చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : అన్నమయ్య
నేపధ్య గానం :
పల్లవి :
ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా
కేళీ విహార లక్ష్మీనారసింహా ... లక్ష్మీనారసింహా
చరణం 1 :
ప్రళయమారుత ఘెరభస్త్రికా పూత్కార
లలితనిశ్వాసడోలారచనయా
కులశైలకుంభినీ కుముదహిత రవిగగన
చలన విధినిపుణ నిశ్చల నారసింహా... నిశ్చల నారసింహా
చరణం 2 :
దారుణోజ్జ్వలధగద్దగితదంష్ట్రానలవి
కారస్ఫులింగసంగక్రీడయా
వైరిదానవఘోర వంశభస్మీకరణ -
కారణ ప్రకట వేంకట నారసింహ... వేంకట నారసింహ
వేంకట నారసింహ... వేంకట నారసింహ
చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : అన్నమయ్య
నేపధ్య గానం :
పల్లవి :
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము
బ్రహ్మ కడిగిన పాదము
చరణం 1 :
చెలగి వసుధ కొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము
బ్రహ్మ కడిగిన పాదము
చరణం 2 :
కామిని పాపము కడిగిన పాదము... పాము తలనిడిన పాదము
ప్రేమతొ శ్రీ సతి పిసికెడి పాదము... పామిడి తురగపు పాదము
బ్రహ్మ కడిగిన పాదము
చరణం 3 :
పరమ యోగులకు పరి పరి విధముల... పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన... పరమ పదము నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మ కడిగిన పాదము
చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : అన్నమయ్య
నేపధ్య గానం : బాలు
పల్లవి :
అంతర్యామి అలసితి సొలసితి
ఇంతటి నీ శరణిదే చొచ్చితిని
అంతర్యామి అలసితి... సొలసితి
చరణం 1 :
కోరిన కోర్పులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక
కోరిన కోర్పులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక
భారపు పగ్గాలు పాపపుణ్యములు
భారపు పగ్గాలు పాపపుణ్యములు
నేరుపున బోవు నీవు వద్దనక
అంతర్యామి అలసితి సొలసితి
ఇంతటి నీ శరణిదే చొచ్చితిని.... అంతర్యామి
చరణం 2 :
మదిలో చింతలు మయలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
మదిలో చింతలు మయలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
ఎదుటనే శ్రీవేంకటేశ్వర
వేంకటేశా... శ్రీనివాస.. ప్రభో
ఎదుటనే శ్రీవేంకటేశ్వర నీవదె
అదనగాచితివి అట్టిట్టనక
అంతర్యామి అలసితి సొలసితి
ఇంతటి నీ శరణిదే చొచ్చితిని
అంతర్యామి... అంతర్యామి
అంతర్యామి... అంతర్యామి
అంతర్యామి... అంతర్యామి
అంతర్యామి... అలసితి
చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : అన్నమయ్య
నేపధ్య గానం : బాలు
పల్లవి :
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
చరణం 1:
కుమ్మర దాసుఁడైన కురువరతినంబి
యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాఁడు
కుమ్మర దాసుఁడైన కురువరతినంబి
యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాఁడు
దొమ్ములు సేసినయట్టి తొండమాం జక్కురవర్తి
దొమ్ములు సేసినయట్టి తొండమాం జక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాఁడు
దొమ్ములు సేసినయట్టి తొండమాం జక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
చరణం 2 :
కంచిలోనుండ తిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
కంచిలోనుండ తిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు...
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించినవాడు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించినవాడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : అన్నమయ్య
నేపధ్య గానం : బాలు
పల్లవి :
అదివో...
అదివో అల్లదివో శ్రీహరివాసము
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
చరణం 1 :
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదులకపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు
వెంకటరమణ.. శంకటహరణ
వెంకటరమణ.. శంకటహరణ
వెంకటరమణ.. శంకటహరణ
వెంకటరమణ.. శంకటహరణ
నదె చూడుఁడదె మొక్కుఁడానందమయము
నదె చూడుఁడదె మొక్కుఁడానందమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
చరణం 2
కైవల్యపదము వేంకటనగమదివో
శ్రీవేంకటపతికి సిరులైనవి
భావింప సకల సంపద రూపమదివో
వెంకటరమణ.. శంకటహరణ
వెంకటరమణ.. శంకటహరణ
వెంకటరమణ.. శంకటహరణ
వెంకటరమణ.. శంకటహరణ
భావింప సకల సంపద రూపమదివో
పావనములకెల్లఁ పావనమయము...
అదివో అల్లదివో శ్రీహరివాసము
శ్రీహరివాసము... శ్రీహరివాసము
శ్రీహరివాసము... శ్రీహరివాసము
శ్రీహరివాసము... శ్రీహరివాసము
చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : అన్నమయ్య
నేపధ్య గానం : మనో
పల్లవి :
శోభనమే శోభనమే.. శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి
శోభనమే శోభనమే.. శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి
శోభనమే శోభనమే
చరణం 1 :
దేవదానవుల ధీరతను
ధావతిపడి వార్ధీతరువుగను
దేవదానవుల ధీరతను
ధావతిపడి వార్ధీతరువుగను
శ్రీవనితామణి చెలగి పెండ్లాడిన శ్రీవేంకటగిరి శ్రీనిధికీ
శోభనమే శోభనమే.. శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి
శోభనమే శోభనమే.. శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి
శోభనమే శోభనమే
చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : అన్నమయ్య
నేపధ్య గానం : బాలు, రేణుక, శ్రీలేఖ, పార్ధసారధి
పల్లవి :
విన్నపాలు వినవలె వింతవింతలూ
విన్నపాలు వినవలె వింతవింతలూ
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య
విన్నపాలు వినవలె వింతవింతలూలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య
విన్నపాలు వినవలె వింతవింతలూ.. ఊ ఊ...
చరణం 1 :
కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగ
అండనుండే స్వామిని
కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగ
అండనుండే స్వామిని.. కంటీ.. ఈ ఈ ...
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వినీ పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వినీ పెండ్లి కూతురు
పేరుగల జవరాలి పెండ్లి కూతురు
పెద్ద పేరుల ముత్యాలమెడ పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరు గుచ్చ సిగ్గువడీ పెండ్లి కూతురూ... ఊ ఊ...
అలర చంచలమైన ఆత్మలందుండ నీ
అలవాటు సేసెనీ ఉయ్యాల
అలర చంచలమైన ఆత్మలందుండ నీ
అలవాటు సేసెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : అన్నమయ్య
నేపధ్య గానం : బాలు, చిత్ర
పల్లవి :
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే.. అలవోకలు
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే..అలవోకలు
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికేలే..అలవోకలు
చరణం 1 :
కందులేని మోమునకేలే..కస్తూరి
చిందుని కొప్పునకేలే..చేమంతులు
మందయానమునకేలే హా.. మట్టెల మోతలు
మందయానమునకేలే మట్టెల మోతలు
గంధమేలే..పైకమ్మని నీమేనికి
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే..అలవోకలు
చరణం 2 :
ముద్దుముద్దు మాటలకేలే..ముదములు
నీ అద్దపు చెక్కిలికేలే..అరవిరి
ఒద్దిక కూటమికేలే..ఏలే..ఏలే..ఏలే లే..
ఒద్దిక కూటమికేలే వూర్పులు
నీకు అద్దమేలే తిరు వేంకటాద్రీశుగూడి
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే..అలవోకలు
చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : అన్నమయ్య
నేపధ్య గానం : బాలు
పల్లవి :
పురుషోత్తమా... పురుషోత్తమా... పురుషోతమా...
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా...
చరణం 1 :
కోరిమమ్ము నేలినట్టి కులదైవమా చాల నేరిచి
పెద్దలిచ్చిన నిదానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా....
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా ....
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా.....
చరణం 2 :
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా
ఓం నమో వేంకటేశాయ... ఓం నమో వేంకటేశాయ
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా
తోగాలడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా.....
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా.....
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా
మమ్ము గడియించినట్టి శ్రీవేంకటనాధుడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
పురుషోత్తమా......
పురుషోత్తమా.....
పురుషోత్తమా..........
చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : జె.కె.భారవి
నేపధ్య గానం : బాలు
పల్లవి :
ఓం శ్రీ పద్మావతీ భూదేవీ సమేతస్య శ్రీమద్ వేంకట నాయకస్య నిత్య షోడశోపచార పూజాం కరిష్యే! ఆవాహయామి!
పదహారు కళలకు ప్రాణాలైన
నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహనం
ఓం ఆసనం సమర్పయామి!
పరువాల హొయలకు పైయెదలైన
నా ఊహల లలనలకు ఊరువుల ఆసనం
ఓ స్నానం సమర్పయామి!
చిత్తడి చిరు చెమటల చిందులు చిలికే
పద్మినీ భామీనులకు పన్నీటి స్నానం
ఓం గంధం సమర్పయామి!
ఘలం ఘలల నడల వలన అలసిన
మీ గగన జఘన సొభగులకు శీతల గంధం
ఓం నైవేద్యం సమర్పయామి!
రతి వేద వేద్యులైన రమణులకు అనుభవైక వేద్యమైన నైవేద్యం
ఓం తాంబూలం సమర్పయామి!
మీ తహతహలకు తపనలకు తాకిళ్ళకు ఈ కొసరు కొసరు తాంబూలం
ఓం సాష్టాంగ వందనం సమర్పయామి!
అనంగ రంగ భంగిణులకు సర్వాంగ చుంబనాల
వందనం!
చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుజాత, రేణుక
పల్లవి :
ఓం ఓం.....
తెలుగు పదానికి జన్మదినం
ఇది జాన పదానికి జ్ఞానపధం
ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం
అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
చరణం 1 :
అరిషడ్వర్గము తెగనరికే హరి ఖడ్గమ్మిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మభారతి నాదాశిస్సులు పొందినదై
శివలోకమ్మున చిద్విలాసమున డమరుధ్వనిలో గమకితమై
దివ్యసభలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి
నీరద మండల నారద తుంబుర మహతి గానవు మహిమలు తెలిసి
శితహిమ కందర యతిరాట్సభలో తపః ఫలమ్ముగ తళుకుమని
తల్లి తనముకై తల్లడిల్లు ఆ లక్క మాంబ గర్భాలయమ్ములో
ప్రవేశించె ఆ నందకము.. నందనానంద కారకము
అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
చరణం 2 :
పద్మావతియే పురుడు పోయగా పద్మాసనుడే ఉసురుపోయగా
విష్ణు తేజమై నాద బీజమై అంధ్ర సాహితి అమరకోశమై
అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ
అవతరించేను అన్నమయ్య అసతోమా సద్గమయ
చరణం 3 :
పాపడుగా నట్టింట పాకుతు భాగవతము చేప్పట్టెనయా
హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా
తెలుగు భారతికి వెలుగు హారతై ఎదలయలో పద కవితలు కలయా
తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ్య.. తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
కలగంటి కలగంటి
చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : అన్నమయ్య
నేపధ్య గానం : బాలు
పల్లవి :
కలగంటి కలగంటి.. ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుడంటి
కలగంటి కలగంటి.. ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుడంటి
ఇప్పుడిటు కలగంటి
చరణం 1 :
అతిశయంబైన శేషాద్రి శిఖరముగంటి
ప్రతిలేని గోపుర ప్రభలుగంటి
శతకోటి సూర్యతేజములు వెలుగగగంటి
చతురాశ్యు పొడగంటి
చతురాశ్యు పొడగంటి.. చయ్యన మేలుకొంటి
ఇప్పుడిటు కలగంటి
చరణం 2 :
అరుదైన శంఖచక్రాదులిరుగడగంటి
సరిలేని అభయ హస్తమునుకంటి
తిరు వేంకటాచాలదిపుని చూడగగంటి
హరిగంటి గురుగంటి
హరిగంటి గురుగంటి.. అంతటా మేలుకంటి
కలగంటి కలగంటి.. ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుడంటి
ఇప్పుడిటు కలగంటి.. ఇప్పుడిటు కలగంటి
చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుజాత, అనురాధ
పల్లవి :
ఏలే ఏలే మరదలా.. వాలే వాలే వరసలా
నచ్చింది నచ్చింది నాజూకు.. నీకే ఇస్తా సోకులు
ఇచ్చెయ్యి పచ్చారు సొగసులు
చాలు నీ తోటి.. అహ.. చాలు నీ తోటి సరసాలు బావ
ఏలే ఏలే మరదలా.. వాలే వాలే వరసలా
చరణం 1 :
గాటపు గుబ్బలు కదలగ కులికేవు మాటల తేటల మరదలా
వేటరి చూపులు విసురుచు మురిసేవు వాటపు వలపుల వరదలా
చీటికి మాటికి చణకేవూ... ఊ ...
చీటికి మాటికి చణకేవు వట్టి బూటకాలు మాని పోవే బావా
చాలు చాలు నీ తోటి.. అహ చాలు నీ తోటి సరసాలు బావ
ఏలే ఏలే మరదలా... వాలే వాలే వరసలా
నచ్చింది నచ్చింది నాజూకు... నీకే ఇస్తా సోకులు
ఇచ్చెయ్యి పచ్చారు సొగసులు
చాలు నీ తోటి.. అహ.. చాలు నీ తోటి సరసాలు బావ
ఏలే ఏలే మరదలా... వాలే వాలే వరసలా
చరణం 2 :
కన్నుల గంటపు కవితలు గిలికేవు నా యెద చాటున మరదలా
పాడని పాటల పయిటలు సరిదేవు పల్లవి పదముల దరువులా
కంటికి వంటికి కలిపేవూ... ఊ....
కంటికి వంటికి కలిపేవు ఎన్ని కొంటె లీలలంట కోలో బావా
అహ పాడుకో పాట.. జంట పాడుకున్న పాట జాజిపూదోట
ఏలే ఏలే మరదలా.. వాలే వాలే వరసలా
నచ్చింది నచ్చింది నాజూకు.. నీకే ఇస్తా సోకులు
ఇచ్చెయ్యి పచ్చారు సొగసులు
చాలు నీ తోటి.. అహ.. చాలు నీ తోటి సరసాలు బావ
ఏలే ఏలే మరదలా.. వాలే వాలే వరసలా
చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : కీరవాణి
నేపధ్య గానం : మనో, చిత్ర
పల్లవి :
అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా
వలపే ఇటు దులిపే చేలి ఒయ్యారంగా
కధలే ఇక్క నడిపే కడు శృంగారంగా
పెనుగొండ యెద నిండ రగిలింది వెన్నెల.. హలా
అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా
రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా
చరణం 1 :
సాపమ సామగ సాగసనిపస సాపమ సామగ సపమ
గమమ మపని పసనిస
నీ పని నీ చాటు పని రసలీల లాడుకున్న రాజసాల పని
నా పని అందాల పని ఘనసాళ్వవంశ రసికరాజు కోరు పని
ఎపుడెపుడని ఎద ఎద కలిపే ఆ పని
రేపని మరిమాపని క్షణమాపని మాపని
ప ప ప పని
ప ని స గ స ని పని
మ మ మ మని
మపని
ఆ పని ఎదో ఇపుడే తెలుపని.. వలపని
అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా
ఆ..
చరణం 2 :
ఓ సఖి రాకేందు ముఖి.. ముద్దులాడు యుద్ధరంగాన.. ముఖాముఖి
ఓ సఖా మదనుని జనకా.. ఈ సందిట కుదరాలి మనకు.. సంధియిక
బుతువున కొక రుచి మరిగిన మన సయ్యాట
మాటికి మొగమాటపు సగ మాటలు యేటికి
ప ప ప పని
ప ని స గ స ని పని
మ మ మ మ మని
మపని
పెళ్ళికి పల్లకి తేచ్చే వరసకి వయసుకీ
అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా
ఆ... రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా
చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : అన్నమయ్య
నేపధ్య గానం : బాలు
పల్లవి :
ఏడు కొండల వాడ వెంకటా రమణ గొవిందా గొవిందా
అదివో..ఓ
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
అదివో అల్లదివో శ్రీహరి వాసము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పది వేలు శేషుల పడగల మయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పది వేలు శేషుల పడగల మయము
ఏడు కొండల వాడా వేంకటరమణా గోవిందా గోవింద
చరణం 1 :
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకూ
వేంకటరమణా సంకట హరణా
వేంకటరమణా సంకట హరణా
నారాయణ నారాయణ
అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదె చూడుడూ అదె మ్రొక్కుడూ.. ఆనందమయము
అదె చూడుడదెమ్రోక్కుడానందమయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
వడ్డీకాసులవాడా వేంకటరమణా గోవిందా గోవింద
ఆపదమ్రొక్కులవాడా అనాధరక్షకా గోవిందా గోవింద
చరణం 2 :
కైవల్య పదము వేంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపద రూప మదివో.. అదివో
వేంకటరమణ సంకటహరణ
భావింప సకల సంపద రూప మదివో.. అదివో
పావనములకెల్ల పావన మయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
శ్రీ హరివాసమూ శ్రీహరివాసమూ శ్రీహరివాసమూ
వేంకటేశా నమో శ్రీనివాసా నమో
వేంకటేశా నమో శ్రీనివాసా నమో
అదివో అదివో....