకండ్ జీవిద్దాము..

నిజం చెస్తు ఈ డె డ్రీం..
గాలక్సి లొ తిరిగొద్దాము..

మ్మ్...మ్మ్... మ్మ్... మ్మ్....

లవ్ ఈస్ ఇన్సేన్ వద్దు అనలేనిదీ పైన్..
కదిలే ఆ చ్లౌడ్ నైన్ గుండె లొ పేల్చె లాండ్ మైన్..

సో కూల్ చూపులె టేకెన్ మై బ్రెత్ అవే..
సో బోర్ లైఫు లె నువు పొగడని నిమిషమె..

నెవర్ ఎవర్ లెట్ మె గొ గల్ అల్లేసుకొ లవ్లి ఏంగెల్..
చం ఆన్ చం ఎన్ లెట్ మె లవ్ యు ఎటెల్లినా ఐ వోంట్ లీవ్ యు..

మ్మ్...మ్మ్మ్... మ్మ్... మ్మ్....

హై మిస్ సన్షైన్!!

కోపమా నీది సన్ సైన్?

జై సింహా (2017)

చిత్రం: జై సింహా (2017)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: శ్రేయఘోషల్, రేవంత్
నటీనటులు: బాలకృష్ణ , నయనతార, హరిప్రియ, నటాషా దోషి , జగపతిబాబు
దర్శకత్వం: కె.యస్.రవికుమార్
నిర్మాత: సి.కళ్యాణ్
విడుదల తేది: 12.01.2018

పల్లవి:
ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుంది
తొలిసారి నా మనసే విప్పాలనిపిస్తుంది
ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుంది
నిదురించే నీ కలలో రావలనిపిస్తుంది
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
ఓ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్

ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుంది
తొలిసారి నా మనసే విప్పాలనిపిస్తుంది
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్

చరణం: 1
తూగే తూగే పాదం నీ వల్లే ఆగింది
నువ్వే వచ్చి చెయ్యందిస్తే పరుగే తీసిందే
ఆగే ఆగే ప్రాణం నీ వల్లే ఆడింది
తీర్చాలని నేననుకున్నా నీ ఋణమే తీరనిది
జీవితాన మల్లెల వాన ఇపుడే కురిసింది

తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్

కోరస్:
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్

చరణం: 2
హో ఎవ్వరైనా చూపగలరా తమలో ప్రాణాన్ని
నే చూపిస్తా ఇదిగో నువ్వు అని
ఒక్కరైనా చూడగలరా తడిమే ఉప్పెనని
నా ఊపిరికే రూపం ఇస్తే అచ్చం నువ్వనని
అపురూపంగా దాచనా నువ్విచ్చిన బహుమతిని

తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుంది
తొలిసారి నా మనసే విప్పాలనిపిస్తుంది

తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్ (3)


సచిన్ (2017)


చిత్రం : సచిన్ (2017)
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్    
సాహిత్యం : వనమాలి  
గానం : పరాగ్ ఛబ్ర, పూర్వి కౌటిష్, నికితా గాంధీ  

సచిన్ సచిన్ సచిన్ సచిన్
సచిన్ సచిన్ సచిన్ సచిన్ 


చీకటంతా కమ్ముకున్నా 
వెలుతురుంది నీ చేతుల్లోనా 
కలలు నిజమూ కాని వేళా 
రాతిరైనా రద్దవ్వాలే నాఆశ
సగమైన సాగలేదు ఆట 
కసిగాయం మానిపోలేదంటా 
ఎదలోన మోగనివ్వు జేగంట 
చెయ్ సాహసమే 
చేరాలంటే గమ్యము 

సచిన్ సచిన్ సచిన్ సచిన్
సచిన్ సచిన్ సచిన్ సచిన్ 


గాలివీచే దిశను మార్చేయ్ 
ఎవ్వరెన్ని అంటూనే ఉన్నా 
కాలమేగా నీకు తోడు 
భారమంతా తనదే ఆ పైన 
మది రేపు వైపు లాగుతుంది 
కొత్త వేకువేదో చూపుతుంది 
మును ముందు 
రోజులన్ని నీవంటుంది 
చెయ్ సాహమఏ 
చేరాలంటే గమ్యమే 

సచిన్ సచిన్ సచిన్ సచిన్
సచిన్ సచిన్ సచిన్ సచిన్ 


సాహో సాహో సాహో ఇండియా 
నువ్వో సైన్యం కదరా 
సాహో సాహో సాహో ఇండియా 
నువ్వో సైన్యం కదరా 

సచిన్ సచిన్ సచిన్ సచిన్
సచిన్ సచిన్ సచిన్ సచిన్
 

అర్జున్ రెడ్డి (2017)


చిత్రం: అర్జున్ రెడ్డి (2017)
సంగీతం: రధన్
సాహిత్యం: శ్రేష్ఠ
గానం: సమీరా భరద్వాజ్

మదురమె ఈ క్షనమే ఓ చెలి
మదురమె ఈ క్షనమే

మదురమె వీక్షనమే ఓ చెలి
మదురమె వీక్షనమే

మదురమే లాలసనే
మదురమే లాలనయే

మదురమె లాహిరిలే
మదురం లాలితమే...

మదు పవనం వీచి
మదు పవనం వీచి
పరువమె మైమరచె

కాలం పరుగులు ఆపి
వీక్షించె అందాలే

మోహం తన్మైయమొంది స్వాసించె గధాలె
ఓరించె రుచులను మరిగి ఒడికించు తాపాలే...

ఉప్పొంగి ఊపిరి సెగలొ కవ్వించె దాహాలె
మౌనంగా మధువుల జడిలోన పులకించె ప్రానాలె

మదురమె ఈ క్షనమే ఓ చెలి
మదురమె ఈ క్షనమే

వీచె గాలులు దాగి
చెప్పెనె గుస గుసలే
చూసె ముసి ముసి నవ్వులు
చేసే బాసలనె
వసమై ఆనందపు లోగిట
అరుదించి ఆకసం…
సగమై ఈ సగరమందె
అగుపించె ఆసాంతం
తీరం ముడివేసిన దారం
తీర్చె ఎద బారాలె…


*******  ********  *********


చిత్రం: అర్జున్ రెడ్డి (2017)
సంగీతం: రధన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: నిఖితా గాంధి

దూరం దగ్గర చేస్తున్నది
ఇంకా ఇస్టం పెంచిందదీ
మల్లి మల్లి కలిసే తొందరా
కాలాన్నైనా తరిమేస్తుందది

ఆ దిక్కు ఈ దిక్కు
మౌనంగా ఒక్కటైయ్యయే...

నా ఊరు నీ ఊరు
మనల్ని వేరు చెయ్లేవే...

రా రా రా... కౌగిలై....
రా రా రా...  ఊపిరై....

రా రా రా... కౌగిలై....
రా రా రా... ఊపిరై....

ప్రానం రెక్కలు చాస్తున్నదీ
నీకై రివ్వున వస్తున్నది
నీపై వాలి నిదురించాలని
ఆకాషాన్నె ఓడిస్తున్నది

నాదాక నువ్ వొస్తె
నీదాక నేను వొస్తుంటె
ఈ దేషం ఈ లోకం
ఇంకింకా చిన్నవైనాయే...

రా రా రా రారరా....
రా రా రా రారరా....
రా రా రా రారరా....
రా రా రా రారరా....
రా రా రా రారరా....
రా రా రా రారరా....
రా రా రా రారరా....
రా రా రా రారరా....
రా రా రా రారరా....
రా రా రా రారరా....


********  ********  ********


చిత్రం: అర్జున్ రెడ్డి (2017)
సంగీతం: రధన్
సాహిత్యం: రాంబాబు గోసాల
గానం: ఎల్. వి.రేవంత్

తెలిసెనే నా నువ్వె నా నువ్వు కాదని
తెలిసెనే నీ నేనె నీ నేను కానని
నాలొ సగం ఇక లేదూ అని
నా నిన్నలే నన్ను చూసి నవ్వెలే...

మరు నాడు అన్నదె ఇక ఉండబోదని
అన్నదీక్షనం.....

నా ప్రానం నువ్వే
నా గుండె నువ్వె గుండెల్లొ మండే
నిప్పై చేరావే...

ఊహలకె తెలియనిదె
జరిగెనులె ఇపుడెలా...
నువ్వు నేను అను మాటె
ఇకపై ఉండదులె ఏంతిలా

తప్పు ఏదొ జరిగెను
రెప్ప పాటులో...
చెప్పలేని వేదనగా
ఉప్పెనగ తరుముతోందె
నువ్వు లేనిదే
మరి నేను లేనని...
అన్న ఈ క్షనం....

నా అంతం నువ్వే....
నా పంతం నువ్వే...
నా పంతం ఎంతా...
ఈ విష్వం అంతా....

నా అంతం నువ్వే....
నా పంతం నువ్వే...
నా పంతం ఎంతా...
ఈ విష్వం అంతా....

తెలిసెనే నా నువ్వె నా నువ్వు కాదని
తెలిసెనే నీ నేనె నీ నేను కానని


********  ********  ********


చిత్రం: అర్జున్ రెడ్డి (2017)
సంగీతం: రధన్
సాహిత్యం: శ్రేష్ఠా
గానం: సౌజన్య

గుండెలోన నిండుకున్న
నీ గురుతు లేక ఊపిరయ్యే ఇన్నాళ్లూ
కళ్ళలోన నింపుకున్న
నీ రూపమేగ ఊరటయ్యే ఇన్నాళ్లూ
చెప్పనీ చెప్పనీ మనసు తాలలేదని నీ దూరమే
తప్పనే తప్పని తాపమే తీరనీ ఈనాడే
గుండెలోన నిండుకున్న

నీ గురుతు లేక ఊపిరయ్యే ఇన్నాళ్లూ
నీ అడుగులోన అడుగు కలిపి ప్రాణమే మురవని
నా అణువు అణువు నిన్ను చేరి తనివి తీరనీ
ఏ దారి మలపు లోను ఇంక వీడనే వీడనీ
నీ లోని నీడ నేనులాగ నన్ను మారనీ
తిమిరం తెర తొలిగిపోయి వెలిగే నవ ఉదయాలే
ప్రాణం చెయ్ జారి మళ్ళి చేరగ తన తీరాన్నే
కమ్మనైన ఓ హాయివాన కురావగా ఇలా చిరునవ్వులోన

గుండెలోన నిండుకున్న
ఊసులన్ని చెప్పుకోగా ఈనాడు
కళ్ళలోన దాచుకున్న
ప్రేమనంత చూపుకోగా ఈనాడు
ఆగనీ ఆగనీ ఆదమరుపులే కదా ఇక అన్నీ
దూరమే ఆనని కౌగిలింతలే కదా ఇక అన్నీ

గుండెలోన నిండుకున్న
ప్రేమనంత చూపుకోగా ఈనాడు

పరవశం పరవశం అవ్వనీ మన వశం
చిలకరించు నవ్వులు మునికి ఈ జగం
చెరు సగం చెరు సగం అవ్వగా ఓ సుమం
పలకరించు ఆశలే హృదయనందనం
అలలే జోలలను పాడి అలుపే మరిచేనే
కలలే నీ ఒడిన వాలి నిజమై మెరిసేనే
అల్లుతున్న హరివిల్లులోన
అందుకోగా స్వర్గసీమ

గుండెలోన నిండుకున్న
ప్రేమనంత చూపుకోగా ఈనాడు
ఆగనీ ఆగనీ ఆదమరుపులే కదా ఇక అన్నీ
దూరమే ఆనని కౌగిలింతలే కదా ఇక అన్నీ
గుండెలోన నిండుకున్న
ప్రేమనంత చూపుకోగా ఈనాడు


********  ********  ********


చిత్రం: అర్జున్ రెడ్డి (2017)
సంగీతం: రధన్
సాహిత్యం: మండేల పెదస్వామి
గానం: గౌతమి

మరీ మరీ కొత్తగ నీ జత
మరో మరో చిత్రమై ఈ కధ
మొదలైంది ఆనందపు చిరునామాగా
నెడుతుంది బంధమని తప్పు కాదుగా

మరీ మరీ కొత్తగ నీ జత
మరో మరో చిత్రమై ఈ కధ

నీ అడుగులలోన నా నడకలివేనా
తెలియక నా గుండెకి
తికమకలేనా తరగక ఆరాధన
ప్రతీసారి అదే తీరున

ఇలా వస్తున్నా ఉండక
కలా వలా పడుతున్నా ఆగక
పరుగేలా నీ దారికి పరిహాసంగా
నిజమేగా నీ చెలిమి చిరంజీవిగా
ఇలా ఇలా వస్తున్నా ఉండక
కలా వలా పడుతున్నా ఆగక