Showing posts with label S. V. Krishna Reddy. Show all posts
Showing posts with label S. V. Krishna Reddy. Show all posts

ప్రేమకువేళాయెరా (1999)

చిత్రం: ప్రేమకువేళాయెరా (1999)
సంగీతం: యస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్, హరిణి


ఆఆఆఅ..ఆఆఆ.ఆ..ఆఆఅ..ఆఆఆ...
తళతళ తారకలాగా మెరుపుల మాలికలాగా
తళతళ తారకలాగా మెరుపుల మాలికలాగా
కరుణించ వచ్చావే సిరులెన్నో తెచ్చావే
కులుకా ఆఆఆ... పంచవన్నెల రామచిలుక
నిధిలాగ దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మొలకా
పంచవన్నెల రామచిలుక..
పంచదారల ప్రేమచినుకా...అఆ...

మాణిక్య వీణవు నువ్వే మలిసంధ్య వేణువు నువ్వే
నామనసు మందిరాన మోగుతున్న
అందమైన అందము నువ్వే
ఆరాద్య దేవత నువ్వే గంధర్వ కాంతవు నువ్వే
స్వర్గాల దారిలోనా నీడనిచ్చు పాలరాతి మేడవు నువ్వే
నీగాలి సోకింది నాకొమ్మ ఊగింది
నీ ప్రేమ తాకింది నాజన్మ పొంగింది

పంచవన్నెల రామచిలుక
నిధిలాగా దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మొలకా
పంచవన్నెల రామచిలుక..
పంచదారల ప్రేమచినుకా...అఆ...

నాతేనె విందువు నువ్వే నాలంకె బిందెవు నువ్వే
నాగుండె గంపలోనా ఒంపుకున్న అంతులేని సంపద నువ్వే
నాపొద్దు పొడుపువు నువ్వే నాభక్తి శ్రద్ధవు నువ్వే
చిననాడు దిద్దుకున్న ఒద్దికైన ఓనమాలు నువ్వే నువ్వే
నీ చూపు అందింది నాచెంప కందింది
నీ మెరుపు తెలిసింది నా వలపు కురిసింది

పంచవన్నెల రామచిలుక
నిధిలాగా దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మొలకా

తళతళ తారకలాగా మెరుపుల మాలికలాగా
కరిణించ వచ్చావే సిరులెన్నో తెచ్చావే
కులుకా ఆఆఆ... పంచవన్నెల రామచిలుక
నిధిలాగ దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మోలకా
పంచవన్నెల రామచిలుకా.ఆఅ..
ఓ పంచదారల ప్రేమచినుకా..ఆఆఆ...

బహుమతి (2007)




చిత్రం: బహుమతి (2007)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: కృష్ణ సాయి
గానం: యన్.సి.కారుణ్య, సుచిత్ర


అబ్బబ్బా వినవే అబ్బాయి పోలిసే
అతను నడిచే ఎ టి ఎం పోతే చిక్కడులే (2)
నీదే లేటంతే నువ్వే ఉ అంటే ఆ కన్యాదానం చేసేస్తానంతే
మొగుడే పొలీసైతే ఇక ఆల్వేస్ హ్యాప్పీసేలే
మాలీష్ నుంచీ అన్నీ ఫ్రీయే
డ్యూటీ మీదే ఉంటే ఈ సిటీ అంతా తనదే
లాఠీకున్న పవరే పవర్
ఆలోచించు కొంచెం నీక్కొచ్చిందీ అవకాశం
ఎందరికీ వచ్చును ఈ అదృష్టం
డ్రీమ్‌లోకి వెళ్ళితే నే చెప్పింది రైటే అంటావు నువ్వే వెళ్ళూ ఒకసారీ
కోటిన్నరకీ తక్కువ కాని కారే తెస్తావుగా అరె కాలే బయట పెట్టాలనిపిస్తే
ఓ పోటి చేసో లూటి చేసో కోరిక తీరుస్తానుగా మరి అంతగా నీకే తిరగాలనిపిస్తే
హైటెక్ సిటీకి దగ్గరలో ప్లాట్ ఉంటే ఆలొచించక కొనితెచ్చేసి వ్రాసి ఇచ్చేస్తావా

ఏ స్కామో చేసేసి ఆ సొమ్మే తెచ్చేసి
యమ అర్జంటుగా కానుక చేసి నీకిచ్చెస్తానుగా
పడుకుంటే కలగంటే
అది నిజమేనే చేస్తాగా
అబ్బబ్బా విను తల్లే
రోజు నీకు వండీ వార్చే ప్రోగ్రాం అంటే కష్టమే
ఓ ఫైవ్‌స్టార్ హొటల్ కుక్‌ని తెస్తావా
తాజా చేతులు కందాయంటే పోదా చూసి ప్రాణమే
ఆ కుక్‌ని నీకే కుక్కని చేస్తాగా
బాబే పుట్టాకా కాన్వెంటే చదువులకీ ఫారన్ పంపించాలంటే
నువ్వేం అంటావు

ఇంగ్లీష్ చదువేగా చదివిద్దాం బేషుగ్గా
అయినా వాడికి పెట్టిందంతా తిరిగొచ్చేవేగా
సరే కానీ మనమొక్కటై
ఇక ఆలూ, మగలవుదాం ఓమ్
అబ్బబ్బా సరిలే చెప్పింది చాల్లే అబ్బాయి వస్తే చూస్తా
ఒకసారి నచ్చాడో మనకే ఇస్తాలే మసే, ఆపైన పెళ్ళి ఖాయం
చెయ్యొచ్చే పరవాలేదనిపిస్తే నే జెండా ఊపేస్తాలే
ఆ ఏర్పాట్లేవో చేసేయ్ నువ్వే నువ్వు చెప్పావనీ ఓకే నేనంటున్నాలే
అంతే ఆపైన ఇంక భారం నీదే తేడా వచ్చిందంటే మన సంగతి
తెలుదుకదా నీకే నాన్నని కూడా చూడను నే నే అబ్బబ్బా


********   ********   ********


చిత్రం: బహుమతి (2007)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: భువనచంద్ర
గానం: సుచిత్ర

నిప్పుంటే గురూ ముట్టిస్తావా
నిప్పుని నిప్పుతో ఆర్పుకోవడంలో తప్పేలేదురా
తప్పున్నా సరే ఒప్పిస్తావా
తప్పుని ఒప్పుగా మార్చే దిట్టకి చెప్పేదేంటిరా
కజురాహో రంభా సొగసులు నిగనిగ చూడనా
కావాజి క్రేజ్ స్ట్తెల్‌లో అదరగొట్టేయనా
మిసిమిసి మిసి పసిడి పంపుల్నీ తడవనిస్తాలే సరదాగా పురుషా
జత కలిపేయ్ అతివ అందాలు శృతి చేయ్
మధన జెండాని ఏగరేయ్

నిప నిప దప దప లేచిపొతే చిట్టీ చిట్టీ నివ్వంటే
టెంపర్ వాలో కోలో మర్చికీ పదమంటిరా
మిడ్‌నైట్ చూపింగ్ మార్చికి నువ్వే రాదురా
అరచేతిలో ఓహో మ్యజిక్ సూపరంటాలే
యమ పాపిక్ స్నేక్ డాన్సే నేర్పుకుంటాలే
సలసల రగుల సెగలన్నీ ఆర్పుకుంటాలే

డు ఇట్ లవ్ సజనా అని అనరా, ఎగిరెళ్ళి ఒళ్ళో పడరా
చిట్టి చిట్టి సిగ్గులే మరి చెడరా
లవ్ వండర్ సోకు నీదేలే చెంతకొస్తాలే సరిహద్దుని రద్దుచేసి
రుద్దుకుంటాలే స్విమ్మింగ్ సూట్‌కి మోడల్ నువ్వట
తపనల తడికి వణికి పొతుంటే ఒడుపు చూస్తాలే
నిప్పుంటే చిట్టీ మిసి మిసి పసిడి వంపుల్లీ చిట్టీ


********   ********   ********


చిత్రం: బహుమతి (2007)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: కృష్ణ సాయి
గానం: సుచిత్ర, టిప్పు

సో హ్యాపీ సో హ్యాపీ సోసో హ్యాపీ రోయ్
బాడీజ్, టీనేజ్ నో క్యాన్సిల్ రోయ్ సో హ్యాప్పీ (2)
కొట్టావే జాక్‌పాట్ లాటరీలో నాట్‌లెట్‌లో దూకేసేయ్
కో అంటే నీ ముందుకొచ్చే కోతి చేయాలీ డిస్కోనే
అల్లావుద్దీన్ ఈ పల్లెటూరికేరా మాదంటూ ఇంతటి ఆనందం
కుబేరుడే మన ఇంటికి వచ్చెరా కాదనక ఇంట్లో పందిట్లో
సో హ్యాపీ సో హ్యాపీ

ఇల్లంతా సెంట్రల్ ఎ సి చేసి ఓ సీ గా వాడేద్దాం
పొద్దున్నే ఫ్ల్తెట్ ఎక్కి ఫారన్ వెళ్ళి మిడ్‌నైట్ తిరిగొద్దాం
ఊహల్లోనా పైపైన తేలు ఊరికినే ఎక్కిఊగాక అలా పడ్డావంటే
పైనుంచి జారి అప్పుడు నీ కళ తీరకలా
హద్దులోనే మన ఆశలుంటే అంతకు మించి ధనముందా సో హ్యాపీ

డబ్బులుతో దర్జానే కొన్నావంటే ఎన్నాళ్ళో ఉండవులే
మేడల్లో ఉన్నోళ్ళు మనుషులైతే ఇన్నాళ్ళూ నువ్వేవరే
జాన్ సే జాజా ఏం తెలుసు నీకై పైసల్లోని కరెంటే, లేనోడిలా
ఉంటానంటే నీ కర్మే అనుకుంటాలే ఈ రోజుతో తీరేది కాదుగా
ఎందుకీ నీకీ గొడవ అసలే సో హ్యాపీ


********   ********   ********


చిత్రం: బహుమతి (2007)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: కృష్ణ సాయి
గానం: ఆర్తి

ఓనమాలే సంగీతంలో నేనే నేర్చుకోలేదంటా
గుండెల్లోని బావమేదో పొంగుతుంది పాటలాగా (2)
చిన్ననాడు విన్న అమ్మ జోలపాట సంగీతంలా నేర్చి
గొంతులోని మార్చి సుస్వరంలా కూర్చి పాడుతున్న పాటే
నా స్వరం గురించి మీరు మెచ్చుకుంటే జిల్ జిల్ జిల్‌లే

మనస్సు తుల్లు తుల్లు తుల్లులే (2)

పలుకే చిలకలకే అరువే ఇచ్చేటంత తియ్యంగా ఉంటే
పలికే ప్రతి పదమే మనస్సు లోతుల్లోకి చేరుతుందంటే
గళమే కోయిలయితే కూత నేర్పటం కమ్మంగా ఉంటే
ఓహో పాడే ఆ తలపే విన్నవారి ఎదలో ఊయలూగుమలే

తాళం తప్పని తకదిమిత రాగం వింటే తల ఆడించని మనిషంటూ
ఉండదు అసలే తమకం చక్కగా అలలాగా కళలొలికిస్తే హృదయం
తియ్యని అనుభూతికి లోనవుతుందీ మమకారంతో గానం
మనమే ఆలపిస్తే మధుమాసాలే వచ్చి ముంగిట్లో విరబూస్తుంటే జిల్
జిల్ జిల్‌లే మనసే తుల్లు తుల్లు తుల్లులే ఓనమాలే
సరిగ అంటూ సరిగా సంగీతంతో నువ్వే పెదవే కలిపాకా

మపనీ అంటూ మారనీ తానే అక్కున చేర్చుకోదా ఎంచక్కా
జతకా ఆడుకోయిలా తనతో వేసి ఆడిస్తుంటే చాలు కదా
ఓహొ లయగా శృతిలయగా గుండెలోనా తాను గూడే కట్టునుగా
ఆనందాన్నీ మనకి ఇచ్చే మంత్రమేదో తనలో ఎంత దాచిందో
ఏమో ఆస్వాదించే మనస్సే ఉంటే అంతో ఇంతో ఆలాపనగా
చేస్తుంది స్నేహం ఎంతో సృష్టి అంతా తానే అల్లుకుంది పది అష్టపది
తానై చెంత చేరి వస్తే
జిల్ జిల్ జిల్‌లే మనస్సే తుల్లులే ఓనమాలే


********   ********   ********


చిత్రం: బహుమతి (2007)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: కృష్ణ సాయి
గానం: నిహాల్

ఏమంటారో ఈ బంధాన్నీ ఏమో ఏమోనండీ పేరేదో మీరే చెప్పండీ
ఎవ్వరికెవ్వరు ఏమి కానీ పోల్చే దారే లేని ఈ బంధం ఏమై ఉంటుందీ
కనురెప్పమూసేస్తే కనుపాప నిదరోతే గుండెల్లో హాయి ఎందుకూ
నిరువుళ్ళ సవ్వడికే పురివిప్పి ఆడవులే ఎందుకలా నర్తించూనూ
ఏమంటారోపయనించే ఎన్నో పక్షులకీ ఊగేటి రెక్కలకీ
ఆ ఆధారం వీచే చిరుగాలి ఆ బంధం ఏమని పిలవాలీ

పువ్వులకీ, నవ్వులకీ ఈ ఈ రంగులకీ మబ్బులకీ
ఓయి ఓయ్ సోకులకి చాంగులకీ హాయ్ హాయ్ జాములకీ జంకలకీ
లేకున్నా ఈబంధం ఉందేదో సంబంధం చూస్తున్నా ఏమంటారో
ఈ సిగ్గొచ్చి వయస్సును తరిమేస్తే, చెక్కిళ్ళే ఎరుపెక్కే ఏమిటో
ఆ ఏముందో ఈ రెండిటికీ బంధం, తేల్చి చెప్పాలంటే కష్టం

ఈ ఈ మనస్సులకీ, మమతలకీ ఆ ఆ స్వరములకి మధురిమలకీ
ఓయ్ ఓయ్ వేకువకి కోయిలకీ హాయ్ హాయ్ చూపులకి ప్రేమలకీ
మన మనస్సుకి అందనిది అనుబంధం ఒకటుందీ కలిపిందీ అది హరివిల్లండీ
ఏమంటారో ఎవ్వరికెవ్వరు

ఎగిరే పావురమా (1997)

మాఘమాసం ఎప్పుడొస్తుందో


చిత్రం :  ఎగిరే పావురమా (1997)
సంగీతం :  ఎస్.వి. కృష్ణారెడ్డి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  సునీత

పల్లవి :

మాఘమాసం ఎప్పుడొస్తుందో... మౌనరాగాలెన్నినాళ్ళో
మంచు మబ్బు కమ్ముకొస్తుందో.. మత్తు మత్తు ఎన్నియల్లో
ఎవరంటే ఎట్టమ్మా...  వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా.. ఆ.. ఆ

మాఘమాసం ఎప్పుడొస్తుందో... మౌనరాగాలెన్నినాళ్ళో
ఎవరంటే ఎట్టమ్మా... వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా ఆ ఆ

చరణం 1:

తీపి చెమ్మల తేనె చెక్కిలి కొసరాడే నావోడు
ముక్కు పచ్చలు ఆరలేదని ముసిరాడే నా తోడు

నా.. ఆ..ఆ కౌగిలింతల కానుకేదని అడిగాడే ఆనాడు
లేతలేతగా సొంతమైనవి దోచాడే ఈనాడు
ఓయమ్మా... ఆ... ఆ... ఆ
హాయమ్మా వలపులే తొలిరేయమ్మా వాటేస్తే
చినవాడు నా సిగ్గు దాటేస్తే


మాఘమాసం ఎప్పుడొస్తుందో... మౌనరాగాలెన్నినాళ్ళో
ఎవరంటే ఎట్టమ్మా..  వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా ఆ ఆ


చరణం 2 :


తేనె మురళికి తీపి గుసగుస విసిరాడే పిలగాడు
రాతి మనసున ప్రేమ అలజడి చిలికాడే చినవోడు

నా కంటి పాపకు కొంటె కలలను అలికాడే అతగాడు
వంటి బతుకున జంట సరిగమ పలికించేదేనాడో
ఓయమ్మా... ఆ... ఆ... ఆ...
ఒళ్ళంతా మనసులే ఈ తుళ్ళింత తెలుసులే
పెళ్ళాడే శుభలగ్నమేనాడో


మాఘమాసం ఎప్పుడొస్తుందో... మౌనరాగాలెన్నినాళ్ళో
ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా ఆ ఆ


ఆహా ఏమి రుచి


చిత్రం :  ఎగిరే పావురమా (1997)
సంగీతం  :  ఎస్.వి. కృష్ణారెడ్డి
గీతరచయిత :  సిరివెన్నెల
నేపధ్య గానం :  చిత్ర

పల్లవి :

ఆ... ఆహా ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ
తాజా కూరలలో రాజా ఎవరండీ...
ఇంకా చెప్పాలా వంకాయేనండీ

ఆహా ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ .. మోజే తీరనిదీ

చరణం 1 :


అల్లం పచ్చిమిర్చీ శుచిగా నూరుకునీ...ఈ...
ఆ......
దానికి కొత్తిమీరీ బాగా తగిలిస్తే
గుత్తొంకాయ కర్రీ ఆకలి పెంచుకదా
అది నా చేతుల్లో అమృతమే అవదా
ఒండుతూ ఉంటేనే రాదా.. ఘుమఘుమ ఘుమఘుమ ఘుమఘుమలు

ఆహా ఏమి రుచి ...అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ




చరణం 2 :


లేత వంకాయలతో వేపుడు చేసేదా...
మపద...దనిసరి రిగరిగగరిస...నిసగప...
మెట్టవంకాయలతో చట్నీ చేసేదా
టొమెటో కలిపి వండిపెడితే మీరు
అన్నమంత వదిలేసి ఒట్టి కూర తింటారు
ఒకటా రెండా మరి వంకాయ లీలలు తెలియగ తెలుపగ తరమా


ఆహా... ఏమి రుచి ...అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ... మోజే తీరనిదీ
తాజా కూరలలో... రాజా ఎవరండీ
ఇంకా చెప్పాలా... వంకాయేనండీ
ఆ.....

************** *********************** *********
చిత్రం :  ఎగిరే పావురమా (1997)
సంగీతం :  ఎస్.వి.కృష్ణారెడ్డి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు

పల్లవి :


గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ
గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ
చరణం 1 :


నేలనోదిలిన గాలి పరుగున.. ఊరంతా చుట్టాలి
వేళ తెలియక వేల పనులను.. వేగంగా చేయాలి
ఇంటి గడపకి మింటి మెరుపుల.. తోరణమే కట్టాలి
కొంటె కలలతో జంట చిలకకి.. స్వాగతమే చెప్పాలి
ఎన్నెన్నో... ఎన్నెన్నో చేసినా ఇంతేనా అనిపిస్తుంది
ఏ పని తోచక తికమక పెడుతుంది


గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ

చరణం 2 :


బావ మమతల భావ కవితలే... శుభ లేఖలు కావలి
బ్రహ్మ కలిపినా జన్మ ముడులకు... సుముహుర్తం రావాలి
ఏడు అడుగుల జోడు నడకలు... ఊరంతా చూడాలి
వేలు విడువని తోడూ ఇమ్మని.. అక్షింతలు వేయాలి
ఇన్నాళ్ళు.. ఇన్నాళ్ళు ఎదురు చూసే నా ఆశల రాజ్యంలో
రాణిని తీసుకు వచ్చే కళకళ కనపడగ


గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ

మాయలోడు (1993)

చిత్రం : మాయలోడు (1993)
సంగీతం : ఎస్. వి. కృష్ణా రెడ్డి
గీతరచయిత : జొన్నవిత్తుల
నేపధ్య గానం : చిత్ర , బాలు

పల్లవి :

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా


చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా


చరణం 1 :

నింగి నేల ఈ వేళ చలికి వణికిపోతుంటే
బిగి కౌగిలి పొదరింటికి పద పదమంది
ఈ కౌగిలింతలోన ఏలో...
గుండెల్లో ఎండ కాసే ఏలో...


అరె.. పైన మబ్బు ఉరిమింది
పడుచు జింక బెదిరింది
వలవేయక సెలయేరై పెనవేసింది
అరె..చినుకమ్మ మెరుపమ్మ ఏలో...
చిటికేస్తే బుగ్గ మీద ఏలో... 


తలపు తొలివలపు ఇక తక ఝుం తక ఝుం
వయసు తడి సొగసు అర విరిసె సమయం
ఆహా…ఊహూ… ఓహోహొహో

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా



చరణం 2 :

మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది
ఎద లోపల చలిగాలుల సుడి రేగింది
వానొచ్చే వరదొచ్చే ఏలో..
వయసంటే తెలిసొచ్చే ఏలో...

మేను చూపు పో అంది వాలు చుపు సై అంది
చెలి కోరిక అలవోకగ తల ఊపింది
అరె.. సరసాల సిందులోన ఏలో
సరి గంగ తానాలు ఏలో

ఒడిలో ఇక ఒకటై తక తకతై అంటే
సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే
ఆహా…ఊహూ… ఓహోహొహో

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా 


 చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా