మొగుడు కావాలి (1980)




చిత్రం :  మొగుడు కావాలి (1980)
సంగీతం :  జె.వి. రాఘవులు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు

పల్లవి :

ఆడపిల్లకి ఈడొస్తే తోడు కోసం ఏడిస్తే
గోల ఆపి జోల పాడి నిదర పుచ్చే బల్మొనగాడు రావాలి..
హ హ.. మొగుడు కావాలి... హె హె
ఒకడు రావాలి... హొ హొ.. మొగుడు కావాలి... హ హ హ హ 


ఆడపిల్లకి ఈడొస్తే తోడు కోసం ఏడిస్తే
గోల ఆపి జోల పాడి నిదర పుచ్చే బల్మొనగాడు రావాలి..
హ హ.. మొగుడు కావాలి... హె హె
ఒకడు రావాలి... హొ హొ.. మొగుడు కావాలి... హ హ హ హ

చరణం 1 :

కన్ను పడితే.. కన్నె ఎదలో..తుమ్మెదల్లే ఒదిగిపోతానులే
చెయ్యి పడితే.. చెలిమి లోని.. తేనె విందు.. అందుకుంటానులే
జవ్వనీ యవ్వనం.. నవ్వనీ ఈ క్షణం
ఝుమ్మని తుమ్మెదా రమ్మనీ పాడగా ....

ఒకడు రావాలి మొగుడు కావాలి
ఒకడు రావాలి.. హహ.. మొగుడు కావాలి.. హె హె..
 
ఆడపిల్లకి ఈడొస్తే తోడు కోసం ఏడిస్తే
గోల ఆపి జోల పాడి నిదర పుచ్చే బల్మొనగాడు రావాలి..
హ హ.. మొగుడు కావాలి... హె హె
ఒకడు రావాలి... హొ హొ.. మొగుడు కావాలి... హ హ హ హ
చరణం 2 :

మనసు పడితే.. వయసు నేనై.. వలపు నీవై కలిసిపోవాలిలే...
మరులు పుడితే.. విరుల పాన్పు.. పరచి నేడే.. కరిగిపోవాలిలే..
జీవితం అంకితం చేసుకో స్వాగతం..
వెన్నెలే వెల్లువై.. మల్లెల నావలో హొ హో హొ హొ

ఒకడు రావాలి హ హ మొగుడు కావాలి హే హే
ఒకడు రావాలి హహహ మొగుడు కావాలి హెహెహె 
 
 
ఆడపిల్లకి ఈడొస్తే తోడు కోసం ఏడిస్తే
గోల ఆపి జోల పాడి నిదర పుచ్చే బల్మొనగాడు రావాలి..
హ హ.. మొగుడు కావాలి... హె హె
ఒకడు రావాలి... హొ హొ.. మొగుడు కావాలి... హ హ హ హ 
 
********* ************** ************* ******


చిత్రం :  మొగుడు కావాలి (1980)
సంగీతం :  జె.వి. రాఘవులు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :   బాలు

పల్లవి :

సాచి కొడితే.. సరిసరి పద పద సరిసరి పదపద..
ఎదలో సంగీతం
వాచిపోయి ఒళ్ళు కళ్ళు వలపుల భాగోతం

ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం
ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం





సాచి కొడితే.. సరిసరి పద పద సరిసరి పదపద..
ఎదలో సంగీతం
వాచిపోయి ఒళ్ళు కళ్ళు వలపుల భాగోతం

ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం
ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం



చరణం 1 :


అల్లిబిల్లి అమ్మాయి గారి దెబ్బా...  అల్లంమురబ్బా
కోనసీమ కొత్తావకాయ దెబ్బా అడీస్ అబబ్బా
అల్లిబిల్లి అమ్మాయి గారి దెబ్బా...  అల్లంమురబ్బా
కోనసీమ కొత్తావకాయ దెబ్బా అడీస్ అబబ్బా

చెలి చూస్తే రంభ.. చెయ్యేస్తే పంబ
చెలి చూస్తే రంభ.. చెయ్యేస్తే పంబ
రేగింది మదిలోన మ్రోగింది తుంబ... మోతగా తుంబా..

సాచి కొడితే.. సరిసరి పద పద సరిసరి పదపద..
ఎదలో సంగీతం
వాచిపోయి ఒళ్ళు కళ్ళు వలపుల భాగోతం

ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం
ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం



చరణం 2 :


అలిగిందంటే చిలకలకొలికీ అందం... అరచేతి మందం
అది వలపుల కొద్దీ వాయించే మృదంగం.. ఈ జలతరగం
అలిగిందంటే చిలకలకొలికీ అందం... అరచేతి మందం
అది వలపుల కొద్దీ వాయించే మృదంగం.. ఈ జలతరగం


శృతి మించే రాగం.. జతలో సరాగం
శృతి మించే రాగం.. జతలో సరాగం
ఇది ముద్దు మురిపాల కళ్యాణి రాగం..
దదద నినిని రిరిరి మమమ పప.. మపప గమమ రిగగ సరిరి నిసగరిస
ఇదే ఆది తాళం.. ఇదే ఆదితాళం.. 





సాచి కొడితే.. సరిసరి పద పద సరిసరి పదపద..
ఎదలో సంగీతం
వాచిపోయి ఒళ్ళు కళ్ళు వలపుల భాగోతం

ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం
ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం


********* ************** ************* ******


చిత్రం :  మొగుడు కావాలి (1980)
సంగీతం :  జె.వి. రాఘవులు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  సుశీల

పల్లవి :

సన్నజాజి సందిట్లో సందెకాడా
విరజాజి కౌగిట్లో పొద్దుకాడా...
సన్నజాజి సందిట్లో సందెకాడా
విరజాజి కౌగిట్లో పొద్దుకాడా

ఆనాటి సంపంగి నచ్చలేదా
తెలిసింది నీ కథా తుమ్మెదా
తుమ్మెదా... నా తుమ్మెదా...
ఓ ఎదలేని తుమ్మెదా...

సన్నజాజి సందిట్లో సందెకాడా
విరజాజి కౌగిట్లో పొద్దుకాడా

చరణం 1 :

నీకూ ఒక తోట ఉంది ..తొలకరి ఉందీ...
నీకూ ఒక నీతి ఉంది...నియమం ఉందీ...
నీకూ ఒక తోట ఉంది ..తొలకరి ఉందీ...
నీకూ ఒక నీతి ఉంది...నియమం ఉందీ...

కన్నే నేనై నిన్ను కన్నారా చూడాలనీ...
కలవరించి నిను వరించి కన్నీరైపోతున్నా...
వలచి వచ్చి వాలావు తుమ్మెదా...
ఓ...వలచి వచ్చి వాలావు తుమ్మెదా
మరచి వెళ్ళిపోతావా తుమ్మెదా...ఓ..ఓ..ఓ..

తుమ్మెదా... నా తుమ్మెదా
ఓ ఎదలేని తుమ్మెదా...
సన్నజాజి సందిట్లో సందెకాడా
విరజాజి కౌగిట్లో పొద్దుకాడా...

చరణం 2 :

నాలోనూ మధువు ఉంది... మనసొకటుందీ..
నా వయసు సుగంధాలు వెదజల్లిందీ...
నాలోనూ మధువు ఉంది... మనసొకటుందీ..
నా వయసు సుగంధాలు వెదజల్లింది...

అయినా ఆమని రాని ఎడారి పువ్వును నేనై...
ఆలి కాని మాలి లేని అడవి మల్లెనై ఉన్నా...

పూవులన్ని పళ్ళు కావు తుమ్మెదా...
ఓ... పూవులన్ని పళ్ళు కావు తుమ్మెదా
ఈ పులకరింతలెన్నళ్లే తుమ్మెదా...
ఓ..ఓ..ఓ.. తుమ్మెదా.. నా తుమ్మెదా
ఓ ఎదలేని తుమ్మెదా

సన్నజాజి సందిట్లో సందెకాడా
విరజాజి కౌగిట్లో పొద్దుకాడా...
ఆనాటి సంపెంగి నచ్చలేదా
తెలిసింది నీ కథా తుమ్మెదా
తుమ్మెదా... నా తుమ్మెదా...
ఓ ఎదలేని తుమ్మెదా...

సన్నజాజి సందిట్లో సందెకాడా
విరజాజి కౌగిట్లో పొద్దుకాడా...నాలోనూ మధువు ఉంది... మనసొకటుందీ..
నా వయసు సుగంధాలు వెదజల్లిందీ...
నాలోనూ మధువు ఉంది... మనసొకటుందీ..
నా వయసు సుగంధాలు వెదజల్లింది...

అయినా ఆమని రాని ఎడారి పువ్వును నేనై...
ఆలి కాని మాలి లేని అడవి మల్లెనై ఉన్నా...

పూవులన్ని పళ్ళు కావు తుమ్మెదా...
ఓ... పూవులన్ని పళ్ళు కావు తుమ్మెదా
ఈ పులకరింతలెన్నళ్లే తుమ్మెదా...
ఓ..ఓ..ఓ.. తుమ్మెదా.. నా తుమ్మెదా
ఓ ఎదలేని తుమ్మెదా

సన్నజాజి సందిట్లో సందెకాడా
విరజాజి కౌగిట్లో పొద్దుకాడా...
ఆనాటి సంపెంగి నచ్చలేదా
తెలిసింది నీ కథా తుమ్మెదా
తుమ్మెదా... నా తుమ్మెదా...
ఓ ఎదలేని తుమ్మెదా...

సన్నజాజి సందిట్లో సందెకాడా
విరజాజి కౌగిట్లో పొద్దుకాడా...
 
********* ************** ************* ******


చిత్రం :  మొగుడు కావాలి (1980)
సంగీతం :  జె.వి. రాఘవులు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు,  సుశీల,  ఎస్. పి. శైలజ  

పల్లవి :

ఓ చిలకా.. పలుకే బంగారమా
అహాహ..  నీ అలకే చిలిపి సింగారమా
నేల మీద ఉన్న చందమామ..... ఏలనమ్మ నీకు ఇంత ధీమా
ఓ ప్రియతమా.. కోపమా.. తాపమా.. తాపమా.. తాపమా

ఓ చిలకా.. పలుకే బంగారమా
ఆహాహాహ నీ అలకే చిలిపి సింగారమా

చరణం 1 :

వయసులో ఎందుకీ మనసులు అందుకో సొగసులు
హో హో హో హో హాయిగా
వయసులో ఎందుకీ మనసులు అందుకో సొగసులు
వయ్యారాలే నీదిగా.. కలుసుకో.. కరిగిపో..
వెన్నెల వేళకు వెలిగిపో.. ఆ పాత కథ మరిచిపో
కౌగిలిగింతకు కడ లేదు.. ఈ చక్కిలిగింతకు తుదిలేదు..
ఓ చిలకా.. పలుకే బంగారమా
ఆహాహాహ నీ అలకే చిలిపి సింగారమా
చరణం 2 :

వలపులో రోజుకో మలుపులు.. మోజుతో పిలుపులు
హొ హొ హొ హొ చెల్లవు
వలపులో రోజుకో మలుపులు.. మోజుతో పిలుపులు
హొ హొ హొ హొ చెల్లవు తెలుసుకో.. కలుసుకో..
మనసున మనసై మసులుకో.. నీ పగటి కల మరిచిపో
మల్లెల మాసం మరి రాదు.. అది మన కోసం రాబోదు 
 
ఓ చిలకా.. పలుకే బంగారమా
అహాహ..  నీ అలకే చిలిపి సింగారమా
నేల మీద ఉన్న చందమామ..... ఏలనమ్మ నీకు ఇంత ధీమా
ఓ ప్రియతమా.. కోపమా.. తాపమా.. తాపమా.. తాపమా

ఓ చిలకా.. పలుకే బంగారమా
ఆహాహాహ నీ అలకే చిలిపి సింగారమా
 
********* ************** ************* ******

చిత్రం :  మొగుడు కావాలి (1980)
సంగీతం :  జె.వి. రాఘవులు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :   బాలు

పల్లవి :

ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు
సాగర వీధిని కెరటాలు ఆకాశానికి చేరవు
ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు
సాగర వీధిని కెరటాలు ఆకాశానికి చేరవు
ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు...

చరణం 1 :

మెరిసే మబ్బులు కురిసే వరకే మేఘమాలికలూ
గగనవీధిలో కరిగిపోయే రాగమాలికలూ
మెరిసే మబ్బులు కురిసే వరకే మేఘమాలికలూ
గగనవీధిలో కరిగిపోయే రాగమాలికలూ 

నిలకడ లేని మెరుపులు చూసి మనుగడ అనుకోకూ
నిలకడ లేని మెరుపులు చూసి మనుగడ అనుకోకూ
మట్టికి బిడ్డలు మణులు మనుషులు అదే మరిచిపోకూ
అదే మరిచిపోకూ...
ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు
సాగర వీధిని కెరటాలు ఆకాశానికి చేరవు
ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు...

చరణం 2 :

అమావాస్యలో చందమామకై వెతకవద్దు నీవూ
అంధకారమే వెలుగు చేసుకొని బతకవద్దు నీవూ
అమావాస్యలో చందమామకై వెతకవద్దు నీవూ
అంధకారమే వెలుగు చేసుకొని బతకవద్దు నీవూ 

ఏమీ లేని ఆకాశంలో ఇంద్రధనుసు చూడూ
ఏమీ లేని ఆకాశంలో ఇంద్రధనుసు చూడూ
పేదబతుకులో పెద్దమనసునే మనసు పెట్టి చూడూ
నా మనసు విప్పి చూడూ...
ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు
సాగర వీధిని కెరటాలు ఆకాశానికి చేరవు
ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు
సాగర వీధిని కెరటాలు ఆకాశానికి చేరవు
ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు...

శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం

శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (09-01-1960)

60 సంవత్సరాలక్రితం అంటే 1960 సంవత్సరంలో 

ఎన్ టి ఆర్ 8 సినిమాలలో నటించారు.



సంక్రాంతి కానుకగా 20 ప్రింట్లతో విడుదలైన శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (09-01-1960) 16 కేంద్రాలలో వసూళ్ళ ప్రభంజనంతో ఘనంగా శత దినోత్సవాలు జరుపుకుని ఆ సంవత్సరపు సూపర్ హిట్ సినిమాగా నిలచింది. ఈ చిత్రానికి దాదాపు సమాంతర విజయంగా దసరా కానుకగా విడుదలైన భట్టి విక్రమార్క చిత్రం (28-09-1960) 13 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది. దీపావళి (22-09-1960) ఎన్ టి ఆర్ కు శ్రీ కృష్ణుడిగా మూడవ విజయం తెస్తూ శత దినోత్సవాలు జరుపుకుంది. అలాగే కన్నుల్లో నీ బొమ్మ చూడు అంటూ విమల చిత్రం (11-08-1960) , ఫాంటసీ చిత్రాలకు నాంది పలుకుతూ దేవాంతకుడు చిత్రం (07-07-1960) శత దినోత్సవాలు జరుపుకున్నాయి. వాహినీ వారి రాజ మకుటం (24-02-1960) విజయవంతమైన చిత్రం గా నిలిచింది. రాణీ రత్న ప్రభ (27-05-1960) ఏవరేజి గా నిలిచింది. కాడెద్దులు ఎకరం నేల (06-10-1960) ఫ్లాప్ అయింది.

అక్కినేని నటించిన నమ్మిన బంటు, శాంతి నివాసం, మహా కవి కాళిదాసు, పెళ్ళి కానుక శత దినోత్సవాలు జరుపుకున్నాయి. అన్నపూర్ణ, అభిమానం, మా బాబు ఏవరేజ్ గా నడిచాయి.

ఇవి కాక రేణుకాదేవి మహాత్మ్యం, శ్రీ కృష్ణ రాయబారం, నిత్య కల్యాణం పచ్చ తోరణం, సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి, ధర్మమే జయం, జగన్నాటకం, అన్నా చెల్లెలు, సమాజం, భక్త శబరి, జల్సారాయడు, కుంకుమ రేఖ, భక్త రఘునాధ్, కనకదుర్గా పూజా మహిమ, చివరకు మిగిలేది, మామకు తగ్గ అల్లుడు సినిమాలు విడుదలయ్యాయి.

09-01-1960 న విడుదలైన శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం సినిమా విశేషాలు:- 

తన దర్శకత్వంలో సి.ఎస్.ఆర్., శాంతకుమారిలతో నిర్మితమై 1939లో విడుదలై విజయవంతమైన శ్రీ వేంకటేశ్వర మహత్యం (బాలాజీ) చిత్రాన్ని పునర్నిర్మించారు పి.పుల్లయ్య. తొలి చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో ఈ చిత్రం కూడా అంత సంచలనం సృష్టించింది. రెండు సార్లు నిర్మితమైన చిత్రాలకు పి.పుల్లయ్య దర్శకత్వం వహించారు. పి.పుల్లయ్య స్వంతంగా స్ధాపించిన పద్మశ్రీ పిక్చర్స్ తొలి చిత్రం 09-01-1960 లో విడుదలైన శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం . ఈ చిత్ర విజయం లవకుశ సినిమా పునర్మిణానికి స్ఫూర్తి కలిగించింది. 1939లో నిర్మితమైన చిత్రంలో పద్మావతి గా నటించిన శాంతికుమారి ఈ చిత్రంలో వకుళమాతగా నటించారు.

లోక కల్యాణానికి సప్త ఋషులు చేస్తున్న యజ్ఞంలో ఆవిష్షును త్రిమూర్తులలో ఎవరికి సమర్ఫిస్తున్నారన్న నారదుని ప్రశ్నకు త్రిమూర్తులను పరీక్షించుటకు భృగు మహార్షి బయలు దేరతాడు. బ్రహ్మ, సరస్వతి వీణానాదం లో మైమరచి భృగును పట్టించుకోడు. భూలోకంలో బ్రహ్మకు పూజలు జరగవని శపించి కైలాసానికి వెళతాడు. అక్కడ శివుడు పార్వతి తో తాండవంతో మునిగి భృగు రాకను గమనించడు.. శివునికి లింగ రూపంలోనే పూజలు జరుగు తాయని శపించి వైకుంఠానికి వెళతాడు..లక్ష్మీదేవి పాదాలు వత్తుతూ ఉండగా నిదురలో ఉన్న శ్రీ మహావిష్ణువు భృగు రాక గమనించడు..భృగు కోపించి శ్రీమహావిష్ణువు వక్షస్ఠలము పై కాలితో తంతాడు..

శ్రీ మహా విష్ణువు లేచి భృగుని శాంతపరిచే నెపంతో భృగు పాదంలో ఉన్న కంటిని వత్తుతాడు.. భృగువుకు జ్ఞానోదయమవుతోంది.. తన నివాస స్థలాన్ని కాలితో తన్ని అవమానించాడని శ్రీమహాలక్ష్మి విష్ణువుపై అలుక వహించి భూలోకానికి వెళుతుంది. శ్రీమహాలక్ష్మిని వెతుకుతూ భూలోకానికి వచ్చి తపస్సులో నిమగ్నవుతాడు శ్రీమహావిష్ణువు. శ్రీ మహా విష్ణువు ఆకలి తీర్చడానికి శివుడు, బ్రహ్మ ఆవు దూడలు కాగా శ్రీమహాలక్ష్మి గోప కాంత యై ఆ ఆవుదూడలను ఆ రాజ్యాన్ని ఏలుతున్న మహారాజుకు అమ్ముతుంది. ఆవు మంద నుండి వేరుపడి శ్రీ మహావిష్ణువు తపస్సు చేస్తున్న వల్మీకంపై పాలను వర్షిస్తుంది. ఆవు పాలను తక్కువగా ఇస్తూ ఉండడంతో ఆవును వెంటాడిన గోపాలకుడు ఆవును కొట్టబోగా ఆ దెబ్బ శ్రీమహావిష్ణువుకు తగులుతుంది. గోపాలకుడిని పిశాచిగా మారమని శపిస్తాడు..

గాయపడిన మహావిష్ణువు సమీపంలో ఉన్న వకుళ మాత ను చేరతాడు.. అతనిని శ్రీనివాసునిగా పిలుస్తూ అతనిపై పుత్ర వాత్సల్యం చూపుతుంది. వ్యాహళికి బయలుదేరిన శ్రీనివాసుడు, ఆకాశరాజు కుమార్తె పద్మావతి ని చూసి ఆమెను వలిచి ఆ విషయాన్ని వకుళకు చెబుతాడు..వకుళ ఆకాశ రాజును కలిసి వివాహానికి అతడిని అంగీకరింప చేస్తుంది. కుబేరుని ఆర్ధిక సహాయంతో శ్రీనివాసుని వివాహం ఆకాశరాజు కుమార్తె పద్మావతితో జరుగుతుంది. ఈ విషయం తెలిసిన శ్రీమహాలక్ష్మి అచ్చటకు చేరుతుంది.. సపత్నుల కలహంతో శిలగా మారతాడు శ్రీనివాసుడు. అతనితో సతులూ.. పిమ్మట బావాజీ వృత్తాంతం, శ్రీనివాసుని మహిమలు చూపే ఇతర కథలు చిత్రంలో పొందు పరిచారు.

స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు: ఆత్రేయ (ఆరుద్ర, మల్లాది రామకృష్ణశాస్ర్తీ ఒక్కో పాట వ్రాయగా, పద్యాలను నారపరెడ్డి వ్రాశారు)

కెమెరా: పియల్ రాయ్, కళ: యస్‌వియస్ రామారావు, ఎడిటింగ్: కెఎ శ్రీరాములు, సహాయ దర్శకులు:కె రాఘవేంద్రరావు, యు విశ్వేశ్వర రావు, సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు, నృత్యం: వెంపటి సత్యం, నిర్మాత: వి వెంకటేశ్వర్లు

ఎన్టీ రామారావు శ్రీనివాసునిగా, యస్ వరలక్ష్మి శ్రీదేవిగా, సావిత్రి పద్మావతిగా , వకుళమాతగా శాంతకుమారి , భృగుమహార్షిగా గుమ్మడి, ఆకాశరాజుగా ఎ వి సుబ్బారావు, బావాజీగా నాగయ్య, శరభ దంపతులుగా రమణా రెడ్డి సురభి బాల సరస్వతి, ధరణీదేవిగా ఋష్యేంద్రమణి, నారదుడిగా పి సూరిబాబు, బ్రహ్మగా ఎ. వి. సుబ్బారావు జూనియర్, సరస్వతిగా సంధ్య, మహా శివుడిగా వెంపటి సత్యం, ఎరుకలసానిగా షావుకారు జానకి, ఇంకా ఘంటసాల, లంక సత్యం, లవకుశలో నటించిన మాస్టర్ నాగరాజు సావిత్రి తమ్ముడిగా, మాస్టర్ సుబ్రహ్మణ్యం బాల కృష్ణుడిగా , సరస్వతిగా సంధ్య, పార్వతిగా కెవి శాంతి, మహరాజుగా రాజనాల, ఆశ్రమంలో శిష్యులుగా బాలకృష్ణ, పేకేటి శివరామ్, పద్మావతి చెలికత్తెలుగా మోహన, ‘బాల’ నృత్య నాటికలో మన్మధునిగా రీటా నటించారు. ఇతర పాత్రలను మద్దాలి కృష్ణమూర్తి, వంగర, వైవి రాజు పోషించారు.

దర్శకులు పి పుల్లయ్య బలవంతం వల్ల ఘంటసాల ఇందులో స్వామివారి ముందు పాటపాడే భక్తుని పాత్ర పోషించారు. వారి ఇష్టదైవం శ్రీ వెంకటేశ్వరుడు కావటం కూడా ఆయన ఈ సన్నివేశంలో నటించటానికి ఓ కారణం. ఈ పాటలో ఘంటసాలతోపాటు సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు, వేణువువాయించే నంజప్ప, ఘంటసాల పెద్ద కుమారుడు విజయ్‌కుమార్ సైతం కనిపిస్తారు. ఆ సన్నివేశంలోని అద్భుతమైన, చిరస్మరణీయమైన భక్తిగీతం ‘శేష శైలావాస శ్రీవెంకటేశా’ (ఘంటసాల- ఆత్రేయ).

ఒకసారి నిర్మించి విజయవంతమైన చిత్రాన్ని తిరిగి తామే నిర్మించి విజయవంతం చేసిన ఘనత దర్శకులు పుల్లయ్యకు దక్కింది. మొదటిసారి ఈ చిత్రాన్ని నిర్మించినపుడు థియేటర్లలో శ్రీ వెంకటేశ్వరుని విగ్రహాలు, హుండీలు పెడితే, హుండీలు తొందరగా నిండిపోయేవి. రెండోసారి చిత్రాన్ని నిర్మించినప్పుడు అదేవిధంగా జరగటం విశేషం. ఆ హుండీల్లో డబ్బు తిరుపతి పంపించేవారు. ఇదికూడా ఓ విశేషాంశం.

‘శ్రీవెంకటేశ్వర మహత్యం’లో శ్రీనివాసునిగా, మహావిష్ణువుగా ఎన్టీ రామారావు ఎంతో సమ్మోహనంగా, గంభీరంగా, తల్లివద్ద పెళ్ళికొరకు అలక పూనిన సన్నివేశంలో ముచ్చటగా నటించి అలరించారు. భృగు మహర్షి (గుమ్మడి) గర్వం, అజ్ఞానం తొలగించే సన్నివేశం లో ఎన్ టి ఆర్ (మహా విష్ణువు) అపూర్వమయిన నటనతో , విలక్షణమైన డైలాగ్ మాడ్యులేషన్ తో అత్యున్నత శిఖరాలకు చేరడం ప్రేక్షకులు గమనిస్తారు. ఆ తరువాత వకుళాదేవి ఆశ్రమంలో ఘంటసాల ఆలపించిన ఎవరివాడ నేను, ఎల్లరు నా వారు అనే అపొరూపమైన పద్యానికి అద్భుతమైన అభినయం చేస్తారు ఎన్ టి ఆర్.

ఇక శ్రీలక్ష్మిగా యస్ వరలక్ష్మి వైకుంఠం వీడి వెళ్ళే సమయంలో ఆత్మాభిమానాన్ని, భర్తకై ఆవేదన సమయాల్లో కరుణరసం, చివర భర్త మరో స్త్రీని వివాహం చేసుకున్నాడన్న ఆగ్రహం, ఆవేదన సమర్ధవంతంగా నటించి చూపించారు. పద్మావతిగా మహానటి సావిత్రి శ్రీనివాసునిపై ప్రేమ, విరహాన్ని, భర్తతో ప్రణయ పారవశ్యాన్ని, శ్రీలక్ష్మితో సంవాదనలో క్రోథాన్ని, వేడికోలు ఎంతో సంయమనంతో ప్రదర్శించగా శాంతకుమారి వకుళమాతగా భక్తిపారవశ్యాన్ని కడురమణీయంగా, నారదుని వల్ల తన పూర్వజన్మ తెలిసికొన్న సమయంలో ఆనందాన్ని ఎంతో భావుకతతో మెప్పించారు. ఎరుకలసానిగా గుఎస్త్ గా నటించిన షావుకారు జానకి, ఆ కొద్దిసేపటిలోనే చక్కని హావభావాలు ప్రదర్శించటం ఆకట్టుకుంటుంది.

శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్ర గీతాలు అద్భుతమనే చెప్పాలి.

1. ఎన్టీ రామారావు, యస్ వరలక్ష్మిపై చిత్రీకరించిన ప్రణయగీతం ‘శ్రీదేవిని, నీదు దేవేరిని’ (యస్.వరలక్ష్మి- ఆరుద్ర);
https://www.youtube.com/watch?v=eTrOP38WBwQ 

2. ఎన్టీఆర్, గుమ్మడిలపై చిత్రీకరించిన పద్యం ‘పావనంబయ్యె’ (ఘంటసాల, నారపరెడ్డి); ‘కన్నుల కండకావరము’ ‘నమో నారాయణ’ (మాధవపెద్ది సత్యం- నారపరెడ్డి);

"కఠిన కౌస్తుభాలంకృతమైన నా వక్షస్థలమును తాకి, మీ కోమలపదకమలములు ఎంత కందినవో? ఎంత నొచ్చినవో? అపచారిని! ఉపచారము చేయనిండు!"

పావనంబయ్యెనయ్య నా జీవనంబు
పావనంబాయె ఈ కౌస్తుభంబు
దానసిరియు సిరియేలు వైకుంఠపురముగూడ
పావనంబాయె నేడు తాపసవరేణ్యా!!
https://www.youtube.com/watch?v=78eHMtA_uNI 

3. ఆశ్రమంలో వకుళమాతపై చిత్రీకరించిన ‘గోపాలా, నందగోపాల’ (శాంతకుమారి, బృందం -ఆత్రేయ) ఈనాటికి మధురమైన భక్తిగీతంగా అలరిస్తున్నది.
https://www.youtube.com/watch?v=6KLid-HkoFc 

4. సావిత్రి, ఎన్టీఆర్లపై చిత్రీకరించిన మనోల్లాసమైన యుగళ గీతం, జలపాతాలు, మేఘాలు, కొండలు, పచ్చని చెట్లమధ్య ఆహ్లాదభరితంగా చిత్రీకరణ సాగిన ‘కలగా కమ్మని కలగా మన జీవితాలు మనవలెగా’ -అని పద్మావతి, ‘వెలుగు చీకటుల కలబోసినవి, కాలము చేతిలో కీలుబొమ్మలు’ -అని శ్రీనివాసుడు, ‘మమతే జగతిని నడుపుతున్నది’ -అని పద్మావతి, ‘ప్రేమకు శోకము ఫలమేమో , రాగము, త్యాగము జతలేమో’ అంటూ శ్రీనివాసుడు తరువాతి కథ సూచించటం, ఎంతో భావయుక్తంగా సాగిన ఈ పాటకు ఆత్రేయవారు బాణీ సూచించటం విశేషం (గానం- ఘంటసాల, పి.సుశీల).
https://www.youtube.com/watch?v=BWJvvrJ2pHE 

5. ఆవు దూడలను బజారులో విక్రయిస్తూ ఎస్ వరలక్ష్మి తదితరులపై చిత్రీకరించిన గీతం ‘వరాల బేరమయా, వనరంబేరమయా పరాకు చేయకు’ (యస్.వరలక్ష్మి- ఆత్రేయ);
https://www.youtube.com/watch?v=05y6kVuUNy0 

6. అచ్చం తిరుపతిలాగే గర్భాలయ సెట్ను వాహిని ఆవరణలో ఓ ఫ్లోర్లో వేసి దేవుడిని ప్రతిష్టించారు. గర్భగుడిలోని మూల విరాట్ విగ్రహం, సినిమాలోని విగ్రహాలు కెజి వేలుస్వామి అనే శిల్పకారుడు తయారు చేయగా కళాదర్శకుడు ఎస్విఎస్ రామారావు సెట్ను ఎంతో సహజంగా రూపొందించారు. ఈ సెట్లోనే ఘంటసాల ఆలపించిన ‘శేష శైలావాసా’ పవళింపు సేవగీతం చిత్రీకరణ జరిపారు.
https://www.youtube.com/watch?v=63EQ-6oJvuA 

7. వేగ రా రా
https://www.youtube.com/watch?v=yvr4f2ehiNo 

8. పాహి హరే
https://www.youtube.com/watch?v=C16aHfHDCxM 

9. కల్యాణ వైభవమీనాడే
https://www.youtube.com/watch?v=k2fCBRza05Y 

10. ఎవరో తానెవరో
https://www.youtube.com/watch?v=1R3uSwQb7uk 

ఎవరతను? మన్మధుడా (వల రాజా) ? కళ్ళకు కనబడుతున్నాడే. పోనీ చంద్రుడా (కలువలరాజా), హరిణంకుడు (జింక చిహ్నం మచ్చగా గల చంద్రుడు) కాదే. అతను అకలంకుడే (మచ్చ లేనివాడే)...గొప్ప భావుకత. కరుణను చూపి కబురు తెలిపి అనే వాక్యం లో కబురు అనే ఉర్దూ పదాన్ని వాడినందుకు బాధ పడి మల్లాది వారితో చెబితే, పరవాలేదు, ఆ కాలం లో బీబీ నాంచారమ్మ కూడా ఉందిగా అన్నారట మల్లాది. బృందావన సారంగ రాగం.

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ, నేపధ్య గానం : ఘంటసాల, సుశీల , ఎన్ టి రామారావు, సావిత్రి
ఆ... ఆ... ఆ..ఆ... ఆ... ఆ.. ఆ..
ఎవరో.. అతడెవరో.. ఆ నవమోహనుడెవరో...
నా మానసచోరుడెవరో.. ఎవరో.. అతడెవరో..
తొలిచూపులలో వలపులు చిలికి.. దోచిన మగసిరి దొర ఎవరో..
అరయగ హృదయము అర్పించితినే.. ఆదరించునో.. ఆదమరచునో ఎవరో..
వలరాజా? కలువలరాజా? కాడే.. కనులకు కనులకడుపడినాడే..
అకళంకుడే.. హరినాంగుడు కాడే..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
అకళంకుడే.. హరినాంగుడు కాడే.. మరి ఎవరో.. ఏమయినాడో...ఎవరో.
ఎవరో.. తానెవరో... ఆ నవమోహిని.. ఎవరో..
నా మానసహారిణి.. ఎవరో..
ఎవరో.. తానెవరో... ఆ నవమోహిని.. ఎవరో..
నందనవనమానందములో.. తొలిసారిగ పూచిన పువ్వో..
తొలకరి యవ్వనం ఒలికిన నవ్వో...
మనసిచ్చినదో.. నను మెచ్చినదో..
ఆ... జవ్వని..ఎవరో.. తానెవరో...
**************
ఎవరో.తానెవరో , దివ్య ప్రణయనందనంలో విరిసిన సుమధుర పారిజాతం ఈ గీతం!! 
http://yugalageetham.blogspot.com/2014/10/blog-post.html?m=1 
************************
11. తిరుమల మహిమలు తెలియచెప్పే గీతంలో ఓ భక్తుడు భార్యతో పాడే పాట ‘పదవే పోదాము గౌరీ’ (పిఠాపురం- ఆత్రేయ) అత్యద్భుత గీతాలే. ఈనాటికీ ఈ చిత్ర గీతాలు శ్రోతలను అలరించటం ఆనందదాయకం.
https://www.youtube.com/watch?v=Gybmj92XAEE 

12. ‘జయజయ జగన్నాయక జయ జయ’ (వెంపటి పెదసత్యం తదితరుల బృందగీతం -మల్లాది రామకృష్ణశాస్ర్తీ);
https://www.youtube.com/watch?v=ak-8YqRf7-U 

13. పశుకాపరి రమణారెడ్డి, అతని భార్య సురభి బాలసరస్వతిపై చిత్రీకరించిన గీతం ‘సిలకో చిక్కావే ఈనాడు సింగారమొలుకుతూ’ (పిఠాపురం- బాల, స్వర్ణలత -ఆత్రేయ)
https://www.youtube.com/watch?v=Y1y5E7eV9-o 

14. చిన్నారి ఓ చిలుక విన్నావా, ఆత్రేయ, పెండ్యాల, సుశీల, సావిత్రి, ఎన్ టి ఆర్, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం 1960, తిలంగ్ రాగం . నిడివి కారణంగా చిత్రంలోనుండి ఈ పాటను తొలగించారు. ఆ రోజుల్లో విడుదలైన 78 ఆర్ పి ఎం రికార్డుల్లో మాత్రమే లభ్యం. పొలయలుకలు అంటే ప్రణయ కోపములు అని అర్ధం.

చిన్నారి ఓ చిలుక విన్నావా
ఇన్నాళ్ళ కోరిక ఈడేరే వేడుక - చిన్నారి
ఏమని నా స్వామికి మనవి చేసినావో
నా మనసు తెలిపినావో
ఫలియించే నీ మాట పల్లవించె నా పాట - చిన్నారి
పెళ్ళి పీటలపై నున్న వేళ ఒళ్ళు మరచి పిలిచేవు
నేనేననుకుని తాను వులికిపడేను
నలుగురు ననుజూచి నవ్వుకునేరు - చిన్నారి
అత్తవారి ఇల్లు మనకు కొత్తచోటు అయినా
తొలి వలపు ముచ్చటలో పొలయలుకలు వచ్చేనా
బెట్టు చేసి వారిని కవ్వించవే
ప్రేమతో నను చేరి నవ్వించవే - చిన్నారి
https://www.youtube.com/watch?v=iXIKc4J0yyw 

చిలిపిచేష్టల తన్నిన చిన్ని పాప
చివురుటడుగుల ముద్దులు చిలికి మురిసి
తనియుదురుగాని యే తల్లిదండ్రులైన
ఆగ్రహింతురే బిడ్డపై అంబుజాక్షి!
ఒంటివాడ నేను ఉనికి యీ జగమెల్ల
కన్నవారులేరు కలను నేను
యెవరివాడ కాను యెల్లరు నావారె
తొల్లికలదు సిరియు తొలగె నేడు!!

ఆత్రేయ వ్యాఖ్యానంతో అసలు సినిమా పూర్తయ్యాక వెంకటేశ్వరుని మహిమలు, ఆయనకు జరిగే పూలంగిసేవ, నేత్ర దర్శనం, చంద్రప్రభ, సూర్యప్రభ వాహనాలపై స్వామివారి ఊరేగింపులు, పవళింపుసేవ వివరంగా చూపటం ఎంతో హర్షణీయం.

వైకుంఠం లో ఆ 15 నిముషాల సన్నివేశం మనల్ని అలౌకికానందాన్ని కలుగచేసి మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. అలాగే శిలా విగ్రహం నుండి ఎన్ టి ఆర్ నడచి వచ్చే సీను చూసి పరవశించని వారుండరు. రాముడు, కృష్ణుడు పాత్రలు వేయడం వేరు, కలియుగ దైవం గా భావించే వేంకటేశ్వరుని పాత్రలో తాధాత్మ్యం చెందుతూ నటించడం వేరు కదా.

ఎన్టీఆర్, గుమ్మడిలపై చిత్రీకరించిన పద్యాలు ‘పావనంబయ్యె’ (ఘంటసాల) ‘కన్నుల కండకావరము’ స్త్రోత్రం ‘నమో నారాయణ’ (మాధవపెద్ది సత్యం) నారపరెడ్డి గారు రచించారు.

1939 లో వచ్చిన శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (సి ఎస్ ఆర్ , శాంతకుమారి శ్రీనివాస్ పద్మావతులుగా) సినిమాకు మాటలు కవికోకిల దువ్వూరి రామిరెడ్డి సంబాషణలందించారు

20 ప్రింట్లతో విడుదలైన ఈ చిత్రం ఏకంగా 16 కేంద్రాలలో వసూళ్ళ ప్రభంజనంతో ఘనంగా శత దినోత్సవాలు జరుపుకుని ఇండస్ట్రీ హిట్గా రికార్డు సృష్టించింది. శతదినోత్సవ సందర్భంగా ఆ రోజు పేపర్ ప్రకటనలో ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షక జనం కోటికి పైగా ఉన్నట్టు నిర్మాతలు తెలిపారు. ఒకచోట రజితోత్సవం జరుపుకుంది..

---సేకరణ

సి.ఐ.డి (1965)

 


చిత్రం:  సి.ఐ.డి (1965)
సంగీతం:  ఘంటసాల
సాహిత్యం:  పింగళి
గానం:  సుశీల
నటీనటులు: యన్.టి.రామారావు, జమున, పండరీ భాయి
దర్శకత్వం: తాపీ చాణక్య
నిర్మాతలు: బి. నాగిరెడ్డి, చక్రపాణి
విడుదల తేది: 23.09.1965

పల్లవి:
యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి .. ఐసవుతావా అబ్బాయి
యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి .. ఐసవుతావా అబ్బాయి

విరహమె నీకు శీతలమైతే .. ఆ ..
విరహమె నీకు శీతలమైతే వెచ్చని కౌగిట ఊచెదనోయి

యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి ..ఐసవుతావా అబ్బాయి

చరణం: 1
కనుచూపులతో పలుకరింపగ కందిపోతివా పాపాయి
కనుచూపులతో పలుకరింపగ కందిపోతివా పాపాయి
ఉగ్గుపోసి నీ సిగ్గు వదలగా ..
ఉగ్గుపోసి నీ నీ సిగ్గు వదలగ.. తమలపాకుతో విసిరెదనోయి..

యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి ..ఐసవుతావా అబ్బాయి

చరణం: 2
పెదవి కదపకే ప్రేమ గీతమును మొదలు పెడితివా బుజ్జాయి.. ఓ .. ఓ ..
పెదవి కదపకే ప్రేమ గీతమును మొదలు పెడితివా బుజ్జాయి
మూగమనసె నీ మోజైతే ...
మూగమనసె నీ మోజైతే మాటాడక జరిగేరెదనోయి..
యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి ..

విరహమె నీకు శీతలమైతే వెచ్చని కౌగిట ఊచెదనోయి
యువతులు చూసి చూడక ముందే

ఐసవుతావా అబ్బాయి .. ఐసవుతావా అబ్బాయి


******  ******  *******


చిత్రం:  సి.ఐ.డి (1965)
సంగీతం:  ఘంటసాల
సాహిత్యం:  పింగళి
గానం:  పి.సుశీల

పల్లవి:
నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే

నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే 

చరణం: 1
ఆశాలత మొగ్గలేసి పూలు విరగపూసెనే
ఆశాలత మొగ్గలేసి పూలు విరగపూసెనే
తలపులెల్ల వలపులై.. పులకరింపజేసెనే
తలపులెల్ల వలపులై.. పులకరింపజేసెనే .. పరవశించి పోతినే..

నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే

చరణం: 2
చందమామ నేడేలనో చలి వెన్నెల కాయడే
చందమామ నేడేలనో చలి వెన్నెల కాయడే
గాలి కూడా ఎందుకనో నులి వెచ్చగ వీచెనే
గాలి కూడా ఎందుకనో నులి వెచ్చగ వీచెనే.. మేను కందిపోయెనే..

నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే

నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
ఆ ఆ ఆ ఆ... ఓ ఓ ఓ ఓ... ఊ ఊ ఊ ఊ ...


******  ******  *******


చిత్రం:  సి.ఐ.డి (1965)
సంగీతం:  ఘంటసాల
సాహిత్యం:  పింగళి
గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి:
నా సరినీవని నీ గురినేనని... ఇపుడే తెలిసెనులే
తెలిసినదేమో తలచినకొలది... పులకలు కలిగెనులే
నీకు నాకు వ్రాసి ఉన్నదని... ఎఫుడో తెలిసెనులే
తెలిసినదేమో తలచినకొలది... కలవరమాయెనులే

నా సరి నీవని... నీ గురి నేనని... ఇపుడే తెలిసెనులే

చరణం: 1
నా హృదయమునే వీణ చేసుకొని.. ప్రేమను గానం చేతువని..
ఆ...ఆ...ఆ...
నా హృదయమునే వీణ చేసుకొని... ప్రేమను గానం చేతువని
నీ గానము నా చెవి సోకగనే.. నా మది నీదై పోవునని
నీ గానము నా చెవి సోకగనే .. నా మది నీదై పోవునని...

నీకు నాకు వ్రాసి ఉన్నదని... ఎపుడో తెలిసెనులే

చరణం: 2
నను నీ చెంతకు ఆకర్షించే... గుణమే నీలో ఉన్నదని
నను నీ చెంతకు ఆకర్షించే... గుణమే నీలో ఉన్నదని
ఏమాత్రము నీ అలికిడి ఐనా... నా ఎద దడ దడలాడునని
ఏమాత్రం నీ అలికిడి ఐనా... నా ఎద దడ దడలాడునని

నా సరినీవని.. నీ గురి నేనని... ఇపుడే తెలిసెనులే
తెలిసినదేమో తలచిన కొలది... కలవారమాయెనులే
నా సరి నీవని... నీ గురి నేనని...ఇపుడే తెలిసెనులే


******  ******  *******


చిత్రం:  సి.ఐ.డి (1965)
సంగీతం:  ఘంటసాల
సాహిత్యం:  పింగళి
గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి:
నా మనసు నీ మనసు ఒకటై మనమొకటిగా
ఎలా ఏకమౌదుమో.. ఎలా కలిసిపోదుమో..
ఎలా ఏకమౌదుమో.. ఎలా కలిసిపోదుమో..
నా తనువు నీ తనువు వేరు వేరు వేరయినా
పాలు నీరు కలియనటులనే.. కలిసిమెలసి పోదము
పాలు నీరు కలియనటులనే.. కలిసిమెలసి పోదము

చరణం: 1
నీ హక్కులు నా హక్కులు.. వేరు వేరు వేరయినా..ఆ..ఆ..
నీ హక్కులు నా హక్కులు.. వేరు వేరు వేరయినా
కీచులాట లేకుండా మచ్చికతో ఉందమా
కీచులాట లేకుండా మచ్చికతో ఉందమా

నా మనసు నీ మనసు ఒకటై మనమొకటిగా
ఎలా ఏకమౌదుమో.. ఎలా కలిసిపోదుమో..

చరణం: 2
నీ ప్రాణము నా ప్రాణము ఒకటి ఒకటి ఒకటైనా..ఆ..ఆ..
నీ ప్రాణము నా ప్రాణము ఒకటి ఒకటి ఒకటైనా..
నీవంటే.. నీవనచు.. ఊఁ..ఆపావే?
నీవంటే.. నీవనచు.. కీచులాడుకొందుమా..

నా తనువు నీ తనువు వేరు వేరు వేరయినా
పాలు నీరు కలియనటులనే కలిసి మెలసి పోదము..
ఆ..ఆ..ఆ..ఆ..
ఆ..ఆ..ఆ...ఆ..
ఊ..ఊ..ఊ..ఊ..


******  ******  *******


చిత్రం:  సి.ఐ.డి (1965)
సంగీతం:  ఘంటసాల
సాహిత్యం:  పింగళి
గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి:
ఎందుకనో నిను చూడగనే.. కవ్వించాలని ఉంటుంది
ఎందుకనో నిను చూడగనే.. కవ్వించాలని ఉంటుంది
కవ్వించి నీవు కలహమాడితే నవ్వుకొనాలని ఉంటుందీ..
ఎందుకనో...ఓ..ఓ..

ఎందుకనో నిను చూడగనే.. ఏదో ఇదిగా ఉంటుంది..
ఎందుకనో నిను చూడగనే.. ఏదో ఇదిగా ఉంటుంది..
నీ పెదవులపై నవ్వు చిందితే.. మనసు చల్లగా ఉంటుందీ..
ఎందుకనో..ఓ...ఓ..ఎందుకనో

చరణం: 1
అడుగడుగున నీ రాజసమంతా.. ఒలికిస్తూ నువు కులుకుతు ఉంటే..
అడుగడుగున నీ రాజసమంతా.. ఒలికిస్తూ నువు కులుకుతు ఉంటే..

కొంగున కట్టుకు నిను తిప్పాలని..
నా కొంగున కట్టుకు నిను తిప్పాలని..
ఏదో వేడుక పుడుతుంది.... ఎందుకనో..

ఎందుకనో నిను చూడగనే.. ఏదో ఇదిగా ఉంటుంది..
కవ్వించి నీవు కలహమాడితే..  నవ్వుకొనాలని ఉంటుందీ..
ఎందుకనో...ఓ..ఓ..

చరణం: 2
అణువణువున నీ సొంపులు ఒంపులు.. నను మైకంలో ముంచుతు ఉంటే..
అణువణువున నీ సొంపులు ఒంపులు.. నను మైకంలో ముంచుతు ఉంటే..

నీలో ఐక్యం చెందాలంటూ...నీలో ఐక్యం చెందాలంటూ... ఏదో తహతహ పుడుతుందీ.. ఎందుకనో..

ఎందుకనో నిను చూడగనే.. కవ్వించాలని ఉంటుంది
కవ్వించి నీవు కలహమాడితే.. నవ్వుకొనాలని ఉంటుందీ..
ఎందుకనో...ఓ..ఓ.. ఎందుకనో...
ఆ..ఆ..ఆ.. ఓ..ఓ..ఓ..
అహా..హా..ఆ..హా.. ఓ..ఓహో..ఓహో..ఓ...

తేనె మనసులు (1965)





చిత్రం: తేనె మనసులు (1965)
సంగీతం: కె.వి.మహాదేవన్
సాహిత్యం: ఆత్రేయ , దాశరధి
గానం: సుశీల, ఘంటసాల

(ఘట్టమనేని కృష్ణ గారికి ఇది మొదటి సినిమా , ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ గారు దీనికి సహాయ దర్శకుడుగా పనిచేశారు)

ఒన్ టూ త్రీ ఫోర్
ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్
మాస్టారూ డ్రిల్ మాస్టారూ
8 7 6 5 4 3 2 1
మానేస్తారా ఇక మానేస్తారా
ఉద్యోగం ఇస్తాము చేస్తారా ఒక
ఉద్యోగం ఇస్తాము చేస్తారా
ఒళ్ళు పంచి పని చేయాలి
మెదడుకు పదును పెట్టాలి
అమ్మయ్యే మెదడే
అది లేకున్నా పరవలేదు
మీకు తోడుగా వుంటాను
అమ్మయ్యా వుంటారా
మెలుకువగా పని చేశారంటే
మీరే దొరలా వస్తారు మరి జీతం
నెలకు ముప్పై రోజులు జీతం
రోజుకు రెండే పూటలు బత్తెం చిత్తం
పూటపూటకు పని వుంటుంది
నాలుగు రోజులు సెలవుంటుంది
సెలవుల్లో ఏం చేయాలి
మా కొలువుననే మీరుండాలి
మా కనుసన్నలలో మెలగాలి
దానికి జీతం నా జీవితం


*******   *******  ******


చిత్రం: తేనె మనసులు (1965)
సంగీతం: కె.వి.మహాదేవన్
సాహిత్యం: ఆత్రేయ , దాశరధి
గానం: సుశీల

అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదిలే
అదేమిటో! ఆడదంటే మగవాడికి అలుసులే

ఎవడో ఒకడన్నాడని
అదియే ప్రజావాక్యమని
అగ్ని వంటి అర్థాంగిని అడవి కంపె రాముడు
శ్రీరాముడు

ధర్మం ధర్మమని జూదమాడి ఒక రాజు
ఆలి నోడినాడు సత్యం సత్యమని ఒక మగడు
సతిని అమ్మినాడు అదేమిటో ఆడదంటె మగవాడికి అలుసులే


*******   *******  ******


చిత్రం: తేనె మనసులు (1965)
సంగీతం: కె.వి.మహాదేవన్
సాహిత్యం: ఆత్రేయ , దాశరధి
గానం: సుశీల, ఘంటసాల

చందమామా అందాలమామా
నీ ఎదుట నేను వారెదుట నీవు
మా ఎదుట ఓ మామ ఎప్పుడుంటావు
పెళ్ళి చూపులకు వారొచ్చారు
చూడాలని నే ఓరగ చూశా
వల్లమాలిన సిగ్గొచ్చింది
కన్నుల దాకా కన్నులు పోక
మగసిరి ఎడదనె చూశాను
తలదాచుకొనుట కది చాలన్నాను

పెళ్ళి చూపులలో బిగుసుకొని
పేరేమి నీ చదువేమి
నను ప్రేమిస్తావా వయసెంత
అని అడిగారా అసలొచ్చారా
నాలో వారు ఏం చూశారో
నా వారయ్యారుఅందులకే
మా ఇద్దరి జంట అపురూపం అంట

చల్లని వెన్నెల దొరవంటారు
తియ్యని నవ్వుల సిరివంటారు
ఆ వెన్నెలలో వేడిగాడ్పులు
నవ్వులలోని నిప్పురవ్వలు
అనుభవించి అనమంటాను
వయసుకు వైరవి నీవంటాను
చందమామా! అందాలమామ


*******   *******  ******


చిత్రం: తేనె మనసులు (1965)
సంగీతం: కె.వి.మహాదేవన్
సాహిత్యం: ఆత్రేయ , దాశరధి
గానం: సుశీల, ఘంటసాల

పురుషుడు నేనై పుట్టాలి
ప్రకృతి నీవే రావాలి
ఇరువురి మనసులు కలవాలి
ఆ కలయిక కళకళలాడాలి

పుడమే నేనై పుట్టాలి
ఒడిదుడుకులను ఓర్వాలి
కడలిని నదినీ కలపాలి
ఆ కలయిక కళకళలాడాలి

మెరమెరలాడే వయసు నేనై
మిసమిసలాడే సొగసు నీవై
వెల్లువలాగా వెన్నెలలాగా
ముల్లోకాలను ముంచాలి

పైమెరుగులకే పరవశమయ్యే
పరువానికి పగ్గం వేసి
పగ్గం కట్టిన కన్నె మనసులో
లోతులు తెలిసి మసలాలి

దేవుడు నేనై పుట్టాలి
దేన్నో తాను ప్రేమించి
ఆడదాని మనసంటేనే
విషమని తెలిసి ఏడ్వాలి

గాజు వంటి హృదయం తనది
రాతి వంటి నాతికి తగిలి
ముక్కలు చెక్కలుగా పగిలి
నెత్తురు కన్నీరవ్వాలి


*******   *******  ******


చిత్రం: తేనె మనసులు (1965)
సంగీతం: కె.వి.మహాదేవన్
సాహిత్యం: ఆత్రేయ , దాశరధి
గానం: సుశీల , ఘంటసాల

ఏం ఎందుకని
ఈ సిగ్గెందుకని
ఎవరికి తెలియదని

దీపముంటే సిగ్గంటిని
చీకటైనా సిగ్గెందుకు
మొగ్గ విరిసే తీరాలి
సిగ్గు విడిచే పోవాలి

ఆ గదిలో నీ హృదిలో
కౌగిలిలో ఈ బిగిలో
ఏలా వుందో ఏమౌతుందో
ఏం చేయాలని నీకుందో చెప్పు

ఊహు! పక్కన చేరాడా చెల్లీ
చెక్కిలి నొక్కాడా
ఇక్కడనా చెక్కిలినా
ఏమిటిదీ గిల్లినదా
పంటికి గోటికి తేడా లేదా
ఎందుకంటే ఈ బుకాయింపులు

పగటి వేషం నాదమ్మా
రాత్రి నాటకం నీదమ్మా
అందుకని అందుకని
నువు చేసినదంతా చెప్పాలి
నే చెప్పినట్లు నువు చేయాలి


*******   *******  ******


చిత్రం: తేనె మనసులు (1965)
సంగీతం: కె.వి.మహాదేవన్
సాహిత్యం: ఆత్రేయ , దాశరధి
గానం: సుశీల, ఘంటసాల

దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై

 

గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై

 

గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై
అందని జాబిలి అందాలు పొందాలి
అనుకున్నానొకనాడు ఆనాడు
అందని జాబిలి అందాలు పొందాలి
అనుకున్నానొకనాడు ఆనాడు
అందిన జాబిలి పొందులో అందాలు
అందిన జాబిలి పొందాలో అందాలు
పొందాను ఈనాడు ఈనాడు
పొందాను ఈనాడు ఈనాడు
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే
పారిజాతమే నీవై నీవై
కనరాని దేవుని కనులా జూడాలని
కలగంటి నొకనాడు ఆనాడు
కనరాని దేవుని కనులా జూడాలని
కలగంటి నొకనాడు ఆనాడు
కల నిజము చేసి కౌగిలిలో జేర్చి
కల నిజము చేసి కౌగిలిలో జేర్చి
కరిగించే ఈనాడు ఈనాడు
కరిగించే ఈనాడు ఈనాడు
గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది
కోటి ప్రభలతో నీవై నీవై
కడలిలో పుట్టావు అలలపై తేలావు
నుఱగవై వచ్చావు ఎందుకో …
కడలిలో పుట్టావు అలలపై తేలావు
నుఱగవై వచ్చావు ఎందుకో
కడలి అంచువు నిన్ను కలిసి నీ ఒడిలో ..
కడలి అంచువు నిన్ను కలిసి నీ ఒడిలో
ఒరిగీ కరగాలని ఆశతో ….
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే
పారిజాతమే నీవై నీవై
అ …. గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది
కోటి ప్రభలతో నీవై నీవై
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే
పారిజాతమే నీవై నీవై


*******   *******  ******


చిత్రం: తేనె మనసులు (1965)
సంగీతం: కె.వి.మహాదేవన్
సాహిత్యం: ఆత్రేయ , దాశరధి
గానం: సుశీల, ఘంటసాల

ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఊఁ ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను
ఆలాగంటే ఏలాగండి అయినవాళ్ళని అడిగాము
ఆలాగంటే ఏలాగండి అయినవాళ్ళని అడిగాము
అంతేలెండి అంతకు మించి ఏదో ఏదో ఉందని అన్నానా
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను

నడవకు నడవకు అమ్మయ్యో నడిచావంటే అమ్మయ్యో
నడుమే నలిగిపోతుంది నీ నడుమే నలిగిపోతుంది
పొగడకు పొగడకు అయ్యయ్యో పొగిడారంటే అయ్యయ్యో
మనిషే వెగటైపోతారు మనిషే వెగటైపోతారు
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను

చూడకు అలా చూడకు ..
చూసావంటే ఏదో ఏదో ఔతోంది .. ఎదలో ప్రేమే పుడుతోంది
ఏదో ఏదో ఔతోంది .. ఎదలో ప్రేమే పుడుతోంది
పుట్టనీ పాపం పుట్టనీ ప్రేమే పుడితే
పెంచేదాన్నీ నేనున్నాలాలించేదాన్నీ నేనున్నా
జోజోజో… జోజోజో…
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను

దేవత (1965)




చిత్రం: దేవత (1965)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం: వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి
గానం: ఘంటసాల

(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు కానీ ఇద్దరు పాటలు రచయితలు)

పల్లవి:

ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి

చరణం: 1

పతిదేవుని మురిపించే వలపుల వీణ
జీవితమే పండించే నవ్వుల వాన
కష్టసుఖాలలో తోడూ నీడగా
తల్లిని మరిపించే యిల్లాలి ఆదరణ
కష్టసుఖాలలో తోడూ నీడగా
తల్లిని మరిపించే యిల్లాలి ఆదరణ
మగువేగా మగవానికి మధుర భావనా

ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి

చరణం: 2

సేవలతో అత్తమామ సంతసించగా
పదిమందిని ఆదరించు కల్పవల్లిగా
సేవలతో అత్తమామ సంతసించగా
పదిమందిని ఆదరించు కల్పవల్లిగా
తనయుని వీరునిగా పెంచే తల్లిగా
సతియే గృహసీమను గాచే దేవతగ
తనయుని వీరునిగా పెంచే తల్లిగా
సతియే గృహసీమను గాచే దేవతగ
సృష్టించెను ఆ దేవుడు తనకు మారుగా

ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి




చిత్రం: దేవత (1965)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం: వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి
గానం: పి.సుశీల

అందము లొల్కు మోముపై
హాస విలాస మనోజ్ణ రేఖలే చిందులు వేయ
వాల్కనుల సిగ్గులు మొగ్గలుపూయ
అందియల్ సందడి సేయ
కాంతివలె చల్లగ జానకి వచ్చె
ఓరగా సుందరుడైన రాఘవుని చూచె
తటాలున పూలమాలికా బంధము వైచె
దేవతలు పాడగా.. లోకము సంతసించగా
ఆ... ఆ... ఆ..




చిత్రం: దేవత (1965)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం: దాశరధి
గానం: యస్.జానకి

సాకీ:
అందమైన చల్లని రేయి
చల్లని రేయిని చక్కని అమ్మాయి
ఆ అమ్మాయితో ఉంది హాయి
ఆ హాయిలో ఉంది జీవితమోయి

పల్లవి:

అరె ఖుషీ ఖుషీ చేస్తేనే కలుగు హుషారు
బలె బలె మోగునులే వలపు సితారు
ఖుషీ ఖుషీ చేస్తేనే కలుగు హుషారు
బలె బలె మోగునులే వలపు సితారు
వలపు మజా చూపిస్తా ఇటురావోయీ

ఖుషీ ఖుషీ చేస్తేనే కలుగు హుషారు

చరణం: 1

నాతో దీటైన నాయకుడవు నీవేలే
నీకు సరియైన ప్రియురాలిని నేనేలే
నాతో దీటైన నాయకుడవు నీవేలే
నీకు సరియైన ప్రియురాలిని నేనేలే
మల్లె విరజాజి మనసూ నీకేలే
మల్లె విరజాజి మనసూ నీకేలే
గులాబి రేకు వంటి నా సొగసూ నీకేలే
అందించిన అందాన్ని అనుభవించవోయ్
వృధా చేయకోయ్... చేజారనీయకోయ్...
ఇదే సమయమోయ్...

అరె ఖుషీ ఖుషీ చేస్తేనే కలుగు హుషారు
బలె బలె మోగునులే వలపు సితారు
వలపు మజా చూపిస్తా ఇటురావోయీ హోయ్
ఖుషీ ఖుషీ చేస్తేనే కలుగు హుషారు

చరణం: 2

స్వర్గం ఎక్కడనో లేదోయీ మొనగాడా
అంతా నాలోనే ఉందోయీ చెలికాడా
స్వర్గం ఎక్కడనో లేదోయీ మొనగాడా
అంతా నాలోనే ఉందోయీ చెలికాడా
నిజాన్ని తెలుసుకుని భుజాలు కలుపుకుని
నిజాన్ని తెలుసుకుని భుజాలు కలుపుకుని
సుఖాన్ని పొందాలి ఓ అందగాడా
విలువైన జీవితాన్ని అనుభవించవోయ్
వృధా చేయకోయ్... చేజారనీయకోయ్...
ఇదే సమయమోయ్....

అరె ఖుషీ ఖుషీ చేస్తేనే కలుగు హుషారు
బలె బలె మోగునులే వలపు సితారు
వలపు మజా చూపిస్తా ఇటురావోయీ హోయ్
ఖుషీ ఖుషీ చేస్తేనే కలుగు హుషారు




చిత్రం: దేవత (1965)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం: వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి
గానం: ఘంటసాల

పల్లవి:

బ్రతుకంతా బాదగా.. కలలోని గాధగా..
కన్నీటి ధారగా.. కరిగిపోయే...
తలచేది జరగదూ... జరిగేది తెలియదు..

బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా
బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా
గారడి చేసీ గుండెను కోసీ నవ్వేవు ఈ వింత చాలికా

బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా

చరణం: 1

అందాలు సృష్టించినావు దయతో నీవు
మరలా నీ చేతితో నీవే తుడిచేవులే
దీపాలు నీవే వెలిగించినావే
గాడాంధకారాన విడిచేవులే
కొండంత ఆశ అడి ఆశ చేసీ
కొండంత ఆశ అడి ఆశ చేసీ
పాతాళ లోకాన తోచేవులే

బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా

చరణం: 2
ఒకనాటి ఉధ్యానవనము నేడు కనము
అదియే మరుభూమిగా నీవు మార్చేవులే
ఒకనాటి ఉధ్యానవనము నేడు కనము
అదియే మరుభూమిగా నీవు మార్చేవులే
అనురాగ మధువు అందించి నీవు
ఆలహల జ్వాల చేసేవులే
ఆనందనంక పయనించు వేళా
ఆనందనంక పయనించు వేళా
శోకాల సంద్రాన ముంచేవులే

బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా
గారడి చేసీ గుండెను కోసీ నవ్వేవు ఈ వింత చాలికా
బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా




చిత్రం: దేవత (1965)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం: వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి
గానం: ఘంటసాల

జగమెల్ల పరికించు చల్లని జాబిల్లి
సుదతి సీతను నీవు చూడలేదా
ప్రతి చరాచరముల పయనించు చిరుగాలి
జానకి నెటనైనా కానలేదా
కరుణతో విశ్వమ్ముభరియించు భూమాతా
చెలిజాడ నీవైన తెలుపరాద
తరులార గిరులార నెరయు తారకలార
పడతి ఏమయ్యనో పలుకరాద
ఏది వైదేహి జానకి ఏది
సీత లేనిదే రాముడే లేడూ
లేడటంచు కరకు కొండల గుండెలే
కరగి మారుమ్రోగ ఎలుగెత్తి పిలిచెనా
రాఘవుండు సీతా... హా.. సీతా...




చిత్రం: దేవత (1965)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం: వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:

కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
గుండెల్లో గుసగుసలు వినిపించనీ
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
నీ చూపుతో నన్ను ముడివేయకూ
ఈ పూలు వింటాయి సడిచేయకూ
నీ చూపుతో నన్ను ముడివేయకూ

చరణం: 1

సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది
నా పైట చెంగు లాగీ కవ్వించకు
సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది
నా పైట చెంగు లాగీ కవ్వించకు
అనువైన వేళ అందాలు దాచకూ
అనువైన వేళ అందాలు దాచకూ
అణువణువు నిన్నే కోరే మురిపించకూ
ఇకనైన నునుసిగ్గు తెరవేయకూ

నీ చూపుతో నన్ను ముడివేయకూ
ఈ పూలు వింటాయి సడిచేయకూ
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ

చరణం: 2

ఎటు చూసినా నువ్వే వినిపించె నీ నవ్వే
మోహాలతో నన్ను మరిపించకూ
ఎటు చూసినా నువ్వే వినిపించె నీ నవ్వే
మోహాలతో నన్ను మరిపించకూ
మనలోని ప్రేమా మారాకు వేయనీ
మనలోని ప్రేమా మారాకు వేయనీ
మనసార ఒడిలో నన్ను నిదురించనీ
నీ నీలి ముంగురులు సవరించనీ

నీ చూపుతో నన్ను ముడివేయకూ
ఈ పూలు వింటాయి సడిచేయకూ
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
గుండెల్లో గుసగుసలు వినిపించనీ
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ




చిత్రం: దేవత (1965)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య
గానం: బి.పద్మనాభం, ఎల్.ఆర్. ఈశ్వరి

పల్లవి:

మావూరు మదరాసు, నా పేరు రాందాసు
మావూరు మదరాసు, నా పేరు రాందాసు
కమ్మని నీ పోజు కవ్వించే ఈ రోజు
కమ్మని నీ పోజు కవ్వించే ఈ రోజు
మదనపడి మనసు చెడి వచ్చానె అమ్మాయి

మావూరు మదరాసు, నా పేరు రాందాసు

మావూరు బొంబాయి, నా పేరు రాధాబాయి
మావూరు బొంబాయి, నా పేరు రాధాబాయి
ఏమిటి నీ బాధ ఏ మాత్రం నీ హోదా
ఏమిటి నీ బాధ ఏ మాత్రం నీ హోదా
ఆ విషయం ఆ వివరం చెప్పవోయి అబ్బాయి

మావూరు బొంబాయి, నా పేరు రాధాబాయి

చరణం: 1

రోడ్లమీద కార్లున్నాయ్  బ్యాంకుల్లో డబ్బులున్నాయ్
రోడ్లమీద కార్లున్నాయ్  బ్యాంకుల్లో డబ్బులున్నాయ్
దేవిడిచ్చిన కాళ్ళున్నాయ్ చూడ్డానికి కళ్ళున్నాయ్
మన బింకం మన పొంకం తెలిసిందా అమ్మయి

మావూరు మదరాసు, నా పేరు రాందాసు

క్యాడిలాక్ కారుందా? న్యూ మోడల్ మేడుందా ?
క్యాడిలాక్ కారుందా? న్యూ మోడల్ మేడుందా ?
ఇంటిముందు వ్యానుందా? నిదురబోను ఫ్యానుందా?
కాఫీలకు సినిమాలకు కరువేమీ లేదు కదా?

మావూరు బొంబాయి, నా పేరు రాధాబాయి

మావూరు మదరాసు, నా పేరు రాందాసు

చరణం: 2

వూరు తిరగ బస్సుంది పబాం... పబాం..
వుండను ఫ్లాట్ ఫారముంది హి.. హి..
వూరు తిరగ బస్సుంది పబాం... పబాం..
వుండను ఫ్లాట్ ఫారముంది హి.. హి..
కడుపు నిండా నీరు త్రాగ కార్పొరేషన్ టాపుంది
ఏమున్నా... లేకున్నా  ఏమున్నా లేకున్నా
మిన్నయైనదొకటుంది  మిన్నయైనదొకటుంది
ఏముంది ?
ప్రేమించే హృదయముంది
అదే నాకు కావాలి ఇతడె నన్ను ఏలాలి
అదే నాకు కావాలి ఇతడె నన్ను ఏలాలి
అబ్బాయిని అమ్మాయిని ఇద్దరినీ కనాలి
అబ్బాయిని అమ్మాయిని ఇద్దరినీ కనాలి
హాయిగా తాపీగా  హాయిగా తాపీగా
హాయిగా తాపీగా  హాయిగా తాపీగా
బ్రతుకు పరుగు తీయాలి బ్రతుకు పరుగు తీయాలి

మావూరు మదరాసు, నా పేరు రాందాసు
మావూరు బొంబాయి, నా పేరు రాధాబాయి




చిత్రం: దేవత (1965)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: మాధవ పెద్ది, యస్.జానకి


పల్లవి:

ఒహో.. హో హో ఓ ఓ ఓ యా యా యా ఓ ఓ ఓ
నాకు నీవే కావాలె రా ఓ.. ఓ.. ఓ..
నీకు నేను కావాలె రా ఆ...ఆ... ఆ..
ప్రక్కన నువు లేకుంటే...
ఒక్కదాన్నే వుంటె వూరంతా పడుకుంటే
ఏమో ఏమో ఏమేమొ ఆయరా

ఒహో.. హో హో ఓ ఓ ఓ యా యా యా ఓ ఓ ఓ

చరణం: 1

అద్దాన నీ రూపే ముద్దుగా కనిపించె
నిద్దరలో నీ పిలుపే కొద్దిగా వినిపించె
కలలో వస్తిని గమ్మత్తు చేస్తిని
అమ్మతోడు ఉలికులికి పడ్డానురా
నన్ను నమ్మరా ఇంక నమ్మరా
నిన్నిడిచి వుండలేనురా
ఓరయ్యో బలే ఓరయ్యో

చరణం: 2

ఒడ్డున పోతుంటే ఒళ్ళు జల్లుమన్నాదే
పడవను నడుపుతుంటే పట్టుదప్పిపోనాదే
చేపలు పడుతున్నా ఏ పని చేస్తున్నా
అమ్మతోడు చూపంతా నీ మీదనే
నన్ను నమ్మవే ఇంక నమ్మవే
నిన్నిడిచి పోలేనులే
ఓలమ్మీ భలే ఓలమ్మీ
నాకు నీవే కావాలె రా.. ఓ.. ఓ ... ఓ
నీకు నేను కావాలె రా ఆ...ఆ...ఆ
ఓయ్
మెత్తని ఇసుకుంది మత్తైన గాలుంది
కోరుకున్నపుడెల్ల కొబ్బరి నీరుంది
మెత్తని యిసుకేమి మత్తైన గాలికేమి
అన్నిటికి మించి నాకు నువ్వుంటివి
నీ అందమే ఆ అందమే పదివేల సొమ్మంటిని
ఓలమ్మీ భలే ఓలమ్మీ
ఓరయ్యో బలే ఓరయ్యో




చిత్రం: దేవత (1965)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం: వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
తొలి వలపే పదే పదే పిలిచే
ఎదలో సందడి చేసే
తొలి వలపే పదే పదే పిలిచే
మదిలో మల్లెలు విరిసే... తొలివలపే...


చరణం: 1

ఏమో ఇది ఏమో
నీ పెదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు
ఆ అందం అనుబంధం
నా మనసున నీకై నోచిన పూసిన కానుకలు
ఏమో ఇది ఏమో
నీ పెదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు
ఆ అందం అనుబంధం
నా మనసున నీకై నోచిన పూసిన కానుకలు
నీ కనుల వెలిగేనే దీపాలు
అవి మీ ప్రేమకు ప్రతిరూపాలు
నీ కనుల వెలిగేనే దీపాలు
అవి మీ ప్రేమకు ప్రతిరూపాలు
మన అనురాగానికి హారతులు

తొలి వలపే పదే పదే పిలిచే
ఎదలో సందడి చేసే తొలి వలపే

గరి నిరిగా
ఆ ఆ ఆ
మగనిగమా
ఆ ఆ ఆ
గమ నీద నీదపా
ఆ ఆ ఆ

చరణం: 2

ఏలా ఈ వేళా
కడువింతగ తోచె తీయగ హాయిగ ఈ జగమూ
యవ్వనము అనుభవమూ
జతగూడిన వేళా కలిగిన వలపుల పరవశమూ
ఏలా ఈ వేళా
కడువింతగ తోచె తీయగ హాయిగ ఈ జగమూ
యవ్వనము అనుభవమూ
జతగూడిన వేళా కలిగిన వలపుల పరవశమూ
ఈ రేయి పలికెలే స్వాగతమూ
ఈనాడే బ్రతుకున శుభదినమా
ఈ రేయి పలికెలే స్వాగతమూ
ఈనాడే బ్రతుకున శుభదినమా
ఈ తనువే మనకిక చెరి సగమూ

తొలి వలపే పదే పదే పిలిచే
ఎదలో సందడి చేసే
తొలి వలపే పదే పదే పిలిచే
మదిలో మల్లెలు విరిసే... తొలివలపే...