శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (09-01-1960)
60 సంవత్సరాలక్రితం అంటే 1960 సంవత్సరంలో
ఎన్ టి ఆర్ 8 సినిమాలలో నటించారు.
సంక్రాంతి కానుకగా 20 ప్రింట్లతో విడుదలైన శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (09-01-1960) 16 కేంద్రాలలో వసూళ్ళ ప్రభంజనంతో ఘనంగా శత దినోత్సవాలు జరుపుకుని ఆ సంవత్సరపు సూపర్ హిట్ సినిమాగా నిలచింది. ఈ చిత్రానికి దాదాపు సమాంతర విజయంగా దసరా కానుకగా విడుదలైన భట్టి విక్రమార్క చిత్రం (28-09-1960) 13 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది. దీపావళి (22-09-1960) ఎన్ టి ఆర్ కు శ్రీ కృష్ణుడిగా మూడవ విజయం తెస్తూ శత దినోత్సవాలు జరుపుకుంది. అలాగే కన్నుల్లో నీ బొమ్మ చూడు అంటూ విమల చిత్రం (11-08-1960) , ఫాంటసీ చిత్రాలకు నాంది పలుకుతూ దేవాంతకుడు చిత్రం (07-07-1960) శత దినోత్సవాలు జరుపుకున్నాయి. వాహినీ వారి రాజ మకుటం (24-02-1960) విజయవంతమైన చిత్రం గా నిలిచింది. రాణీ రత్న ప్రభ (27-05-1960) ఏవరేజి గా నిలిచింది. కాడెద్దులు ఎకరం నేల (06-10-1960) ఫ్లాప్ అయింది.
అక్కినేని నటించిన నమ్మిన బంటు, శాంతి నివాసం, మహా కవి కాళిదాసు, పెళ్ళి కానుక శత దినోత్సవాలు జరుపుకున్నాయి. అన్నపూర్ణ, అభిమానం, మా బాబు ఏవరేజ్ గా నడిచాయి.
ఇవి కాక రేణుకాదేవి మహాత్మ్యం, శ్రీ కృష్ణ రాయబారం, నిత్య కల్యాణం పచ్చ తోరణం, సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి, ధర్మమే జయం, జగన్నాటకం, అన్నా చెల్లెలు, సమాజం, భక్త శబరి, జల్సారాయడు, కుంకుమ రేఖ, భక్త రఘునాధ్, కనకదుర్గా పూజా మహిమ, చివరకు మిగిలేది, మామకు తగ్గ అల్లుడు సినిమాలు విడుదలయ్యాయి.
09-01-1960 న విడుదలైన శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం సినిమా విశేషాలు:-
తన దర్శకత్వంలో సి.ఎస్.ఆర్., శాంతకుమారిలతో నిర్మితమై 1939లో విడుదలై విజయవంతమైన శ్రీ వేంకటేశ్వర మహత్యం (బాలాజీ) చిత్రాన్ని పునర్నిర్మించారు పి.పుల్లయ్య. తొలి చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో ఈ చిత్రం కూడా అంత సంచలనం సృష్టించింది. రెండు సార్లు నిర్మితమైన చిత్రాలకు పి.పుల్లయ్య దర్శకత్వం వహించారు. పి.పుల్లయ్య స్వంతంగా స్ధాపించిన పద్మశ్రీ పిక్చర్స్ తొలి చిత్రం 09-01-1960 లో విడుదలైన శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం . ఈ చిత్ర విజయం లవకుశ సినిమా పునర్మిణానికి స్ఫూర్తి కలిగించింది. 1939లో నిర్మితమైన చిత్రంలో పద్మావతి గా నటించిన శాంతికుమారి ఈ చిత్రంలో వకుళమాతగా నటించారు.
లోక కల్యాణానికి సప్త ఋషులు చేస్తున్న యజ్ఞంలో ఆవిష్షును త్రిమూర్తులలో ఎవరికి సమర్ఫిస్తున్నారన్న నారదుని ప్రశ్నకు త్రిమూర్తులను పరీక్షించుటకు భృగు మహార్షి బయలు దేరతాడు. బ్రహ్మ, సరస్వతి వీణానాదం లో మైమరచి భృగును పట్టించుకోడు. భూలోకంలో బ్రహ్మకు పూజలు జరగవని శపించి కైలాసానికి వెళతాడు. అక్కడ శివుడు పార్వతి తో తాండవంతో మునిగి భృగు రాకను గమనించడు.. శివునికి లింగ రూపంలోనే పూజలు జరుగు తాయని శపించి వైకుంఠానికి వెళతాడు..లక్ష్మీదేవి పాదాలు వత్తుతూ ఉండగా నిదురలో ఉన్న శ్రీ మహావిష్ణువు భృగు రాక గమనించడు..భృగు కోపించి శ్రీమహావిష్ణువు వక్షస్ఠలము పై కాలితో తంతాడు..
శ్రీ మహా విష్ణువు లేచి భృగుని శాంతపరిచే నెపంతో భృగు పాదంలో ఉన్న కంటిని వత్తుతాడు.. భృగువుకు జ్ఞానోదయమవుతోంది.. తన నివాస స్థలాన్ని కాలితో తన్ని అవమానించాడని శ్రీమహాలక్ష్మి విష్ణువుపై అలుక వహించి భూలోకానికి వెళుతుంది. శ్రీమహాలక్ష్మిని వెతుకుతూ భూలోకానికి వచ్చి తపస్సులో నిమగ్నవుతాడు శ్రీమహావిష్ణువు. శ్రీ మహా విష్ణువు ఆకలి తీర్చడానికి శివుడు, బ్రహ్మ ఆవు దూడలు కాగా శ్రీమహాలక్ష్మి గోప కాంత యై ఆ ఆవుదూడలను ఆ రాజ్యాన్ని ఏలుతున్న మహారాజుకు అమ్ముతుంది. ఆవు మంద నుండి వేరుపడి శ్రీ మహావిష్ణువు తపస్సు చేస్తున్న వల్మీకంపై పాలను వర్షిస్తుంది. ఆవు పాలను తక్కువగా ఇస్తూ ఉండడంతో ఆవును వెంటాడిన గోపాలకుడు ఆవును కొట్టబోగా ఆ దెబ్బ శ్రీమహావిష్ణువుకు తగులుతుంది. గోపాలకుడిని పిశాచిగా మారమని శపిస్తాడు..
గాయపడిన మహావిష్ణువు సమీపంలో ఉన్న వకుళ మాత ను చేరతాడు.. అతనిని శ్రీనివాసునిగా పిలుస్తూ అతనిపై పుత్ర వాత్సల్యం చూపుతుంది. వ్యాహళికి బయలుదేరిన శ్రీనివాసుడు, ఆకాశరాజు కుమార్తె పద్మావతి ని చూసి ఆమెను వలిచి ఆ విషయాన్ని వకుళకు చెబుతాడు..వకుళ ఆకాశ రాజును కలిసి వివాహానికి అతడిని అంగీకరింప చేస్తుంది. కుబేరుని ఆర్ధిక సహాయంతో శ్రీనివాసుని వివాహం ఆకాశరాజు కుమార్తె పద్మావతితో జరుగుతుంది. ఈ విషయం తెలిసిన శ్రీమహాలక్ష్మి అచ్చటకు చేరుతుంది.. సపత్నుల కలహంతో శిలగా మారతాడు శ్రీనివాసుడు. అతనితో సతులూ.. పిమ్మట బావాజీ వృత్తాంతం, శ్రీనివాసుని మహిమలు చూపే ఇతర కథలు చిత్రంలో పొందు పరిచారు.
స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు: ఆత్రేయ (ఆరుద్ర, మల్లాది రామకృష్ణశాస్ర్తీ ఒక్కో పాట వ్రాయగా, పద్యాలను నారపరెడ్డి వ్రాశారు)
కెమెరా: పియల్ రాయ్, కళ: యస్వియస్ రామారావు, ఎడిటింగ్: కెఎ శ్రీరాములు, సహాయ దర్శకులు:కె రాఘవేంద్రరావు, యు విశ్వేశ్వర రావు, సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు, నృత్యం: వెంపటి సత్యం, నిర్మాత: వి వెంకటేశ్వర్లు
ఎన్టీ రామారావు శ్రీనివాసునిగా, యస్ వరలక్ష్మి శ్రీదేవిగా, సావిత్రి పద్మావతిగా , వకుళమాతగా శాంతకుమారి , భృగుమహార్షిగా గుమ్మడి, ఆకాశరాజుగా ఎ వి సుబ్బారావు, బావాజీగా నాగయ్య, శరభ దంపతులుగా రమణా రెడ్డి సురభి బాల సరస్వతి, ధరణీదేవిగా ఋష్యేంద్రమణి, నారదుడిగా పి సూరిబాబు, బ్రహ్మగా ఎ. వి. సుబ్బారావు జూనియర్, సరస్వతిగా సంధ్య, మహా శివుడిగా వెంపటి సత్యం, ఎరుకలసానిగా షావుకారు జానకి, ఇంకా ఘంటసాల, లంక సత్యం, లవకుశలో నటించిన మాస్టర్ నాగరాజు సావిత్రి తమ్ముడిగా, మాస్టర్ సుబ్రహ్మణ్యం బాల కృష్ణుడిగా , సరస్వతిగా సంధ్య, పార్వతిగా కెవి శాంతి, మహరాజుగా రాజనాల, ఆశ్రమంలో శిష్యులుగా బాలకృష్ణ, పేకేటి శివరామ్, పద్మావతి చెలికత్తెలుగా మోహన, ‘బాల’ నృత్య నాటికలో మన్మధునిగా రీటా నటించారు. ఇతర పాత్రలను మద్దాలి కృష్ణమూర్తి, వంగర, వైవి రాజు పోషించారు.
దర్శకులు పి పుల్లయ్య బలవంతం వల్ల ఘంటసాల ఇందులో స్వామివారి ముందు పాటపాడే భక్తుని పాత్ర పోషించారు. వారి ఇష్టదైవం శ్రీ వెంకటేశ్వరుడు కావటం కూడా ఆయన ఈ సన్నివేశంలో నటించటానికి ఓ కారణం. ఈ పాటలో ఘంటసాలతోపాటు సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు, వేణువువాయించే నంజప్ప, ఘంటసాల పెద్ద కుమారుడు విజయ్‌కుమార్ సైతం కనిపిస్తారు. ఆ సన్నివేశంలోని అద్భుతమైన, చిరస్మరణీయమైన భక్తిగీతం ‘శేష శైలావాస శ్రీవెంకటేశా’ (ఘంటసాల- ఆత్రేయ).
ఒకసారి నిర్మించి విజయవంతమైన చిత్రాన్ని తిరిగి తామే నిర్మించి విజయవంతం చేసిన ఘనత దర్శకులు పుల్లయ్యకు దక్కింది. మొదటిసారి ఈ చిత్రాన్ని నిర్మించినపుడు థియేటర్లలో శ్రీ వెంకటేశ్వరుని విగ్రహాలు, హుండీలు పెడితే, హుండీలు తొందరగా నిండిపోయేవి. రెండోసారి చిత్రాన్ని నిర్మించినప్పుడు అదేవిధంగా జరగటం విశేషం. ఆ హుండీల్లో డబ్బు తిరుపతి పంపించేవారు. ఇదికూడా ఓ విశేషాంశం.
‘శ్రీవెంకటేశ్వర మహత్యం’లో శ్రీనివాసునిగా, మహావిష్ణువుగా ఎన్టీ రామారావు ఎంతో సమ్మోహనంగా, గంభీరంగా, తల్లివద్ద పెళ్ళికొరకు అలక పూనిన సన్నివేశంలో ముచ్చటగా నటించి అలరించారు. భృగు మహర్షి (గుమ్మడి) గర్వం, అజ్ఞానం తొలగించే సన్నివేశం లో ఎన్ టి ఆర్ (మహా విష్ణువు) అపూర్వమయిన నటనతో , విలక్షణమైన డైలాగ్ మాడ్యులేషన్ తో అత్యున్నత శిఖరాలకు చేరడం ప్రేక్షకులు గమనిస్తారు. ఆ తరువాత వకుళాదేవి ఆశ్రమంలో ఘంటసాల ఆలపించిన ఎవరివాడ నేను, ఎల్లరు నా వారు అనే అపొరూపమైన పద్యానికి అద్భుతమైన అభినయం చేస్తారు ఎన్ టి ఆర్.
ఇక శ్రీలక్ష్మిగా యస్ వరలక్ష్మి వైకుంఠం వీడి వెళ్ళే సమయంలో ఆత్మాభిమానాన్ని, భర్తకై ఆవేదన సమయాల్లో కరుణరసం, చివర భర్త మరో స్త్రీని వివాహం చేసుకున్నాడన్న ఆగ్రహం, ఆవేదన సమర్ధవంతంగా నటించి చూపించారు. పద్మావతిగా మహానటి సావిత్రి శ్రీనివాసునిపై ప్రేమ, విరహాన్ని, భర్తతో ప్రణయ పారవశ్యాన్ని, శ్రీలక్ష్మితో సంవాదనలో క్రోథాన్ని, వేడికోలు ఎంతో సంయమనంతో ప్రదర్శించగా శాంతకుమారి వకుళమాతగా భక్తిపారవశ్యాన్ని కడురమణీయంగా, నారదుని వల్ల తన పూర్వజన్మ తెలిసికొన్న సమయంలో ఆనందాన్ని ఎంతో భావుకతతో మెప్పించారు. ఎరుకలసానిగా గుఎస్త్ గా నటించిన షావుకారు జానకి, ఆ కొద్దిసేపటిలోనే చక్కని హావభావాలు ప్రదర్శించటం ఆకట్టుకుంటుంది.
శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్ర గీతాలు అద్భుతమనే చెప్పాలి.
1. ఎన్టీ రామారావు, యస్ వరలక్ష్మిపై చిత్రీకరించిన ప్రణయగీతం ‘శ్రీదేవిని, నీదు దేవేరిని’ (యస్.వరలక్ష్మి- ఆరుద్ర);
https://www.youtube.com/watch?v=eTrOP38WBwQ
2. ఎన్టీఆర్, గుమ్మడిలపై చిత్రీకరించిన పద్యం ‘పావనంబయ్యె’ (ఘంటసాల, నారపరెడ్డి); ‘కన్నుల కండకావరము’ ‘నమో నారాయణ’ (మాధవపెద్ది సత్యం- నారపరెడ్డి);
"కఠిన కౌస్తుభాలంకృతమైన నా వక్షస్థలమును తాకి, మీ కోమలపదకమలములు ఎంత కందినవో? ఎంత నొచ్చినవో? అపచారిని! ఉపచారము చేయనిండు!"
పావనంబయ్యెనయ్య నా జీవనంబు
పావనంబాయె ఈ కౌస్తుభంబు
దానసిరియు సిరియేలు వైకుంఠపురముగూడ
పావనంబాయె నేడు తాపసవరేణ్యా!!
https://www.youtube.com/watch?v=78eHMtA_uNI
3. ఆశ్రమంలో వకుళమాతపై చిత్రీకరించిన ‘గోపాలా, నందగోపాల’ (శాంతకుమారి, బృందం -ఆత్రేయ) ఈనాటికి మధురమైన భక్తిగీతంగా అలరిస్తున్నది.
https://www.youtube.com/watch?v=6KLid-HkoFc
4. సావిత్రి, ఎన్టీఆర్‌లపై చిత్రీకరించిన మనోల్లాసమైన యుగళ గీతం, జలపాతాలు, మేఘాలు, కొండలు, పచ్చని చెట్లమధ్య ఆహ్లాదభరితంగా చిత్రీకరణ సాగిన ‘కలగా కమ్మని కలగా మన జీవితాలు మనవలెగా’ -అని పద్మావతి, ‘వెలుగు చీకటుల కలబోసినవి, కాలము చేతిలో కీలుబొమ్మలు’ -అని శ్రీనివాసుడు, ‘మమతే జగతిని నడుపుతున్నది’ -అని పద్మావతి, ‘ప్రేమకు శోకము ఫలమేమో , రాగము, త్యాగము జతలేమో’ అంటూ శ్రీనివాసుడు తరువాతి కథ సూచించటం, ఎంతో భావయుక్తంగా సాగిన ఈ పాటకు ఆత్రేయవారు బాణీ సూచించటం విశేషం (గానం- ఘంటసాల, పి.సుశీల).
https://www.youtube.com/watch?v=BWJvvrJ2pHE
5. ఆవు దూడలను బజారులో విక్రయిస్తూ ఎస్ వరలక్ష్మి తదితరులపై చిత్రీకరించిన గీతం ‘వరాల బేరమయా, వనరంబేరమయా పరాకు చేయకు’ (యస్.వరలక్ష్మి- ఆత్రేయ);
https://www.youtube.com/watch?v=05y6kVuUNy0
6. అచ్చం తిరుపతిలాగే గర్భాలయ సెట్‌ను వాహిని ఆవరణలో ఓ ఫ్లోర్లో వేసి దేవుడిని ప్రతిష్టించారు. గర్భగుడిలోని మూల విరాట్ విగ్రహం, సినిమాలోని విగ్రహాలు కెజి వేలుస్వామి అనే శిల్పకారుడు తయారు చేయగా కళాదర్శకుడు ఎస్విఎస్ రామారావు సెట్‌ను ఎంతో సహజంగా రూపొందించారు. ఈ సెట్లోనే ఘంటసాల ఆలపించిన ‘శేష శైలావాసా’ పవళింపు సేవగీతం చిత్రీకరణ జరిపారు.
https://www.youtube.com/watch?v=63EQ-6oJvuA
7. వేగ రా రా
https://www.youtube.com/watch?v=yvr4f2ehiNo
8. పాహి హరే
https://www.youtube.com/watch?v=C16aHfHDCxM
9. కల్యాణ వైభవమీనాడే
https://www.youtube.com/watch?v=k2fCBRza05Y
10. ఎవరో తానెవరో
https://www.youtube.com/watch?v=1R3uSwQb7uk
ఎవరతను? మన్మధుడా (వల రాజా) ? కళ్ళకు కనబడుతున్నాడే. పోనీ చంద్రుడా (కలువలరాజా), హరిణంకుడు (జింక చిహ్నం మచ్చగా గల చంద్రుడు) కాదే. అతను అకలంకుడే (మచ్చ లేనివాడే)...గొప్ప భావుకత. కరుణను చూపి కబురు తెలిపి అనే వాక్యం లో కబురు అనే ఉర్దూ పదాన్ని వాడినందుకు బాధ పడి మల్లాది వారితో చెబితే, పరవాలేదు, ఆ కాలం లో బీబీ నాంచారమ్మ కూడా ఉందిగా అన్నారట మల్లాది. బృందావన సారంగ రాగం.
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ, నేపధ్య గానం : ఘంటసాల, సుశీల , ఎన్ టి రామారావు, సావిత్రి
ఆ... ఆ... ఆ..ఆ... ఆ... ఆ.. ఆ..
ఎవరో.. అతడెవరో.. ఆ నవమోహనుడెవరో...
నా మానసచోరుడెవరో.. ఎవరో.. అతడెవరో..
తొలిచూపులలో వలపులు చిలికి.. దోచిన మగసిరి దొర ఎవరో..
అరయగ హృదయము అర్పించితినే.. ఆదరించునో.. ఆదమరచునో ఎవరో..
వలరాజా? కలువలరాజా? కాడే.. కనులకు కనులకడుపడినాడే..
అకళంకుడే.. హరినాంగుడు కాడే..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
అకళంకుడే.. హరినాంగుడు కాడే.. మరి ఎవరో.. ఏమయినాడో...ఎవరో.
ఎవరో.. తానెవరో... ఆ నవమోహిని.. ఎవరో..
నా మానసహారిణి.. ఎవరో..
ఎవరో.. తానెవరో... ఆ నవమోహిని.. ఎవరో..
నందనవనమానందములో.. తొలిసారిగ పూచిన పువ్వో..
తొలకరి యవ్వనం ఒలికిన నవ్వో...
మనసిచ్చినదో.. నను మెచ్చినదో..
ఆ... జవ్వని..ఎవరో.. తానెవరో...
**************
ఎవరో.తానెవరో , దివ్య ప్రణయనందనంలో విరిసిన సుమధుర పారిజాతం ఈ గీతం!!
http://yugalageetham.blogspot.com/2014/10/blog-post.html?m=1
************************
11. తిరుమల మహిమలు తెలియచెప్పే గీతంలో ఓ భక్తుడు భార్యతో పాడే పాట ‘పదవే పోదాము గౌరీ’ (పిఠాపురం- ఆత్రేయ) అత్యద్భుత గీతాలే. ఈనాటికీ ఈ చిత్ర గీతాలు శ్రోతలను అలరించటం ఆనందదాయకం.
https://www.youtube.com/watch?v=Gybmj92XAEE
12. ‘జయజయ జగన్నాయక జయ జయ’ (వెంపటి పెదసత్యం తదితరుల బృందగీతం -మల్లాది రామకృష్ణశాస్ర్తీ);
https://www.youtube.com/watch?v=ak-8YqRf7-U
13. పశుకాపరి రమణారెడ్డి, అతని భార్య సురభి బాలసరస్వతిపై చిత్రీకరించిన గీతం ‘సిలకో చిక్కావే ఈనాడు సింగారమొలుకుతూ’ (పిఠాపురం- బాల, స్వర్ణలత -ఆత్రేయ)
https://www.youtube.com/watch?v=Y1y5E7eV9-o
14. చిన్నారి ఓ చిలుక విన్నావా, ఆత్రేయ, పెండ్యాల, సుశీల, సావిత్రి, ఎన్ టి ఆర్, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం 1960, తిలంగ్ రాగం . నిడివి కారణంగా చిత్రంలోనుండి ఈ పాటను తొలగించారు. ఆ రోజుల్లో విడుదలైన 78 ఆర్ పి ఎం రికార్డుల్లో మాత్రమే లభ్యం. పొలయలుకలు అంటే ప్రణయ కోపములు అని అర్ధం.
చిన్నారి ఓ చిలుక విన్నావా
ఇన్నాళ్ళ కోరిక ఈడేరే వేడుక - చిన్నారి
ఏమని నా స్వామికి మనవి చేసినావో
నా మనసు తెలిపినావో
ఫలియించే నీ మాట పల్లవించె నా పాట - చిన్నారి
పెళ్ళి పీటలపై నున్న వేళ ఒళ్ళు మరచి పిలిచేవు
నేనేననుకుని తాను వులికిపడేను
నలుగురు ననుజూచి నవ్వుకునేరు - చిన్నారి
అత్తవారి ఇల్లు మనకు కొత్తచోటు అయినా
తొలి వలపు ముచ్చటలో పొలయలుకలు వచ్చేనా
బెట్టు చేసి వారిని కవ్వించవే
ప్రేమతో నను చేరి నవ్వించవే - చిన్నారి
https://www.youtube.com/watch?v=iXIKc4J0yyw
చిలిపిచేష్టల తన్నిన చిన్ని పాప
చివురుటడుగుల ముద్దులు చిలికి మురిసి
తనియుదురుగాని యే తల్లిదండ్రులైన
ఆగ్రహింతురే బిడ్డపై అంబుజాక్షి!
ఒంటివాడ నేను ఉనికి యీ జగమెల్ల
కన్నవారులేరు కలను నేను
యెవరివాడ కాను యెల్లరు నావారె
తొల్లికలదు సిరియు తొలగె నేడు!!
ఆత్రేయ వ్యాఖ్యానంతో అసలు సినిమా పూర్తయ్యాక వెంకటేశ్వరుని మహిమలు, ఆయనకు జరిగే పూలంగిసేవ, నేత్ర దర్శనం, చంద్రప్రభ, సూర్యప్రభ వాహనాలపై స్వామివారి ఊరేగింపులు, పవళింపుసేవ వివరంగా చూపటం ఎంతో హర్షణీయం.
వైకుంఠం లో ఆ 15 నిముషాల సన్నివేశం మనల్ని అలౌకికానందాన్ని కలుగచేసి మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. అలాగే శిలా విగ్రహం నుండి ఎన్ టి ఆర్ నడచి వచ్చే సీను చూసి పరవశించని వారుండరు. రాముడు, కృష్ణుడు పాత్రలు వేయడం వేరు, కలియుగ దైవం గా భావించే వేంకటేశ్వరుని పాత్రలో తాధాత్మ్యం చెందుతూ నటించడం వేరు కదా.
ఎన్టీఆర్, గుమ్మడిలపై చిత్రీకరించిన పద్యాలు ‘పావనంబయ్యె’ (ఘంటసాల) ‘కన్నుల కండకావరము’ స్త్రోత్రం ‘నమో నారాయణ’ (మాధవపెద్ది సత్యం) నారపరెడ్డి గారు రచించారు.
1939 లో వచ్చిన శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (సి ఎస్ ఆర్ , శాంతకుమారి శ్రీనివాస్ పద్మావతులుగా) సినిమాకు మాటలు కవికోకిల దువ్వూరి రామిరెడ్డి సంబాషణలందించారు
20 ప్రింట్లతో విడుదలైన ఈ చిత్రం ఏకంగా 16 కేంద్రాలలో వసూళ్ళ ప్రభంజనంతో ఘనంగా శత దినోత్సవాలు జరుపుకుని ఇండస్ట్రీ హిట్‌గా రికార్డు సృష్టించింది. శతదినోత్సవ సందర్భంగా ఆ రోజు పేపర్ ప్రకటనలో ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షక జనం కోటికి పైగా ఉన్నట్టు నిర్మాతలు తెలిపారు. ఒకచోట రజితోత్సవం జరుపుకుంది..
---సేకరణ
No comments:
Post a Comment